LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారుతోందన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఇంత కాలం వైసీపీ అడుగులకు మడుగులొత్తిన పోలీసులు ఇప్పుడు తటస్థంగా ఉంటున్నారు. అంతే కాదు ఎన్నికల సంఘం పలువురు పోలీసు అధికారులపై వేటు వేసింది. అలా వేటు పడిన స్థానంలో వచ్చిన వారు.. మరింత మందిని కీలక విధులకు దూరం చేశారు. మరింత మందిపై నిఘా పెట్టారు. ఈ మార్పు ఒక్క సారిగా పోలీసు వ్యవస్థలో కింది నుంచి పై దాకా ఉలిక్కిపడేలా చేసింది. నిబంధనలను అతిక్రమిస్తే ఏం జరుగుతుందో, ఒక పార్టీతో అంటకాగితే జరిగే పరిణామాలేమిటో తేటతెల్లం చేసింది. దీంతో ఏపీ పోలీసుల తీరు ఒక్కసారిగా మారిపోయింది. గత ఐదేళ్లూ ఒక తీరు.. గత కొద్ది రోజులుగా మారో తీరుగా మారిపోయింది.   వైసీపీ హయాంలో అంటే గత ఐదేళ్లుగా పోలీసు అధికారులకు పదోన్నతులు, కీలక పోస్టింగులకు వారిపై ఉన్న అభియోగాలూ, అధికార పార్టీకి అనుకూలంగా పని చేయడానికి సై అనడమే అర్హతలుగా మారాయి. ఇప్పుడు అలా కీలక  పోస్టింగులలో వచ్చి తిష్ట వేసిన వారికి ఇప్పుడు స్థాన చలనం కలిగింది.  ఇక మిగిలిన వారిలో భయం మొదలైంది. దీంతో మొత్తం పరిస్థితి వైసీపీకి రివర్స్ అయినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ఖాయమని చెప్పడానికి  వైసీపీ పెద్దల మాటలను కింది స్థాయి పోలీసులే ఖాతరు చేయకపోవడాన్ని ఉదాహరణగా పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ వైసీపీ బాధితులపైనే కేసుల నమోదుకు పరిమితమైన పోలీసులు ఇప్పుడు వైసీపీ కేడర్, నాయకులపై కూడా యాక్షన్ తీసుకోవడానికి, కేసులు నమోదు చేయడానికి వెనుకాడటం లేదు.   రాష్ట్రంలో మారిన  ఈ పరిస్థితే జూన్ 4న ఫలితం ఎలా ఉండబోతోందో చెబుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ప్రజల నాడి ఎలా ఉందో, ప్రజల మొగ్గు ఎటువైపు ఉందో అందరి కంటే నిక్కచ్చిగా, కచ్చితంగా అంచనా వేయగలిగేది క్షేత్ర స్థాయిలో పోలింగ్ విధులు నిర్వహించిన పోలీసులే అని అంటున్నారు. 
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో  తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. గత వారంతో పోలిస్తే సోమవారం భక్తుల తాకిడి ఒకింత తగ్గినప్పటికీ రద్దీ కొనసాగుతోంది. సోమవారం (మే27) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక ఆదివారం ( మే 26) శ్రీవారిని మొత్తం 89 వేల 161 మంది దర్శించుకున్నారు.  వారిలో 36వేల450 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 77లక్షల రూపాయలు వచ్చింది. 
పేర్ని నాని.. వైసీపీలో అందరూ మాటలు ఆపేసిన వేళ పేర్ని నాని మాత్రం విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ  సొంత నియోజకవర్గ ప్రజలకు మాంఛి వినోదం అందిస్తున్నారు. ఓటమి భయం కప్పిపుచ్చుకోవడానికి మాటలను కోటలు దాటిస్తున్నారు. బందరులో తన కుమారుడు విజయం సాధిస్తారో లేదో చెప్పడానికి ఆయన దగ్గర సరైన గణాంకాలు లేవు కానీ మాచర్లలో మాత్రం పిన్నెల్లి విజయం ఖాయమని ఢంకా బజాయిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం పిన్నెల్లి కంచుకోట అని చెబుతూ అందుకు ఉదాహరణలు చెబుతున్నారు. ఒక వైపు పిన్నెల్లి సోదరుల దౌర్జన్యం, దుర్మార్గాలను ప్రపంచం అంతా వీక్షిస్తున్న సమయంలో పేర్ని నాని పిన్నెల్లికి వత్తాసు పలుకుతూ, అసలు సినిమా జూన్ 4 తరువాత చూస్తారని బెదరిస్తున్నారు.  ఇప్పుడు కాదు.. 2019లో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచే వైసీపీలో మేధో శూన్యత ఉందనీ, స్వోత్కర్ష, పర నిందే ఆ పార్టీ సిద్ధాంతమనీ అందరికీ అర్ధమైపోయింది. నిస్సిగ్గుగా తమ తప్పులను సమర్ధించుకోవడమే కాకుండా.. తమ వైఫల్యాలను కూడా విపక్షంపై నెట్టివేసి చప్పట్లు కొట్టే విద్యలో  వైసీపీ ఆరితేరిపోయింది. ఇప్పుడు అదే ఆరితేరిన విద్యను కొత్తగా పేర్ని నాని మరోసారి మొదలెట్టేశారు.  ఈవీఎం ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నేల్లినే బాధితుడిగా అభివర్ణించడానికి పేర్ని నాని ఎక్కడా సంకోచించడం లేదు. మీడియా ముందుకు వచ్చి పిన్నెల్లి హత్యకు తెలుగుదేశం కుట్రపన్నిందంటూ ఆరోపణలు గుప్పించారు. ఆ కుట్రకు ఎన్నికల సంఘంన, పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ గగ్గోలు పెట్టేశారు.   ఇంత కాలం ఎవరి అండ చూసుకునైతే వైసీపీ నేతలూ, మూకలూ రెచ్చిపోయాయో అదే పోలీసులు పాపం వైసీపీ నేతలకు వ్యతిరేకంగా మారిపోయారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఓటమికి సాకులు వెతుక్కునే వారే ఇటువంటి బేల మాటలు మాట్లాడతారు. ఇంత బేలగా, ఇంత దిగజారి ఆరోపణలు గుప్పిస్తున్న పేర్ని నాని అదే నోటితో పిన్నెల్లి విజయం ఖాయమంటూ జోస్యం చెబుతున్నారు. విజయం ఖాయం అయితే ఈవీఎం ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది, దాడులకు, దౌర్జన్యాలకు దిగి, ఓటర్లను ఎందుకు భయభ్రాంతులకు గురి చేయాల్సి వచ్చింది అన్న దానికి మాత్రం పేర్ని సమాధానం చెప్పరు. అసలు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏమిటి? మేం చెబుతాం మీరు వినండి అన్నట్లుగా సాగింది పేర్ని ధోరణి.   ఇంతకీ పిన్నెల్లి హత్యకు తెలుగుదేశం కుట్ర అంటూ ఆరోపణలు చేసిన పేర్ని మాటల సారాంశం.. జూన్ 4 వరకూ ఎదురు చూడటం ఎందుకు.. మేం ఓడిపోయాం.. మా ప్రాణాలకు భద్రత కల్పిస్తే చాలు అని వేడుకోవడంలాగే  ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వాస్తవానికి  ముందస్తు బెయిల్ తెచ్చుకున్న పిన్నెల్లి కోర్టు షరతులను ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన నరసరావు పేటలోనే ఉండాలి. కానీ ఆయన నరసరావు పేటలో ఉండటం లేదు. కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి అజ్ణాతంలోనే ఉన్నారు.  ఈ విషయాన్ని దాచిపెట్టి ఎదురు ఆయన హత్యకు తెలుగుదేశం కుట్ర పన్నిందనీ, ఆ కుట్రకు పోలీసులు సహకరిస్తున్నారనీ ఆరోపణలు మొదలెట్టేసింది. అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా వైసీపీ తీరు ఉందన్న మాట. పేర్ని నాని ఎంతగా గొంతు చించుకున్నా పిన్నెల్లి విధ్వంస, దౌర్జన్య కాండ గురించి తెలిసిన ఏ ఒక్కరూ పిన్నెల్లిని కానీ, ఆయనకు వత్తాసుగా గొంతుచించుకు గగ్గోలు పెడుతున్న పేర్ని నానిని కానీ ఇసుమంతైనా నమ్మడం లేదు. అజ్ణాతంలో ఉన్న పిన్నెల్లి కౌంటింగ్ రోజున మరింత విధ్వంసానికి ప్రణాళికలు రచిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే ఆదివారం పల్నాడులో జరిగిన దాడే నిదర్శనంగా నిలుస్తుంది. 
