బనానా వెనిల్లా మిల్క్‌షేక్ రెసిపి

 

కావలసినవి:

అరటి పండు - ఒకటి

చాకొలెట్ సాస్ - టేబుల్‌స్పూన్

ఐస్ క్రీమ్ - ఒకటిన్నర కప్పు

వెనిలా ఎసెన్స్ - నాలుగు చుక్కలు

పాలు - కప్పు

తయారి:

అరటిపండు,ఐస్ క్రీం , కాచి చల్లార్చిన పాలు ,వెనిలా ఎసెన్స్ అన్నిటిని కలిపి మిక్సీలో వేసి బాగా బ్లెండ్ చెయ్యాలి. గంట సేపు ఫ్రిజ్ లో పెట్టాలి .

సర్వ్ చేసేముందు గ్లాసులో ముందు చాకొలెట్ సాస్ వేసి తరవాత బనానా వెనిల్లా మిల్క్‌షేక్ వేసి సర్వ్చెయ్యాలి.