పచ్చి మామిడి జామ్‌

 

 

కావలసినవి
మామిడి కాయలు : రెండు
పంచదార : అర కేజీ
యాలకుల పొడి : రెండు స్పూన్లు
డ్రైఫ్రూట్స్‌ : అర కప్పు
టూటీ ఫ్రూటీ ముక్కలు : అర కప్పు

 

తయారీ :
ముందుగా మామిడికాయ చెక్కు తీసి తురిమి పంచదార కలిపి పక్కన పెట్టి స్టవ్ వెలిగించి మందంగా వెడల్పుగా ఉన్నపాత్ర తీసుకుని ఉడికించాలి. ఇలా ఒక పదిహేను నిముషాలు  ఉడికించాకా దగ్గర పడుతుంది.ఇప్పుడు  డ్రై ఫ్రూట్‌ ముక్కలు, టూటీ ఫ్రూటీ ముక్కలు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి దింపేయాలి. చల్లారాకా ఒక సీసాలో లో  భద్రపరచుకోవాలి.