క్రిస్ట్‌మస్‌  స్పెషల్

 

 

 

చాక్లెట్ కేక్

 

 

కావలసిన పదార్ధాలు:
మైదాపిండి - 250 గ్రాములు
కొకో పౌడర్‌ - 4 టేబుల్‌ స్పూన్లు
వెన్న - 250 గ్రాములు
చక్కెర - పావు కేజీ
గుడ్లు -  4
పెరుగు - 1 కప్పు
వెనిల్లా ఎస్సెన్స్‌: 1 టీ స్పూన్‌
బేకింగ్‌ పౌడర్‌ - 2 టీ స్పూన్లు
సాల్ట్‌ -  చిటికెడు

 

తయారు చేసే విధానం:
ముందుగా ఒవెన్‌ను 180 డిగ్రీ సెంటీగ్రేడ్‌ వరకూ వేడి చేయండి. తరువాత  ఒక టిన్‌ తీసుకొని దాని చుట్టూ నెయ్యి రాయ్యాలి. ఇప్పుడు మైదాలో బేకింగ్‌ పౌడర్‌, సాల్ట్, కొకో పౌడర్‌ వేసి బాగా కలపాలి. వెన్నలో ఉండలు లేకుండా  చేసుకొని అందులో  చక్కెర పొడి కలిపి ఎగ్‌ బీటర్‌తో   బీట్‌ చేయాలి. తర్వాత ఒక్కొక్క గుడ్డూ పగులకొట్టి ఇందులో కలపాలి. ఇప్పుడు కొకో పౌడర్ వేసి కలుపుకోవాలి. తర్వాత  మైదా పిండిని మూడు స్పూన్ల చొప్పున అందులో వేస్తూ కొద్దిగా  పెరుగును కూడా వేస్తు పేస్ట్ లా చేసుకోవాలి. చివరిలో వెనిలా  ఎస్సెన్స్‌ కలుపుకొని కేక్‌ టిన్‌లో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసి ఒవెన్‌ ను 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో  వుంచి 40 నిముషాలు బేక్ చెయ్యాలి.

 

 

 

డ్రైఫ్రూట్స్‌ కేక్‌

 

 

కావల్సినవి:
మైదా - 200 గ్రాములు
డ్రైఫ్రూట్స్‌ - ఒక కప్పు
పాలు - అర కప్పు
ఆరెంజ్ జ్యూస్ - ఒక కప్పు
వెన్న - 150 గ్రాములు
యాలకులపొడి - అరచెంచా,
బేకింగ్‌ పొడి - ఒకటిన్నర స్పూన్
పంచదార - 150 గ్రాములు
మిల్క్‌మెయిడ్‌ - యాభై గ్రాములు
మిక్సెడ్ ఫ్రూట్ ఎసెన్సు - కొద్దిగా

 

తయారీ :
ముందుగా పాత్రలో వెన్న, పంచదార, మిల్క్‌మెయిడ్‌, పాలు, యాలకులపొడి తీసుకుని బాగా కలపాలి. తరువాత  డ్రైఫ్రూట్స్‌ ఆరెంజ్ జ్యూస్ వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు  మైదా వేసి బాగా కలిపి చివరిలోమిక్సెడ్ ఫ్రూట్ ఎసెన్సు వేసుకుని మరోసారి కలపాలి. ఓవెన్‌ను ముందుగానే 180 డిగ్రీల దగ్గర వేడిచేసి పెట్టుకోవాలి. తరువాత కేక్‌ టిన్ కి వెన్న రాసి ఈ మిశ్రమాన్ని అందులో వేసుకుని 35 నిముషాల పాటు  బేక్‌ చేయ్యాలి.

 

 

 

ఫ్రూట్ కేక్

 

 


కావలసిన పదార్థాలు:
గుడ్లు - నాలుగు
మైదా - రెండు కప్పులు
పంచదార - 120 గ్రాములు,
మిక్స్‌డ్ ఫ్రూట్ ఎసెన్స్ - అర స్పూన్
పెరుగు - రెండు కప్పులు
టూటి ఫ్రూటీలు - ఒక కప్పు
లెమన్ ఎల్లో కలర్ - నాలుగు చుక్కలు.

 

తయారుచేయు విధానం:
ముందుగా గుడ్డులో తెల్లసొనని వేరు చేసి బాగా గిలకొట్టాలి.  అందులో పంచదార పొడి వేసి మళ్లీ గిలకొట్టాలి. తరువాత పచ్చసొన కూడా వేసి బాగా గిలకొట్టాలి. ఇందులో మైదా, ఎసెన్స్, లెమన్ ఎల్లో కలర్ కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ మౌల్డ్ లో పెరుగు రాసి ఈ మిశ్రమాన్ని వేయాలి. దీన్ని ఓవెన్‌లో 180 డిగ్రీల  వద్ద 30 నిమిషాలపాటు బేక్ చేయాలి. తరువాత టూటి ఫ్రూటీలతో కేక్‌ని డెకరేట్ చేసుకోవాలి.