LATEST NEWS
  వ్యవసాయ మార్కెట్ కమిటీ నామినేటెడ్ పదవుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చారు. 66 వ్యవసాయ మార్కెట్‌ కమిటీ(ఏఎంసీ)లకు ఛైర్మన్లను ఖరారు చేసింది. వీటిలో 9 చోట్ల జనసేన, 4 చోట్ల బీజేపీ నేతలకు అవకాశం కల్పించారు. 66 ఛైర్మన్‌ పదవుల్లో 17 మంది బీసీలు, 10 ఎస్సీలు ఉన్నారు. ఎస్టీ, మైనార్టీలకు చెందిన వారు ఐదుగురు చొప్పున ఉన్నారు.  మొత్తం 66 ఏఎంసీ ఛైర్మన్‌ పదవుల్లో 35 చోట్ల మహిళలకు అవకాశం కల్పించారు. ఇది వరకే కొన్ని ఏఎంసీలకు ఛైర్మన్లను ఖరారు చేయగా.. తాజాగా మరో 66 మందిని ప్రభుత్వం ప్రకటించింది. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు రైతులకు వారి ఉత్పత్తులకు సరైన రేటులు అందేలా, మార్కెట్ వ్యవస్థను నియంత్రించేలా పనిచేస్తాయి. ఈ కమిటీలు రైతులకు, వ్యాపారులకు మధ్య వారధిగా ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఈ నియామకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది.  
  గోషామహల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి రాజీనామ చేసిన  నేపధ్యంలో, జూబ్లీ హిల్స్ నియోజక వర్గంతో పాటుగా గోషామహల్’నియోజక వర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అవుతుందన్న వ్యూహగానాలు వినిపిస్తున్నాయి. అయితే, బీజేపీకి రాజీనామా  చేసిన రాజా  సింగ్’ ఇంతవరకు  ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామ చేయలేదు. బీజీపీ అధ్యక్షుడికి రాసిన రాజీనామా లేఖను, అసెంబ్లీ స్పీకర్’కు పంపి, తనను అనర్హుడిగా ప్రకటించమని కోరాలని సూచన చేసారు. అయితే, రాజా సింగ్  ప్రతిపాదనను బీజేపీ తిరస్కరించింది. రాజీనామా చేయాలనుకుంటే రాజా సింగ్’  నేరుగా అసెంబ్లీ స్పీకర్’కే టం రాజీనాం లేఖను సంర్పించాలని, బీజేపీ అధికార ప్రతినిధులు స్పష్టం చేసారు. అలాగే, రాజసింగ్’ రాజీనామను తిరస్కరించి సందర్భంలోనూ బీజేపీ అధ్యక్షుడు, అనర్హత వేటు అంశాన్ని ప్రస్తావించలేదు. రాజా సింగ్ పార్టీ కోర్టులోకి కొట్టిన బండిని, బీజేపీ  తిరిగి  ఆయన కోర్టులోకి తిప్పికొట్టింది.  అయితే,పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి  రాజా సింగ్ చేసిన రాజీనామాను, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించి వారం రోజులు పైగానే అయింది, అయినా, రాజా సింగ్ ఇంత వరకు ఎమ్మెల్యే పదవికి సంబంధించి పెదవి విప్పలేదు. మూడుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు,పార్టీకి కృతజ్ఞతలు చెప్పారు. బీజేపీకి రాజీనామా చేసినా హిదుత్వ సిద్దాంతాన్ని వదలనని, వేరే పార్టీలో చేరనని  చెప్పారు. కార్యకర్తలకు ఉద్భోదలు చేసారు.,కానీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సంబంధించి మాత్రం ఇంత వరకు మాట్లాడ లేదు. రాజీనామా చేసే సంకేతాలు కూడా కనబడడం లేదు. మరోవంక  బీజేపీ కూడా వత్తిడి చేయడం లేదు. సో... రాజీనామా చేస్తారా ? స్వతంత్ర అభ్యర్ధిగా కొనసాగుతారా, అనేది ఇంకా స్పష్టం కాలేదు. అదొకటి అలా ఉంటే, ఒక వేళ రాజా సింగ్’ స్పీకర్ ఫార్మేట్’లో రాజీనామా సమర్పించినా, స్పీకర్’ను స్వయంగా కలిసి రాజీనామా ఆమోదించమని కోరినా,స్పీకర్’ వెంటనే రాజీనామాను ఆమోదిస్తారా? అంటే, అది కూడా జరగక పోవచ్చని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే, బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయం ఎటూ తేలకుండా వుంది. స్పీకర్’ వెంటనే నిర్ణయం తీసుకోవాలని, న్యాయ స్థానాలు సూచించినా, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పడు రాజ్ సింగ్ రాజీనామాను తక్షణం ఆమోదిస్తే, స్పీకర్’, విమర్శలను ఎదుర్కోనవలసి వస్తుంది. అందుకే,  రాజా సింగ్ రాజీనామా చేసినా, స్పీకర్ ఆమోదించక పోవచ్చని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపధ్యంలో గోషామహల్ నియోజక వర్గానికి, ఉప ఎన్నిక వచ్చే  అవకాశం ఇంచుమించుగా లేనట్లే అంటున్నారు. ఒక  విధంగా ఇది, రోగి కోరుకున్నది  వైద్యుడు ఇచ్చింది ఒకటే అన్నట్లుగా ఉందని  పరిశీలకులు పేర్కొంటున్నారు.  కారణాలు వేరైనా, ఎవ్వరూ కూడా ఉప ఎన్నికను కోరుకోవడం లేదు. అవును,అటు రాజా సింగ్ ఉప ఎన్నిక కోరుకోవడం లేదు, బీజేపీ పట్టుపట్టే పరిస్థితి లేదు.. అన్నిటికంటే ముఖ్యంగా అంతిమ తీర్పు ఇవ్వవలసిన స్పీకర్, తక్షణ నిర్ణయం తీసుకోక పోవచ్చని అంటున్నారు.అందుకే ..గోషామహల్ ఉప ఎన్నికపై ఆశలు పెట్టుకున్న మాధవీలత గోషామహల్ కాకపోతే జూబ్లీ హిల్స్’ అంటూ అటుగా చూస్తున్నారు. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా గెలుస్తా, అసెంబ్లీలో అడుగు పెడతా అంటన్నారు.అయితే ఆమె ఏకపక్షంగా చేస్తున ప్రకటనల విషయంలో ఇప్పటికీ పార్టీలో వ్యతిరేకత వ్యక్త మవుతోంది. నిజానికి, పార్టీ నాయకత్వం కూడా ఇప్పటికే ఆమెను, హెచ్చరించినట్లు చెపుతున్నారు.మాధవీ లత విష్యం ఎలా ఉన్నా, రాజా సింగ్ రాజీనామా, గోషామహల్ ‘  ఉప ఎన్నిక  రెండూ అనుమానమే, అంటున్నారు.
