కారట్ హల్వా

 (Diwali special)

 

 

కావలసిన పదార్ధాలు:

కారట్ లు      :  4 cups grated

పంచదార      :   2cups 

పాలు           :  4 cups:

నెయ్యి          :  150 grams

ఏలక్కాయపొడి : 2 spoons

జీడిపప్పు, కిస్మిస్ లు, : 1/2 cup

కోవా            :   1/2 cup

 

తయారీ విధానం :

ముందుగా 2స్పూన్ల నేయిలో జీడిపప్పు , కిస్మిస్ వేయించి పెట్టు కోవాలి. తరువాత నేతిలో కారట్ తురుము వేసి వేయించాలి.  పచ్చి వాసన పోయాక పాలు, పంచదార వేసి బాగా కలుపుతూ 5 ని. వేయించాలి. ముందుగా వేయించిన నట్స్ కుడా వేయాలి. మళ్ళి బాగా కలుపుతూ పాలు, పంచదార పూర్తిగా ఆవిరై కారట్ మెత్తగా అయ్యేదాకా వేయించాలి. కోవాని కుడా వేసి మళ్ళి వేయించాలి. చివరలో ఏలక్కాయ పొడి కూడా వేయాలి. హల్వా మాడకుండా, అడుగంటకుండా మధ్య మధ్య లోనేయ్యి వేస్తూ కలపాలి. బాళికి అడుగంటకుండా వున్నపుడు పొయ్యి మీదనుంచి తీసి వేడిగా  వడ్డించండి.

 

టిప్స్ :

ఇష్టమైతే చిటికెడు యెల్లో కలర్ పాలల్లో కలిపితే మంచి రంగుతో కారట్ హల్వా చాలా బాగుంటుంది.
వీలయితే కొంచం ఎక్కువ నెయ్యి వేసినా బాగుంటుంది.
కోవా తప్పనిసరిగా వేయాల్సిన అవసరం లేదు.
వేయించిన జీడిపప్పులు వంటివి మధ్యలో వేయాలి . కారట్, పాలతో పాటు అవికూడా ఉడికి బాగుంటాయి.
బాదం, పిస్తా పప్పులు కుడా నేతిలో వేయించి కలిపితే కూడా హల్వా బాగుంటుంది

--Manikopalle