LATEST NEWS
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వంలో అవినీతి, దోపిడీ విచ్చలవిడిగా సాగాయని విమర్శిస్తూ, తాము అధికారంలోకి వస్తే వ్యవస్థలను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చిన ప్రస్తుత తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఆశించిన ఫలితాలను చూపించలేకపోతోందని  తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ‘తెలుగువన్ వాస్తవ వేదిక’లో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా, గతంలోనూ ప్రస్తుతంనూ రాష్ట్రాన్ని శాసిస్తున్న మరియు ఆర్థిక వనరులను దోచుకుంటున్న ఆ ‘పది మంది’ వ్యక్తులు లేదా శక్తులు మారలేదనేది ప్రస్తుత రాజకీయ ముఖచిత్రం. గత ప్రభుత్వంలో ఒకవైపు నుయ్యి ఉంటే, ఈ ప్రభుత్వంలో మరోవైపు గొయ్యి తయారైందని డోలేంద్ర ప్రసాద్ విశ్లేషించారు , ప్రజలకు లభించింది కేవలం ముఖచిత్రాల మార్పే తప్ప నిజమైన సుపరిపాలన కాదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయ వ్యూహం మరియు అంతరార్థాలు  ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాల్లో ప్రధాన లోపం "రియల్ టైమ్ గవర్నెన్స్" లేదా డిజిటల్ వ్యవస్థల ప్రదర్శనపై ఉన్న శ్రద్ధ, క్షేత్రస్థాయి ఫలితాలపై లేకపోవడమే. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం కంటే, గత పాలకుల తప్పులను ఎత్తిచూపడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ వ్యూహాత్మక అంతరార్థం ఏమిటంటే, అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య అంతర్గత అవగాహన లేదా ‘కొమ్మకు’ (సహకార) రాజకీయాలు నడుస్తున్నాయనే అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి.  ప్రతిపక్షం సైతం కొన్ని విషయాల్లో గట్టిగా నిలదీయకపోవడానికి ఈ వ్యవస్థీకృత నెట్‌వర్కే కారణం. ప్రెస్ ఫ్రీడమ్ (పత్రికా స్వేచ్ఛ) విషయంలోనూ, పాలకులకు అనుకూలమైన కథనాలకే ప్రాధాన్యత దక్కడం, నిజమైన ప్రజా సమస్యలు పక్కదారి పట్టడం వంటి పరిణామాలు ఈ వ్యూహాల్లోని లోపాలను సూచిస్తున్నాయి. భవిష్యత్తు రాజకీయ ప్రభావం  వరుసగా మూడు టర్మ్‌లు మేమే అధికారంలో ఉంటామనే అతివిశ్వాసం లేదా భ్రమల్లో పాలకులు ఉండటం ప్రజాస్వామ్యానికి హానికరమని ఆయన పేర్కొన్నారు. అంతిమ నిర్ణయం ప్రజలదే కానీ, పాలకులది కాదు. ప్రస్తుత విధానాలు ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది.  ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే విశ్లేషకులను లేదా జర్నలిస్టులను శత్రువులుగా చూడటం మానేసి, అద్దంలో కనిపించే మచ్చలను సరిదిద్దుకున్నట్లుగా పాలనను చక్కదిద్దకపోతే భవిష్యత్తులో రాజకీయ శూన్యత ఏర్పడే ప్రమాదం ఉందని . ఈ మార్పు లేని ‘పది మంది’ దోపిడీ వ్యవస్థను అంతమొందించకపోతే, ఏపీ రాజకీయాల్లో త్వరలోనే ప్రజలు ప్రత్యామ్నాయ శక్తుల వైపు చూసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో అభివృద్ధికి చిహ్నాలుగా నిలిచిన నాగార్జున సాగర్, శ్రీశైలం, తెలుగుగంగా వంటి భారీ ప్రాజెక్టులను నిర్మించిన చరిత్రను గుర్తుచేసుకునే తరుణంలో, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజా స్మృతిలో నిలిచిపోయేలా ఎలాంటి మైలురాళ్లను సృష్టిస్తుందనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది. పత్రికా స్వేచ్ఛ మరియు పాలనా పారదర్శకత విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కూడా అప్పుడే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అధికార కూటమి రాజకీయంగా సుస్థిరత సాధించడానికి దీర్ఘకాలిక వ్యూహాలను రచిస్తోంది. వరుసగా రాబోయే మూడు టర్మ్‌లు తామే అధికారంలో ఉంటామనే ధీమాతో పాలకులు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, అది కేవలం ఆత్మవంచనగా లేదా ప్రచారానికే పరిమితమైన వ్యూహంగా మారుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.  ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలపై చేసిన విమర్శలు, ఇచ్చిన హామీల అమలుపై ప్రస్తుతం ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. అధికారంలోకి రాకముందు మాట్లాడిన తీవ్రమైన మాటలకు, ప్రస్తుత ఆచరణకు పొంతన లేకపోవడం కూడా కూటమి వ్యూహాత్మక వైఫల్యంగా మారుతోంది. మరోవైపు, ప్రతిపక్షం కూడా ఆశించిన స్థాయిలో ప్రజా సమస్యలపై గళం విప్పకుండా, తెరవెనుక సర్దుబాట్లకు లోనవుతోందనే సరికొత్త రాజకీయ కోణం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ ప్రభావం మరియు భవిష్యత్తు పరిణామాలు సుదీర్ఘ కాలం పాటు కొనసాగే అరాచకాలను లేదా అవినీతిని కాలం ఎల్లప్పుడూ సహించదు ప్రకృతి లేదా ప్రజా చైతన్యమే దానికి సరైన దిద్దుబాటు చర్యలను చేపడుతుంది. కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో నిలదొక్కుకోవాలంటే కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితం కాకుండా, ప్రజల నిజమైన అవసరాలను గుర్తించాల్సి ఉంటుంది.  అధికార గర్వంతో ప్రజల నిర్ణయాలను తక్కువగా అంచనా వేస్తే రాజకీయ పరిణామాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం అవినీతిరహిత, పారదర్శక పరిపాలనను అందించడంలో పూర్తిగా విఫలమైతే, అది రాబోయే కాలంలో పాలకుల మనుగడకే ముప్పుగా మారుతుంది.  ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు కాబట్టి, కూటమి ప్రభుత్వం తన స్వీయ కరెక్షన్‌ను ఎంత త్వరగా చేసుకుంటే అంతగా భవిష్యత్తు రాజకీయాలపై తన పట్టును నిలుపుకోగలుగుతుందని జమీన్ రైతు’ సంపాదకుడు తెలిపారు.  మరిన్ని అంశాలపై కంఠంనేని రవిశంకర్ – డోలేంద్ర ప్రసాద్ మధ్య జరిగిన పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించవచ్చు.  
  దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా 2028 లక్ష్యంగా బీజేపీ వేస్తున్న అడుగులు, వ్యూహాలు భారతీయ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసేలా ఉన్నాయి. మీడియాలో వినిపిస్తున్న లీకులు, గాసిప్స్ నిజమైతే, దేశ రాజకీయాల్లో అతిపెద్ద మార్పు తథ్యం. ముఖ్యంగా మమతా బెనర్జీ పార్టీకి చెందిన సుమారు 62 నుండి 64 మంది రెబల్స్ బీజేపీలో విలీనం కావడానికి రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. యాంటీ డిఫెక్షన్ చట్టం ప్రకారం వీరు వేరే మార్గం లేక ఈ నిర్ణయం తీసుకోవాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదేవిధంగా ఏపీ రాజకీయాల్లోనూ ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాజ్యసభ సభ్యత్వాలకు సంబంధించి ఇప్పటికే నలుగురు రాజీనామా చేయగా, మరో ఏడుగురు మిగిలి ఉన్న పరిస్థితుల్లో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి. సువేందు అధికారి, అమిత్ షా వంటి కీలక నేతల నేతృత్వంలో ఈ ‘బిగ్ గేమ్’ కొనసాగుతోంది.  ఇక మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ వ్యూహాలు కూడా పదునుగా ఉన్నాయి. ఎన్సీపీకి చెందిన రెండు వర్గాలను కలిపి మొత్తం 9 లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ సభ్యులను బీజేపీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. శరద్ పవార్ రిటైర్మెంట్, అజిత్ పవార్ కన్నుమూత నేపథ్యంలో అక్కడ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని కమలం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, శివసేనలోనూ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని 7 గురు ఎంపీలు షిండే మరియు ఫడ్నవీస్‌తో టచ్‌లోకి రావడం రాజకీయ చర్చలకు దారితీస్తోంది. సంజయ్ రౌత్ వ్యూహాలు ఏ మేరకు ఉద్ధవ్ వర్గానికి మేలు చేస్తాయో వేచి చూడాల్సిందే. ప్రధానమంత్రి స్వయంగా సీఎంలతో జరిపిన చర్చల్లో 2029 కంటే ముందుగానే అంటే 2028లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సంకేతాలివ్వడం, ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక ఇండియా కూటమి విషయానికి వస్తే, డీఎంకే వంటి పార్టీలు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. డీఎంకేకు లోక్‌సభలో 22, రాజ్యసభలో 10 సీట్లు ఉండటం వల్ల పార్లమెంటులో వారి పాత్ర కీలకం కానుంది. ఏపీలోని వైసీపీ, బీఆర్ఎస్ వంటి పార్టీలు ప్రస్తుతానికి స్వతంత్రంగానే ఉన్నప్పటికీ, భవిష్యత్ అవసరాలను బట్టి ఎన్డీయేకు మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని ప్రచారం జరుగుతోంది.  ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బీజేపీ తన అంతర్గత లోపాలను సరిదిద్దుకుంటూ, జనాదరణ తక్కువగా ఉన్న నేతలను తొలగించి దూకుడుగా ఉన్న నాయకులను రంగంలోకి దింపే కసరత్తు చేస్తోంది. అటు కాంగ్రెస్ కూడా ఆపదను గుర్తించి అప్రమత్తమవుతోంది. మొత్తం మీద, రాబోయే రోజుల్లో దేశ రాజకీయాలు ఎటువంటి మలుపులు తిరుగుతాయోనన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది.
  ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. నాలుగు స్థానాలకు నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలవడంతో అభ్యర్థుల ఎన్నికను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ తరఫున సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ రాజ్యసభకు ఎన్నిక కాగా, జనసేన పార్టీ నుంచి లింగమనేని రమేష్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.  నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి పోటీలో ఈ నలుగురు అభ్యర్థులే మిగలడంతో ఎన్నిక అనివార్యంగా ఏకగ్రీవమైంది. దీంతో అధికార కూటమికి చెందిన అభ్యర్థుల విజయం ముందుగానే ఖరారైంది. ఎన్నికైన సభ్యులకు రిటర్నింగ్ అధికారి వనిత రాణి అధికారిక ధ్రువీకరణ పత్రాలు (ఫారం-22) అందజేయనున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని 10 రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం జూన్ 1న ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆ షెడ్యూల్ ప్రకారం నామినేషన్ ప్రక్రియ పూర్తికాగా, ఏపీలో నాలుగు స్థానాలకు నాలుగు నామినేషన్లు మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది.
రాజకీయాల్లో  ఏ ఎండకా గొడుగు పట్టడంలో వైసీపీ అధినేత జగన్ ది అందె వేసిన చెయ్యిగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ తెలుగుదేశం ఘనతలను తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నించిన జగన్ ఇప్పుడు..  నీట్ పరీక్షల లీకేజీ వ్యవహారంపై యువత ఆగ్రహం నుంచి పుట్టుకొచ్చిన  కాక్రోచ్ జనతా పార్టీ  ట్రెండ్‌ను  చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నీట్ లీకేజీని  ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల అంశానికి లింక్ చేసిమైలేజ్ పొందాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.  తాడేపల్లిలో గురువారం (జూన్ 11) జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. దాదాపు రెండున్నర గంటల పాటు జగన్ రెండున్నర గంటల పాటు సాగిన మీడియా సమావేశంలో జగన్  సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.  ఇది జెన్-జీ కాలం.. ఇప్పుడు జెన్-ఆల్ఫా కూడా నడుస్తోంది. ఏపీలో కూడా కాక్రోచ్‌లు బయటకు వస్తాయి అంటూ ఆయన  చేసిన వ్యాఖ్యలు  రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నిజానికి ఆ రెండు జనరేషన్ల అర్థాలు ఏమిటి? అన్నది జగన్ కు ఎంత వరకూ తెలుసో కానీ,  జగన్ మాత్రం తాను  ఏపీ కాక్రోచ్ మూవ్ మెంట్ ను లీడ్ చేస్తానంటూ అన్యాపదేశంగా  ప్రకటించేశారు.  అయితే  దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ   ఏపీలో మెగా డీఎస్సీ  పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది. ఈ డీఎస్సీ ప్రక్రియలో ఒక్కటంటే ఒక్క లీకేజీని కూడా జగన్  చూపించలేదు. ఆరోపణలు తప్ప ఆధారాలేవీ బయటపెట్టలేదు.  అయినప్పటికీ..  ఒక  అబద్ధాన్ని పదే పదే  చెబితే.. ఏపీ యువత  నమ్మేసి రోడ్లెక్కి  చంద్రబాబు ప్రభుత్వంపై దాడి చేస్తారని ఆయన నమ్ముతున్నారు.  వాస్తవాలతో  సంబంధం లేకుండా, ప్రజలకు సరైన దిశానిర్దేశం చేయాల్సిన రాజకీయ నేత..  అసత్య ప్రచారాలతో జనాలను నమ్మించాలని చేస్తున్న ప్రయత్నాల పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్త మౌతున్నాయి.  ట్రెండ్ సృష్టించడమెందుకు.. ఫాలో అయితే పోలా అన్న చందంగా జగన్ .. కాక్రోచ్ జనతా పార్టీని గుడ్డిగా ఫాలో అవుతూ నీట్  లీకేజీకీ,  ఏపీ డీఎస్సీకీ ముడిపెట్టి లబ్ధి పొందాలని చూసిన తీరును నెటిజనులు ఎండగడుతున్నారు.  తాజా ప్రెస్ మీట్ లో జగన్ పదే పదే కాక్రోచ్ లు వస్తాయి అనడంతో నెటిజనులు  వైసీపీ పేరును.. కాక్రోచ్ జగన్ పార్టీ అని మార్చేస్తారేమో అని నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  ఏది ఏమైనా  జగన్ కొత్తగా మొదలెట్టిన  బొద్దింకల రాజకీయం ఏపీలో జగన్‌కు మైలేజీ ఇవ్వడం మాట అటుంచి.. జనంలో ఆయన నవ్వుల పాలు కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీ పెట్టి టీఆర్ఎస్ బ్రాండ్ ఓన్ చేసుకుందామనుకున్న కవితకు ఆ పేరే  ఇప్పుడు ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. టీఆర్ఎస్ పేరును కేటాయించవద్దని ఇప్పటికే బీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.  అదలా ఉంటే.. మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న  తెలంగాణ రాష్ట్రసామాజిక సేన  టీఆర్ఎస్ పేరు తమ పార్టీకి కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతోంది. ఇక కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా, కవిత పత్రికల్లో ఇచ్చిన ప్రకటనపై కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. టీఆర్ఎస్ పేరును ఆమె పార్టీకి కేటాయించడంపై దాదాపు 600 నుంచి 700 వరకు  అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి అందాయి. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే  టీఆర్ఎస్ పేరుతో నమోదైన మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ రాజ్య సమితి పేరుతో నమోదైన మరో రాజకీయ పార్టీ కూడా టీఆర్ఎస్ పేరును ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు కవిత ప్రతినిధుల బృందం కూడా ఈసీని కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. భారీ సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో కవిత పార్టీకి టీఆర్ఎస్ సెంటిమెంట్ దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ALSO ON TELUGUONE N E W S
కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్‌కు తెలుగులోనూ ఎంతటి భారీ క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన యాక్షన్ చిత్రాలతో మెప్పించే ఈ విలక్షణ నటుడు, తాజాగా తన మార్క్ సంచలనానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'మకుటం' . ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా అఫీషియల్ యాక్షన్ టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ విడుదలైన టీజర్ ఆద్యంతం హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పీక్స్ లెవెల్లో సాగింది. ముఖ్యంగా టీజర్ ప్రారంభంలో వచ్చే ఫస్ట్ షాట్ ప్రతి ఒక్కరికీ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. మండుతున్న ఒక శవం నుండి విశాల్ స్టైలిష్‌గా సిగరెట్ వెలిగించుకుంటూ ఇచ్చే మాస్ ఎంట్రీ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఒక్క సీన్‌తోనే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో విశాల్ హింట్ ఇచ్చేశారు. సినిమాలో విశాల్ ఏకంగా మూడు విభిన్నమైన షేడ్స్ ఉన్న గెటప్స్‌లో కనిపించి విశ్వరూపం చూపించబోతున్నారు. వృద్ధుడి గెటప్‌తో పాటు మిగిలిన రెండు వేరియేషన్స్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయనున్నాయి. ఇక ఈ చిత్రంలో టాలెంటెడ్ నటి అంజలి కూడా ఊరమాస్ యాక్షన్ అవతారంలో కనిపించి షాక్ ఇచ్చింది. విజువల్స్, స్టంట్ కొరియోగ్రఫీ, మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ వెరసి టీజర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఈ ప్రాజెక్ట్ విశాల్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా నిలవనుంది. మొదట వేరే దర్శకుడితో ప్రారంభమైనప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను, స్క్రీన్‌ప్లేని విశాల్ స్వయంగా తన భుజాలపై వేసుకున్నారు. ఈ చిత్రానికి రవి అరసు కథను అందించారు. దుషార విజయన్ కథానాయికగా నటిస్తుండగా.. తంబి రామయ్య, ఐర్జె కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్ ఫిల్మ్స్ పతాకంపై అగ్ర నిర్మాత ఆర్.బి. చౌదరి నిర్మిస్తున్న 99వ మైలురాయి చిత్రం కావడం విశేషం. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నారు. టీజర్ చూసిన నెటిజన్లు "విశాల్ ఈసారి గట్టిగా కొట్టేలా ఉన్నాడు", "డైరెక్టర్‌గా విశాల్ డెబ్యూ అదిరిపోయింది" అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్యాచ్ వర్క్ జరుపుకుంటున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మకుటం' వెండితెరపై ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. త్వరలోనే ఈ చిత్ర ఆడియో విడుదల తేదీ మరియు థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా హారర్ చిత్రాల ప్రేమికులకు అత్యంత ఇష్టమైన ఫ్రాంచైజీలలో 'ఈవిల్ డెడ్' సిరీస్ ఒకటి. ఈ సిరీస్ నుండి వచ్చే ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ప్రేక్షకులను వణికించేస్తుంటుంది. తాజాగా ఈ క్రేజీ ఫ్రాంచైజీ నుండి రాబోతున్న సరికొత్త హారర్ థ్రిల్లర్ 'ఈవిల్ డెడ్ బర్న్' (Evil Dead Burn). ఈ చిత్రం యొక్క అఫీషియల్ తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలై, సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది.   విడుదలైన కొద్దిసేపటికే ఈ ట్రైలర్ హారర్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మరియు నటీనటుల పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిలోనూ భయాన్ని, క్యూరియాసిటీని రేకెత్తిస్తున్నాయి. గత చిత్రాల కంటే ఈసారి మరింత క్రూరమైన, భయంకరమైన డెమొనిక్ ఎలిమెంట్స్‌తో దర్శకుడు సెబాస్టియన్ వానిసెక్ ఈ చిత్రాన్ని వెండితెరపై ఆవిష్కరించినట్లు స్పష్టమవుతోంది. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. భర్తను కోల్పోయిన ఒక మహిళ, ఒంటరితనం నుండి ఉపశమనం కోసం దూరంగా ఉన్న తన అత్తమామల ఇంటికి వెళుతుంది. అయితే, అక్కడ ఉన్న ఒక రహస్య పుస్తకం (Necronomicon) ద్వారా ఆ కుటుంబంలోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. ఒక్కొక్కరుగా ఆ ఇంట్లోని వారంతా భయంకరమైన డెడ్‌లైట్స్‌గా (Deadites) మారిపోతుంటే, ఆ నరకం నుండి ఆ మహిళ ఎలా ప్రాణాలతో బయటపడింది అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది.   గతంలో వచ్చిన 'ఈవిల్ డెడ్ రైజ్' (2023) చిత్రం అపార్ట్‌మెంట్ నేపథ్యంలో సాగి భారీ విజయాన్ని అందుకోగా, ఈసారి 'ఈవిల్ డెడ్ బర్న్' సరికొత్త లొకేషన్‌లో మరింత వైల్డ్ అండ్ సావేజ్ రైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో లూసియెన్ బుకానన్, హంటర్ డూహన్, సౌహైలా యాకూబ్ ప్రధాన పాత్రల్లో నటించారు. సోనీ పిక్చర్స్ ఇండియా ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.   తెలుగు ట్రైలర్ చూసిన సినీ ప్రియులు యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తమ స్పందనలను పంచుకుంటున్నారు. "ట్రైలర్ లోని కొన్ని సీన్లు చూస్తుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది", "ఈసారి థియేటర్లలో భయపడటానికి రెడీ అవ్వాల్సిందే" అంటూ హారర్ లవర్స్ కామెంట్లు పెడుతున్నారు. హాలీవుడ్ స్థాయి మేకింగ్ వాల్యూస్ ఈ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతున్న ఈ మోస్ట్ అవేటెడ్ హాలీవుడ్ హారర్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా జూలై 10న ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ సరికొత్త చాప్టర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
  ప్రస్తుత డిజిటల్ యుగంలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల హవా ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లలో మిస్ అయిన సినిమాలను, విభిన్నమైన వెబ్ సిరీస్‌లను ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రశాంతంగా వీక్షించేందుకు ప్రేక్షకులు వీటిపై మొగ్గు చూపుతున్నారు. అయితే, ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో తమ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. డబ్బులు పెట్టి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నప్పటికీ, ఇకపై స్క్రీన్‌పై ప్రకటనలు చూడాల్సిందేనంటూ సరికొత్త నిబంధనలను తీసుకువచ్చింది. గతంలో ఎలాంటి యాడ్స్ లేకుండా సాఫీగా సాగిపోయిన ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇకపై మారబోతోంది. అమెజాన్ సంస్థ తమ సేవల్లో భాగంగా గంటకు దాదాపు 4 నుండి 6 నిమిషాల పాటు పరిమిత ప్రకటనలను ప్రసారం చేయడం ప్రారంభించింది. ఈ అకస్మాత్తు మార్పు ఓటీటీ ప్రియులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలు, భారీ సిరీస్‌ల నిర్మాణ వ్యయాన్ని తట్టుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంటున్నప్పటికీ, యూజర్లు మాత్రం దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.   ఒకవేళ ఈ యాడ్స్ టార్చర్ మాకు వద్దు.. మునుపటిలాగే ప్రశాంతంగా సినిమాలు చూసుకోవాలి అనుకుంటే మాత్రం, యూజర్లు తమ జేబులకు మరింత చిల్లు పెట్టుకోవాల్సిందే. అవును, పూర్తి యాడ్-ఫ్రీ అనుభవం కోసం అమెజాన్ ప్రైమ్ సరికొత్త ఆప్షనల్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, ప్రస్తుతమున్న సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలకు అదనంగా నెలకు రూ. 129 లేదా సంవత్సరానికి రూ. 699 చెల్లించి అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది.   అమెజాన్ తీసుకున్న ఈ వాణిజ్య నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. "ఇప్పటికే వేలల్లో సబ్‌స్క్రిప్షన్ ఫీజు కడుతుంటే, మళ్లీ యాడ్స్ చూపించడం ఏంటి? యాడ్స్ వద్దనుకుంటే అదనపు డబ్బులు అడగడం ఎంతవరకు న్యాయం?" అంటూ ట్విట్టర్ వేదికగా #BoycottPrime వంటి హ్యాష్ ట్యాగ్‌లతో యూజర్లు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. ఇది సాధారణ టెలివిజన్ ఛానెల్ లా మారిపోతోందని కొందరు పెదవి విరుస్తున్నారు. ఇలాంటి యాడ్-సపోర్టెడ్ మోడల్‌ను ప్రవేశపెట్టడం అమెజాన్‌కు మాత్రమే పరిమితం కాలేదు. గ్లోబల్ మార్కెట్‌లో నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ఇతర ప్రధాన ఓటీటీ సంస్థలు కూడా ఇప్పటికే ఇటువంటి బిజినెస్ స్ట్రాటజీలను అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ, ఒకేసారి అదనపు భారం పడటంతో సగటు డిజిటల్ వీక్షకుడు ఈ విధానాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. రాబోయే రోజుల్లో ఈ యాడ్స్ విధానం వల్ల ప్రైమ్ వీడియో సబ్‌స్క్రైబర్స్ సంఖ్య తగ్గుతుందా లేదా అనేది వేచి చూడాలి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇతర భాషల్లో ఘనవిజయం సాధించిన కథలను మన నేటివిటీ, సంస్కృతికి తగినట్లుగా మార్చి తెరకెక్కించే సాంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే, టాలీవుడ్‌లో అత్యధిక రీమేక్ చిత్రాల్లో నటించి, వాటి ద్వారా ఇండస్ట్రీ హిట్లను సొంతం చేసుకున్న రికార్డ్ ఎవరిదో తెలుసా? మరెవరిదో కాదు.. మన మెగాస్టార్ చిరంజీవిదే. తన అద్భుతమైన నటనతో రీమేక్ సినిమాలకు సరికొత్త ప్రాణం పోశారాయన. చిరంజీవి తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దాదాపు 40 రీమేక్ ప్రాజెక్టులలో భాగస్వామి అయ్యి టాలీవుడ్ అగ్రస్థానంలో నిలిచారు. ఇక్కడ గమనార్హం ఏమిటంటే, ఆయన నటించిన ఈ రీమేక్ చిత్రాలలో అత్యధిక శాతం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. చిరంజీవిని తిరుగులేని మాస్ హీరోగా, కలెక్షన్ల రారాజుగా నిలబెట్టడంలో ఈ సినిమాలు కీలక పాత్ర పోషించాయి. మెగాస్టార్ సినీ కెరీర్‌ను ఒక్కసారి పరిశీలిస్తే.. మనం సూపర్ హిట్ అనుకునే 'ఖైదీ', 'అభిలాష', 'విజేత', 'ఘరానా మొగుడు' వంటి ఎన్నో వింటేజ్ చిత్రాలు వేరే