LATEST NEWS
  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. వరంగల్‌ సభ సక్సెస్‌ అయ్యిందంటూనే లేఖ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్‌కు ఆరు పేజీల లేఖలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మై డియర్‌ డాడీ అంటూ కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖలో వరంగల్‌ సభ సక్సెస్‌ అయ్యిందంటూనే.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఏడాది మార్చి నెలలో బీఆర్‌ఎస్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్ని నిర్వహించింది. ఆ వేడుకలపై, అంతకు ముందు పరిణామాలపై..ఆ తర్వాత పరిణామాలను కేసీఆర్‌కు రాసిన లేఖకు కవిత ప్రస్తావించారు.  పాజిటీవ్‌,నెగిటీవ్‌ ఫీడ్‌ బ్యాక్‌ అంటూ వివరంగా లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘బీజేపీపై 2 నిమిషాలే మాట్లాడడంపై అనేక అనుమానాలున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేజన్లపై విస్మరించారు. ఎస్సీ వర్గీకరణపై నోరు విప్పలేదు. 2001 నుంచి పార్టీలో ఉన్నవారికి వేదికపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వరా? తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ గీతం మార్చడంపై మోటివేట్‌ చేస్తారని అందరూ ఎదురు చూశారు. ఓవరాలుగా కొంచెం పంచ్‌ ఎక్స్‌పెక్ట్‌ చేశారు. 
  వేసవి నీటి అవసరాల కోసం శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ నీటిని కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌కు 4 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 10.26 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు కేఆర్ఎంబీ ఉత్తర్వుల్లో పేర్కొంది. శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల వరకు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 505 అడుగుల వరకు నీటిని వాడుకోవడానికి అనుమతించింది. ఏపీ అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి కాల్వ ద్వారా రోజుకు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కేఆర్ఎంబీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ నీటి విడుదలతో వేసవిలో తాగునీటి సమస్య కొంతమేర తీరుతుందని భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ విషయంలో కూడా బోర్డు కీలకమైన సూచన చేసింది. జులై నెలాఖరు వరకు శ్రీశైలం జలాశయంలో కనీసం 800 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగించాలని తమ ఉత్తర్వుల్లో స్పష్టంగా తెలిపింది. ఈ నిర్ణయాలు తక్షణమే అమల్లోకి వస్తాయని బోర్డు వర్గాలు వెల్లడించాయి.  
కరోనా మహమ్మరి మరో సారి దాడి చేస్తున్నదా? ఇక మళ్లీ మాస్కులు లేకుండా బయటకు రాలేని, రాకూడని పరిస్థితులు ఏర్పడుతున్నాయా? అంటే ఔననే అంటున్నారు వైద్య నిపుణులు. దేశ వ్యాప్తంగా మళ్లీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేరళలో మే నెలలో ఇప్పటి వరకూ 182 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మాస్కులు ధరించడాన్ని తప్పని సరి చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అ దలా ఉండే కోవిడ్ కేసుల వ్యాప్తం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హాంకాంగ్, థాయ్ ల్యాండ్, సింగపూర్ లలో కోవిడ్ వ్యాప్తి తీవ్రత ఒకింత అధికంగా ఉంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందనీ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే.. బయటకు రాకుండా విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. ఇప్పుడు వ్యాపిస్తున్న ఓమిక్రాన్ ఉప-వేరియంట్‌లు స్వల్ప ఆనారోగ్య కారకాలేకానీ ప్రమాదకరమైనవి కావని పేర్కొంది. 
  జోహార్ ఎన్టీఆర్, అంటూ అదే ఫ్లో లో బతికి ఉన్న వాళ్లకు జోహార్ చెప్పేశారు? ఓ యువనేత. రాజకీయాల్లో ఓటమి తెలియని మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కొడుకు నోటి నుండి వచ్చిన పలుకులివి. తండ్రి ఏమో రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదిగి ఓటమి తెలియని నాయకుడిగా ముద్ర వేయించుకుంటే రాజకీయ ఆరంగేట్రానికి సిద్ధంగా ఉన్న కొడుకు రవితేజ తన తెలిసీ తెలియనితనంతో అందరిలో నవ్వులపాలవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాల్లో ఓటమి తెలియని నాయకుడు ఎవరు అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు మాజీ మంత్రి ప్రస్తుత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు... ఓటమి ఎరగని రాజకీయ నాయకుడిగా పేరున్న గంటా శ్రీనివాసరావు 4 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచి తన రాజకీయ ప్రయాణంలో ఓటమిని దరిదాపులకు రాకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు.  టీడీపీ నుంచి పీఆర్పీకి, అక్కడ నుంచి కాంగ్రెస్‌కి తర్వాత తిరిగి టీడీపీకి వచ్చిన గంటా శ్రీనివాస్ తన ఇమేజ్‌కి ఎక్కడా డ్యామేజ్ అవ్వకుండా పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఓ మెట్టు పైకి ఎదుగుతూనే వచ్చారు. అలాంటి మాజీ మంత్రికి ఇప్పుడు కొడుకు రూపంలో కొత్త తలనొప్పి మొదలైందంట. రాజకీయ నాయకుల్లో అత్యధికులు కచ్చితంగా రాజకీయ వారసత్వాన్ని తెరమీదకి తీసుకొచ్చి తమ బిడ్డల్ని గ్రాండ్ లాంచ్ చేస్తారు. అలాగే గంటా శ్రీనివాస్ తన కొడుకు రవితేజని రాజకీయాల్లో గ్రాండ్‌గా లాంచింగ్ చేయడానికి ప్లాన్ చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక భీమిలి నుండి గెలిచిన ఆయన భీమిలి నియోజకవర్గం పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో తనతో పాటు తన కొడుకును కూడా ముందు పెట్టి నడిపిస్తున్నారు. గత సంవత్సర కాలంగా భీమిలి నియోజకవర్గంలో  జరిగే అధికారిక కార్యక్రమాల్లో గంటా కొడుకు రవితేజ అన్ని తానై ముందుండి నడిపిస్తున్నారు. ఇప్పటివరకు అన్ని ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ముందు ఉండి పనులు చేస్తున్న రవితేజ పెద్దగా ప్రసంగాలు చేయలేదు. స్టేజీ మీద మాట్లాడితే ఒక్క నిమిషానికి మించి ఏ రోజు మాట్లాడింది లేదు.  అలాంటి గంటా రవితేజ తాజాగా భీమిలి నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడులో తన తండ్రితో పాటు నియోజకవర్గంలోని కీలకమైన రాజకీయ నాయకుల సమక్షంలో క్యాడర్‌ని ఉత్సాహపరచడానికి మాట్లాడుతూ నోరు జారి జోహార్ సీఎం సార్, జోహార్ లోకేష్ అన్నయ్య అంటూ నినాదాలు చేశారు.రవితేజ తెలిసీ తెలియక కనబర్చిన అత్యుత్సాహాన్ని కేడర్ మొత్తం ఫాలో అయింది. చేసిన తప్పును గుర్తించి సరిదిద్దుకునే లోపే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. రవితేజ మినీ మహానాడు స్టేజి మీద మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. బ్రతికున్న వాళ్లకు జోహార్లు ఏంటయ్యా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.ఆ వ్యాఖ్యలతో గంటా వారసుడు నవ్వులపాలు అవుతున్నా... ఇంతకాలం ఆయన ఎవరో తెలియని వారికి కూడా పరిచయమవుతున్నారంట. గంటా రవితేజ తెలియని వారు ఉండరు అనే అంతగా సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారు.   