LATEST NEWS
ఒక నాయకుడు ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే వారి మనస్సులు గెలవాలి. అయితే ఇంట్లోనే ఆయన తీరుకు, వైఖరికీ నిరసన వ్యక్తం అవుతుంటే..సొంత కుటుంబ సభ్యులే బయటకు వచ్చి తమ వారిని నమ్మొద్దని చెబుతుంటే ఆ నేతను జనం ఎలా నమ్ముతారు. ఎందుకు విశ్వసిస్తారు. ముందు ఇంట గెలు.. ఈ తరువాత రచ్చగెలవడం గురించి ఆలోచించు అంటారు కదా?  ఇప్పుడు వైసీపీలో కీలక నేతలు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. స్వయంగా జనగ్ నుంచి, ఆ పార్టీలో బాగా నోరున్న నేతగా పేరుబడిన అంబటి దాకా, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను ఓడించడానికి తురుఫు ముక్కగా భావించి తెచ్చుకున్న ముద్రగడ పద్మనాభం వరకూ సొంత ఇంటి నుంచే నిరసన సెగలు ఎదుర్కొంటున్నారు. దీంతో జగన్ పార్టీ సొంతింటి సెగలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎం చేయాలో, ఎలా సమాధానం చెప్పుకోవాలో అర్ధం కాక అవస్ధలు పడుతోంది.  పార్టీ అగ్రనేతలు, మంత్రులు ఆఖరికి పార్టీ అధినేత ఇంట్లోనే  వ్యతిరేకత అధికారపార్టీకి వడదెబ్బ తగిలేలా చేస్తోంది. ముందుగా  పార్టీ అధినేత జగన్ విషయమే తీసుకుంటే ఆయనను సొంత కుటుంబ సభ్యులే నమ్మడం లేదు.  సొంత చెల్లి షర్మిల- చిన్నాన్న కూతురు డాక్టర్ సునీత.. జగనన్నకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. చిన్నమ్మ సౌభాగ్యమ్మ కూడా జగనన్న పార్టీకి ఓటేయద్దని  కోరుతూ బహిరంగ లేఖ సైతం రాశారు.  చిన్నాన్న హంతకుడు అవినాష్‌రెడ్డికి ఎలా టికెట్ ఇచ్చావు? అసలు నీవు అన్నవేనా? నీకు మైండ్ పనిచేస్తుందా? లేదా? తండ్రిని చంపారన్న రిలయన్స్ కంపెనీ పరిమళ్ నత్వానీకి రాజ్యసభ ఎలా ఇచ్చావ్? నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటూ షర్మిల ఊరూ వాడా తిరుగుతూ జగన్ పరవు బజారున పడేస్తున్నారు. ఎన్నికల వేళ తన ప్రచారంలో జగన్ పై విమర్శనాస్త్రాలు, ప్రశ్నాస్త్రాలూ సంధించని రోజుంటూ లేకుండా ఆమె సాగుతున్నారు.  ఇక జగన్ కూడా షర్మిల తన తండ్రికి వారసురాలు కాదంటూ కరాఖండీగా నిండు సభలో సెలవిచ్చారు.   ఇక స్వయం ప్రకటిత కాపు ఉద్యమ నేత  మాజీ మంత్రి మద్రగడ పద్మనాభం ను కాపుల ఓట్లు చీల్చి వైసీపీని ప్రయోజనం చేకూర్చు తురుఫు ముక్కగా భావించి దరికి చేర్చుకున్నా జగన్ కు ఇప్పుడు ఆయన ఒక గుదిబండగా మారిపోయారు. అందుకు కూడా ముద్రగడు కుటుంబ పోరే కారణం అయ్యింది. ముద్రగడ పిలుపునిస్తే కాపు సామాజికవర్గం అంతా కలిసి వస్తుందని జగన్ భావించారు. అందుకే పిఠాపురంలో జగన్ ను ఓడించాలంటే ముద్రగడను పార్టీలో చేర్చుకుంటే సరిపోతుందని భావించారు. జగన్ పిలుపునందుకుని ముద్రగడ కూడా వైసీపీ గూటికి చేరిపోయారు.  అలా చేరి ఊరుకోలేదు.. పిఠాపురంలో పవన్‌ను ఓడించకపోతే, తాను పేరు మార్చుకుంటానని  శపథం కూడా చేసేశారు.  అయితే ఆయనకు సొంత ఇంటి నుంచే వ్యతిరేక సెగ తగిలింది. ఆయన కుమార్తె స్వయంగా తన తండ్రిని నమ్మకండి అంటూ జనాలకు ఓ వీడియో సందేశం ఇచ్చారు. తన తండ్రి జగన్ చేతిలో పావుగా మారి అనవసరంగా జనసేనాని పవన్ కల్యాణ్ ను తిడుతున్నారు. అది కరెక్టు కాదు అంటే ఆ వీడియోలో పేర్కొన్న ముద్రగత కూతురు తన ఓటు పవన్ కల్యాణ్ కే అని ప్రకటించారు. దీంతో కూతురిపై ముద్రగడ ప్రాపర్టీ వ్యాఖ్యలు చేసి పరుపు పోగొట్టుకున్నారు.  సొంత కుమార్తే ముద్రగడను నమ్మడం లేదు.. ఇక ప్రజలెందుకు ఆయనను విశ్వసిస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్ధి, ఉపముఖ్యమంత్రి  బూడి ముత్యాలరాజు ఇంటి పోరు కూడా రచ్చకెక్కింది.  ఆ కథేంటంటే ఆయనకు ఇద్దరు భార్యలు.  మొదటి భార్య కొడుకు బూడి రవికుమార్. ఆయన  మా నాన్న ముత్యాలనాయుడుకు ఓటేయకండి. సొంత కుటుంబానికే న్యాయం చేయని వాడు ప్రజలకేం చేస్తాడంటూ రోడ్డెక్కారు.  పాపం ఆయనా ఇంటి పోరు కారణంగా అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గంలో ప్రజల విశ్వాసం పొందలేక ఎదురీదుతున్నారు.  ఇక తాజాగా సత్తెన పల్లి వైసీపీ అభ్యర్థి, మంత్రి అంబటి రాంబాబు ఇంట్లోనూ ఇంటి పోరు రచ్చకెక్కింది. ఆయన కుమార్తె భర్త తన మామ నీచుడు, నికృష్ణుడు అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అది ఇప్పుడు సత్తెన పల్లి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.  ప్రత్యర్థి నేతలపై  నోరు పారేసుకునే అంబటి ఇప్పుడు సొంత అల్లుడు తనపై చేసిన విమర్శలపై నోరెత్తలేని పరిస్థితుల్లో ఉన్నారు.   మొత్తంగా వైసీపీ అధినేత నుంచి ఆ పార్టీ కీలక నేతల వరకూ సొంత ఇంటి నుంచే ఎదురౌతున్న వ్యతిరేకతతో  సతమతమౌతున్నారు. సొంత ఇంటి కుంపట్లే నిరసన నిప్పులు చెరుగుతుంటే ఏం చేయాలో తెలియక సతమతమౌతున్నారు.  