భాషల నుంచి స్వీకరించినవే. కేవలం కెరీర్ ప్రారంభంలోనే కాకుండా, తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా 'హిట్లర్', 'ఠాగూర్', 'ఖైదీ నంబర్ 150', 'గాడ్ ఫాదర్' వంటి బ్లాక్‌బస్టర్ రీమేక్‌లతో బాక్సాఫీస్ వద్ద చిరు రీఎంట్రీ గ్రాండ్‌గా సాగింది. చిరంజీవి తర్వాత టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్ దాదాపు 32 రీమేక్ చిత్రాలతో 'రీమేక్ రాజా'గా ముద్ర వేసుకున్నారు. వెంకీ కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిన 'చంటి', 'సూర్యవంశం', 'రాజా', 'దృశ్యం' వంటి చిత్రాలన్నీ ఇతర భాషల్లో విజయవంతమైనవే. అలాగే కింగ్ నాగార్జున కూడా 20కి పైగా రీమేక్ సినిమాల్లో నటించగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లోని భారీ హిట్‌లలో కూడా రీమేక్‌లే ఎక్కువగా ఉండటం విశేషం. ఒకప్పుడు రీమేక్ చిత్రాలను టాలీవుడ్‌లో అత్యంత సురక్షితమైన వ్యాపారంగా భావించేవారు. కానీ, ప్రస్తుత డిజిటల్ యుగంలో ఓటీటీల హవా పెరగడంతో, ప్రేక్షకులు ఇతర భాషల చిత్రాలను సబ్‌టైటిల్స్‌తో నేరుగానే వీక్షిస్తున్నారు. దీనివల్ల రీమేక్ చిత్రాల సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా స్ట్రైట్ సబ్జెక్టులకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదేమైనా, ఒరిజినల్ కథలోని ఆత్మ చెడకుండా తెలుగు ఆడియెన్స్ పల్స్ పట్టుకుని సినిమాలు చేయడంలో చిరంజీవి ఎప్పటికీ నెంబర్ 1 గానే ఉంటారు. ప్రస్తుతం చిరు 'విశ్వంభర' వంటి భారీ సోషియో ఫాంటసీ స్ట్రైట్ సినిమాతో బిజీగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కంటెంట్ పటిష్టంగా ఉంటే రీమేక్ ట్రెండ్ మళ్లీ ఊపందుకునే అవకాశం లేకపోలేదు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోగా దూసుకుపోతున్నారు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ యంగ్ హీరో, తాజాగా ఒక క్రేజీ సినిమా వేదికపై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌తో సందడి చేశారు. ఇద్దరి మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌లో ఆసక్తి రేకెత్తిస్తున్న ‘దీవానా’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు అల్లు అరవింద్‌తో పాటు విశ్వక్ సేన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో సినిమా చేసే విషయంపై ఇద్దరి మధ్య స్టేజ్ పైనే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడిచింది. తనదైన స్టైల్‌లో మాట్లాడే విశ్వక్ సేన్.. అల్లు అరవింద్‌ను నేరుగానే సినిమా ఆఫర్ గురించి అడిగేశారు. "సార్, గీతా ఆర్ట్స్ లో నాకు ఇప్పుడే అడ్వాన్స్ ఇస్తారా?" అంటూ విశ్వక్ సరదాగా డిమాండ్ చేశారు. దీనికి అల్లు అరవింద్ కూడా అంతే స్పోర్టివ్‌గా స్పందిస్తూ.. "నువ్వు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటావో చెప్తే, ఇప్పుడే అడ్వాన్స్ ఇచ్చేస్తా" అంటూ కౌంటర్ ఇవ్వడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ, తమ ఇద్దరి మధ్య సినిమా గురించిన చర్చలు ఈరోజువి కావని, గత ఐదారేళ్లుగా సాగుతున్నాయని వెల్లడించారు. "నేను ఒకసారి అడుగుతాను, తర్వాత మర్చిపోతాను.. విశ్వక్ కూడా అంతే. ఏదైనా ఈవెంట్‌లో కలిసినప్పుడు మాత్రం సినిమా చేద్దాం అనుకుంటాం కానీ ఇప్పటివరకు కుదరలేదు" అని అరవింద్ చెప్పుకొచ్చారు. కథానాయకుడిగా విశ్వక్ సేన్ టాలెంట్‌కు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. అటు గీతా ఆర్ట్స్ సంస్థ కూడా ఇటీవల కాలంలో కేవలం పెద్ద సినిమాలే కాకుండా, GA2 పిక్చర్స్ బ్యానర్‌పై విభిన్నమైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ లాంటి ఎనర్జిటిక్ హీరోతో అల్లు అరవింద్ సినిమా చేస్తే ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ రిపీట్ అవుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. నెట్టింట వైరల్ అవుతున్న వీరిద్దరి ఫన్నీ కాంబో చాట్ చూసి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. "ఆలస్యం అమృతం విషం" కాకుండా, మంచి కథతో ఈ క్రేజీ కాంబినేషన్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ‘దీవానా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ద్వారా ఈ సరికొత్త కాంబినేషన్‌పై గట్టి హింట్ అయితే వచ్చేసింది. త్వరలోనే గీతా ఆర్ట్స్ నుంచి విశ్వక్ సేన్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని టాలీవుడ్ సమాచారం.
Vishal’s directorial debut Magudam has finally unveiled its teaser and the first impression is clear — this is not designed as a safe commercial outing. The actor-filmmaker appears to be aiming for a rough-edged action drama that values atmosphere, intensity and visual scale over conventional hero elevation moments. The teaser keeps dialogue and story details to a minimum, instead relying on mood-building. Dust-filled frames, grounded action and a constant sense of tension dominate the visuals, creating the feeling of a world shaped by conflict and power struggles. Interestingly, Vishal does not seem interested in presenting himself in a polished star avatar. His screen presence feels more rugged and restrained, fitting the tone the teaser is trying to establish. That decision immediately separates Magudam from the louder mass-action template audiences are used to. Technically too, the teaser leaves a stronger impression than expected. The production design and cinematography work together to give the film a larger visual identity without making it look artificially grand. At the same time, Magudam wisely avoids revealing too much. There are enough glimpses to understand the film’s scale, but not enough to decode its emotional core.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు సూర్య లీడ్ రోల్‌లో వచ్చిన రీసెంట్ మూవీ 'కరుప్పు' (తెలుగులో వీరభద్రుడు) థియేట్రికల్ రిలీజ్ సమయంలో ఎంతటి హై డ్రామా నడిచిందో అందరికీ తెలిసిందే. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొన్ని చోట్ల షోలు క్యాన్సిల్ అవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ సమయంలో ఈ సినిమా దర్శకుడు ఆర్జే బాలాజీ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూ, తాను కారులోనే కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నానంటూ చేసిన కామెంట్స్ సెన్సేషన్ అయ్యాయి. అయితే, తాజాగా ఈ అంశంపై కోలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఫైనాన్షియర్ తిరుప్పూర్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీశాయి. దర్శకుడు ఆర్జే బాలాజీ అలా కన్నీరు కార్చడంపై తిరుప్పూర్ సుబ్రహ్మణ్యం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సినిమా మేకింగ్ సమయంలో బడ్జెట్‌పై నియంత్రణ కోల్పోవడం వల్లే నిర్మాతలకు ఇలాంటి కష్టాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. మొదట ఈ ప్రాజెక్ట్‌ను కేవలం 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ప్లాన్ చేశారని, ఆ తర్వాత అది 40 కోట్లకు చేరినా ఒక అర్థం ఉంటుందని.. కానీ ఏకంగా 80 కోట్ల రూపాయల మేర బడ్జెట్‌ను పెంచేయడం ఏంటని ఆయన నిలదీశారు. అంత భారీ భారాన్ని నిర్మాతపై వేసేటప్పుడు దర్శకుడికి బాధ్యత ఉండదా అని ఘాటుగా ప్రశ్నించారు. సినిమా షూటింగ్ సమయంలో బడ్జెట్‌ను అదుపులో ఉంచకుండా, రిలీజ్ టైమ్‌లో సమస్యలు రాగానే దర్శకులు