అందమైన అధరాలు కావాలంటే...!

 

 

ముఖం చక్కని రంగులో ఉన్నా ఒక్కోసారి పెదవులు నల్లబడిపోతుంటాయి. ఆహారపు అలవాట్లు, కాలుష్యం, సరైన కేర్ తీసుకోకపోవడం వంటి పలు కారణాలు మన అధరాల అందాలను అణచివేస్తుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే...

 

- గ్రీన్ టీ పొడిని నీటితో కొద్దిగా తడపాలి. తర్వాత దీనితో పెదవులపై బాగా రుద్దాలి. రోజుకోసారి ఇలా చేస్తూ ఉంటే మృతకణాలు తొలగిపోయి పెదవులు సున్నితంగా తయారవుతాయి. నలుపు పోయి గులాబిరంగులోకి మారతాయి.

- పెరుగులో కాస్త కుంకుమపువ్వును కలిపి పెదవులకు పట్టించి.. ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదవులు పొడిబారిపోకుండా ఉండటమే కాక చక్కని రంగులో ఉంటాయి కూడా.

- బాదంపొడిలో పాలు కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని పెదవులకు ప్యాక్ లా వేసి, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. తరచూ ఇలా చేయడం వల్ల పెదవులు సున్నితంగా అవుతాయి. మెరుస్తాయి.

- తేనెలో కాస్త రోజ్ వాటర్ కలిపి రోజూ రెండు మూడుసార్లు పెదాలకు రాసుకుంటూ ఉండండి. కొన్నాళ్లకు పెదవులు ఎర్రబారి అందంగా ఉంటాయి.

- పసుపులో పాలు కలిపి పెదాలకు ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత కడిగేసుకుని, మెత్తని బట్టతో తుడిచి, లిప్ బామ్ కానీ వెన్న కానీ రాయాలి. రోజుకోసారైనా ఇలా చేస్తే నలుపు 

-Sameera