LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో  విజయవాడ మేయర్ స్థానానికి సంబంధించిన ఫలితాలు అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి అధికారిక  తెలుగుదేశం కూటమి అభ్యర్థి  అభ్యర్థి, జనసేన నాయకుడు వంగవీటి రాధాకృష్ణ స్పష్గమైన ఆధిక్యిన్ని ప్రదర్శిస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే కాంగ్రెస్, కమ్యూనిస్టుల మద్దతులో మేయర్ అభ్యర్థిగా నిలిచిన స్వతంత్ర అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రెండో స్థానంలో నిలిచారు. ఇక్కడ వైసీపీ మూడో స్థానానికి పరిమితమైంది. ఇక పోతే వంగవీటి రాధాకృష్ణ బెజవాడ నగరంలో తనకున్న విస్తృతమైన ప్రజాదరణకు తోడు కూటమి శ్రేణుల బలం తోడవడంతో ఆరంభం నుంచీ గెలుపు బాటలో దూసుకుపోతున్నారు. ఒక్కో రౌండుకూ వంగవీటి రాధా ఆధిక్యం పెరుగుతూ వస్తున్నది. అలాగే విజయవాడ నగరంలోనిమెజారిటీ డివిజన్లలో తెలుగుదేశం కూటమికి ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు.   ఇక విజయవాడ మేయర్ బరిలో నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి, స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు   రెండో స్థానంలో కొనసాగుతున్నారు. మేధావులు, వామపక్షాల మద్దతుతో పాటు నగరంలోని విద్యావంతులైన ఓటర్ల మద్దతును పొందడంలో ఆయన సక్సెస్ అయ్యారని అవగతమౌతుంది. ఈ ప్రతిష్ఠాత్మక స్థానంలో వైసీపీ   అభ్యర్థి, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మూడో స్థానానికి పరిమితమౌతున్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ఈ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని భావించినప్పటికీ, నగర ఓటర్లు కూటమి అభ్యర్థికే జైకొడుతున్నారని కౌంటింగ్ లో వెల్లడౌతున్న ఫలితాన్ని బట్టి స్పష్టమౌతోంది.   ఎన్నికల ప్రచారంలో వంగవీటి రాధాకృష్ణ,  ఏబీ వెంకటేశ్వరరావు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు పోకుండా హుందాతనంతో వ్యవహరించడం విశేషం. నగరాభివృద్ధికి సంబంధించి మేధావుల, అనుభవజ్ఞుల సలహాలను స్వీకరిస్తానని రాధా ప్రకటించగా, ఇది కేవలం సిద్ధాంతాల పోరాటమని ఏబీవీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఈ ఎన్నికల పోరులో బెజవాడ ప్రజల మొగ్గు తెలుగుదేశం కూటమి వైపే ఉన్నట్లు ఓటింగ్ ను బట్టి స్పష్టంగా అవగతమౌతోంది.  తుది రౌండ్ల లెక్కింపు కూడా త్వరలోనే పూర్తయిన అనంతరం  విజయవాడ కొత్త మేయర్ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.   [Vijayawada Mayor Election Results, Vangaveeti Radha Leading, AB Venkateswara Rao, Second Place, Vijayawada Corporation Counting, AP Local Body Polls, Telugu One] 
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీల ఎన్నికల ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతోంది. అధికార తెలుగుదేశం కూటమి  ప్రారంభం నుంచే స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ పలు స్థానాలను కైవసం చేసుకుంటున్నది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వెలువడుతున్న ఫలితాలు అధికార కూటమికి హవాకు అద్దం పడుతున్నాయి. పుర పోరులో భాగంగా  పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన సిబ్బంది, ఆ తర్వాత సాధారణ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది. ఇక్కడ మెజారిటీ వార్డులను కైవసం చేసుకోవడంతో పాటు, ఎర్రగుంట్ల నగర పంచాయతీలోనూ కూటమి అభ్యర్థులు   విజయం సాధించారు. ఇక ఉమ్మడి  ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ తెలుగుదేశం కూటమి అభ్యర్థులు తమ ప్రాబల్యాన్ని చాటుతున్నారు. పెద్దాపురం లాంటి ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించగా, మిగిలిన అర్బన్ లోకల్ బాడీస్‌లోనూ కూటమి పార్టీల మధ్య సమన్వయం సత్ఫలితాలను ఇస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించిన కూటమి నాయకత్వం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడమే ఈ విజయాలకు ప్రధాన కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మరోవైపు, కొన్ని తీర ప్రాంతాల్లో మాత్రం ప్రతికూల వాతావరణం, భారీ వర్షాల ప్రభావం కౌంటింగ్ ప్రక్రియపై పడింది. ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో తుఫాను ప్రభావం కారణంగా ఓట్ల లెక్కింపులో  స్వల్ప ఆలస్యం చోటుచేసుకుంది. అయినప్పటికీ అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా గట్టి భద్రతా ఏర్పాట్లతో కౌంటింగ్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. పోలీసుల పటిష్ట నిఘా నడుమ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా తుది ఫలితాలు పూర్తిగా వెలువడే కొద్దీ ఏయే పురపాలక సంఘాలు ఏ పార్టీ  ఖాతాలో  చేరనున్నాయనే అంశంపై స్పష్టత రానుంది.   [AP Municipal Election Results, Vote Counting, TDP Jana Sena BJP Alliance, AP Local Body Elections, Telugu One] 
మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీ  అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిందంటూ తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను  ఆశ్రయించింది. వైసీపీ అగ్రనేతలు, కార్యకర్తలు ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ ఎన్నికల నిర్వహణకు విఘాతం కలిగించారని ఆరోపిస్తూ   ఫిర్యాదు  అందజేశారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు,  ఎంఎల్‌సి వర్ల రామయ్య నేతృత్వంలోని ప్రతినిధి బృందం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్   అనిల్ చంద్ర పునేఠాని కలసి ఈ ఫిర్యాదు చేసింది. ఎస్ఈసీని కలిసిన బృందంలో వర్ల రామయ్య తో పాటు నాలెడ్జ్ కమిటీ చైర్మన్ గురజాల మాల్యాద్రి, జాతీయ అధికార ప్రతినిధి,  ఏపీ బయో డైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు,  బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్,  తెలుగుదేశం పార్టీ అధికారప్రతినిది బండారు వంశీ కృష్ణ తదితరులు ఉన్నారు. ఈ  సందర్భంగా వారు  పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. దీంతోపాటు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన అక్రమాలను కూడా ప్రత్యేకంగా ఫిర్యాదులో ప్రస్తావించారు. 