మామిడికాయ షర్బత్

 

 

 

కావలసినవి:

పచ్చి మామిడి కాయలు -3
పంచదార         - ఒక కప్పు
జీలకర్ర పొడి      - ఒక చెమ్చా
ఉప్పు             - ఒక చెమ్చా
మంచి నీరు      - రెండు కప్పులు
పుదీనా రసం     - రెండు చెంచాలు

తయారీ విధానం:
 
ముందుగా మామిడి కాయలని రెండు కప్పుల నీరు పోసి కుక్కర్ లో పెట్టి 3 విసిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. ఆ తర్వాత కాయలలోని గుజ్జు తీసి, ఉడికించటానికి పోసిన నీటితో మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమం లో పంచదార, ఉప్పు, పుదినా రసం  వేసి స్టవ్ మీద పెట్టి పంచదార కరిగేదాకా సన్న మంటమీద తిప్పుతూ వుండాలి. పంచదార కరిగి రసం ఉడకటం మొదలుఅయ్యేదాకా ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి మామిడి మిశ్రమాన్ని చల్లారనివ్వాలి . చల్లారాక జీలకర్రపొడి వేసి కలపాలి.. ఈ రసాన్ని ఒక గ్లాసు మంచి నీటిలో ఓ మూడు చెంచాలు వేస్తే చాలు. చల్లటి నీటితో కలుపుకుని, కొన్ని పుదినా ఆకులని అందులో వేసి తాగితే చాలా రుచిగా వుంటుంది. పచ్చి మామిడి రసం ఆరోగ్యానికి చాలా మంచిది .

-రమ