LATEST NEWS
విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు రాజకీయ ప్రయాణంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇటీవల  ముద్రగడ పద్మనాభం సంతాప సభలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వేదికను పంచుకోవడం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ఆయన  ఆత్మీయంగా మెలగడానికి సంబంధించిన  దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  దీంతో బోండా ఉమా పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. బోండా ఉమా తీరును సీరియస్ గా పరిగణించిన తెలుగుదేశం అధిష్ఠానం కూడా ఆయనను వివరణ కోరింది.   అంతే కాకుండా.. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారు రాజేష్, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడులతో  కూడిన త్రిసభ్య కమిటీ ఎదుట హాజరై తన వైఖరిని స్పష్టం చేయాలని బోండాకు నోటీసులు పంపింది.   అయితే తనపై వస్తున్న ప్రచారాన్ని, ఆరోపణలను బోండా ఉమా తీవ్రంగా ఖండించారు. తాను వైసీపీ  కార్యక్రమంలోనూ పాల్గొనలేదని, అది ఏ రాజకీయ పార్టీకీ సంబంధం లేని   కార్యక్రమని స్పష్టం చేశారు. గుంటూరులో జనసేన మాజీ  నాయకుడు దాసరి రాము ఏర్పాటు చేసిన సంతాప సభకు మాత్రమే తాను హాజరయ్యానని తెలిపారు. ఆ వేదికపై కాకతాళీయంగా  అంబటి రాంబాబు కలవడంతో   మర్యాదపూర్వకంగా  పలకరించి మాట్లాడానని ఆయన వివరణ ఇచ్చారు.     ఈ మొత్తం వ్యవహారంతో వైసీపీ విజయవాడకు చెందిన కీలక నాయకుడు తమ గూటికి చేరడం ఖాయమన్న భావనకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే   వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు  అంబటి రాంబాబు, పేర్ని నాని  మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా   వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో  వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి. అంతకు ముందే బోండా ఉమా పార్టీ మారే ఉద్దేశం లేదంటూ స్పష్టత నిచ్చారు. తాజాగా విజయవాడలో  మెగా డీఎస్సీ లో అక్రమాలు అంటూ మల్లాది విష్ణు నేతృత్వంలో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష లో మంత్రి నారా లోకేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపించారు. దీనితో బోండా తన నియోజకవర్గం లో అధికారుల అనుమతి లేకుండా వైసీపీ చేస్తున్న ఈ నిరసన దీక్షలను నిలువరించే ప్రయత్నం చేశారు. అనుమతుల్లేని  అనధికారిక దీక్షల వల్ల   స్థానిక ప్రజలు ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కుంటున్నారని, వెంటనే వైసీపీ నేతలు తమ దీక్షలు విరమించాలని బోండా   వైసీపీ కి వ్యతిరేకంగా గట్టిగా గళం విప్పారు.  ఈ ఘటన తరువాత వైసీపీయుల స్వరం మారింది. అంతకు ముందు వరకూ బోండాకు మద్దతుగా గళమెత్తిన వైసీపీ... ఆ తరువాత.. బోండా ఉమా టార్గెట్ గా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పింింది. తాము శాంతియుతంగా  చేపట్టిన నిరాహారదీక్షను బోండా  భగ్నం చేసారంటూ   పేర్ని నాని విమర్శలు గుప్పించారు. ఒక విధంగా బోండా ఉమ   ప్రజాస్వామ్యం మీద  దాడి చేశారని దుయ్యబట్టారు. దీనితో బోండా ఉమా  విషయంలో వైసీపీ ఆశలు ఆవిరయ్యాయనీ, అందుకే ఆయన టార్గెట్ గా ఫ్యాన్ పార్టీ విమర్శలకు పదును పెట్టిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో బోండా ఉమా ఫ్యాన్ గూటికి చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి కూడా బోండా చెక్ పెట్టారని అంటున్నారు.   Bonda Uma, Vijayawada Central, TDP leadership, YSRCP, Ambati Rambabu
