LATEST NEWS
కేంద్ర హోం మంత్రి, బీజేపీ నాయకుడు అమిత్ షా హెలికాప్టర్‌కి ప్రమాదం తప్పిందని, ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ టేకాఫ్ అయ్యే సమయంలో ఊగిసలాటకి గురైందని వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే అమిత్ షా హెలికాప్టర్‌కి అలాంటి సంఘటన జరగలేదని, అది ఒక ఫేక్ న్యూస్ అని ప్రభుత్వ వర్గాలు ప్రకటించింది. ఈ న్యూస్ ఫేక్ న్యూస్ అని తెలియక అనేక ప్రముఖ మీడియా సంస్థలు ఈ వార్తను అందించాయి. అయితే అది ఫేక్ న్యూస్ అని తెలిసి మళ్ళీ డిలీట్ చేశాయి. గతంలో సినీనటి సౌందర్య బీజేపీ కోసం ప్రచారం చేయడం కోసం హెలికాప్టర్లో ప్రయాణం చేయబోగా, హెలికాప్టర్ టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయి ఆమె మరణించిన విషయం తెలిసిందే.
పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరిన సమయంలో కూడా చల్లటి వినాదాన్ని పంచగల దిట్ట ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏపాల్ మాత్రమేనని ఇంత కాలం అందరూ భావిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు  ఏపీ ఎన్నికల ముంగిట అధికార పార్టీ అదినేత వైఎస్ జగన్ పొలిటికల్ కామెడీని పండించడంలో పాల్ ను మించిపోయాడని అంటున్నారు. ఔను వైఎస్ జగన్ ఇటీవలి కాలంలో తన మాటలు, చేతలు, ప్రసంగాలలో కామెడీని బ్రహ్మాండంగా పండిస్తున్నారు.   తన హయాంలో జరిగిన సర్వ తప్పిదాలనూ తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఆపాదిస్తూ.. ఐదేళ్లలో తన వైఫల్యానికి కారణం చంద్రబాబే అని చెబుతూ నవ్విస్తున్నారు. అధికారంలోకి రాగానే మూడు రాజధానులంటూ హడావుడి చేసి చివరకు ఒక రూపుదాల్చిన రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయడమే కాకుండా... రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా తాను మిగల్చిన జగన్.. తన వైఫల్యానికి కూడా చంద్రబాబే కారణమని చెబుతున్నారు. అదెలాగో స్వయంగా ఆయన చెప్పిన మాటలు వింటే దుర్వాసుడైనా పగలబడి నవ్వి తీరతాడు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వదిలి వచ్చేసి చంద్రబాబే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేశారట. ఔను ఆయన అలా చేయకుండా ఉండి ఉంటే తాను అమరావతిని నిర్వీర్యం చేసినా, మూడు రాజధానులు కాదు కదా ఒక్క రాజధినికి ఒక్క ఇటుకముక్క కూడా పేర్చలేకపోయినా.. హైదరాబాద్ ఉండేది కదా అంటున్నారు.  ఔను సోమవారం (ఏప్రిల్ 29) చోడవరంలో  మాట్లాడుతూ  జగన్ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కాదని చంద్రబాబు రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని విమర్శించారు.  అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వీటన్నిటి గురించి ఆయన మరచిపోవడమే కాకుండా, ప్రజలూ మర్చిపోవాలని అంటున్నారు. అదే సచివాలయంలో తన ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతున్నా, అసెంబ్లీ సమావేశాలను చంద్రబాబు నిర్మించిన భవనంలోనే నిర్వహిస్తున్నా. జగన్ ప్రభుత్వ తప్పిదాలకు మొట్టికాయలు వేస్తున్న హైకోర్టు కూడా చంద్రబాబు రాజధాని అమరావతిలో నిర్మించిన భవనంలోనే సాగుతోందని తెలిసినా జగన్ మాత్రం హైదరాబాద్ వదిలేసి చంద్రబాబు తప్పు చేశాడని నిందిస్తుంటే వినేవాళ్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.  ఇక మనమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తుండగా జగన్ పై జరిగిన గులకరాయి హత్యాయత్నం గురించి జగన్ చెబుతున్న మాటలు, చేస్తున్న చేష్టల గురించైతే ప్రజలు గుర్తుకు తెచ్చుకుని మరీ పడీపడీ నవ్వుతున్నారు.  దెబ్బ తగిలిన తొలి రోజు చిన్నసైజు ప్లాస్టర్ వేసుకున్న జగన్, ఆ తర్వాత పెద్ద సైజు పట్టీతో దర్శనమిచ్చారు.  అంతే కాదు ఆ పట్టీని ఆయన దాదాపు 13 రోజుల పాటు ధరించి కాదు కాదు భరించారు.  డాక్టర్ చెల్లెమ్మ సునీత   జగనన్నా  గాయంపై రోజుల తరబడి పట్టీ ఉంచుకుంటే సెప్టిక్ ఔతుంది జాగ్రత్త అని హెచ్చిరించడంతో భయపడి తీసేశారు. అయినా గులకరాయి హత్యాయత్నం ఘటనలో గాయపడిన జగన్ కు చికిత్స చేసి కుట్లు వేసి మరీ బ్యాండేజీ వేసిన నిపుణులైన గవర్నమెంట్ వైద్యుల బృందానికి ఆ విషయం తెలియదు పాపం. నిజానికి కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు, ఆంకాలజిస్టు, చివరాఖరకు గైనకాలజిస్టులు కలసి మూడు కుట్లు వేసి మరీ చికిత్స చేసినా పదమూడు రోజుల పాటు ఆయన నుదుటిపై అంతసైజు బ్యాండ్ ఎయిడ్ పట్టీ ఎందుకు ఉంచుకోవాల్సి వచ్చిందో అని జనం ఆందోళన కూడా పడ్డారు. అయితే నెటిజనులు మాత్రం జగన్ స్థాయి వ్యక్తికి గాయం తగిలినప్పుడు ఆ మాత్రం పట్టీ లేకపోతే ఎలా అని సెటైర్లూ వేశారు అది వేరే సంగతి.   గర్భిణులకు సిజేరియన్ చేసి కానుపు చేసిన వైద్యులు కూడా కుట్లను వారంలో తీసేస్తారు.. కానీ జగన్ కు మాత్రం 13 రోజుల పాటు కుట్లు వేసిన గాయానికి పట్టీ వేసి అలాగే ఉంచేశారు.  సరే 13 రోజుల తరువాత జగన్ నుదుటిపై పట్టీ తీసేశారు. పట్టీ తీసేసిన తరువాత ఆయన ముఖం చూసి జనం ఆశ్చర్యపోయారు.   మెడికల్ హిస్టరీలో ఇంతకు మించి మిరాకిల్ ఎక్కడైనా ఉంటుందా అని సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలారు.  ఎందుకంటే.. 13 రోజులు పట్టీతో ఉన్న జగనన్న నుదుటిపై  గీత కూడా కనిపించకపోవడమే.  మొత్తం మీద జగన్ తన చేష్టలు, చర్యలు, ప్రసంగాలతో భలే కామెడీ పండిస్తున్నారంటూ జనం చర్చించుకుంటున్నారు. 