  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోమారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్,  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో పాటుగా, బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్’గా విమర్శనా అస్త్రాలు సంధించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మీడియాతో ఇష్టాగోష్టిగా, మాట్లాడారు. ఈ సందర్భంగా,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కడుపునిండా విషం పెట్టుకుని మాట్లాడుతోందని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి రాష్ట్రప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని,ఆయన ఇచ్చిన స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అలాగే, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్, రాష్ట్ర ప్రయోజనలసధనకోసం ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపవచ్చని అన్నారు. అలాగే, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖలు రాయడం కాదని, ప్రణాళికతో ముందుకు రావాలని సూచనలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ను కాపాడేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో, కేంద్ర మంత్రి   కిషన్రెడ్డితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే అదే సమయంలో, మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కేటీఆర్’కు గట్టిగా చురకలు అంటించారు. ఆయనపై ఘాటైన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన, కేటీఆర్’ ను ఉద్దేశించి, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీకి వెళ్లకుండా ఫామ్ హౌస్ కి వెళ్లాలా? అంటూ ఘాటైన కౌంటర్ ఇచ్చారు. అలాగే, కేటీఆర్’ పై,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా తీవ్రమైన ఆరోపణలు చేసారు. కేటీఆర్ గంజాయి బ్యాచ్ అని.. అతని చుట్టూ ఉండేవాళ్లు డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపించారు. డ్రగ్స్ తీసుకునే కేటీఆర్’తో తానేం మాట్లాడతానని ఎద్దేవా చేశారు. వైట్ ఛాలెంజ్ విసిరితే పారిపోయిన వ్యక్తి కేటీఆర్ అంటూ చురకలు అంటించారు. అలాగే, దుబాయ్‌లో మాజీ మంత్రి కేటీఆర్ స్నేహితుడు కేదార్ డ్రగ్స్ తీసుకుని చనిపోయాడని ఇందుకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టును తెలంగాణకు తెప్పించినట్లు తెలిపారు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోలాగా తాము ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయలేదని, చేయబోమని అన్నారు.  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో వారి కుటుంబసభ్యులే బయటికి వచ్చి చెప్తున్నారని ఎద్దేవా చేసారు. అలాగే, కేసీఆర్ కుటుంబ కలహాల అంశాన్ని ముఖ్యమంత్రి వదిలి పెట్టలేదు. ప్రతిపక్షనేత పదవి ఇవ్వాలని కేసీఆర్‌ను ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ అడుగుతున్నారని, కేటీఆర్‌ కోరికను కేసీఆర్‌ ఒప్పకోవడం లేదని ముఖ్యమంత్రి అన్నారు. సొంత వివాదాలతోనే కేసీఆర్‌ కుటుంబానికి సరిపోతోందని,కేటీఆర్‌ నాయకత్వాన్ని కవిత ఒప్పుకోవట్లేదని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య రగులుతున్న జల వివాదాలకు సంబంధించి ఢిల్లీలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల నడుమ జరిగిన చర్చల విషయాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో పర్యటిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రుల సమావేశంలో మూడు అంశాలు పరిష్కారానికి వచ్చాయని తెలిపారు. బనకచర్ల సహా అన్ని అంశాలపై అధ్యయన కమిటీని వేశామని, కమిటీ పరిష్కరించలేని అంశాలపై ముఖ్య మంత్రుల స్థాయిలో మరో మారు చర్చిస్తామని చెప్పారు.  నదుల అనుసంధానం కోసం కేంద్రం ప్రయత్నిస్తోందని, ఇచ్చంపల్లి నుంచి కావేరికి అనుసంధించాలనే ప్రతిపాదన ఉందని పేర్కొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై తమకో వ్యూహం ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. 2018లో కేసీఆర్‌ పంచాయితీ రాజ్‌ చట్టంలో మార్పులు చేశారని, 50శాతం రిజర్వేషన్లు వద్దని చట్టంలో మార్పులు చేశారని, 2014 ముందు 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 23 శాతానికి కుదించారని తెలిపారు. రిజర్వేషన్ల కుదింపును సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చామని అన్నారు. ఆర్డినెన్సుపై అవగాహన లేకుండా చాలామంది మాట్లాడుతున్నారని ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే ఉన్నాయని, ముస్లింలకు బీసీ-ఇ గ్రూపులో రిజర్వేషన్లు ఉన్నాయని, బీజేపీ రాష్ట్రాల్లోనూ ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. గుజరాత్‌, యూపీ, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేసిన తర్వాతే కిషన్‌రెడ్డి మాట్లాడాలని రేవంత్ రెడ్డి సూచించారు.  
  బీఆర్ఎస్ పాలనలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన లుచ్చా పనుల ఫలితంగానే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల నుండి ఈ లవ్ లెటర్ (నోటీసులు) అందుకోవాల్సి వచ్చింది. నాతో పాటు నా కుటుంబ సభ్యుల, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచుడు కేసీఆర్. భార్యాభర్తలు పడక గదిలో మాట్లాడుకునే మాటలను కూడా ట్యాప్ చేసి ఎంతో మంది జీవితాలను నాశనం చేసిన దుర్మార్గ కుటుంబం కేసీఆర్ దే. సిట్ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తా. నాకు తెలిసిన, నా దగ్గరున్న సమాచారాన్ని పోలీసులకు అందజేస్తాని కేంద్ర మంత్రి తెలిపారు.
  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం క్లైమాక్స్ కు చేరింది. బీఆర్ఎస్ పాలనలో అనేక మంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయనే అంశంపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్ట్ గేషన్ టీం (సిట్) అధికారులు ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, ప్రముఖులను విచారణకు పిలిచి స్టేట్ రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే.  తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తొలుత తెరపైకి తీసుకొచ్చిన నాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. బండి సంజయ్ తోపాటు ఆయన పీఆర్వో పసునూరు మధు, పీఏ బోయినిపల్లి ప్రవీణ్ రావు, మాజీ పీఏ పోగుల తిరుపతికి కూడా నోటీసులు అందజేసింది.  ఈనెల 24న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నందున ఆయన వద్దకే వచ్చి స్టేట్ మెంట్ ను రికార్డు చేయాలని పోలీసులు నిర్ణయించారు. అందులో భాగంగా బండి సంజయ్ సూచన  మేరకు హైదరాబాద్ లోని దిల్ కుష్ ప్రభుత్వ అతిథి గ్రుహంలో విచారణ జరపాలని పోలీసులు నిర్ణయించారు. బండి సంజయ్ తోపాటు పీఆర్వో పసునూరు మధు, పీఏ బోయినిపల్లి ప్రవీణ్ రావు, మాజీ పీఏ పోగుల తిరుపతి స్టేట్ మెంట్లను కూడా రికార్డు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వీరంతా అదే రోజు విచారణకు సిద్ధంగా ఉండాలని పేర్కొంటూ సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు కొద్దిరోజుల క్రితమే బండి సంజయ్ వ్యక్తిగత డ్రైవర్ రమేశ్ ను సిట్ పోలీసులు విచారణకు పిలిచి స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్న సంగతి విదితమే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయట పెట్టిందే బండి సంజయ్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ మొట్టమొదటగా గళం విన్పించిన నేత బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలో కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బండి సంజయ్ అనేక ఉద్యమాలు, ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తూ పాలకులకు కొరకరాని కొయ్యలా మారిన సంగతి విదితమే. ఈ నేపథ్యలో బండి సంజయ్ ను కట్టడి చేయాలని భావించిన నాటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు ఒడిగట్టింది. తనను నేరుగా ఎదుర్కొనే దమ్ములేక కేసీఆర్ ప్రభుత్వం తనతోపాటు తన కుటుంబ సభ్యుల, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ నీచానికి ఒడిగడుతోందని 2022లోనే బండి సంజయ్ సంచలన అరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనతోపాటు నాటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సహా జడ్జీల, ప్రతిపక్ష పార్టీల నాయకుల, సినీ తారలతోపాటు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ పలుమార్లు ఆరోపించారు.   ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం ద్వారానే టెన్త్ పేపర్ లీక్ అనే తప్పుడు కేసు బనాయించి అర్ధరాత్రి తన నివాసంపై దాడి చేసి అరెస్ట్ చేశారని బండి సంజయ్ పేరొన్న సంగతి తెలిసిందే. కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో 317 జీవోను సవరించాలంటూ చేపట్టిన దీక్ష జరగకుండా నిలువరించేందుకు పోలీసులు  శతవిధాలా ప్రయత్నించి చివరకు టియర్ గ్యాస్ ఆఫీసు గేటు బద్దలు కొట్టి, ఆఫీస్ అద్దాలు ధ్వంసం చేసి బండి సంజయ్ ను, బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. భార్యాభర్తలు పడక గదిలో మాట్లాడుకునే సంభాషణలను కూడా ట్యాప్ చేసి అనేక మంది జీవితాల్లో చిచ్చు పెట్టిన దుర్మార్గులు కేసీఆర్, కేటీఆర్ అంటూ బండి సంజయ్ అనేక సభల్లో, మీడియా వేదికల ద్వారా ఆరోపించిన విషయం అందరికీ తెలిసిందే.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేపడుతున్న సిట్ పోలీస్ వర్గాలు నాడు బండి సంజయ్ చెప్పిందంతా నిజమేనని చెబుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం తన ప్రత్యర్థులతోపాటు జడ్జీల, సినీ తారల ఫోన్లను కూడా ట్యాప్ చేసిందని, చివరకు బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ కు గురయ్యాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ ను ఈనెల 24న సిట్ విచారించడంతోపాటు ఆయన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు బండి సంజయ్ సైతం తన వద్ద ఉన్న సమాచారాన్ని సిట్ ముందుంచాలని భావిస్తున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
