చాక్లెట్ బర్ఫీ

 

 

కావలసిన పదార్ధాలు:
చాక్లెట్  పౌడర్ – అర కప్పు
మైదా – అర కప్పు
నెయ్యి – ఒక కప్పు
పాలు – పావు లీటర్
జీడిపప్పు – అర కప్పు
పంచదార – 300 గ్రాములు

 

తయారు చేసే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి  పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి కరిగాక మైదా పిండి  వేసి వేయించాలి. తరువాత మరో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీరు పోసి అందులో పంచదార వేసి పాకం పట్టాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో పాలు పోసి అందులో చాక్లెట్ పౌడర్ వేసి చిన్నమంట మీద మరిగించాలి అందులో  ముందు వేయించి పెట్టుకొన్న మైదా, సరిపడా నీళ్లు వేసి  చిక్కబడే వరకూ కలియ బెడుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం చిక్క బడ్డాక పంచదార పాకంను, జీడిపప్పును వేసి కలపాలి. ఈ మిశ్రమం పూర్తిగా చిక్కబడ్డాక ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసి అందులో చాక్లెట్ మిక్స్ అందులో పోసి పైన  చాక్లెట్  పౌడర్ ను చల్లి చల్లారాకా  కావలసిన షేప్ లో కట్ చేసి సర్వ్ చేసుకోవాలి.