 ఏపీలో ఎన్నికల తేదీ రోజుల్లోకి వచ్చేసింది. కచ్చితంగా చెప్పాలంటే మరో 14 రోజుల్లో ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల హీట్ రోహిణీకార్తె ఎండలను మించిపోయింది. పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలైపోయి ఉన్నాయి. పార్టీల అధినేతలు బహిరంగ సభలు, రోడ్ షోలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత వేరే లెవెల్ లో కనిపిస్తోంది. దీంతో అధికార వైసీపీలో ఓటమి భయం కూడా స్పష్టంగా కానవస్తోంది. రాష్ట్రం మొత్తం ఒకెత్తైతే.. కడప జిల్లా ఒక్కటీ ఒకెత్తు అన్నట్లుగా ఇక్కడ అధికార వైసీపీ ఆధిపత్యం కానవచ్చేది. అయితే ఆ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కడప లోక్ సభ బరిలో అవినాష్ కు పోటీగా కాంగ్రెస్ తరఫున వైఎస్ షర్మిల రంగంలోకి దిగడంతోనే కడపలో సీన్ మారిపోయింది. షర్మిల ప్రజెన్స్ ఒక్క కడప లోక్ సభ నియోజకవర్గాన్నే కాకుండా ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ, మొత్తం జిల్లాపైనా ప్రభావం చూపుతోంది. అన్నిటికీ మించి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఈ ఎన్నికలలో జిల్లా వ్యాప్తంగా ప్రధాన అజెండాగా మారిపోయింది.  ఏపీలో ఎన్నికలకు ఇంకా ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది. ఇప్పటి రాజకీయాలను బట్టి చూస్తే ఇది చాలా తక్కువ సమయం. అందుకే   ఇప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి చిన్నాన్న  వైఎస్ వివేకానంద రెడ్డి 2019 ఎన్నికలకు ముందు హత్యకు గురైన సంగతి తెలిసిందే.  హత్యకు గురైన వివేకా ఇంట్లోనే ఇప్పుడు అధికారం ఉంది. హత్య  తెలుగుదేశం హయంలో జరగడం, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు.. ఆ హత్య వెనుక ఉన్నది తెలుగుదేశంఅన్నట్లుగా ఫోకస్ చేసి లబ్ధి పొందారు ఇప్పుడు అదే కేసు విచారణకు వచ్చేసరికి నాడు లబ్ధి చేకూర్చిన కేసే ఇప్పుడు వారికి రివర్స్ లో నష్టం చేకూర్చేలా మారిపోయింది. ఇప్పటికే ఎన్నో మలుపులు, అంతకి మించి కుదుపులు చోటు చేసుకున్న వివేకా హత్యకేసు క్లైమాక్స్ చేరింది. ఈ హత్య కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. కోర్టుల్లో తీర్పులూ ఇంకా రాలేదు. కానీ ఈ కేసులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్న విషయంలో ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది. ఇప్పుడు వివేకా హత్య కేసులో కడప ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఎన్నికలలో ఓటు ద్వారా తమ తీర్పు ఏమిటో చెప్పనున్నారు. అందుకే  వివేకా హత్య కేసు  క్లైమాక్స్ కి చేరిందని అంటున్నారు.  కోర్టుల్లో వివేకా హత్య కేసు సాగదీత కోసం   ఓ వర్గం సర్వశక్తులు ఒడ్డింది. అది  తెలుగు రాష్ట్రాల  ప్రజలు   చూస్తూనే ఉన్నారు. కడప జిల్లా వాసులు అయితే చూడటం తో  పాటు హత్య కు కారకులు, కారణాలు కూడా అర్ధం చేసుకున్నారు.  నిన్న మొన్నటి వరకు ఈ కేసు సాగదీతలో కేంద్రం అంతో ఇంతో సాయపడుతుందని ఢిల్లీ నుండి గల్లీ వరకూ కోడై కూసింది. విశ్లేషకుల నుండి అతి సామాన్య ప్రజల వరకూ అందరి నోటా ఈ మాటే వినిపించింది. అయితే, ఇప్పుడు కేంద్రంలో పరిస్థితులు కూడా మారిపోయాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు పాత మిత్రుల అవసరం వచ్చింది పడింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల పుణ్యమా అని అని దేశవ్యాప్తంగా బీజేపీ పాత మిత్రులను దగ్గరకు చేర్చుకుంది. అలాగే ఏపీలో కూడా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది.  ఈక్రమంలో ఇకపై వివేకా కేసులో కేంద్రం నుండి సాయం అంటే వైసీపీకి ఎడారిలో నీటి ఊటను వెతుక్కోవడమే అవుతుంది. దీంతో ఇప్పుడు వివేకా హత్య కేసు కడప జిల్లాలో ప్రధాన ఎన్నికల అజెండాగా మారిపోయింది.  సరిగ్గా గత ఎన్నికల సమయంలో వైసీపీకి, జగన్ మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన  వివేకా హత్యకేసు ఇప్పుడు  వైసీపీకి ఊపిరాడకుండా చేస్తోంది.  రాజకోట లాంటి ఇంట్లో అతి కిరాతకంగా జరిగిన ఈ హత్యను వారికి తగ్గట్లుగా మలుచుకోవడంలో వైఎస్ జగన్ అప్పుడు సక్సెస్ అయ్యారు. సరిగ్గా ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయానికి అదే కేసు వైసీపీ వెన్నులో వణుకుపుట్టిస్తోంది.   నిజానికి ఈ హత్య ఎవరు చేశారు.. ఎవరు చేయించారు అనేది కోర్టులు, శిక్షలకే పరిమితం. కానీ, రాజకీయాలలో చేసే ఆరోపణలలో బలం ఎటువైపు ఉంటే ప్రజలు అదే నమ్మే ఛాన్స్ ఉంటుంది. ఆ లెక్కన ఈ కేసులో దాదాపు ఐదేళ్ల విచారణ, అప్పటి నుండి జరిగిన పరిణామాలు అన్నీ కూడా  తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, వైసీపీకి వ్యతిరేకంగా  ఉన్నాయి. ఈ కేసులో ప్రధానంగా సీఎం జగన్ కు మరో చిన్నాన్న కొడుకైన ఎంపీ అవినాష్  కీలక సూత్రధారిగా దర్యాప్తు సంస్థ సీబీఐ ఇప్పటికే తేల్చి చెప్పడం సీఎంకు ఎన్నికలలో కచ్చితంగా ప్రతికూలాంశంగా మారిందనడంలో సందేహం లేదు. దానికి తోడు వివేకా కుమార్తె సునీత, సీఎం జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల.. వివేకా హంతకుల పక్కన నిలబడిన సీఎంకు ఓటు వేయవద్దు, వైసీపీని ఓడించండి అంటూ చేస్తున్న ప్రచారం కడప వాసులను కదిలిస్తోంది.  ఈ కేసులో అవినాష్ తప్పించుకునేందుకు జగన్ పడుతున్న తాపత్రయం, ఎన్నికల ప్రచారంలో కోర్టుల తీర్పులతో పని లేకుండా జగన్ అవినాష్ కు క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజలలో జగన్ పట్ల, ఆయన ప్రభుత్వం పట్ల ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. అందులో భాగమే పులివెందులలో జగన్ తరఫున ప్రచారం చేస్తున్న ఆయన సతీమణి భారతికి ఎదురౌతున్న చేదు అనుభవాలు. ప్రజల నుంచి ఎదురౌతున్న ప్రశ్నలు. వీటన్నిటినీ బట్టి చూస్తే  ఎన్నికలలో వైసీపీకి  కడపలో కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ వ్యతిరేక పవనాలకు జగన్ అవినాష్ ను వెనకేసుకురావడమే కారణమంటున్నారు. అంటే కడప కహానీ క్లైమాక్స్ చేరిందనీ, జగన్ కు అవినాష్ నుంచే గట్టి దెబ్బతగిలినట్లు కనిపిస్తోందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (ఏప్రిల్ 30)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో నాలుగు కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.   టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. సోమవారం (ఏప్రిల్ 29) శ్రీవారిని మొత్తం 77 వేల 673 మంది దర్శించుకున్నారు. వారిలో 30 వేల 607 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 10 లక్షల రూపాయలు వచ్చింది. 
గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే ముందు... నిజామాబాద్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ ధర్మపురి ఈ  ప్రశ్నలకు జవాబు చెప్పాలంటూ  గల్ఫ్ జెఏసి చైర్మన్, గుగ్గిల్ల రవిగౌడ్ బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు.  ◉ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఏం చర్యలు తీసుకుంది?   ◉ గత ఐదేళ్లలో గల్ఫ్ సమస్యల గురించి పార్లమెంటులో మీరు ఎందుకు మాట్లాడలేదు? ◉ గల్ఫ్ దేశాలలో భారతీయ కార్మికులకు అక్కడ కంపెనీలు ఇస్తున్న కనీస వేతనాలను... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ  సెప్టెంబర్ 2020 లో రెండు సర్కులర్లను జారీ చేసింది. ఇందులో కేంద్రం జేబులోంచి ఇచ్చేది ఏముండదు. గల్ఫ్ దేశాల కంపెనీలు జీతాలు ఇస్తాయి... కార్మికులు తీసుకుంటారు. అరవింద్ గారు... గల్ఫ్ దేశాలలో పనిచేసే 88 లక్షల మంది భారతీయ కార్మికుల జీవితాలకు సంబంధించిన ఈ అంశంపై మీరు ఎందుకు స్పందించలేదు. ఎందుకు పార్లమెంటులో మాట్లాడలేదు. మేము చేసిన ఉద్యమ ఒత్తిడికి తలొగ్గిన  కేంద్ర ప్రభుత్వం 10 నెలల తర్వాత పాత వేతనాలను కొనసాగిస్తామని ప్రకటించింది.  ◉ ప్రవాసి భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమాలో సహజ మరణాన్ని కూడా చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎందుకు పట్టించుకోలేదు.  ◉ హైదరాబాద్ లో సౌదీ అరేబియా మరియు కువైట్ దేశాల కాన్సులేట్లు (దౌత్య కార్యాలయాలు) ఏర్పాటు కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా... కేంద్ర ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదు. ◉ ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోదీ గారు సౌదీ అరేబియా, యూఏఈ, ఓమాన్, కువైట్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో చాలా సార్లు పర్యటించారు. భారత్ - గల్ఫ్ దేశాల మధ్య చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలలో వ్యాపార వాణిజ్య ఒప్పందాలే ఎక్కువ. గల్ఫ్ వలస కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమం గురించి ఎందుకు  పట్టించుకోలేదు.  ◉ కరోనా కష్టకాలంలో గల్ఫ్ తదితర దేశాల నుంచి భారత్ కు వాపస్ వచ్చిన ప్రయాణీకుల నుంచి వందే భారత్ ప్లయిట్స్ లలో రెండింతలు, చార్టర్డ్ ఫ్లయిట్స్ లలో మూడింతలు విమాన ఛార్జీలు వసూలు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద ప్రవాసి కార్మికులను ఎందుకు దోచుకున్నది.  ◉ 34 సంవత్సరాల క్రితం...1990 లో కువైట్ పై ఇరాక్ దురాక్రమణ 'గల్ఫ్ యుద్ధం' జరిగిన సందర్బంగా అప్పటి భారత ప్రధాని వి.పి. సింగ్, విదేశాంగ మంత్రి ఐ.కె. గుజ్రాల్ నాయకత్వంలో ఒక లక్షా 70 వేల మంది భారతీయులను ఉచితంగా స్వదేశానికి తరలించారు. వి.పి. సింగ్ లాగా ఇప్పటి ప్రధాని మోదీ ఎందుకు ఉచితంగా విమానాలను ఏర్పాటు చేయలేకపోయారు.  ◉ గల్ఫ్ దేశాలలో ఉన్న వలస కార్మికులు ఈ ఎన్నికల్లో ఓటు వేయడం కోసం స్వయంగా ఇండియాకు రావడం వీలుకాదు. ప్లయిట్ చార్జీలు భరించడం, లీవ్ దొరకడం కష్టం. గత పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం... ఎన్నారైలకు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం -  ఆన్ లైన్ ఓటింగ్ ఓటింగ్ సౌకర్యం కల్పించలేకపోయింది. 'ఆబ్సెంటీ ఓటర్స్' గా మిగిలిపోతున్న గల్ఫ్ కార్మికులకు మీరు ఇచ్చే జవాబు ఏమిటి? ◉ బీజేపీ మోదీ ప్రభుత్వం ఆన్ లైన్ ఓటింగ్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది. మోదీకి ఎన్నారైలు అంటే... ఏదో తెలియని భయం పట్టుకున్నదా? ◉ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు 2023లో 125 బిలియన్ యుఎస్ డాలర్లు (10 లక్షల 25 వేల కోట్ల రూపాయల) విలువైన విదేశీ మారకాన్ని భారత్ కు పంపారు. ఇందులో సగానికి పైగా గల్ఫ్ దేశాల నుంచే లభిస్తున్నది. దేశానికి ఆర్థిక జవాన్లుగా పనిచేస్తున్న ప్రవాసులకు కేంద్రం అన్యాయం చేస్తోందని అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. దీనికి మీ జవాబు ఏమిటి? ◉ బంగ్లాదేశ్ పౌరులు విదేశాల నుంచి పంపిన విదేశీ మారక ద్రవ్యంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం రెండున శాతం ప్రోత్సాహకం  ఇస్తున్నది. భారత్ ఎందుకు ఇవ్వడం లేదో ఏనాడైనా ఆలోచించారా.  ◉ "ఇవాళ దుబాయిలో మనవాళ్ళు చేతికి కంకణం కట్టుకొని, నొదుట బొట్టు పెట్టుకొని, తిలకం దిద్దుకొని తిరుగుతున్నరు అంటే... దానికి నరేంద్ర మోదీ గారే కారణం" అని ఇటీవల నిజామాబాద్ ఎంపీ అరవింద్  వ్యాఖ్యానించడం ఘోర తప్పిదం.. సర్వ స్వతంత్ర, సార్వభౌమాధికారం కలిగిన దుబాయి (యూఏఈ దేశం) పై భారత్ ఆధిపత్యం చలాయిస్తున్నది అనే అర్థం వచ్చేలా మాట్లాడటం దౌత్య నిబంధనలకు విరుద్ధం. దీనిపై మీ జవాబు ఏమిటి.  ◉ దుబాయిలో, మస్కట్, బహరేన్ లలో వంద సంవత్సరాలకు పూర్వమే హిందూ మందిరాలు ఉన్నాయనే విషయం మీకు తెలుసా.  ◉ ఇలాంటి వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై చిచ్చు పెట్టి ఈ పార్లమెంటు ఎన్నికల్లో లబ్ది పొందాలని చూడటం ఎంతవరకు కరెక్ట్. ఇలాంటి మాటల వలన దుబాయి, యూఏఈ దేశంలో మన ప్రవాస భారతీయుల ఉద్యోగ అవకాశాలపై దెబ్బ పడితే ఎవరు బాధ్యత వహిస్తారు.  ◉ ఎమిగ్రేషన్ యాక్టు1983 అనే విదేశీ వలసల నియంత్రణ చట్టం స్థానంలో... కొత్త చట్టం తేవాలనే ప్రతిపాదనలను గత ఐదేళ్లుగా బీజేపీ ఎందుకు పెండింగ్ లో పెట్టిందని గ‌ల్ఫ్ జేఏసి నిల‌దీస్తోంది.  రైతులు, బీడీ కార్మికులు, గల్ఫ్‌ కార్మికులు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ నియోజకవర్గం ఓట‌ర్లు, ప్రతిసారీ విలక్షణ తీర్పునే ఇస్తుంటారు. గ‌ల్ప్ కార్మికులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వారి కుటుంబ స‌భ్యులు ఎటు మొగ్గితే వారే విజయాన్ని సాధిస్తున్నారు. ఎంపీ హోదాలో అర‌వింద్  ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో గ‌ల్ప్ కార్మికుల కుటుంబాలు బీజేపీపై కోపంతో ఉన్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌
ALSO ON TELUGUONE N E W S
Young actor Anand Devarakonda, who made his presence felt in Tollywood with films like ‘Dorasani’, ‘Middle Class Melodies’ and ‘Pushpaka Vimanam’ scored his careers biggest blockbuster with Baby directed by Sai Rajesh. He is now coming with an action entertainer titled Gam Gam Ganesha. The recently released intriguing first look, teaser and song garnered everyone attention. Pragati Srivastava plays the female lead. Gam Ganesha is written and directed by Uday Shetty. The film is produced by Kedar Selagamashetty and Vamsi Karumanchi under the banner Hy-Life Entertainment. Today, makers announced the much awaited release date with a captivating poster. In the poster, Anand Deverakonda is seen standing on a cliff and firing a gun, from which rose petals are coming out. The background of the poster is filled with red, and the date is placed in yellow. The film is releasing worldwide in theaters on May 31st. The comedy, chaos, and confusion begin in theaters very soon. The makers are planning for creative promotions starting from the beginning of May. Chaitan Bharadwaj has composed the music for Gam Gam Ganesha. Karthika Srinivas R is the editor of the film. The film co produced by Anurag Paravatheneni. The film also stars, Karisma, Vennela Kishore, Jabardast Emmanuel and others in key roles.
  ఆఫ్టర్ బాహుబలి తర్వాత ప్రభాస్ ఒక కమర్షియల్ సినిమాని చెయ్యాలని కొన్ని లక్షల మంది అభిమానులు కోరుకున్నారు. వాళ్ళ అభ్యర్ధనని మన్నించిన  డార్లింగ్  రాజా సాబ్ చేస్తున్నాడు. అందులో నుంచి  ప్రభాస్ లుక్ బయటకి వచ్చినప్పటినుంచి   ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. ఊర మాస్ యాక్టింగ్ కి నేను రెడీ అనేలా లుంగీ కట్టుకొని ఉన్న ప్రభాస్ స్టిల్ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చింది. ఇక లేటెస్ట్ న్యూస్ ఒకటి వాళ్ళల్లో మరింత  ఉత్సాహాన్ని పెంచుతుంది.  రాజా సాబ్ పక్కా మాస్ మూవీ. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ లు ప్రభాస్ తో జత కడుతున్నారు.పైగా  ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ జత కట్టడం ఇదే తొలిసారి. ఇప్పుడు ఆ ముగ్గురుతో  కలిసి  ప్రభాస్  ఒక సూపర్  మాస్  సాంగ్ కి స్టెప్ లు వెయ్యబోతున్నాడు. త్వరలోనే  షూట్ కి వెళ్లబోతున్నాడు. పైగా  మూవీ మొత్తానికి ఆ సాంగ్  హైలైట్ కానుందనే వార్తలు వస్తున్నాయి. అలాగే  ప్రభాస్ మాస్  డ్యాన్స్  సరికొత్తగా ఉండబోతుందని రేపు థియేటర్స్ లో విజిల్స్ మోగడం గ్యారంటీ అని  అంటున్నారు ఇక డైరెక్టర్ మారుతీ  తనకి వచ్చిన అవకాశాన్ని నిరూపించుకొని పాన్  ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఫస్ట్ టైం ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ ని డైరెక్క్షన్ చేస్తుండటంతో అవుట్ ఫుట్ కోసం రేయింపగళ్ళు శ్రమిస్తున్నాడు. పీపుల్స్  మీడియా ఫ్యాక్టరీ పై టి జి విశ్వ ప్రసాద్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలీవుడ్ అగ్ర నటుడు  సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది.  
అమృత  పాండే..  భోజ్ పురి  సినీ రంగంలో మంచి నటిగా  గుర్తింపుని  తెచ్చుకుంది. పైగా తనకి ఎంతో భవిష్యత్తు కూడా ఉంది. ఈ క్రమంలో  బీహార్  భాగల్పూర్ లోని  తన ప్లాట్ లో ఉరి వేసుకొని చనిపోయింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తుని ప్రారంభించారు. ఈ క్రమంలో కొన్ని సంచలన  విషయాలు బయటకి వచ్చాయి అమృత పాండే కి యానిమేషన్ రంగానికి చెందిన  చంద్ర మణి ఝంగాడ్ తో వివాహం జరిగింది. ఇద్దరు కలిసి ముంబై లో నివాసం ఉంటున్నారు. ఏప్రిల్ 12 న  తన సోదరి వివాహానికి హాజరయ్యేందుకు అమృత  బీహార్ వచ్చింది.ఆ సమయంలో   చంద్ర మణి కూడా ఆమె వెంట ఉన్నాడు. వివాహం  అనంతరం  అతను ముంబై కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అమృత భాగల్పూర్ లో ఒక  పార్టీ నిర్వహించింది. చంద్ర మణి కూడా హాజరయ్యాడు. పైగా ఇద్దరు కలిసి ఎంతో సంతోషంతో  డాన్స్ కూడా చేసారు. కలిసే డిన్నర్  చేసారు. ఆ సమయంలో అమృతలో ఎలాంటి మానసిక ఒత్తిడి లేదు.అది జరిగిన  రెండు రోజులకి అంటే ఏప్రిల్ 27 న  సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. అతని జీవితం రెండు పడవలపై ఉంది.కాబట్టి  అతని జీవితాన్ని సులభతరం చెయ్యడానికి మేము మా పడవని ముంచుతున్నాం అని పోస్ట్ చేసింది . ఆ తర్వాతే సూసైడ్ చేసుకుంది.  తాజాగా  పోలీసుల నివేదికలో ఇంకో విషయం వెలుగులోకి వచ్చింది. అమృతకి తన ఇద్దరు సోదరీమణులు , దత్తత తీసుకున్న తమ్ముడుతో ఒక సమస్యపై గొడవ ఉందని తెలుస్తుంది.పైగా  తన సోదరి కుమార్తెను కూడా  పెంచుతుంది .ఈ  కోణంలో  కూడా  విచారణ జరుగుతుంది. మరి  ముందు ముందు ఈ కేసులో ఎలాంటి సంచలన విషయాలు బయటకి వస్తాయో చూడాలి. భోజ్‌పురి సూపర్  స్టార్ ఖేసరి లాల్ యాదవ్‌తో కలిసి దీవానాపన్ అనే మూవీలో నటించింది. అలాగే పలు  హిందీ సినిమాలు,టీవీ షోలు మరియు వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. పరిషోద్  అనే వెబ్ సిరీస్‌ ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది
మంచు వారి ప్రెస్టేజియస్ట్ మూవీ కన్నప్ప. మంచు విష్ణు టైటిల్ రోల్ ని పోషిస్తున్నాడు.  విష్ణు  ఇప్పటి వరకు సోషల్ ఎలిమెంట్ చిత్రాల్లో మాత్రమే నటించాడు. దీంతో  కన్నప్ప గా ఎలా నటిస్తాడో అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కన్నప్పలో ఒక ప్రత్యేక గీతం ఉంది.  కథకి అది  చాలా ముఖ్యమైనది కూడా.  ఆ  సాంగ్ ని ఎలాగైనా  తమన్నా చేత చేయించాలని మేకర్స్  ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. ఈ మేరకు త్వరలోనే  తమన్నా ని  కలవబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఈ విషయం మీద ఇంకా అధికార ప్రకటన రాలేదు. ఒక వేళ అదే నిజమయ్యి  తమన్నా  గ్రీన్ సిగ్నల్ ఇస్తే కన్నప్ప కి అదనపు ఆకర్షణ కూడా తోడయినట్టే. పైగా తమన్నాకి పీరియాడిక్ అండ్ చారిత్రాత్మక సినిమాల్లో నటించిన అనుభవం కూడా ఉంది. హావ భావాలని, బాడీ లాంగ్వేజ్ ని పర్ఫెక్ట్ గా పండించగలదు. బహుబలి,సైరా నరసింహ రెడ్డిలే   అందుకు ఉదాహరణ  పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న కన్నప్ప లో  మోహన్ బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రభాస్, నయనతార, మోహ‌న్ లాల్ ,అక్షయ్ కుమార్ , శరత్ కుమార్  వంటి వారు నటిస్తున్నారనే వార్త ఎప్పటినుంచో  వినపడుతుంది.ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫిలిం ఫ్యాక్టరీ అండ్ అవా ఎంటర్టైన్మెంట్స్ పై విష్ణు,మోహన్ బాబు లే  నిర్మిస్తున్నారు. ప్రీతీ ముకుందన్ కథానాయిక  కాగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకుడు.  పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. 100 కోట్ల బడ్జట్ అని అంచనా  
ఆఫ్ ది స్క్రీన్, ఆన్ ది స్క్రీన్  రికార్డులు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అందుకు నిదర్శనమే ప్రస్తుతం సోషల్ మీడియాలో  ట్రెండ్ అవుతున్న వీడియో.  రాజమౌళితో మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి సదరు వీడియో హుషారు ని తెస్తుంది. అంతే కాదు సోదరీమణులని కూడా   గుర్తుకు తెస్తుంది. మహేష్ రీసెంట్ గా ఒక ఫంక్షన్ కి హాజరయ్యాడు. సరికొత్త హెయిర్ స్టైల్ తో, సరికొత్త లుక్ తో ఒక రేంజ్ లో ఉన్నాడు.  జుట్టు అయితే షోల్డర్స్ దాకా వచ్చింది. ఇక ఇదే  ఫంక్షన్ కి  మహేష్ అక్కయ్య మంజుల కూడా హాజరయ్యింది. మహేష్ ని చూసి  వెంటనే  దగ్గరకెళ్ళి జుట్టేంటి ఇంత పెంచావు అనేలా  మహేష్ వెనకవైపు జుట్టుని చేత్తో తడిమింది. దీంతో మహేష్ ఒక నవ్వు నవ్వాడు. ఆ తర్వాత  ఏం చెప్పాడో గాని మంజుల అయితే విపరీతంగా నవ్వింది. ఆ సమయంలో మంజుల భర్త  ప్రముఖ నటుడు సంజయ్ కుమార్ కూడా అక్కడే  ఉన్నాడు. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ అయితే అక్కా తమ్ముడి అనుబంధం అంటు కామెంట్స్ చేస్తున్నారు. అదే టైం లో మహేష్ లుక్  రాజమౌళి సినిమా కోసమే అని కూడా మాట్లాడుకుంటున్నారు.  మంజుల, మహేష్ ఒకరికొకరు చాలా అభిమానంగా ఉంటారు. అందుకు నిదర్శనంగా  మహేష్ హీరోగా మంజుల రెండు సినిమాలని కూడా నిర్మించింది. నాని కి సోలో ప్రొడ్యూసర్ గా  పోకిరి కి  సహనిర్మాత గాను వ్యవహరించింది.  షో అనే సినిమాకి దర్శకత్వం కూడా చేసింది వహించింది.  
‘HanuMan’, starring Teja Sajja, was directed by Prasanth Varma, who took viewers by surprise in January 2024. The movie was a huge hit in Telugu and Hindi, and there is a lot of talk about the sequel, ‘Jai HanuMan’. Although it's still a work in progress, the reports are doing the rounds on the internet that Prasanth Varma and Ranveer Singh are making a massively budgeted period film. Ranveer Singh, Prasanth Varma and Mythri Movie Makers are confirmed to team up for a film. It will be the immediate film in Prasanth Varma's cinematic universe and will got onto the floors even before Jai Hanuman. The Project with a working title Brahmarakshasa will be the immediate next of actor Ranveer Singh too. The film's formal Pooja was recently held. Its a part of the movie Universe PVCU as well. The film will release in 2025.
అసలే తండ్రీకొడుకులు చిరంజీవి-రామ్ చరణ్ కలిసి నటించిన మొదటి సినిమా, పైగా అపజయమెరుగని దర్శకుడు కొరటాల శివ రూపొందించిన సినిమా, దానికి తోడు 'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్ నటించిన సినిమా. ఇన్ని పాజిటివ్ లు ఉంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ఆచార్య'(Acharya) విషయంలో అదే జరిగింది. కానీ ఆ చిత్రం ఆ అంచనాలకు అందుకోవడంలో పూర్తిగా విఫలమై, బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చిరంజీవి(Chiranjeevi), రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీతో కలిసి మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా.. భారీ అంచనాలతో 2022 ఏప్రిల్ 29న విడుదలైంది. మొదటి షోకే నెగటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. చిరంజీవి, చరణ్, కొరటాల కెరీర్లలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. చిరంజీవి-రామ్ చరణ్ కలిసి నటించారు, కలిసి చిందేశారు అనే ఆనందం తప్ప.. ఈ సినిమా మెగా అభిమానులకు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ చిత్రం విడుదలై నేటితో రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా 'ఆచార్య' విడుదలకు ముందు ఏర్పడిన అంచనాలను, విడుదల తర్వాత తగిలిన గాయాలను సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.
The regular shoot of the most-awaited film Thandel in the crazy combination of Yuva Samrat Naga Chaitanya, successful director Chandoo Mondeti, and leading production house Geetha Arts is going at brisk pace. Thandel is presented by Allu Aravind and produced by Bunny Vasu. The shoot is presently underway and the team is canning some crucial sequences. Sai Pallavi plays the role of Satya in this film. The film will hit the big screens for Christmas 2025. Makers considering December 20th as release date. Naga Chaitanya who underwent a complete makeover will be seen in a never-before get-up and character in the movie. The buzz is high on this film in trade circles and audience. Now, the film's digital streaming Rights ( post theatrical release ) were sold to Netflix for a whooping price of 40+cr. Thandel marks the highest OTT rights ever sold for Yuvasamrat Naga Chaitanya starrer. Makers recently closed the deal. Sai Pallavi is the female lead opposite Naga Chaitanya in the movie story which is based on real incidents. Thandel is a love story with a completely different backdrop. The makers zeroed in on well-known technicians to handle different crafts. As the story has a good scope for music, National-award-winning composer- Rockstar Devi Sri Prasad is roped in to beautify the love story with his soundtracks and score. Shamdat will crank the camera to offer a visual spectacle. Srinagendra Tangala will look after the art department.
బడా సినిమాలకే కాదు చిన్న సినిమాలకి సీక్వెల్స్ ఉంటాయని  పొలిమేర  సిరీస్  నిరూపించింది.  మా ఊరి పొలిమేర, మా ఊరి పొలిమేర 2 ఇలా వచ్చిన  రెండు పార్టులు  మంచి విజయాన్ని సాధించాయి. ఫస్ట్ పార్ట్ 2021 లో ఓటిటి  వేదికగా స్మాల్ స్క్రీన్స్ లో అడుగుపెట్టింది.  సెకండ్ పార్ట్ 2023 లో థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ మూవీ అరుదైన ఘనతని సాధించింది.     ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 30 న ఢిల్లీలో  దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఎంటైర్ భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభ కనపరిచిన సినిమాలు ఈ ఫెస్టివల్ కి ఎంపిక చేయబడతాయి. ఇప్పుడు  పొలిమేర 2  దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపిక   అయ్యింది. దీంతో మేకర్స్ ఆనందంలో ఉన్నారు. నిజానికి  దాదాసాహెబ్ ఫాల్కే అనగానే భారత ప్రభుత్వం ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు  అందరకి గుర్తుకొస్తుంది.  భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభ కనపర్చిన వారికి ఆ అవార్డు ని ఇస్తుంటారు. మన తెలుగు చిత్ర సీమ నుంచి దేవికా రాణి, బి ఎన్ రెడ్డి,ఎల్ వి ప్రసాద్, బి నాగి రెడ్డి, నట సామ్రాట్  అక్కినేని నాగేశ్వరరావు ,మూవీ మొఘల్  డి  రామానాయుడు, కళాతపస్వి కే.విశ్వనాధ్ తదితరులు  ఫాల్కే ని  అందుకున్నారు. అమితాబ్ ,రజనీకాంత్ వంటి ప్రముఖుల్ని కూడా ఫాల్కే  వరించింది.   . ఇక బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో పొలిమేర 2 తెరకెక్కింది. సత్యం రాజేష్, బాలాదిత్య, గెటప్ శ్రీను, రవివర్మ, రాకేందు మౌళి,కామాక్షి బాసర్ల,  సాహితీ దాసరి ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌర్ కృష్ణ నిర్మించగా అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు  
Young talented hero Anand Deverakonda recently got a blockbuster hit with the movie "Baby". He is currently busy with the movie titled "Gam Gam Ganesha". Anand is doing this movie in action genre which he has not done till now. Kedar Selagamshetty and Vamsi Karumanchi are producing the movie under the banner of Hy-Life Entertainment. Uday Shetty is debuting as a director with this film. The first look poster and teaser impressed audience. Currently, the post-production activities of the movie "Gam..Gam..Ganesha" are going on. Recently Anand Deverakonda announced that they will reveal the release date of the movie soon.  We hear is that the makers finally locked the release date as May 31st. The film will be clashing with Sudheer Babu's Harom Hara at box office.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  మనసులో ఏదీ దాచుకోలేకపోవడం చాలా మంది బలహీనత. బాధ అయినా, సంతోషం అయినా, దుఃఖం అయినా తనకు తెలిసిన వారికో లేక స్నేహితులు, ఆత్మీయులకో ఏదో ఒక  సందర్భంలో చెప్పుకుని తీరతారు. అయితే ఇలా చెప్పడం తప్పని కాదు కానీ.. కొన్ని విషయాలు మాత్రం ఇతరులతో అస్సలు చెప్పడం మంచిది కాదని అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేష నిపుణులు. ఏ వ్యక్తి అయినా ఇతరులతో అస్సలు చెప్పకూడని 5 విషయాలేంటో తెలుసుకుని వాటిని పాటిస్తే  వారి జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది. ఆ అయిదు విషయాలేంటో తెలుసుకుంటే.. ఆర్థిక స్థితి.. ఉద్యోగం చేసేవారు అయినా వ్యాపారం చేసేవారు అయినా పొదుపు చేసేవారు అయినా తమ ఆర్థిక స్థితి గురించి మరో వ్యక్తికి చెప్పడం మంచిది కాదు. ప్రతి వ్యక్తి ఆర్థిక స్థితి సామాజిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. డబ్బును చూసి మనుషులు మసలుకునే కాలమిది. ఎవరిదగ్గరైనా డబ్బు ఎక్కువ ఉందని తెలిసినా, ఎక్కువ సంపాదిస్తున్నారని తెలిసినా అప్పు కోసం, సహాయాల కోసం సులువుగా చుట్టూ చేరతారు. పక్క మనిషి గురించి పట్టించుకోని ఈ కాలంలో ఆర్థిక సహాయాలు చెయ్యడం అంత మంచిది కాదు. అందుకే ఆర్థిక స్థితి గురించి ఎవరికీ చెప్పకూడదు. ఇంటి సమస్యలు.. ప్రతి ఇంట్లోనూ సమస్యలుంటాయి. ఇంటి సమస్యలను ఇంటి వారితో చర్చించి వాటిని చక్కబెట్టుకోవడం శ్రేయస్కరం. అలా కాకుండా సలహాలు, సూచనలు ఇస్తారనో లేదా మనసులో భారం దించుకోవాలనే ఆలోచనతోనో ఇంటి సమస్యలు బయటి వారికి, తెలిసిన వారికి చెప్పడం మంచిది కాదు. రిలేషన్ గొడవలు..  నిజానికి తోబుట్టువులు, చుట్టాలు, బాగా దగ్గరి వారైనా సరే.. భార్యాభర్తల సమస్యలలో జోక్యం చేసుకోవడం, తీర్పులు ఇవ్వడం మంచిది కాదు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గొడవలు, సమస్యలు వారే పరిష్కరించుకుంటే వారిద్దరికి ఒకరి మీద మరొకరికి గౌరవం పెరుగుతుంది. ఏ సమస్యకైనా ప్రతి వ్యక్తి స్పందన వేరుగా ఉంటుంది. అనుభవాలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి సమస్యలను బయటకు, లేదా ఇతరుల దగ్గరకు తీసుకెళ్లడం, చెప్పడం మంచిది కాదు. మూడవ వ్యక్తికి భార్యాభర్తల సమస్యలు చెబితే వారు దాన్ని ఎంటర్టైన్మెంట్ గా చూస్తారు. బలహీనతలు.. ప్రతి వ్యక్తిలోనూ బలాలతో పాటూ బలహీనతలు ఉంటాయి. చాలామంది వ్యక్తులలో లోపాలు, బలహీనతలను వెతుకుతారు. వాటిని వేలెత్తి చూపిస్తారు. విమర్శిస్తారు. అందుకే వ్యక్తులలో బలాలు బయటపెట్టినా సమస్య లేదు కానీ బలహీనతల గురించి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరికీ చెప్పకూడదు. ప్రణాళికలు.. పెద్ద పెద్ద విషయాల గురించి నిర్ణయాలు తీసుకునే ముందు, పెద్ద ప్రణాళికలు వేసుకునేటప్పుడు వాటిని మరొక వ్యక్తితో చెప్పకూడదు. జీవితంలో ఇంకా ఎదిగే దశలో వేసుకునే ప్రణాళికలు ఇతరులతో చెప్పకూడదు.                                                      *రూపశ్రీ.  
మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అయ్యాయని ఒకప్పుడు చెప్పుకునేవాళ్లం. అది ఇప్పటికీ ఉంది కానీ.. మానవ సంబంధాలు మరికొన్ని కొత్త రూపాలకు దారి మళ్లాయి. ఒకప్పుడు వైవాహిక జీవితంలో ఏ సమస్య వచ్చినా  దాన్ని పరిష్కరించుకోవడం, సర్థుకోవడం చేసేవారు. కానీ ఇప్పుడలా కాదు.. ఏ సమస్య వచ్చినా దాన్ని తెగెవరకు లాగి అదే సమస్యకు పరిష్కారం అని అనుకుంటున్నారు. ప్రస్తుతం చాలా వైరల్ అవుతున్న విషయం స్లీపింగ్ డైవొర్స్.. అసలు స్లీపింగ్ డైవొర్స్ అంటే ఏంటి? దీనివల్ల భార్యాభర్తలకు జరిగే నష్టం ఏంటి తెలుసుకుంటే.. పెళ్లైన భార్యాభర్తలు  ఒకే గదిలో ఉన్నప్పుడు వారు కలిసి నిద్రపోతారు.  ఇద్దరూ విడివిడిగా పడుకోవడం ప్రారంభిస్తే వారి మధ్య ఏదో సరిగ్గా జరగడం లేదనే అనుమానం వస్తుంది.  సాధారణంగా భార్యాభర్తలు ఇక ఇద్దరూ కలిసి జీవించలేమని నిర్ణయించుకున్న తరువాత విడాకులు తీసుకుంటారు. కానీ ఈ స్లీపింగ్ డైవొర్స్ అనేవి బంధాన్ని తెంచుకునే విడాకులు కాదు.. నాణ్యమైన నిద్ర పొందడానికి భాగస్వాములు విడివిడిగా నిద్రపోవడానికి తీసుకునే విడాకులు. సాధారణంగా భాగస్వాములు నిద్రలో చేతులు,  కాళ్లను కదిలించడం వల్ల, గురకకు అలవాటు పడడం వల్ల లేదా ఏదైనా నిద్ర రుగ్మత కారణంగా పక్కవారి నిద్రకు డిస్టర్బ్ కలిగిస్తూ ఉంటారు. కానీ ఈ స్లీపింగ్ డైవొర్స్ కారణంగా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, ఇద్దరు హాయిగా నిద్రపోతారని  అనుకుంటున్నారు. కానీ  ఇది సమస్యను పరిష్కరించడానికి బదులుగా వారి మధ్య బంధాన్నిబలహీనపరుస్తుంది. నిద్ర కోసం ఈ స్లీపింగ్ డైవొర్స్ తీసుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. అయినా సరే ఈ డైవొర్స్ స్లీపింగ్ వల్ల జంట మధ్య బంధం బలహీనపడుతుందని రిలేషన్షిప్ నిపుణులు నొక్కి వక్కాణిస్తున్నారు. ఇద్దరూ విడివిడిగా పడుకోవడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా వారిని ఎప్పటికీ కలిపి ఉంచేది వారిద్దరి మధ్య శారీరక స్పర్శే.. అది కూడా వారిమధ్య లేనప్పుడు  ఇక ఇద్దరినీ కలిపి ఉంచే మార్గమేదీ ఉండదు. ఒకే ఇంట్లో ఇద్దరూ అపరిచితుల్లా చాలా  కొద్ది కాలంలోనే మారిపోతారు. మరొక విషయం ఏమిటంటే ఇలా ఇద్దరూ విడివిడిగా పడుకోవడం అనేది దీర్ఘకాలం జరిగితే వైవాహిక బంధాలు విచ్చిన్నమై వాటి విలువ కూడా తగ్గిపోతుంది. ఆరోగ్యకరమైన నిద్రకోసం భార్యాభర్తలు ఇద్దరూ ఆరోగ్యకరమైన పద్దతులు ఎంచుకోవాలి. వైద్యుల సలహా తీసుకుని నిద్రకు బంగం కలిగించే సమస్యలను పరిష్కించుకోవాలి.                                              *రూపశ్రీ.  
