Home >>Vegetarian >>AA Kakarakaya Vepudu

 

 

ఆ కాకరకాయ వేపుడు 

 

 

 

కావలసిన పదార్థాలు..

* ఆ కాకరకాయలు   - 1/2 kg

* ఉల్లిపాయలు         - 2 చిన్నవి 

* జీలకర్ర                 -  1/8 స్పూన్ 

* ధనియాలపొడి       - 1/2 

* ఆమ్ చూర్           - 1/4 

* పసుపు               - కొద్దిగా 

* కారం                  - 1/4 స్పూన్ 

* ఉప్పు                   - రుచికి తగినంత 

* నూనె                  - తగినంత

తయారుచేసుకునే విధానం:

* ముందుగా ఆ కాకరకాయలు కడిగి పైన కొద్దిగా పొట్టు తీసేసి పొడవుగా నిలువుముక్కలు తరుగుకోవాలి. ముదిరిన గింజలు గుచ్చుకుంటాయి వాటిని తీసివేసుకోవాలి.

* ఇప్పుడు ఒక బాణలి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి అది కాగాక జీలకర్ర వేసి ఈ ముక్కలు మూకుడులో వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. 

* 10 నిమిషాలలో కదుపుతూ ఉప్పు పసుపు జోడించాలి. పూర్తిగా వేగాక స్టౌవ్ ఆఫ్ చేసి సర్విం గ్ బౌల్ లోకి తీసుకోవాలి

* అదే మూకుడులో  కొద్ది నూనె వేసి నిలువుగా సన్నగా తరిగిన ఉల్లిముక్కలు వేసి 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చి..ధనియాలపొడి, ఆమ్ చూర్ పొడివేసి కారంపొడి కూడా వేసి అన్నీ ఉల్లిముక్కలకు పట్టేటట్లు కలిపి వీటిని ఆకాకర ముక్కలపై వేసి అలంకరించుకోవాలి.

* వడ్డించేటప్పుడు అడుగునుంచి తీసి వడ్డిస్తే ఆకాకర ముక్కలు కమ్మని రుచితో పైన ఉల్లిముక్కలు  ఉప్పుగా , పుల్లగా ఆ  రెండు రుచులు అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. 

 

Related Recipes