Cast: Manoj Chandra, Monika T, Usha Bonela, Benerjee, Ravindra Vijay, Babu Mohan, Abhiram Mahankali, Prem Sagar, Praveena Paruchuri Crew:  Written by Guru Kiran Bathula Cinematography by Petros Antoniadis Edited by R. Kiran Music by Mani Sharma, Varun Unni Directed by Paruchuri Praveena Produced by Paruchuri Praveena, Paruchuri Gopalakrishna Presented by Rana Daggubati  Paruchuri Praveena produced films like C/O Kancherapalem, Uma Maheswara Ugra Roopasya. She debuted as a director with Kothapallilo Okappudu. The movie introduced leading actors Manoj Chandra, Monika T, Usha Bonela. Rana Daggubati presented the film under his Spirit Media. As the movie released on 18th July, let's discuss about it in detail.  Plot:  Ramakrishna (Manoj Chandra) runs a stage dancing troupe but he also works with a money lender Appanna (Ravindra Vijay). He collects money from the villagers who owe money for him. Zamindar Reddy (Benerjee) is a staunch enemy of Appanna, due to his character and his community. Ramakrishna loves Reddy's granddaughter Savitri (Monika). To get closer to her, he tries to talk to Adhilakshmi (Usha Bonela) aka Andam. But her looks are quite contrast to her name. So, Ramakrishna feels agitated when villagers connect her with him. Ramakrishna wants Savitri to dance on stage in a nearby village and hence, he is going around Adhilakshmi.  While Adhilakshmi is a good dancer, Savitri takes it as a challenge and learns from him. But she declines to dance on stage and Adhilakshmi asks her to talk to Ramakrishna directly. She accepts at first and then declines, Ramakrishna waits for her. So, Adhilakshmi goes to tell him about it but villagers think they are in relationship and force marriage. Appanna stops it and promises to Ramakrishna that he will marry Savitri, only. But he dies on his way, what happens next? Watch the movie to know more.  Analysis:  The movie tries to blend blind beliefs and belief in God, that too, in villages, satirically. While the idea seems to be good on paper, it doesn't translate to the big screen in an effective way. With an interesting premise like stage dancer falling for zamindar of the village's grand daughter, the film fails to engage audiences in romantic portions. The selection of leading ladies doesn't really suit the story as well.  While it doesn't need stunningly beautiful ladies, it needed to present them even more attractive manner. Even in an artistic or parallel cinema, the need for actresses to have some sort of an attraction works better, especially, for romance at its core. Even the satire doesn't really work as the premise and set-up for the satire haven't been laid effectively.  Writing needed to showcase how blindly villagers tend to believe in either God men or legends about God descending through someone after their death. This kind of premise and romance going hand-in-hand would have worked big time for this film. But the transition into this issue from what presumably looked like a love story just did not sit fit into it. Also, the writing did not really proceed to have any stand-out moments that really hit the satire out of park.  Even the execution looked poor as the camera work using anamorphic lens did not translate the output well to the screen. Everything that could have worked on paper, did not work translate to the screen. Manoj Chandra is good in several scenes but he needs a little bit more training and exposure in monologue delivery. Benerjee and Ravindra Vijay did their best but couldn't really hold it all together in this Sandcastle.  Bottomline:  Movie needed a lot more focus in writing and execution for the premise, hence, ends up being boring one.  Rating: 2/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Organisation recommends viewers' discretion. 
Superstar Rajinikanth and Kamal Haasan have been friends from the beginning of their respective careers. Kamal, even shared that he went first to Rajinikanth before starting his Rajya Sabha MP stint. Reports suggest that after K. Balachander, it is Rajini, who is so close to Kamal, that he shares everything with him.  Now, reports further suggest that Rajinikanth has started mediating between director Shankar and Lyca Productions for the completion of Indian 3. After debacle of Indian 2 and Game Changer, Shankar is unable to demand huge budget in his normal style and Lyca Productions is also not ready to spend so much.    Hence, Rajinikanth is trying to bring Shankar and Lyca Productions on to same page for completion of the project. He is doing this not just for Kamal but for Subaskaran, owner of Lyca Prodcutions. As the production house produced 2.0, Darbar, Lal Salaam, Vettaiyan with him, he has a good friendship with them.  He even attended Ponniyin Selvan pre-release event due to his respect for Mani Ratnam and Subaskaran. Now, we though he has issues with Shankar, he met the director and asked him to consider finishing Indian 3 in lesser budget. While Shankar asked for Rs.6-8 crores production budget, Subaskaran did not grant so much, it seems.  Currently, Rajinikanth is trying his best to convince both parties and let Indian 3 be released. Kamal Haasan, on the other hand, is busy with his MP duties and after a debacle like Thug Life, he is being careful about his next with Anbarivu- fight choreographers. He will decide about its shoot progress post taking MP oath, say reports.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుకు 'విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ మరియు అక్రమ రవాణా నివారణ చట్టం' (COFEPOSA) కింద ఏర్పాటైన అడ్వైజరీ బోర్డు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది శిక్ష కాలంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే హక్కును కూడా నిరాకరించింది. దీంతో ఆమె ఏడాది పాటు జైలు నుంచి విడుదల అయ్యే ఛాన్స్ లేదు. (Ranya Rao)   మార్చి 1న బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌ఫోర్ట్‌లో దుబాయ్ నుంచి రూ.12.56 కోట్ల విలువ చేసే 14.2 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు నటి రన్యారావు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె సహచరుడు తరుణ్ కొండూరు రాజు, అలాగే జ్యువెలర్ సాహిల్ జైన్‌ కూడా అరెస్ట్ అయ్యారు. తాజా తీర్పు ప్ర‌కారం ఈ ముగ్గురు నిందితులు ఏడాది పాటు జైల్లోనే ఉండాల్సిఉంది. ఈ కేసులో ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి విచార‌ణ‌లు జ‌రుగుతాయ‌ని బోర్డు పేర్కొంది. ఇలా ఏడాది వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని తెలిపింది.   
