పన్నీర్  కాప్సికం కర్రీ

 

 

 

కావలసిన పదార్దాలు :
క్యాప్సికమ్స్ : 4 
ఉప్పు : తగినంత
దనియాల పొడి : టీ స్పూన్
కొత్తిమీర : కొద్దిగా 
ఉల్లిపాయలు : 200 గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్ట్ : టీ స్పూన్
నూనె : సరిపడా
పచ్చిమిర్చి : 5
కరివేపాకు : కొద్దిగా
కారం : తగినంత
టమాటాలు : 2
పసుపు : అర టీ స్పూన్

 

తయారుచేయు విధానం :
ముందుగా  స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి కాగాక పనీర్ ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో క్యాప్సికం ముక్కలు కూడా వేసి వేయించి ఒక ప్లేటులోకి తీసుకోవాలి. తరువాత అందులో కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిముక్కలు వేసి వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. వేగాక  టమాటాముక్కలు,  పసుపు, ఉప్పు, కారంవేసి కొద్దిసేపు  వేయించాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు, పనీర్ ముక్కలు  వేసి సరిపడా   వేసి కొద్ది నిముషాలు ఉడికించి  చివరిలో కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి...