'బ్యాగుం'డాలి బాగుండాలి
 

                  ఆడవాళ్ళకి ఎని బ్యాగులున్నా ఎక్కడికైనా బయలుదేరాలి అంటే వెంటనే ఏది పట్టికెళ్లాలో అని బ్యాగ్ కోసం వెతుకుంటారు. ఉన్న బ్యాగుల్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో అనేది మరో సందేహం. సందర్భానికి తగ్గట్టుగా బ్యాగు లేకపోతె కాస్త ఇబ్బందిగానే ఉంటుంది కదా. ఇప్పుడు మార్కెట్లోకి ఎన్నో కొత్త బ్యాగులు వచ్చాయి. అవేంటో చూసి ఎలాంటి బ్యాగులు ఎప్పుడు వాడాలో తెలుసుకుందాం.

 

 

హోబో బ్యాగ్స్ : ఇవి పొడుగ్గా ఉంటాయి. ఫ్రెండ్స్ తో షాపింగ్ కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి ఎంతగానో ఉపయోగపతాయి. వెడల్పు పట్టితో చూడటానికి స్టైల్ గా కనిపించే ఈ బ్యాగ్ లో ఒకేసారి  చాలా  వస్తువులు పడతాయి. భుజానికి తగిలించుకోవటం వల్ల పెద్ద బరువుగా కూడా అనిపించదు.రేటు కాస్త ఎక్కువగా అనిపించినా అవి వేసుకుని బయటకి వెళితే అందరి కళ్ళు ఆ బ్యాగ్ ల మీదే ఉంటాయి.  

 

 

టోటే బ్యాగ్స్: ఉద్యోగానికి  వెళ్ళే ఆడవాళ్ళూ వేసుకోటానికి అనువుగా ఉండి  స్టైలిష్ గా కనపడతాయి ఈ బ్యాగ్ లు. లెథర్ తయారయ్యే ఈ బ్యాగ్ అఫిషియల్ లుక్ తీసుకొస్తుంది.

 

 

సాట్చెల్ బ్యాగ్స్ : చదువుకునే అమ్మాయిలకి, ఉద్యోగం చేసే ఆడవారికి అందుబాటులో ఉన్న మరో ఆప్షన్ ఈ సాట్ చెల్ బ్యాగ్. ఒకే పట్టి ఉండి కొంచెం  పొడుగ్గా ఉండే ఈ రకం బ్యాగ్ ఇంపార్టెంట్ పేపర్స్, ఇంకా ఫైల్స్ పెట్టుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది. దీనిని బండి మీద వెళ్ళేటప్పుడు అడ్డుగా కూడా తగిలించుకునే వీలుంటుంది.

 

 

బకెట్ బ్యాగ్స్: చూడటానికి బకెట్ లాగా కింద వెడల్పుగా పైకి వచ్చేసరికి సన్నగా ఉండే ఈ రకం బ్యాగులు ఫాషన్ కి పెట్టింది పేరుగా కనిపిస్తాయి. కాలేజీ లో ఫంక్షన్ టైములో మేకప్ సామగ్రిని తీసుకెళ్ళటానికి బాగుంటుంది. ఎక్కడైనా పిక్నిక్ కి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్లచ్చు.

 

 

క్లచ్ బ్యాగ్స్: హేండిల్ లేకుండా క్లచ్ ఉండే ఈ బ్యాగ్స్ ఈవెనింగ్ టైములో పార్టీలకి వేసుకుని వెళ్ళచ్చు. వెడల్పుగా, అందంగా కనిపించే ఇలాంటి బ్యాగులు మీకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి.

 

 

బ్యాక్ ప్యాక్ బ్యాగ్స్: ఇవి ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ కి చక్కగా సరిపోయే బ్యాగ్ లు. రెండు భుజాలకి తగిలించుకోవచ్చు  లేదా ఒక వైపు వేలాడతీసుకోవచ్చు. ఎన్ని వస్తువులు లేదా పుస్తకాలు పెట్టిన ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా హేండిల్ చెయచ్చు.

 

 

స్లింగ్ బ్యాగ్స్: తాడులు పొడుగ్గా వేలాడుతూ చిన్నగా ముద్దుగా కనిపించే ఈ టైప్ బ్యాగ్ లు ఎలాంటి సందర్భంలో అయినా వేసుకోటానికి బాగుంటాయి. హోటల్స్ కి వెళ్ళేటప్పుడు పెద్దగా తీసుకెళ్ళాల్సినవి ఉండవు కాబట్టి ఇలాంటి బ్యాగ్ లు వాడుకోవచ్చు.

 

 

రిస్ట్లేట్ బ్యాగ్స్: వీటి పేరులోనే ఉంది ఇవి మడమకి తగిలించుకునే బ్యాగ్స్ అని. హేండిల్ గాని క్లచ్ గాని కాకుండా ఎక్కువశాతం జిప్ మూమెంట్ తో సౌకర్యంగా ఉంటాయి. కేవలం డబ్బులు కార్డ్స్ పెట్టుకోవచ్చు.

       ఇలా మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల బ్యాగుల్లో  మన స్టైల్ కి తగ్గట్టుగా మనకి సరిపోయేవి చూసి మనం ఎంచుకోవచ్చు.


                                                                                                            ...కళ్యాణి