చంద్రబాబు  చండ్ర నిప్పులు చెరిగారు. తన స్వభావానికి విరుద్ధంగా ఆగ్రహాన్ని ప్రదర్శించారు. స్కిల్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేసిన్పుడు కూడా ఆయన శాంతంగానే ఉన్నారు. న్యాయస్థానాలలోనే తేల్చుకుంటానని, తనపై కేసే తప్పంటూ క్వాష్ పిటిషన్ వేశారు. ఎక్కడా ఆగ్రహం ప్రదర్శించలేదు. జనాలకు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.  అయితే తాజాగా ఆయన పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలేంటంటూ ఫైర్ అయ్యారు. వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించి పట్టా పాసు పుస్తకాలపై జగన్ ఫొటో విషయంలో మాత్రం ఆయన పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ భూములను వాళ్ల తాత, తండ్రి ఇచ్చారా? అంటూ నిలదీశారు. మన పెద్దలు మనకు వారసత్వంగాఇచ్చిన పుస్తకాలపై సైకో జగన్ ఫొటోలను సమర్ధిస్తారా అంటూ జగన్ పై చంద్రనిప్పులు చెరిగారు. అంతే కాదు ఆ పట్టాదారు పాసుపుస్తకాలను చించి పారేశారు.  కాకినాడలో ఎన్నికల సభలో ఆయన ఆగ్రహం అంబరాన్ని తాకింది. చంద్రబాబు ఆగ్రహం ధర్మాగ్రహమేనంటూ సభికులు చప్పట్లతో మద్దతు పలికారు.   అసలే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ఆ అంశాన్ని ప్రధాన ఎన్నికల అంశంగా జనంలోకి తీసుకువెళ్లడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఆయనకు తోడుగా కూటమి భాగస్వామ్యపక్షాలు కూడా ల్యాండ్ టైలిటింగ్ యాక్ట్ దుర్మార్గమైనదన్న చర్చ ప్రజలలో విస్తృతంగా జరిగేలా ప్రచారంలో ఆ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. సరిగ్గా ఈ తరుణంలోనే పులివెందులలో వైఎస్ జగన్ సతీమణి భారతిని ఓ వైసీపీ నేతే మా పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకంటూ నిలదీశారు. ఆ ప్రశ్నకు సమాధానం లేక భారతి నేల చూపులు చూశారు. సరిగ్గా ఆ అంశాన్నే చంద్రబాబు అందిపుచ్చుకున్నారు. తొలి నుంచీ కూడా పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకంటూ తెలుగుదేశం ప్రశ్నిస్తూనే ఉంది. ఇప్పుడు ఎన్నికల సమయంలో అదే ప్రధాన అంశంగా తెరమీదకు తీసుకురావడంతో జనంలో కూడా ఇదే విషయమై చర్చ జరుగుతున్నది. మొదట భూమిపట్టా పాసు పుస్తకాలపై జగన్ ఫొటో, ఇప్పుడేమో  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ చట్టం. ఈ రెంటినీ కలిపి చూస్తే మన భూములు మనవి కాకుండా జగన్ చేస్తున్నారంటూ జనంలో పెద్ద చర్చ ఆరంభమైంది. ఆ విషయాన్నే చంద్రబాబు మరింత స్పష్టంగా ప్రజల గుండెలను నేరుగా తాకేలా లేవనెత్తారు.  జగన్ తీసుకువచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని, అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చంద్రబాబు భాష్యం చెప్పారు.  ఈ చట్టం అమలులోకి వస్తే పట్టాదారుపాసు పుస్తకం ఉండదు. పత్రాలుండవు. మన ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా జగన్ అనుమతి కావాలి. ఇది మీకు సమ్మతమేనా అని ప్రజజలను నేరుగా ప్రశ్నించారు.  ఎంతో మంది సీఎంలుగా పనిచేశారు. ఎవరైనా ఇలాంటి పనికిమాలిన చట్టం తెచ్చారా? ఏ సీఎం అయినా పట్టాదారు పుస్తకాలపై తన ఫొటో వేసుకున్నారా? అని నిలదీశారు.  ఈ ఫొటోల పిచ్చోడిని సాగనంపకపోతే మీ భూములన్నీ కబ్జా చేసేస్తారు అంటూ చంద్రబాబు హెచ్చరించారు.  ఇక జగన్ ఫొటో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను చంద్రబాబునాడయుడు చింపేసి, గాల్లో ఎగురవేసిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి.  మాకు పొలాలిచ్చింది మీ తాత రాజారెడ్డీ కాదు, మీ నాయన వైఎస్సూ కాదు..  అంటూ నెటిజన్లు జగన్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు. పొద్దున్నే మీ ముఖం చూడాల్సిన ఖర్మ మాకేంటి సామీ అంటూ ఈసడించుకుంటున్నారు.   అసలు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో అన్న థీమ్ ను అమలు చేయడం మొదలైనప్పటి నుంచే జగన్ పై సామాజిక మాధ్యమంలో సెటైర్లే మరో రేంజ్ లో పేలాయి. అదేదో సినిమాలో చెప్పినట్లు... ఎవడికైనా చూపించండ్రా.. అలా వదిలేయకండ్రా అంటూ జగన్ ను నెటిజన్లు ట్రోల్ చేశారు.    ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, ఆఫీసుల్లోనే కాదు భూమి రికార్డుల్లోనూ జ‌గ‌న్ బొమ్మలతో రెవెన్యూ, స‌ర్వే శాఖ‌లు భారీ ఫోటో ఎగ్జిబిష‌న్  ఏమైనా పెట్టాయా అంటూ అప్పట్లోనే సందేహం వ్యక్తం చేశారు.  ఇప్పుడు సరిగ్గా ఎన్నికల సమయంలో జగన్ ఫొటోల పిచ్చి ఆయన మెడకు చుట్టుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో భూమి ఉన్న ఏ ఒక్కరూ జగన్ ఫొటోను చూడడానికి ఇష్టపడిని విధంగా పరిస్థితి తయారైంది. అదే ఆయనకు ఈ ఎన్నికలలో భారీ పరాజయాన్ని తెచ్చిపెట్టే అంశంగా మారిపోయిందని అంటున్నారు. 
ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఏపీ డీజీపీ  రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎ  వేటు వేసింది. అయితే ఇప్పటికే ఆలస్యమైపోయిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎన్నికల సంఘం తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాల ఫిర్యాదులు, ఆరోపణలకు పూచికపుల్ల విలువ ఇవ్వకుండా ఎన్నికల సంఘం వ్యవహరించిందని అంటున్నారు.   ఎన్నికల షెడ్యూల్ వెలువడిన గంటల వ్యవథిలో బెంగాల్ డీజీపీపై వేటు వేసిన ఎన్నికల సంఘం, ఏపీలో ఇన్ చార్జ్ డీజీపీని మార్చడంలో చేసిన తాత్సారం విమర్శలకు తావిస్తోంది.  ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేసినా పట్టించుకోని ఎన్నికల సంఘం.. ఇక చివరి క్షణంలో ఇక తప్పని సరి పరిస్థితుల్లో, అదీ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పై అధకార పార్టీ మూకలు దాడి చేసిన తర్వాత బదలీ వేటు వేసింది.  కానీ  ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఈ నెలన్నర వ్యవధిలో సీఎం రేమేష్ పై దాడికి   ముందు జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలూ, దాడులను ఎన్నికల సంఘం చూసీ చూడనట్లు వదిలేసిందన్న విమర్శలు వెల్లువెత్తినా పెడచెవిన పెట్టింది. వాస్తవానికి ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాజేంద్రనాథరెడ్డి వైసీపీకి మద్దతుగా నిలిచారని విమర్శలు ఉన్నాయి.  ప్రతిపక్షాలపై దాడులు జరిగినా, దాష్టీకాలు జరుగుతున్నా  ట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. అన్నిటికీ మించి ఆయన ఇన్ చార్జ్ డీజీపీయే.  ఏపీ మంత్రుల్ని, వైసీపీ నేతల్ని ప్రశ్నించేవారిని అణగదొక్కేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేశారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.  వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన వారితో పాటు సోషల్ మీడియాలో సైతం పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేశారని తెలుగుదేశం  ఆరోపణలు చేసింది. వీటి వేటికీ స్పందించని ఎన్నికల సంఘం బీజేపీ అభ్యర్థిపై దాడి జరిగే సరికి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని గుర్తించింది. మరీ ముఖ్యంగా సరిగ్గా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రావడానికి ఒక రోజు ముందు ఇన్ చార్జి డీజీపీపై వేటు వేసింది. ఇప్పుడు ఇక వారం రోజులలో ఎన్నికలు జరగనుండగా కొత్తగా వచ్చే డీజీపీ పోలీసుల పని తీరును సమూలంగా మార్చేందుకు ఏం చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో విపక్షాలు ప్రచారం చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం ఇష్టం లేదన్నట్లుగా వైసీపీ తీరు ఉంది. వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా పోలీసు శాఖ పని చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడైనా పోలీసుల పనితరులో మార్పు వచ్చి.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చక్కబడుతుందేమో చూడాలి.  
ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలాంటిదని చెప్పవచ్చు. పార్టీకి వ్యతిరేక పవనాలు వీచిన 2019 ఎన్నికలలో కూడా ప్రకాశం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం విజయం సాధించింది. అయితే దర్శినియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఒకింత భిన్నంగా మారాయి. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీలో ఉన్నారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని తొలుత జనసేనకు కేటాయించాలని భావించినప్పటికీ, తరువాత మాజీ మంత్రి సిద్ధారాఘవరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి ఆ స్థానాన్ని ఆయనకు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ భావించింది. అయితే తరువాత ప్రత్నమ్నాయ అభ్యర్థి కోసం గాలించింది. ఆ గాలింపులో భాగంగా దర్శినియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి రంగంలోకి వచ్చారు. దీంతో దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి  మధ్య రసవత్తర పోరుకు తెరలేచింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు గొట్టిపాటి లక్మికి అదనపు బలంగా మారింది. నియోజకవర్గంలో అన్ని వర్గాల వారూ కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తున్నారు. కూటమి పట్ల మహిళలు, వృద్ధులు సైతం ఆసక్తి కనబరచడం గమనార్హం. కూటమి సభలకు మండుటెండలను సైతం లెక్క చేయకుండా పోటెత్తుతున్న జనం తెలుగుదేశం శ్రేణులలో జోష్ పెంచుతున్నది. అన్నిటికీ మించి ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి తన ప్రసంగాలతో ప్రజలను మంత్రముగ్థులను చేస్తున్నారు.  స్పష్టమైన హామీలు ఇవ్వడమే కాకుండా, వైసీపీ పాలనా వైఫల్యాలను సూటిగా సుత్తి లేకుండా ఎండగడుతున్న తీరు ప్రజలను ఆకర్షిస్తోంది. కష్టపడి పని చేసే తత్వం, ప్రజలలో మమేకం అవుతున్న తీరు  గొట్టిపాటి లక్ష్మికి సానుకూలాంశాలుగా మారాయి. ప్రజలలో ఆమె పట్ల నమ్మకాన్ని పెంచాయి. మరో వైపు  ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి దశాబ్దాల రాజకీయ అనుభవం, నియోజకవర్గ పరిధిలో ఆయనకు వివిధ వర్గాల ప్రజలతో ఉన్న సత్సంబంధాలు పెద్ద సంఖ్యలో వైసీపీ కేడర్ తెలుగుదేశం గూటికి చేరేలా చేశాయి. ఇది దర్శిలో తెలుగుదేశం అవకాశాలను మరింతగా పెంచింది. ఈ పరిణామాలతో దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం బలం అనూహ్యంగా పెరిగింది. దీంతో పరిశీలకులు సైతం దర్శిలో గొట్టిపాటి లక్ష్మి విజయం నల్లేరుమీద బండినడకలా మారిందని విశ్లేషిస్తున్నారు. 
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (మే6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 19 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఆదివారం (మే 5) శ్రీవారిని మొత్తం 81 వేల 927 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 196 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 28 లక్షల రూపాయలు వచ్చింది.
ALSO ON TELUGUONE N E W S
Kollywood’s versatile actor Dhanush has been very keen on working with Telugu filmmakers, extending his market in Tollywood. The actor, who scored massive hit with SIR in Telugu and Tamil is currently working with acclaimed Telugu director Sekhar Kammula for his upcoming film Kubera, is rumoured to have signed a project with popular producer Dil Raju.  According to recent reports, the producer of Sri Venkateswara Creations banner is eyeing to collaborate with Dhanush for an untitled script. Producer Dil Raju has Dhanush dates and he was waiting for the perfect script. Dhanush gave his nod for Sreekaram fame Kishore Reddy's interesting script with strong social message. He will be directing the film and currently giving final touches to the script. The filming is set to commence soon after Dhanush completes his current projects. Other details about the new project will be announced soon by the team.
Universal Star Kamal Haasan is celebrated for his multifaceted and impactful performances, while esteemed director Shankar is renowned for his grandiose and visually stunning commercial spectacles infused with profound societal messages. Their much-anticipated collaboration, "Bharateeyudu 2 (Indian2)" is planned to release on June 13th. Shankar and team planned grand promotions like grand audio launch on May 16th in Nehru Stadium, Chennai. The film's powerful trailer will be unveiled at the event. They've also invited Rajinikanth and Ram Charan for the launch. But, unfortunately the film postponed to later date. According to our sources, the film will be released grandly in theatres on July 18th, 2024. On the other side, Kalki 2898AD, in which Kamal Haasan played key role will be releasing worldwide on June 27th. Serving as a sequel to the blockbuster Bharateeyudu ( "Indian,") where Haasan's Senapathy waged a lone battle against corruption, Bharateeyudu 2 ("Indian 2") promises to further captivate audiences with its gripping narrative. Kamal Haasan's Senapathy persona has sparked imaginations, while the tagline "Zero Tolerance" only amplifies anticipation for what's in store. Joining the ensemble cast are the talented actresses Kajal Agarwal, Rakul Preet Singh, and Priya Bhavani Shankar, each adding depth to the narrative. The film also features a stellar lineup of supporting actors, including SJ Suryah, Siddharth, and Gulshan Grover, among others, all contributing to the film's ensemble brilliance. With Anirudh Ravichander's musical prowess, Ravi Varman's captivating cinematography, and Sreekar Prasad's deft editing, "Indian 2" promises a cinematic experience like no other. Shankar's collaboration with esteemed writers such as B. Jeyamohan, Kabilan Vairamuthu, and Lakshmi Saravana Kumar ensures a screenplay that resonates with both heart and intellect. Produced jointly by Subaskaran Allirajah's Lyca Productions and Red Giant Movies, Bharateeyudu 2 ( "Indian 2") stands poised to reaffirm the creative brilliance of its creators while setting new benchmarks in cinematic excellence.