Hari Hara Veera Mallu starring Power Star Pawan Kalyan, Bobby Deol, Nidhhi Agerwal is gearing up for a wide release on July 24th. Nidhhi Agerwal shared exciting insights into her role as Panchami from the film in press interaction. She described the character as a blessing, rich with contrasting shades.  Nidhhi's transformation into Panchami was meticulous, requiring nearly two hours daily for her elaborate costumes and jewelry. She expressed immense privilege working alongside Pawan Kalyan, noting, "Doing a hundred films is equal to doing just one with him," a testament to his unmatched stardom.   She stated that the film's tagline, "Sword vs Spirit," perfectly encapsulates its core — a conflict of ideals and identity. Nidhhi also embraced intense training for the role, including fight sequences, horse riding, and Bharatanatyam, pushing her boundaries as a performer.  Nidhhi highlighted the unwavering commitment of the cast and crew, confident that their dedication will shine through. She likened the film's blend of a fictional character in a real historical setting to an "Indian version of Indiana Jones with royal intensity." With Oscar-winner M.M. Keeravani's musical genius promising to elevate every scene, "Hari Hara Veera Mallu" is poised to elevate her career to next level, opined the actress.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
వరుణ్ తేజ్(Varun Tej),హరీష్ శంకర్(Harish Shankar)కాంబినేషన్ లో వచ్చిన 'గద్దలకొండ గణేష్' మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో దర్శకుడు అవ్వాలనే లక్ష్యంతో పాటు, కరుడుగట్టిన రౌడీని సినిమాతో మంచి వ్యక్తిగా మార్చేసే అభి క్యారక్టర్ లో నటించి, మెప్పించిన తమిళ నటుడు అథర్వ(Atharvaa). ప్రముఖ తమిళ హీరో మురళి(Murali)నటవారసుడిగా, 2010 లో 'బాణా కాత్తడి' అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసాడు.  విభిన్నకథాంశంతో కూడిన చిత్రాల్లో చేసే హీరోగా గుర్తింపు పొందిన అథర్వ రీసెంట్ గా “డీఎన్ఏ' (Dna)అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ థ్రిలర్ గా తెరకెక్కిన ఈ మూవీలో అథర్వ సరసన 'నిమిషా సజయన్'(Nimisha Sajayan)హీరోయిన్ గా చేసింది. జూన్ 20న తమిళంలో విడుదలై పర్వాలేదనే టాక్ తెచ్చుకోగా, రేపు అంటే జులై 18 న “మై బేబీ”పేరుతో తెలుగులో విడుదల కాబోతుంది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే తమిళంతో పాటు తెలుగు వెర్షన్ లో జులై 19 నుంచి 'జియో' వేదికగా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది. ఈ విషయాన్నీ సదరు సంస్థ అధికారంగా ప్రకటించింది. దీంతో కేవలం ఒక్క రోజు గ్యాప్ లోనే తెలుగులో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేస్తుండటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 'మై బేబీ' ని ఒలింపియా మూవీస్ పతాకంపై 'జయంతి అంబేద్ కుమార్, అంబేద్ కుమార్ సంయుక్తంగా నిర్మించగా నెల్సన్ వెంకటేసన్(Nelson venkatesan)దర్శకుడిగా వ్యవహరించాడు. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించడం జరిగింది. తెలుగులో ప్రముఖ నిర్మాత, పాత్రికేయుడు 'కొండేటి సురేష్' రిలీజ్ చేస్తున్నాడు.     
  పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన భారీ చిత్రం 'హరి హర వీరమల్లు' జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడి.. ఎట్టకేలకు మరో వారం రోజుల్లో థియేటర్లలో అడుగుపెట్టనుంది. నిజానికి ఈ సినిమా ఈసారైనా విడుదలవుతుందా లేక మళ్ళీ వాయిదా పడుతుందా? అని భయపడిన అభిమానులు కూడా ఉన్నారు. అయితే ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. ఇక వీరమల్లు ఆగమనం ఫిక్స్ అయింది. ఇలాంటి సమయంలో మూవీ టీం ఫ్యాన్స్ కి ఓ చిన్న షాక్ ఇచ్చింది. ఈసారి సినిమాని వాయిదా వేయలేదు కానీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఒకరోజు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. (Hari Hara Veera Mallu)   'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతి లేదా విజయవాడలో నిర్వహించాలని మొదట మేకర్స్ భావించారు. ఏవో కారణాల వల్ల ఆ రెండు చోట్ల కాకుండా.. జూలై 20న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ వైజాగ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతున్నట్లు సమాచారం. జూలై 21న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈవెంట్ జరపాలని మేకర్స్ నిర్ణయించారట. ఇది ఫ్యాన్స్ కి చిన్నపాటి షాక్ అని చెప్పవచ్చు. శిల్పకళా వేదిక అంటే భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశముండదు. పోలీసులు చాలా తక్కువ మందికే అనుమతి ఇచ్చే అవకాశముంది. డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి సినిమా ఈవెంట్ భారీస్థాయిలో జరగకపోవడం అభిమానులకు నిరాశ కలిగించే విషయమే.  
వరల్డ్ సినిమాలని ఫాలో అయ్యే సినీ ప్రేమికులకి ప్రఖ్యాత దర్శకుడు 'క్రిస్టోఫర్ నోలన్'(Christopher Nolan)సినీ జర్నీ గురించి తెలిసే ఉంటుంది. 1998 లో రిలీజైన 'ఫాలోయింగ్' అనే సినిమాతో దర్శకుడిగా,రచయితగా, నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన  క్రిస్టోఫర్ ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన చిత్రాలకి దర్సకత్వం వహించి ప్రేక్షకుల మనస్సులో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు. 2023 లో అణుబాంబు సృష్టికర్త రాబర్ట్  ఒప్పెన్ హైమర్'(J. Robert Oppenheimer)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన  'ఒప్పెన్ హైమర్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం 'ది ఆడెస్సి'(The Odyssey)అనే చిత్రాన్ని తెరక్కిస్తున్నాడు. ఇతిహాసంతో కూడిన యాక్షన్  ఫాంటసీ గా   తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది జులై 17 న రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు మేకర్స్  అధికారకంగా ప్రకటించారు. 'అమెరికా'(America)లోని ఐమాక్స్ 70 mm స్క్రీన్స్ 'ది ఆడెస్సి' టికెట్స్ కి  సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్  ఈ రోజు నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు, సంవత్సరం ముందే అడ్వాన్స్ టికెట్స్ ని ప్రారంభించిన సినిమాగా కూడా  'ది ఆడెస్సి' రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో హీరోగా 'క్రిస్టోఫర్' నే చేస్తుండగా మాట్ డామన్, టామ్ హాలండ్, అన్నే హాథవే కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. 250 మిలియన్ డాలర్స్ తో నిర్మాణం జరుపుకుంటుండగా, ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.      
