LATEST NEWS
 పులివెందుల తీర్పు పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం కావడానికి ఇక కొన్ని గంటలే ఉంది. ఈ నేపథ్యంలో పులివెందులలో పోలింగ్ హీట్ పీక్స్ కు చేరింది. పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉప ఎన్నిక ఫలితంపై పులివెందుల, కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, ఆ మాటకొస్తే దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఏదో ఒక మండలానికి చెందిన ఎన్నికలా కాకుండా ఈ ఉప ఎన్నిక యుద్ధ వాతావరణాన్ని తలపించేంత ఉద్రిక్తత, ఉత్కంఠ రేపుతోంది. మంగళవారం (ఆగస్టు 12)   జరగనున్న ఈ ఉప పోరును తెలుగుదేశం కూటమి ,వైసీపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాజకీయం వేడెక్కింది.  ఇప్పటికే ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా దాడులు, ప్రతిదాడులు జరగడంతో ఇక పోలింగ్ ఇప్పటికే ప్రచార సందర్భంగా పోలింగ్ దాడులు జరగడం తో పోలింగ్ రోజున పరిస్థితి ఎలా ఉంటుందో అన్న భయాందోళనలు  వ్యక్తమౌతున్నాయి. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్ సైన్యం దిగితే... తమ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి పార్టీలు ప్రైవేటు సైన్యాన్ని  దించారన్న ప్రచారం   ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో పులివెందులలో దౌర్జన్యానికి పై చేయి అవుతుందా? ప్రజాస్వామ్యానిదా? అన్న పరిస్థితి కనిపిస్తోంది.   ఇప్పటికే తెలుగుదేశం కూటమి, వైసిపి నేతలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.  ప్రచార ఘట్టంలోనే హింసాత్మక ఘటనలు జరగడంతో  పోలింగ్ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఇదిలా ఉంటే పోలింగ్ రోజు తమకు అనుకూలంగా ఓటింగ్  జరుపుకునేందుకు బయట వ్యక్తులు పులివెందులకు చేరుకున్నారన్న ప్రచారంతో స్థానికులలో ఆందోళన వ్యక్తం అవుతోంది. పోలీసులు పోలింగ్ ముందు రోజు నుంచే కొత్త వ్యక్తులు పోలింగ్ జరిగే పులివెందులలో కానీ ఒంటిమిట్టలో కానీ ఉండకూడదని   హెచ్చరించారు.  ఇక ప్రలోభాల పర్వం కూడా పెద్ద ఎత్తున  సాగుతోందంటున్నారు.  పోటాపోటీగా, ప్రతిష్టాత్మకంగా మారిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నకలో ఓటు చాలా కాస్టీగా మారిపోయిందని పరిశీలకులు చెబుతున్నారు.  ఓటుకు పది వేల చొప్పున ఇస్తున్నారంటూ తెలుగుదేశం కూటమి, వైసీపీలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఒంటిమిట్టలో కూడా జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా పులివెందుల స్థానం అంత కాకపోయినా.. ఓటుకు నోటు భారీగానే ఇస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం రెండు  జట్పీసీలకు కలిపి..దాదాపు పాతిక కోట్ల పంపిణీ జరుగుతోందని అంచనా వేస్తున్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఇంత కాస్టీగా మారడం ఇదే ప్రథమం అంటున్నారు.  ఇక పులివెందుల బరిలో స్థానానికి వై.ఎస్.ఆర్.సి.పి అభ్యర్థిగా తుమ్మల హేమంత్ రెడ్డి, తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా  బిటెక్ రవి సతీమణి  లతారెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున అభ్యర్ధి రంగంలో ఉన్నారు. మరి కొందరు స్వతంత్రులు కూడా రంగంలో ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థుల మధ్యే ఉంది.  ఇక   ఒంటిమిట్ట జడ్.పి.టి.సి అభ్యర్థిగా వైసీపీ తరఫున ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా ముద్దు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయభాస్కర్ తో పాటు మరో 8 మంది స్వంతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక్కడా పోటీ ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీల మధ్యే ఉంది.  
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఓ  వృద్దురాలు తన వంతుగా విరాళం అందజేశారు. నరసరావుపేటకు చెందిన కాసా నాగేంద్రమ్మ అనే వృద్ధురాలు రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షిస్తూ రెండు లక్షల నూట పదహారు రాపాయల విరాళం ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో సోమవారం (ఆగస్టు 11)న స్వయంగా కలిసి ఈ విరాళం చెక్కును అందించారు.  రాజధాని నిర్మాణానికి విరాళం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సచివాలయంలో కలిసి రూ.2,00,116 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నాగేంద్రమ్మకు   కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు ఆమెను అభినందించారు. రాష్ట్ర రాజధాని అత్యంత గొప్పగా చరిత్రలో నిలిచిపోయేలా నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో ఆబాట గోపాలం రాజధాని నిర్మాణం పట్ల ఎంతో ఉత్సాహంతో ఉన్నారనడానికి కాసా నాగేంధ్రమ్మ తన వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా సచివాలయం వరకూ వచ్చి విరాళం అందించడమే నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు తదితరులు పాల్గొన్నారు.  
గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఫిలిం ఛాంబర్‌, ఫిలిం ఫెడరేషన్‌ మధ్య వేతనాల సమస్య రోజురోజుకీ జటిలం అవుతోంది. పీట ముడులు పడుతోంది. దీనికి పరిష్కారం కోసం పలుమార్లు చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. దీంతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలను, రాజకీయనేతలను శరణుజొచ్చుతున్నారు నిర్మాతలు. ఉభయ తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫి మంత్రులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ సమస్యలు, కార్మిలకు డిమాండ్ లు, ఆందోళనకు సంబంధించి వినతి పత్రాలు అందజేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ను నిర్మాతలు కలిశారు.   కాగా నిర్మాతలతో భేటీపై ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్  సినీ పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితిని తెలియజేయడానికి కలుస్తామంటూ కొందరు నిర్మాతలు చెబితే రమ్మన్నాం.. అంతే తప్ప ఈ భేటీకి ప్రత్యేకమైన అజెండా ఏమీ లేదని తేల్చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సమస్యలకు సంబం ధించి నిర్మాతలు, కార్మికులు చెప్పే అంశాలను విని, వాటిని సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకు వెడతాం. వారి స్థాయిలోనే ఏం చేయాలన్న నిర్ణయం ఉంటుందని కందుల  చెప్పారు. అంతే కాకుండా   ఆంధ్రప్రదేశ్‌లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం. సినిమా నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పనకు  కృషి చేస్తాం, రాష్ట్రంలో స్టూడియోలు, రీరికార్డింగ్‌ థియేటర్లు, డబ్బింగ్‌ థియేటర్లు నిర్మించేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని చెప్పారు. కాగా కందుల దుర్గేష్‌ను నిర్మాతలు బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కె.ఎల్‌.నారాయణ, డి.వి.వి.దానయ్య, రవిశంకర్‌, నాగవంశీ, భరత్‌, విశ్వప్రసాద్‌, చెర్రీ, సాహు గారపాటి, యువి క్రియేషన్స్‌ వంశీ, బన్నీ వాసు, వివేక్‌ కూచిభొట్ల తదితరులు  కలిశారు. ఇక తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని  ఎఫ్‌డిసి ఛైర్మన్‌ దిల్‌ రాజు, బాపినీడు, ఫిలిం ఛాంబర్‌ కార్యదర్శి దామోదర ప్రసాద్‌, సుప్రియ, జెమినీ కిరణ్‌ తదితరులు కలిశారు. 