కారులో కూర్చుని ఏడవడం, వీడియోలు పెట్టడం కరెక్ట్ కాదని సుబ్రహ్మణ్యం హితవు పలికారు. ప్రొడ్యూసర్లు విడుదల ముందు రెండు మూడు నెలల పాటు డబ్బులు సర్దుబాటు చేయడానికి నానా సంకటాలు పడుతుంటే, ఏ దర్శకుడూ వారి అండగా నిలబడరని మండిపడ్డారు. అదే సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయితే మాత్రం సక్సెస్ క్రెడిట్ మొత్తం తమ ఖాతాలోనే వేసుకునేందుకు ముందుంటారని విమర్శించారు. ఇదే క్రమంలో హీరో సూర్య వ్యవహరించిన తీరును మాత్రం తిరుప్పూర్ సుబ్రహ్మణ్యం కొనియాడారు. సూర్య తన రెమ్యునరేషన్‌లో కేవలం సగం మాత్రమే తీసుకుని, మిగిలిన మొత్తానికి ఆయనే పర్సనల్‌గా గ్యారెంటీ ఇచ్చారని వెల్లడించారు. సూర్య చూపించిన ఆ ఉదారత వల్లే ఈ సినిమా చివరకు థియేటర్లలోకి రాగలిగిందని, ఈ క్రెడిట్ అంతా సూర్యకే దక్కుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ సినిమా ప్లాప్ అయితే మిగిలిన బాకీలను దర్శకులు తీరుస్తారా అంటూ ఆయన వేసిన ప్రశ్నలు ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో పెను దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వివాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది నెటిజన్లు దర్శకుడు ఆర్జే బాలాజీని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తుండగా, మరికొందరు మాత్రం ఒక క్రియేటర్‌గా సినిమా క్వాలిటీ కోసం బడ్జెట్ పెంచి ఉండొచ్చని సపోర్ట్ చేస్తున్నారు. ఏదేమైనా, సినిమా సక్సెస్ ఎంజాయ్ చేసే దర్శకులు, మేకింగ్‌లో వచ్చే ఆర్థిక నష్టాలకు కూడా అంతే బాధ్యత వహించాలనే చర్చను ఈ ఇష్యూ మరోసారి తెరపైకి తెచ్చింది. సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో, ఈ బడ్జెట్ లొల్లి కోలీవుడ్‌లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది. ఒకవైపు కలెక్షన్ల వర్షం కురుస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో ఈ చిత్రంపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై చిత్ర యూనిట్ అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో 'పెద్ది' సినిమా పోస్ట్ ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటుడు జగపతి బాబు సోషల్ మీడియా ట్రోలర్స్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సినిమాలపై కావాలనే విషం చిమ్మే కొందరి తీరును ఆయన తప్పుపట్టారు. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంటుందని, సినిమా నచ్చితే మెచ్చుకోవడం, నచ్చకపోతే విమర్శించడం సహజమేనని.. కానీ కావాలనే ఒక సినిమాను దెబ్బతీయాలని చూడటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమందికి ఒక సినిమా ఫ్లాప్ అయితే వింత ఆనందం కలుగుతుందని, అది చాలా తప్పుడు ఆలోచన అని జగ్గూభాయ్ అన్నారు. కేవలం కొన్ని వేల రూపాయల కోసం లేదా వ్యూస్ కోసం వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలను టార్గెట్ చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఈ రకమైన నెగిటివ్ ప్రచారం వెనుక పనిలేని వెదవలు, గుంటనక్కలు ఉన్నారంటూ ఆయన తనదైన శైలిలో ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. ఒక సినిమా వెనుక కేవలం హీరో మాత్రమే ఉండరని, నిర్మాత పెట్టిన పెట్టుబడితో పాటు దర్శకుడు, టెక్నీషియన్లు, వందలాది మంది కార్మికుల కష్టం దాగి ఉంటుందని జగపతి బాబు గుర్తుచేశారు. సినిమా ఫలితంపై ఎంతోమంది జీవితాలు ఆధారపడి ఉంటాయని, అలాంటి ప్రాజెక్ట్‌ను నాశనం చేయాలని చూడటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. రామ్ చరణ్ ఆర్థికంగా ఎంతో బలంగా ఉండొచ్చు, కానీ మిగిలిన వారి పరిస్థితి ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రివ్యూలు ఇవ్వడం వేరని, కానీ వ్యక్తిగత కక్షలతో లేదా ఉద్దేశపూర్వకంగా నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం వేరని జగ్గూభాయ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం జగపతి బాబు చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సినీ సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి. ఇండస్ట్రీలో చాలామంది ఆయన మాటలను సమర్థిస్తుండగా, నెటిజన్లు కూడా ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా వివాదాలు, ట్రోలింగ్స్ ఎలా ఉన్నా 'పెద్ది' సినిమా థియేటర్లలో మాత్రం సాలిడ్ వసూళ్లతో అదరగొడుతోంది. రామ్ చరణ్ నటనకు, చిత్ర దర్శకుడి టేకింగ్‌కు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. రానున్న రోజుల్లో ఈ మూవీ మరిన్ని కలెక్షన్ల రికార్డులను బద్దలు కొడుతుందని మెగా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
A rumour involving Mohanlal and Mammootty is enough to set Malayalam cinema discussions on fire — and that is exactly what is happening with Padayatra. Fresh reports circulating in film circles suggest that Mohanlal could be associated with the project in some capacity.  Further adding to the excitement, reports are leading to speculation about a possible collaboration with Mammootty. While there has been no official confirmation so far, the mere possibility has become a major talking point among fans. The excitement around such reports comes from the rarity of seeing Malayalam cinema’s two biggest stars connected to the same project. Their occasional collaborations have always carried an event-like appeal, making even early-stage rumours enough to trigger widespread interest. At the centre of this discussion is Padayatra, a project that was already drawing attention for its creative ambitions and Mammootty’s involvement. The latest chatter has now shifted focus from the film itself to whether audiences could witness another moment featuring two of Malayalam cinema’s most influential names. For now, nothing has been officially announced. But the reaction to the speculation once again underlines a familiar reality — in Malayalam cinema, Mohanlal and Mammootty together remains an idea powerful enough to dominate conversations even before a single frame is revealed.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  తెలుగు చిత్ర సీమలో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind)కి ఉన్న స్థానం అందరికి తెలిసిందే. ఎనీ హీరో ఆ బ్యానర్ లో నటించాలని కోరుకుంటాడు. కోరుకోవడమే కాదు నిద్రలో కలలు కూడా కంటూ ఉంటారు. హిట్ కి దారిని చూపించే బ్యానర్ కావడమే అందుకు ఉదాహరణ. అల్లు అరవింద్ రీసెంట్ గా 'దీవానా' అనే మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ప్రముఖ హీరో విశ్వక్ సేన్ ప్రేమ గురించి  అల్లు అరవింద్ ని అడిగాడు. దాంతో అల్లు అరవింద్ మాట్లాడుతు ఈ రోజుల్లో లవ్ ఏముంది. ప్రేయసి, ప్రియడు జనం లేని థియేటర్స్ కి వెళ్లి కార్నర్ సీట్స్ లో కూర్చోడం, ఆ తర్వాత  రెండు షాపింగ్ లకి వెళ్లి ఓయోలో ఎండ్ చేస్తున్నారు అని చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలు వైరల్ గా నిలిచాయి . Also read: మెగా హీరోల సంచలనం.. మూడంటే మూడే సినిమాలతో ఎంత రాబట్టారో తెలుసా! అనంతరం  'దీవానా'(Deewana)గురించి మాట్లాడుతు ఈ సినిమా కథ నాకు తెలుసు. దర్శకుడు బాగా తెరకెక్కించాడు. హీరోతో పాటు అందరు బాగా చేసారు. అందరికి మంచి పేరు వస్తుందని చెప్పుకొచ్చాడు. అల్లు అరవింద్ కూడా వన్ హాఫ్ ది ప్రొడ్యూసర్..   