తమిళనాడు స్టైల్ టమాటా చట్నీ

 

 

 

మూడు రోజులుగా టమాటాలతో చేసే వెరైటీలు చూసాం కదా. అయితే ఇప్పుడు తమిళనాడు టమాటా చట్నీ ఎలా చేయచ్చో చూద్దాం.

 

కావలసిన పదార్ధాలు:

నూనె                     - 2 చెమ్చాలు
ఉల్లిపాయ               - 1
పసుపు                  - చిటికెడు
కొబ్బరి తురుము      - 1/4 కప్పు
శెనగపప్పు              - 1 చెమ్చా
మినపప్పు              - 1 చెమ్చా
ఎండుమిర్చి              - 2
పచ్చిమిర్చి              - 1
వెల్లుల్లి                   - రెండు రెబ్బలు

పోపు కోసం:

నూనె                    - రెండు చెమ్చాలు
ఆవాలు                 - తగినన్ని
కరివేపాకు              - తగినంత
ఎండుమిర్చి            - తగినన్ని
ఉప్పు                   - రుచికి సరిపడా

 

తయారీ విధానం:

ముందుగా బాణలిలో నూనె వేసి శెనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. పప్పులు ఎర్రగా వేగాక ప్లేటులోకి తీసి ఆరనివ్వాలి. అదే బాణలిలో ఉల్లితరుగు, వెల్లుల్లి, టమాటా వేసి వేయించాలి. టమాటా మెత్త పడ్డాకా స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నపప్పులు, టమాటాలు, కొబ్బరి తురుము, పసుపు, ఉప్పు కలిపి మెత్త్గగా రుబ్బుకోవాలి. ఆ రుబ్బిన టమాటా చట్నీని ఓ గిన్నెలోకి తీసుకొని ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చితో పోపువేసి బాగా కలపాలి. టేస్టీ టమాటా చట్నీ రెడీ.

 

టిప్:

వెల్లుల్లి ఇష్టం లేని వారు దానికి బదులు రుచి కోసం పోపులో ఇంగువ వేసుకోవచ్చు.

 

-రమ