ఆలస్యం అమృతం విషం ఈ నానుడి అతికినట్లు సరిపోయే సందర్భం ఏదైనా ఉందంటే  అది ఇదే.  తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యం అయ్యే కొద్దీ..   కేంద్రం నుంచి పంచాయతీలకు రావసిన  కేంద్ర నిధులు  రాకుండా ఆగి పోతాయి. అంతే కాదు..  నిర్దిష్ట గడువు ముగిస్తే అవి మురిగి  పోతాయి కూడా.   అవును..  రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1992లో తెచ్చిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం.. ప్రజలచే ఎన్నుకోబడిన పంచాయతీలు కొలువు తీరి ఉన్నప్పడు మాత్రమే  పంచాయతీలకు  కేంద్ర నిధులు అందుతాయి. అయితే తెలంగాణలో గ్రామ పంచాయతీల గడువు 2024 జనవరిలోనే ముగిసింది. ఇక అక్కడి నుంచి  కారాణాలు ఏవైనా పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ముడి పడలేదు. ఈ కారణంగా ఇప్పటికే, కేంద్ర ప్రభుత్వం  2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రావలసిన రూ.1,550 కోట్లను రిలీజ్ చేయకుండా  విత్ హెల్డ్  లో పెట్టింది. అంటే..  నిధుల విడుదలను నిలుపుదల  చేసింది. అలాగే ప్రస్తుత   ఆర్థిక సంవత్సరానికి సంబందించి   రూ.1,450 కోట్లు కూడా విడుదల కాలేదు.  అంటే..  పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించక పోవడం వలన రాష్ట్రంలోని గ్రామ  పంచాయతీలు ఇంచుమించుగా రూ.3000 కోట్లు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.  మరో వంక నిధుల కొరతతో అల్లాడుతున్న గ్రామ పంచాయతీలకు ప్రాణప్రదంగా భావించే  కేంద్ర నిధుల విడుదల కావాలంటే..   స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణం నిర్వహించడం మినహా మరో మార్గంలేదన్నది పంచాయతీరాజ్ శాఖ అధికారుల సమాచారం. మరోవంక..  స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని   హై కోర్టు గడువు విధించింది. ఈ అన్నిటినీ మించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్  కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని  బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే .. అంటూ రాజకీయ హెచ్చరికలు చేస్తున్నాయి. దీంతో  గండం నుంచి గట్టెక్కేదారి కనిపించక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తికమక పడుతోంది. ఇతర అంశాలు ఎలా ఉన్నా..  రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఫేస్  చేస్తున్న తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ముందు కేంద్ర గ్రాంట్స్ తెచ్చుకోవడం పై దృష్టి పెట్టాలి,  లేదంటే,  పంచాయతీల పరిస్థితి మరింత అధ్వాన స్థితికి దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా, గత ఆర్థిక సంవత్సరానికి సంబందించిన రూ.1,550 కోట్లు విడుదల అవుతాయనే నమ్మకం లేదనీ, గడువు ముగిసిన గత సంవత్సరం నిదుల విడుదల పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విచక్షణాదికార పరిధిలోకే వస్తుందనీ,  సో ..గత ఆర్థిక సంవత్సరానికి సంబందించిన రూ.1,550 కోట్లు విడుదల కేంద్రం దయ .. మన ప్రాప్తం అన్నట్లుగానే ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే..  గతంలో   ఎన్నికలు నిర్వహించిన వెంటనే విత్ హెల్డ్  లో పెట్టిన నిధులను విడుదల చేసిన అనుభవాల ఉన్నాయి కాబట్టి  ఎన్నికలు జరిగితే గత, ప్రస్తుత సంవత్సరాలకు సంబందించిన రూ. 3000 కోట్లు విడుదలవుతాయనే విశ్వాసాన్ని పంచాయతీ శాఖ అధికారాలు వ్యక్తం చేస్తున్నారు.   అలాగే.. ఈలోగా ఎన్నికలు జాప్యానికి కారణాలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రనికి లేఖ రాస్తే, కేంద్ర నిధులు  విడుదల అవుతాయని  కొందరు అధికారులు అంటున్నారు  అయితే..  స్థానిక సంస్థల ఎన్నికల్లో  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం రోజురోజుకూ మరింత జటిలం అవుతున్న నేపధ్యంలో, ఈ చిక్కు ముళ్ళు వీడి, పంచాయతీ ఎన్నికల జరగడం  ప్రస్తుత పరిస్థితిలో సాధ్యమేనా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సింధూన‌ది పై ప్రాజెక్టు క‌డితే అణుబాంబులేస్తానంటోంది పాక్. మొన్న‌టికి మొన్న ఇదే అణు బాంబుల విష‌యంలో భారీ ఎత్తున భ‌య‌ప‌డ‌బ‌ట్టే క‌దా?  కాళ్లు పట్టుకుని మ‌రీ ఇండియాతో కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి వ‌చ్చింది? ఈ విష‌యం పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మ‌ర‌చిపోతే ఎలా? మొన్న‌టి యుద్ధంలో భార‌త్ పాక్ ని భ‌య‌పెట్ట‌కుండా ఏకంగా ఆ దేశ అణు నిల్వ‌లున్న ప్రాంతంలో బాంబులు జార విడిచి ఉండాల్సింది.  జ‌స్ట్ ఆ నూర్ ఖాన్ బేస్ పై బ్ర‌హ్మోస్ లు వ‌దిలినందుకే త‌ల్ల‌డిల్లిపోయింది పాక్.  ఈ ఎయిర్ బేస్ కి ద‌గ్గ‌ర్లో ఇటు ఆర్మీ చీఫ్ హెడ్ క్వార్ట‌ర్ తో పాటు అటు అణు నిర్వ‌హ‌ణ చేసే నేష‌న‌ల్ క‌మాండ్ ఆఫీసు కూడా ఉంటుంది. ఇక్క‌డ భార‌త్ బాంబులు ప‌డ్డంత‌నే.. ఇదే పాక్ ఆర్మీ చీఫ్‌.. జ‌డుసుకుని బంక‌ర్లో దాక్కున్నాడు. అలాంటి బీరువు ఇప్పుడు మ‌ళ్లీ బీరాలు ప‌లుకుతున్నాడు. సింధూన‌ది మీద ప్రాజెక్టు క‌డుతున్నందుకే ఇలా అంటుంటే మ‌రి బ్ర‌హ్మ‌పుత్రా న‌ది మీద చైనా క‌డుతున్న ప్రాజెక్టు ప‌రిస్థితి ఏంటి? సింధూన‌ది ఎలా కుటుంబ ఆస్తి కాదో అదీ అంతేగా? మ‌రి చైనాపై కూడా భార‌త్ అణు బాంబులు వేయాలా? మొన్న ప‌హెల్గాం దాడి త‌ర్వాత ఇదే సింధూజ‌లాల‌ విష‌యం వెలుగులోకి వ‌స్తే మేం అణుబాంబులు వేస్తామ‌ని అన్నారు పాక్ దేశ నాయ‌కులు. తీరా భార‌త్ యుద్ధానికి దిగితే వేయాల్సిన బాంబులు వేయ‌డం మానేసి.. బంక‌ర్ల‌లో దాక్కున్నారు. ఇరాన్ ద‌గ్గ‌ర అణుబాంబులు ఉంటే..  ప్ర‌పంచానికే అతి పెద్ద విప‌త్తుగా భావించిన అమెరికా.. పాక్ విష‌యంలో ఎందుకో వెన‌క‌డుగు వేస్తూనే ఉంటుంది. అంటే పాక్ ద్వారా భార‌త్ ని భ‌య‌పెట్టి ఆయుధాలు కొనిపించాల‌న్న యోచ‌న అమెరికాది. అందుకే ఆ దేశ గ‌డ్డ‌పై నుంచి ఇలాంటి బీరాలు ప‌లికిస్తోంద‌న్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెలువ‌డుతున్నాయ్.  మేం పోతే స‌గం ప్ర‌పంచాన్ని లాక్కెళ్లిపోతామ‌ని మీరు భ‌య‌పెడ‌తారేమో.. కానీ భార‌త్ మొన్న‌టిలా చేసి చూపిస్తుంది.  అయినా యుద్ధం జ‌రుగుతుంటే మ‌న ద‌గ్గ‌ర ప్లాన్స్ లేవు ప్రేయ‌ర్సే అన్న మునీర్ కూడా .. ఇలా భార‌త్ ను భ‌య‌పెట్టేందుకు ప్రయత్నించడం  ఆశ్చ‌ర్యంగా ఉంది. ట్రంప్ కుటుంబానికి అమ్ముడుపోయి పాకిస్థాన్ని తాక‌ట్టి పెట్టి బ‌తుకుతున్న మునీర్  సైన్యాధ్య‌క్షుడంటే ఆసియాకే అవ‌మాన క‌రంగా ఉందని అంటున్నారు దౌత్య నిపుణులు.
