బాదాం హల్వా  (నవరాత్రి స్పెషల్)

 

 

కావలసిన పదార్ధాలు:

బాదం పప్పులు - 1 కప్పు (నానపెట్టి పై తొక్క తీసినవి )

పాలు - 1 కప్పు

పంచదార - 3/4 కప్పు

ఏలక్కాయలు - 3

నెయ్యి - 1/2 కప్పు

కుంకుమ పువ్వు - కొద్దిగా

ఫుడ్ కలర్ - కేసరి కాని లైట్ పసుపు రంగు (optional)

 

తయారు చేసే విధానం :

బాదం పప్పులని నీటిలో నానబెట్టాలి. తరువాత పైన వున్న తొక్కని తీసేయాలి. తొందరగా తొక్క తీయాలంటే వాటిని  నీటిలో వుడికించితే తొందరగా వస్తుంది. వాటిని మిక్సీలో వేసి  పాలు పోసి  పేస్ట్ చేయాలి. పంచదారని పావు కప్పు నీటిలో కరిగించి లేత పాకం వచ్చేదాక పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. పంచదార పాకంలో రుబ్బి వుంచుకున్న బాదం పేస్ట్ ని వేసి కలుపుతూ వుండాలి. లేకపోతే మాడి పోతుంది. చాలా జాగ్రత్తగా కలపాలి. దంచిన ఏలక్కాయ పొడి వేయాలి. కరిగించిన నేతిని పోస్తూ కలుపుతూ వుండాలి. ఒకేసారి నెయ్యి అంతా వేయకూడదు. కొద్ది కొద్దిగా వేస్తూ వుండాలి. కొద్ది పాలలో కుంకుమ పూవు వేసి బాగా కలిపి కరిగాక వుడుకుతున్న బాదం పేస్ట్ లో వేయాలి. వుడుకుతున్నప్పుడు నెయ్యి సెపరేట్ అయ్యినట్లుగా వుంటే హల్వా అయిపోయినట్లే! వెంటనే  స్టౌ కట్టేయాలి. లేకపోతే తొందరగా అడుగంటడమో, మాడటమో జరుగుతుంది. కలుపుతుంటే బాళికి అంటుకోకుండా వున్నపుడు అయిపోయినట్లు. వేయించిన బాదం పప్పులు, పిస్తా సన్నాగా కట్ చేసి   హల్వా పైన అలంకరిస్తే బాగుంటుంది. ముద్దగా కాకుండా పీసెస్ లాగా కావలంటే నెయ్యి రాసిన పళ్ళెంలో  బాదం   హల్వా   వేసి చల్లారాక ముక్కలుగా కట్ చేయాలి.

 

టిప్స్:
బాదాం పప్పు పది నిముషాలు ఉడికిస్తే తొక్క తొందరగా వస్తుంది.
కొంతమంది బాళిలో ఒకేసారి బాదాం పేస్టు, నెయ్యి, పంచదార, ఏలక్కాయ పొడి అన్నీ ఒకేసారి వేసి ఉడికిస్తారు.
హల్వా పూర్తీ అయ్యే వరకు కలుపుతూనే వుండాలి. 
పిన్నలు, పెద్దలు ఇష్టం గా తినే బాదాం హల్వా ఆరోగ్యానికి కూడా చాల మంచిది.
తీపి కావలసిన వారు ఎక్కువగా పంచదార కూడా వేసుకోవచ్చు.

 

- Mani Kopalle