చర్మం బిగువు సడలకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు

 


వయస్సు ప్రభావం వలన కానీ,బరువు తగ్గే క్రమంలో గాని చర్మం బిగువు సడులుతుంది. దీని కారణంగా అకాల వృద్ధాప్య ఛాయలు చర్మ సౌందర్యాన్ని దెబ్బతిస్తాయి. అలా జరగకుండా చర్మం పూర్వ నిగారింపును,మెరుపును సొంతం చేసుకోవాలంటే ఇంటిలోనే ఆచరించదగిన కొన్ని చిట్కాలు ఉన్నాయి.

* చందనం పొదిలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి,మెడకు,చేతులకు అప్లై చేసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయుట వలన చర్మం బిగువుగా మారి నిగారింపును,మెరుపును సంతరించుకుంటుంది.

* గుడ్డులోని తెల్లసొనను వేరుచేసి దానిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి బ్రెష్ తో ముఖానికి,మెడకు,చేతులకు అప్లై చేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో  మాత్రమే శుభ్రం చేయాలి. పార్టీలకు,శుభకార్యాలకు వెళ్ళే ముందు ఈ విధంగా చేసుకుంటే చర్మం మెరుస్తూ ఉంటుంది.

* రెండు స్పూన్ల పాలు,కొన్ని చుక్కల విటమిన్ ఇ ఆయిల్,అంతే మోతాదులో తేనే కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత్ చల్లని నీటితో కడగాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేసినట్లైతే చర్మం బిగువుగా ఉండటంతో పాటు నిగారింపు,మెరుపు రెట్టింపు అవుతాయి. ఇది కందిన చర్మానికి మందులా కూడా పనిచేస్తుంది.