క్యారట్ మంచూరియా

 

 

 

కావలసినవి:
తురిమిన క్యారట్ - కప్పు
ఉప్పు - తగినంత
కారం - తగినంత
శనగపిండి - 2 కప్పులు
కార్న్‌ ఫ్లోర్ - స్పూను
అల్లం, వెల్లుల్లి పేస్ట్ -  ఒక స్పూను
ఉల్లిపాయ - ఒకటి 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను
సోయాసాస్ - ఒక స్పూను
నూనె - కొద్దిగా
టొమాటో సాస్ -  ఒక స్పూన్
కొత్తిమీర - కొద్దిగా 
వాము - చిటికెడు

 

తయారుచేసే విధానం:
ముందుగా ఒక గిన్నెలో తురిమిన క్యారట్, శనగపిండి, కార్న్‌ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్ప, కారం, వాము కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. తరువాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె పోసి కాగిన తర్వాత  కలిపి ఉంచుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని నూనెలో వేసి  బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. తరువాత  స్టవ్ పై గిన్నె పెట్టి కొద్దిగా  నూనె వేసి కాగాక ఉల్లిపాయ ముక్కలు వేయించి  అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయాసాస్, టొమాటో సాస్ వేసి వేగాక మొత్తం గ్రేవీలాగా అవుతుంది. ఇప్పుడు అందులో  వేయించి పెట్టుకున్న క్యారట్ మంచూరియాలను వేసి కలిపి బౌల్‌లోకి తీసుకోవాలి. ఆ మిశ్రమంలో  కొత్తిమీర వేసుకోవాలి. అంతే టేస్టీ అండ్ వెరైటీ క్యారట్ మంచూరియా రెడీ.