వేసవికాలం వచ్చిందంటే వామ్మో అంటాము. మండిపోయే ఎండలు, మగ్గబెట్టే ఉక్కపోత, వీటికి తోడు కరెంట్ కోతలు. ఉదయం, సాయంత్రం తప్ప ఏ మధ్యాహ్నపు ఎండలోనో బయటకు వెళ్లాల్సిన అవసరం వచ్చిందంటే గుండె గుభేలుమంటుంది. అందుకే ఎండ అంటే చెప్పలేనంత మంట అందరికీ. కానీ సమయం గడుస్తూ ఉంటే ఈ కాలాలు అదేనండి వర్షాకాలం, చలికాలం వచ్చినట్టు ఎండాకాలం కూడా రాక తప్పదు. అది తన ప్రతాపం చూపించక తప్పదు. అయితే ఈ వేసవిని చూసి భయపడటానికి ఎన్ని కారణాలు ఉన్నాయో, దీన్ని ఎంజాయ్ చేయడానికి అన్నే మార్గాలు ఉన్నాయి. ఓసారి తెలుసుకుంటే సమ్మర్ మీద హమ్మర్ తో ఓ మోస్తరు సౌండ్ చేయచ్చు. ఒకప్పుడు!! సంవత్సరకాలం అంతా పిల్లలు ఎదురుచూసేరోజులు ఇవే అంటే ఆశ్చర్యమేస్తుంది. నిజంగానే వేసవి కోసం పిల్లలు అర్రులు చాచేవాళ్ళు. ఒక పూట బడి ముగియగానే ఎండను కూడా లెక్కచేయకుండా బావుల వెంట, చేల వెంట వెల్తూ ఎన్నో మధురస్మృతులను మూటగట్టుకునేవాళ్ళు. ఓ ముప్పై సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళను పిలిచి బాల్యం గురించి చెప్పమంటే కళ్ళు మెరవడం, చిరునవ్వు బయటకు రావడం ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి.  అందుకే అన్ని కాలలను ఒకేలా పుస్తకాల మధ్య కాకుండా కాసింత ప్రత్యేకంగా గడిపేలా మీ పిల్లలకు ఏర్పాటు చేయండి. అది వాళ్లకు ఆసక్తికరమై, వాళ్ళ సంతోషానికి కారణమయ్యేది అయ్యుండాలి సుమా!! ప్రకృతి ఆతిథ్యం!! నిజంగా నిజమే. వేసవిలో ప్రకృతి ఎంత గొప్ప ఆతిథ్యం ఇస్తుందని. అవన్నీ చాలా వరకు ఇప్పటి తరానికి తెలియకుండా ఉన్నాయి. వాళ్లకు ఓసారి పరిచయం చేసి చూడండి. నాచురల్ లైఫ్ మీద లవ్ లో పడతారు వాళ్ళు. పుల్లని విందు!! బలే బలే పసందు ఈ పుల్లని విందు. అదే అదే ఫలాల రాజు మామిడి గారు ఎంతో ఠీవిగా చెట్లలో పెరిగి అందరినీ పలకరించడానికి ఇంటింటికి వస్తాడు. అందరి నోర్లు జలపాతాలు చేస్తాడు.  చెరకు చరిష్మా!! చిన్నప్పటి దంతాల రహస్యం. నోటితోనే చెరకు పొట్టు తీసి, కొరికి, కసకస నమిలి, రసాన్ని జుర్రుకుంటూ పిప్పిని పడేస్తే ఆహా ఉంటుంది ఆ నాలుగు అదృష్టం ఎంతో అనిపిస్తుంది. ఇప్పట్లో అంత సీన్లు లేకపోయినా ఎంచక్కా రోడ్ సైడ్ దొరికే చెరకు రసం తాగేసి హాయి హాయిగా వెళ్లిపోవచ్చు.  ఇవి మచ్చుకు రెండు మాత్రమే. ఇంకా చింతచిగురు వేరే లెవెల్. తాటి ముంజలు మరొక ఎత్తు, చల్ల చల్లటి మజ్జిగ, శరీర తాపాన్ని తగ్గించే పుదీనా శరబత్ ఇవన్నీ హైలైట్.  అయితే మరొక మ్యాజిక్ కూడా ఉంది. అదే కేవలం రాయలసీమ ప్రాంతంలో లభ్యమయ్యే సుగంధి సిరప్. కేవలం కడప జిల్లాలో అడవులలో మాత్రమే పెరిగే సుగంధ మొక్కల వేర్లను ఉడికించి పంచదార కలిపి సిరప్ చేసి అమ్ముతుంటారు. సువాసన అద్భుతంగా ఉంటుంది. చల్లని నీళ్లు, లేదా షోడాతో ఈ సిరప్ కలిపి తీసుకుంటే వేసవి కాలం వెంట తీసుకొచ్చే వడదెబ్బ వంద కిలోమీటర్లు పరిగెత్తి పరిగెత్తి పారిపోతుంది. శరీర వేడిని తక్షణమే తగ్గిస్తుంది.  వేసవి భయం అసలు వద్దు!! ఎవరు ఎన్ని చెప్పుకున్నా బయటకు వెళ్ళేవాళ్లకు అదొక భయం. సర్రుమని కాలిపోతున్న రోడ్లన్నీ నరకంలో యమధర్మరాజు ఏర్పాటు చేసినట్టు అనుభూతి కలుగుతుంది. అందుకే సులువైన, మరియు అందరూ ఆచరించగల జాగ్రత్తలు. బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. మరి నీళ్లు అయిపోతే?? ఏముంది ఏకంగా బాటల్  కొనే పని తప్పుతుంది ఎక్కడో ఒక చోట అయిదు రూపాయల్లో బాటల్ నింపుకోవచ్చు. లేదు కాదు అంటే 20 నుండి 30 పెట్టి వాటర్ బాటిల్ కొనేబదులు ఎంచక్కా ఫ్రూట్ జ్యూస్, లేదా నిమ్మ షోడా వంటివి తాగడం హాయి. వేసవి తాపాన్ని తగ్గిస్తాయి ఇవి. ఇవి కాకుండా మరొక సలహా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కీరా దోస, పుచ్చకాయ వంటి నీరు అధికంగా ఉన్నవి తినడం లేదా జ్యూస్ తాగడం మంచిది. ఉప్పు, కారం, మసాలాలు వంటివి తగ్గించుకోవాలి ఈ కాలంలో. శరీర ఉష్ణోగ్రత మీద అవి ప్రభావం చూపిస్తాయి.  వెంట గొడుగు ఉంచుకోవడం మర్చిపోకండి. లేదంటే టోపి, లేదా స్పార్క్ ఇలా ఎదో ఒకటి నెత్తిని కప్పి ఉంచేలా జాగ్రత్త పడాలి. వీలైనంత వరకు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు వెళ్లేలా చూసుకోవాలి. మధ్యలో సమయం అంతా ఇంటి పట్టున లేదా ఉద్యోగాలు చేసే ప్రాంతాలలో ఉండటం మంచిది. ఇలా చెప్పుకుంటూ పోతే వేసవి కోసం బోలెడు మార్గాలు. అయితే మనం ఎంత డాబు చెప్పుకున్నా ఈ ఎండల కొరడా దెబ్బకు ఒళ్ళు చురుక్కుమనడం సాధారణం. అందుకే దాని నుండి జాగ్రత్త మరి. జాగ్రత్తగా షేక్ హాండ్ ఇచ్చి కూల్ గా డీల్ చేసి పంపిద్దాం.                                     ◆వెంకటేష్ పువ్వాడ.