గంటా శ్రీనివాస్ తన కొడుకుని  సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టి కొత్త ఇమేజ్ క్రియేట్ చేయాలనుకున్నారు. స్టార్ డైరెక్టర్ జయంత్ సి పరాన్జీతో పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్‌తో జై దేవ్ అనే మూవీతో గంట రవితేజను లాంచ్ కూడా చేశారు. జయదేవ్ సినిమా డిజాస్టర్ కావడంతో గంటా రవితేజ తనకి సినిమాలు సరిపడవు అనుకున్నారో ఏమో?మొదటి సినిమాతోనే సినిమా ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసి తండ్రి రాజకీయ వారసుడిగా ఓనమాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు.  టీడీపీ అధికారంలో ఉన్న ప్రస్తుత తరుణంలో జరుగుతున్న మినీ మహానాడు తన ఆ రాజకీయ ఆరంగేట్రానికి సరైన సమయం అని భావించిన రవితేజకు తొలి పొలిటికల్ ప్రసంగంలోనే చుక్కెదురవ్వడంతో.. ఆయన భవిష్యత్తు రాజకీయం ఎలా ఉండబోతుందన్న సందేహాలు మొదలయ్యాయి.  2024 ఎన్నికల బరిలో తన వారసుడ్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించాలని గంట శ్రీనివాస్ ప్రయత్నం చేసినట్లు జోరుగా ప్రచారం సాగింది.  చంద్రబాబు దగ్గర కూడా తన కొడుకుకి సీటు ఇవ్వాలని గంటా కోరినట్లు అప్పట్లో టాక్ నడిచింది. 2024 ఎన్నికల్లో ప్రతి సీటు టీడీపీకి కీలకం కావడంతో చంద్రబాబు నిరాకరించడంతో గంట తానే స్వయంగా భీమిలి బరిలోకి దిగి విజయం సాధించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కచ్చితంగా గంట శ్రీనివాస్ కు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. అయితే ఎవరు ఊహించని విధంగా చంద్రబాబు మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో ఆయనకు నిరాశే మిగిలింది.మంత్రి పదవి రాకపోవడంతో నియోజకవర్గ మీద కొంత ఫోకస్ తగ్గించిన గంటా తన వారసుడ్ని ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారంట.  రవితేజను భీమిలి నియోజకవర్గంలో బలమైన నేతగా తయారు చేయడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్న మాజీ మంత్రి పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కుమారుడ్ని ముందు పెట్టి నడిపిస్తున్నారంట. తీరా చూస్తే రవితేజ మినీ మహానాడు స్పీచ్‌తో అందరికీ కామెడీగా మారిపోయారు. మరి సినిమాల్లో ఫ్లాప్ అయిన ఆయన పొలిటికల్ స్క్రీన్‌పై ఏ మాత్రం రాణిస్తారో చూడాలి.
  బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? కెసిఆర్ స్థానంలో పార్టీపై పెత్తనం కోసం కేటీఆర్, కవిత, హరీష్ రావుల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తున్నట్టు ప్రచారం జరిగింది. కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లకు తల్లిదండ్రుల్లో తలా ఒకరు సపోర్ట్ చేస్తున్నారన్న టాక్ కూడా వినిపించింది. అయితే ఇటీవల కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. బావా బామ్మర్దులు ఒకటికి రెండుసార్లు భేటీ అవ్వటం, కేటీఆర్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే తన సపోర్టు ఉంటుందని హరీష్ రావు ప్రకటించటంతో  వారి మధ్య ఏమీ లేదని గులాబీ శ్రేణులు సంబరపడిపోయాయి. అయితే తాజాగా కవిత... కేసీఆర్ కు రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా నియోజకవర్గాలు చుట్టి వచ్చిన కవిత.. పార్టీ క్యాడర్, లీడర్ షిప్ ఏమనుకుంటుందో అవే విషయాలను చెబుతున్నా అంటూనే పార్టీకి కొన్ని సూటి ప్రశ్నలనే సంధించారు. మహిళా సమానతలో పదేళ్లలో అనుకున్నంత ముందుకు వెళ్లలేక పోయామన్న  కవిత డైలాగ్ తో గులాబీదళం ఇరకాటంలో పడింది.  ప్రత్యర్థి పార్టీలు కూడా కెసిఆర్ పై ఎప్పటి నుంచో అవే విమర్శలు చేస్తున్నాయి.కేసీఆర్ కు కవిత కొన్ని రోజుల క్రితమే రాసినట్లుగా చెబుతున్న లేఖ తాజాగా బయటికొచ్చింది. ఇప్పుడు ఆ లేఖ చుట్టూ కొత్త రాజకీయ చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ తర్వాత కేసీఆర్‌కు ఆయన కుమార్తె,  కవిత ఓ లేఖ రాశారు. సభ నిర్వహించిన తీరుపై తన అభిప్రాయాన్ని లేఖలో కుండ బద్దలు కొట్టారు . పార్టీ మీటింగ్ సక్సెస్ అయ్యిందంటూనే లోపాలను బయటపెట్టారామె. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ రెండు పార్టులుగా లేఖ రాశారు. తెలంగాణ అంటే బీఆర్‌ఎస్ - తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెబుతారని చాలామంది అనుకున్నారని కవిత తన తండ్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, తెలంగాణ గీతంపై మాట్లాడతారని అనుకున్నట్టు కవిత రాసుకొచ్చారు. కేసీఆర్ స్పీచ్ బాగుందంటూనే.. ఇంకొంచెం పంచ్‌ ను కేడర్ ఎక్స్‌పెక్ట్ చేసిందని కవిత తెలిపారు. ఉర్దూలో మాట్లాడకపోవడం, వక్ఫ్‌ బిల్లు మీద మాట్లాడకపోవడం నెగిటివ్ అయిందన్నారు. బీసీలకు 42శాతం అంశం విస్మరించడం, ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవడమూ నెగిటివ్ అని లేఖలో ప్రస్తావించారామె. ఇంత పెద్ద మీటింగ్‌కు పాత ఇంచార్జులను ఇవ్వడంపై కొన్ని నియోజకవర్గాల్లో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని, లోకల్‌బాడీ ఎన్నికల్లో ఈ ఇంఛార్జులే బీఫామ్స్ ఇస్తారని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, ఎంపీపీలుగా ఉండాలనుకునేవాళ్లు రాష్ట్ర నాయకత్వమే బీఫామ్ ఇవ్వాలని కోరుతున్నారని కవిత తన లెటర్‌లో రాశారు.భవిష్యత్తులో బీజేపీతో పొత్తుపెట్టుకుంటారన్న ప్రచారాన్ని చాలామంది మొదలుపెట్టారన్న విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంకొంచెం బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ  అంటూ... ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా ఉన్న కవిత  పేర్కొనటం చర్చనీయాంశం అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామన్న మెసేజ్‌ను కాంగ్రెస్ జనంలోకి బలంగా తీసుకెళ్లిందని  ఆమె ఎత్తి చూపారు. అన్నీ చెప్పాక పెద్దలేఖ రాసినందుకు క్షమించాలని ప్రత్యేకంగా కవిత కోరుతూ అందరికీ అందుబాటులో ఉండాలని కెసిఆర్ ని కవిత  కోరడం కూడా ఇప్పుడు బిగ్ డిబేట్ కు దారి తీసింది.    టిఆర్ఎస్  రజతోత్సవం మొత్తం కేసీఆర్, కేటీఆర్ నిర్వహించారని, కవిత, హరీశ్ రావు డమ్మీగా మారిపోయారన్న ప్రచారం ఉంది . పేరుకే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కేటీఆర్ ప్రెసిడెంట్‌‌గా వ్యవహరిస్తున్నారు అని గులాబీ శ్రేణులే అంటున్నాయి . ప్రస్తుతం కవిత లేఖతో  వైఎస్ జగన్‌‌పై షర్మిల ఎలాగైతే ఎదురు తిరిగారో.. కేటీఆర్‌‌‌‌పై కూడా కవిత పరిస్థితి కూడా అలాగే ఉంటుందన్న చర్చ మొదలైంది.వీటికి తోడు ఇటీవల ములుగు జిల్లాలో సోదమ్మలతో సోది జోస్యం చెప్పించుకున్నారు కవిత. అందులో కవిత సీఎం అవుతారని జోస్యం చెప్పారంట. ఆ విషయం కూడా హాట్ టాపిక్ అయింది. కవిత బీసీల గురించి చాలా మీటింగ్స్ పెట్టారు. అక్కడ ఆమె అనుచరులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు కవిత ఏ నియోజకవర్గం వెళ్లినా ఆమె అనుచరగణం సీఎం సీఎం అంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. మొత్తానికి ఈ లేఖతో కెసిఆర్ కుటుంబంలో కొత్త డ్రామా మొదలైంది అంటున్నారు .