ALSO ON TELUGUONE N E W S
Superstar Mahesh Babu is working with SS Rajamouli and from past 15 years both of them have been waiting to collaborate. Now, the movie shoot has started but the update about story or the kind of project has not been announced. While makers state it as Globe Trottling adventure, they did not confirm the story.  Now, on Mahesh's birthday, a sample of his look has been released by the makers. Mahesh Babu made sure that his fans get at least a small update from the movie, as originally the makers have decided to only release any update in November, only.  For this small glimpse of his look, Mahesh fans have poured in their love on a special website. Mahesh looked at the wishes and felt very happy. SS Karthikeya, son of Rajamouli and executive producer, shared the photo of Mahesh enjoying the wishes.  He wrote on X, "Our #GlobeTrotter witnessed love pouring in from every corner of the globe… cheers to whoever came up with the cool idea of http://WishSSMB.com. Just felt like sharing this with you all…" Mahesh with curly hair looks very different from his other films. 
  జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'వార్-2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటించడంతో 'వార్-2'పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయిన ఖర్చు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. (War 2)   'వార్-2' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 10న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చిన ఈ వేడుకలో ఎన్టీఆర్, హృతిక్ సందడి చేశారు. 'వార్-2' రిజల్ట్ పై కాన్ఫిడెంట్ గా ఉన్న ఎన్టీఆర్.. కాలర్ ఎగరేసి మరీ ఫ్యాన్స్ కి భరోసా ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఈ ఈవెంట్ కి అయిన ఖర్చు గురించి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వేడుకకు ఏకంగా రూ.1.7 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఈ ఖర్చుతో ఓ చిన్న సినిమా తీయొచ్చు అని చర్చించుకుంటున్నారు.   భారీగా ఖర్చు అయినప్పటికీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల 'వార్-2'పై మరింత బజ్ ఏర్పడిందని చెప్పవచ్చు. దాని వల్ల ఓపెనింగ్స్ పెరిగే అవకాశముంది. ఆ తర్వాత చూస్తే మాత్రం.. ఈవెంట్ కోసం రూ.1.7 కోట్లు ఖర్చు చేయడం వల్ల నష్టమేమీ లేదని చెప్పవచ్చు.  
Prabhas is one of the most eligible bachelors and is amongst the biggest stars of Indian Cinema. Post Baahubali, his craze have grown Pan-india and he delivered a big hits with Salaar and Kalki. He is shooting for The Raja Saab and Prabhas-Hanu project, currently.  While he is busy with his continuous film projects, reports about his romantic link-ups have been going around. But he did not react to any of them and many are waiting for his marriage. Prabhas has been silent about his possible matrimony and been showing reluctance to commit about it soon.  Shyamala Devi, wife of late Krishnam Raju, and his relative, talked to media briefly after her visit to Daksharamam Temple. She stated that she did special offerings and pooja to Lord Shiva and Goddess Parvati, for Prabhas well-being and marriage. She remarked that only God can give clear answer about Prabhas impending nuptials.  She candidly remarked that while she doesn't know about the possible bride but she hopes that he would get married soon. On the other hand, Prabhas is happy to be busy with his film commitments and he is locked till 2028 with projects like Spirit, Salaar Part 2, Kalki 2 and few others in the pipeline.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్ళి కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. నిజానికి 'బాహుబలి' తర్వాత ప్రభాస్ పెళ్ళి చేసుకుంటాడని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే, బాహుబలి వచ్చి పదేళ్లు అవుతుంది కానీ.. ఇంతవరకు ప్రభాస్ పెళ్ళి పీటలు ఎక్కలేదు. మధ్య మధ్యలో ప్రభాస్ పెళ్ళి అంటూ వార్తలొస్తున్నాయి కానీ.. అవేవీ నిజం అవ్వట్లేదు. ఈ క్రమంలో ప్రభాస్ పెళ్ళి గురించి తాజాగా ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (Prabhas)   అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని తాజాగా శ్యామలాదేవి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్ పెళ్లి గురించి పార్వతీ పరమేశ్వరులకు పూజలు చేసినట్లు తెలిపారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు.. శివుడు అనుగ్రహిస్తే త్వరలోనే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని అన్నారు. అమ్మాయి ఎవరు, పెళ్ళి ఎప్పుడు అనేవి తెలియవని.. కానీ, పెళ్ళి మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని శ్యామలాదేవి చెప్పారు.    శ్యామలాదేవి మాటలు విని ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఆమె కోరుకున్నట్టుగా త్వరలోనే ప్రభాస్ పెళ్ళి పీటలు ఎక్కుతారేమో చూడాలి.  