  జీర్ణ ఆరోగ్యం బాగుంటే మొత్తం ఆరోగ్యం అంతా బావుంటుంది. వేసవిలో  వేడి,  తేమతో కూడిన వాతావరణంలో శరీరాలు సులభంగా డీహైడ్రేషన్ కు గురవుతాయి.  ఇది మలబద్ధకం, అతిసారం,  ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యలను నివారించడానికి  ఆయుర్వేద చెప్పిన  చిట్కాలను అనుసరించడం అన్ని విధాలా మంచిది. జీర్ణ సమస్యల పరిష్కారానికి ఆయుర్వేదం చెప్పిన చిట్కాలివీ.. ఆహారం మన శరీరానికి ఇంధనం. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది, ఔషదంగా పనిచేస్తుంది. శరీరం  సమతుల్యంగా ఉండటంలో సహాయపడుతుంది.  మంచి ఆహారం తీసుకోవడం సరైన ఫిట్నెస్ మెంటైన్ చేయడానికి మూలం.   వెచ్చని, తాజాగా వండిన,  సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు ఆయుర్వేదంచే ఎక్కువగా సిఫార్సు చేయబడ్డాయి. డైటరీ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, గింజలు,  విత్తనాలు అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి మూలికలు,  సుగంధ ద్రవ్యాలు తీసుకోవడం చాలా మంచిది.  ఆయుర్వేదంలో ఉపయోగించే త్రిఫల వంటి మూలికలు జీర్ణక్రియకు,  జీర్ణశయాంతర వ్యవస్థను క్లియర్ చేయడానికి  బాగా ఉపయోగపడతాయి.  మసాలా దినుసులను పోలి ఉండే అల్లం జీర్ణ ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అల్లంను ఆహారంలో చేర్చవచ్చు లేదా తాజా అల్లం టీ వంటివి త్రాగవచ్చు. జీలకర్ర, కొత్తిమీర,  ఫెన్నెల్ టీ, లేదా CCF టీ, జీర్ణక్రియకు,  గ్యాస్,  ఉబ్బరం నుండి ఉపశమనానికి ఉపయోగిస్తారు. పులియబెట్టిన ఆహారాలైన పెరుగు, ఇంట్లో తయారుచేసిన ఊరగాయలు, మజ్జిగ, అన్నం గంజి,  ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే పాల ఉత్పత్తులను తీసుకోవచ్చు. సరైన జీర్ణక్రియ గట్ బ్యాక్టీరియా  సమతుల్యంగా ఉండటంపై  ఆధారపడి ఉంటుంది. ఇది ప్రోబయోటిక్స్ మద్దతు ఇస్తుంది.  కెఫిన్, స్పైసీ ఫుడ్,  కొన్ని పాల ఉత్పత్తులు కడుపు నొప్పికి కారణం అవుతాయి.  కొన్ని వస్తువులు తీసుకోవడం పరిమితం చేయడం ఉత్తమం. భారీ ఆహారాలు,  వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక కొవ్వు, ప్రాసెస్ చేయబడిన, ప్యాక్ చేయబడిన, నిల్వ చేసిన,  సీసాలలో ఉంచిన ఆహారాలను తగ్గించాలి.  ఎందుకంటే అవి జీర్ణం కావడం కష్టం.  జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది. ఒకేసారి ఎక్కువ తినకుండా  రోజంతా చిన్న మొత్తాలలో తినాలి.  ఇది  జీర్ణవ్యవస్థపై  అధిక భారం పడకుండా చేస్తుంది. భోజనం చేస్తున్న సమయంలో  స్పృహతో తినాలి. తినేటప్పుడు గాలి పీల్చుకోకూడదు. ప్రశాంతమైన, రిలాక్స్డ్ వాతావరణంలో తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఆహారాన్ని నెమ్మదిగా,  పూర్తిగా నమలాలి. ఇది ఆహార కణాల విచ్ఛిన్నానికి సహాయపడుతుంది.   రోజంతా తగినంత నీరు త్రాగాలి. నీరు జీర్ణక్రియ,  పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.  అలాగే జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారం కదలికలో సహాయపడుతుంది. జీర్ణాశయాన్ని శుభ్రపరచడంలో  గోరువెచ్చని నీరు తాగాలని ఆయుర్వేదం సూచిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి రెగ్యులర్ శారీరక శ్రమ కూడా అవసరం. ఆప్టిమల్ మూవ్మెంట్ థెరపీ ప్రేగు కదలికలను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.  మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొన్ని యోగా భంగిమలు,  శ్వాస వ్యాయామాలు ఉదర అవయవాలను ప్రేరేపిస్తాయి, ఇవి విశ్రాంతిని,  మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. పవనముక్తాసనం (గాలి-ఉపశమన భంగిమ),  భుజంగాసనం (కోబ్రా భంగిమ) వంటి ఆసనాలు సహాయపడతాయి. నాడి శోధన (ప్రత్యామ్నాయ నాసికా శ్వాస) వంటి ప్రాణాయామం కూడా జీర్ణవ్యవస్థను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.  గోరువెచ్చని నువ్వుల నూనెతో సవ్యదిశలో పొత్తికడుపును మసాజ్ చేయడం జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ప్రసరణను మెరుగుపరుస్తుంది.  నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది.  తద్వారా జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. విరేచన (చికిత్సా ప్రక్షాళన),  బస్తీ (ఔషధ ఎనిమా) వంటి పంచకర్మ చికిత్సలు శరీరాన్ని శుభ్రపరచడానికి,  జీర్ణ ఆరోగ్యానికి పరోక్షంగా తోడ్పడే దోషాలను సమతుల్యం చేయడానికి ఉపయోగిస్తారు. క్రమం తప్పకుండా తినడం,  నిద్రపోవడం ద్వారా సిర్కాడియన్ చక్రాన్ని నియంత్రణలో ఉంచవచ్చు. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు కీలకం.                                                            *రూపశ్రీ.
మామిడి పండ్ల సీజన్ మొదలైంది. మార్కెట్‌లో వివిధ రకాల మామిడి పండ్లను విక్రయిస్తుంటారు. మామిడి  పండు తినడమంటే అందరికీ ఇష్టమే.. అయితే కొందరు మాత్రం దీన్ని మినహాయించాలని చెబుతారు. వారే మధుమేహం ఉన్నవారు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం మధుమేహం ఉన్నవారు కూడా మామిడి పండ్లను తప్పకుండా తినచ్చని, కానీ అది తగినంత మోతాదులో చాలా కొద్దిగా మాత్రమే తినాలని చెబుతారు. అంతేనా మరికొందరు బాగా పండిన మామిడి పండ్లను మధుమేహం ఉన్నవారు అస్సలు తినకూడదని కూడా అంటున్నారు. అసలు మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లు తినడంలో తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? తెలియకుండానే మామిడిపండ్లు తినడంలో వారు చేస్తున్న తప్పులేంటి? తెలుసుకుంటే.. మామిడి పండ్లను తింటే డయాబెటిక్ పేషెంట్ల పరిస్థితి మరింత దిగజారుతుందనేది పెద్ద అపోహ అని డాక్టర్లు చెబుతున్నారు. మామిడి పండ్లు ఆరోగ్యానికి మంచివి, కానీ తీపి కారణంగా మధుమేహ రోగులు తరచుగా వాటిని తినకుండా ఉంటారు.లేదా వాటిని తప్పుడు పరిమాణంలో లేదా తప్పుడు పద్ధతిలో తినడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనం ఏది తిన్నా అది షుగర్ స్థాయిని ప్రభావితం చేస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.  ఇది ఏ ఆహారం తినడం ద్వారా చక్కెర స్థాయి ఎంత పెరుగుతుందో చెప్పడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ రోగులందరూ క్రమం తప్పకుండా పండ్లు తినాలి. అయితే మామిడి గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ ఎక్కువగా ఉంది (51-56). అందుకే తినే పరిమాణం,  విధానంపై మధుమేహ రోగులు శ్రద్ధ వహించాలి. డయాబెటిక్ పేషెంట్లు మామిడిపండ్లు తినడం మానేయాల్సిన అవసరం లేదు.  ప్రతిరోజూ 100 గ్రాముల చిన్న మామిడిపండును సమతుల్య పరిమాణంలో తీసుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లను తినే విధానంపై శ్రద్ధ వహించాలి.  వాటిని తీసుకునేటప్పుడు జాగ్రత్త పడాలి. ఒకేసారి 100 గ్రాముల కంటే ఎక్కువ మామిడి తినకూడదు. మామిడికాయ గుజ్జును మాత్రమే తినాలి.  మామిడి రసం లేదా షేక్ రూపంలో తీసుకోకూడదు. పండ్లు తిన్న రెండు గంటల తర్వాత చక్కెర స్థాయిని చెక్ చేసుకోవాలి. పండ్లు తిన్న తర్వాత చక్కెర స్థాయి పెరిగితే పరిమాణాన్ని తగ్గించాలి.  వైద్యుడిని సంప్రదించాలి. భోజనం తర్వాత లేదా రాత్రి మామిడి తినకూడదు. ఎల్లప్పుడూ మామిడికాయను మధ్యాహ్నం సలాడ్‌గా లేదా ఉదయం అల్పాహారంగా తినాలి.                                          *రూపశ్రీ.  