జూనియర్ ఎన్టీఆర్  నటించిన అదుర్స్ అనే సినిమాలో  కొవ్వు ఎక్కువై తెలియలేదు కానీ నీ బాడీలో బుల్లెట్ దిగి చాలా సేపైంది అని ఓ డైలాగ్ ఉంటుంది. ప్రస్తుతం ఆ డైలాగ్ వైసీపీకి అతికినట్లుగా సరిపోతుంది. అధికార మదం తలకెక్కి అర్ధం కావడం లేదు కానీ.. వైసీపీ ఓటమి ఖరారై చాలా కాలమైంది.  నిజమే.. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చేది ఎవరో అధికారికంగా తేలడానికి ఇక ఎనిమిది రోజులు మాత్రమే ఉంది. అయితే ఓట్ల లెక్కింపు పూర్తై ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే జనం తీర్పు ఏమిటన్నది వైసీపీతో సహా అందరికీ పోలింగ్ రోజునే అవగతమైపోయింది.  అధికారమదం తలకెక్కి అర్ధం కాలేదు కానీ.. వైసీపీ ఓటమి కోసం జనం ఎప్పుడో తమ ఆయుధానికి పదును పెట్టేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంగా జగన్ కు మరో చాన్స్ ఇచ్చేది లేదని డిసైడైపోయారు. తమ ఓటు భద్రంగా ఉందో లేదో అనుక్షణం వెరిఫై చేసుకుంటూ వచ్చారు. దొంగ ఓట్ల నమోదును అడ్డుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయితే ఇదంతా జనం నిశ్శబ్దంగా చేశారు. ఈ నిశ్శబ్దం వెనుక ప్రభుత్వ వ్యతిరేకత వారిలో నివురుగప్పిన నిప్పులా ఉంది. గడప గడపకు నుంచి వైసీపీ నాయకులకు నిరసన సెగ తగిలినా.. ఆ ఏముందిలే అనుకున్నారు. వైనాట్ 175 ధీమా వ్యక్తం చేశారు. ఆ ధీమా వెనుక ప్రజలు వ్యతిరేకించినా, అవినీతికి అలవాటుపడ్డ కొందరు ఉన్నతాధికారులు, పోలీసుల సహకారంతో వారిణి భయపెట్టి పబ్బం గడిపేసుకోగలమని భావించారు.  అయితే అది సాధ్యం కాదు.   రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు ఏ మాత్రం సుముఖంగా లేరన్న సంకేతాలు ఏడాది ముందు నుంచే స్పష్టంగా కనిపించాయి. ఎన్నికలలో జగన్ రెడ్డి  బొక్కబోర్లా పడడం ఘయమని ఎప్పుడో తేలిపోయింది.  సంక్షేమ పథకాల పేరిట క్రమం తప్ప కుండా ప్రజల ఖాతాల్లో . పైసలు వేస్తున్నాము కాబట్టి, ప్రజలు చచ్చుకుంటూ మళ్ళీ  తమకే ఓటేస్తారని, తమనే గెలిపిస్తారని వైసీపీ నేతలు పగటి కలలు కన్నారు. గాలిలో మేడలు కట్టుకున్నారు. ఆశల పల్లకిలో ఊరేగారు.   ప్రజలు సంక్షేమం అంటూ జగన్ సర్కార్ ఇచ్చిందేదో పుచ్చుకున్నారు. అయితే జగన్ కు మరో చాన్స్ ఇచ్చే ప్రశక్తే లేదన్న నిర్ణయం ఎప్పుడో తీసేసుకున్నారు. విధ్వంసం తప్ప విజన్ లేని పాలకుడు ఇక వద్దే వద్దని నిర్ణయానికి వచ్చేశారు. మాట తప్పను, మడమ తిప్పను అంటే ఏమిటో అనుకున్నామనీ, జగన్ అధికారంలోకి వచ్చి రివర్స్ పాలన ప్రారంభించిన తరువాత కానీ    జగన్ రెడ్డి మాటలను కూడా రివర్స్ గానే అర్ధం చేసుకోవాలని అర్ధం కాలేదని వాపోయారు. అప్పులు చేయడం సంక్షేమం అంటూ చిల్లర విసరడం తప్ప జగన్ హయాంలో రాష్ట్రంలో వీసమొత్తు అభివృద్ధి జరగలేదు.   చేసిన పనులకు కాంట్రాక్టర్లు బిల్లులు అందలేదు. దీంతో   రాష్ట్రంలో చిన్నా పెద్ద పనులకు టెండర్లు పిలిచినా, కాంట్రాక్టర్లు ఎవరూ, ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది.  కాంట్రాక్టర్లకే కాదు పార్టీ క్యాడర్ కు మేలు చేయడం కోసం అంటూ కేటాయించిన నామినేషన్ పనులకు కూడా పార్టీ క్యాడర్, నేతలు ముందుకు రావడం మానేశారు. అంటే పార్టీ క్యాడర్ లోనే   జగన్ రెడ్డి విశ్వాస స్థాయి  దిగజారింది. అంతెందుకు  ప్రభుత్వ భూములు  ప్లాట్స్ వేసి అమ్ముదామంటే కొనే నాథుడే లేకుండా పోయారు.   ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డ్రీమ్ కాపిటల్  వైజాగ్ లో   జగనన్నస్మార్ట్ టౌన్ షిప్ లో  సుమారు 2000 ప్లాట్లను వేలం ద్వారా అమ్మకానికి పెడితే ప్రజల నుంచి స్పందన లేదు.  వాస్తవానికి   ప్రభుత్వం నేరుగా అమ్ముతోందంటే దానికో క్రేజ్ ఉంటుంది. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రావు. క్లియర్ టైటిల్ ఉంటుంది అన్న నమ్మకంతో జనం ముందుకు రావాలి.  చంద్రబాబు హయాంలో   అమరావతిలో హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్ట్ చేపడితే గంటల్లో బిజినెస్ క్లోజ్ అయింది. అదీ విశ్వాసం అంటే. కానీ జగన్ సర్కార్ కు ప్రజలలో విశ్వసనీయత లేదనడానికి జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో ప్లాట్ లు కొనడానికి ఎవరూ రాకపోవడమే నిదర్శనం అని అప్పుడే తేలిపోయింది. ఇలా ఒకరని కాదు, అన్ని వర్గాల ప్రజలూ, చివరకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందుతున్న సామాన్య జనం కూడా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్దంగా లేమని చెప్పకనే చెప్పేశారు. అయినా వైసీపీ మాత్రం సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజలు ఆ విశ్వాసంతో తమకే ఓటు వేస్తారని నమ్మింది. మే 13న పోలింగ్ సరళి చూసిన తరువాత కానీ వైసీపీ నేతలకు అర్ధం కాలేదు. వాస్తవం బోధపడలేదు. హింస, దౌర్జన్యం, దుర్మార్గాలతో జనాలను భయపెట్టి ఓట్లేయించుకోలేమని. ప్రజలు తమ పార్టీని తిరస్కరించారని.  అందుకే వైసీపీలో ఇంత కాలం నోరెట్టుకు పడిపోయిన ఏ నాయకుడూ కూడా ఇప్పుడు నోరు మెదపడం లేదు. వైసీపీ ఓటమి ఖాయమని చెప్పడానికి ఇదే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
‘జయ జయహే తెలంగాణ’ అంటూ సాగే తెలంగాణ రాష్ట్ర గీతంలో సంగీత దర్శకుడు కీరవాణి ఆధ్వర్యంలో స్పల్ప మార్పులు, చేర్పులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రాయదుర్గంలో వున్న కీరవాణి మ్యూజిక్ స్టూడియోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ గీతంలో చేయాల్సిన మార్పులు, చేర్పుల గురించి గీత రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో చర్చించారు. తెలంగాణ గీతంలో జిల్లాల ప్రస్తావన, మరికొన్ని మార్చాల్సిన అంశాలు వున్నాయి. ఆయా అంశాలను మార్చి, వాటి స్థానంలో ఏయే అంశాలను ప్రస్తావించాలన్న పాయింట్ మీద వీరి మధ్య డిస్కషన్ జరిగింది. కీరవాణి బాణీ కట్టిన పాటను సీఎం రేవంత్ రెడ్డి రెండు మూడుసార్లు విని, ఆ పాటలోని అంశాలను చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలు వున్నాయి. అందెశ్రీ రాసిన పాటలో పది జిల్లాలు అని వుంటుంది. ఆ పదాన్ని తొలగించి, ఆ స్థానంలో పద.. పద.. అనే పదాన్ని చేర్చినట్టు తెలుస్తోంది.