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా అపురూపమైనది.  భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమగా ఉంటూ,  ఒకరితో ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ బంధం బాగుటుంది.  అయితే ఈ బంధంలో చాలామంది భర్తలు తమ భార్యకు ఎంతో ప్రేమను పంచుతున్నామని, ఎంతో బాగా చూసుకుంటున్నామని అంటూ ఉంటారు.  కానీ ఇది చాలా తప్పు. కేవలం ప్రేమతో మనిషి సంతోషంగా ఉండటం అనేది జరగదు. గిఫ్ట్ లు,  గోల్డ్,  చీరలు.. ఇవన్నీ కొనిపెట్టడం మీద మహిళల సంతోషం ఆధారపడి ఉండదు.  చాలామంది పెద్ద గొడవలు ఏమీ జరగడం లేదు కాబట్టి ఆ బంధంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారని అనుకుంటారు.  కానీ అది నిజం కాదు.. కొన్ని చిన్న చిన్్న అలవాట్లు, కొన్ని చిన్న చిన్న విషయాలు బంధాన్ని బహీనంగా మారుస్తాయి.  మహిళలు ఎవరికీ చెప్పుకోలేక తమలో తాము ఎక్కువగా బాధపడే కొన్ని విషయాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. ఇతర మహిళల పై ఎక్కువ శ్రద్ద చూపడం.. మగాడు తన భాగస్వామితో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇతర స్త్రీల వైపు చూడటం లేదా వారిపై ఎక్కువ శ్రద్ధ చూపడం వంటివి చేస్తే. ఆతనితో బంధంలో ఉన్న  స్త్రీ అభద్రతా భావానికి లోనై, నిర్లక్ష్యానికి గురైనట్లు భావించబడుతుంది. ఇతర స్త్రీల వైపు చూసే మగాడు తన భార్యను అవమానించినట్టు. కేవలం అవమానం మాత్రమే కాదు.. ఆమె గౌరవాన్ని కూడా దెబ్బతీసినట్టే. అసలు జీవితంలో ఆమెకు ప్రాధాన్యత  ఇవ్వనట్టు. ప్రత్యేక సందర్బాలు మరచిపోవడం.. చాలామంది మగాళ్లకు పెళ్లిరోజు తేదీలు కూడా గుర్తుండవు అని తరచుగా అంటుంటారు.  ఇది బయటకు తమాషాగా,  సరదాగా మాట్లాడే విషయం అయినా.. మహిళలకు ఇవి ఎంతగానో బాధపెడతాయి. మొదటిసారి కలుసుకున్న రోజు,  భాగస్వామి పుట్టినరోజు,  మ్యారేజ్ డే వంటి ముఖ్యమైన తేదీలు, సందర్భాలు వంటివి గుర్తుంచుకోకపోతే మహిళలు చాలా బాధపడతారు. ఎక్కువగా ఆలోచించవద్దని చెప్పడం.. మహిళలు  ఆందోళనలను లేదా సమస్యలను తన  భర్తతో షేర్ చేసుకున్నప్పుడు,  దానికి పరిష్కారం చెప్పకపోయినా కనీసం అర్థం చేసుకుంటే చాలని,  ఎంతో ఊరటగా ఫీల్ అవుతుంది. కానీ మహిళలు తమ భయాలు, ఆందోళనలు షేర్ చేసుకున్నప్పుడు , అంతగా ఆలోచించకు అని చెప్పడం వల్ల ఆమె తన మాటలను పట్టించుకోవడం లేదని ఫీలవుతుంది. భార్య కంటే స్నేహితులు, బయటివారి మాటకే విలువ ఇవ్వడం.. ప్రతి మగాడి జీవితంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. కానీ ప్రతి మగాడు తన నిర్ణయాలలో ఎల్లప్పుడూ స్నేహితుల అభిప్రాయాలకే ప్రాధాన్యతనిస్తూ, భార్య చెప్పే విషయాలను, భార్య ఫీలింగ్స్ ను విస్మరిస్తే అది ఆ సంబంధంలో దూరాన్ని సృష్టిస్తుంది. అంతే కాదు.. బయటి వాళ్ల మాటలతో భార్యను చిన్నతనంగా మాట్లాడటం,  భార్యకు విలువ ఇవ్వకపోవడం కూడా బంధాన్ని బలహీనపరుస్తుంది. మద్దతు ఇవ్వకపోవడం.. ఎన్నో ఏళ్లు కని పెంచిన తల్లిదండ్రులను వదిలి ప్రతి ఆడపిల్ల  భర్త వెంట అత్తింటికి వెళుతుంది. కానీ చాలామంది మహిళలు అత్తింట్లో, భర్త వైపు కుటుంబ సభ్యుల నుండి అవమానం ఎదుర్కొంటూ ఉంటారు.  భార్యను ఏదైనా మాటలు అన్నా,  భార్యను చిన్నతనంగా చూసినా ఆమెకు మద్దతు ఇచ్చి మాట్లాడాల్సింది పోయి,  వాళ్లతో కలిసి భార్యను నిందించడం చేస్తుంటారు.  ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది.  మహిళలు చాలా భాధపడతారు. ఒంటరితనం.. ప్రతి ఒక్కరూ తమ సంబంధాలలో , కుటుంబంలో తమకు విలువ ఉండాలని కోరుకుంటారు. ప్రతి మహిళ తన మాటకు, తన అభిప్రాయానికి,  తనకు ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటారు.  ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా కేవలం వివాహ బంధంతో ఇంటికి తెచ్చుకున్న ఒక వ్యక్తిలాగా ఆమెను ట్రీట్ చేస్తే ఆమె మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తుంది. ఇతరులతో పోల్చడం.. చాలామంది మగవారు తమ భార్యలను ఇతరులతో పోల్చుతారు.  అమ్మలా వంట చేయలేవు, అక్కలాగా పని చేయలేవు,  ఇలాంటివి మాత్రమే కాకుండా.. శారీరకంగా, ఇతర విషయాలలోనూ ఇతరులతో పోల్చి మాట్లాడటం వల్ల మహిళలు చాలా బాధపడతారు.  ప్రతి మనిషిని మనిషిగా చూడాలి,  వారిలో ప్లస్ పాయింట్స్ ను ఎలా స్వీకరిస్తారో అలాగే మైనస్ ను స్వీకరించాలి. పోల్చడం వల్ల మహిళల ఆత్మగౌరవం దెబ్బతింటుంది.                                    *రూపశ్రీ.
ఎలాంటి సంబంధం అయినా సరే.. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన గొడవ, సంఘర్షణ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో చాలా సాధారణం. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో గొడవలు కూడా చాలా ఉంటాయి. కానీ భార్యాభర్తల మధ్య కేవలం గొడవలు మాత్రమే ఎక్కువ ఉండి,  ఇద్దరి మధ్య సరైన అవగాహన,  పరస్పర గౌరవం వంటివి లేకపోతే.. ఆ బంధం చాలా పెళుసుగా మారిపోయే అవకాశం ఉంటుంది.  గొడవలు అలకలు ఇద్దరి మద్య బంధాన్ని ఎంత బలం చేస్తాయో.. అవి ఎక్కువైతే ఇద్దరిని అవే విడదీస్తాయి కూడా. నేటికాలంలో చాలామంది తమ బంధం గురించి ఆలోచించి బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. అలాంటి వారికోసం ఒక మంచి మార్గం ఉంది. అదే  రిలేషన్షిప్ డిటాక్స్.. శరీరాన్ని డిటాక్స్ చేసుకోవడం కోసం చాలా  మంది డిటాక్స్ డ్రింకులు తాగుతూ ఉంటారు.  దీనివల్ల శరీరంలో విషపదార్థాలు బయటకు వెళ్లిపోయి శరీరం శుభ్రం అవుతుంది. అదేవిధంగా.. రిలేషన్షిప్ ను డిటాక్స్ చేసుకుంటే.. బంధంలో ఉన్న అనవసర గొడవలు,  ఇబ్బందులు,  అపార్థాలు అన్నీ మంత్రమేసినట్టు మాయమవుతాయి. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. భాగస్వామిని బాధపెట్టకుండా బంధాన్ని డిటాక్స్ చేసుకోవాలంటే.. భాగస్వామితో మాట్లాడాలి..  రిలేషన్ షిప్ డిటాక్స్ చేయించుకోవాలనుకుంటే, ముందుగా  భాగస్వామితో మాట్లాడాలి. ఎందుకు రిలేషన్షిప్ డిటాక్స్ చేయించుకోవాలని అనుకుంటున్నారో వివరించాలి.ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని వివరించాలి. సమస్యలకు కారణమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. భాగస్వామి పైవన్నీ అర్థం చేసుకుంటే.. రిలేషన్షిప్ డిటాక్స్ చేయించుకోవడం సులువు అవుతుంది. దృష్టి.. ప్రతి ఒక్కరు తమపై తాము  దృష్టి పెట్టాలి. ఇది  మానసిక,  భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తమపై తాము దృష్టి పెట్టినప్పుడు, తమ  బలాలు,  బలహీనతలను బాగా అర్థం చేసుకోగలుగుతారు.  ఇవి భవిష్యత్తులో సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో సహాయపడతాయి. సమయం.. నేటికాలంలో ప్రతి ఒక్కరు  నిరంతరం ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. ముఖ్యంగా ఎప్పుడూ  ఫోన్‌లో ఉండటం వల్ల తమకు తాము సమయం కేటాయించుకోలేకపోతారు. తమకు తాము సమయం కేటాయించుకోనప్పుడు అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. బంధాన్ని డిటాక్స్ చేసుకోవాలంటే.. సమయం కేటాయించాలి.  ఫోన్ కు దూరంగా ఉండాలి. బందం గురించి ఆలోచించాలి.  అలాంటప్పుడు అలోచనలు కూడా సరిగ్గా పనిచేస్తాయి. దూరం.. రిలేషన్షిప్ డిటాక్స్ అంటే.. బంధం నుండి విడిపోవడానికి ప్రయత్నించడం కాదు.. బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం.  బంధంలో గొడవలు, అపార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు.. భాగస్వామికి కొన్నాళ్లు దూరంగా ఉండి అన్నీ ఆలోచించుకోవడం వల్ల అన్ని విషయాలు క్షుణ్ణంగా అర్థం అవుతాయి. అప్పుడు బంధాన్ని నిలబెట్టుకోవడానికి మార్గాలు కనిపిస్తాయి. బంధం ఎంత ముఖ్యమైనదో కూడా అర్థమవుతుంది.                                        *రూపశ్రీ.