'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు రామ్ చరణ్ (Ram Charan). దీంతో ఆయన తదుపరి సినిమా 'గేమ్ ఛేంజర్' (Game Changer) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులు ఇప్పట్లో ఫలించేలా లేవు. 'గేమ్ ఛేంజర్'ని ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ.. ఆ సినిమా విషయంలో చరణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్' విడుదలకు ముందే చరణ్ ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించడంతో.. మా హీరో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడని అప్పుడు ఫ్యాన్స్ తెగ సంబరపడ్డారు. అయితే ఆ తర్వాత, కొంతకాలానికి దర్శకుడు శంకర్ 'ఇండియన్-2' (Indian 2) తో బిజీ కావడంతో 'గేమ్ ఛేంజర్' షూటింగ్ వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చింది. మధ్యలో అసలు ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఎట్టకేలకు 'ఇండియన్-2' షూటింగ్ పూర్తి కావడం, 'గేమ్ ఛేంజర్' షూటింగ్ మళ్ళీ మొదలై, శరవేగంగా జరుగుతుండటంతో.. చరణ్ ఫ్యాన్స్ లో మళ్ళీ మునుపటి ఆనందం కనిపించింది. అయితే ఇప్పుడు ఆ ఆనందం కూడా నిలవలేదు. తాజాగా చరణ్ ఫ్యాన్స్ కి మరో షాక్ తగిలింది. 'ఇండియన్-2' జూన్ 13న విడుదల కానుందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడం, కమల్ హాసన్ కీలక పాత్ర పోషించిన 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) జూన్ 27న విడుదలవుతుండటం.. వంటి కారణాలతో 'ఇండియన్-2' జూలై 18కి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఆ తేదీకి రావడం కూడా అనుమానమే అనేవాళ్ళు లేకపోలేదు. అయితే 'ఇండియన్-2' ఆలస్యమయ్యే కొద్దీ ఆ ప్రభావం 'గేమ్ ఛేంజర్'పై పడుతుంది. 'ఇండియన్-2' పూర్తి అయితేనే కానీ.. శంకర్ తన ఫుల్ ఫోకస్ ని 'గేమ్ ఛేంజర్'పై పెట్టలేదు. 'ఇండియన్-2' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు, ప్రమోషన్స్ కోసం శంకర్ సమయం కేటాయించాల్సింది ఉంటుంది. దాని వల్ల 'గేమ్ ఛేంజర్' షూటింగ్ కి మళ్ళీ బ్రేక్ పడుతుంది. అదే జరిగితే సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విడుదలవుతుంది అనుకుంటున్న ఈ చిత్రం.. మరింత ఆలస్యమవుతుంది. అసలు ఈ ఏడాది ప్రేక్షకులు ముందుకు రాకపోయినా ఆశ్చర్యంలేదు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా స్టార్ట్ అయ్యి మూడేళ్లు దాటిపోయింది. సినిమాకి సంబంధించిన అప్డేట్స్ సరిగా లేవు. కనీసం సినిమా నుంచి గ్లింప్స్ కూడా ఇంతవరకు విడుదల కాలేదు. 'ఇండియన్-2' కారణంగా ఇప్పటికే షూటింగ్ ఆలస్యం కాగా, ఇప్పుడు విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. 'ఇండియన్-2' పూర్తయ్యాక 'గేమ్ ఛేంజర్' అనౌన్స్ చేసినా బాగుండేదని.. లేదా 'గేమ్ ఛేంజర్' కంప్లీట్ అయ్యాక, 'ఇండియన్-2'పై శంకర్ దృష్టి పెడితే బాగుండేదని మండి పడుతున్నారు. మొత్తానికి  'గేమ్ ఛేంజర్' చిత్రం చరణ్ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన  జల్సా లో ఒక సాంగ్ ఉంటుంది. జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి. బ్రిట్నీ స్పియర్స్ ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ  క్యాడ్బరి. ఇప్పుడు ఈ  బ్రిట్నీ స్పియర్స్ కి సంబంధించిన ఒక వార్త యావత్తు ప్రపంచాన్ని షేక్ చేస్తుంది.      పవన్ కళ్యాణ్ చెప్పిన  బ్రిట్నీ స్పియర్స్ ఎవరో కాదు.  హాలీవుడ్ సినీ జగత్తు ని ఒక ఊపు ఊపిన పాప్ సింగర్. పంతొమ్మిది    ఏళ్ళ వయసులోనే పాప్ సింగర్ గా అరంగేట్రం చేసింది. తన ఫస్ట్  ఆల్బమ్ పేరు బేబీ వన్ మోర్ టైం.ఇక అక్కడనుంచి ఆమె  చేసిన ప్రతి ఆల్బమ్ వరల్డ్ వైడ్ గా చాలా పెద్ద సక్సెస్ ని సాధించాయి. కొన్ని కోట్ల మంది ప్రజలు  ఆమె ఆల్బమ్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవారు. తాజాగా ఆమె పర్సనల్ విషయం ఇప్పుడు  హాట్ టాపిక్ గా మారింది.  తన భర్త సామ్ అస్గారి నుంచి విడాకులు తీసుకుంది. నిజానికి వాళ్లిద్దరు ఎనిమిది నెలల కిందటే విడిపోయారు. విడాకులకు కారణం తమ మధ్య ఉన్న అవగాహనా లోపమే అని బ్రిట్నీ స్పియర్స్ తెలిపింది.బ్రిట్నీ వయసు నలభై రెండు సంవత్సరాలు కాగా    సామ్ వయసు  వయసు ముప్పై  సంవత్సరాలు కావడం గమనార్హం  ఇక  బ్రిట్నీ  విడాకులు తీసుకోవడం ఇది  మూడో సారి. 2004లో తన చిన్ననాటి స్నేహితుడు అలెగ్జాండర్‌ తో మొదటి సారి  వివాహం జరిగింది. ఏడాది  తర్వాత ఆ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత  కెవిన్ ఫెడెర్‌లైన్‌ను వివాహం చేసుకుంది. 2007లో ఆ ఇద్దరు  విడాకులు తీసుకున్నారు. ఇక నలభై  రెండు సంవత్సరాల వయసులో  బ్రిట్నీ  మూడోసారి విడాకులు తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎవ్రి టైం, ఊప్స్ ఐ డిడ్ ఇట్ అగైన్, జిమ్మి మోర్, ఐ యాం స్లేవ్ ఫర్ యు, బ్రిట్నీ, పీస్ ఆఫ్ మీ, టాక్సిక్,హోల్డ్ ఇట్ ఎగైనిస్ట్ మీ తదితర హిట్ ఆల్బమ్స్ తో కోట్లాది మంది అభిమానులని సంపాదించింది      
The much anticipated action film starring Man of the Masses NTR and blockbuster director Prashanth Neel was announced a long time ago. NTR fans have been hoping to see NTR through Prasanth Neel's mass vision who gave massive blockbusters like KGF & KGF2. Delighting fans and moviegoers, Prasanth Neel revealed a key update about #NTRNeel. The director called it a new story for him and the film has its own emotion. "It'll be a different film with different emotions. I don't want to get into the genre, but I'm sure people will assume it's an action movie. I want to call it a very new story for me, which I want to tell my audience. It has its own emotion, and I hope people can connect with it." But Prasanth Neel is currently busy with Salaar 2 pre production. The movie shoot will begin in May end. The director wants to complete the entire second part shoot by October or November without any delays. The NTR31 shoot will begin in the in December 2024. The same, shoot related announcement will be coming on NTR's birthday on May 20th. This film, which will be produced by prominent production houses Mythri Movie Makers and NTR Arts.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన మేనమామ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సాయి ధరమ్ తేజ్ పై.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బీరు సీసాలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో సాయి తేజ్ తృటితో తప్పించుకోగా.. ఆయన పక్కనే ఉన్న జనసేన కార్యకర్త శ్రీధర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో శ్రీధర్ ని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, సాయి తేజ్ పై బీరు సీసాలు, రాళ్లతో దాడికి పాల్పడింది అధికార పార్టీ వైసీపీ వర్గీయులు అని ప్రచారం జరుగుతోంది. మెగా హీరో ప్రచారం నిర్వహిస్తున్న చోటుకి కొందరు వైసీపీ వర్గీయులు వచ్చి 'జై జగన్' నినాదాలతో ఈ దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. సినీ పరిశ్రమలో సాయి ధరమ్ తేజ్ కి సౌమ్యుడు, వివాద రహితుడుగా పేరుంది. పైగా రోడ్డు ప్రమాదంలో చావు అంచుల వరకు వెళ్లి, ప్రాణాలతో బయటపడ్డాడు. అలాంటి వ్యక్తిపై ఇలా దాడులకు పాల్పడటం ఏంటంటూ జనసైనికులు, మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Prabhas' Salaar movie has shattered several box office records and has been created new records every day. It was a solid comeback for Prabhas with total 700 crores gross worldwide. This is unprecedented and Prabhas is breaking his own records and creating new benchmarks. Now, the film's second part is in the works. Everyone is eagerly waiting to start the 2nd part shoot. Prasanth Neel is currently busy in pre-production while Prabhas and Prithviraj Sukumaran are so excited to back on grandeur sets. According to sources, the film's shoot begins in May end at Ramoji Film City, Hyderabad. The sets work is going on. There will be a 10 days schedule and Prabhas will join the shoot after Kalki 2898AD release. Latest we hear is that, Prabhas will completely devote his full attention Salaar 2 following the release of Kalki 2898 AD as per Prasanth Neel's request. The maker want to complete the shoot in quick pace without any postponements. Prabhas will perform some risky stunts on his own for this film. Salaar: Part 1 – Ceasefire is directed by KGF director Prashanth Neel and it is produced by Vijay Kiragandur under the banner of Hombale Films. The movie stars Prabhas, Shruti Haasan, Bobby Simha, Jagapathi Babu Tinnu Anand, Easwari Rao, Sriya Reddy and Ramachandra Raju in pivotal roles.
దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో 'దేవర' (Devara) ఒకటి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తున్న సినిమా కావడంతో 'దేవర'పై భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల 'టిల్లు స్క్వేర్' సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. "అభిమానులు కాలరెగరేసుకునే సినిమా" అనడంతో 'దేవర'పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక తాజాగా దర్శకుడు కొరటాల కూడా అలాంటి కామెంట్సే చేయడం విశేషం. సత్యదేవ్ హీరోగా నటించిన 'కృష్ణమ్మ' మూవీ మే 10న విడుదల కానుంది. ఈ చిత్రానికి కొరటాల శివ సమర్పకుడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కొరటాల.. 'దేవర' గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "దేవర సినిమా నాకు మరియు ఎన్టీఆర్ అభిమానులకు చాలా ప్రత్యేకమైన సినిమా అవుతుంది." అని కొరటాల అన్నాడు. మొన్న ఎన్టీఆర్, ఇప్పుడు కొరటాల.. వారి కామెంట్స్ చూస్తుంటే, సినిమాపై వారికున్న నమ్మకం అర్థమవుతోంది. అలాగే సినిమాపై అంచనాలు కూడా రెట్టింపు అవుతున్నాయి. అసలు దేవర ఎలా ఉండబోతుంది? ఎన్టీఆర్-కొరటాల ఏం ప్లాన్ చేశారు? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో రోజురోజుకి పెరిగిపోతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'దేవర'లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న మొదటి సాంగ్ విడుదలయ్యే అవకాశముంది.
1997 వ సంవత్సరంలో వచ్చిన  టైటానిక్ మూవీ ప్రపంచ సినీ ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. పైగా ప్రపంచ సినిమాని ఒక్కటిగా కూడా  చేసింది. లియో నార్డో డికా ప్రియో, కేట్ విన్స్లెట్  లు ప్రేమికులుగా కనిపించి స్వచ్ఛమైన ప్రేమకి సజీవ రూపాలుగా నిలిచారు. సినిమా అనేది ఉన్నంత కాలం ఆ ఇద్దర్ని మాత్రం ఎవరు మర్చిపోరు. అలాగే అందులో నటించిన ఇంకొంత మందిని కూడా మర్చిపోరు. అంతలా తమ పాత్రల్లో నటించారు. తాజాగా ఒక నటుడి విషయం  సినీ ప్రియుల్లో విషాదాన్ని నింపుతుంది.  బెర్నార్డ్ హిల్.. టైటానిక్ లో  కెప్టెన్ ఎడ్వర్డ్‌ స్మిత్‌ గా  నటించి అశేష ప్రేక్షాభిమానాన్ని పొందాడు. నిన్న అనారోగ్య కారణాల వల్ల తుది శ్వాస విడిచాడు. ఆయన వయసు ప్రస్తుతం   79  సంవత్సరాలు.ది చైన్, గాంధీ,రన్నర్స్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ,మడగాస్కర్ స్కిన్, ది క్రిమినల్, త్రూ క్రైమ్, ఫ్రాంక్లిన్, గోల్డెన్ ఇయర్స్.నార్త్ వెర్సస్ సౌత్, ఇలా సుమారు 50 చిత్రాలకి పైనే చేసాడు. 2023 లో వచ్చిన ఫర్ ఎవర్ యంగ్ ఆయన చివరి చిత్రం. 1975 లో వచ్చిన ఇట్ కుడ్ హ్యాపేన్ టూ యు ఆయన మొదటి చిత్రం   పలు టీవీ సీరియల్స్ లోను నటించి ఎంతో పేరు సంపాదించాడు. ఎక్కువ భాగం  వరల్డ్ నెంబర్ వన్ ఛానల్  బిబిసి లో టెలికాస్ట్ అయ్యాయి. పలు  ప్రతిష్టాత్మక  అవార్డుల్ని కూడా గెలుచుకున్నాడు. యూకేలోని మంచెస్టర్‌ లో 1944లో  జన్మించారు. ప్రముఖ అమెరికన్ నటి అయిన మరియానా హిల్ ని మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు. అతని పేరు గాబ్రియల్.  ఇక  పలువురు ప్రపంచ సినీ ప్రముఖులు, ప్రేమికులు బెర్నార్డ్ హిల్  మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.  
నాచురల్ స్టార్ నాని హీరోగా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ హాయ్ నాన్న.డిసెంబర్ 7 న విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 75 కోట్ల రూపాయిల దాకా వసూలు చేసింది. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో అని.  క్లాస్ ,మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు.లేటెస్ట్ గా ఒక అరుదైన  ఘనతని సాధించింది  ప్రతి సంవత్సరం  స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. ఇది అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ. ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్న సినిమాలకి అవార్డ్స్ ని ఇస్తుంటారు. అన్ని విభాగాల్లోను ప్రకటిస్తారు.  ఇప్పుడు హాయ్ నాన్న  2024 కి సంబంధించి  ఆరు అవార్డుల్ని గెలుచుకుంది.మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ హేషం వాహెబ్ కి మూడు అవార్డులు, డైరెక్టర్ శౌర్యవ్ కి రెండు ,ఇక నాని మృణాళి జోడీకి  ఒక అవార్డు దక్కింది. దీంతో హాయ్ నాన్న బృందం ఫెస్టివల్ మూడ్ లో ఉంది. ప్రేమకి అసలైన ప్రతిధ్వని అంటు మేకర్స్ అవార్డు విషయాన్ని సోషల్ మీడియాలో  తెలియచేసారు హాయ్ నాన్న లో  నాని, మృణాల్ తో  పాటు కూతురుగా నటించిన కియారా ఖన్నా చాలా అద్భుతంగా నటించారు.అసలు నటించారు అనే కంటే జీవించారని చెప్పవచ్చు. కూతురికి ఉన్న అనారోగ్య సమస్యని తన ప్రేమతో జయించే విరాజ్  క్యారక్టర్ లో నాని, గతాన్ని మర్చిపోయి తన కూతురుతోనే స్నేహం చేసే జిష్ణ క్యారక్టర్ లో మృణాల్, తన స్నేహితురాలే తన తల్లి అని తెలిసి తల్లి మెంటల్ కండిషన్  కోసం నిజాన్ని చెప్పని  మహి క్యారక్టర్ లో కియారా లు ప్రతి ఒక్క ప్రేక్షక హృదయాన్ని తడిమారు.  ఆ పాత్రల యొక్క భావాన్ని ప్రేక్షకుల మనసులోకి వెళ్లేలా మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ హేషం, దర్శకుడు శౌర్యవ్ లు విజయాన్ని సాధించారు.   