ALSO ON TELUGUONE N E W S
HanuMan director Prasanth Varma is making a massively budgeted period film with Bollywood star Ranveer Singh. We've revealed that this biggie titled as "Brahmarakshasa." Ranveer Singh, Prasanth Varma and Mythri Movie Makers are confirmed to team up for a film. It will be the immediate film in Prasanth Varma's cinematic universe and will got onto the floors even before Jai Hanuman. The film's formal Pooja was recently held. Ranveer Singh joined test shoot recently in Hyderabad for the glimpse, which makers planned to release as a announcement video. A massive set was constructed for the shoot. The film is rumored to be titled Brahmarakshasa and is said to be a periodic drama with loads and loads of action. The ongoing rumors say that Ranveer Singh walked out of the film due to creative differences with Prasanth Varma. He decided not to sign the film. But we've learnt that the project is still on. Prasanth Varma revealed that he will do the film with Ranveer Singh and it goes to floors very soon. Mythri Movie Makers are the producers of this mega budget film. An official announcement is expected to be made soon. Its a part of the movie Universe PVCU as well. The film will release in 2025.
Thalapathy Vijay is set to showcase his versatility by playing a dual role in The Greatest of All Time, directed by Venkat Prabhu. Meenakshi Chaudhary, the captivating beauty from Guntur Kaaram, is the leading lady in this highly anticipated film, backed by AGS Entertainment on a grand scale. The film shoot is going on at breakneck pace. The film's much-anticipated single "Whistle Podu" sung by Thalapathy Vijay has unfortunately not lived up to the high expectations set by his previous blockbuster hit songs in films like "Mersal," "Master," and "Leo." Now, the second single will be coming in the middle of June. The film's music director Yuvan Shankar Raja, revealed an exciting update for Thalapathy fans. He revealed that for the first time Thalapathy Vijay will be singing two songs in a film and that is GOAT directed by Venkat Prabhu. The team is currently busy with the post production works. Fans expecting a banger number that will be a viral chartbuster from the evergreen combo. The film will be releasing in theatres on September 5th. Fans are expecting that this is his last film and planning to celebrate in a grand way. The film will also be released in Telugu on same date.
Powerstar Pawan Kalyan was working with Sujeeth for a massive action drama OG backed by DVV Danayya under DVV Entertainment. The film’s shoot is currently on break as Pawan Kalyan was busy with Janasena political works. The elections are over now and the results will be announced in June. Lot of rumours said that Pawan Kalyan is not planning to return to sets even after the elections. But, according to our latest reports, he will be back to sets very soon. This project is highly anticipated by everyone and after the glimpse, the expectations reached to sky high. Now, director Sujeeth words about the film raised intrigue. The director revealed the backstory of the title. He said, "I got called to make a remake movie with Pawan Kalyan garu, but I wanted to make an original film. I've waited so long to make OG. OG - Ojhas Gambheera. Ojhas means the master and our Pawan Kalyan name is Gambheera in the film. He is a marshal Arts master (MONSTER) and the film has huge Japanese influence. They Call Him OG trailer cut is ready." He added, “There is an Aikido and Krav Maga (martial arts) sequence in the movie. I have designed it based on my knowledge and available resources. But Kalyan Garu wanted to give his best. He contacted Aikido masters from Pune and Mumbai and had multiple practice sessions.” Sujeeth added, “He also saw a few YouTube videos and discussed with me on how to go about it. With his inputs we redesigned the action block and shot it in three days. Earlier the plan was to wrap up in half day. If Kalyan Garu finds something interesting then there is no stopping him.”
సంవత్సరం క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan)అప్ కమింగ్ మూవీ ఓజి (og) టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. అప్పట్నుంచి  పవన్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల మెదడులని ఒక ప్రశ్న తొలుస్తూ ఉంది. ఆఫ్ కోర్స్  ఇప్పటికీ చాలా  మంది ఆ దిశగా ఆలోచిస్తున్నారనుకోండి.  ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అని.. కాదు కాదు ఇంకేదో  అర్ధం ఉందని రకరకాలుగా  చెప్పుకుంటు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలైన అర్ధం బయటకి వచ్చింది శర్వానంద్ తో రన్ రాజా రన్, ప్రభాస్ (prabhas)తో సాహూ ని తెరకెక్కించిన సుజిత్  ఓజి కి దర్శకుడు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ఓజి టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ ని బయటపెట్టాడు. ఓజీ అంటే ఓజాస్ గంభీర్ అని  అర్థం. మూవీలో  ఓజాస్ అనేది మాస్టర్ పేరు, గంభీర్ అంటే హీరో పేరు. రెండూ కలిపితే ఓజీ అని  చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా పవన్ ఫ్యాన్స్ ఆనందంతో ఎగిరి గంతేసేలా ఒక సూపర్ వార్త ని చెప్పుకొచ్చాడు. మూవీ మొత్తం జపాన్ స్టైల్లో ఉంటుందని పవన్ తో ఆ విధంగా  సినిమా చెయ్యాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యానని చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉంది.  కానీ సుజిత్ కి  కూడా తెలియని విషయం ఏంటంటే పవన్ ఫ్యాన్స్ లో ఇంకొన్ని కొత్త  డౌట్స్ ని  నింపాడు. ఓజాస్ అనేది మాస్టర్ పేరు అని చెప్పుకొచ్చాడు సరే.  ఆ మాస్టర్ పవనేనా లేక వేరే వ్యక్తి నా అనేది తెలియాలి. ఒక వేళ వేరు వేరు అయితే పవన్  మాస్టర్ గా ఎవరు చేశారనే  ఆసక్తి కూడా అందరిలో ఉంది ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు పూర్తి అయిన నేపధ్యంలో పవన్ కంటిన్యూగా ఓజి కి డేట్స్ ఇవ్వబోతున్నాడు. పవన్ తో చెయ్యాల్సిన సీన్స్   మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయి. పవన్ లిస్ట్ లో ఉన్న మూవీస్ లో ఫస్ట్ రిలీజ్ అయ్యే మూవీ ఓజి నే. సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. నాని గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా చేస్తుండగా  బాలీవుడ్ హీరో  ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తున్నాడు. సలార్ శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ లు  కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ దానయ్య(danayya)తన డివివి ఎంటర్ టైన్మెంట్ పై అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. థమన్ (thaman)మ్యూజిక్ డైరెక్టర్.  