ప్రతి వ్యక్తికి నేటికాలంలో ఇల్లు, ఆఫీసు అంటూ రెండు ప్రదేశాలు ముఖ్యంగా మారాయి.  ఒకటి కుటుంబ సభ్యులతో కలసి ఉండేది అయితే రెండవది కుటుంబ సభ్యులను పోషించడానికి మరొక ప్రదేశంలో విభిన్న వ్యక్తులతో కలిసి పనిచేసే స్థలం. చాలామంది ఆఫీసులో ఒత్తిడి ఎదుర్కుంటున్నామని చెబుతూ ఉంటారు. ఆఫీసులో గనుక పని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటే అది మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని చిన్న చిన్న మార్పులు, చిట్కాలతో ఒత్తిడి నుండి బయట పడవచ్చు. ఇవి నేరుగా ఆఫీసుకు వెళ్లి పని చేసే వారికి అయినా,  లేక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి అయినా చాలా చక్కగా పని చేస్తాయి.  అవేంటో తెలుసుకుంటే.. పనుల జాబితా.. ఈ చిట్కా ఖచ్చితంగా  సహాయపడుతుంది. ఉదయాన్నే డైరీలో రోజు పనులను రాసుకోవాలి. పైన తేలికైన పనులను,  దిగువన ఎక్కువ సమయం,  శ్రద్ధ అవసరమయ్యే పనులను లిస్ట్  చేయాలి. ఇది  మనస్సు గందరగోళం లేకుండా క్లారిటీగా  ఉంచడానికి సహాయపడుతుంది.  రోజులో ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి.. వాటిని ఎప్పుడు చేయాలో అనుకుంటూ  అతిగా ఆలోచించడాన్ని తగ్గిస్తుంది. బ్రేక్ ముఖ్యం..  ఎంత పని ఉన్నా సరే.. గంటల తరబడి కూర్చుని పని చేయడం తప్పు. ప్రతి 25-30 నిమిషాల పని తర్వాత 5 నిమిషాల విరామం తీసుకోవాలి. నీరు త్రాగడం,  కళ్ళు మూసుకోవడం  లేదా కొద్దిగా శరీరాన్ని రిలాక్స్ చేసుకోవడం.. ఇవన్నీ  మనసు అలసిపోకుండా  విశ్రాంతిని ఇస్తాయి.   ఒత్తిడిని తగ్గిస్తాయి. నో చెప్పడం నేర్చుకోండి.. ఇది అతి ముఖ్యమైన చిట్కా ఏమిటంటే.. ప్రతి పనినీ, మీటింగ్‌నీ లేదా పనిని.. ఇట్లా ఏదైనా సరే.. ఆఫీసులో  అదనపు బాధ్యతను ఎప్పుడూ తీసుకోకూడదు. చాలా మంది కాస్త మంచిగా మాట్లాడుతూ,  కాస్త పొగుడుతూ ఏదైనా పని చేసిపెట్టమని అడుగుతూ ఉంటారు.  అలాంటి సందర్భాలలో  మర్యాదగా తిరస్కరించాలి.  ఇది  మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే అదనపు పని భారం ఒత్తిడికి దారి తీస్తుంది.  ప్రతి ఒక్కరూ నో చెప్పడం నేర్చుకోవాలి. ఇది ఎంతో సహాయపడుతుంది. శారీరక శ్రమ..  పనిలో బిజీగా ఉన్నప్పటికీ, ప్రతిరోజూ 15-30 నిమిషాలు నడవడం, యోగా చేయడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది సహజ ఒత్తిడిని తగ్గించే మార్గం.  ఒత్తిడి హార్మోన్లు వ్యాయామం వల్ల తగ్గుతాయి. వ్యాయమం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది  ఫిట్‌గా ఉంచుతుంది. డెస్క్ దగ్గరే కూర్చుని చేయగల యోగా భంగిమలు కొన్ని ఉంటాయి.  అలాంటివి చేసినా బాగుంటుంది.                          *రూపశ్రీ.
నేటి కాలంలో నిమ్మరసం ఎంతో ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి . శరీరాన్ని చల్లబరచడం నుండి డీహైడ్రేషన్‌ను నివారించడం వరకు నిమ్మరసం ప్రయోజనాలు చాలా ఉన్నాయి. నిమ్మకాయతో చాలామంది చేసుకునే రిఫ్రెష్ డ్రింక్ లలో లెమన్ షర్బత్ ఏ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అయితే  దాని రుచి కోసం అధిక మొత్తంలో చక్కెరను కలుపుతారు. ఈ అలవాటు ఆరోగ్యకరమైన నిమ్మరసం   ప్రయోజనాలను నాశనం చేస్తుంది.  ఏదో అప్పుడప్పుడు  నిమ్మరసం తాగే వారైతే పర్లేదు. కానీ రోజు లెమన్ షర్బత్ తాగేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.  అధికంగా చక్కెర కలపడం  ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నిమ్మరసం.. భారతీయ ఇళ్లలో ఎన్నో సంవత్సరాల నుండి ఇంటికి వచ్చిన అతిథులకు నిమ్మరసం నీటిని ఇవ్వడం జరుగుతోంది. సాధారణంగా కొందరు నిమ్మరసం తయారీలో తరచుగా నల్ల ఉప్పు, రాతి ఉప్పు లేదా వేయించిన జీలకర్ర పోసి కలుపుతారు. ఇది శరీరానికి తేమను అందించి, అవసరమైన ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడానికి సహాయపడుతుంది. ఈ డ్రింక్ ముఖ్యంగా వేడి,  తేమతో కూడిన  రోజులలో మంచి  ఉపశమనాన్ని అందిస్తుంది. ఆయుర్వేదంలో కూడా నిమ్మకాయకు ప్రాముఖ్యత ఉంది. చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగుతారు. ఇది జీర్ణక్రియను ఉత్తేజపరుస్తుందని, శరీరాన్ని తాజాగా ఉంచుతుందని,  రోజంతా చురుగ్గా ఉండటంలో సహాయపడుతుందని చెబుతారు.  నిమ్మకాయలోని విటమిన్ సి శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చక్కర కలిపితే.. నిమ్మరసంలో ఎక్కువ చక్కెర కలిపినప్పుడు, దానిలోని కేలరీలు పెరుగుతాయి. క్రమం తప్పకుండా అధిక చక్కెర తీసుకోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం, రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.  అందుకే  నేటి కాలంలో చాలా మంది ఆరోగ్య నిపుణులు , డైటీషియన్లు నిమ్మరసంలో చక్కెర లేకుండా లేదా తక్కువ చక్కెరతో తాగమని చెబుతుంటారు. నారింజ రసం కూడా.. నిమ్మరసం మాత్రమే కాకుండా, నారింజ రసం కూడా చక్కెర కలపకపోవడం మంచిది. నారింజ పండ్లు సహజంగానే తీపిగా ఉంటాయి, కాబట్టి అదనపు చక్కెరను జోడించాల్సిన అవసరం లేదు. ఒకవేళ పుల్లని నారింజ పండ్ల రసం ఉంటే అందులో కాస్త నల్ల ఉప్పులేద సాధారణ ఉప్పు కొద్దిగా కలిపి తీసుకోవచ్చు. తాజాగా ఉండే, చక్కెర కలపని నారింజ రసం విటమిన్ సి కి మంచి మూలం . శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే ఫిట్‌నెస్ మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వ్యక్తులు  అదనపు చక్కెర లేని పానీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రుచి మెరుగవ్వాలంటే.. నిమ్మరసం రుచిని మెరుగుపరచడానికి చక్కెర బదులుగా పుదీనా ఆకులు, నల్ల ఉప్పు, రాతి ఉప్పు లేదా వేయించిన జీలకర్ర పొడి ఉపయోగించవచ్చు. ఇది రుచిని మెరుగుపరచడమే కాకుండా, పానీయం  పోషక విలువలను కూడా కాపాడుతుంది. నారింజ రసాన్ని ఎప్పుడూ తాజాగా, చక్కెర కలపకుండా తాగితేనే ఉత్తమంగా ఉంటుంది. ప్యాక్ చేసిన, అధికంగా తీపి కలిపిన పానీయాలకు దూరంగా ఉండాలని  అనుకునేవారు నిమ్మరసం , నారింజ రసం వంటి సహజ ప్రత్యామ్నాయాలకు మారడం మంచిది.   చక్కెర కలపడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. కొన్నిసార్లు ఒక చిన్న అలవాటు కూడా  ఆరోగ్యంపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది.                         *రూపశ్రీ
కొన్నిసార్లు శరీరంపై నీలం లేదా ఊదా రంగు మచ్చలు  కనిపిస్తాయి. చాలా వరకు ఇలాంటి మచ్చలు ఏవైనా గాయాలు లేదా దెబ్బలు తగిలినప్పుడు బయటకు రక్తం కారడం, చర్మం దెబ్బ తినడం  వంటివి జరగకపోయినా, చర్మం మీద నీలం రంగులో మచ్చలు మాత్రం ఏర్పడుతూ ఉంటాయి. కొందరికి ఎలాంటి గాయాలు అయినట్లు కూడా గుర్తుండదు.  చాలామంది తరచుగా ఇది సాధారణమే అనుకుని నిర్లక్ష్యం చేస్తారు, కానీ కొన్ని సందర్భాల్లో, ఇది ఒక శరీరం లోపల ఏదో  సమస్యకు సంకేతం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. పదేపదే కారణం లేకుండా ఏర్పడే గాయాలను తేలికగా తీసుకోవడం మంచిది కాదని  అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే…  మచ్చలు ఎందుకు కనిపిస్తాయి?  