ప్రజా బలం ముందు ధన బలం తలవంచక తప్పదని మరోసారి రుజువైంది. 2024 ఎన్నికలలో వైసీపీ ధన బలంతో గెలిచేందుకు ప్రయత్నించి ఘోర పరాజయాన్ని మూటగట్టుకోగా,  ప్రజాబలంతో బరిలో నిలిచిన తెలుగుదేశం ఘన విజయం సాధించింది.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు, గణాంకాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఇటీవల విడుదల చేసిన ఆర్థిక విశ్లేషణ నివేదిక ప్రస్ఫుటంగా తేల్చింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల ఆదాయ, వ్యయాలకు సంబంధించిన వివరాలను ఏడీఆర్ నివేదిక బయటపెట్టింది.    ఏడీఆర్  నివేదిక మేరకు   దేశంలోని ప్రాంతీయ పార్టీల ఆదాయంలో తెలుగుదేశం పార్టీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరానికి  తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఆదాయం  228.31 కోట్ల రూపాయలు.  ఇది   దేశవ్యాప్తంగా   36 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో దాదాపు 19 శాతం. తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఆదాయంలో సభ్యత్వ రుసుములు, పార్టీ చందాలు,  బ్యాంక్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ ప్రధాన వనరులుగా నిలిచాయి. అయితే.. ఎన్నికల  ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ  ఆర్థిక సంవత్సరంలో వైసీపీ  ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే  దాదాపు  199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది. ఈ మొత్తం వ్యయంలో  ఆ పార్టీ  300 కోట్ల రూపాయలకు  పైగా కేవలం ఎన్నికల ప్రచారానికే కేటాయించింది.  దీనికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ  క్రమశిక్షణతో వ్యయం చేసింది. పార్టీకి వచ్చిన  228.31 కోట్లరూపాయల  ఆదాయంలో తెలుగుదేశం  61.33 కోట్ల రూపాయలు   ఖర్చు చేసింది. ఇందులో ఎన్నికల వ్యయం  31.73 కోట్ల రూపాయలు.   ఆదాయంలో ఏకంగా 73 శాతానికి పైగా..  అంటే  167 కోట్ల రూపాయలను  మిగులు నిధిగా భద్రపరుచుకుంది. ఇదే సమయంలో పొత్తులో ఉన్న జనసేన పార్టీ రూ.64.1 కోట్ల ఆదాయాన్ని, రూ.56.9 కోట్ల వ్యయాన్ని చూపించింది. ఏడీఆర్ నివేదికను ఉటంకిస్తూ.. కేవలం ప్రకటనలు, ప్రచార ఆర్భాటాలకు వందల కోట్లు గుమ్మరించినంత మాత్రాన ఓటర్లను ఆకట్టుకోవడం సాధ్యం కాదని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వైఎస్సార్‌సీపీ  340 కోట్లకు పైగా వెచ్చించి భారీగా ఎన్నికలలో విజయం కోసం ఖర్చు చేసినప్పటికీ,  ఆ పార్టీ 2024 ఎన్నికలలో గెలిచినది కేవలం 11 స్థానాలలో మాత్రమే.  అదే సమయంలో పరిమిత వ్యయంతోనే   ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన తెలుగుదేశం కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలలో   135 స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.   మొత్తానికి  ధనబలం కంటే ప్రజాబలమే పార్టీల విజయానికి కీలకమని అని ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు,  ఏడీఆర్  నివేదిక కూడా ప్రస్ఫుటంగా తేల్చిచెప్పాయి.   ADR Report Andhra Pradesh, TDP Election Funds, YSRCP Campaign Expenditure, AP Assembly Elections 2024, Political Party Income, TeluguOne
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించ తలపెట్టిన ఛాత్రోన్ కీ గూంజ్  (విద్యార్థుల గళం) సదస్సుకు లైన్ క్లియర్ అయ్యింది.  సభా వేదికకు సంబంధించి ఇచ్చిన అనుమతిని ఆ తరువాత అకస్మాత్తుగా ఉప సంహరించుకున్న  కాయస్థ పాఠశాల  ట్రస్ట్, దీనిపై సర్వత్రా నిరసనలు, విమర్శలు వెల్లువెత్తడంతో  అనివార్యంగా వెనక్కు తగ్గి అనుమతిని పునరుద్ధరిస్తూ గురువారం (ఆగస్టు 6) రాత్రి పొద్దుపోయిన తరువాత ప్రకటన విడుదల చేసింది. అయితే  కొన్ని షరతులు విధించింది.   దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న  ప్రశ్నాపత్రాల లీకేజీలు,  నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. ఇందుకు కేపీ ట్రస్ట్ అనుమతి కూడా ఇచ్చింది. అయితే.. అనూహ్యంగా.. కేపీ ట్రస్ట్ బుధవారం ( ఆగస్టు 5)     సభకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించరుకుంటున్నట్లు తెలిపింది.  రాహుల్ గాంధీ నేరుగా విద్యార్థుల సమస్యలపై గళమెత్తితే  ప్రభుత్వ  వైఫల్యాలు బయటపడతాయన్న భయంతోనే కేంద్రంలోని మోడీ సర్కార్, యూపీలోని బీజేపీ ప్రభుత్వం..   