Christopher Nolan has become a huge brand name for quality and original content. He announced his next film after Oppenheimer, The Odyssey, recently and the hype for this film is unprecedented. He is adapating poet Homer's classical poem Odyssey based on Russian Historical figures.  The movie is being shot with IMAX cameras and bookings have been opened for IMAX 70MM format screens in US, Canada, Australia. At many locations, the tickets are already 80% sold out. This is shocking entire world as the movie is slated for release on 17th July, 2026, exactly in an year.  IMAX opening tickets for the film, so early, is unprecedented. On top of it, the movie tickets being booked at such fast rate is adding to the surprise and shock. Matt Damon, Tom Holland, Anne Hathaway, Zendaya, Lupita Nyongo, Robert Pattinson, Charlize Theron, and Jon Bernthal are cast in this ensemble historical.  More than the cast, it is Christopher Nolan, who is able to create such rush at the ticket windows. A year before release, Hollywood films are sure to release on the day and date around the world. But Indian films lack such clarity even with unlimited and unprecedented budgets.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
అనుష్క(Anushka),రష్మిక మందన్నా(Rashmika Mandanna).. ఈ ఇద్దరు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ప్రవేశించి   తమ అద్భుతమైన నటనతో టాప్ హీరోయిన్ఫ్ గా ఎదిగారు. హీరోలకి దీటుగా తమ కంటు ప్రత్యేకమైన అభిమాన గణాన్ని కూడా సంపాదించుకోవడం జరిగింది. అందుకే బడా నిర్మాతలు ఈ ఇద్దర్ని   ప్రధాన పాత్ర చేసుకొని భారీ వ్యయంతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంలోనే అనుష్క, రష్మిక మధ్య పోటీ ఏర్పడబోతుందనే వార్తలు వస్తున్నాయి. అనుష్క ప్రధాన పాత్రలో విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్(Krish)దర్శకత్వంలో 'ఘాటీ'(Ghaati)అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబోలో 'వేదం' వచ్చి ఉండటం, ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, అనుష్క లుక్ తో  'ఘాటీ' పై అందరిలోను అంచనాలు పెరిగాయి. 'అరుంధతి' లా 'ఘాటీ' బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయమని అభిమానులు అయితే బలంగానే   నమ్ముతున్నారు. ప్రస్తుతం 'విఎఫ్ఎక్స్' పనుల్లో ఉన్న ఈ మూవీ,సెప్టెంబర్ 5 న  రిలీజ్ కాబోతుందనే  వార్తలు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే డేట్ కి రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ది గర్ల్ ఫ్రెండ్'(The Girl friend)కూడా రిలీజ్ కాబోతుందనే చర్చ చాలా జోరుగానే నడుస్తుంది. ఈ మేరకు  మేకర్స్ త్వరలోనే  అధికారంగా ప్రకటించనున్నారని కూడా అంటున్నారు. పుష్ప 2 , యానిమల్, చావా, కుబేర లతో రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం, అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 'గర్ల్ ఫ్రెండ్'  ని నిర్మిస్తుండంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచార చిత్రాల ద్వారా ఈ చిత్ర కథపై క్యూరియాసిటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అనుష్క, రష్మిక ఒకేసారి పోటీపడితే ఎవరు పై చేయి సాధిస్తారనే ప్రచారం సినీ సర్కిల్స్ లో జరుగుతుంది.  నాగార్జున(Nagarjuna),పూరి జగన్నాధ్(Puri jagannadh)కాంబోలో 2005 లో వచ్చిన 'సూపర్' మూవీతో అనుష్క సినీ రంగ ప్రవేశం చేయగా, నాగశౌర్య హీరోగా 2018 లో వచ్చిన ఛలో మూవీతో 'రష్మిక' హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ ఇద్దరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారే.       
  కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ పేరు ఓ సంచలనంలా వినిపించింది. 2016లో వచ్చిన 'పెళ్లి చూపులు'తో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న విజయ్.. ఆ మరుసటి ఏడాది వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. అదే జోష్ ని కంటిన్యూ చేస్తూ.. 2018లో వచ్చిన 'గీత గోవిందం'తో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఇక విజయ్ కి తిరుగులేదని భావించారంతా. అందుకు తగ్గట్టే 2018 లోనే వచ్చిన 'ట్యాక్సీవాలా'తో మరో సక్సెస్ ను చూశాడు. కానీ ఆ తర్వాత నుంచి విజయ్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. 2019 నుంచి విజయ్ ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు. ఈ ఆరేళ్లలో విజయ్ నుంచి ఐదు సినిమాలు రాగా.. అవన్నీ బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గానే మిలిగాయి. ఈ జూలై 31న 'కింగ్‌డమ్'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు విజయ్. ఈ సినిమాతోనైనా కమ్ బ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. కమ్ బ్యాక్ కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన చిత్రం 'కింగ్‌డమ్'. విడుదలకు ఇంకా రెండు వారాలే ఉంది. అయినప్పటికీ సినిమాకి రావాల్సినంత బజ్ రావట్లేదు. నిజానికి విజయ్-గౌతమ్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలి. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమాపై ఆశించిన హైప్ రాలేదు. దానికి ప్రధాన కారణం విజయ్ వరుస ఫ్లాప్స్ లో ఉండటమని చెప్పవచ్చు. అలాగే, 2019లో వచ్చిన 'జెర్సీ'తో ఆకట్టుకున్న డైరెక్టర్ గౌతమ్.. తన నెక్స్ట్ తెలుగు మూవీ కోసం ఏకంగా ఆరేళ్ళు టైం తీసుకున్నాడు. దాంతో ప్రేక్షకుల్లో 'జెర్సీ' ఇంపాక్ట్.. అప్పుడున్న స్థాయిలో ఇప్పుడు లేదు. నిజానికి 'కింగ్‌డమ్' మూవీ.. విజయ్ గత చిత్రం 'ఫ్యామిలీ స్టార్' కంటే ముందు రావాలి. కానీ, కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. అది కూడా 'కింగ్‌డమ్' బజ్ పై ప్రభావం చూపించింది. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలిపేలా, జనరల్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేలా.. 'కింగ్‌డమ్' నుంచి సరైన కంటెంట్ కూడా రాలేదు. ఎప్పుడో ఐదారు నెలల క్రితం ఎన్టీఆర్ వాయిస్ తో ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. దానిని ఇప్పటికే జనాలు మర్చిపోయారు. పేరుకి ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ.. విడుదలైన ఒకట్రెండు పాటలు ఆ స్థాయిలో లేవు. సినిమా విడుదలకు ఇంకా రెండు వారాలే ఉంది. ఇంతవరకు ట్రైలర్ రాలేదు. సాంగ్స్ అన్నీ విడుదల కాలేదు. ప్రమోషన్స్ లో జోష్ లేదు. చూస్తుంటే.. అసలు 'కింగ్‌డమ్' పట్ల నిర్మాతలు కూడా అంత కాన్ఫిడెంట్ గా లేరా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.   