16వ డివిజన్‌లోని గుణదల ప్రాంతానికి చెందిన బూత్ నెంబర్ 5లో పోలింగ్ ప్రక్రియ సాఫీగా సాగుతున్న సమయంలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా చొరబడ్డారని   వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ, నిబంధనలను ఉల్లంఘించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  అధికార పరిధిని దాటి, పోలింగ్ కేంద్రాల్లోకి అనుచరులతో ప్రవేశించి ఓటర్లను భయపెట్టేలా వ్యవహరించిన దేవినేని అవినాష్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని   డిమాండ్ చేశారు.  తెలుగుదేశం పార్టీ నేతలు అందించిన ఫిర్యాదులను స్వీకరించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా, ఈ అంశాలపై నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తామని తెలిపారు. సమగ్ర విచారణ జరిపి నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. [TDP Complaint SEC, Pulivendula Municipality Elections, Jagan, Provocation, Gunadala, Devineni Avinash, Booth Entry, AP Local Body Elections, Telugu One] 
ALSO ON TELUGUONE N E W S
అన్నా మొత్తం పది కావాలి.. ఈ షో కి ఐదు ఇచ్చి వేరే షో కి ఐదు ఇస్తా,వేరే బ్యాచ్ కి కూడా  ఇవ్వాలి సర్దుతున్నాను.. వెంటనే బుంగమూతి... కొన్నిసార్లయితే  టికెట్ లాక్కుని పరుగెత్తడం.. పోలీసులు, రెవిన్యూ ఆఫీసర్ల చేత ఫోన్లు.. క్యూ లైన్ దగ్గర రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్... ఈ పాటికే అర్ధమయ్యి ఉంటుంది సినిమా టికెట్స్ కోసమని. అంత సందడి వాతావరణం నెలకొని ఉండేది. టికెట్ దొరకగానే డబ్బులని పై జేబులో, టికెట్ ని ఎన్నో రకాలుగా మడతలు పెట్టి లోపల జేబులో దాచుకునే వాళ్ళైతే కోకొల్లలు.  నాటి రోజుల్లో థియేటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉండటం, ప్రింట్ల కొరత కారణంగా ఒక పెద్ద సినిమా కేవలం కొన్ని పరిమిత థియేటర్లలో మాత్రమే విడుదలయ్యేది. దానివల్ల మొదటి వారం టిక్కెట్టు సంపాదించడం ఒక బ్రహ్మవిద్యలా మారేది. టిక్కెట్ల కోసం థియేటర్ సిబ్బంది, మేనేజర్ల చుట్టూ తిరగడం, ప్రజా ప్రతినిధుల చేత  రికమండేషన్ లెటర్లు పట్టుకుని వెళ్లడం నాటి కాలంలో ఒక పెద్ద హంగామాగా నడిచేది. రికమండేషన్ ఉంటే తప్ప ఫస్ట్ డే ఫస్ట్ షో టిక్కెట్టు దక్కేది కాదు. బ్లాక్ మార్కెట్‌లో వందల రూపాయలు పెట్టి టిక్కెట్లు కొనుగోలు చేయడం ఒక సాధారణ విషయంగా ఉండేది. కానీ, కాలక్రమేణా డిజిటలైజేషన్ మరియు సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ఆ రోజులు పూర్తిగా మారిపోయాయి.  ఇప్పుడు డిజిటల్ క్యూబ్, యుఎఫ్ఓ (UFO) వంటి సాంకేతికతల వల్ల ఒక్క క్లిక్‌తో ప్రపంచవ్యాప్తంగా వేల థియేటర్లలో ఒకేసారి సినిమాను ప్రదర్శించే వీలు కలిగింది. దీనికి తోడు మల్టీప్లెక్స్‌ల సంఖ్య విపరీతంగా పెరగడం, మల్టీ-స్క్రీన్ కల్చర్ రావడం వల్ల ఒకే థియేటర్ సముదాయంలో రోజుకు పదుల సంఖ్యలో షోలు వేసే వెసులుబాటు వచ్చింది. దీనివల్ల పెద్ద సినిమాలకు మొదటి రోజే అత్యధిక సంఖ్యలో థియేటర్లను కేటాయించడం సాధ్యమైంది. ఒక్కోసారి హైదరాబాద్, విజయవాడ,వైజాగ్ వంటి పెద్ద నగరాల్లో ఒకే సినిమాకు మొదటి రోజు వందలాది స్క్రీన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాకుండా, బుక్ మై షో, పేటీఎం వంటి ఆన్‌లైన్ టిక్కెటింగ్ యాప్‌లు అందుబాటులోకి రావడంతో సీట్ బుకింగ్ ప్రక్రియ వేళ్ల కొనలపైకి వచ్చేసింది. థియేటర్ క్యూ లైన్లలో నిలబడే అవసరం లేకుండానే ఇంట్లోనే కూర్చుని మనకు నచ్చిన సీటును ఎంచుకునే సౌలభ్యం ప్రేక్షకులకు లభించింది. ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్ వల్ల టిక్కెట్ల కేటాయింపులో పారదర్శకత పెరిగింది. అప్పట్లో నడిచిన రికమండేషన్లు, థియేటర్ సిబ్బంది ప్రాధాన్యతలు మరియు బ్లాక్ మార్కెటింగ్ దందాలకు ఇది పెద్ద చెక్ పెట్టింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా ఇప్పుడు ఆన్‌లైన్ నెట్‌వర్క్‌తో అనుసంధానం కావడంతో సామాన్య ప్రేక్షకుడు కూడా సులభంగా టిక్కెట్టు పొందే వెసులుబాటు వచ్చింది. ఇది కూడా చదవండి: సినిమాలే సినిమాలు: ఈ వారం థియేటర్స్, ఓటీటీల్లో వచ్చే చిత్రాలివే..టోటల్ 24!   అయితే, ఈ సులభమైన అందుబాటు వల్ల నాటి రోజుల్లో ఉన్న ఒక ప్రత్యేకమైన ఉత్సాహం, థ్రిల్ తగ్గిందనేది  నిజం. అప్పట్లో క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడి, రికమండేషన్లతో కష్టపడి టిక్కెట్టు సంపాదించి సినిమా చూసినప్పుడు వచ్చే ఆనందం వేరుగా ఉండేది. కానీ నేటి ఆన్‌లైన్ యుగంలో వేల స్క్రీన్లలో ఒకేసారి విడుదల కావడం వల్ల టిక్కెట్ల లభ్యత చాలా సులువుగా మారింది. పాత రోజుల నాటి క్యూ లైన్లు, రికమండేషన్ల హంగామా మళ్లీ తిరిగి రావడం అసాధ్యమే అయినప్పటికీ, ఆధునిక సాంకేతికత ప్రేక్షకుడికి కల్పించిన సౌకర్యం, సమయం ఆదా మాత్రం వినోద ప్రపంచంలో ఒక విప్లవాత్మకమైన మార్పుగా నిలిచింది.        [Cinema Ticket Queues History Online Booking Transformation, cinema ticket booking queue lines, online movie ticket booking system, theater recommendation letters history, TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News]
సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు అంతర్జాతీయ గేమింగ్‌ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. ముంబైకి చెందిన ప్రముఖ ఇంటరాక్టివ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ షార్ట్‌గన్‌ గేమ్స్‌ (Shotgun Games)లో వ్యూహాత్మక పెట్టుబడిదారుగా భాగస్వామి అయ్యారు. దీంతో మహేశ్‌ వ్యాపార ప్రయాణంలో మరో ఆసక్తికరమైన అధ్యాయం మొదలైంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా షార్ట్‌గన్‌ గేమ్స్‌ ‘టేక్‌డౌన్‌: జెనెసిస్‌’ (Takedown: Genesis) పేరుతో భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌ గేమ్‌ను అభివృద్ధి చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ గేమ్‌ను రూపొందిస్తున్నారు. సంస్థ సహ వ్యవస్థాపకులు జీత్‌ చందన్‌, విధిత్‌ మెహతాతో కలిసి మహేశ్‌ ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యారు. ప్రముఖ దర్శకుడు విక్కీ అరోరా నేతృత్వంలో గేమ్‌ రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమాలతో పాటు పలు వ్యాపార రంగాల్లోనూ ఆసక్తి చూపిస్తున్న మహేశ్‌.. ఇప్పుడు గేమింగ్‌ పరిశ్రమలోకి అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. మరి ‘టేక్‌డౌన్‌: జెనెసిస్‌’ అంతర్జాతీయ గేమింగ్‌ మార్కెట్‌లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి. ఇది కూడా చదవండి: స్పిరిట్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్.!       [Mahesh Babu New Business, Mahesh Babu Gaming Industry, Mahesh Babu, Shotgun Games, Takedown Genesis, Vicky Arora, Indian Gaming Industry, Telugu News]  
  ఎప్పటిలాగానే సినీ ప్రియులు సినిమా ఉండగా మాలో నో డల్ నెస్ అనే పరిస్థితి. దీంతో ఈ వారం థియేటర్స్ , ఓటిటిలో అడుగుపెట్టే చిత్రాలు ఇవే అంటూ సోషల్ మీడియా వేదికగా సదరు లిస్ట్ ని షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. మరి ఆ లిస్ట్ మనం కూడా చూసేద్దాం.  .ఈ వీకెండ్‌లో థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కలిపి దాదాపు 30కి పైగా కొత్త సినిమాలు, క్రేజీ వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు క్యూ కట్టాయి.  నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం 'రామాయణం' (Ramayana) మొదటి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. రణబీర్  కపూర్, యశ్, సాయి పల్లవి వంటి దిగ్గజ తారాగణం నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అలాగే కోలీవుడ్ నుంచి సూర్య నటించిన 'సీన్' (Scene), నయనతార లీడ్ రోల్ పోషించిన డివోషనల్ ఫ్యాంటసీ కామెడీ చిత్రం 'మూకుత్తి అమ్మన్ 2' (Mookuthi Amman 2) కూడా నవంబర్ 6న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి.    నెట్‌ఫ్లిక్స్ బాస్ ఎక్స్ మెషీనా (ఇంగ్లిష్ యానిమేటెడ్ సిరీస్) – నవంబర్ 03 ఏ డాగ్స్ ఫెర్ఫెక్ట్ క్రిస్మస్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబర్ 04 టేకెన్: నటాలీ హాలోవే ఇంగ్లిష్ డాక్యుమెంటరీ) – నవంబర్ 04 అనస్తీషియా (పోలిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 04 బ్లాక్ డోవ్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 05 నార్త్ ఆఫ్ ద నార్త్ సీజన్ 2 (కెనడియన్ వెబ్ సిరీస్) – నవంబర్ 05 వన్ ఇయర్ టూ లివ్, బై ఏ మ్యాన్ (జపనీస్ మూవీ) – నవంబర్ 05 దిల్‌వాలీ దివాళీ (హిందీ సినిమా) – నవంబర్ ౦౫ కౌరిబురీర్ మందిర్ (బెంగాలీ వెబ్ సిరీస్) – నవంబర్ 06 పాజిబుల్ లవ్ (కొరియన్ మూవీ) – నవంబర్ 06  ఇది కూడా చదవండి: సినిమానా, తుఫానా: విక్టరీ ఎవరిది!   జియో హాట్‌స్టార్ మినియన్స్ అండ్ మాన్‌స్టర్స్ ( ఇంగ్లిష్ సినిమా) – నవంబర్ 02 ద గిల్డెడ్ ఏజ్ సీజన్ 4 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 02 ఐ యామ్ గేమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబర్ 06 మోటూ పత్లూ అండ్ మిస్టరీ ఆఫ్ ఏ నాగమణి (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబర్ 08 అండర్ సీజ్ (కొలంబియన్ వెబ్ సిరీస్) – నవంబర్ 06  అమెజాన్ ప్రైమ్ వీడియో ద గ్రేటెస్ట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 04 ద వాన్ (హిందీ సినిమా) – నవంబర్ 06 ద ఇన్‌స్టిట్యూట్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 08  జీ5 బ్లైండ్ గేమ్ (హిందీ సినిమా) – నవంబర్ 04 నూర్ కోడివానవిళ్ (తమిళ మూవీ) – నవంబర్ 06 సన్ నెక్స్ట్ అనకాపల్లి (తెలుగు సినిమా) – నవంబర్ 03 సోనీ లివ్ హైవాన్ (హిందీ మూవీ) – నవంబర్ 06  ఆపిల్ టీవీ ప్లస్ స్టిక్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబర్ 04 మీసయ్య మురుక్కు (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబర్ 06  మరి ఇన్ని చిత్రాలు ఉండంగా సినీ, ఓటిటి ప్రియుల్లో డల్ నెస్ ఎందుకు ఉంటుంది చెప్పండి!     [This week Ott Theatrical Releases, Nov First Week ott theatrical releases, November OTT releases, new movies this week, theater releases, TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News]
ప్రభాస్‌–సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్‌’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. సినిమా క్లైమాక్స్‌ కోసం చిత్రబృందం భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఈ షెడ్యూల్‌లోనే ప్రభాస్‌తో ఓ ప్రత్యేకమైన పాటను కూడా చిత్రీకరించనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ‘స్పిరిట్‌’ క్లైమాక్స్‌ సీక్వెన్స్‌ను చాలా భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు సందీప్‌ రెడ్డి వంగా ప్లాన్‌ చేస్తున్నారట. ఇందుకోసం ప్రత్యేకంగా భారీ సెట్‌ నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తదుపరి షెడ్యూల్‌లో ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. సందీప్‌ గత చిత్రాల్లో క్లైమాక్స్‌ సన్నివేశాలు ఎంత ఇంటెన్స్‌గా ఉంటాయో తెలిసిందే. దీంతో ప్రభాస్‌తో ఆయన ఎలాంటి యాక్షన్‌ ఎపిసోడ్‌ను ప్లాన్‌ చేశారనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. క్లైమాక్స్‌ షూటింగ్‌ పూర్తయిన తర్వాత ప్రభాస్‌పై ఓ స్పెషల్‌ సాంగ్‌ను కూడా చిత్రీకరించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రభాస్‌ మాస్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ పాటను రూపొందించబోతున్నారట. ఈ సినిమాలో ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లో ఆయన గాయాలతో, రఫ్‌ లుక్‌లో కనిపించి అభిమానుల్లో ఆసక్తిని పెంచారు. ఇక కథలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో ప్రభాస్‌ మరింత వైల్డ్‌, మాస్‌ అవతార్‌లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘స్పిరిట్‌’ దీపావళి కానుకగా అక్టోబర్‌ 29, 2027న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కూడా చదవండి: లెజెండ్‌ సినిమా చేయడం నచ్చలేదు.. రాధికా ఆప్టే కామెంట్స్‌పై నెటిజన్లు ఫైర్‌!       [Spirit Climax Shooting Update, Prabhas Spirit, Spirit Movie Update, Spirit Climax Shooting, Spirit Special Song, Prabhas, Sandeep Reddy Vanga, Triptii Dimri, Spirit Release Date, Telugu Film News]  
