వేసవి వచ్చేసింది.. తులసి మొక్క ఎండిపోకుండా పచ్చగా ఉండాలంటే ఏం చేయాలి!

posted on: Mar 17, 2026 5:58PM


హిందువులకు తులసి మొక్క దైవంతో సమానం. తులసి మొక్క పచ్చగా కళకళలాడుతూ ఉంటే ా ఇంట్లో ఎంతో సానుకూల శక్తి,  మరెంతో సంతోషం ఉంటాయని చెబుతారు. అయితే వేసవి కాలం వచ్చేసింది. తులసి మొక్కతో సహా చాలా రకాల మొక్కలు వేసవి ఎండల కారణంగా వాడిపోయి ఎండిపోతుంటాయి. కానీ పవిత్రమైన తులసి మొక్క పచ్చగా ఉంటేనే మంచిది.  ఇది ఇంటికి అందాన్నే కాకుండా సానుకూల శక్తిని కూడా నిలిపి ఉంచుతుంది.  వేసవి ఎండలు ఎంత ఉన్నా తులసి మొక్క అందంగా,  పచ్చగా ఉండాలంటే  కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకుంటే..

తులసి మొక్క ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉంటుంది. వేసవి కాలం కదా అని చాలామంది తులసి మొక్కకు ఎక్కువ నీరు పెడుతూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు.
 ఎక్కువ నీరు పెట్టడం వల్ల మొక్క దెబ్బతింటుంది. నేల తేమగా  ఉండేందుకు తగినంత మాత్రమే మొక్కకు నీరు పెట్టాలి. మొక్క నీటిలో మునిగినట్టు ఉంటే ఆ మొక్కకు హాని కలుగుతుంది.

తులసి మొక్క గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు.  కొన్నిసార్లు, మొక్కను సరిగ్గా చూసుకోకపోవడం వల్ల అది కుళ్ళిపోతుంది.  కొన్ని ఇళ్లలో వర్షాకాలంలో కూడా తులసి మొక్క పచ్చగా కనిపించదు. అలాంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలి.

మొక్కలను కుండీలలో పెంచుతూ ఉంటారు.  వీటికి కొన్నిసార్లు,  పోషకాహార లోపం కూడా  ఎదురవుతుంది.  మొక్కల ఎదుగుదలకు  అవసరమైన పోషకాలు అందించడం చాలా ముఖ్యం. తులసి మొక్కను పచ్చగా ఉంచడానికి,  ఎరువులు వేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎరువులు వేస్తూ ఉంటే కొన్ని రోజులకే మొక్క పచ్చగా మారుతుంది.

తులసి మొక్క ఎండిపోయినట్టు ఉంటే మొక్క  మట్టికి ఆవాల కేక్ వేయవచ్చు. ఆవాల కేక్ వేయడం వల్ల మొక్క వేగంగా పెరుగుతుంది.  ఆవాల నూనె తీసిన తర్వాత వచ్చే పిప్పిని ఆవాల కేక్ అని అంటారు.  ఒకవేళ ఇది అందుబాటులో లేకపోతే ఒక స్పూన్ ఆవాలను బాగా గ్రైండ్ చేసి ఆ పొడిని నేరుగా మట్టిలో మిక్స్ చేయవచ్చు. లేదంటే ఆవాల పొడిని నీటిలో వేసి ఒక రోజంతా అలాగే ఉంచి,  ఆ తరువాత  ఆ నీటిని మొక్కకు పోయవచ్చు. మొక్క బలంగా పచ్చగా పెరుగుతుంది.

తులసి మొక్క ఎండిపోతూ ఉంటే.. ఎండిపోయిన కొమ్మలను తొలగించి,  ఆవాల పొడిని వేయడం వల్ల మొక్క తిరిగి కొన్ని రోజులకే పచ్చగా మారుతుంది.

                                         *రూపశ్రీ.

google-ad-img
    Related Sigment News
    • Loading...