మూవీ : కలియుగం పట్టణంలో నటీనటులు:  విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్, చిత్ర శుక్లా, దేవి ప్రసాద్, రూప లక్ష్మీ, ప్రమోదిని తదితరులు ఎడిటింగ్: గ్యారీ బి హెచ్  సినిమాటోగ్రఫీ: చరణ్ మాధవనేని  మ్యూజిక్: అజయ్ అర్సాడ నిర్మాతలు: కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, గడ్డం మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ దర్శకత్వం:  రమాకాంత్ రెడ్డి ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో కథ: మోహన్ అతని భార్య కల్పన నంద్యాలలో ఉంటారు. వారిద్దరికి ఇద్దరు కవల పిల్లలు పుడతారు. ‌ఒకరు సాగర్, మరొకరు విజయ్. అయితే సాగర్ తన చిన్నతనంలో పెంపుడు జంతువులని చంపేస్తుంటాడు. అది తెలుసుకున్న కాలనీ వాసులు మోహన్ ని తిడుతూ , అవమానిస్తుంటారు. ఇక సాగర్ ని తీసుకెళ్ళి మానసిక వైద్యశాలలో పడేస్తాడు తండ్రి మోహన్.  తల్లి మాత్రం నిత్యం సాగర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మోహన్ మాత్రం అతని విషయంలో అయిష్టంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. కాలక్రమంలో విజయ్ పెద్దవాడవుతాడు .. ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతూ ఉంటాడు. తన అన్నయ్య మామూలు మనిషి కాగానే అతడిని ఇంటికి తీసుకురావాలనుకుంటాడు. అదే అదే సమయంలో కాలేజ్ లో విజయ్ ని శ్రావణి  ప్రేమిస్తూ ఉంటుంది. శ్రావణి పిన్ని పులి కూడా ఓ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్. తన బాస్ ప్రభాకర్ ఆదేశం మేరకు నంద్యాల చేరుకుంటుంది పులి. ఇక అదే సమయంలో తన అన్నయ్యను కలుసుకోవడానికి విజయ్ మానసిక వైద్యశాలకు వెళ్తాడు. అయితే అక్కడి నుంచి సాగర్ బయటికి వస్తాడు. లోపల ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. విజయ్ స్థానంలో ఉన్నది సాగర్ అనే విషయాన్ని తల్లి గమనిస్తుంది. అయితే సిటీలో అమ్మాయిలు‌ సూసైడ్ చేసుకొని చనిపోతుంటారు. మానసిక వైద్యశాల నుంచి బయటపడిన సాగర్ ఏం చేశాడు? నంద్యాలలో  వరుస హత్యలు చేస్తుందెవరో పోలీసులు కనిపెట్టారా లేదా అనేది మిగతా కథ. విశ్లేషణ:  సినిమా ప్రారంభంలోనే పెంపుడు‌ జంతువులని మర్డర్స్  చేస్తున్న పిల్లాడు..  ఆ పిల్లాడిని మానసిక వైద్యశాలలో పడేయడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. పిల్లల చుట్టు ఉండే ప్రపంచం, పరిస్థితులు వారిలో లేనిపోని భయాలని, నమ్మకాలని కలుగజేస్తాయని దాని పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో దర్శకుడు చెప్పాలనుకున్నాడు. అది చెప్పటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ప్లస్ అయింది. పట్టణంలో జరిగే హత్యలని సాల్వ్ చేయడంలో పోలీసులు బిజీగా ఉండటం. హీరో, విలన్ గా ద్విపాత్రాభినయం చేసిన విశ్వ కార్తికేయ కథని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు. హీరోయిన్ కి మాత్రం చాలా లిమిటెడ్ స్పేస్ ఇచ్చారు. అయితే ఈ సినిమాకి నిడివి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అర్థం కాని సీన్లు, అనవసరమైన సీన్లు వస్తూనే ఉంటాయి. చెప్పడానికి చాలా కథ ఉన్నా .. కొన్ని నెమ్మదిగా సాగే సీన్లు కథని డిస్టబ్ చేశాయి. చివరి ముప్పై నిమిషాలు సినిమాకు బలం. కానీ అందులోనే క్లారిటీ మిస్ అయింది. ట్విస్ట్ లు ఉన్నాయి.. కథనం బాగుంది.. కానీ అనవసరపు సీన్లు, సాంగ్స్ తీసేస్తే కథ ఇంకా గ్రిస్పింగ్ గా ఉండేది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఓ ఐటమ్ సాంగ్ ఉంటుంది. అందులో లిమిట్ కి మించి ఎక్స్ పోజింగ్ ఉంటుంది. ఇక క్లైమాక్స్ లో కోర్ సీన్ వచ్చేటప్పుడు ఉంటుంది. అవి రెండు స్కిప్ చేస్తే చూసేయొచ్చు. క్రైమ్ థ్రిల్లర్ ని ఇష్టపడే వారికి కొన్ని సన్నివేశాలు చూస్తే ఇవెక్కడో చూసామే అనే ఫీలింగ్ వస్తుంది. నాగశౌర్య మూవీ ఒకటి ఉంటుంది. అందులో కూడా ఇలాంటి కథనమే ఉంటుంది. కానీ ఇది కాస్త ఢిఫరెంట్ గా సాగుతుంది. అజయ్ అర్సాడ మ్యూజిక్ బాగుంది. చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ‌గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ పర్వాలేదు. కానీ ప్రథమార్ధంలో కొన్ని సీన్లు తీసేస్తే ఇంకా బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు: విశ్వ కార్తికేయ నటన సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. స్పెషల్ ఆఫీసర్ పులిగా చిత్ర శుక్లా ఆకట్టుకుంది. ఆయుషి పటేల్, దేవి ప్రసాద్, రూప లక్ష్మీ వారి పాత్రలకి న్యాయం చేశారు. ఫైనల్ గా : ఫ్రెష్ కంటెంట్ బట్ లెంతీ. ఒకసారి ట్రై చేయొచ్చు. రేటింగ్ : 2.25  / 5 ✍️. దాసరి  మల్లేశ్
విశ్వం పుట్టినప్పటి నుంచే  ఈ భూమ్మీద  కళ వర్దిల్లుతూ ఉంది. ప్రకృతి దగ్గరనుంచి పసిపిల్లవాడు దాకా  కళ కి దాసోహులే  మహా సముద్రం లోతు అయినా కొలవచ్చు గాని కళ కి ఉన్న లోతు మాత్రం  కొలవలేము.అదే విధంగా  కళ ఎన్నో రూపాలలో కొలువై ఉంది. అంతటి కళకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy) ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో  చర్చినీయాంశ మయ్యింది తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గీతం రాబోతుందన్న విషయం అందరకి తెలిసిందే. ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి (m.m keeravani)సంగీత సారధ్యంలోసదరు  గీతం రూపాంతరం చెందుతుంది. పాట రికార్డింగ్  కూడా పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని కీరవాణి రికార్డింగ్ స్టూడియోకి వెళ్లారు. పాటని పూర్తిగా విన్నారు. కీరవాణి నే  స్వయంగా   పాడి వినిపించారు.  పాట బాగుందని మెచ్చుకున్న సిఎం ఏమైనా మార్పులు చేర్పులు చెయ్యాలేమో అని మిగతా ప్రభుత్వ పెద్దలతో చర్చిస్తున్నారు. సీఎం అయ్యి ఉండి కూడా రేవంతే  స్వయంగా కీరవాణి స్టూడియో కూడా వెళ్లడం పట్ల కళ కి ఆయన ఇచ్చిన విలువ ఎంతో అర్ధమవుతుంది     తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలకి ప్రత్యేక గీతం రావడం పట్ల పలువురు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంగీత శిఖరం,  ప్రపంచ అవార్డు  ఆస్కార్ విన్నర్  కీరవాణి  తెలంగాణ పాటని  ఎలా స్వరకల్పన చేసారో అనే ఆసక్తి తెలంగాణ ప్రజలతో పాటు తెలుగు ప్రజల్లో కూడా ఉంది. ప్రముఖ సినీ ప్రజా కవి అందె శ్రీ (ande sri)కలం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక గీతం పురుడుపోసుకుంది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన జూన్ 2 న  పాట ప్రజల్లోకి రానుంది  
Anand Devarakonda's latest movie "Gam Gam Ganesha" is gearing up for a grand theatrical release on the 31st of this month. The distribution companies for this film have been recently finalized.  The makers have announced that "Gam Gam Ganesha" will be distributed by Mythri Movie Distributors in Nizam and by Dheeraj Mogilineni Entertainments in AP and Karnataka. The team of "Gam Gam Ganesha" is happy that their film is being released by Dheeraj Mogilineni Entertainments and Mythri Movie Distributors, both of which have distributed many huge and successful films. Pragathi Srivastava and Nayan Sarika star opposite Anand in "Gam Gam Ganesha". This movie is produced by Kedar Selagamshetty and Vamsi Karumanchi under the banner of Hi-Life Entertainment. Uday Shetty is debuting as a director with this movie. "Gam Gam Ganesha," which has received a Clean U certificate from the Censor Board, is ready to entertain family audiences.