విజయ్ దేవరకొండ(Vijay deverakonda),జర్సీ మూవీ ఫేమ్ 'గౌతమ్ తిన్ననూరి'(Gowtam tinnanuri)కాంబినేషన్ లో గత నెల 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'కింగ్డమ్'(Kingdom). యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ దేవరకొండ 'సూరి' గా రెండు పార్శ్యాలు నిండిన క్యారక్టర్ లో అత్యద్భుతంగా నటించాడని అభిమానులు ముక్త కంఠంతో చెప్తున్నారు. సాంకేతిక ప్రమాణాల పరంగా కూడా మూవీ ఉన్నత స్థాయిలో ఉందనే మాటలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి 'కింగ్డమ్' ఓటిటి హక్కులని ప్రముఖ నిర్మాణ సంస్థ 'నెట్ ఫ్లిక్స్'(Netflix)దక్కించుకున్న విషయం తెలిసిందే. ఓటిటి రిలీజ్ డేట్ ని సదరు సంస్థ ఇంకా అధికారంగా ప్రకటించలేదు. కానీ 'కింగ్ డమ్' ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతుందని, మేకర్స్ మరికొన్నిరోజుల్లో సదరు డేట్ పై అధికార ప్రకటన కూడా ఇవ్వనున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్థుతానికి అయితే      థియేటర్స్ లో కింగ్డమ్ రెండో వారంలో కొనసాగుతు ఉంది. ఈ సమయంలో ఓటిటి డేట్ వార్తలు సోషల్ మీడియాలో వస్తుండటం వైరల్ గా మారింది. సితార ఎంటర్ టైన్ మెంట్ పై సూర్యదేవర నాగవంశీ(Nagavamsi)నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ కి అన్నయ్యగా శివ అనే క్యారక్టర్ లో 'సత్యదేవ్' నటించాడు. సదరు క్యారక్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. విజయ్ కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే(Bhaghyashri Borse)చెయ్యగా, మనీష్ చౌదరి, అయ్యప్ప పి శర్మ, గోపరాజు రమణ,బాబురాజ్ తదితరులు మిగతా పాత్రల్లో కనిపించారు. అనిరుద్(Anirudh Ravichander)సంగీతాన్ని అందించాడు. కింగ్డమ్ ఇప్పటి వరకు 80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.       
బుల్లితెర మీద అమరదీప్, తేజు జోడి అందరికీ ఎంతో ఇష్టమైన జోడి. ఇక శ్రీముఖి, వర్ష, సుహాసిని వీళ్లంతా తమ్ముడు తమ్ముడు అని పిలుస్తూ ఉంటారు. ఇక అమరదీప్ కి ఇష్టమైన ఫ్రెండ్స్ ఆరియానా, మానస్, నిఖిల్ ఇలా ఉన్నారు. ఐతే అమరదీప్ ఇప్పుడు మూవీస్ లో బాగా ట్రై చేస్తూ ఉన్నాడు. అలాగే కొన్ని మూవీస్ లో నటిస్తున్నాడు. గతంలో తానూ నటించిన కొన్ని మూవీస్ లో రోల్స్ గురించి చెప్పుకొచ్చాడు. నాగచైతన్య హీరోగా నటించిన ‘శైలజ రెడ్డి అల్లుడు’ మూవీలో టైటిల్ రోల్ దగ్గర చూస్తే అమరదీప్ చౌదరి అని కనిపిస్తుంది. ఒక సీన్ లో నటించాను కానీ అది లేదు. నా సీన్ కి నేను డబ్బింగ్ కూడా చెప్పుకుని వచ్చా. ఎడిటింగ్ లో తీసేసారు. చాలా మూవీస్ లో చిన్న చిన్న పాత్రలే చేసాను ఎందులోనూ లేను నేను. జక్కన్న, ఉంగరాల రాంబాబు, భలే భలే మగాడివోయ్, కృష్ణార్జున యుద్ధం ఇలా మూవీస్ లో చిన్న చిన్న రోల్స్ చేసాను. కానీ ఎందులోనూ లేకపోయినా నేను వెనకడుగు వేయలేదు. ఇప్పుడు ఒక నాలుగు సినిమాల్లో చేస్తున్నా. సీరియల్స్ లో పేమెంట్స్ బాగానే వచ్చేవి. సినిమాలకు వచ్చాను ..దాంతో కొంచెం కష్టమే ఇంట్లో. " అని చెప్పుకొచ్చాడు. ఇక అమరదీప్ బిగ్ బాస్ సీజన్ 7 లో టాస్కులు ఆడి అందరి మనసులకు దోచుకున్నాడు. ఇక ఇప్పుడు "సుమతి శతకం" అనే మూవీతో హీరోగా రాబోతున్నాడు అమరదీప్. తనకు శివుడు అంటే ఇష్టం అని చెప్పుకొచ్చాడు.
  'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి సినిమాలతో కెరీర్ స్టార్టింగ్ లో సంచలనాలు సృష్టించిన విజయ్ దేవరకొండ.. కొన్నేళ్లుగా ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోతున్నాడు. ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన 'కింగ్ డమ్' కూడా విజయ్ కోరుకున్న సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వలేకపోయింది. దీంతో విజయ్ తదుపరి చిత్రాలపై అందరి దృష్టి పడింది.    ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒక దానికి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు కాగా, మరో చిత్రానికి రవికిరణ్ కోలా డైరెక్టర్. ఈ రెండు సినిమాల తర్వాత విజయ్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ కి హరీష్ శంకర్ దర్శకుడని సమాచారం. విజయ్ గత చిత్రం 'కింగ్ డమ్' కూడా సితార బ్యానర్ లో రూపొందటం విశేషం.   గతేడాది 'మిస్టర్ బచ్చన్'తో నిరాశపరిచిన హరీష్ శంకర్.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా చేస్తున్నాడు. ఇది 2026 ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి హరీష్.. ఉస్తాద్ తర్వాత మరో సినిమా చేస్తాడో లేదా డైరెక్ట్ గా విజయ్ ప్రాజెక్ట్ పైకి వెళ్తాడో చూడాలి.  
ముప్పై శాతం వేతనం పెంచాలని 24 క్రాఫ్ట్స్ కి చెందిన  తెలుగు సినిమా ఫెడరేషన్ సభ్యులు, కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా షూటింగ్ లు కూడా ఆగిపోయాయి.    ఈ విషయంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందిస్తు 'నిర్మాతలు లేకుండా సినిమా పరిశ్రమ లేదు. మన పరిశ్రమ మనుగడకు నిర్మాతల శ్రేయస్సు చాలా ముఖ్యమైనదనే విషయాన్నీ ట్రేడ్ యూనియన్లు గుర్తించాలని పేర్కొంది. రీసెంట్ గా ప్రముఖ నిర్మాతలు ఎస్ కె ఎన్(Skn),మధుర శ్రీధర్(Madhura Sreedhar)తో పాటు మరికొంత మంది నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మధుర శ్రీధర్ మాట్లాడుతు సినిమా అనేది క్రియేటివ్ బిజినెస్. కానీ ప్రొడ్యూసర్స్ కి డెమోక్రసీ లేదని అనిపిస్తుంది. హీరో, హీరో ఫ్రెండ్ మధ్య  ఒక గదిలో చిన్న సీన్  షూట్ చెయ్యడానికి ఒక జనరేటర్ తో పాటు ఒక లైట్ మెన్, ఒక  ఎలక్ట్రీషియన్ సరిపోతారు. కానీ యూనియన్ రూల్స్ ఒప్పుకోవని ఏడుగురు లైట్ మెన్స్ వచ్చారు. మేకప్ డిపార్ట్మెంట్ నుంచి ముగ్గురు వచ్చారు. దీంతో అక్కడున్న పది,ఇరవై మందికి ఫుడ్ సర్వ్ చేయడానికి ఆరుగురు ప్రొడక్షన్స్ వాళ్ళు. కాస్ట్యూమ్స్ పరంగా హీరో హీరోయిన్ బట్టలని, నా అసిస్టెంట్ డైరెక్టర్ ఇస్త్రీ చేసి తీసుకు  రాగలడు. కానీ యూనియన్ రూల్స్ ప్రకారం ఒక కాస్ట్యూమర్ ని,బట్టలు ఉతకడానికి ఒకరు, ఇస్త్రీ చెయ్యడానికి ఒకర్ని పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక చిన్న సీన్ కి ఎనభై మంది పని చేస్తారు. నిజంగా పని చేసే వాళ్ళు నలుగురే ఉంటారు. డిఓపి ని రమ్మంటే నలుగురు అసిస్టెంట్ కావాలంటాడు. 30 % హైక్ గురించి మాట్లాడటం లేదు.  నేను ఒక చిన్న నిర్మాతని, మా మీద ఎందుకు యూనియన్ వాళ్ళందర్నీ రుద్దుతోంది. నేను  యూనియన్ వాళ్ళకి  ఎందుకు బైండ్ అవ్వాలి. నిర్మాతల  యూనియన్ ఏం చేస్తుందని మధుర శ్రీధర్ చెప్పుకొచ్చాడు. నిర్మాతగా మధుర శ్రీధర్  ప్రేమ, ఇష్క్, కాదల్, మాయ, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఒక మనసు, ఏబీసీడీ, దొరసాని వంటి పలు విభిన్న చిత్రాలు నిర్మించాడు. ఈ నెల 8 న 'మోతె వారి లవ్ స్టోరీ' అనే వెబ్ సిరీస్ ని నిర్మించాడు. 2010 లో సందీప్ కిషన్ హీరోగా లగడపాటి శ్రీధర్ నిర్మాణ సారధ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్నేహగీతం అనే చిత్రంతో  దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన మధుర శ్రీధర్  పలు చిత్రాలకి దర్శకత్వం వహించాడు.     