ALSO ON TELUGUONE N E W S
NTR is a true blue pan India superstar, who is lovingly called the ‘Man of the Masses’. And he showed the monstrous popularity he enjoys with people across India with the War 2 teaser and his super-spy act in this much-awaited YRF Spy Universe franchise film became a rage on the internet.  NTR is overwhelmed with the outpouring of appreciation coming his way for War 2. He says, “It is truly a blessing to be an actor because you get to experience so much unconditional love from people. It is a very precious and a rare feeling and I’m really lucky to be receiving the same for War 2. This YRF Spy Universe film presents me in an all new avatar which I had a lot of fun portraying and I’m overwhelmed with the positivity and the love coming in from every quarter of the country.” NTR revealed he is thrilled to witness the unanimously positive response to WAR 2 after giving every drop of emotion and energy he had within himself for the big screen entertainer.    NTR says, “This character is extremely special to me. When you give so much emotion, so much intensity and energy to your role, it is all the more exciting to see this kind of response from my fans, from people who love to see good cinema on the big screen.” He adds, “YRF Spy Universe has always created new cinematic and box office benchmarks and I’m really happy to see the start of our campaign making this huge a mark on people. Can’t wait to see the madness unfold in theatres from August 14th.” Produced by Aditya Chopra and directed by Ayan Mukerji, War 2 also stars Kiara Advani as the female lead. War 2 is set to release on August 14th in Hindi, Tamil, and Telugu.
Mega Fans are trending #BoycottBhairavam and they are serious about no one watching the movie. Going into the details, the movie stars Bellamkonda Sai Sreenivas, Manchu Manoj and Nara Rohith. It is directed by Vijay Kanakamedala and fans are so aggressively trending on social media against him.  The director debuted with Allari Naresh's Naandhi and made Ugram with him. During the release both these two films, mega fans did not talk about boycotting or his older posts. The fans are circulating his older posts where he trolled Megastar Chiranjeevi and Ram Charan, politically, using some morphs.    Looking at these posts, we can say that he posted them way back in 2011, during Prajarajyam party merging with Congress. But digging them up now and circulating showcases some sort of negative PR agency looking to provoke fans against the film. We don't know who but that seems apparent.  Well, Vijay Kanakamedala may have to appologise for his posts to calm down the people who are posting them. We have to wait and see, how the team will handle this issue as it is releasing on 30th May. 
  బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారం చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడింది. పైగా 'భైరవం' విజయం అనేది టీం అందరికీ కీలకం. ఇలాంటి టైంలో మూవీ టీంకి ఊహించని షాక్ తగిలింది. ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది.   సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెలబ్రిటీ హోదా రాకముందు.. ఎవరైనా స్టార్స్ ని ట్రోల్ చేస్తూ ఏవైనా దారుణ పోస్ట్ లు పెట్టి ఉంటే.. వాటిని డిలీట్ చేయడం మంచిది. అసలు అలాంటి పోస్ట్ లే చేయకపోవడం మరీ మంచిది. కానీ కొందరు తెలిసో తెలియకో ట్రోల్ చేసి.. ఆ తర్వాత వాటిని డిలీట్ చేయక.. ఇరుకున పడతారు. ఇప్పుడు దర్శకుడు విజయ్ కనకమేడల విషయంలో కూడా అదే జరిగింది అంటున్నారు.   2011 లో చిరంజీవి, రామ్ చరణ్ లను ట్రోల్ చేస్తూ విజయ్ ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. #BoycottBHAIRAVAM హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.    మరి ఆ పోస్ట్ నిజంగానే విజయ్ కనకమేడల చేశాడా? లేక ఆయన పేరుతో ఎవరైనా ఫేక్ అకౌంట్ తో చేశారా? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏదైనా ఎప్పుడో 14 ఏళ్ళ క్రితం నాటి పోస్ట్ కారణంగా ఇప్పుడు 'భైరవం' సినిమా వివాదంలో చిక్కుకుంది. మరి దీనిపై విజయ్ కనకమేడల ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.  
Deepika Padukone is one of the biggest powerhouses of Bollywood Cinema and a bonafide star. She made a successful combination with Shah Rukh Khan and more recently, both his 1000 crore blockbusters - Pathaan and Jawan- had her in leading role. So, if she makes unreasonable demands, would Bollywood just accept and tow along?  The rumor mills have been going overboard spreading that Sandeep Reddy Vanga "rejected" her due to her unreasonable demands to be part of Spirit. Conversely, she is said to be cast in Allu Arjun and Atlee's film. Many are asking if she walked out due to "creative differences" about her character or if really director rejected.  Sridevi put forth some exorbitant conditions when Baahubali makers approached her but she did Thalapathy Vijay's Puli, that came out an year later. Now, the makers of Spirit, the next film by Sandeep Reddy Vanga with Prabhas as the main lead, said to have approached Deepika and she put forth unreasonable demands.  Not going into specifics, one wonders, if she is known to put forth any unreasonable demands, she would not have been part of Kalki 2898 AD, with Prabhas in lead role and she will join Kalki 2 sets for sure. She did give lip sync to Telugu lines and she did not dub. So, what changes for Sandeep Reddy Vanga's film? The makers are not in tone with paying Rs.20 crores paycheck and also for 8 hours shift timings. Sandeep Reddy already stated that he has no problem with actors coming at their time but he wants them to inform him beforehand and stick to it.  A 20-crore paycheck is not an unreasonable demand by a successful actress like Deepika Padukone as rumors stated Priyanka Chopra Jonas, asked for close to 25-30 crores paycheck for SSMB29 opposite Mahesh Babu in the direction of SS Rajamouli. Well, Rajamouli did not want to handle demands of Sridevi but he is okay with Priyanka?  The point seems to be simple, Deepika and Sandeep might have had disagreements about script and could have decided to not go forward. But this unreasonable demands rumor doesn't really sync in as she is now said to be a part of "AA22 X A6". Wouldn't Atlee also be afraid to handle all those demands, ask netizens.  Until, we know the real reasons behind anyone's inclusion or exclusion, these rumors can only be seen as mud-slinging activities and nothing much. Even she demands 8-hour shift and a big paycheck, for her stature it should not be a huge problem.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  బయోపిక్ ట్రెండ్ కొంతకాలంగా ఊపందుకుంది. బయోపిక్ లు చేయడానికి స్టార్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఒకే బయోపిక్ కోసం ఒకే సమయంలో ఇద్దరు స్టార్స్ పోటీపడటం అనేది ఇటీవల చూస్తున్నాం.    భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ గా 'మేడ్ ఇన్ ఇండియా' ప్రకటన వచ్చింది. రాజమౌళి సమర్పణలో రూపొందనున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తాడని వార్తలొచ్చాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే వారి ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ గా మరో సినిమా తెరకెక్కనుందని, ఇందులో ఆమిర్ ఖాన్ నటిస్తున్నాడని తెలిసి.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ఈ బయోపిక్ ని ఎన్టీఆరే ముందు చేస్తే బాగుంటుందని వారు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే కన్నడ స్టార్ రిషబ్ శెట్టికి వచ్చింది.     రిషబ్ శెట్టి టైటిల్ రోల్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ ను గతేడాది చివరిలో ప్రకటించారు. సందీప్ సింగ్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా.. 2027 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దీనికంటే ముందే మరో ఛత్రపతి శివాజీ బయోపిక్ థియేటర్లలో అడుగుపెట్టనుంది.   'రాజా శివాజీ' పేరుతో ప్రముఖ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ స్వీయ దర్శకత్వంలో ఛత్రపతి శివాజీ బయోపిక్ ను తాజాగా అనౌన్స్ చేశాడు. జ్యోతి దేశ్‌పాండే, జెనీలియా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మే 1న మరాఠీ, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇది ఓ రకంగా రిషబ్ శెట్టికి షాక్ అనే చెప్పాలి.     శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఛావా' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రలో సంచలన వసూళ్లు సాధించింది. ఆ ఉత్సాహంతోనే శివాజీ బయోపిక్ కి రితేష్ శ్రీకారం చుట్టినట్టున్నాడు. ఈ సినిమా కూడా ఛావా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తే.. రిషబ్ శెట్టి ప్రాజెక్ట్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.  
కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు(Sri Vishnu)కేతిక శర్మ(Ketika Sharma)ఇవానా(Ivana)వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో ఈ నెల 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'సింగిల్'(Single). శ్రీ విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకెళ్తున్న ఈ మూవీ రెండు వారాలు దాటినా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్ళని సాధిస్తుంది.  తాజాగా ఈ మూవీ యుఎస్ లో 700K డాలర్ల క్లబ్ లో చేరి చిన్న సినిమాల్లోనే సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా దూసుకెళ్తుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. దీంతో యుఎస్ లో సింగిల్ మూవీ ఫైనల్ గా ఎంత మేర రాబడుతుందనే చర్చ సినీ సర్కిల్స్ లో జరుగుతుంది. సింగిల్ అయిన శ్రీవిష్ణు ఆడ తోడుకోసం తాపత్రయపడుతు, అతి తెలివితో తన లైఫ్ లోకి వచ్చిన ఇద్దరి అందమైన అమ్మాయిలని దూరం చేసుకుంటాడు. ఈ క్రమంలో శ్రీ విష్ణు చేసే కామెడీ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తుంది. ముఖ్యంగా శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో వచ్చే  కామెడీ సీన్స్ కి రిపీట్ ఆడియెన్స్ కూడా వెళ్తున్నారు. కేతిక శర్మ, ఇవానా కూడా తమ క్యారక్టర్ ల మేరకు అత్యద్భుతంగా నటించి చిత్ర విజయంలో బాగస్వామ్యమయ్యారు.   కార్తీక్ రాజు(Caarthick Raju)రచనా దర్శకత్వంలో తెరకెక్కిన సింగల్ ని గీతా ఆర్ట్స్, కళ్యా ఫిలింస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించాడు. సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలియచేస్తు చిత్ర బృందం రీసెంట్ గా విజయయాత్ర కూడా చేసింది.      
భోళాశంకర్ పరాజయంతో ఈసారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలనే పట్టుదలతో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)'విశ్వంభర'(Vishwambhara)మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి'బింబిసార' ఫేమ్ వశిష్ట(Vasishta)దర్శకుడు కావడంతో మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. గత నెలలో 'హనుమాన్ జయంతి' రోజున విడుదలైన 'రామ రామ' సాంగ్  ఆ అంచనాలని రెట్టింపు చేసిందని చెప్పవచ్చు. యువి క్రియేషన్స్ పై పలు హిట్ చిత్రాలని నిర్మించిన   విక్రమ్ రెడ్డి, ప్రమోద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 'విశ్వంభర' ని నిర్మిస్తున్నారు. ఈ నెల 13 నుంచి 25 వరకు ఫ్రెంచ్ రివేరాలో ఉన్న కేన్స్(Cannes)నగరంలో ప్రతిష్టాత్మకమైన'కేన్స్ ఫిలింఫెస్టివల్(Cannes Film Festival)జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఫెస్టివల్ లో 'విశ్వంభర' కి సంబంధించిన విషయాలు దాగి ఉన్న ఒక పుస్తకాన్ని విక్రమ్ రెడ్డి ఆవిష్కరించాడు. ఈ విషయాన్నీ తెలుపుతూ సోషల్ మీడియాలో  నిర్మాణ సంస్థ ఫోటోలు పంచుకోవడంతో పాటు విశ్వంభర ప్రపంచం త్వరలోనే మీ ముందుకు ఒక అద్భుతాన్ని తీసుకురానుంది. ఈ పుస్తకంలో ఏం ఉందో తెలుసుకోవాలంటే వేచి ఉండండని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ    పుస్తకానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న విశ్వంభరలో త్రిష(Trisha)ఆషికా రంగనాధ్, ఇషాచావ్లా, కునాల్ కపూర్, రావు రమేష్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి(keeravani)సంగీత సారధ్యం వహించగా త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే  అవకాశం ఉంది.    
Ram Charan joined hands with Buchi Babu Sana to deliver a rural based sports drama Peddi. The makers have promoted the film as a magnum opus that will be a memorable theatrical experience to all. The movie glimpse has gone viral with the huge cricketing shot by Charan. Venkata Satish Kilaru is producing the film.  On the occasion of Hanuman Jayanthi, director Buchi Babu shared a BTS click from the film with Ram Charan and Divyendu Sharma, famous as Guddu Bhai from Mirzapur web series, in get-up between the shots. Buchi Babu stated that the two are working hard and enjoying the process of making the film.  The movie shoot is 30% completed till date and they announced that this huge schedule will continue in a village set, specially built in Hyderabad. Shiv Rajkumar and Janhvi Kapoor are playing prominent roles in the film. AR Rahman is composing music and the movie is set to release all over on 27th March, 2026. 
  పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో శ్రీరామ్. ఆయన నటించిన కొత్త సినిమా "నిశ్శబ్ద ప్రేమ". ఈ చిత్రంలో ప్రియాంక తిమ్మేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సెలబ్రైట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత కార్తికేయన్.ఎస్ నిర్మించారు. లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు రాజ్ దేవ్ రూపొందించారు. "నిశ్శబ్ద ప్రేమ" సినిమా ఈ నెల 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.   ఈ రోజు ఈ సినిమా ట్రైలర్, సాంగ్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్, నిర్మాత చింతపల్లి రామారావు, నిర్మాత  రాజేశ్ పుత్ర, డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ ట్రైలర్ లాంచ్ చేయగా, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ సాంగ్ విడుదల చేశారు.      ఈ సందర్భంగా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ మాట్లాడుతూ.. "నిశ్శబ్ద ప్రేమ చిత్రంతో మా పరిటాల రాంబాబు డిస్ట్రిబ్యూటర్ గా మారడం సంతోషంగా ఉంది. తమిళంలో ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించింది. 