మైసూర్ పాక్

 

 

 

కావలసిన పదార్థాలు: 
శనగపిండి - ఒక కప్పు 
పంచదార - మూడు కప్పులు 
నెయ్యి - ఒక కప్పు 
నూనె - తగినంత 
తినే సోడా - చిటికెడు 

 

 

తయారు చేసే విధానం: 
ముందుగా  ఉన్న బాణిలీలో పంచదార వేసి, కప్పు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాలి. పంచదార కరిగి బాగా ఉడుకుతుండగా, శనగపిండి వేసి బాగా కలపాలి. అయితే ఆ మిశ్రమం  ఉండలు కట్టకుండా చూడాలి. మరో పొయ్యి మీద నెయ్యి, నూనె కలిపిన మిశ్రమాన్ని వేడి చేస్తు ఉండాలి.  ఇప్పుడు నెయ్యి, నూనె మిశ్రమాన్ని శనగపిండి ఉన్న బాణలీలో కొంచెం కొంచెం వేస్తూ బాగా కలుపుతూ ఉండాలి. పాకము, పిండి, బాగా వేగి, చిల్లులు పడుతూ కనిపించినప్పుడు తినేసోడా కొంచెం నీటిలో కలిపి వెయ్యాలి. మిగిలిన నెయ్యి కూడా వేసి బాగా రెండు, మూడు నిమిషాలు కలపాలి. ఆ తర్వాత ఒక పళ్లెంలో దాన్ని వేసి  చదునుగా చేసి, మనకి నచ్చిన విధంగా కోసి పెట్టుకోవాలి. చల్లారి గట్టిపడ్డాక మనం కోసిన విధంగా ముక్కలు వచ్చేస్తాయి. అంతే రుచికరమైన మైసూర్ పాక్ రెడీ.