కొన్నిసార్లు అధిక శారీరక శ్రమ లేదా తీవ్రమైన వ్యాయామం చర్మం కింద ఉండే చిన్న రక్తనాళాలను ప్రభావితం చేయగలదని నిపుణులు అంటున్నారు. కండరాలపై అధిక ఒత్తిడి ఈ నాళాలు చిట్లిపోవడానికి,  చర్మం కింద రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది, దీని ఫలితంగా నీలి రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇలా జరిగినప్పుడు  ఆ వ్యక్తికి గాయం అయినట్టు తెలియకపోవచ్చు, కానీ మచ్చలు కనిపినస్తుంటాయి. మందులు.. కొన్ని మందులు కూడా చర్మం మీద ఇలా నీలి రంగు మచ్చలకు కారణం కావచ్చు. రక్తాన్ని పల్చబరిచే మందులు, ముఖ్యంగా ఆస్పిరిన్, ఇబుప్రోఫెన్,  నాప్రోక్సెన్ వంటివి, రక్తం మరింత త్వరగా గడ్డకట్టేలా చేస్తాయి. రక్తం సాధారణ వేగంతో గడ్డకట్టనప్పుడు, అది చర్మం కిందకు కారిపోయి, సులభంగా కమిలిపోతుంది. కొత్త మందులు తీసుకున్న తర్వాత ఈ సమస్య మొదలైతే వైద్యుడిని సంప్రదించడం ఎంతో ముఖ్యం.  పోషకాల లోపం.. కొన్ని ముఖ్యమైన పోషకాల లోపం కూడా ఈ సమస్యను తీవ్రతరం చేస్తుంది. విటమిన్ సి లోపం చర్మాన్ని, రక్తనాళాలను బలహీనపరిచి, చిన్న ఒత్తిడికే మచ్చలు ఏర్పడేలా చేస్తుంది. ఐరన్ లోపం రక్తనాళాలను ప్రభావితం చేస్తుంది, విటమిన్ కె లోపం రక్తం గడ్డకట్టడాన్ని నెమ్మదింపజేస్తుంది. అందువల్ల, ఎటువంటి కారణం లేకుండా పదేపదే నీలి మచ్చలు రావడం పోషకాహార లోపానికి సంకేతం కావచ్చట..  ఈ సమస్య ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం.. ఇమ్యూన్ థ్రోంబోసైటోపెనియా వంటి అరుదైన సమస్యలలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడానికి కారణమవుతాయి. రక్తం గడ్డకట్టడంలో ప్లేట్‌లెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. వాటి లోపం వల్ల చర్మంపై అకస్మాత్తుగా నీలం లేదా ఊదా రంగు మచ్చలు ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాల్లో, పదేపదే వచ్చే నీలం మచ్చలు నాన్-హాడ్కిన్స్ లింఫోమా లేదా ఇతర రక్త సంబంధిత సమస్యల వంటి తీవ్రమైన వైద్య పరిస్థితికి సంకేతం కావచ్చు. ఇది అరుదైనప్పటికీ, తీవ్రమైన అలసట, బరువు తగ్గడం లేదా తరచుగా రక్తస్రావం వంటి లక్షణాలతో పాటుగా ఉంటే వైద్యులను కలిసి పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. వైద్యుడిని ఎప్పుడు కలవాలి? ఎటువంటి స్పష్టమైన గాయం లేకుండా  శరీరంపై పదేపదే నీలి మచ్చలు కనిపిస్తే, ఆ మచ్చలు క్రమంగా పెద్దగా అవుతూ పరిమాణంలో పెరుగుతుంటే, తరచుగా ముక్కు నుండి రక్తం కారుతుంటే, లేదా ఆ రక్తస్రావం సులభంగా ఆగకపోతే,  వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సకాలంలో వైద్య పరీక్ష చేయించుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్యాన్ని దాని ప్రారంభ దశలోనే గుర్తించి, వ3ఎలైనంత తొందరగా చికిత్సను ప్రారంభించవచ్చు.                          *రూపశ్రీ 
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది శరీరానికి కావలసిన పోషకాలను సరిగ్గా అందజేయలేకపోతున్నారు. ఈ క్రమంలో శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని భర్తీ చేయడానికి చాలామంది ఆశ్రయించేది "మల్టీవిటమిన్ టాబ్లెట్లు" (Multivitamin Tablets). అయితే, ఈ టాబ్లెట్లను ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? ఎక్కువగా వాడితే ఎలాంటి నష్టాలు జరుగుతాయి? అనే విషయాలపై ప్రముఖ వైద్యులు డాక్టర్ లక్ష్మి కోన గారు అందించిన పూర్తి వివరాలు ఈ VIDEO ద్వారా తెలుసుకుందాం. మల్టీవిటమిన్ టాబ్లెట్ల ఉపయోగాలు (Uses of Multivitamins) మన శరీరంలో వివిధ అవయవాలు సక్రమంగా పనిచేయడానికి, రోగనిరోధక శక్తి బలంగా ఉండటానికి విటమిన్లు ఎంతగానో తోడ్పడతాయి. మల్టీవిటమిన్ల వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు: పోషకాహార లోపాన్ని భర్తీ చేయడం: మనం తినే ఆహారంలో లోపించిన ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్‌ను ఇవి శరీరానికి అందిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుదల (Immunity Boost): విటమిన్ C, D, మరియు జింక్ వంటి పోషకాలు శరీరంలో ఇమ్యూనిటీని పెంచి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. శక్తిని అందించడం (Energy Levels): విటమిన్ B-కాంప్లెక్స్ శరీరంలో ఆహారాన్ని శక్తి గా మార్చడంలో సహాయపడుతుంది, దీనివల్ల అలసట, నీరసం తగ్గుతాయి. చర్మం, జుట్టు ఆరోగ్యం: విటమిన్ E, బయోటిన్ వంటివి చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఎముకల బలం: క్యాల్షియం మరియు విటమిన్ D కలిసిన మల్టీవిటమిన్లు ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచుతాయి. సరైన డోసేజ్ మరియు వేసుకునే విధానం (Correct Dosage & Guidelines) మల్టీవిటమిన్లను ఎప్పుడు పడితే అప్పుడు, ఎన్ని పడితే అన్ని వేసుకోకూడదు. వాటికంటూ ఒక పద్ధతి ఉంటుంది: మల్టీవిటమిన్ టాబ్లెట్లను సాధారణంగా ఉదయం లేదా मధ్యాహ్నం భోజనం తర్వాత వేసుకోవడం మంచిది. పరగడుపున (ఖాళీ కడుపుతో) వేసుకుంటే కొంతమందిలో కడుపులో మంట లేదా వికారం కలగవచ్చు. కొన్ని విటమిన్లు (A, D, E, K) కొవ్వులో కరిగేవి (Fat-soluble vitamins). కాబట్టి, కొద్దిగా కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత వీటిని వేసుకుంటే శరీరం బాగా గ్రహిస్తుంది. ఎల్లప్పుడూ డాక్టర్ సూచించిన డోస్ మాత్రమే వాడాలి. సొంత నిర్ణయాలతో రోజుకు ఒకటి కంటే ఎక్కువ టాబ్లెట్లు వేసుకోకూడదు. జాగ్రత్త: మితిమీరిన విటమిన్ల వాడకం  చాలామంది మల్టీవిటమిన్లు ఆరోగ్యానికి మంచిదే కదా అని విపరీతంగా వాడుతుంటారు. కానీ, డాక్టర్ లక్ష్మి కోన గారి ప్రకారం, విటమిన్లు ఎక్కువైతే "విటమిన్ టాక్సిసిటీ" (Vitamin Toxicity / Hypervitaminosis) అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా విటమిన్ A, D, E, K లు శరీరంలో పేరుకుపోయి కాలేయం (Liver) మరియు మూత్రపిండాల (Kidneys) పై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, విటమిన్ D ఎక్కువైతే శరీరంలో క్యాల్షియం పెరిగిపోయి కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడే అవకాశం ఉంది. అలాగే విటమిన్ A ఎక్కువైతే తలనొప్పి, వాంతులు మరియు కాలేయ సమస్యలు రావచ్చు. దుష్ప్రభావాలు (Side Effects) సాధారణంగా పరిమితికి లోబడి వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ కొంతమందిలో క్రింది లక్షణాలు కనిపించవచ్చు: కడుపులో అశాంతి, వికారం లేదా వాంతులు. మలబద్ధకం (Constipation) లేదా విరేచనాలు (Diarrhea) - ముఖ్యంగా ఐరన్ (Iron) ఎక్కువగా ఉన్న మల్టీవిటమిన్ల వల్ల మలం నల్లగా రావడం మరియు మలబద్ధకం జరుగుతుంది. నోటిలో వింత రుచి (Metallic Taste). ఇతర మందులతో పరస్పర చర్యలు (Drug Interactions) మీరు ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యల కోసం మందులు వాడుతుంటే, మల్టీవిటమిన్లు వేసుకునే ముందు జాగ్రత్త వహించాలి: యాంటీబయాటిక్స్: మల్టీవిటమిన్లలో ఉండే క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్ కొన్ని రకాల యాంటీబయాటిక్స్ (ఉదాహరణకు Tetracyclines) శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. కాబట్టి వీటి మధ్య కనీసం 2 గంటల వ్యవధి ఉండాలి. బ్లడ్ థిన్నర్స్ (రక్తాన్ని పలచబరిచే మందులు): విటమిన్ K రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీరు రక్తాన్ని పలచబరిచే మందులు (Warfarin వంటివి) వాడుతుంటే, విటమిన్ K ఉన్న మల్టీవిటమిన్లు వాటి పనితీరును దెబ్బతీస్తాయి. చివరిగా:-  మల్టీవిటమిన్ టాబ్లెట్లు అనేవి సమతుల్య ఆహారానికి ప్రత్యామ్నాయం కావు.. సహజసిద్ధమైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరల ద్వారా వచ్చే పోషకాలే శరీరానికి అత్యంత శ్రేష్ఠమైనవి.  మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)