అందరినీ వేదించే సమస్య ముఖ్యంగా యువతను వేదిస్తున్న సమస్య ఊబ కాయం అంటే ఒబెసిటీ. దీనికోసం తిరగని చోటంటూ ఉండదు .  వెళ్ళని డాక్టర్ అంటూ లేదు. సక్షన్లు, నాన్ లైపోసక్షన్లు. ప్రత్యేకంగా దీనికోసమే ఉన్న ఆసుపత్రులు. ప్రత్యేక సర్జన్లు. ఇలా ఊబకాయం అనేక ఆరోగ్య సమస్యలకు కారణం కావడం  గమనించ వచ్చు.చేతి వాడిని ఒదిలి కాలివాడిని పట్టుకున్నట్లు మనం పాటించాల్సిన కనీస  నియమావళిని అమలు చేయకుండా స్వీయ నియంత్రణ  లేకుండా ఊబ కాయాన్ని తగ్గించలేమని అంటున్నారు వైద్యులు.మీ శరీరం బరువు తగ్గాలంటే రాత్రి వేళ ఈ పది సూత్రాలు అమలు చేయండి.మీరు మీ శరీర బరువు తగ్గాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు.ప్రతిరోజూ వర్క్ అవుట్ తప్పని సరిగా  చేస్తూ ఉంటారు. కొన్ని మార్పులు చేసి ప్రయత్నం చేయండి. దీని వల్ల మీరు నాజూకుగా స్లిమ్ముగా కనపడడానికి దోహదం చేస్తాయి. రాత్రి సమయమే సరైన సమయం... మన శరీర బరువు తగ్గించే ప్రయత్నం చేస్తు ఆరోగ్యకర మైన ఆహారం తీసుకుంటూనే వర్క్ అవుట్ చేస్తూ ప్రతిరోజూ ప్రత్యేకమైన  విషయాలు అనుసరించాలి.అందులోను కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తూ రాత్రివేళ ప్రయత్నించండి మీరు స్లిమ్ గా మారచ్చు .సాయంత్రం వేళ మిమ్మల్ని మీరు బిజీగా ఉంచండి. సాయంత్రం వేళ మిమ్మల్నిమీరు ఒక వ్యాపకం వైపుకు మళ్లించండి. కొన్ని సందర్భాలలో ప్రజలు చాలా ఎక్కువగా ఆహారం తీసుకుంటారు. అలా చెయడం బోరింగ్ మీరు ఫిట్ గా ఉండాలంటే నిద్ర పోయే ముందు కొంత పని చేయాల్సి ఉంటుంది. కొంచం సేపు నడవడం, చాట్ చేయడం, వ్యాసాలు రాయడం, మీమిత్రులతో పంచుకోవడం. లేదా కొన్ని పుస్తకాలు చదవడం వల్లమీరు  ఆహారం పెద్దగా తీసుకోరు. ఒక కొత్త అలవాటు ఒక్కొఅంశం పైన ఆశక్తి పెంచుకోడం వల్ల పెయింటింగ్ వేయడం. సంగీతం పాడడం లేదా ఏదైనా వాయిద్యం వాయించడం. అల్లికలు చేయడం వంటి పనుల వల్ల ఆహారం తినాలన్న కోరిక తగ్గిపోతుంది. మళ్ళీ తినా లన్నా కాంక్ష బోర్ గా ఉంటుంది. సరిగా నిద్రపోవాలి... సాయంత్రం వేళలో  కాస్త వ్యాయామం కొంత మేర మీకు సహాయ పడుతుంది. అది ఎక్కువ సేపు వ్యాయామం చేయకూడదు. విరామం లేకుండా చేసే వ్యాయామం చెయడం వల్ల నిద్ర పోవడం కొంచం కష్టంగా ఉంటుంది. మరీ ఆలస్యంగా వర్క్ అవుట్ చేయకండి. నిద్రపోడానికి రాత్రివేళ గంట ముందు  వ్యాయామం ఆపేయండి ఆతరువాతే నిద్రకు ఉపక్రమించండి. నిద్రపోయే ముందు తినకండి... నిద్రపోయే ముందు మీరు డిన్నర్ తీసుకుంటారా? అల్పాహారం అంటే టిఫిన్ తీసుకుంటారా? ఏదైనా మీరు మీఅహారాని నిద్రకు ముందే ముగించేయ్యాలి. అలాకాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మీఆహారం తీసుకుంటే అది మీ శరీర బరువును మరింత పెంచుతుంది. అయితే మీరు మీ బరువు తగ్గాలన్న ప్రయత్నం విఫలం కావచ్చు. సరైన సమయం, అంటే ఏ సమయంలో ఆహారం తిన్నారు అన్నది విషయం కాదు. చాలా మంది రాత్రి వేళలో  ఆహారం తీసుకునే వాళ్ళు పైగా ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకుంటారు. అర్ధ రాత్రి భోజనం ,అల్పాహారం తీసుకోడం వల్ల  నిద్రపోలేరు. దీనివల్ల మళ్ళీ బరువు పెరుగుతారు. కొన్ని గంటల పాటు వంట గది నుంచి బయటికి రండి. నిద్రపోయేముందు నుంచి మరుసటి రోజు ముందు వరకు మేల్కుని ఉంటారు. మీ మధ్యాహ్న భోజనాన్ని రేపటికి ప్యాక్ చెయ్యండి... ప్రతి రోజూ మీరు మాధ్యాహ్న భోజనానికి బయటికి వెళ్తున్నారా? అయితే కొంత పొడుపు చేయండి. రాత్రికి ముందే మీ లంచ్ ను ప్యాక్ చెయ్యండి. బయట తినడము అంటే  అందులో ఎక్కువ కొవ్వు పదార్ధాలు, సోడియం ఉంటుంది మీ ఆహారాన్ని మీరే  ప్యాక్ చేసినప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ ఇచ్చే బాదాం, టర్కీస్లై సెస్, హోల్ గ్రైన్, తక్కువ కొవ్వు ఇచ్చే  పాల ఉత్పత్తులు చాలా రకాల పండ్లు ఫలాలు తీసుకోవచ్చు. మీరు మీ సమయ పాలనకు కట్టుబడి ఉండండి... రాత్రి వేళ మీరు ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారని గమనిస్తే అంటే దాని ఆర్ధం ఉదయం వేళ మీరు సరిపడే ఆహారాన్ని తీసుకోలేదని అర్ధం. దీనిని ఎలా ఎదుర్కోవాలి అన్న ప్రశ్నకు సమాధానంగా మీ భోజనం మీరు ప్రతిరోజూ తీసుకోవాలి. ఆరకంగా మీ శరీరానికి ఎప్పుడు ఆహారం తీసుకోవాలో  తెలుస్తుంది. మాధ్యాహ్న భోజనం రాత్రి డిన్నర్ మధ్య స్నాక్ తీసుకుంటే మంచిది. అలా ప్రయత్నం చేయడం అది మీరు ఎక్కువగా చేయకండి. టి వి ని కట్టెయ్యండి... రాత్రి వేళ ఆహారం తీసుకుంటూ టివి చూసే అల వాటు మీకు ఉంటె మీరు ఆహారం తీసుకునే సమయం టి వి చూసే సమయం ఆమధ్యలో మీరు ఎక్కువ ఆహారం తీసుకునే అవకాసం ఉంది.రాత్రి ఆహారం తీసుకున్నాక మీ చిగుళ్ళను పళ్ళను బ్రష్ చేయండి. రాత్రి వేళ మీరు తీసుకునే ఆహారాన్నిపూర్తిగా తగ్గించాలంటే మీరు మీపళ్ళను  చిగుళ్ళను శుబ్రం చేసుకోండి. ఒక వేళ మీ పళ్ళు శుభ్రంగా ఉంటె నిద్రపోవడానికి ముందే అల్పాహారం తీసుకునే ముందు రెండు సార్లు ఆలోచించండి. పళ్ళు శుభ్రం చేయడానికి 6౦ నిమిషాలు ఆలోచించండి. ప్రత్యేకంగా మీరు యాసిడ్స్ లాంటివి అంటే నిమ్మరసం, ద్రాక్ష పళ్ళు, సోడా లాంటివి తీసుకుంటే 6౦ నిమిషాలు  ఆగాలి అంటున్నారు నిపుణులు. ఒత్తిడిని సులభంగా జయించవచ్చు... మీరు ఒత్తిడిని ఎదుర్కుంటూ న్నట్లైతే మీ బరువు పెరిగే అవకాశం ఉంది. రాత్రి వేళ కాసేపు రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. లోపలి సుదీర్ఘ శ్వాస తీసుకునే పద్దతులు అవలంబించండి. లేదా మెడిటేషన్ ధ్యానం చెయడం ద్వారా ఒత్తిడిని జయించ వచ్చని అలా చేయడం వల్ల నాణ్యతతో కూడుకున్న నిద్ర ను పొందవచ్చు. ఇక చివరగా రాత్రివేళ నిద్ర పోయే ముందు లైట్లు తీసి వేయండి.. చీకాట్లో నిద్రపోవడం చాలా మందికి అల వాటు. అలా చేయడం వల్ల మాంచి నిద్ర పడుతుంది.మీరు బరువు తగ్గించు కోవాలన్న ప్రయత్నాం చేయడం ద్వారా మీ కిటికీలు మూసి వేయండి. కర్టెన్లు వేసుకోండి. ఫోన్లు ల్యాబ్ టాబ్ కు దూరంగా ఉండండి. పడు కునేందుకు ముందు 3౦ నిమిషాలు వాటికి దూరంగా ఉండండి. కంటి మీద మాస్క్ వేసుకుంటే సహాయ పడుతుంది.