ఎగ్‌ మంచూరియా రెసిపి

కావలసిన పదార్థాలు:

గుడ్లు: 6 చక్కెర :

పావు టీ స్పూన్‌

నూనె : 4 స్పూన్లు

మొక్కజొన్న పిండి: 1 స్పూన్‌

వెనిగర్‌ : 1 స్పూన్‌

 పచ్చిమిర్చి: 6

సోయా సాస్‌: 2 టేబుల్‌ స్పూన్‌

ఉల్లిపాయలు: 1

తయారుచేసే విధానం :

ముందుగా కోడి గుడ్లను ఉడకబెట్టుకోవాలి. తరువాత కోడి గుడ్లను సగానికి కట్‌ చేసుకోవాలి.

పాన్‌లో నూనె వేసి వేడి చేసి, రౌండ్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ముక్కలు వేసి, అవి బాగా వేగేవరకు వుంచాలి .

దానిలో మొక్కజొన్నపిండి,నీళ్ళు పోసి, ఉండలు కట్టకుండా తిప్పాలి. దీనికి సోయాసాస్‌, వెనిగర్‌, చక్కెర, ఉప్పు , పచ్చి మిర్చి, గుడ్లను కూడా ఒకదాని తరువాత ఒకటి వేసి తగినంత సేపు వేగనివ్వాలి.

ఆ తరువాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి.