బీట్‌రూట్‌ మసాలా కర్రీ

 

 

 

కావలసినవి:
బీట్‌రూట్‌  : అరకిలో
ఉల్లిపాయలు : 3
వెల్లుల్లి  : కొద్దిగా
అల్లం  : చిన్న ముక్క
గసగసాలు : 2 స్పూన్లు
దాల్చిన చెక్క : అంగుళం ముక్క
ధనియాలు : 2స్పూన్లు    
లవంగాలు : 4
పసుపు : అర స్పూన్
ఉప్పు: తగినంత
కారం:  తగినంత
నూనె : సరిపడగా

 

తయారీ  విధానం :
ముందుగా బీట్‌రూట్‌ శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చెయ్యాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు ,అల్లం వెల్లుల్లి మసాల దినుసులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి కాగాక మసాలా పేస్ట్ వేసి వేగనివ్వాలి. తరువాత బీట్‌రూట్‌ ముక్కలు వేసి తరువాత  పసుపు, ఉప్పు కారం వేసి కాసేపు వేయించి కొంచెం నీళ్ళు పోసి కలిపి మూతపెట్టాలి. ఒక పది నిముషాలు  ఉడకనివ్వాలి. నీరు మొత్తం ఇగిరిపోయాక స్టవ్ ఆఫ్  చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని రైస్ తో కాని చపాతితో కాని సర్వ్ చేసుకోవచ్చు.