Anand Devarakonda's latest movie "Gam Gam Ganesha" is gearing up for a grand theatrical release on the 31st of this month. The film will be distributed by Mythri Movie Distributors in Naijam and by Dheeraj Mogilineni Entertainments in AP and Karnataka. Makers are impressing everyone with aggressive promotions. Now, today team announced that the film's pre release event will be held tomorrow. National Crush Rashmika Mandanna will be attending as chief guest for this grand event. It is known that there were lot of rumours about Rashmika's relationship with Vijay Deverakonda. Lot of time, during their vacation, with pictures they've subtly delivered the news. Now, this beautiful lady is supporting Anand Deverakonda. Pragathi Srivastava and Nayan Sarika star opposite Anand in "Gam Gam Ganesha". This movie is produced by Kedar Selagamshetty and Vamsi Karumanchi under the banner of Hi-Life Entertainment. Uday Shetty is debuting as a director with this movie. "Gam Gam Ganesha," which has received a Clean U certificate from the Censor Board, is ready to entertain family audiences.
Prabhas' Salaar movie was released in theatres on December 22, 2023, and since then the movie has been performing well at the box office. Salaar has shattered several box office records. Now, the film's second part is in the works. Everyone is eagerly waiting to start the 2nd part shoot. There were numerous rumors circulating that the project might not happen due to significant differences within the team. However, Team Salaar has given a massive shock to everyone by releasing a making picture from the first part of Salaar. In the picture, both Prabhas and Prasanth Neel can be seen laughing, effectively debunking all the rumors about Salaar 2 being shelved and the supposed differences within the team. Salaar 2 is on the right track. The team has laughed off the rumors about internal differences. Following the gigantic success of Salaar, both Prabhas and Prasanth Neel are ready to start Salaar 2 shoot very soon. The project is expected to be another major blockbuster in Prabhas's career. The initial speculations caused quite a stir among fans and industry insiders, but this recent update has brought much relief and excitement. With the first installment of Salaar setting a high benchmark with its captivating storyline, stunning visuals, and stellar performances, anticipation for Salaar 2 is at an all-time high. The production team is pulling out all the stops to ensure that the sequel not only matches but exceeds the grandeur of its predecessor. Prabhas, whose stardom continues to soar, is leaving no stone unturned in preparing for his role in Salaar 2. In conclusion, the release of the making picture from Salaar has effectively quashed all rumors about the project's uncertainty. Salaar 2 is set to continue the legacy of its predecessor. Salaar: Part 1 – Ceasefire is directed by KGF director Prashanth Neel and it is produced by Vijay Kiragandur under the banner of Hombale Films. The movie stars Prabhas, Shruti Haasan, Bobby Simha, Jagapathi Babu Tinnu Anand, Easwari Rao, Sriya Reddy and Ramachandra Raju in pivotal roles.
Mass Ka Das Vishwak Sen is increasingly growing his fame with his versatility and committed performances. Now, he is coming up with an intense gangster drama, Gangs of Godavari. Makers have released the trailer of the film on 25th May, in front of the young and upcoming astounding actor's fans in Devi 70 MM theatre, Hyderabad.  Amongst the fanfare, Vishwak Sen stated that Gangs of Godavari will be one of his best films and biggest blockbusters. And the trailer is perfectly cut being true to his words.  Vishwak Sen could create a character like "Lankala Rathna," who seemed raw, enigmatic yet the same time charismatic. He has been able to encapsulate the man, who encompasses a difficult political journey from rags to riches with a no non-sense attitude of his own.  Even the trailer cut is so creative in depicting a circle of emotions. While it starts with a character describing humans in three categories, it ends with the protagonist categorising them as "Males", "Females" and "Politicians". Also, Lankala Rathna's unique lines while being sarcastic, dismissive and romantic will go viral, as they all been delivered with perfection.  Visuals by ace cinematographer Amit Madhadi impress us with the usage of colors, composition and grandoice. The Background score by most popular and successful composer Yuvan Shankar Raja is equally riveting and apt to the intensity showcased on-screen.  Beautiful Neha Sshetty looks attractive and cute in this film in the leading lady role. Anjali is also good in other leading lady role and her character's connection with Lankala Rathna seems to be something special.  Writer-director Krishna Chaitanya is directing the film and he did a wonderful job looking at the trailer. Suryadevara Naga Vamsi and Sai Soujanya of Sithara Entertainments and Fortune Four Cinemas, respectively, are producing the film, Gangs of Godavari. Venkat Upputuri and Gopichand Innumuri are co-producing the film while Srikara Studios is presenting it.  Gangs of Godavari is releasing worldwide on 31st May 2024.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నేటి వేగవంతమైన ప్రపంచంలో ఉద్యోగ జీవితాలు కూడా అంతే వేగంగా ఉంటాయి. పోటీ దృష్ట్యా ప్రతి సంస్థ 24 గంటలు తమ కార్యకలాపాలు కొనసాగించాలని అనుకుంటుంది. ఈ కారణంగానే సాధారణ పనివేళలు మాత్రమే కాకుండా నైట్ షిఫ్టులు కూడా కొనసాగిస్తుంది.  వేతనం గురించో ఇతర కారణాల వల్లనో చాలామంది నైట్ షిప్టులో పనిచేస్తుంటారు.  