టమోటో కాప్సికం కర్రీ

 

 

కావాలసిన పదార్థములు :

కాప్సికమ్‌ : రెండు
ఉల్లిపాయ : ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక స్పూన్‌
కరివేపాకు : రెండు రెబ్బలు
నువ్వులపొడి :  ఒక స్పూన్‌
కారం : ఒక  స్పూన్‌
పసుపు : అర స్పూన్‌
నూనె : తగినంత
ధనియాల పోడి : అరస్పూన్‌
కొత్తిమీర : కట్ట
టమోటోలు : రెండు

తయారీ:

ముందుగా పాన్ పెట్టి నూనె వేసి కరివేపాకు, ఉల్లిపాయ తరుగు  వేసి వేయించి  అల్లంవెల్లుల్లి ఫేస్ట్ వేసి వేగాక అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాలపొడి ఒకదాని తరువాత ఒకటి వేసి కలపాలి. తరువాత కాప్సికమ్‌, టమోటో ముక్కలు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు సరిపడా  నీళ్ళుపొసి మూతపెట్టి చిన్న మంట మీద ఉడకనివ్వాలి. చివరిలో నువ్వుల పొడి కొత్తిమిర వేసి రెండునిముషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి బౌల్ లోకి తీసుకోవాలి.