  చాలా సినిమాల్లో విలన్ నోటి నుంచి ఒక ఫేమస్ డైలాగ్ వినుంటాం. బంగాళాఖాతంలో పడిన వాయుగుండం మరింతగా తన ఉధృతాన్ని చూపనుంది. దీంతో పెను తుఫాన్ పక్కా అని. ఇప్పడు ఆ సినిమానే రియల్ గా తుఫాన్ గండాన్ని మోయాల్సిన పరిస్థితి.     ముఖ్యంగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణ'తో పాటు రీసెంట్‌గా ఎనౌన్స్ అయి మంచి క్రేజ్ తెచ్చుకున్న 'సీన్' సినిమాపై ఈ ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతోందనే చర్చ ఊపందుకుంది. గత కొన్ని నెలల సినీ గణాంకాలని పరిశీలిస్తే, టాలీవుడ్ తో పాటు బహుభాషా చిత్రాల బాక్సాఫీస్ వద్ద ప్రతివారం వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు మొదటి 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 60% నుండి 70% వరకు థియేటర్ల ఆక్యుపెన్సీ నమోదవుతుండగా, దాదాపు 200  కోట్ల నుండి 300 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు రావడం సాధారణంగా మారింది. ఇలాంటి సమయంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న తుఫాన్ ప్రభావంతో మేకర్స్, ట్రేడ్ సర్కిల్స్ హడలెత్తిపోతున్నారు.   ఇది కూడా చదవండి : రామాయణ అడ్వాన్స్ బుకింగ్ పరిస్థితి ఇదే: ముఖ్యంగా ఏరియాలోనే అలా ఎందుకు!        రామాయణ, సీన్ రెండు భారీ అగ్ర కాస్టింగ్  చిత్రాలే. ముఖ్యంగా రామాయణ కనివిని ఎరుగని బడ్జెట్ తో వస్తుంది.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ముసురు వాతావరణం ఆవహించి ఉంది. ప్రత్యేకించి ఏపి తుఫాన్ హెచ్చరికతో ఉండగా, తెలంగాణ కూడా తుఫాన్ ప్రభావం ఉండవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా ఎన్నో తుఫాన్ లని సెల్యులాయిడ్ పై చూపించిన సినిమా ఇప్పడు తుఫాన్ భయంతో ఉంది. సినీ ప్రియులు మాత్రం ఐదవ తారీకుకి కల్లా మాములు వాతావరణం ఉంటుందని అంటున్నారు.      [Murasu Cyclon effect On Movies, Cyclon effect Movies, Ramayana, Scene, Suriya, Ranbir Kapoor, TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News]  
  వరల్డ్ సెల్యులాయిడ్  మరోసారి సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేత రాముడి దివ్య దర్శనాన్ని చూడటానికి ముహూర్తం స్టార్ట్ అయ్యింది. వరల్డ్ వైడ్ గా ఉన్న అన్ని థియేటర్స్ కూడా  అడ్వాన్స్ బుకింగ్స్ ని 1 st తారీకు నుంచే స్టార్ట్ చేసాయి. దీంతో చాలా రోజుల తర్వాత థియేటర్స్  తమ లోపల బొమ్మని నడుపుతున్నా,లేకపోయినా అభిమానులు, రామ భక్తులతో సందడి వాతావరణం నెలకొని ఉంది. దీంతో విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.తాజా నివేదికల ప్రకారం, 'రామాయణ' చిత్రం విడుదలకూ ముందే ప్రపంచవ్యాప్తంగా  105 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ సాధించి ట్రేడ్ వర్గాలని  సైతం విస్మయానికి గురిచేసింది. భారతదేశం వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 700 నగరాల్లో 59,463 షోలకు గానూ 18.46 లక్షల కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. కేవలం భారత్‌లోనే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 72.26 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదైనట్లు బాక్సాఫీస్ ట్రాకర్లు ధృవీకరించారు. సాధారణ సీటింగ్‌తో పాటు ఆన్‌లైన్ బ్లాక్ చేసిన సీట్లతో కలిపి ఈ మొత్తం నమోదవ్వగా, కేవలం పక్కా కన్ఫర్మ్డ్ టిక్కెట్ల విలువ రూ. 57.60 కోట్లుగా ఉంది.    భాషల వారీగా వసూళ్లను పరిశీలిస్తే, హిందీ వెర్షన్ రికార్డు స్థాయిలో రూ. 59.60 కోట్లతో ఏకంగా 82 శాతం వాటాను సొంతం చేసుకుంది. దక్షిణ భారతదేశంలో యష్ క్రేజ్ కారణంగా కన్నడ వెర్షన్ రూ. 6.06 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా రాముడి కథపై ఉన్న అపారమైన ఆదరణతో  5.37 కోట్లు కలెక్ట్ కాగా, తమిళంలో  1.01 కోట్లు మరియు మలయాళంలో రూ. 22.27 లక్షల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. నగరాల పరంగా ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో అత్యధికంగా10.42 కోట్లు, ముంబైలో  9.42 కోట్లు, బెంగళూరులో రూ. 8.07 కోట్లు మరియు హైదరాబాద్‌లో రూ. 4.57 కోట్ల విలువైన టిక్కెట్లు అమ్ముడయ్యాయి.    ప్రత్యేకించి ప్రీమియం ఫార్మాట్లపై సినీ ప్రియులు విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. IMAX, 4DX, Dolby, EPIQ మరియు ICE వంటి లగ్జరీ స్క్రీన్‌లలో 1,138 షోలకు గానూ రూ. 12.89 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయి. ఇది మొత్తం దేశీయ వసూళ్లలో 18 శాతంగా నిలవడం విశేషం. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ రామాయణ ప్రవాహం కొనసాగుతోంది. ఒక్క ఉత్తర అమెరికాలోనే తొలి 5 రోజుల వ్యవధికి గాను 1.40 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి.   అక్కడ మొదటి ఐదు రోజుల్లోనే $13 మిలియన్ల నుండి $14 మిలియన్ల వరకు కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వరల్డ్ వైడ్ ఓపెనింగ్ డే రోజున ఈ చిత్రం  200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ లెక్కన 3 గంటల 15 నిమిషాల నిడివితో వస్తున్న ఈ మహాకావ్యం తొలి రోజే ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సరిహద్దులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.దీపావళికి కోటి కాంతులు మన సొంతమైనట్టుగా ఈ నెల 5 న రాముడు అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.     [Ramayana Movie Worldwide Advance Booking Collections, Ramayana Advance Booking Worldwide, Ramayana Box Office Collections, Ranbir Kapoor, Telugu Cinema, telugu Cinema news, Tollywood, Tollywood News]
కళాకారులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన, మార్ఫింగ్ చేసిన వీడియోలను రూపొందించడంపై ఇటీవల ఎక్స్‌ వేదికగా తన ఆందోళనను వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ఈ అంశంపై మరో కీలక అడుగు వేశారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని కలిసి ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్ సమస్యలను వివరించారు. ఈ భేటీలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీలను దుర్వినియోగం చేస్తున్న తీరును స్వయంగా వివరించేందుకు చిరంజీవి ఈ భేటీకి అపాయింట్‌మెంట్ కోరారు. ఈ సాంకేతికతల దుర్వినియోగం కళాకారుల హక్కులు, గౌరవం, క్రియేటివ్ కంటెంట్‌కు ముప్పుగా మారుతోందని ఆయన వివరించారు. ఈ సమస్యను కేవలం సోషల్ మీడియా వేదికకే పరిమితం చేయకుండా, చిత్ర పరిశ్రమ తరఫున ఇటువంటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు మరింత పటిష్టమైన రక్షణ చర్యలు, కఠినమైన శిక్షలు అమలు చేయాలని కోరారు. చిరంజీవి ఆందోళనలను సానుకూలంగా అర్థం చేసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఈ అంశాన్ని ప్రభుత్వం అత్యవసరంగా పరిశీలిస్తుందని, మరింత పటిష్టమైన రక్షణ చర్యలు, కఠినమైన శిక్షలు అమలు చేసే దిశగా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ విషయంపై లిఖితపూర్వకంగా వినతిపత్రం సమర్పించాలని సూచించిన ఆయన, ఈ వ్యవహారాన్ని సమన్వయం చేసే బాధ్యతను జి. కిషన్ రెడ్డికి అప్పగించారు. కేంద్ర హోంమంత్రి స్పందనకు కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి.. ఆయన ఇచ్చిన హామీ చిత్ర పరిశ్రమకు ప్రోత్సాహాన్నిచ్చే కీలక అడుగుగా అభివర్ణించారు. త్వరలోనే ఈ సమస్యకు  పరిష్కారం లభించి, కళాకారులకు తగిన రక్షణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ప్రభాస్‌పైనే పీపుల్ మీడియా ఆశలు.. రంగంలోకి ఎవరూ ఊహించని దర్శకులు.!     [Chiranjeevi Amit Shah Meeting, Amit Shah Hyderabad Visit, AI Misuse, Chiranjeevi, Amit Shah, Ram Charan, Hyderabad, Telugu News]  
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబర్ 2న హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి, రామ్ చరణ్‌ కూడా అమిత్ షాను కలిశారు. అమిత్ షా తెలంగాణ బీజేపీ నిర్వహిస్తున్న మహాపాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ జరగడం ఆసక్తిని పెంచింది. అయితే ఈ సమావేశంలో ఏయే అంశాలపై చర్చించారనే విషయంపై అధికారిక సమాచారం వెల్లడికాలేదు. గతంలో 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత కూడా చిరంజీవి, రామ్ చరణ్ ఢిల్లీలో అమిత్ షాను కలిశారు. అప్పట్లో రామ్ చరణ్‌ను అమిత్ షా అభినందించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో మరోసారి ఈ ముగ్గురూ కలవడంతో సినీ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. మొత్తానికి మెగా తండ్రీకొడుకులు కేంద్ర హోంమంత్రిని కలవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ మర్యాదపూర్వక సమావేశంగానే ముగిసిందా? లేక మరేదైనా అంశం చర్చకు వచ్చిందా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇది కూడా చదవండి: ప్రభాస్‌పైనే పీపుల్ మీడియా ఆశలు.. రంగంలోకి ఎవరూ ఊహించని దర్శకులు.!       [Amit Shah Hyderabad Visit, Chiranjeevi Amit Shah Meeting, Ram Charan Amit Shah Meeting, Chiranjeevi, Ram Charan, Amit Shah, Telugu News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
సాయంత్రం వేళ వేడి వేడి టీ తాగుతూ ఏదైనా కరకరలాడే స్నాక్ తినాలనిపించడం చాలా సహజం. అందులోనూ మన ఇంట్లోనే శుభ్రంగా తయారు చేసుకున్న పిండి వంటల రుచే వేరు. అటువంటి అద్భుతమైన టీ టైమ్ స్నాక్స్‌లో మురుకులకు ఉండే ప్రత్యేకతే వేరు. ఏళ్ల తరబడి మన సంప్రదాయంలో భాగమైన ఈ కమ్మని మురుకులను మరింత సులభంగా, ఎక్కడా నూనె పీల్చకుండా గుల్లగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మురుకులు అనగానే పప్పులు నానబెట్టి, పిండి పట్టించుకోవాలనే పెద్ద ప్రాసెస్ గుర్తుకు వస్తుంది. కానీ ఎలాంటి కష్టం లేకుండా కేవలం పొడి బియ్యప్పిండితో అκαశ్శంగా ఈ అరిసెలను తలపించే రుచితో మురుకులను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సులభమైన రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి, అందులోకి సరిగ్గా 2 కప్పుల పొడి బియ్యప్పిండిని తీసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, పిండి రంగు మారకుండా 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఇలా చేయడం వల్ల మురుకులకు అద్భుతమైన సువాసన, రుచి వస్తాయి. పిండి వేడెక్కగానే దానిని ఒక వెడల్పాటి బౌల్‌లోకి మార్చుకోవాలి. అదే సమయంలో, ఒక మిక్సీ జార్‌లోకి ముప్పావు కప్పు పుట్నాలను తీసుకుని మెత్తగా పౌడర్ లా గ్రైండ్ చేయాలి. ఈ పుట్నాల పిండిని ఉండలు లేకుండా జల్లెడ పట్టి, ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యప్పిండిలో కలపాలి. జల్లెడ పట్టిన తర్వాత మిగిలిన రవ్వ వంటి పదార్థాన్ని పక్కకు తీసివేయాలి. ఇప్పుడు అదే పాన్‌లో సరిగ్గా 2 కప్పుల నీళ్లను తీసుకుని బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, ఆ వేడి నీళ్లను కొద్దికొద్దిగా పిండి మిశ్రమంలో పోస్తూ ఒక చెంచాతో బాగా కలపాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, 2 కప్పుల బియ్యప్పిండికి సరిగ్గా 2 కప్పుల నీళ్లు సరిగ్గా