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత అయిన జంధ్యాల. ఈయన నవ్వు గురించి చెప్పినప్పుడు ఆ నవ్వు ప్రాముఖ్యత ప్రజలకు అంతగా తెలియలేదు. కానీ ఇప్పుడూ లాఫింగ్ క్లబ్బులు పెట్టుకుని మరీ నవ్వేస్తున్నారు. నవ్వు ఓ గొప్ప ఔషధం అని వైద్యులు కూడా క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారు. ఒక చిన్న నవ్వుతో ఎలాంటి వారిని అయినా గెలవచ్చు, ఎంత కఠిన హృదయం గలవారిని అయినా మార్చేయచ్చు అంటారు. అసలు నవ్వుకు ఇంత గొప్ప శక్తి ఉందంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నవ్వుకున్న గొప్పదనాన్ని గుర్తుచేసుకుంటూ, నవ్వుతో ప్రపంచాన్ని కాస్తో కూస్తూ మార్చాలనే తపనతో ప్రతి ఏడాది నవ్వుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు కూడా. ఒక మనిషి జీవితంలో నవ్వు ఎంత మార్పు తెస్తుందో.. ఎలాంటి మార్పు తెస్తుందో కాసింత వివరంగా తెలుసుకుంటే ఔషధం.. నవ్వును ఔషధం అంటుంటే చాలామందికి కామెడీగా అనిపిస్తుంది కానీ ఇది అక్షరాలా నిజం. సైన్సే కూడా ఇదే నిజమని చెప్పింది. నవ్వినప్పుడు శరీరంలో విడుదల అయ్యే హ్యాపీ హార్మోన్లు మనిషికి ఉన్న ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటి మానసిక రుగ్మతలను సులువుగా తగ్గిస్తుంది. అందుకే నవ్వును ఔషధం అన్నారు. ప్రతి రోజూ ఉదయాన్నే ఎలాంటి సంకోచం లేకుండా కొన్ని సెకెన్ల నుండి నిమిషాల పాటూ  అలా పెదవులు సాగదీసి నవ్వితే ఇక ఆ రోజంతా చాలా హ్యాపీ మూమెంట్లోనే గడిచిపోతుంది. పాజిటివ్.. మనిషి జీవితంలో పాజిటివ్, నెగిటివ్ అంటూ రెండూ ఉన్నాయి. పాజిటివ్ ఆలోచనలు మనిషి జీవితంలో ఉన్నతికి తోడ్పడతాయి. నెగిటివ్ ఆలోచనలు ఉంటే మనిషి పతనానికి కారణం అవుతాయి. పాజిటివ్ వైబ్రేషన్ ను కలిగించడంలో నవ్వుదే కీలక  పాత్ర. ఎవరితోనైనా బాగా గొడవ పడినప్పుడు వారితో విభేదాలు వచ్చినప్పుడు ఇక వారితో మాట్లాడకుండా ఉండిపోతారు. కానీ వారు ఎప్పుడైనా తారసపడినప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వి చూడండి. పాత గొడవలు, కలహాలు అన్నీ మర్చిపోయి వారు కూడా తిరిగి నవ్వుతారు. మళ్ళీ బంధం చిగురిస్తుంది. విజయానికి మెట్టు.. నవ్వు విజయానికి తొలిమెట్టు అవుతుంది. నవ్వు వల్ల జీవితంలో ఎంత కష్టాన్ని అయినా సునాయాసంగా అధిగమించగలుగుతారు. ఎక్కడలేని ఓర్పు, సహనం, నవ్వుతో వచ్చేస్తాయి. నవ్వుతూ ఇంకొకరిని ఎంకరేజ్ చేస్తే ఇంకొకరు విజయంలో భాగస్వాములు కూడా అవుతారు. సంబంధాలు.. పైన చెప్పుకున్నట్టు.. మనుషుల మధ్య ఎలాంటి సమస్యలున్నా నవ్వు పరిష్కరిస్తుంది. ఎంత గొడవ వచ్చినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నవ్వుతూ సర్థి చెప్పడం వల్ల పెద్దగా మారాల్సిన గొడవలను చిన్నగా ఉండగానే పరిష్కరించుకోవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతరులు, ఆఫీసులో కొలీగ్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే నవ్వు వల్ల బలంగా ఉండే బంధాలు బోలెడు.                                                   *నిశ్శబ్ద.
మీ ఆసక్తి, వ్యక్తిత్వానికి సరిపోయే వృత్తిని ఎంచుకోవడం వ్యక్తిగత వృద్ధికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. జీవితంలో చాలా సార్లు డబ్బు కంటే ఆనందం, శాంతి ముఖ్యం. కాబట్టి, మీ అభిరుచులు, లక్షణాలను సరిగ్గా తెలుసుకుని కెరీర్‌ను ఎంచుకోండి. అందరూ ఇంజినీరింగ్ చేయలేరు. అందరూ డాక్టర్, లాయర్, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ కాలేరు. ప్రతి ఒక్కరూ బికామ్ లాగా కనీసం బ్యాచిలర్ డిగ్రీని కామర్స్‌లో పూర్తి చేయలేరు. మీరు ఏది చదివినా...అది జీవనోపాధి కోసమే పని చేయాలి. చాలామంది కొన్ని మంచి కోర్సులు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. చదువు తర్వాత ఉపాధిపరంగా కొన్ని కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ఉద్యోగం పొందడం సులభతరం చేసే అనేక విద్యా కోర్సులు ఉన్నాయి. కానీ, ఉద్యోగ సంతృప్తి కోసమే కాదు, వ్యక్తిత్వాన్ని కూడా వికసించాలి. చేసే పనిలో శాంతి ఉండాలి. అలా ఉండాలంటే మన వ్యక్తిత్వం, గుణం, స్వభావం, అభిరుచికి తగ్గట్టుగా ఉద్యోగం చేయాలి. ఈమధ్య ఈ కాన్సెప్ట్ బాగా పాపులర్ అయినప్పటికీ ఉద్యోగం సంపాదించాలనే కోరికతో ఏదో ఒకటి చేసేవాళ్ళు ఎక్కువ. దాంతో మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఏ వృత్తిని ఎంచుకున్నా మంచి వ్యక్తిత్వం ఉండాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. కానీ, ప్రస్తుతం అన్ని చోట్లా పోటీ నెలకొంది. అందువల్ల, చాలా మంది యువకులకు కెరీర్‌ను ఎంచుకోవడం డైలమాగా మారింది. అయితే ఉద్యోగం వస్తే చాలు అని ఆలోచించడం కంటే మీ అభిరుచికి, వ్యక్తిత్వానికి అనుగుణంగా ఉద్యోగాన్ని ఎంచుకోవడం సరైనది. దీని కోసం చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే మీ ఆసక్తుల గురించి స్పష్టంగా తెలుసుకోవడం. మీ సామర్థ్యాలను తెలుసుకోండి. మీరు మీ విలువలు, వ్యక్తిత్వానికి సరిపోయే ఉద్యోగాన్ని ఎంచుకుంటే విజయం సులభం అవుతుంది. ఏది నచ్చదు? మీకు నచ్చని వాటిని గుర్తించడం ఎంత ముఖ్యమో, మీకు ఏది ఇష్టమో గుర్తించడం కూడా అంతే ముఖ్యం. నలుగురితో కాలక్షేపం చేయనివారు మార్కెటింగ్ ఉద్యోగానికి సరిపోరు. నేడు సాధారణ విద్యను అభ్యసించిన వారికి అనేక రకాల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వాటిలో ఏది మీరు ఆనందించగలరో ఆలోచించండి. ఏది కష్టమో గ్రహించండి. బలహీనతలు ఏమిటి? ఒక వ్యక్తి ఎంత అవగాహన పెంచుకున్నా, కొన్ని స్వాభావిక గుణాలు పోవు. ఉదాహరణకు..మీది ఒంటరిగా ఉండే మనసతత్వం అయితే...ఒంటరిగా నిర్వహించగల ఉద్యోగం సరిపోతుంది. గ్రూప్ వర్క్ కు దూరంగా ఉండటం మంచిది. మీరు ఏ స్వభావాన్ని మార్చుకోలేరు అనేది మీ బలహీనత అని చెప్పవచ్చు. వాటిని గుర్తించండి. కార్యాలయంలో వారితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోండి. ఇలా చేయడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవడం సులభం అవుతుంది. ఎక్కడ ఫిట్‌గా ఉంది..  కేవలం జీతం కోసం  ఇష్టం లేని ఉద్యోగం చేయనక్కర్లేదు. జీతం తక్కువే అయినా.. వేరే ఉద్యోగంలో ఆసక్తి ఉంటే.. ఆనందంగా అనిపిస్తే అక్కడికి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయవచ్చు. అయితే, ఎవరైనా ఆసక్తిని పదేపదే మార్చకూడదు. ఇది కాదు. ఒక నిర్దిష్ట వృత్తిలో ఒక సముచిత స్థానాన్ని కనుగొనాలి. అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు.
