చక్కెర పొంగలి

 

 

కావలసినవి  :
పంచదార - 25౦ గ్రాములు
బియ్యం - 25౦ గ్రాములు
పెసరపప్పు : ఒక కప్పు
పాలు - అర లీటరు
జీడిపప్పు - 50  గ్రాములు
నెయ్యి - 50  గ్రాములు
కిస్మిస్  - 50  గ్రాములు
పచ్చ కర్పూరం - చిటికెడు

 

తయారీ:
ముందుగా  బియ్యం , పెసరపప్పు కడిగి సరిపడా నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టాలి . ఒక పొంగు వచ్చాక పాలు పోసుకోవాలి. అన్నం మెత్తగా ఉడికాక అందులో  పంచదార వేసి ఒక పది నిముషాలు  కలపాలి. ఇప్పుడు పక్క స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నెయ్యి వేసి జీడిపప్పు,కిస్మిస్ వేయించాలి. వీటిని ఉడుకుతున్న అన్నంలోకి వేసుకుని మిగిలిన నెయ్యి కూడా వేసి కలపాలి. చివరిగా పచ్చకర్పూరం  వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి బౌల్ లోకి తీసుకోవాలి..