క్యాలీఫ్లవర్‌ కుర్మా

 

 

 

కావలసినవి :
కాలీఫ్లవర్‌ - ఒకటి
టొమేటో గుజ్జు - అరకప్పు
జీడిపప్పు - 10
పచ్చిమిర్చి- 4
నూనె - సరిపడా 
వెల్లుల్లి - 6 రెబ్బలు
మెంతులు - ఒక స్పూన్
పచ్చి బఠానీలు - అర కప్పు
ఉప్పు- తగినంత
కొత్తిమీర - ఒక కట్ట
ఉల్లిపాయ - ఒకటి
పసుపు - చిటికెడు 
అల్లం - చిన్నముక్క
కారం - ఒక స్పూన్
గసగసాలు - రెండు చెంచాలు
లవంగాలు - 4
దాల్చిన చెక్క -  ఒక ముక్క
ఎండుకొబ్బరి తురుము - అర కప్పు

 

తయారుచేసే విధానం :
ముందుగా క్యాలీఫ్లవర్‌ను కట్ చేసుకుని కడిగి తర్వాత దానిలో పచ్చి బఠానీలు వేసి  ఉడికించుకోవాలి.  తరువాత  జీడిపప్పు, గసగసాలు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, కొబ్బరి తురుము, ఎండుమిర్చి , ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం, వెల్లుల్లి  మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి.  ఇప్పుడు స్టవ్ వెలిగించి, పాన్ పెట్టి నూనె వేసి మెంతులు, ఉల్లిపాయ పేస్ట్  వేసి వేయించుకుని తరువాత  టొమేటో గుజ్జు, ఉప్పు, కారం వేసి కలపాలి. ఐదు నిమిషాల తరువాత ఉడికించిన క్యాలీఫ్లవర్‌ బఠానీలు వేసి వేయించాలి. ఆ తర్వాత  మసాలా పేస్ట్  వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి. ఐదు నిమిషాలపాటు ఉడికించిన తరువాత గ్రేవీ చిక్కబడుతుంది. అప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.