Home

»

Latest News

Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్' మైండ్ బ్లోయింగ్ బిజినెస్.. ట్రైలర్ రాకముందే మాస్ రచ్చ!

Mar 11, 2026

  • హాట్ టాపిక్ గా 'ఉస్తాద్ భగత్ సింగ్' బిజినెస్ 
  • రికార్డు ధరకు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

పవన్ కళ్యాణ్ గత చిత్రం 'ఓజీ' బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు, 'గబ్బర్ సింగ్' కాంబినేషన్ కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి. దీంతో పవన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

అంచనాలకు తగ్గట్టుగానే 'ఉస్తాద్ భగత్ సింగ్' థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ బిజినెస్ రూ.130 కోట్లని సమాచారం.

నైజాంలో రూ.50 కోట్లు, ఆంధ్రాలో రూ.60 కోట్లు, సీడెడ్ లో రూ.20 కోట్లతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.130 కోట్ల బిజినెస్ జరిగినట్లు వినికిడి. వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ రూ.150 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశముంది.

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచింది మూవీ టీమ్. థర్డ్ సింగిల్ 'కాలరే ఎత్తరా'ను మార్చి 12న విడుదల చేస్తుండగా, ట్రైలర్ ను మార్చి 14న విడుదల చేయనున్నారు. అలాగే భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com