అయితే సాధారణ పని వేళల్లో పనిచేసేవారి కంటే నైట్ షిప్టులో పనిచేసేవారిలో చురుకుదనం తక్కువగా ఉంటుంది. అంతేనా సాధారణంగా నిద్రపోవాల్సిన సమయంలో ఉద్యోగాలు చెయ్యడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నైట్ షిఫ్టు డ్యూటీ చేసేవారు  ఆరోగ్యంగా, యాక్టీవ్ గా ఉండటానికి  కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే.. నిద్ర.. నైట్ షిఫ్టు లో పనిచేసేవారు నిద్ర షెడ్యూల్ ను కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. నిద్రా చక్రమైన సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలిగించకుండా చూసుకోవాలి. సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలిగితే  నిద్ర ఆటంకాలు, అలసట కలుగుతాయి.  ఈ సిర్కాడియన్ రిథమ్ గడియారాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి సెలవు దినాలలో కూడా ఒకే సమయానికి పడుకోవాలి. ఆహారపు అలవాట్లు.. నైట్ షిఫ్టుల సమయంలో చాలామంది ఎనర్జీగా ఉండటం కోసం ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ తినడం మీద ఆసక్తి చూపిస్తారు. పైపెచ్చు సాధారణ భోజన సమయాలు కాకపోవడం వల్ల రాత్రి పూట ఆకలేసినప్పుడు ఇలాంటి ఆహారానికే ప్రాధాన్యత ఇస్తారు. అయితే వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. నైట్ షిఫ్ట్ అంతా చిన్న చిన్న మొత్తాలలో ఆహారం తీసుకోవాలి. నీరు బాగా త్రాగాలి. వ్యాయామం.. నైట్ షిప్టులలో పనిచేసేవారు ఉదయం సమయాల్లో పడుకుంటూ ఉంటారు. దీని వల్ల చాలామంది ఉదయం వేళ చెయ్యాల్సిన వ్యాయామాన్ని స్కిప్ చేస్తుంటారు. లేదా పగటి సమయాన్ని లేజీగా గడిపేస్తూ  ఉంటారు. కానీ వ్యాయామాన్ని తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. జాకింగ్, వాకింగ్, యోగా, సైక్లింగ్ వంటివి మంచి ఎంపిక. ఒత్తిడి.. పనిచేసే సమయవేళలు మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. ఇది ఒత్తిడి, ఒంటరితనం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఒత్తిడి రాకుండా చూడటం కోసం  లోతైన శ్వాస, శ్వాస వ్యాయామాలు,  ధ్యానం,  తీరిక సమయాలలో స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటివి చేయాలి.  ఒకవేళ ఒత్తిడి సమస్య ఉంటే మానసిక నిపుణులను కలిసి కౌన్సెలింగ్ తీసుకోవాలి. ప్లానింగ్.. నైట్ షిఫ్టులలో పనిచేసేవారు తమ పనిని చాలా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. పని చేసేటప్పుడు అలసిపోకుండా పనిని ఏకధాటిగా కాకుండా చిన్నచిన్న భాగాలుగా విభజించుకొని ఫినిష్ చేయాలి. ఇది పక్కాగా అమలుకావడం కోసం కోలీగ్స్,  అధికారులతో సంప్రదించి వారి మద్దతు తీసుకోవాలి.                                     *నిశ్శబ్ద.  
జీవించడమూ ఒక కళ అని ఎంతోమంది చెబుతూ ఉంటారు. ప్రస్తుత సమాజంలో మనిషి రెండు విధాలుగా బ్రతుకుతున్నాడు. ఒకటి, తనకు తోచిన విధంగా, రెండు ఓ పద్ధతి ప్రకారం. కానీ మూడవ పద్ధతి ఒకటి ఉంది. ఈ పద్ధతిలో అమితమైన స్వేచ్ఛ ఉంటుంది. ఈ పద్ధతిలో బ్రతకడమే జీవించడం అంటే, ఈ పద్ధతినే జీవించే కళ అంటారు. ఇప్పుడు విదేశాలలో క్రొత్తరకం జీవనోపాధి ఒకటి స్వైరవిహారం చేస్తోంది. అదేమిటంటే మంచి వాక్చాతుర్యం కలిగి, జీవితంలో గొప్పగా సాధించిన ఒక వ్యక్తి ఇతరులకు ఎలా జీవించాలో, ఏ విధంగా జీవన పద్ధతి పాటిస్తే నిండైన విలువైన జీవితం దొరుకుతుందో వివరిస్తూ, అందులో శిక్షణా తరగతులూ, ప్రసంగాలూ ఇస్తూ ఎంతో మంచి పాతవైన, భారమైన జీవితాలని అందమైన తీరాలవైపు మళ్ళిస్తున్నారు. ఈ విధంగా జీవించేకళలో శిక్షణ ఇచ్చే మనిషిని లైఫ్ కోచ్ అని అంటున్నారు.  ఇప్పుడు ఈ లైఫ్ కోచ్ ల ఆవశ్యకత మన భారతదేశానికె అవసరం అంటున్నారు. ఎందుకంటే ప్రపంచానికే వెలుగు చూపింది మన భారతదేశం. ఆధ్యాత్మికంగా ప్రపంచ ప్రజలకు తలమానికంగా నిలచింది మన దేశమే. ఇప్పుడు కూడా ఏ దేశానికీ వెళ్ళనంత ఎక్కువ జనాభా, భారతదేశానికి వచ్చి ఆధ్యాత్మిక జీవనం నేర్చుకొని వెళ్తున్నారు. ఇక్కడ నేర్చుకొన్న గొప్ప విద్యను, జ్ఞానాన్ని వారి దేశాల్లో వినియోగిస్తూ, లైఫ్ కోచ్ లుగా, పబ్లిక్ స్పీకర్లుగా, ప్రేరణా రచయితలుగా మారి కోట్లకు కోట్లు సంపాదిస్తూ పదిమంది జీవితాలను ఉన్నతదిశగా మారుస్తూ తృప్తిగా హాయిగా జీవిస్తున్నారు. మన దేశంలో పూస్తున్న మల్లెల సువాసనను మన తుమ్మెదలు గ్రహించలేని స్థితిలో ఉంటే... విదేశాలనుండి వచ్చిన తుమ్మెదలు ఆ అద్భుత సౌరభాలను హాయిగా ఆస్వాదించి... తిరిగి మన తుమ్మెదలకే మల్లెల సువాసనలు గురించి పరిచయం చేస్తున్నాయి. ఈ విషయం ఎంత విచిత్రమో కదా అనిపించడం లేదూ... ఇక్కడ తప్పు మన తుమ్మెదలదా, విదేశీ తుమ్మెదలదా. ఆలోచిస్తే ముమ్మాటికీ మన తుమ్మెదలదే. మన దేశంలో దొరికిన కాసింత జ్ఞానాన్ని వాళ్ళు గ్రహించి దాంతోటే వాళ్ళ దేశంలో అద్భుతాలు సృష్టిస్తుంటే, ఇక్కడ పుట్టి, ఇక్కడే పెరిగి మన భారతీయ విజ్ఞానంపై సర్వహక్కులూ కలిగి ఉండి,  నేర్చుకోగల అవకాశాలు ఉండికూడా భారతీయులు విఫలమవుతున్నారు.  ఈ అపాయకరమైన పరిస్థితిని గమనించి ఎందరో భారతీయ గురువులూ, తత్వవేత్తలూ, ఆధ్యాత్మిక ప్రవచకులూ గొంతు అరిగేలా అరిచి అరిచి చెప్తున్నా... కనీసం కొంచెమైనా పట్టించుకోలేని భయానకమైన స్థితిలో దేశప్రజలు దిగజారిపోతున్నారు. ఎందుకంటే... ప్రజలు తమకు తోచిన విధంగానే బ్రతకాలని నిర్ణయించుకున్నారు. ఎవరైనా జీవించడం గురించి చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించే విషయం ఒకటే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు అందుకే ఇలా చెబుతారు అని.  ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్టు  జీవించే పద్ధతిలో జీవితం వారిని కాలసర్పంలా కాటేస్తున్నా ఆ విషవలయాల మధ్య రొప్పుతూ బ్రతికేస్తున్నారు. విద్యార్థి దశనుండీ... పరీక్షల్లో ర్యాంకులైతే తెచ్చుకోగలరు కానీ జీవితంలో నిరంతరం పరాజయం పొందుతూనే ఉన్నారు. ఎందుకంటే జీవితం గురించిన పాఠాలు ఏ పాఠశాలలోనూ బోధించడం లేదు.  నేర్చుకుంటున్న విద్య  కడుపునిండా తిండి పెట్టగల్గుతోంది. కానీ ప్రశాంతమైన నిద్రను ఇవ్వడం లేదు. కలకాలం హాయిగా జీవించడానికి పనికిరాని విద్య... అసవరమే లేదు. ఆ విషయాన్ని ఎవరూ గ్రహించడం లేదు. అటువంటి విద్యతో బ్రతకగలరేమోగానీ జీవించలేరు. ఎలాగైనా బ్రతికేయడం...  జీవితమవుతుందా?? జీవించడమంటే.... వెయ్యేళ్ళు ప్రజల గుండెల్లో వర్ధిల్లాలి. జీవితమే భావితరాలకు జీవితకళను నేర్పే పాఠం కావాలి. గొప్పగా జీవించలేకపోయినా కనీసం తన కుటుంబంలోని సభ్యులతో ఏ చీకూచింతా లేకుండా, నిండు ఆరోగ్యంతో, నీతిగా, ధర్మబద్దంగా ప్రతిరోజూ ఆనంద పరవశులౌతూ మనసారా తృప్తిగా జీవించగల్గితే చాలు. తమ బిడ్డలకు నైతిక విలువలు నేర్పిస్తూ, దయా, కరుణ, ప్రేమతత్వాన్ని వారికి అమృతంలా అందిస్తూ... వారు సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా తయారయ్యేలా చేస్తూ... కనీసం వెయ్యి మందిలో ఒక్కరైనా నిజంగా జీవించగలుగుతున్నారా?... ఇవన్నీ ప్రశ్నించుకుంటే జీవించడం గురించి ఓ అవగాహన వస్తుంది.                                      ◆నిశ్శబ్ద.