ప్రతి వ్యక్తి జీవితాన్ని పెళ్లికి ముందు, పెళ్ళి తర్వాత అని చాలా స్పష్టంగా విభజించి చెప్పవచ్చు.  ఎందుకంటే పెళ్లికి ముందు ఉన్న చాలా విషయాలు పెళ్ళి తర్వాత మారిపోతాయి. మరీ ముఖ్యంగా ఈ జనరేషన్లో  అమ్మాయిలు, అబ్బాయిలు వ్యక్తిత్వం పరంగా చాలా ఆత్మగౌరవం కలిగి ఉంటారు. ఏ చిన్న విషయాల్లోనూ రాజీ పడటానికి సిద్దంగా ఉండరు. ఈ కారణంగా ఇప్పటి కాలంలో పెళ్లవుతున్న వారి మధ్య గొడవలు, విడాకులు ఎక్కువ. పెళ్లయ్యాక భార్యాభర్తలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నా, వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ పెద్ద గొడవలకు దారి తీయకుండా సింపుల్ గా పరిష్కారం కావాలన్నా కొన్ని గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వాలి. రిలేషన్షిప్ నిపుణులు చెప్పిన ఆ గోల్డెన్ రూల్స్ ఏంటో తెలుసుకుంటే.. పెళ్ళి తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. అమ్మాయిలకు అయినా, అబ్బాయిలకు అయినా భాద్యతలు పెరుగుతాయి. ఇల్లు, ఉద్యోగం, స్నేహితులు, ఇతర పనులలో భార్యాభర్తలు ఒకరినొకరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎన్ని పనులున్నా సరే.. భార్యాభర్తలిద్దరూ కొంతసమయం కేటాయించుకోవాలి.  కలసి మాట్లాడుకోవడం, కలసి భోజనం చేయడం, కలసి చర్చించడం,  ప్రతిరోజూ కనీసం గంటసేపు అయినా మాట్లాడాలనే నియమం పెట్టుకోవాలి. ఇలా చేస్తే వారి మధ్య  ఏ సమస్యలున్నా వాటిని మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు. అందుకే ఒకరికోసం ఒకరు సమయం కేటాయించుకోవడం ఎంతో ముఖ్యం. పెళ్ళికి ముందు కాబోయే జంట ఒకరి పట్ల మరొకరు చాలా ప్రేమగా ఉంటారు. ఒకరిని మరొకరు బుజ్జగించుకోవడం, ప్రేమ కురిపించడం, చాలా కేరింగ్ గా ఉండటం చేస్తారు. అయితే చాలామంది జీవతాలను గమనిస్తే పెళ్ళి తర్వాత ఈ సీన్ మొత్తం మారిపోతుంది.  కానీ ఇలా చేయడం మంచిది కాదు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు ప్రేమగా ఉండాలి. ఒకరి మీద మరొకరు అరుచుకోవడం, గొంతు పెంచి మాట్లాడటం వల్ల ఇద్దరి మధ్య  గొడవకు దారితీస్తుంది. భార్య చేసే ఏ పని అయినా భర్తకు నచ్చితే భార్యను మెచ్చుకోవడం అస్సలు మిస్ కాకూడదు.   భార్య వంట నచ్చినా, ఆమె ఇంటి పనిలో చలాకీగా ఉన్నా,  భర్తకు ప్రేమగా వడ్డించినా, ఇంటి పనిని, ఆఫీసు పనిని ఆమె సమర్థవంతంగా  బ్యాలెన్స్ చేస్తున్నా ఇలా ఏం చేసినా సరే భార్యను మెచ్చుకోవడానికి అస్సలు మొహమాటపడకూడదు. అలాగే  భర్త ప్రేమగా ఏం చేసినా భర్త వృత్తి, వ్యక్తిగతంగా ఏం చేసినా దాన్ని భార్య కూడా మెచ్చుకోవాలి. ఇలా చేస్తే భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి ప్రేమ పెరుగుతుంది. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా మాట్లాడే తీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని మరొకరు ఎలా మాట్లాడుతున్నారు అనేది వారి మధ్య బంధాన్ని నిర్ణయిస్తుంది. ఒకరితో ఒకరు మాట్లాడటం, ఒకరి మనసులో విషయాలు మరొకరితో షేర్ చేసుకోవడం, ఒకరు చెప్పేది మరొకరు శ్రద్దగా వినడం ఇవన్నీ బంధం పదిలంగా ఉండటానికి అవసరం. భార్యాభర్తల బంధం అంటే ఇక ఒకరి జీవితం మరొకరు చేతుల్లోకి వెళ్లినట్టే అని అనుకుంటారు కొందరు. కానీ భార్యాభర్తలు అలా ఉండకూడదు. స్పేస్ అనేది చాలా ముఖ్యం. స్పేస్ లేకపోతే బంధం కష్టంగా అనిపిస్తుంది. భాగస్వామి జీవితాన్ని మరీ గట్టిగా బంధించినట్టు, తనకు అన్ని విషయాలు తెలియాలి అన్నట్టు ఉండకూడదు. ముఖ్యంగా కంట్రోల్ చేయడం, కమాండ్ చేయడం అస్సలు మంచిది కాదు. ఎవరి సొంత అభిప్రాయాలు, ఆలోచనలు, సంతోషాలు వారికి ఉండటం మంచిది.                                             *రూపశ్రీ. 