Superstar Rajinikanth speeches at his movie audio launch events in recent times have become highly popular and they have been increasing hype for his films, too. Now, the makers of Coolie, Sun Pictures, dropped audio launch event videos on OTT and YouTube. Once again, Rajini shared an emotional anecdote from his life.  Interestingly, he and Lokesh share similar emotional connection. Rajini shared that he worked as Coolie, even though, he passed out SSLC, as he ran away from his house to find some job in Film Industry. His father asked him to become a Coolie and he shared how he faced difficulties during those days to earn Ten rupees.  After long struggle, he got a chance to become bus conductor and later, life took a huge turn, like everyone know him, today. He shared that such tough times have made him stronger and he is always looking to deliver what people expect from him as their beloved actor.  While this brought huge motivation to his fans and people who take him as an inspiration to work and make big. But the surprise came from director Lokesh Kanagaraj, as he shared how the number he used on Coolie badge of Rajinikanth is his faher's badge number.  He also shared that his father worked as bus conductor and when Rajinikanth, asked him about his father, he shared this anecdote. Lokesh stated that Rajini asking him about his father has become a huge memory for him and it will same for his father, too.  King Nagarjuna, Aamir Khan, Upendra, Satyaraj, Shruthi Haasan, Soubin Shahir are playing other prominent leading roles in this movie. Coolie is releasing on 14th August and it has created huge box office euphoria in Southern States with pre-sales.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
Hansika Motwani has been lately in the news due to her rumored separation from her husband, Sohael. Recently, she deleted her marriage video and photos she shared with Sohael on Instagram. The news reports have been speculating about her indirect clarification, ever since.  Now, on her birthday, she shared a cryptic message which seems to be another confirmation about her separation and divorce. She mentioned that her life taught many lessons this year, which she never asked for. Still, she stated that she found peace and attributed it to birthday magic.    She wrote, "Feeling humbled and full of gratitude. Wrapped in love, topped with cake, and thankful for every little moment. This year brought lessons I didn't ask for... and strength I didn't know I had. Heart's full. Phone's full. Soul's at peace. Thank you for the birthday magic." Well, at a time when the divorce and separation rumors are going around, such a cryptic post does feel like an unofficial confirmation about the impending. For now though, she has chosen to stay silent and she might open up sooner than later.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
చాణక్య నీతి శాస్త్రంలో జీవితంలోని ప్రతి అంశం చక్కగా వివరించబడింది. ఆచార్య చాణక్యుడు తన జీవిత అనుభవాల ద్వారా వృత్తి, స్నేహం, వైవాహిక జీవితం, సంపద, విద్య, వ్యాపారం మొదలైన అన్ని విషయాలపై నైతిక పాఠాలను అందించాడు. ఇదిలా ఉంటే పెళ్లి గురించి ప్రస్తావించాడు. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాల గురించి కూడా వివరించాడు. భార్యాభర్తల మధ్య అనుబంధం ప్రత్యేకమైనది. అది జీవితాంతం ఉండే అనుబంధం. వైవాహిక జీవితం సాదాసీదాగా, ప్రేమగా ఉండాలంటే ఇరువైపులా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. పరస్పర సామరస్యం,  ప్రేమపై ఆధారపడిన సంబంధం మాత్రమే బలపడుతుంది. కాబట్టి చాణక్యుడి తత్వశాస్త్రం ప్రకారం సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఏ అంశాలు దారితీస్తాయో ఇక్కడ వివరాలు ఉన్నాయి. చాణక్యుడు ప్రకారం, భార్యాభర్తలు ఒకరికొకరు సహచరులు, పోటీదారులు కాదు. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం, భార్యాభర్తలిద్దరూ కలిసి ముందుకు సాగడం ముఖ్యం. జీవితంలో ఎదురయ్యే రెండు సమస్యలనూ ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా చేసి పరిష్కరించుకోవాలి. ఆచార్య చాణక్య ప్రకారం ప్రతి సంబంధానికి వారి వ్యక్తిగత పరిమితులు ఉంటాయి. అదేవిధంగా, భార్యాభర్తల మధ్య కొన్ని రహస్య విషయాలు ఉన్నాయి, అవి ఎప్పుడూ మూడవ వ్యక్తికి చెప్పకూడదు, లేకుంటే వారి పరస్పర సంబంధంలో చీలిక ఉండవచ్చు. ఆచార్య చాణక్యుడు ప్రకారం, భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి అవసరాలను ఒకరు చూసుకోవాలి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం, మనం ఒకరి భావాలను గౌరవించుకోవాలి. మద్దతు ఇవ్వాలి.  మీ వైవాహిక జీవితం విజయవంతంగా ముందుకు సాగాలంటే , భార్యాభర్తలు ప్రతి విషయంలోనూ ఓపిగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు మీ సంబంధంలో చీలికలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. భార్యాభర్తల మధ్య స్నేహపూర్వక దృక్పథం ఉండాలి. సంబంధం ఒకరికొకరు మద్దతు ఇచ్చే స్నేహితులలా ఉండాలి. ఇద్దరి మధ్య సమానత్వ భావన ఉంటే ఎలాంటి సమస్యలనైనా సులభంగా పరిష్కరించుకోవచ్చు.
