కాశ్మీరీ పాలక్ కోఫ్తా కర్రీ
 

 


 

 

 

కావలసినవి :
పాలకూర - రెండు కట్టలు
జీలకర్ర - అర టీ స్పూన్
స్వీట్ క్రీమ్ - 2 టీ స్పూన్లు
ఇలాచి పౌడర్- అర టీస్పూను
కసూరీ మేథీ - టీ స్పూను
ఉప్పు - తగినంత
నూనె -  సరిపడినంత
ధనియాలపొడి - టీ స్పూను
మైదా - రెండు టేబుల్ స్పూన్లు
జీడిపప్పు - 50 గ్రాములు
నీరు - తగినంత

 

తయారీ:
ముందుగా పాలకూరను మెత్తగా ఉడికించి, చల్లారిన తరవాత కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. తరువాత పాన్‌లో కొద్దిగా నూనె వేసి కాగాక జీలకర్ర వేసి దోరగా వేయించి  మైదా వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పాలకూర పేస్ట్‌లో వేసి బాల్స్ లా చేసుకోవాలి. తరువాత స్టవ్ పై పాన్‌ పెట్టి  నూనె పోసి  కాగిన తరవాత అందులో ఈ కోఫ్తాలను  వేసి వేగాక ప్లేట్ లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ పై  పాన్‌ పెట్టి జీడిపప్పు పేస్ట్ వేసి కొద్దిగా ఉడికిన తరవాత ఇలాచి పౌడర్ ,ధనియాలపొడి, కసూరీ మేథీ, స్వీట్ క్రీమ్ వేసి ఐదు నిముషాలు ఉడికాక గ్రేవీ తయారవుతుంది. ఇప్పుడు  వేయించుకున్న  కోఫ్తాలు వేసి మరొక ఐదునిముషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని వేడి వేడి రైస్ తో సర్వ్ చేసుకోవాలి.