Home

»

Latest News

అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ: అసలేం జరుగుతోంది.?

Nov 2, 2026 6:06PM

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబర్ 2న హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి, రామ్ చరణ్‌ కూడా అమిత్ షాను కలిశారు.

అమిత్ షా తెలంగాణ బీజేపీ నిర్వహిస్తున్న మహాపాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ జరగడం ఆసక్తిని పెంచింది. అయితే ఈ సమావేశంలో ఏయే అంశాలపై చర్చించారనే విషయంపై అధికారిక సమాచారం వెల్లడికాలేదు.

గతంలో 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత కూడా చిరంజీవి, రామ్ చరణ్ ఢిల్లీలో అమిత్ షాను కలిశారు. అప్పట్లో రామ్ చరణ్‌ను అమిత్ షా అభినందించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో మరోసారి ఈ ముగ్గురూ కలవడంతో సినీ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

మొత్తానికి మెగా తండ్రీకొడుకులు కేంద్ర హోంమంత్రిని కలవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ మర్యాదపూర్వక సమావేశంగానే ముగిసిందా? లేక మరేదైనా అంశం చర్చకు వచ్చిందా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఇది కూడా చదవండి: ప్రభాస్‌పైనే పీపుల్ మీడియా ఆశలు.. రంగంలోకి ఎవరూ ఊహించని దర్శకులు.!

 

 

 

[Amit Shah Hyderabad Visit, Chiranjeevi Amit Shah Meeting, Ram Charan Amit Shah Meeting, Chiranjeevi, Ram Charan, Amit Shah, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com