సరిపోతాయి. నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి వెంటనే చేత్తో కలపకుండా, మూత పెట్టి సరిగ్గా 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. పిండి కొద్దిగా చల్లారిన తర్వాత మూత తీసి చేత్తో బాగా మెదపాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ సాఫ్ట్‌గా కాకుండా సెమీ సాఫ్ట్ పద్ధతిలో ఉండేలా చూసుకోవాలి. పిండి మరీ సాఫ్ట్‌గా ఉంటే మురుకులు నూనెను ఎక్కువగా లాగేస్తాయి. పిండిని నొక్కి చూస్తే కొద్దిగా బరకగా, మృదువుగా అనిపించాలి. తర్వాత జంతికల గొట్టానికి స్టార్ గుర్తు ఉన్న బిళ్లను సెట్ చేయాలి. గొట్టం లోపల కొద్దిగా నూనెను అప్లై చేసి, సిద్ధంగా ఉన్న పిండిని అందులో నింపాలి. మిగిలిన పిండి ఆరిపోకుండా దానిపై ఒక తడి కాటన్ క్లాత్ కప్పి ఉంచాలి. ఒక పెద్ద స్టీల్ ప్లేట్‌కు లేదా చిల్లుల గరిటె వెనుక భాగంలో కొద్దిగా నూనె రాసి, దానిపై రెండు లేదా మూడు చుట్ల చుట్టి మురుకుల షేప్‌లో ఒత్తుకోవాలి. మరో పక్కన కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె చక్కగా వేడయ్యాక, ప్లేట్‌పై లేదా గరిటెపై తయారు చేసుకున్న మురుకులను జాగ్రత్తగా తీసుకుని నూనెలో జారవదలాలి. నూనెలో వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు, అలా చేస్తే మురుకులు విరిగిపోతాయి. మీడియం మంటపై ఒక వైపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరో వైపుకు తిప్పి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. నూనెలోని నురగ మరియు పొంగు పూర్తిగా తగ్గిపోయిందంటే మురుకులు చక్కగా వేగాయని అర్థం. ఈ ప్రక్రియను మొత్తం పిండి అయిపోయే వరకు కొనసాగించాలి. ఈ పద్ధతిలో చేసిన మురుకులు ఎక్స్‌ట్రా క్రిస్పీగా వస్తాయనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే దాదాపు నెల రోజుల పాటు తాజాగా, కరకరలాడుతూ ఉంటాయి.     Rice Flour Murukku Recipe, Crispy Murukku At Home, Tea Time Snack Ideas, South Indian Chakkli Recipe, Easy Evening Snacks, Traditional Indian Fritters, Cooking Tips In Telugu.
మనలో చాలామందికి వేరుశెనగలు ఒక సాధారణ చిరుతిండిగా మాత్రమే తెలుసు. అయితే, ప్రతిరోజూ క్రమం తప్పకుండా వేరుశెనగలు తినడం వల్ల మన మెదడు ఆరోగ్యానికి, ముఖ్యంగా జ్ఞాపకశక్తికి ఎంతో మేలు జరుగుతుందని ఇటీవలి శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రఖ్యాత  ఫుడ్ అండ్ ఫంక్షన్  (Food & Function) జర్నల్‌లో ప్రచురితమైన ఈ తాజా పరిశోధన ప్రకారం, ఉప్పు కలపని, పొట్టుతో రోస్ట్ చేసిన వేరుశెనగలను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల వయసుతో పాటు వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలను తగ్గించవచ్చని తేలింది. వయసు పెరుగుతున్న కొద్దీ మెదడులో జరిగే మార్పులను అడ్డుకోవడంలో ఈ సాధారణ ఆహారం అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ పరిశోధనలో భాగంగా వృద్ధులకు 16 వారాల పాటు రోజువారీగా సుమారు రెండు సర్వింగ్‌ల వేరుశెనగలను అందించారు. దీనివల్ల వారి మెదడు పనితీరులో ఊహించని సానుకూల మార్పులు వచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా మెదడులో ఇన్సులిన్ ప్రతిస్పందన మెరుగుపడటం వల్ల జ్ఞాపకశక్తితో ముడిపడి ఉన్న కణాలకు సరికొత్త శక్తి లభించిందని అధ్యయనం స్పష్టం చేసింది. శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇన్సులిన్ ఎంత ముఖ్యమో, మెదడు కణాలు పెరగడానికి, జీవించడానికి మరియు ఒకదానితో ఒకటి సంభాషించుకోవడానికి కూడా ఇన్సులిన్ సిగ్నలింగ్ అదే స్థాయిలో సహకరిస్తుంది. వయసు పైబడే కొద్దీ మెదడు కణాలు ఇన్సులిన్‌కు తక్కువగా స్పందిస్తాయి, దీనివల్ల జ్ఞాపకశక్తి మందగించే ప్రమాదం ఉంది. అయితే, నిపుణులు జరిపిన ఈ పరీక్షల్లో పాల్గొన్న వారు రోజువారీగా వేరుశెనగలు తీసుకోవడం ద్వారా వారి మెదడులోని కుడి అర్ధగోళంలోని హిప్పోకాంపస్, పారాహిప్పోకాంపల్ గైరస్ వంటి కీలక ప్రాంతాలలో ఇన్సులిన్ ప్రతిస్పందనలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. అంతేకాకుండా, ఈ పరిశోధనలో అత్యంత ఆశ్చర్యకరమైన గణాంకాలు వెలుగు చూశాయి. వేరుశెనగలు క్రమం తప్పకుండా తినడం వల్ల మొత్తం సెరెబ్రల్ రక్త ప్రవాహంలో 3.6% వృద్ధి నమోదవగా, గ్రే మేటర్‌లో రక్త ప్రవాహం ఏకంగా 4.5% పెరిగినట్లు తేలింది. కేవలం రక్త ప్రవాహం పెరగడమే కాకుండా, డీలేడ్ రికాల్ టెస్ట్ సమయంలో పాల్గొన్న వృద్ధులలో వెర్బల్ మెమరీ (మాటల ద్వారా గుర్తుంచుకునే శక్తి) ఏకంగా 5.8% మెరుగైనట్లు పరిశోధకులు స్పష్టం చేశారు. వేరుశెనగలలో లభించే పోషకాలు మెదడును చురుగ్గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో పుష్కలంగా లభించే అసంతృప్త కొవ్వులు, ప్లాంట్  బేస్డ్ ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు మరియు ఖనిజాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా వేరుశెనగలలో ఎల్  ఆర్జినైన్  (L arginine) అనే అమైనో ఆమ్లం సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రేరేపించి, రక్తనాళాల పనితీరును క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. అయితే, మార్కెట్లో దొరికే హెవీగా ఉప్పు లేదా చక్కెర కోటింగ్ చేసిన వేరుశెనగలు కాకుండా, కేవలం ఉప్పు కలపని, సహజమైన రోస్ట్ చేసిన వేరుశెనగలను మాత్రమే సరైన మోతాదులో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిశోధన వేరుశెనగలు అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను పూర్తిగా నయం చేస్తాయని లేదా నివారిస్తాయని నిరూపించనప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా వీటిని తీసుకోవడం మెదడు రక్తనాళాల ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు.     Peanuts For Brain Memory, Daily Peanuts Health Benefits, Brain Boosting Foods Research, Cognitive Health And Peanuts, Nutritious Nuts For Focus, Scientific Facts On Peanuts, Health Tips In Telugu.
