బర్ఫీ

 

 

 

కావలసిన పదార్ధాలు..

* కొబ్బరిపాలు                            :  4 కప్పులు

* కొబ్బరి తురుము                     :  కప్పు

* పంచదార                                :  ఒకటిన్నర కప్పు

* బటర్ స్కాచ్ కస్టర్డ్ పౌడర్           :  3 టేబుల్ స్పూన్లు

* వెనీలా కస్టర్డ్ పౌడర్                  :  3 టేబుల్ స్పూన్లు

* నెయ్యి                                     :  4 టేబుల్ స్పూన్లు\

* ఫుడ్ కలర్                              :  చిటికెడు

* బాదం, పిస్తా, జీడిపప్పు             :  కొద్దికొద్దిగా

తయారు చేసే విధానం..

* ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో కొబ్బరిపాలు, వెనీలా కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు కట్టకుండా కలపాలి.

* తరువాత నాన్ స్టిక్ పాన్ లో నెయ్యి వేసి అది కరిగాక, కొబ్బరిపాల మిశ్రమాన్ని వేసి కలపాలి.

* ఇప్పుడు కొబ్బరి తురుము, బటర్ స్కాచ్ కస్టర్డ్ పౌడర్, ఫుడ్ కలర్ వేసి సుమారు పావుగంట సేపు దగ్గరగా అయ్యేవరకు ఉడికించి దించాలి.

* దించిన మిశ్రమాన్ని చిన్న బౌల్స్ లో సర్దాక బాదం, పిస్తా, జీడిపప్పు ముక్కలు చల్లి వడ్డంచాలి.

టిప్..సాధారణంగా ఇందులో పంచదార అవసరం లేదు. తీపి సరిపోదు అనుకున్న వాళ్లు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు.

Related Recipes