రక్షా బంధన్ ఆగస్టు 9వ తేదీన వచ్చింది. ఈ రోజు కోసం కొందరు  ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుంటారు. కొందరు అక్కాచెల్లెళ్ళు  ఇప్పటికే కొత్త ఆలోచనలతో రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి రెఢీ అవుతున్నారు. కొత్త బట్టలు, రాఖీ  సిద్ధం చేసుకోవడం పరిపాటి. ప్రతిసారీ  పండుగను ఇంకాస్త మెరుగ్గా చేసుకోవాలని అనుకుంటారు.  కానీ ఇంకా మెరుగ్గా అంటే ఏం చేయాలో చాలామందికి తెలియదు.  మెరుగ్గా చేసుకోవడం అంటే కాస్త ఖరీదైన రాఖీ కట్టడం,  ఖరీదైన స్వీట్లు తెచ్చి పంచుకుని తినడం అని అనుకుంటారు చాలా మంది. కానీ ఇది తప్పు.. చాలామంది చేసేది కూడా రాఖీ కట్టడం, స్వీట్లు తినడం.. దీంతో రాఖీ సెలబ్రేషన్ అయిపోయింది అనుకుంటారు. కానీ రాఖీ పండుగ ఏడాది మొత్తం గుర్తుండిపోవాలి అంటే.. కాస్త డిఫరెంట్ గా ఆలోచించాలి.  ప్రణాళిక మార్చాలి.  ఇందుకోసం ఏమేమి చేయవచ్చు తెలుసుకుంటే.. సరదా రోజు.. రక్షా బంధన్ ను స్పెషల్ గా  చేసుకోవాలనుకుంటే  ఆ రోజును సరదాగా మార్చేయాలి. ఇందులో భాగంగా   సినిమా చూడటానికి వెళ్ళవచ్చు. ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు,   తోబుట్టువులందరితో కలిసి సినిమా వెళ్లడం చాలా మంచి అనుభూతి ఇస్తుంది.  అందరూ కలసి ఇంట్లో అయినా ఒక మంచి సినిమా చూసేయవచ్చు.  సినిమా చూస్తూ ఆస్వాదించడానికి  అందరూ కలసి స్నాక్స్ రెఢీ చేసుకోవడం,  లేదా ఆర్డర్ చేసుకుని అయినా సరే.. అందరూ కలిసి కాసింత సమయం గడపడం మంచి అనుభూతిని ఇస్తుంది. అట్లాగే గేమ్స్ ఆడటం,  సరదాగా గడపడం ద్వారా రోజును గుర్తుండిపోయేలా చేసుకోవచ్చు. ఫ్యామిలీ టూర్.. కుటుంబం మొత్తం ఒకే చోట కలవడం చాలా మంచి జ్ఞాపకం అవుతుంది.  కుటుంబంతో కలిసి పిక్నిక్ ప్లాన్ చేసుకోవచ్చు.  కుటుంబ సభ్యులందరూ ఒకరితో ఒకరు సమయం గడపగలుగుతారు. కుటుంబం అంతా ఒకే చోట కలిసేలా మీరు ఒక గొప్ప రోజును ప్లాన్ చేసుకున్నట్లుగా ఉంటుంది.  అందమైన గార్డెన్ లో  లేదా మీకు ఇష్టమైన ప్రదేశాలలో ఏదైనా పిక్నిక్ ప్లాన్ చేసుకోవచ్చు. దీని కోసం స్నాక్స్, స్వీట్లు, పానీయాలు మొదలైనవి ఏర్పాటు చేసుకుంటే ఇబ్బంది లేకుండా టూర్ ఎంజాయ్ చేయవచ్చు. అందరూ కలసి గేమ్స్ ఆడుకోవడం లాంటివి కూడా భలే మజా ఇస్తాయి. కలిసి వంట చేయడం.. రక్షా బంధన్ రోజు  అన్నా చెల్లెళ్లు కలిసి ఇష్టమైన ఆహారాన్ని వండటం, దాన్ని ఇంటిల్లిపాదికి వడ్డించడం చేయవచ్చు. ఇది చాలా మంచి మెమరీ గా మిగులుతుంది.    మంచిగా మాట్లాడాలి.. సాధారణంగా అన్నా చెల్లెళ్లు అంటే గొడవ పడటం,  కొట్టుకోవడం, అల్లరి చేయడం.. ఇదే ఎక్కువ ఉంటుంది.  కానీ రాఖీ పండుగ రోజు ఇద్దరూ ఆప్యాయంగా ఉండటం, ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడటం, ఒకరికి మరొకరు ధైర్యం ఇచ్చుకోవడం వంటివి చేయాలి.  ఇదే వారి జీవితాంతం కొనసాగితే  వారి జీవితం ఎంత అదంగా, ఎంత ధైర్యవంతంగా ఉంటుందో అర్థమైతే అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల బంధం పదికాలాల పాటు ఆనందమయంగా ఉంటుంది.                                  *రూపశ్రీ.  
తెలుగు పంచాంగంలో ఒకో మాసంలో వచ్చే పూర్ణిమకు ఒకో ప్రత్యేకత ఉంటుందనే విషయం బాగా గమనిస్తే అర్థమవుతుంది. మాఘ పూర్ణిమ, ఆషాడ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ, వీటిని బుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని జరుపుకుంటారు.  ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తోంది. శ్రావణ మాసం అంతా సందడిగానూ ప్రత్యేకంగానూ ఉంటుంది.  అయితే పెళ్లిళ్లు, శుభకార్యాలు, వ్రతాలు వీటితో ఉండే సందడి వేరు. ఈ మాసంలో అన్నా, చెల్లెళ్లను పలకరించే రాఖీ పూర్ణిమ వేరు.  అన్నాచెల్లెళ్ల అనురాగాన్ని, వారి మధ్య ఒకరిమీద మరొకరికి ఉండాల్సిన బాధ్యతను గుర్తుచేసేది రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమినే రక్షా బంధన్ అని కూడా అంటారు. రక్ష అంటే ఎలాంటి ఆపదలు, సమస్యలు రాకుండా కాపాడేది. బంధన్ అంటే కట్టి ఉంచేది. రక్షా బంధన్ అంటే ఎలాంటి సమస్యలు రాకుండా కట్టి ఉంచే బంధనం. ఆ బంధనమే రాఖీ. అందరూ తమ సోదరులకు రాఖీ కట్టడం వల్ల  వాడుక భాషలో అందరూ రాఖీ పండుగ అంటున్నారు. రాఖీ పండుగ వెనుక కథనాలు!! ఈ పండుగకు వెనుక విభిన్న కథనాలు ప్రచారంలో  ఉన్నాయి. వాటిలో ఎక్కువగా చెప్పుకునేది ఇంద్రుడి కథనం. ఇంద్రుడి కథ!! పూర్వం రాక్షసులు రెచ్చిపోయి మూడు లోకాల మీద దండయాత్ర చేసి మూడు లోకాలను సొంతం చేసుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన పరివారం, తన లోకంలో ఉన్న వాళ్ళందరితో కలసి తన నివాసమైన అమరావతిలో దాక్కున్నాడు. ఇంద్రుడి పరిస్థితి చూసి ఆయన భార్య శచీదేవికి బాధ కలిగింది. దేవాదిదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి ప్రార్థించి, నా భర్తను సమస్య నుండి గట్టెక్కించు అని అడిగింది. సరే అయితే నీ భర్తకు ఎరుపు రంగు దారంతో  రక్ష తయారుచేసి దాన్ని చేతికి కట్టు, అతను విజయం సాధిస్తాడు అని చెబుతాడు. శచీదేవి విష్ణుమూర్తి చెప్పినట్టు ఎరుపురంగు దారంతో రక్ష తయారుచేసి ఇంద్రుడికి కట్టి ఆ తరువాత హారతి ఇచ్చి, నుదుటన వీరతిలకం దిద్ది యుద్ధానికి వెళ్లమంది. అది తెలిసి అమరావతిలో ఉన్న మిగిలిన వారు కూడా రక్షలు తయారుచేసి ఇంద్రుడికి కట్టి, వీరతిలకం దిద్దారు. ఆ యుద్ధంలో ఇంద్రుడు గెలిచి తిరిగి మూడు లోకాల ఆధిపత్యాన్ని సంపాదించాడు. దీనికి గుర్తుగా రక్షా బంధన్ జరుపుకుంటున్నారని చెబుతారు. దీని వెనుక ఉన్న మరొక కథ ద్రౌపతి, కృష్ణుల కథ!! కృష్ణుడు శిశుపాలుడు వంద తప్పులు చేసిన తరువాత శిశుపాలుడిని వధిస్తాడు. ఆ సమయంలో కృష్ణుడి వేలు తెగితే ద్రౌపతి తన చీర కొంగు చింపి కట్టు కడుతుందట. అప్పుడు కృష్ణుడు ద్రౌపతితో నీ సమస్యలలో నేను అన్నగా తోడుంటాను అని చెబుతాడు. ఆ కారణంతోనే ద్రౌపతి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆమెను కాపాడాడు అని చెబుతారు. పురుషోత్తముడి కథ!! అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజు పురుషోత్తముడిని అన్నగా భావించి రాఖీ కడుతుంది. అలెగ్జాండర్ ప్రపంచానికి అధిపతి కావాలనే అత్యాశతో తక్షశిల మీద దండెత్తినప్పుడు పురుషోత్తముడు యుద్ధంలో గెలిచినా అలెగ్జాండర్ ని చంపకుండా వదిలేసాడు. రాఖీ కట్టినవారికి భయం దొరుకుతుందని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఇలా చరిత్రలో రాఖీ పౌర్ణమి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. మొత్తానికి ఇందులో ఉన్న అర్థం చెల్లెలు కట్టే రక్ష అన్నకు ఆరోగ్యాన్ని, ఆయుష్షును, అన్నిటికీ మించి క్షేమాన్ని కోరుకుంటే, అన్న చేతిలో ఉండే రక్ష అన్నకు తన చెల్లి విషయంలో ఉండాల్సిన బాధ్యత, చెల్లికి ఇవ్వాల్సిన రక్షణ, భరోసాను స్పష్టం చేస్తాయి. ఇదీ రాఖీ వెనుక ఉన్న అనుబంధం.                                    ◆నిశ్శబ్ద.