టమోటా భారతీయ వంటల్లో తప్పనిసరిగా.. ఎక్కువగా వాడే కూరగాయ. దీన్ని కూరగాయ అంటుంటాం కానీ టమోటా పండుగానే పిలవబడుతుంది. ఉల్లిపాయ తర్వాత వంటల్లో లేకపోతే అస్సలు బాగోదు అనుకునే కూరగాయ టమోటానే..  అయితే టమోటాను వంటల్లో వాడటం కాకుండా జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిదని, అది కూడా సమ్మర్ లో అయితే దీనివల్ల బోలెడు ప్రయోజనాలుంటాయని అంటున్నారు ఆహార నిపుణులు.. టమోటా జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓ లుక్కేస్తే.. సాధారణంగా కూరల్లో మాత్రమే వాడే టమోటా ఇప్పటికే కెచప్ రూపంలో చాలా విరివిగా వినియోగించబడుతోంది. కొందరికి దీని కెచప్ లేకపోతే అస్సలు గడవదంటే అతిశయోక్తి కాదు. కానీ ఇది నిజమే.. టమోటా సూప్, టమోటా కెచప్, టమోటా ఉరగాయ.. ఇలా చెప్పుకుంటూ పోతే టమోటా పాత్ర చాలానే ఉంది. టమోటా జ్యూస్ చేసుకుని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. టమోటా  లో విటమిన్-సి అధికంగా ఉంటుంది. శరీరం ఐరన్ గ్రహించడంలో ఇది సహాయపడుతుంది. ఇక ఇందులో ఉండే విటమిన్-కె పునరుత్పత్తి ఆరోగ్యాన్ని బలంగా ఉంచుతుంది. టమోటాలు ఆహారంలో భాగంగా తీసుకున్నా, టమోటా జ్యూస్ తాగుతున్నా పిల్లలు పుట్టడంలో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. టమోటాలలో లైకోపీన్, బీటా కెరోటిన్, గామా కెరోటిన్ మొదలైనవి ఉంటాయి. గుండె సంబంధ సమస్యలను తగ్గించడంలో ఇవి చాలా బాగా  సహాయపడతాయి. వేసవిలో టమోటా జ్యూస్ తాగుతుంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్ లలో సోడియం ఒకటి.   ఈ సోడియం కండరాల మరమ్మత్తులకు, సెల్ కమ్యూనికేషన్ కు చాలా అవసరం. టమటాలలో ఈ సోడియం ఉండటం మూలానా టమోటా జ్యూస్ తీసుకుంటే కండరాలు, సెల్ కమ్యూనికేషన్ ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పట్లో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. బరువు  తగ్గాలని అనుకునేవారు టమోటా రసాన్ని తీసుకుంటే శరీరంలో కొవ్వు కరిగించి బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. కొందరు పోషకాహారం తీసుకున్నా శరీరంలో తగినంత శక్తి లేక ఇబ్బంది పడుతుంటారు. అయితే తీసుకునే పోషకాలను శరీరం సరిగా గ్రహించలేకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. కానీ  ఖాళీ కడుపుతో టమోటా జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాల శోషణ పెరుగుతుంది. టమోటా జ్యూస్ కేవలం ఆరోగ్య ప్రయోజనాలనే కాదు.. శరీరాన్ని డిటాక్స్ చేసే మంచి డిటాక్స్ డ్రింక్ గా కూడా పనిచేస్తుంది. శరీరంలో విషాలు తొలగించడంలో సహాయపడుతుంది. రోజూ టమోటా జ్యూస్ తీసుకుంటే శరీరం శుద్ది అవుతుంది.  టమోటాలలో జీర్ణ ఎంజైమ్ లు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల  జీర్ణవ్యవస్థకు మంచి టానిక్ లాగా పనిచేస్తుంది. కడుపుకు సంబంధించిన సమస్యలు,  జీర్ణ ఇబ్బందులు ఉన్నవారు టమోటా జ్యూస్ తీసుకుంటే చక్కని ఉపశమనం ఉంటుంది.                                                                *రూపశ్రీ.
డ్రై ఫ్రూట్స్ అందరికీ ఇష్టమైనవి. ఖరీదు ఎక్కువని కొందరు వీటిని దూరం పెడతారు కానీ పండుగలు, శుభకార్యాలప్పుడు వంటల్లో డ్రై ప్రూట్స్ తప్పక ఉండాల్సిందే. డ్రై ఫ్రూట్స్ లో ఎండు ద్రాక్షకు చాలా ప్రత్యేకత ఉంది. ఎండుద్రాక్షను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి మరుసటిరోజు ఉదయాన్నే నానిన ఎండు ద్రాక్షలు తిని ఆ నీటిని తాగడం వల్ల  చాలా ప్రయోజనాలు కలుగుతాయని, మరీ ముఖ్యంగా వేసవి కాలంలో ఎండుద్రాక్షనీరు తాగడం మంచిదని అంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు ఎండు ద్రాక్ష నీరు వేసవి కాలంలో తాగితే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. ఎండుద్రాక్షలో ప్రోటీన్, ఫైబర్, ఇనుము, పొటాషియం, రాగి, విటమిన్ B6 మరియు మాంగనీస్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.ఎండుద్రాక్ష నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.  టైప్ 2 డయాబెటిస్,  అల్జీమర్స్ వ్యాధి వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తాయి. ఎండుద్రాక్ష తినడం వల్ల రక్తంలో యాంటీఆక్సిడెంట్ స్థాయిలు పెరుగుతాయని,  మెదడు పనితీరు మెరుగుపడుతుందని నమ్ముతారు. ఎండుద్రాక్ష నీరు ఐరన్  లోపం వల్ల కలిగే  రక్తహీనత వంటి పరిస్థితులను నివారిస్తుంది.  అలసట, శ్వాస ఆడకపోవడం, చర్మం సున్నితంగా మారడం, బలహీనత వంటి లక్షణాలు రక్తహీనత ఉన్నవారిలో ఉంటాయి. ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఎండుద్రాక్ష నీరు త్రాగడం మంచిది.  ఎందుకంటే ఇది కడుపులోని యాసిడ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.  ఇది పేగు పనితీరును మెరుగుపరచడంలో,  పేగులోని బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందుకే ఎండుద్రాక్ష నీరు  పొట్ట ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎండుద్రాక్ష నీరు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది.  జుట్టు రాలడం సమస్యను నివారిస్తుంది. అందువల్ల జుట్టు రాలే సమస్యతో బాధపడే వారికి ఇది మేలు చేస్తుంది.                                             *రూపశ్రీ.
  బాదం ఒక డ్రై ఫ్రూట్ దీనిలో ఉండే  పోషకాలు శరీరానికి చాలా అవసరమైనవి. బాదంపప్పులో శక్తి, కొవ్వు, ప్రొటీన్, ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్,  ఐరన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందుకే దీన్ని డైట్‌లో భాగం చేసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ప్రతిరోజూ ఉదయాన్నే రాత్రి నానబెట్టిన బాదం పప్పులు కనీసం నాలుగైనా తినమని చెబుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బాదం పప్పు తినాలా వద్దా  కన్ఫ్యూజన్ చాలామందిలో ఉంటుంది. దీని గురించి ఆహార నిపుణులు కింది విధంగా చెబుతున్నారు. బాదంపప్పును ఏ సీజన్‌లోనైనా తినవచ్చు.  అయితే ఏ సీజన్ అయినా వాటిని నానబెట్టి తినాలి.  అయితే వేసవి కాలంలో పచ్చి బాదం పప్పుులు మాత్రం తినకూడదు. ఇవి కడుపునొప్పికి కారణం అవుతాయి. బాదం పప్పు స్వభావం సహజంగా వేడిగా ఉంటుంది. వేసవి కాలంలో బాదం పప్పులు తినడం వల్ల పిత్త దోషం సంభవించే అవకాశం ఉంటుంది.  అందుకే రాత్రంతా నానబెట్టిన బాదం పప్పును మాత్రమే తినడం అన్ని విధాలా శ్రేయస్కరం. రాత్రి నానబెట్టిన బాదం పప్పు తినడం వల్ల జీర్ణశక్తి బలపడుతుంది.  బాదం పప్పులో ఉండే మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాట్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది. నానబెట్టిన బాదం పప్పు తింటే శోషణ సామర్థ్యం మెరుగుపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.  బాదం శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.   రోజుకు ఎవరు ఎన్ని బాదం పప్పులు తినాలంటే.. 5 నుండి 10 సంవత్సరాల పిల్లలు ప్రతి రోజూ 2 నుండి 4 బాదం పప్పులు తినవచ్చు.  జీర్ణశక్తి తక్కువగా పిల్లలు కనీసం రెండు కూడా తినలేకపోవచ్చు. కాబట్టి పిల్లల జీర్ణశక్తి సామర్థ్యం ను బట్టి బాదం పప్పులను ఇవ్వాలి. బాదం పప్పులు తినడం కొత్తగా మొదలుపెట్టేవారు రోజూ రెండు బాదం పప్పులతో మొదలుపెట్టాలి.  అవి బాగా అలవాటు అయ్యాక వాటి పరిమాణం పెంచుకోవచ్చు. అయితే రోజుకు 8 బాదం పప్పులకు మించి ఎప్పుడూ తినకూడదు.                                                    *నిశ్శబ్ద.