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేసింది. లవ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటుందని నమ్ముతున్నా. హీరో శ్రీరామ్ మరో మంచి మూవీతో మన ముందుకు రాబోతున్నారు. నిశ్శబ్ద ప్రేమ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా." అన్నారు.   ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. "నిశ్శబ్ద ప్రేమ చాలా మంచి టైటిల్. శ్రీరామ్ గారు మన తెలుగు హీరో. ఆయన రోజాపూలు సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. వయలెన్స్ కంటే సైలెన్స్ శక్తి ఉన్నది. నిశ్శబ్ద ప్రేమ సినిమాలో ఒక మంచి మూవీకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. అలాగే నిర్మాత కార్తికేయన్ ఫారెన్ లో జాబ్ చేస్తూ సినిమా మీద ప్యాషన్ తో వచ్చి ఈ సినిమా రూపొందించారు. ఆయన మంచి అభిరుచి గల నిర్మాత అని అర్థమవుతుంది. అటువంటి ఆయన త్వరలో తెలుగులో కూడా సినిమా తీయాలని కోరుకుంటున్నాను. అలాగే డిస్ట్రిబ్యూటర్ గా వస్తున్న మన పరిటాల రాంబాబుకు సక్సెస్ దక్కాలని కోరుకుంటున్నా. సక్సెస్ మీట్ లో మరోసారి మనమంతా కలుద్దాం." అన్నారు.   నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. "నిశ్శబ్ద ప్రేమ సినిమా హీరో శ్రీరామ్ గారికి మంచి సక్సెస్ ఇవ్వాలి. ఆయన తెలుగులో మరిన్ని మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. డిఫరెంట్ లవ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు రాజ్ దేవ్ రూపొందించారు. తమిళంలో ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది. తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ కావాలి. కార్తికేయన్. ఎస్. ప్యాషనేట్ ప్రొడ్యూసర్. సరికొత్త థ్రిల్లర్ లవ్ స్టోరీగా "నిశ్శబ్ద ప్రేమ" సినిమా మీ ముందుకు రాబోతోంది. ఈ నెల 23న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. తెలుగు ఆడియెన్స్ కంటెంట్ ఉన్న చిత్రాలను తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది." అన్నారు.   హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. "నిశ్శబ్ద ప్రేమ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చి సపోర్ట్ చేస్తున్న ప్రసన్నకుమార్ గారికి, వీరశంకర్ గారికి, రామారావు గారికి ఇతర గెస్ట్ లకు థ్యాంక్స్. లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిపిన గ్రిప్పింగ్ మూవీ ఇది. ఏమాత్రం మిమ్మల్ని నిరాశపర్చదు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇలాంటి టీమ్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. తమిళంలో హిట్ అయిన తర్వాత కూడా ఎంతో ప్రయాసపడి తెలుగులోకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు మా ప్రొడ్యూసర్, డైరెక్టర్. వారికి థ్యాంక్స్ చెబుతున్నా. మంచి సినిమాకు భాషా హద్దులు లేవు. ఏ భాషలోని సినిమా అయినా కంటెంట్ ఉంటే మరో చోట తప్పకుండా ఆదరణ పొందుతుంది. "నిశ్శబ్ద ప్రేమ" సినిమా సక్సెస్ మీద కూడా అలాంటి నమ్మకమే మా అందరికీ ఉంది." అన్నారు.   హీరోయిన్ ప్రియాంక తిమ్మేష్ మాట్లాడుతూ.. "నిశ్శబ్ద ప్రేమ సినిమాలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన శ్రీరామ్ గారికి,  ప్రొడ్యూసర్ కార్తికేయన్, డైరెక్టర్ రాజ్ దేవ్ గారికి థ్యాంక్స్. ఈ నెల 23న మా "నిశ్శబ్ద ప్రేమ" సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. మీరంతా థియేటర్స్ కు వెళ్లి మా మూవీని చూస్తారని కోరుకుంటున్నా." అన్నారు.   డైరెక్టర్ రాజ్ దేవ్ మాట్లాడుతూ.. "నిశ్శబ్ద ప్రేమ ట్రైలర్, సాంగ్ లాంచ్ కు వచ్చిన గెస్ట్ లు అందరికీ థ్యాంక్స్. మా మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. "నిశ్శబ్ద ప్రేమ" సినిమా తమిళంలో మంచి ఆదరణ పొందింది. తెలుగులో ఈ నెల 23న రిలీజ్ కు వస్తోంది. తెలుగు ఆడియెన్స్ కూడా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం." అన్నారు.   నటుడు వియాన్ మాట్లాడుతూ.. "నేను మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చాను. నా ఫస్ట్ తమిళ్ మూవీ ఇది. తెలుగులో నాకు చాలా మంది ఫేవరేట్ హీరోస్ ఉన్నారు. "నిశ్శబ్ద ప్రేమ" చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ గార్లకు థ్యాంక్స్. "నిశ్శబ్ద ప్రేమ" సినిమాకు మీ సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాం." అన్నారు.  
  పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల 'హరి హర వీరమల్లు' షూటింగ్ పూర్తి చేశారు. ఈ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే 'ఓజీ' షూట్ కూడా స్టార్ట్ చేశారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీటితో పాటు 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా లైన్ లో ఉంది. కానీ, ఆ సినిమాను పవన్ పూర్తి చేస్తాడా లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ తాజాగా 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది.   'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అనౌన్స్ మెంట్ తోనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే కొంతభాగం షూట్ చేశారు. గ్లింప్స్ కూడా విడుదలై ఆకట్టుకుంది. అయితే పవన్ పాలిటిక్స్ తో బిజీ అవ్వడం.. 'హరి హర వీరమల్లు', 'ఓజీ' ఆలస్యమవ్వడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉంటుందా లేదా? అనే డౌట్స్ వచ్చాయి. వాటికి చెక్ పెడుతూ.. తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుపుతూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇది అభిమానులకు, సినీ ప్రియులకు ఫ్యాన్ బాయ్ అందిస్తున్న ఫీస్ట్ అని..సెలెబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి, చాలా ఏళ్ళు గుర్తుండిపోతుంది అని రాసుకొచ్చారు.    మొత్తానికి 'హరి హర వీరమల్లు', 'ఓజీ'తో పాటు 'ఉస్తాద్ భగత్ సింగ్'ను కూడా పవన్ పూర్తి చేయబోతున్నారు. అంటే తక్కువ గ్యాప్ లోనే ఆయన నుంచి మూడు సినిమాలు రాబోతున్నాయి. వీటి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి, తన ఫుల్ ఫోకస్ ని పాలిటిక్స్ పై పెట్టే అవకాశముంది.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