  నేటి కాలంలో చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. కొందరి ప్రేమకథ పెళ్లికి దారితీయదు. ఏదైనా ప్రేమ బంధం దృఢంగా ఉండాలంటే సద్గురువు చెప్పిన ఈ మాటలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.  కొన్నిసార్లు ఇది బంధాన్ని విజయవంతం చేయడానికి సరిపోదు. బంధంలో నివసిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య అలాంటి కొన్ని సమస్యలు తలెత్తుతాయి. వారు తమ కోసం వేర్వేరు మార్గాలను ఎంచుకోవాలి.  వివాహాన్ని ప్రేమకు గమ్యస్థానంగా పరిగణించనప్పటికీ, జీవితాంతం కలిసి ఉండటమే అత్యంత అందమైన, పవిత్రమైన బంధం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు తమ ప్రేమికుడితో కలిసి కుటుంబాన్ని గడపాలని కలలు కంటారు. కానీ మీ ప్రేమను పెళ్లి దశకు ఎలా తీసుకురావాలో మీకు తెలియదు. అలాంటి వారికి సద్గురు సలహా ఉపయోగపడుతుంది. సంబంధాన్ని కాపాడుకోవడానికి సద్గురు సలహా: ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన సద్గురు, యువ తరం సమస్యలను బాగా అర్థం చేసుకుని, వారికి బాధ కలిగించకుండా వాటిని ఎలా పరిష్కరించాలో తెలిసిన మత గురువులలో ఒకరిగా పరిగణిస్తున్నారు. ప్రేమ సంబంధాన్ని మెరుగుపరచడానికి.. అతను ఇచ్చిన చిట్కాలను అనుసరించడం ద్వారా, మీరు మీ సంబంధాన్ని ప్రతి సమస్య నుండి కాపాడుకోవచ్చు. దానిని విజయవంతం చేయవచ్చు. ఈ విషయం మాత్రమే ప్రేమ సంబంధాన్ని విజయవంతం చేస్తుంది: సద్గురు చెప్పినట్లుగా, మీలో ఉన్న ప్రేమ సఫలీకృతం కావాలంటే, మీరు ముందుగా ఓడిపోవడం నేర్చుకోవాలి, ఎక్కువ కాలం ఉండకూడదు లేదా అంతం కాదు. మీ సంబంధాన్ని గెలవాలంటే మీరు ప్రేమలో ఓడిపోయిన వ్యక్తి అయి ఉండాలి. సంబంధంలో జీవిస్తున్న ఇద్దరూ దీనిని అర్థం చేసుకున్నప్పుడు, వారి జీవితమంతా ఏదీ వారిని వేరు చేయదు. వారి ప్రేమ అజరామరం. ప్రేమలో ఓడిపోవడం అంటే ఏమిటి? జీవితంలో ఎప్పుడూ ఓడిపోకండి, కానీ మీ ప్రేమికుడితో మీ సంబంధాన్ని చిరస్థాయిగా మార్చుకోవడానికి మీరు ఓడిపోవడం మంచిది. యుద్ధాల్లో గెలవాలంటే ఓడిపోయినట్లే, ప్రేమ కూడా వీటిలో ఒకటి మాత్రమే. అయితే అంతకు ముందు రిలేషన్ షిప్ లో లూజర్ అంటే అర్థం తెలుసుకోండి. మీ భాగస్వామి కోసం ఏదైనా చేయండి: ప్రతి ఒక్కరూ ప్రేమలో లావాదేవీల గురించి మాట్లాడుతారని సద్గురు చెప్పారు. అయితే అందులో ఓడిపోయిన వారిని ఎంచుకుంటేనే మీరు మీ ప్రేమ వ్యవహారాన్ని విజయవంతం చేయగలరు. దీని కోసం మీరు కోల్పోయేది ఏమీ లేదు. మీ భాగస్వామి నుండి మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ చేయడం అంటే. ఇలా చేయడం వల్ల మాత్రమే ప్రేమ పెరుగుతుంది. సంబంధాలు చిరస్థాయిగా ఉంటాయి. అటువంటి వ్యక్తుల సంబంధం విజయవంతం కాదు: ఇతరులు మీ నుండి తీసుకోవాలని మీరు ఎల్లప్పుడూ ఆశించినట్లయితే, ఎవరూ మీతో సంబంధాన్ని కలిగి ఉండకూడదని సద్గురు వివరిస్తున్నారు. మీరు ఎల్లప్పుడూ మీ గురించి ఆలోచించకూడదు: రిలేషన్‌షిప్‌లో ప్రతి ఒక్కరికీ కొన్ని అంచనాలు ఉంటాయి. భాగస్వామి మీతో నిజాయితీగా ఉండాలి, మిమ్మల్ని గౌరవించాలి, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు. అంతే కాకుండా అనవసరమైన అంచనాల భారాన్ని వారి భుజాలపై వేసుకోవడం సరికాదు. ఇది మీ సంబంధాన్ని నాశనం చేస్తుంది. విజయవంతమైన ప్రేమ సంబంధం అంటే ఏమిటి? ప్రేమ సంబంధం  విజయం ప్రతి జంటకు భిన్నంగా ఉంటుంది. కొందరు వివాహ దశకు చేరుకోవడం ద్వారా తమ సంబంధాన్ని విజయవంతంగా భావిస్తారు, కొందరు దీనిని ఎల్లప్పుడూ ఒకరికొకరు సుఖంగా ఉన్నట్లు భావిస్తారు, తద్వారా మూడవ వ్యక్తి రాక వారి సంబంధాన్ని మార్చదు.