డైటింగ్ లేదా బరువు తగ్గే ప్రయత్నాలలో ఉన్నప్పుడు చాలామందిని వేధించే ప్రధాన సమస్య సాయంత్రం వేళల్లో వచ్చే ఆకలి. చిప్స్, బిస్కెట్లు, ఇతర ఫ్రైడ్ స్నాక్స్ తింటే శరీరంలోకి అదనపు కేలరీలు చేరి బరువు పెరిగిపోతామనే భయం ఒకవైపు ఉంటే, ఏమీ తినకుండా కడుపు మార్చుకోలేమనే బాధ మరొకవైపు ఉంటుంది. ఈ క్రమంలోనే ఆరోగ్యకరమైన స్నాక్స్‌గా అందరి దృష్టి  మఖానా  అనగా తామర గింజలు మరియు  పాప్‌కార్న్  పైకి మళ్లుతుంది. ఈ రెండూ కరకరలాడుతూ, తేలికగా ఉండేవే అయినప్పటికీ, బరువు తగ్గే ప్రయాణంలో వీటిలో ఏది ఉత్తమమైన ఎంపిక అనే సందేహం చాలామందిలో కలుగుతుంది. ఈ రెండింటి పోషక విలువులు, శరీరానికి వాటి వల్ల కలిగే ప్రయోజనాలను నిశితంగా పరిశీలిస్తే సరైన నిర్ణయం తీసుకోవడం సులువవుతుంది. ప్రస్తుతం హెల్త్ కాన్షియస్ ఉన్న ప్రతిఒక్కరి ఇళ్లలో మఖానా ప్రముఖ స్థానం సంపాదించుకుంది. వీటిని ఎలాంటి నూనె లేదా తక్కువ నూనెతో డ్రై రోస్ట్ చేసుకుని తినడానికి చాలా రుచిగా ఉంటాయి. మఖానాలో సహజంగానే ఫ్యాట్ లేదా కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. వీటిలో శరీరానికి కావలసిన ప్రోటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా మఖానాలో  గ్లైసెమిక్ ఇండెక్స్  సుమారు 37 వంతు మాత్రమే చాలా తక్కువగా ఉంటుంది. అంటే వీటిని తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. అయితే, ఆరోగ్యకరమైన స్నాక్ కదా అని గిన్నెల కొద్దీ తినేస్తే మాత్రం బరువు తగ్గడం అటుంచి శరీరానికి అదనపు కేలరీలు చేరే ప్రమాదం ఉంది. పైగా వీటిని వేయించేటప్పుడు వాడే నెయ్యి లేదా నూనె పరిమాణాన్ని బట్టి కూడా కేలరీల మోతాదు పూర్తిగా మారిపోతుంది. మరోవైపు మనకు ఎప్పట్నుంచో సుపరిచితమైన, ఎంతో ఇష్టమైన స్నాక్ పాప్‌కార్న్. అయితే ఇక్కడ థియేటర్లలో విరివిగా దొరికే బటర్, కారమెల్, చీజ్ వంటి అధిక కేలరీల పాప్‌కార్న్ గురించి కాదు, ఎలాంటి నూనె, వెన్న లేని ప్యూర్  ఎయిర్ పాప్డ్  పాప్‌కార్న్ గురించి మాట్లాడుకోవాలి. పాప్‌కార్న్‌ ఒక అద్భుతమైన హోల్ గ్రెయిన్ లేదా తృణధాన్యం. వీటిలో ఉండే అధిక పీచు పదార్థం లేదా ఫైబర్ వల్ల తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. సాధారణ బంగాళాదుంప చిప్స్ కంటే చాలా తక్కువ కేలరీలతో ఎక్కువ పరిమాణంలో పాప్‌కార్న్ ఆరగించవచ్చు. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండటమే కాకుండా, రక్తంలోకి పిండి పదార్థాలు త్వరగా కలవకుండా ఫైబర్ సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఈ రెండు ఆరోగ్యకరమైన స్నాక్స్ పోల్చి చూస్తే.. కేవలం బరువు తగ్గడం అనే ప్రధాన లక్ష్యం ఉన్నవారికి ఎలాంటి మసాలాలు కలపని  ప్లెయిన్ ఎయిర్  పాప్డ్ పాప్‌కార్న్  కొద్దిగా మెరుగైన ఎంపికగా నిలుస్తుంది. ఎందుకంటే తక్కువ కేలరీలలో ఎక్కువ క్వాంటిటీ తినవచ్చు, పైగా కడుపు నిండిన ఫీలింగ్ త్వరగా వస్తుంది. అలాగని మఖానాను తీసిపడేయాల్సిన అవసరం లేదు. తక్కువ నెయ్యితో వేయించిన ఒక చిన్న కప్పు మఖానా కూడా వెయిట్ లాస్ డైట్‌కు అద్భుతంగా సరిపోతుంది. అయితే ఏ స్నాక్ ఎంచుకున్నా సరే, దాని తయారీలో వాడే బటర్, నూనె, మసాలాల పరిమాణం మరియు మీరు తినే సరైన మోతాదు మీ బరువు తగ్గే ఫలితాలను నిర్ణయిస్తాయి.     Makhana Vs Popcorn, Weight Loss Snacks, Fox Nuts Benefits, Low Calorie Diet Snacks, Healthy Evening Snacking, Diet Foods Comparison, Health Tips In Telugu.