కలలు అందరికీ వస్తాయి. అయితే ప్రతి కలలో ఏదో ఒకటి కనబడుతూ ఉంటుంది అందరికీ. అలా కలలో కనిపించే వస్తువు, ప్రదేశం ఇతరం ఏదైనా సరే.. దాన్ని బట్టి మనిషికి కొన్ని విషయాలను సూచిస్తుంది మనిషి అంతరంగం. మనిషి కలలో ఏమి కనబడితే ఏమవుతుంది?? ఏది దేనికి సంకేతంగా భావించబడుతుంది?? దానికి వివరణలు ఏమిటి?? ఫ్రాయిడ్ తన సిద్ధం ద్వారా నిరూపించిన విషయాలు ఇవీ... దేవదూత : కలగన్నవారు ఆధ్యాత్మిక శక్తి, ఉన్నతాత్మ, దివ్యగుణాలను (దయ, ప్రేమ, కరుణ, పవిత్రత) పొందాలనే ఆకాంక్షలకు ప్రతీక దేవదూత కలలో కనిపించడం. శిశువు: కొత్త జన్మ, కొత్త ఆదర్శాలను గుర్తించడం, చిన్న పిల్లల్లాగా  నిస్సహాయతను వ్యక్తం చేయడం దీనికి సంకేతం. అలాగే పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనే కోరిక, గర్భధారణ విషయంలో భయానికి ప్రతీక. చెంపలు: ఇవి  పిరుదులకు ప్రతీకలు, ఇవి కలలోకి వస్తే లైంగికేచ్చ అంతర్లీనంగా సంఘర్షణలో ఉన్నట్టు అర్థం. చెంపలు ఈ భావాన్ని  వ్యక్తం చేస్తాయి.  కన్ను:  దూరదృష్టిని, ఆప్రమత్తతను సూచిస్తుంది. జరగబోయే వాటి గురించి అప్రమత్తతను తెలియజేయడం దీని అర్ధం.  పెళ్లి కూతురు:  స్త్రీల కలలలో ఎక్కువగా కనిపించేది పెళ్లి కూతురు. మగవాడు పెళ్ళికూతురు గురించి కలగనడు. పెళ్ళికూతురే కలలో పెళ్ళి కూతురిని చూస్తే ప్రేమను వేడుకొందన్న మాట. తల్లిదండ్రుల శృంఖలాల నుంచి బయటికి అడుగుపెట్టడం దీనికి సంకేతం.  దొంగ : విలువైనది దేనినైన తస్కరించేవాడు. స్త్రీల విషయంలో మానాన్ని, కలగన్న వాడే దొంగ అయితే తను చేసిన, చేయనున్న దోషాలను బయటపెట్టడం, దొంగ తండ్రిని సూచించవచ్చు. ఫ్రాయిడ్ ప్రకారం, దొంగల భయం శైశవంలో పాతుకుపోతుంది. మంచం ప్రక్కన నిలబడ్డ తండ్రిని, ఆకస్మికంగా నిద్ర లేచిన బిడ్డ చీకట్లో చూచి దొంగ అనుకొంటాడు.  శవం: ఇది ఎప్పుడూ మనుష్యులు చావడాన్నే సూచించదు. అవాంఛనీయ ఆశ. ప్రేమసంబంధాల అంతాన్ని సూచించవచ్చు. తను కాదనుకొన్నవారిని మరణం ద్వారా తొలగిస్తాడు. తానే శవమైతే అనారోగ్యాన్ని, మృత్యుభయాన్ని, తను అనుభవిస్తున్న రోగబాధను సూచించవచ్చు.  పోలీసు:  అధికారం, శిక్ష, రక్షణ, అంతరాత్మ ఇవన్నీ విడివిడిగా లేదా కలిపి. రాణి: రాణి కలలో కనిపిస్తే తల్లి కాబోతున్నట్టు సంకేతమట. స్నానాల గది : లైంగిక, రుగ్మత, రహస్యకార్యమేదైన ఉంటే దానికి ఇది సంకేతం.  సేతువు : ఒక స్థితి నుంచి మరొక స్థితికి పరివర్తనం చెందటం. సేతువును దాటటమంటే కష్టాలను దాటడం. శ్మశానం : తన లేదా ఇతరుల మరణ వాంఛ. ప్రేమ భంగం లేదా సంబంధం తెగిపోవడం కూడా దీనికి సంకేతం. గుడి: ఆధ్యాత్మికంగా పైకి ఎదగడం, అపరాధాలను ప్రక్షాళనం చేసుకోవడం.  వ్యవసాయ క్షేత్రం : ప్రేమ, పెండ్లి, సంతానాలను సూచిస్తుంది.  హోటలు: హోటల్ కలలోకి రావడం అరుదే. అయితే ఇది పరివర్తన దశ. హోటలు తాత్కాలిక నివాసం. వాటి అంతస్తులు చేతనా చేతనలను సూచిస్తాయి. ద్వీపం : ఏకాంత సూచకం. ఒంటరిగా మౌనంగా ఉండాలని అనుకోవడానికి ఇది సూచన.  ఊబి: పరిస్థితులు తనను ముంచుతున్నాయను కొంటాడు స్వాపి. ఇతరుల సహాయం లేక బయట పడలేననుకొంటాడు. ఊబి ఎలాగైతే మనిషిని తనలోకి లాక్కుని సజీవంగా మరణం తెస్తుందో అలాగే నిజంగా జరుగుతుందని భయాడతారు. ఇలా కలలో కొన్ని విషయాలు కొన్ని సంకేతాలను ఇస్తాయి. అవన్నీ ఫ్రాయిడ్ తన సిద్ధాంత  పరిశీలన ద్వారా  రూపొందించినవి.                                          ◆నిశ్శబ్ద.
ఈ కాలంలో హాయిగా నిద్రపోవడం కూడా అదృష్టమే. ఎంతో మంది నిద్రలేమితో సతమతమవుతుంటారు. నిద్ర పట్టాలని ఎన్నో మార్గాలు అనుసరిస్తుంటారు. కానీ ఏవీ చక్కని పలితాన్ని ఇవ్వవు. కొందరు ధ్యానం అంటారు అయిదు నిమిషాలు స్థిరంగా కూర్చోలేరు. మరికొందరు ఒత్తిడి అంటారు దానివల్ల నిద్రలేమి అంటారు దాని కోసం డాక్టర్లను సంప్రదిస్తారు. మందులు వాడుతూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్ళు అలా మందుల వల్ల నిద్రకు అలవాటు పడి తరువాత వాటిని వాడటం ఒక్కరోజు ఆయన ఇక నిద్ర ఖరాబ్. మళ్లీ నిద్ర రాదు, పట్టదు. ఇంకొందరికి ఆలోచనలు.  జీవితం గూర్చి, భవిష్యత్తు గూర్చి.మరికొందరికి ఓర్వలేనితనం వల్ల నిద్ర పట్టదు. చెప్పుకోవడానికి, వినడానికి కాస్త ఆస్చశ్రయంగా అనిపించినా ఇది నిజం. ఒకరు ఎదుగుతున్నారంటే భరించలేని వాళ్ళుంటారు. వాళ్ళు ఎప్పుడూ ఇతరులు ఎదిగిపోతున్నారని ఆలోచిస్తూ తమ సమయాన్ని వృధా చేసుకుంటారు. ఇదే కోవకు చెందినవాళ్ళు మరికొందరు ఉంటారు. ఇంకొందరు అయితే చాటింగ్ లు, బ్రౌజింగ్ లు, అనవసరపు పనులు చేస్తూ చేతులారా నిద్రను దూరం చేసుకుంటారు. ఇట్లా కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు. నిద్ర పట్టకపోవడానికి కూడా బోలెడు కారణాలు ఉన్నాయి. అయితే నిద్రకు ఒక చక్కని మందు ఉంది. అదేంటో తెలియాలి అంటే కింద విషయం చదవాలి. అనగనగా ఒకరాజు. ఆయన గొప్పవాడు. రాజ్యం ఉంది, సంపదలు ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. సకల సౌభాగ్యాలు ఉన్నాయి. కానీ ఆయనకు లేనిది ఒకటే నిద్ర. నిద్ర పట్టదు. పరుపు మీద పడుకుని దొర్లి దొర్లి పెడతాడు. కానీ నిద్ర రాదు. ఒకరోజు రాత్రిపూట నిద్రపట్టక తోటలోకి వెళ్ళాడు. ఆ తోటకు ఆనుకుని అడవి ఉంది. ఆ అడవి నుండి ఆ వేళ ఏదో శబ్దం వస్తోంది. ఈ సమయంలో ఎవరో చూడాలి అనుకుని తోట నుండి అడవిలోకి వెళ్ళాడు రాజు. ఆ అడవిలో ఒక వ్యక్తి చెట్టు నరుకుతూ కనిపించాడు. వెన్నెల వెలుగు ఉండటంతో పని జరుగుతోంది.  "నువ్వు రాత్రిపూట నిద్రపోకుండా చెట్టు నరుకుతున్నావు. నీకు నిద్ర పట్టదా" అని అడిగాడు రాజు. రాజు సాధారణ బట్టలు వేసుకుని ఉండటంతో ఆ వ్యక్తి అతన్ని రాజు అనుకోలేదు. "ఎందుకు రాదు అలా పడుకుంటే కొన్ని సెకండ్లలోనే .శవం మాదిరి నిద్రపోతాను. కానీ పని జరిగితేనే డబ్బులొస్తాయి. కాబట్టి తప్పదు పని చేయాలి" అన్నాడు ఆ వ్యక్తి. "ఏంటి సెకండ్లలోనే నిద్ర వచ్చేస్తుందా నేను నమ్మను" అన్నాడు రాజు. "నమ్మకపోతే నేను ఏమి చేయలేను" అన్నాడు ఆ వ్యక్తి. "ఒకపని చేద్దాం. నేను నీ బదులు చెట్టు నరుకుతాను. నువ్వు సెకండ్లలోనే నిద్రపోతా అన్నావుగా నిద్రపో చూద్దాం" అన్నాడు రాజు. ఆ వ్యక్తి సరేనని గొడ్డలి రాజుకు ఇచ్చి చెట్టుకింద అలా పడుకుని నిమిషంలోపలే గురక పెట్టి నిద్రపోయాడు. "పట్టు పరుపులు, మెత్తని దుప్పట్లు అన్ని ఉన్నా నాకు నిద్ర రాదు. వీడు చెట్టు కిందనే ఇట్లా ఎలా నిద్రపోయాడు" అనుకున్నాడు రాజు. ఆ తరువాత వాడికి మాట ఇచ్చాను కాబట్టి చెట్టు నరకాలి అనుకుని చెట్టు నరికేసాడు. అలవాటు లేని పని అవ్వడం వల్ల చేతులు బొబ్బలెక్కాయి. చెమటతో శరీరం తడిసి ముద్దయ్యింది.అలసట కలిగింది. కాళ్ళు, చేతులు లాగేసాయి. మెల్లిగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి అతడి పక్కనే అలా నడుము వాల్చాడు. నిమిషంలోపలే హాయిగా నిద్రపోయాడు. ఉదయాన్నే రాజుకు మెలకువ రాగానే అనుకున్నాడు. మనిషికి శారీరక కష్టమే మంచి నిద్రను ప్రసాదిస్తుంది అని.  కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే మంచి నిద్ర కావాలి అంటే కష్టపడి పనిచేయాలి. దురదృష్టం కొద్దీ ఈ కాలంలోప్రతి ఇంట్లో పని దొంగలు ఎక్కువ ఉంటున్నారు. పని మనుషులను పెట్టుకోవడం కూడా అందుకు ఓ కారణం. మనిషి శరీర ఆరోగ్యానికి, మంచి నిద్రకు ఏ వైద్యుడు ఇవ్వలేని గొప్ప ఔషధం కష్టం. అందుకే కష్టపడాలి. నష్టం ఏమి ఉండదు. ◆ వెంకటేష్ పువ్వాడ  
పిల్లలను పెంచడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడాలి. ఒక్కోసారి పిల్లలు చేసే అల్లరిని, వారు చెప్పే కట్టు కథలను తెలివిగా ఎదుర్కోవలసి ఉంటుంది. మరికొన్నిసార్లు పిల్లలు చేసే తప్పులను, మోసాన్ని తట్టుకోవలసి వస్తుంది,  కొన్నిసార్లు  పిల్లల డిమాండ్లను నెరవేర్చవలసి ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చేస్తున్న ప్రతిదీ వారి మంచికోసమేనని, అది మంచి పనేనని భావిస్తుంటారు. దానికి అనుగుణంగానే నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కానీ చాలా మంది తల్లిదండ్రులు తమకు తెలియకుండానే మంచి అనే భ్రమలో పిల్లల జీవితాన్ని చేతులారా నాశనం చేస్తున్నారు. దీనికి సంబంధించి విషయాలను పేరెంటింగ్ నిపుణులు, కౌన్సిలర్లు కూడా వెల్లడిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చేస్తున్న తప్పులేంటో తెలుసుకుంటే.. నిర్ణయాలు.. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏది కావాలంటే అది చేయనివ్వమని నిర్ణయాలు పూర్తీగా పిల్లల చేతుల్లో పెట్టడం  తరచుగా కనిపిస్తుంది. పిల్లలు  తమ కెరీర్‌లో ఏమి కోరుకుంటున్నారు, వారికి ఏమి కావాలి, పిల్లలు కోరుకుంటున్నది ఏంటి?  ఈ విషయాలన్నింటికి సంబంధించి  తల్లిదండ్రులు చాలావరకు పిల్లల ఇష్టానికి వదిలేశాం అని చెబుతూ ఉంటారు.  పిల్లల ఇష్టమే మా ఇష్టం, మేము మా అభిప్రాయాలు పిల్లల మీద రుద్దడం లేదు. అని చెప్పుకుంటూంటారు కూడా.   ఈ కారణంగానే పిల్లల కెరీర్, వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు వారి చేతుల్లోనే పెడుతుంటారు. కానీ ఇది సరైన పద్దతి కాదని పేరెంటింగ్ నిపుణులు, కౌన్సిలర్లు అంటున్నారు. తల్లిదండ్రుల తప్పేంటి? చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఏది అడిగినా దానికి నో చెప్పరు. దీనికి కారణం పిల్లలు ఇష్టమైన రంగంలో చాలా ఆసక్తి చూపిస్తారని దీని వల్ల వారు సులువుగా కెరీర్ లో విజయం సాధించి సెటిల్ అవుతారని నమ్మడం. కొందరు తల్లిదండ్రలు అయితే తమ పిల్లలు ఆసక్తి చూపించిన రంగంలో వారిని చేర్చి ప్రోత్సహించడానికి లక్షలాది రూపాయలు పోయడానికి అయినా సిద్దంగా ఉంటారు. కానీ పిల్లలు కెరీర్ లో విజయం సాదించలేకపోతారు. దీనికి కారణాన్ని పేరెంటింగ్ నిపుణులు కింది విధంగా చెప్పుకొచ్చారు. ఇప్పటికాలం తల్లిదండ్రులు  చాలా బిజీ జీవితాలు గడుపుతున్నారు. పిల్లలకు ఏ లోటూ రాకూడదని లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టడానికి అయినా సిద్దమవుతారు. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించడం లేదు. ఆ లోటు భర్తీ చేయడానికి, అది బయటకు కనిపించకుండా ఉండటానికి వారు డబ్బును అడ్డు పెట్టుకుంటున్నారు. డబ్బుతో పిల్లలు విజయం సాధిస్తారని అనుకుంటున్నారు. కానీ ఇది చాలా పెద్జ తప్పు. చిన్న తనం నుండే తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన మార్గనిర్దేశకత్వం చేస్తూంటే అది వారి జీవితాన్నిసరైన దిశలో తీసుకెళ్తుంది. కేవలం డబ్బు వెచ్చింది పిల్లల బాగోగులను చూడటం అంటే అది కృత్రిమంగా పిల్లలను పెంచడం లాంటిది. అదే పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పటి నుండి వారి జీవితాన్ని  తోడ్పాటు ఇస్తూ వారి ఆలోచనలు సరైనవా కాదా అని వారితోనే చర్చింది ఆ తరువాత నిర్ణయం తీసుకునే అదికారం పిల్లలకు ఇస్తే అప్పుడు పిల్లలకు తమ జీవితంలో సాధించాల్సింది ఏంటి అనే విషయం మీద స్పష్టత వస్తుంది. అలా కాకుండా పిల్లల జీవితం ఎదగడానికి కేవలం డబ్బు సరిపోతుందని తల్లిదండ్రులు బావిస్తే అది చాలా పొరపాటు అవుతుంది.                                              *నిశ్శబ్ద.  