కలబంద.. చర్మం, జుట్టు, ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.దీనిని రోజూ తీసుకోవడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులు దూరంగా ఉంటాయి. కలబందలో ఉండే విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్ మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో అలోవెరా జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తిని, జీవక్రియను మెరుగుపరుస్తుంది.మలబద్ధకం, రక్తహీనత వంటి తీవ్రమైన వ్యాధులకు చెక్ పెడుతుంది. అనేక తీవ్రమైన వ్యాధుల చికిత్సలో ఆయుర్వేదంలో అలోవెరాను సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ సీజన్‌లో కలబంద ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు దీన్ని జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. చల్లటి వాతావరణంలో అలోవెరా జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో.. ఏయే వ్యాధులను దూరం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం నుండి ఉపశమనం: ఆంత్రాక్వినోన్ అనే సమ్మేళనం కలబందలో ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది కాకుండా, కలబంద వినియోగం కడుపు తిమ్మిరిని నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల, ఈ సీజన్‌లో, మీరు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి  అలోవెరా జ్యూస్ తాగవచ్చు. రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది: ఈ సీజన్‌లో, చాలా మందిలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా, అటువంటి వ్యక్తులు అనేక సీజనల్ వ్యాధులకు గురవుతారు. అందువల్ల, ఈ సీజన్‌లో మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, మీరు కలబంద జ్యూస్ తాగాలి. శరీరం నిర్విషీకరణ : అలోవెరా జ్యూస్ శరీరంలోని టాక్సిక్ ఎలిమెంట్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. వాస్తవానికి, శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలను ఆహ్వానించే అనేక విష పదార్థాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, కలబంద రసం తీసుకోవడం ఈ తొలగింపు ప్రక్రియలో సహాయపడుతుంది. అలోవెరా జ్యూస్ ను క్రమం తప్పకుండా తాగుతే ఆరోగ్యంతోపాటు అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. రక్తహీనత సమస్యకు చెక్: నేటికాలంలో చాలా మంది రక్తహీనతకు లోనవుతున్నారు. అటువంటి పరిస్థితిలో, ఒక గ్లాసు కలబంద రసం ఈ సమస్యను వదిలించుకోవడానికి మీకు సహాయపడుతుంది. నిజానికి కలబంద రసాన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి రక్తహీనత సమస్య దూరమవుతుంది. పొడి చర్మం నుండి ఉపశమనం: చలికాలంలో తరచుగా చర్మం పొడిబారుతుంది. అందువల్ల, ఈ సీజన్‌లో కూడా మీ ముఖం పోషణతో ఉండాలంటే, కలబంద రసాన్ని మీ ముఖానికి అప్లై చేయడమే కాకుండా, దాని జ్యూస్ తాగండి. నిత్యం ఈ జ్యూస్ తాగడం వల్ల మీ ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. ఎప్పుడు తాగాలి? మీరు కలబంద జ్యూస్‌ని సాయంత్రం పూట కూడా తాగవచ్చు. అయితే ఉదయం పూట కలబంద జ్యూస్ తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు.  
సీజన్ల వారిగా లభించే పండ్లలో నేరేడు పండ్లు కూడా ప్రముఖమైనవి.  వేసవి కాలం ఇక ముగుస్తుందనగా మార్కెట్లలోకి చొచ్చుకువచ్చి సందడి చేసే నేరేడు పండ్లు రుచిగా ఉండటమే కాదు, బోలెడు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. వైలెట్ కలర్ లో ఉంటూ ఉప్పగా, వగరుగా ఉండే ఈ నేరేడు కాయలు  క్రమంగా నల్లగా మారి నిగనిగలాడుతూ చెప్పలేనంత తియ్యదనంగా మారుతాయి.  జామూన్ ఫ్రూట్ గా పిలిచే ఈ నేరేడు లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యం దీనికున్న ప్రత్యేక లక్షణం. అయితే నేరేడు పండ్లు అందరూ తింటారు. కానీ గింజలు ఉపయోగించే వారు తక్కువ. నేరేడు పండ్లలానే వాటి గింజలు కూడా అంతే ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే అవి మధుమేహం నియంత్రించడంలో అద్భుతాలు చేయడమే కాకుండా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. నేరేడు గింజల పొడి ప్రయోజనాలను తెలుసుకుంటే నేరేడు పండ్లు తినగానే ఆ విత్తనాలను ఇకమీదట పడెయ్యరు. నేరేడు గింజలు పొడి తీసుకోవడం ద్వారా కలిగే అయిదు అద్భుత ప్రయోజనాలు ఏమిటంటే.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి, గ్లైకోసూరియాను తగ్గించడానికి నేరేడు విత్తనాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పండు గింజలు జంబోలిన్ మరియు జాంబోసిన్ అనే క్రియాశీల పదార్ధాలను కలిగి ఉంటాయి, ఇవి రక్తంలోకి విడుదలయ్యే చక్కెర రేటును నెమ్మదిస్తాయి. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. శాస్త్రీయంగా, ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంది, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఫలితంగా  మూత్రవిసర్జన, చెమటలను సహజంగా నిర్వహించడంలో సహాయపడుతుంది.  నేరేడు విత్తనాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణం కారణంగా, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టానికి వ్యతిరేకంగా పోరాడుతాయి, కాలేయ కణాలను రక్షిస్తాయి. ఇంకా ఈ గింజలు పొడిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి, ఇది కాలేయంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.  నేరేడు గింజల పొడిలో ఎల్లాజిక్ యాసిడ్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి రక్తపోటు వేగవంతమైన హెచ్చుతగ్గులను నియంత్రించడంలో  సహాయపడతాయి. నేరేడు గింజలు ఫ్లేవనాయిడ్లు, ఫినాలిక్ సమ్మేళనాల వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ అయిదు ప్రయోజనాలు పొందడానికి నేరేడు గింజల పొడిని తీసుకోవడం మంచిది. ◆నిశ్శబ్ద
ద్రాక్ష ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనది. దీని రుచి చాలా బాగుంటుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ద్రాక్షలో అనేక రకాలు ఉన్నాయి.  ఎరుపు, నలుపు,  ఆకుపచ్చ రంగులలో లభిస్తుంది. వీటిలో ఎర్ర ద్రాక్ష కాస్త ప్రత్యేకం. ఎర్ర ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. ఎర్ర ద్రాక్షలో విటమిన్ ఎ,  సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం, కాపర్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ  శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలు. ఎర్ర ద్రాక్ష వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓ లుక్కేస్తే...  రోగనిరోధక వ్యవస్థ.. ఎర్ర ద్రాక్షను క్రమం తప్పకుండా తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు ఎముకలతో పాటు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. కంటి ఆరోగ్యం.. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎర్ర ద్రాక్ష మంచి ఎంపిక. ఎర్ర ద్రాక్ష ఆక్సీకరణ ఒత్తిడిని,  కళ్ల మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎర్ర ద్రాక్షను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కంటిశుక్లం రాకుండా చేస్తుంది. బీపీ పై నియంత్రణ.. ఎర్ర ద్రాక్ష తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్,  ఫినోలిక్ యాసిడ్లు గుండెను వ్యాధుల నుండి రక్షించడానికి పని చేస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని  మెరుగుపరుస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యం.. ఎర్ర ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్,  యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కిడ్నీ సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి.  కిడ్నీ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియ.. ఎర్ర ద్రాక్షలో ఉండే పొటాషియం,  ఫైబర్  జీర్ణక్రియకు సహాయపడతాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా ఎర్ర ద్రాక్షను ఆహారంలో చేర్చుకోవాలి. కొలెస్ట్రాల్‌.. ఎర్ర ద్రాక్ష కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.  ఆహారంలో ఎర్ర ద్రాక్షను చేర్చుకోవడం ద్వారా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. ఇది జ్ఞాపకశక్తిని,  మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.                                                    *నిశ్శబ్ద.