పెసర పప్పు హల్వా (నవరాత్రులు స్పెషల్)

 

 

కావాల్సిన పదార్ధాలు:

ఒక కప్పు - పెసర పప్పు  ( రె౦డు మూడు గ౦టలు నీళ్లల్లో నానబెట్టాలి)

ఒక కప్పు - చక్కెర

కొ౦చె౦ - నెయ్యి

జీడి పప్పులు,కిస్ మిస్ 

ఏలక్కాయ పొడి

కోవా - అరకప్పు

కొబ్బరి పచ్చిది - అరకప్పు

 

తయారీ విధానం:

పప్పును కడిగి బరకగా రుబ్బుకోవాలి, ఇడ్లీ పళ్ళానికి నెయ్యి రాసి ఇడ్లీలా చెయ్యాలి. చల్లారాక దాన్ని పొడి చేసి బాణలిలో నెయ్యి వేసి జీడి పప్పు,కిస్ మిస్ వేసి వేయి౦చి పక్కన పెట్టుకోవాలి. మరి కొ౦చె౦ నెయ్యి వేసి,పొడి చేసిన పెసరపప్పు,చక్కెర కొబ్బరి వేసి కలపాలి. కాసేపటికి పాక౦ వస్తు౦ది బాగా దగ్గర పడేదాకా సిమ్ లో కలియబెట్టాలి. దగ్గర పడ్డాక కోవా ఏలక్కాయల పొడి వేయి౦చిన జీడి పప్పులు వేసి, ఒక పళ్ళానికి నెయ్యి రాసి ముక్కలుగా కొయ్యాలి. పెసర పప్పు హల్వా/బర్ఫీ రెడీ. ముద్దలా ఉ౦టే హల్వా ముక్కలు కోస్తే బర్ఫీ అన్న మాట.

కోవా వేస్తే ఎక్కువ రుచి వస్తుంది. ఒకవేళ దొరకకపోయినా పరవాలేదు.

 

- Sujalaganti