  సరైన విధంగా తింటే శాకాహారం ఇచ్చినంత గొప్ప ఆరోగ్యం ఇంకేదీ ఇవ్వగదనేది వైద్యుల మాట. కూరగాయలలో కూడా ప్రాంతీయతను బట్టి వివిధ రకాలుంటాయి. వీటిలో కొన్ని చూడడానికి కొన్ని వింతగా ఉంటే మరికొన్ని తిన్నప్పుడు ఆశ్చర్యకరమైన రుచి కలిగుంటాయి. అలాంటి వాటిలో కూర పనస కూడా ఒకటి. రూపంలో అచ్చం పనస పండును పోలి ఉండే కూర పనస రుచిలో మాత్రం అందరికీ షాకిస్తుంది. ఇది అచ్చం బ్రెడ్ రుచిని పోలి ఉంటుంది. అందుకే దీన్ని బ్రెడ్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఈ కూర పనస తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఓసారి తెలుసుకుంటే.. పోషకాలు.. కూర విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యకరమైన చర్మం కోసం కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. అదనంగా, ఇందులో విటమిన్ ఎ, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఉన్నాయి, ఇది మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. జీర్ణ ఆరోగ్యం.. అధిక ఫైబర్ కంటెంట్‌ ఉన్న కారణంగా, కూర పనసప్రేగు కదలికలను నియంత్రించడం, మలబద్ధకాన్ని నివారించడం ద్వారా జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఫైబర్ ప్రీబయోటిక్‌గా కూడా పనిచేస్తుంది.  గట్‌లోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పోషించడం, జీర్ణక్రియ, పోషకాల శోషణకు అవసరమైన ఆరోగ్యకరమైన మైక్రోబయోమ్‌ను ప్రోత్సహిస్తుంది. బరువు నిర్వహణ.. కూర పనసను ఆహారంలో చేర్చుకోవడం వల్ల  తక్కువ కేలరీలు,  అధిక ఫైబర్ కంటెంట్ లభిస్తాయి. బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువ కాలం కడుపు  నిండిన అనుభూతిని కలిగిస్తుంది, మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గిస్తుంది.  అతిగా తినకుండా చేస్తుంది. అదనంగా, దాని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు స్థిరమైన శక్తిని అందిస్తాయి, రోజంతా సంతృప్తిగా, ఉత్సాహంగా ఉంచుతాయి.                    *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  పసుపులో ఉన్న ఔషద గుణాలు మరిదేనిలోను లేవని అంటున్నారు యు నాని వైద్యులు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ యునాని వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్ జి వి సత్య తెలుగు వన్ హెల్త్ తో మాట్లాడుతూ పసుపు లోనే కాదు పసుపు చెట్టు ఆకుల లోను ఔషద గుణాలు ఉన్నాయని అంటున్నారు సత్య. సహజంగా అందరికి తెలిసింది పసుపు కేవలం కూరలలోనే వాడతారని, లేదా సంప్రదాయంగా  పసుపు ను పూజా కార్య క్రమాలలో వాడతారు. సంప్రదాయ పద్దతిలో జరిగే  పెళ్లి లోను పసుపుదే కీలక పాత్ర,సహజంగా గ్రా మీణ ప్రాంతాలలో చిన్న పాటి గాయం అయితే రక్త శ్రావం ఆగడానికి ముందుగా వాడేది పసుపే అని అంటారు యునాని వైద్యురాలుఅక్కడ పసుపు యాంటి బాయిటిక్  గా పనిచేస్తుందని అన్నారు.   ఎస్ జి వి సత్య. ముఖ్యంగా పసుపు మొక్క నుండి తీసిన పసుపు కొమ్ము ను ఆరగ దీసి పెట్టుకుంటే దద్దుర్లు వాపులు  తగ్గుతాయి. పసుపు ఆకును డికాక్షిన్  తో స్నానం చేస్తే దద్దుర్లు తగ్గుతాయి. పసుపును డ వేడి వేడి పాలలో వేసి తీసుకుంటే జలుబు దగ్గు తగ్గుముఖం పడుతుంది. పసుపు ఆకుల రసాన్ని  డికాక్షిన్ రూపం లో తీసుకుంటే శరీరం లో ఇన్ఫెక్షన్ లు తగ్గుతాయి. ఇక సాంప్రదాయానికి వస్తే వివాహానికి సంబంధించి పెళ్లి కూతురు,పెళ్లి కొడుకు కి సంబంధించి చేసే మంగళ స్నానాలలో పసుపు వాడడం అనావాయితిగా వస్తుంది. పసుపు కాళ్ళకు రాసుకుంటే  యాంటీ బాయిటిక్ గా పనిచేస్తుంది. కాళ్ళ పగుళ్ళు ఉన్న వారికి పసుపు రాసుకుంటే పగుళ్ళు తగ్గుతాయి.  ఇక ముఖం పై పసుపు రాసుకుంటే ముఖం పై వచ్చే ముడతలు తగ్గి ముఖం లో  గ్లౌ వస్తుంది.అలాగీ మీ ముఖం మరింత సౌందర్యం కావాలంటే తేనె, పసుపు ఆకు రసం కలిపిన  లేపనాన్ని కలిపి రాస్తే ముఖం మరింత కాంతి వంతంగా మెరుస్తుందని యునాని హెల్త్ క్లినిక్  కు చెందిన డాక్టర్ ఎస్ జి వి సత్య తెలుగు వన్ హెల్త్ కు తెలిపారు. పసుపు ఆకు ఇమ్యునిటీ  బూస్టర్ గా పని చేస్తుంది.పసుపు ఆకు డికాక్షిన్ ను క్యాన్సర్ వచ్చిన రోగులకు వారానికి ఒక సారి ఇస్తే  నీరసం తగ్గి కొంచం కోలుకుంటారని డాక్టర్ ఎస్ జి వి సత్య వివరించారు. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఉదయం లేవగానే రోజు మొదలుపెట్టాలంటే టీ కావాలి. డ్యూటీ మధ్యలో కాస్త బయటకు వెళ్ళాలంటే టీ బెస్ట్ సాకు, సాయంత్రం స్నేహితులతో కలసి టీ కొట్టు దగ్గర కబుర్లు చెబుతూ చాయ్ తాగితే ఆ ఫీల్ వేరు.  టైమ్ పాడు లేకుండా టీ తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీ కొట్టు ఓపెన్ చేశాక కట్టేసేవరకు స్టౌ మీద టీ ఉడుకుతూనే ఉంటుందంటే టీ కి ఉన్న గిరాకీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు టీ కహానీ ఎందుకంటారా? టీ అంటే అందరికీ ఇష్టం. మరీ ముఖ్యంగా వేడి వేడి టీలో బిస్కెట్లు ముంచుకుని తింటే మరీ ఇష్టం. ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్లు, అప్పటికప్పుడు హాట్ హాట్ గా బేక్ చేసిన బిస్కెట్లు.. ఓయబ్బో టీ పక్కనే వయ్యారాలు పోతాయి బిస్కెట్లు. కానీ టీతో బిస్కెట్లు తినడం మహా ఇష్టమైన వారికి బ్యాడ్ న్యూస్.. దీని వల్ల బోలెడు నష్టాలున్నాయి. టీతో బిస్కెట్ తింటే కలిగే నష్టాలేంటి? టీ తో ఏం తింటే ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి? పూర్తీగా తెలుసుకుంటే.. భారతదేశంలో టీ తాగేవారు ఎక్కువ. ఇక టీ బిస్కెట్ కాంబినేషన్ కు ఫ్యాన్స్ ఎక్కువ. అయితే టీ బిస్కెట్ వల్ల ఆరోగ్య నష్టాలున్నాయి. యువతలో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి  టీ తో బిస్కెట్ తినడం ఒక కారణంగా తెలుస్తోంది. టీ బిస్కెట్ కాంబినేషన్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. బిస్కెట్లలో సోడియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. ఇది గుండెజబ్బులకు ప్రధానకారణం అవుతుంది. బిస్కెట్ల తయారీకి శుద్ది చేసిన పిండి, శుద్ది చేసిన పంచదార ఉపయోగిస్తారు. ఇది శరీరంలో ఇన్సులిన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ అసమతుల్యత కారణంగా మధుమేహం ప్రమాదం పెరుగుతుంది. మరొకవైపు ఇది జీర్ణక్రియను కూడా దెబ్బతీస్తుంది. దీని వల్ల మలబద్దకం వస్తుంది. బిస్కెట్లు ఎక్కువగా ప్రాసెస్ చేయబడే ఆహారం. ఇందులో  BHA (butylated hydroxyanisole),  BHT (butylated hydroxytoluene) ఉంటాయి. ఇవి మానవ శరీరంలో ఉండే DNA ను దెబ్బతీస్తాయి. మరీ ముఖ్యంగా బిస్కెట్లలో హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్  ఉంటుంది. ఇది శరీరంలో హార్మోన్లను డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి టీతో బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. టీతో వేయించిన శనగలు తింటే.. వేయించిన శనగలు ఆరోగ్యానికి చాలా మంచిదం. టీ టైమ్ లో స్నాక్ గా వేయించిన శనగలు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. వేయించిన శనగలు ఇన్సులిన్ ను కంట్రోల్ చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే బి-కాంప్లెక్స్ విటమిన్ ఉంటుంది కాబట్టి బి-విటమిన్ లోపాన్ని జయించవచ్చు. ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, మెగ్నీషియం శనగలలో పుష్కలంగా ఉంటుంది. శనగలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ అయిన కోలిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి టీతో బిస్కెట్లకు బదులు వేయించిన శనగలు తింటే మంచిది.                                          *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...