ఆహారం తినేటప్పుడు ఒక్కోసారి పొరపాటున నాలుక పంటికి తగిలి కొరుకుడు పడుతూ ఉంటుంది. సాధారణంగా ఇది తొందరపాటులో తినడం వల్ల జరుగుతుందని చాలామంది తేలికగా తీసుకుంటారు. కానీ ఇది కేవలం అజాగ్రత్త వల్ల మాత్రమే కాకుండా, పంటి వరుస సరిగ్గా లేకపోవడం, నోటి ఆరోగ్యంలో సమస్యలు లేదా శరీరంలో కొన్ని పోషకాల లోపం వల్ల కూడా జరుగుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం.  అసలు ఇలా పదే పదే కొరుక్కోవడం అనేది ఎందుకు జరుగుతుంది? దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారు? వివరంగా తెలుసుకుంటే.. నాలుక మన నోటిలో ఎంతో సున్నితమైన భాగం. ఇది ఆహారాన్ని నమలడానికి, మింగడానికి , మాట్లాడడానికి చాలా ముఖ్యం. అందువల్ల తరచూ నాలుక కొరుక్కునే సమస్య ఎదురైతే, దాని వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకోవడం చాలా అవసరం. దీన్ని పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు. పంటి అమరిక.. పంటి అమరిక సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. కొన్నిసార్లు పన్ను సరిగ్గా లేకపోయినా, పంటి అంచు చాలా పదునుగా ఉన్నా, లేదా పంటికి చేసిన డెంటల్ ట్రీట్మెంట్  సరిగ్గా అమరకపోయినా భోజనం చేసేటప్పుడు నాలుక ఆ భాగంలో తగిలి గాయమవుతుంది. అలాగే దంతాల వరుస సరిగ్గా లేని సందర్భాలలో ఆహారం నమిలేటప్పుడు నాలుక పళ్ల మధ్యకు వచ్చేస్తుంది. ఇలాంటి సమయంలో దంత వైద్యులను సంప్రదించి పరీక్ష చేయించుకోవడం మంచిది. విటమిన్ల లోపం.. కొన్నిసార్లు శరీరంలో విటమిన్ల లోపం వల్ల కూడా నాలుకకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ముఖ్యంగా విటమిన్ బి 12, ఫోలెట్ లేదా ఐరన్  లోపించినప్పుడు నాలుక మీద మంట, నొప్పి లేదా వాపు రావడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి సరైన పోషకాహారం తీసుకోవాలి. తొందరగా తినడం.. భోజనం చేసేటప్పుడు తొందరపడటం, ఎక్కువ వేగంగా నమలడం, లేదా తినే సమయంలో వేరే విషయాల గురించి మాట్లాడుతూ తినడం వల్ల కూడా నాలుక కొరుక్కునే అవకాశం ఉంది. భోజనం చేసేటప్పుడు ఎప్పుడూ ప్రశాంతంగా, నెమ్మదిగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ అనుకోకుండా నాలుక కొరుడుపడి గాయమైతే వెంటనే శుభ్రమైన నీటితో నోటిని కడుక్కోవాలి. రక్తం వస్తుంటే మెత్తటి గుడ్డతో కొద్దిగా ఒత్తిపట్టాలి. గాయం పూర్తిగా తగ్గే వరకు కారంగా, పుల్లగా లేదా చాలా వేడిగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ రక్తం ఆగకపోతే, గాయం పెద్దదిగా ఉంటే లేదా వాపు ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.                             *రూపశ్రీ.  
ఉపవాసం అనగానే మనలో చాలామందికి ముందుగా గుర్తువచ్చేది ఏదో ఒక పూట భోజనం మానివేయడం లేదా దేవుడి పేరుతో చేసే పూజా కార్యక్రమాలు. అయితే ఆధునిక వైద్య శాస్త్రం , మన పురాతన కాలం నాటి ఆచారాలు కూడా ఉపవాసం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఎటువంటి ఖర్చు లేకుండా, మనం పాటించే చిన్న ఉపవాస పద్ధతి శరీరం లోపల ఎన్నో అద్బుతమైన మార్పులకు కారణమవుతుంది. ఉపవాసం గురించి మూర్ఖంగా వాదించే వారు కూడా ఉంటారు.  అలాంటి వారు ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తీగా అర్థం చేసుకోవాలి.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. జీర్ణవ్యవస్థకు విశ్రాంతి.. శరీరానికి ఎప్పుడూ ఆహారాన్ని అందిస్తూనే ఉంటే జీర్ణవ్యవస్థ విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల కాలక్రమేణా శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం, కణాల పనితీరు మందగించడం జరుగుతుంది. అదే మనం ఉపవాసం ఉన్నప్పుడు జీర్ణక్రియకు కాస్త విరామం దొరుకుతుంది. ఈ సమయంలో శరీరం తనను తాను శుభ్రం చేసుకునే ప్రక్రియపై పూర్తిగా దృష్టి పెడుతుంది. ఉపవాసం వల్ల శరీరానికి కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు.. బరువు నియంత్రణ.. మనం తినడం ఆపినప్పుడు శరీరం శక్తి కోసం మొదట గ్లూకోజ్ ను, ఆ తర్వాత నిల్వ ఉన్న కొవ్వును కరిగించడం మొదలుపెడుతుంది. దీనివల్ల అనవసరమైన కొవ్వు సులభంగా కరిగిపోయి బరువు అదుపులోకి వస్తుంది.   రోగనిరోధక శక్తి పెరుగుదల.. ఉపవాస సమయాల్లో శరీరం పాత , దెబ్బతిన్న కణాలను తొలగించి కొత్త కణాల ఉత్పత్తికి పెద్దపీట వేస్తుంది. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ మరింత బలంగా తయారవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ.. కొద్దిసేపు ఆహారానికి దూరంగా ఉండటం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గి, మధుమేహం అదుపులో ఉండేందుకు చక్కటి అవకాశం లభిస్తుంది. మెదడు చురుకుదనం.. ఉపవాసం ఉన్న సమయంలో మెదడుకు రక్తప్రసరణ మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి , ఏకాగ్రత మెరుగుపడటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నిజం తెలుసుకోవాలి.. అయితే ఉపవాసం అంటే రోజంతా పస్తులు ఉండమని కాదు. మన శరీర తత్వానికి తగినట్లుగా, నీళ్లు లేదా పండ్ల రసాలు తాగుతూ తేలికపాటి పద్ధతిలో ఉపవాసం ఉండటం మంచిది. ఒకసారి ఈ చిన్న అలవాటును మన దినచర్యలో భాగం చేసుకుంటే, అనారోగ్యాలొచ్చే అవకాశాలు చాలావరకు తగ్గిపోయి నిత్యం ఉత్సాహంగా ఉండవచ్చు. కాబట్టి  ఉపవాసాన్ని కేవలం ఆచారంలా కాకుండా ఆరోగ్య రహస్యంగా భావించి పాటించడం వల్ల మరింత స్పష్టత వస్తుంది.                                                                                                                                        *రూపశ్రీ.