  శరీరాన్ని శుద్ది చేసే పానీయాలను డీటాక్స్ జ్యూసులు అని అంటుంటారు. ఈ  డీటాక్స్ జ్యూస్లు లేదా పానీయాలు ఫ్యాటీ లివర్ వ్యాధి లేదా దీర్ఘకాలిక కాలేయ వ్యాధి వంటి తీవ్రమైన కాలేయ సమస్యలను నయం చేయగలవని నమ్ముతారు.  ఈ కారణంగానే డిటాక్స్ పానీయాలకు చాలా ఆదరణ ఉంది. కొందరైతే రోజు మొత్తం డిటాక్స్ నీటినే తాగుతూ ఉంటారు.  సుమారు ఒకటి నుండి రెండు లీటర్ల డీటాక్స్ నీటిని లేదా పానీయాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గడం, శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం వంటివి జరుగుతాయని నమ్ముతారు. కానీ ఈ డిటాక్స్ జ్యూసుల గురించి దిమ్మతిరిగే నిజాలను వెలిబుచ్చుతున్నారు వైద్యులు.  దీని గురించి తెలుసుకుంటే.. డిటాక్స్ జ్యూస్లు  కాలేయ సంబంధిత సమస్యలను తొలగించడంలో లేదా నయం చేయడంలో పెద్దగా సహాయపడవట. బయట అమ్మే డిటాక్స్ జ్యూస్లు లేదా హెర్బల్ డ్రింక్స్  తయారీలో ఉపయోగించే పదార్థాలు,  వాటి కూర్పు గురించి స్పష్టమైన సమాచారం ఉండదు. ఈ ద్రవాలలో కాలేయానికి హానికరమైన భారీ లోహాలు లేదా ఇతర పదార్థాలు ఉండవచ్చు. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనాల కంటే కాలేయానికి ఎక్కువ హాని కలిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. డీటాక్స్ పానీయాలు కొవ్వు కాలేయ సమస్యలను పెంచుతాయి.. నిజానికి ఈ జ్యూస్లను తీసుకోవడం వల్ల ఇప్పటికే ఉన్న కాలేయ సమస్య మరింత దిగజారిపోతుందట. ఫ్యాటీ లివర్ వ్యాధి నుండి క్రానిక్ లివర్ డిసీజ్,  క్రానిక్ లివర్ డిసీజ్ నుండి ఎండ్-స్టేజ్ లివర్ డిసీజ్ మారవచ్చట. కాబట్టి ఈ జ్యూస్లను తీసుకోకుండా ఉండటం మంచిది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఏం తినాలి.. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి లేదా కాలేయ సమస్యలను నయం చేయడానికి  డీటాక్స్ జ్యూస్లను ఆశ్రయించే బదులు, ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులను అనుసరించడం మంచిదని ఆహార నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన, పోషకమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం. ప్రాసెస్ చేసిన,  కొవ్వు పదార్థాలను అధికంగా తీసుకోవడాన్ని నివారించడం, తరచుగా బయట తినడాన్ని నిషేధించడం చేయాలి.  వీటికి బదులు  ఆరోగ్యకరమైన ఇంట్లో వండిన భోజనాన్ని ఎంచుకోవాలి. రెడ్ మీట్ లేదా ప్రాసెస్ చేసిన మాంసం మానేయాలి.  లేదా వీటిని  పరిమితం చేయాలి.  మాంసాహారం తినాలని ఉంటే   లీన్ మాంసాలను ఎంచుకోవడం ఉత్తమమట. ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.. ధూమపానం,  అధికంగా  మద్యం సేవించడం వంటి అలవాట్లను నివారించడం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కాలేయాన్ని రక్షించడంలో చాలా సహాయపడుతుంది. దీనితో పాటు కాలేయ ఆరోగ్యానికి హాని కలిగించే మధుమేహం,  కొలెస్ట్రాల్ వంటి ప్రమాద కారకాలను నియంత్రించడం కూడా చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, శారీరక వ్యాయామం,  ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ఈ ప్రమాద కారకాలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి.  కాలేయానికి నిజమైన 'డిటాక్స్' అంటే శుభ్రమైన,  పోషకమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి, సకాలంలో వైద్య సలహా.  రోజువారీ ఎంపికలలో చిన్న మార్పులు కూడా దీర్ఘకాలంలో  కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా సహాయపడతాయి. కాలేయ ఆరోగ్యం కోసం డీటాక్స్ జ్యూస్లపై ఆధారపడటానికి బదులుగా, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం మరింత ప్రభావవంతమైన,  సురక్షితమైన విధానం.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  ఉప్పు లేని వంట, సారం లేని జీవితం వ్యర్థం అని అంటారు. వంటల్లో పులుపు, కారం కు జతగా ఉప్పు కూడా తగిన పరిమాణంలో ఉండాలి. లేకపోతే అస్సలు తినలేం. అయితే ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఆరోగ్యానికి బోలెడు ముప్పులు తప్పుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఏం జరుగుతుందంటే.. ఉప్పు నీటిలో సోడియం, పొటాషియం,  క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది.  ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఈ ఎలక్ట్రోలైట్లు శరీర ఆర్థ్రీకరణ, నరాల పనితీరు, కండరాల సంకోచాలు మొదలైన కార్యకలాపాలకు సహాయపడుతుంది. ఉప్పు నీరులో ఉండే సమ్మేళనాలు కడుపులో ఉండే జీర్ణ ఎంజైములు,  హైడ్రోక్లోరిక యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.  జీర్ణక్రియ,  పోషకాల శోషణకు సహాయపడుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఉప్పు నీటిలో మినరల్స్ కంటెంట్  ఎక్కువగా ఉంటుంది.  ఇది తామర, సొరియాసిస్ వంటి చర్మ సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. గొంతు నొప్పి,  గొంతు సంబంధ సమస్యలు తగ్గడానికి చాలామంది ఉప్పు నీటితో పుక్కిలిస్తుంటారు. అయితే ఉప్పు నీటితో పుక్కిలించడం,  ఉప్పు నీటిని ఉదయాన్నే తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు,  గొంతులో శ్లేష్మం వంటివి తగ్గడమే కాకుండా అలెర్జీలు,  శ్వాసకోశ ఆరోగ్యం,  జలుబు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలో ఉండే సూక్ష్మ వ్యర్థాలు,  విష పదార్థాలను శరీరం నుండి బయటకు పంపడంలో ఉప్పు నీరు సహాయపడుతుంది.  ఈ కారణంగా ఇది శరీరాన్ని శుద్ది చేస్తుంది. ఏ ఉప్పు వాడితే మంచిదంటే.. నీటిలో ఉప్పు కలుపుకుని ఉదయాన్నే తాగడం మంచిదే అయినా  అన్ని రకాల ఉప్పుడు ఇందుకు మంచివి కావు. ఉప్పు నీరు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు లభించాలంటే.. హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా శుధ్ది చేయని ఉప్పును ఎంపిక చేసుకోవాలి. ఉప్పు నీరు ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ మోతాదులో ఉప్పు కలిపి తాగకూడదు.  తగినంత మోతాదులో ఉప్పు కలిపి తాగడం అన్ని రకాల వ్యక్తులకు మంచిదే అయినా అధిక రక్తపోటు,  గుండె సంబంధ జబ్బులు ఉన్నవారు  ఉప్పు నీరు తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.                                           *రూపశ్రీ.  
