మూడు రంగుల పూరీలు

(రిపబ్లిక్ డే స్పెషల్)

 

 

 

కావలసిన పదార్దాలు:

గోధుమపిండి - 3 కప్పుల

ఉప్పు - 1/2 స్పూన్

నూనె - 2.3 స్పూన్స్

పాలకూర ముద్ద - 1 కప్పు

బీట్ రూట్ ముద్ద నుండి తీసిన రసం - 1 కప్పు

 

తయారీ విధానం:

ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని 1 స్పూన్  నూనె కొద్దిగా ఉప్పు వేసి పురీలకు గట్టిగా కలుపుకోవాలి. మరో కప్పు గోధుమ పిండిలో పాలకుర ముద్దని నూనెను, ఉప్పు జోడించి గట్టిగా పూరీపిండి కలపాలి. చివరి కప్పు గోధుమపిండిని పూరీలకు బిట్రూట్ రసంతో పై విధానంగా కలపాలి. ముడు రంగులతో పూరీపిండి సిద్దం చేసుకుని విడిగా రంగుల రంగుల పూరీలు వత్తుకుని నూనె లో వేయించుకోవాలి.. ఈమూడు ముద్దలు కలిపి కూడా పూరీలను తయారుచేసుకుంటే రుచికి చూడడానికి చాలా బావుంటాయి.

 

భారతి