శెనగ వడలు

 

 

 

కావలసిన పదార్ధాలు:
శెనగలు - 1 కప్పు
బొబ్బర్లు - 1/4 కప్పు
మినపప్పు - పొట్టుతో సహా 4 చెంచాలు
పెసరపప్పు - ఒక చిన్న కప్పు
జీలకర్ర - 1/2 చెంచాలు
మిరపకాయలు - 4
ఉప్పు - తగినంత
అల్లం -  ఒక చిన్న ముక్క
సోంపు - 1/2 చెంచా
లవంగాలు - 4
నూనె - వేయించడానికి తగినంత

 

తయారీ విధానం:
శెనగలు, బొబ్బర్లు, మినపప్పు కలిపి 8 గంటలు నానబెట్టి అల్లం, మిరపకాయలు, జీలకర్ర, లవంగాలు, ఉప్పు వేసి మిక్సీలో మరీ మెత్తగా కాకుండా రుబ్బాలి. తరువాత దానిలో సోంపు జోడించుకొని నానబెట్టిన పెసరపప్పును తీసుకొని వడలకు అద్ది ముందు ముద్దగా గుండ్రగా తీసుకొని తరువాత దానిని వడలగా నొక్కి మరిగే నూనెలో వేసి మంట తగ్గించి చిన్న మంటపై వేయించాలి. మరీ మాడిపోయోలా కాకుండా లోపన వేగేలా దోరగా వేయించుకోవాలి. ఇందులో ఉల్లి ముక్కలు జోడించవచ్చు లేదా రుబ్బేటప్పుడే ఉల్లిపాయ ముక్కలు కూడా రుబ్యేయోచ్చు. ఎలా చేసినా చాలా చాలా రుచిగా ఉంటాయి ఈ వడలు

 

 

టిప్.. ఇష్టమున్నవారు పిండిలో సోంపు వేసుకోవచ్చు. లేదంటే లేకుండా అయినా ఈ వడలు చేసుకోవచ్చు.

 

--భారతి