నానబెట్టిన వాల్నట్స్ తినడానికి ఏ సమయం ఉత్తమం తెలుసా?
posted on Sep 24, 2025 12:45PM

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. చాలమంది డ్రై ఫ్రూట్స్ ను నేరుగా తినడం కంటే వాటిని నానబెట్టుకుని తినడం చాలా మంచిదని చెబుతారు. ఇలా నానబెట్టుకుని తినే డ్రై ప్రూట్స్ లో బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఖర్జూరం మొదలైనవాటితో పాటు వాల్నట్స్ కూడా ఉంటాయి. వీటిని నానబెట్టుకుని తినడం వల్ల పోషకాలు లభిస్తాయి. శరీరానికి ప్రోటీన్ లభిస్తుంది. అలాగే సాధారణంగా ఉన్న డ్రై ఫ్రూట్స్ ను తినడం కంటే.. నానబెట్టిన వాటిని తినడం వల్ల ఎక్కువ పోషకాలు లభిస్తాయి. అయితే నానబెట్టిన వాల్నట్స్ ను సాధారణంగా రాత్రి నానబెట్టి, ఉదయాన్నే తింటుంటారు. కానీ.. ఇలా నానబెట్టిన వాల్నట్స్ ను ఉదయం కాకుండా వేరే సమయంలో తినడం వల్ల ఫలితాలు బాగుంటాయట. శరీరానికి మంచి బెనిఫిట్ చేకూరుతుందట. ఇంతకీ నానబెట్టిన వాల్నట్స్ ను ఏ సమయంలో తినాలి? ఏ సమయంలో తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి? తెలుసుకుంటే..
సాయంత్రం..
నానబెట్టిన వాల్నట్స్ ను సాయంత్రం సమయంలో తినడం చాలా మంచిదని వైద్యులు, ఆహార నిపుణులు అంటున్నారు.
వాల్నట్స్ లో ఉండే పోషకాలలో ప్రముఖమైనది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు. అలాగే మెలటోనిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని సాయంత్రం సమయంలో తినడం మంచిదని అంటారు.
వాల్నట్స్ లో ఉండే ఒమేగా-3 మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మెదడు పని తీరుకు చాలా సహాయపడుతుంది. అలాగే వాల్నట్స్ లో ఉండే మెలటోనిన్ కూడా శరీరానికి చాలా అవసరం. ఇది నిద్రను మెరుగ్గా ఉంచడంలో, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
వాల్నట్స్ లో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెలటోనిన్ మాత్రమే కాకుండా పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను, అభ్యాసన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.
వాల్నట్స్ లో ఉండే ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందినవి. ఇవి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడుతుంది. అట్లాగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను డీల్ చేయడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. నానబెట్టిన వాల్నట్స్ తింటే జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. ఎందుకంటే వాల్నట్స్ నానడం ద్వారా ఫైబర్ మెరుగవుతుంది. ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఇది మలబద్దకం సమస్యను నివారిస్తుంది.
నానబెట్టిన వాల్నట్స్ తింటే ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఇది ఆహారం ఎక్కువ తీసుకోవడాన్ని నివారిస్తుంది. తద్వారా బరువు అదుపులో ఉంచడం లేదా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...