'కింగ్‌డమ్' సినిమాకి నాగవంశీ నిర్మాత. నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తన సినిమాలకు అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తాడు. సినిమా నచ్చితే చాలు.. రిలీజ్ కి ముందు ఆ సినిమా గురించి మీడియా ముందు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు. కానీ, 'కింగ్‌డమ్' విషయంలో నాగవంశీలో ఏమంత కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో.. తాను నిర్మించిన 'కింగ్‌డమ్' కంటే కూడా.. తాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న 'వార్-2' గురించే ఎక్కువ కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. పైగా విజయ్ దేవరకొండ మీద జనాలు జాలి చూపించాలని ఆయన మాట్లాడటం మరింత ఆశ్చర్యం కలిగించింది. విజయ్ ఫ్లాప్స్ లో ఉన్నాడు, ఆయనను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు, ఆయన మీద జనాలు జాలి చూపించాలి అన్నట్టుగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ వ్యాఖ్యలు చేయడం విశేషం. సినిమా ఆలస్యమవ్వడం, సరైన కంటెంట్ రాకపోవడం, ప్రమోషన్స్ లో దూకుడు లేకపోవడం, నాగవంశీలో మునుపటి కాన్ఫిడెన్స్ లేకపోవడం.. ఇవన్నీ కలిసి 'కింగ్‌డమ్'కి రావాల్సినంత హైప్ లేకుండా చేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే హిట్ కోసం విజయ్ మళ్ళీ ఎదురుచూడక తప్పేలా లేదు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
విడాకులు.. అనే మాట అంత సులభమైనది ఏమీ కాదు. జీవితాంతం కలిసుండాలని ఒక వ్యక్తితో కొంత కాలం ఉండి ఆ తరువాత వారి నుండి విడిపోవడం అనేది మానసికంగా చాలా బాధాకరం. ఇలా విడిపోవడం వల్ల ఎప్పుడూ ఒకరిని మిస్ అవుతున్న భావన ఉంటుంది. అలాంటి పరిస్థితిలో పాత సంబంధం వల్ల అయిన  గాయాన్ని మాన్పుకోకుండా,  దాన్ని మర్చిపోకుండానే  కొన్ని కారణాల వల్ల  కొత్త వ్యక్తితో  మళ్లీ బంధంలోకి వెళ్లడానికి సిద్దపడుతుంటారు. వైవాహిక బంధం జీవితంలో  ముఖ్యమైన భాగం. దానిని మొదలుపెట్టినప్పటి నుండి ముగించే వరకు చాలా జాగ్రత్త అవసరం. జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం నుండి విడిపోయారు అంటే అర్థం అది  చెడు సంబంధం అని. ఆ బంధంలో గాయపడిన వారికి ఆ బందం  మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఒంటరిగా ఉండటం అంత సులభం కాదు.  ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒంటరితనాన్ని నివారించడానికి తొందరపడి కొత్తం సంబంధాన్ని ప్రారంభించడం కూడా మంచి ఆలోచన కాదు. కాబట్టి విడిపోయిన తర్వాత మళ్ళీ కొత్త సంబంధంలోకి రావడానికి  మానసికంగా  సిద్ధంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడం ముఖ్యం. విడిపోయిన తర్వాత..  భార్యాభర్తల బంధం చాలా భావోద్వేగమైనది. ఆ బంధంలో ఇద్దరు వ్యక్తులు చాలా ఓపెన్ అవుతారు. దురదృష్ణ వశాత్తు చాలా నిజాయితీగా ఉండి గాయపడిన వ్యక్తులు ఆ బంధం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను అంత తొందరగా మరచిపోలేరు. కానీ కొందరు మాత్రం వాటిని మరచిపోవడానికి మరొక సంబంధాన్ని ప్రారంభించాలని అనుకుంటారు.  ఈ పొరపాటు ఎప్పుడూ చేయవద్దని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు. విడిపోవడాన్ని మరచిపోవడానికి ఏర్పడిన సంబంధాలు సాధారణంగా కాలక్రమేణా విషపూరితంగా మారుతాయి. కోల్పోయిన భావన.. ఎవరితోనైనా అయినా సరే.. చాలా అపురూపమైన సమయాన్నిగడిపి ఆ తర్వాత కారణాల వల్ల విడిపోతే..  వారి మనస్సు నుండి సదరు వ్యక్తులను  తొలగించడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ  ఒక విషయం.. ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక టాపిక్ లో విడిపోయిన భాగస్వామిని గుర్తు చేసుకుంటూ వారి గురించి మాట్లాడుతూ ఉంటే..  కొత్త సంబంధానికి సిద్దంగా లేనట్టేనని గుర్తించాలి. ఒంటరితనం.. ఆరోగ్యకరమైన సంబంధం కావాలంటే, ఒంటరిగా ఉండటం, ఒంటరితనాన్ని కూడా  ఆనందించడం నేర్చుకునే వరకు కొత్త బంధంలోకి వెళ్లకూడదు.  చాలా కాలంగా ఉన్న సంబంధం విడిపోయినప్పుడు తరచుగా  తమతో తాము సమయం గడపలేరు. తమను తాము సంతోషంగా ఉంచుకోలేరు. ఇలాంటి వారు సంతోషంగా ఉండటానికి ఏవైనా వెన్నంటి ఉండాల్సి ఉంటుంది.   ఆశిస్తున్నారా? భార్యాభర్తల సంబందం గురించి సరైన అవగాహన లేకపోయినా,  అందులో లోతుగా జరిగే వాటిని అర్థం చేసుకోలేకపోయినా దయచేసి వెంటనే కొత్త సంబంధం కోసం ప్రయత్నించకూడదు. కేవలం  సమయం గడపడానికి ఒక సంబంధం నుండి మరొక సంబంధానికి మారడం  మంచిది కాదు. ఇలా చేసే వ్యక్తులు తరచుగా నిరాశ,  స్వీయ-అపరాధ భావనతో బాధపడుతుంటారు.                              *రూపశ్రీ.
  40 ఏళ్ల తర్వాత శరీరంలో హార్మోన్ల మార్పులు, జీవక్రియ మందగించడం, ఎముకల బలం తగ్గడం మరియు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరగడం సర్వసాధారణం. అటువంటి పరిస్థితిలో, ఆరోగ్యంగా మరియు ఫిట్‌గా ఉండటం ఒక ఛాలెంజ్ గా  మారుతుంది. కానీ కొన్ని సులభమైన,  క్రమం తప్పకుండా   అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా, ఈ వయస్సులో కూడా తనను తాను ఆరోగ్యంగా,  చురుకుగా ఉంచుకోవచ్చు. 40 ఏళ్ల తర్వాత అందరూ అలవర్చుకోవాల్సిన 5 ముఖ్యమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం.. 40 ఏళ్ల తర్వాత శరీర దృఢత్వం,  కండరాల బలం తగ్గడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో, నడక, యోగా, స్ట్రెచ్ వ్యాయామాలు,  తేలికపాటి బలంతో  ఫిట్‌నెస్‌ను ట్రైనింగ్ వంటివి చేయాలి.  ఇవి ఫిట్‌నెస్ ను కాపాడటమే కాకుండా, గుండె,  ఎముకలను బలంగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మధుమేహం, అధిక రక్తపోటు,  ఊబకాయాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఆహారంలో ఫైబర్, ప్రోటీన్,  యాంటీఆక్సిడెంట్లు.. 40 ఏళ్ల తర్వాత  జీర్ణక్రియ మందగిస్తుంది.  బరువు పెరిగే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు (ఓట్స్, పండ్లు-కూరగాయలు, గంజి వంటివి) జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ప్రోటీన్ కండరాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.  యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తాయి.  ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్.. 40 ఏళ్ల తర్వాత అనేక వ్యాధుల ప్రారంభ లక్షణాలు కనిపించవు. అందువల్ల ఏటా రక్త పరీక్ష, చక్కెర స్థాయి, రక్తపోటు, కొలెస్ట్రాల్,  థైరాయిడ్ వంటి ముఖ్యమైన చెకప్ లు  చేయించుకోవాలి. ఇది ఏదైనా వ్యాధిని సకాలంలో గుర్తించడంలో సహాయపడుతుంది.   చికిత్సను సులభతరం చేస్తుంది. నిద్ర పట్ల ప్రత్యేక శ్రద్ధ.. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో వాపు, అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం,  మానసిక ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ కనీసం 7-8 గంటలు గాఢ నిద్ర ముఖ్యం. నిద్రపోయే ముందు మొబైల్‌కు దూరంగా ఉండటం,  ప్రశాంత వాతావరణం నిద్ర నాణ్యతను పెంచుతుంది. ఒత్తిడిని నివారించాలి..  మైండ్‌ఫుల్‌నెస్,  ధ్యానం సాధన చేయాలి.. 40 సంవత్సరాల వయస్సు తర్వాత, ఒత్తిడి ,  ఆందోళన శరీరాన్ని వేగంగా ప్రభావితం చేస్తాయి. మైండ్‌ఫుల్‌నెస్, ధ్యానం, పుస్తకాలు చదవడం లేదా ఒక అభిరుచిని అవలంబించడం మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.                                    *రూపశ్రీ.
