రైస్ & ఫ్రూట్ సలాడ్

 

 

కావలసిన పదార్దాములు:

బిర్యానీ రైస్ - 100 గ్రాములు

పైనాపిల్ పీసెస్ -  1 కప్పు ( సన్నగా కట్ చేసినవి )

కీరదోస పీసెస్ - 1 \ 2 కప్పు ( సన్నగా కట్ చేసినవి )

బాదంపప్పు, జీడిపప్పు - 50 గ్రా ( సన్నవి ముక్కలు చేసి వేసినవి )

ఉప్పు - రుచికి సరిపడ

పెప్పర్ - రుచికి సరిపడ


డ్రేస్సింగ్ కి :

కమలారసం - అర కప్పు 

వెజిటబుల్ ఆయిల్ - 1 \ 4 కప్పు

ధనియాలపొడి - 1 స్పూన్ 

కారం - 1 స్పూన్


తయారుచేయు విధానం:

ముందుగా బియ్యం శుభ్రంగా కడగాలి. ఉప్పు వేసి మరిగించి నీటిలో బియ్యం, యాలుకలు వేసి ఉడికించాలి.

 

బియ్యం ఉడకగానే గంజి వార్చి అన్నం మీద చల్లని నీరు పోయాలి. ఈ విధంగా చేయటం వలన అన్నం పొడిగా ఉండి విడివిడిగా ఉంటుంది.

 

ఒక బౌల్ లో పైనాపిల్, కీరదోస ముక్కలు, జీడిపప్పు, బాదంపప్పు, సరిపడ ఉప్పు, పెప్పర్, కమలారసం, ఆయిల్, ధనియాలపొడి, కారం వేసి కలపాలి.

 

ఈ మిశ్రమాన్ని అన్నానికి జత చేసి బాగా కలిసేలా కలపాలి. సర్వ్ చేసే ముందు ప్లేట్స్ లో పెట్టి పైన కొత్తిమీర చల్లి సర్వ్ చెయ్యాలి. ఈ సలాడ్ కనీసం 4 గురికి సర్వ్ చేయవచ్చు.