  మంచి ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ విషయాన్ని వైద్యులు చెప్పడమే కాకుండా ఆరోగ్యం మీద స్పుహ ఉన్న ప్రతి ఒక్కరూ అదే చెబుతారు.   ఏది తిన్నా అది  ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు తీసుకునే ఆహారం పోషకాలతో సమతుల్యంగా ఉండాలని చెబుతారు. అంతేకాదు.. తీసుకునే ఆహారమే కాకుండా ఆహారం తీసుకునే  సమయం  కూడా అంతే ముఖ్యమని చాలా మంది చెబుతారు. కానీ అధిక శాతం మంది తీసుకునే ఆహారం విషయంలో చూపించిన శ్రద్ద ఆహారం తీసుకునే సమయం విషయంలో అస్సలు చూపించరు. నేటి బిజీ లైఫ్ లో రోజంతా హడావిడిగా పనులు చేయడమే కాదు.. హడావిడిగా తినడం కూడా జరుగుతోంది. రాత్రి సమయంలో  కొన్నిసార్లు  9 గంటలకు, కొన్నిసార్లు 10 లేదా 11 గంటలకు తింటుంటారు.  తిన్న  వెంటనే నిద్రపోతారు. కానీ  రాత్రి 7 నుండి 8 గంటల మధ్య ఆహారం తీసుకుంటే ఆరోగ్య పరంగా అద్భుతాలు జరుగుతాయని అంటున్నారు వైద్యులు.  దీని గురించి తెలుసుకుంటే.. 7-8 మధ్య భోజనం ఎందుకంటే.. 7-8 గంటల మధ్య భోజనం చేయడం వల్ల  మొత్తం ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. త్వరగా భోజనం చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా నిద్ర, గుండె, జీర్ణక్రియ,  చక్కెర నియంత్రణకు కూడా చాలా మంచిది.  త్వరగా భోజనం చేసేవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 27% తక్కువగా ఉంటుందని,  అధిక కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదం 19% తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనితో పాటు, బరువు తగ్గడం, జీర్ణ ఆరోగ్యం,  నిద్ర నాణ్యతకు కూడా ఇది 7-8 మధ్య రాత్రి భోజనం చేయడం మంచిది.   రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల షుగర్ సమస్య వచ్చే ప్రమాదం సాధారణం కంటే 20 శాతం ఎక్కువ ఉంటుందట. జీర్ణశక్తి.. త్వరగా భోజనం చేయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే అది జీర్ణక్రియను చక్కగా ఉంచుతుంది. రాత్రి 8 గంటల ముందు భోజనం చేసినప్పుడు, శరీరం దానిని జీర్ణం చేసుకోవడానికి తగినంత సమయం తీసుకుంటుంది. ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి దాదాపు 2 నుండి 4 గంటలు పడుతుంది. ఆహారం తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది,  గ్యాస్, మలబద్ధకం, ఆమ్లత్వం వంటి సమస్యలు ఏర్పడతాయి. త్వరగా భోజనం చేయడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ (గుండెల్లో మంట) ప్రమాదం 50% తగ్గుతుంది. సూర్యాస్తమయం తర్వాత జీర్ణక్రియ మందగిస్తుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది, కాబట్టి రాత్రిపూట తేలికగా,  త్వరగా తినాలి. నిద్ర.. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంలో బిజీగా ఉండటం వల్ల విశ్రాంతి లభించదు. దీని ప్రభావం నిద్రపై కూడా కనిపిస్తుంది.  నిద్రపోవడానికి 2-3 గంటల ముందు తినడం వల్ల శరీరం ప్రశాంతంగా ఉంటుంది.  నిద్ర గాఢంగా పడుతుంది. 7-8 మధ్య రాత్రి భోజనం చేసేవారికి నిద్రలో గ్యాస్, గుండెల్లో మంట లేదా భారం తక్కువగా ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మంచి నిద్ర మానసిక,  శారీరక ఆరోగ్యానికి మంచిది. బరువు.. బరువు తగ్గాలనుకునేవారు ఆహారం మాత్రమే కాదు, తినే సమయం కూడా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీ (2013) ప్రకారం, సాయంత్రం 7 గంటలకు ముందు తినేవారిలో శరీరం కేలరీలను శక్తిగా మార్చగలదు కాబట్టి బరువు తగ్గడం వేగంగా ఉంటుంది. రాత్రి ఆలస్యంగా  భోజనం చేయడం వల్ల ఆహారం కొవ్వుగా నిల్వ చేయబడుతుంది. త్వరగా తినడం వల్ల జీవక్రియ చురుకుగా ఉంటుంది.  ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. అలాగే రాత్రి భోజనం తర్వాత  శారీరక శ్రమ లేదా కాస్త వాకింగ్ చేయడానికి కూడా సమయం దొరుకుతుంది. ఇది కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ రోగులు సమయానికి రాత్రి భోజనం చేయడం  చాలా ముఖ్యం. ఆలస్యంగా భోజనం చేసేవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల శరీరం  సిర్కాడియన్ సైకిల్ కు భంగం కలుగుతుంది, ఇది హార్మోన్ల అసమతుల్యత ప్రమాదాన్ని పెంచుతుంది.                              *రూపశ్రీ.