నేటి జనరేషన్ లో  యువ జంటలలో విడాకులు తీసుకోవడం పద్దతి వేగంగా పెరుగుతోంది. గతంలో వివాహం చేసుకుంటే జీవితాంతం కలిసుండేవారు. కానీ ఇప్పుడు చాలా జంటలు వివాహం అయిన కొన్ని సంవత్సరాలు, నెలల తర్వాత విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్,  పారుపల్లి కశ్యప్   విడిపోతున్నట్లు ప్రకటించారు. 7 సంవత్సరాల వివాహ బంధాన్ని ఇంతటితో ముగిస్తున్నట్టు స్పష్టం చేశారు. కేవలం సెలబ్రిటీలే కాదు.. నేటి కాలంలో సాధారణ కుటుంబాలలో కూడా వివాహం తర్వాత విడాకుల తంతు చాలా ఎక్కువగానే జరుగుతోంది.  యువ జంటలు విడిపోవడానికి అనేక సామాజిక, మానసిక,  ఆచరణాత్మక కారణాలు ఉండవచ్చు. అలాంటి 5 ప్రధాన కారణాలు తెలుసుకుంటే..  సహనం  ఓర్పు.. నేటి యువ జంటలలో  మునుపటి కాలంతో పోలిస్తే సహనంలో చాలా లోపాలు కలిగి ఉన్నారు. చిన్న సమస్యలకు వాదించుకోవడం,  దానిని పరిష్కరించుకోవడానికి  బదులుగా సంబంధాన్ని వదిలివేయడం ఒక సాధారణ ధోరణిగా మారింది. గొడవ నుండి పారిపోవాలనే ధోరణి కారణంగా బార్యాభర్తల మధ్య విడాకుల సమస్యకు దారితీస్తోంది.  స్వేచ్ఛ,  సెల్ఫ్ స్పేస్.. నేటి యువకులు ఎక్కువ స్వేచ్ఛ,  పర్సనల్ స్పేస్ కావాలని  కోరుకుంటారు. వివాహం తర్వాత, భాగస్వామి యొక్క అంచనాలు వారి స్వేచ్ఛకు అడ్డంకిని సృష్టిస్తే వారు దానిని తట్టుకోలేక విడాకులు తీసుకోవడం లేదా విడిపోయే మార్గాన్ని ఎంచుకోవడం చేస్తున్నారు. కెరీర్,  ఆర్థిక ఒత్తిడి.. పెరుగుతున్న పోటీ, కెరీర్ గురించి ఆలోచనలు,  ఆర్థిక అస్థిరత కారణంగా యువ జంటలు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడి సంబంధాలను ప్రభావితం చేస్తుంది.  కొన్నిసార్లు పరస్పర అవగాహన లేకపోవడం జరుగుతుంది. సోషల్ మీడియా,  బాహ్య ప్రభావాలు.. సోషల్ మీడియాలో కనిపించే ఆదర్శ జీవితం,  గ్లామర్ జంటలలో తప్పుడు అంచనాలను ఏర్పరుస్తాయి. వారు తమ సంబంధాన్ని ఇతరులతో పోల్చుకుంటారు. ఇది అసంతృప్తికి,  భార్యాభర్తల మధ్య  దూరం ఏర్పడటానికి  దారితీస్తుంది. కమ్యూనికేషన్ గ్యాప్,  భావోద్వేగ సంబంధం లేకపోవడం.. సంబంధాలకు కమ్యూనికేషన్ అతిపెద్ద పునాది. కానీ భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ తగ్గడం ప్రారంభించినప్పుడు, అపార్థాలు పెరుగుతాయి. ఇది కాకుండా ఎమోషనల్ బాండింగ్ కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సంబంధం లేకపోవడం కూడా సంబంధం విచ్ఛిన్నానికి దారితీస్తుంది.                       *రూపశ్రీ.
      ఆహారం శరీరానికి శక్తి వనరు.  తీసుకునే ఆహారాన్ని బట్టి శరీర ఆరోగ్యం ఆధాపడి ఉంటుంది. అయితే పుర్రెకో బుద్ధి,  జిహ్వకో రుచి  అని పెద్దలున్నారు. కానీ నేటి కాలంలో మాత్రం జిహ్వకు బోలెడు రుచులు కావాలి. నేచి జనరేషన్ లో తిండి మీద చూపిస్తున్న ఆసక్తి వేరే దేని మీద లేదంటే అతిశయోక్తి కాదు.. దీనికి తగినట్టే వీదులలో బోలెడు ఫుడ్ సెంటర్లు కూడా పుట్టగొడుగుల్లా వచ్చేసాయి. కానీ ఆహారం అనేది శరీరాన్ని దృఢంగా ఉంచేలా ఉండాలని ఆయుర్వేదం చెబుతుంది.  అయితే దీన్ని పాటించేవారు ఇప్పట్లో చాలావరకు తగ్గిపోయారు. మరీ ముఖ్యంగా రుచి కోసం తింటున్న ఆహారాలు మనిషి ఆయుష్షును తగ్గించేస్తున్నాయ్ అని అంటున్నారు. వాటిలో చాలా డేంజర్ ఫుడ్ కూడా ఉంది. ఈ ఫుడ్ ఐటమ్ తిన్న ప్రతి సారి 36 నిమిషాల మానవ జీవితకాలం తగ్గిపోతోందట. ఇంతకీ ఆ ఫుడ్ ఏంటి? తెలుసుకుంటే.. ఫాస్ట్ ఫుడ్ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. నగరాల్లోనే కాదు, ఇప్పుడు గ్రామాల్లో కూడా ఫాస్ట్ ఫుడ్ వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు,  యువత ఫాస్ట్ ఫుడ్ అంటే పడి చస్తారు.   ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిసి కూడా  సంతోషంగా తింటున్నారు. అయితే ఈ ఫాస్ట్ ఫుడ్ ల గురించి చాలా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. హాట్ డాగ్ తినడం వల్ల ఒక వ్యక్తి వయస్సు 36 నిమిషాలు తగ్గుతుందని, సోడా తాగడం వల్ల  12 నిమిషాలు తగ్గుతుందని పరిశోధకులు తమ పరిశోధనలలో కనుగొన్నారు. సంతోషంగా తినే ఫాస్ట్ ఫుడ్ వాస్తవానికి ఆయుష్షును మింగేస్తోందని వారు అంటున్నారు. శాండ్‌విచ్‌లు,  గుడ్లు జీవితాన్ని 13 నిమిషాలు తగ్గిస్తాయట.  చీజ్ బర్గర్‌లు  దాదాపు 9 నిమిషాలు,  బేకన్‌ను 6 నిమిషాలు తగ్గిస్తాయని అంటున్నారు. ఇవి ఎందుకు ప్రమాదం అంటే.. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు ఆయుష్షు తగ్గడానికి ప్రధాన కారణాలు..  ఎందుకంటే వాటిలో ఎటువంటి పోషకాహారం లేకపోవడం,  శుద్ధి చేసిన చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు, ఉప్పు, ఉత్పత్తులు పాడవకుండా ఉండటం కోసం వినియోగించే రసాయనాలు,   కృత్రిమ రుచులు, రంగులు  ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి తీవ్ర నష్టం చేకూరుస్తాయి. ప్రమాదాలు.. ఈ ఆహార పదార్థాలను ఎక్కువగా  తీసుకోవడం వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాలక్రమేణా అవి దీర్ఘకాలిక మంట, ఊబకాయం, గుండె జబ్బులు, స్ట్రోక్,  కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతాయి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ పెద్ద మొత్తంలో తీసుకునే వ్యక్తులు గుండె జబ్బులతో చనిపోయే ప్రమాదం 50% ఎక్కువగా ఉంటుంది.  ఆందోళన,  నిరాశ వంటి మానసిక సమస్యలతో బాధపడే అవకాశం 48-53% ఎక్కువగా ఉంటుంది.  టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 12% ఎక్కువగా ఉంటుందట.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  ఆయుర్వేదంలో ఎన్నో శతాబ్దాలుగా అనేక వ్యాధుల చికిత్సకు ఎన్నో మొక్కలు ఉపయోగిస్తున్నారు. వాటిలో సింహదంష్ట్ర లేదా పుచ్చపువ్వు అనేది ముఖ్యమైనది. దీన్నే అందరూ తంగేడు పువ్వు అంటారు. చూడటానికి పసుపు రంగు చామంతిని పోలి ఉండే ఈ పువ్వు కిడ్నీ నుండి లివర్ వరకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. భారతదేశంలో, ఇది ముఖ్యంగా హిమాలయ ప్రాంతంలో కనిపిస్తుంది. అంతేకాదు..  దీనికి 30 కంటే ఎక్కువ జాతులు ఉన్నాయి. దీన్ని ఇంగ్లీష్ లో డాండెలైన్ అని పిలుస్తారు.   సుశ్రుత సంహిత ప్రకారం, తంగేడు  ఫైబర్ యొక్క మంచి మూలం. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో,  జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదంలో, దీనిని కాలేయానికి సహజమైన నిర్విషీకరణ మందుగా పేర్కొంటారు. దీని వేర్లు,  ఆకులు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా సహాయపడతాయి. అదే సమయంలో, దీని ఆకులు విటమిన్లు A, C,  D అలాగే పొటాషియం,  కాల్షియం వంటి ఖనిజాలకు అద్భుతమైన మూలం. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మధుమేహాన్ని నిర్వహించడంలో,  రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. తంగేడు ఆకుల సారం మూత్రపిండాలను దెబ్బతినకుండా రక్షించే సమ్మేళన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో మంటను నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది, ఇది మూత్రపిండాలపై భారాన్ని తగ్గిస్తుంది, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. తంగేడు పువ్వుల టీ  డయాబెటిస్ రోగులకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది క్లోమమును ప్రేరేపించడం ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. కాల్షియం,  విటమిన్ K పుష్కలంగా ఉండటం వల్ల, ఇది ఎముకలను బలోపేతం చేయడంలో,  ఎముక సంబంధిత ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.                               *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..  
  భారతదేశంలో టీ కేవలం ఒక పానీయంగా మాత్రమే కాదు, ఒక భావోద్వేగంగా మారిపోయింది. ఉదయం  అయినా లేదా సాయంత్రం అలసట అయినా, అందరికీ ఒక కప్పు టీ లేనిదే రిలాక్స్ గా అనిపించదు. చాలా మంది టీని ఎక్కువసేపు మరిగిస్తారు, తద్వారా దాని రుచి చిక్కగా,  రుచికరంగా మారుతుంది. అయితే ఎంతో ఇష్టంగా  త్రాగే టీని, అవసరానికి మించి మరిగిస్తే అది  ఆరోగ్యానికి కూడా హానికరం చేస్తుంది.  చాలామంది టీ విషయంలో చేసే తప్పులు, చేయకూడని పొరపాట్లు తెలుసుకుంటూ.. టీ ని ఆరోగ్యంగా తాగాలంటే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం టీలో కెఫిన్,టానిన్లు,  యాంటీఆక్సిడెంట్లు ప్రభావవంతంగా ఉంటాయి. ఈ కారణంగా టీని  పరిమిత సమయం మాత్రమే ఉడకబెట్టాలి. టీని ఎక్కువసేపు లేదా చాలా తక్కువసేపు ఉడకబెట్టడం వల్ల రుచి దెబ్బతింటుంది. అంతేకాదు.. ఇది ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది.   త్వరగా టీ తయారు చేసి తాగితే.. అంటే 1-2 నిమిషాలు టీని  ఉడకబెట్టినట్లయితే అప్పుడు టీ ఆకులలో ఉండే పోషకాలు పూర్తిగా పానీయంలో చేరదు. . ఇలాంటి టీ కూడా ఎలాంటి రుచిని, ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాన్ని ఇవ్వదు. టీ చాలా సేపు ఉంచి మరగబెడితే..  10 నిమిషాలు లేదా ఎక్కువసేపు టీని  ఉడకబెట్టినట్లయితే దానిలో టానిన్డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది టీని చేదుగా చేస్తుంది. ఇది చాలా వగరుగా కూడా ఉంటుంది.  చాలామంది టీ స్ట్రాంగ్ గా ఉండాలని ఎక్కువ సేపు టీ ఉడికిస్తారు. కానీ ఈ రకమైన టీ తాగడం వల్ల గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి కడుపు సమస్యలు వస్తాయి.ఎక్కువగా మరిగించిన టీలో కెఫిన్ పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారాతలనొప్పి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఉండవచ్చు. టీ ఎంతసేపు మరగబెట్టాలి? ఆరోగ్య నిపుణుల ప్రకారం టీని 4-5 నిమిషాలు మాత్రమే మరిగించడం సరైనది. దీనివల్ల టీ రుచికరంగా,  ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. అది పాల టీ అయినా లేదా బ్లాక్ టీ అయినా రెండూ ఎక్కువసేపు ఉడకబెట్టకూడదు . టీ తయారు చేస్తున్నప్పుడు ముందుగా నీటిని మరిగించి అప్పుడు అందులో టీ ఆకులు వేసి 2-3 నిమిషాలు మరిగించాలి. తక్కువ మంట మీద మరిగించి, రుచికి తగ్గట్టుగా పాలు, చక్కెర కలపాలి. దీని తరువాత, దానిని 1-2 నిమిషాలు మరిగించి వెంటనే వడకట్టాలి. చాలా సేపు మరగబెట్టిన టీని  తాగడం వల్ల రుచి పెరుగుతుంది. కానీ ఆరోగ్యం మాత్రం  మరింత దిగజారుతుంది, అయితే గ్రీన్ టీ తాగే వారులేదా లేదా హెర్బల్ టీ తీసుకునేవారు దానిని అస్సలు ఉడకబెట్టకూడదు. గోరువెచ్చని నీటిలో వేసి మూత పెట్టి 2-3 నిమిషాలు ఆవిరిలో ఉంచాలి.  దీని ద్వారా ఆరోగ్యం బాగుటుంది.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..