ట్రస్ట్ యాజమాన్యంపై   ఒత్తిడి తెచ్చి సభకు అనుమతి రద్దు చేయించాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వేదిక అనుమతి రద్దయినా..  మైదానాలు మారినా రాహుల్ గాంధీ ప్రయాగ్‌రాజ్ పర్యటన  రద్దు కాదనీ, నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే  జరుగుతుందనీ కాంగ్రెస్ ప్రకటించింది.   రాహుల్ సభకు అనుమతి రద్దు చేస్తూ కేపీ ట్రస్ నిర్ణయం పట్ల సర్వత్రా ఆగ్రహం, విమర్శలు రావడంతో..  ఆ ట్రస్ట్ తాత్కాలిక అధ్యక్షుడు జితేంద్ర నాథ్ చౌదరి హైకోర్టు సీనియర్ న్యాయవాదులతో   సంప్రదింపులు జరిపి.. సభకు అనుమతిని పునరుద్ధరించారు. అయితే..   ఈ సభ వల్ల కాలేజీలో జరిగే  తరగతులకు ఎలాంటి ఆటంకం, భంగం కలగకూడదనీ,   ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజిస్ట్రేట్  నుంచి కాంగ్రెస్ నాయకత్వం తప్పనిసరిగా చట్టబద్ధమైన   అనుమతి తీసుకోవాలని షరతులు విధించారు.   Rahul Gandhi Prayagraj Meeting, Chatron Ki Goonj, KP Ground Permission, Congress Student Rally, UP Politics News, Rahul Gandhi Student Interaction
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ భద్రతకు నిజంగా ముప్పు ఉందా? పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో  జగన్  భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది.  అంతటితో ఆగకుండా,  జగన్‌కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే  వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.   వైసీపీ  ఎంపీల బృందం  ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఇటీవల కలిసి  జగన్‌కు తగిన భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసింది. జగన్ భద్రతలో కోతలు విధిస్తున్నారని, దీనివల్ల ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందనీ వైసీపీ ఎంపీలు  ఆందోళన వ్యక్తం చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల విషయంలో అక్రమాలపైనా, రాష్ట్రంలో  వైసీపీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ వేధింపులతో కేసులు బనాయిస్తున్నారని వారు హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలపై పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా వారికి హామీ ఇచ్చినట్లు వారు ఆ తరువాత మీడియాకు తెలిపారు.   అయితే..  వైఎసీపీ ఎంపీల ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం  తోసిపుచ్చింది. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఈ విషయమై స్పందిస్తూ, జగన్ మోహన్ రెడ్డికి  భద్రత తగ్గించినట్లు వైసీపీయలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు.  స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే జగన్ కు భద్రత కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.  ప్రభుత్వం తరుఫున భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేవని వంగలపూడి అనిత కండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  వైసీపీ   పర్యటనలు, సభలలో పోలీసు అనుమతులకు మించి భారీగా జన సమీకరణ చేస్తుండటమే అసలు సమస్య పేర్కొన్నారు.  అనుమతించిన దాని కంటే  ఎన్నో రెట్లు ఎక్కువగా జనాన్ని వైసీపీ తరలించడంవల్లనే  క్షేత్రస్థాయిలో భద్రతా నిర్వహణ పోలీసులకు సవాలుగా మారుతోందనీ,  ప్రణాళికారాహిత్యమైన ఈ తీరు వల్లనే భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.  జగన్ భద్రత తగ్గించినట్లు స్పష్టమైన ఆధారాలేవీ ఇప్పటివరకు బయటకు రాలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భద్రతకు సంబంధించి రాజకీయ విమర్శలు రావడం సహజమే అయినా.. ఈ విషయంలో రాజకీయ వివాదాల కంటే భద్రతా ఏజెన్సీల అంచనాలకే ప్రాధాన్యత ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.     Jagans security, Amit Shah, YCP MPs, Vangalapudi Anita, Jagan security controversy, Andhra Pradesh politics, TeluguOne
 పార్లమెంట్ ఆవరణలో  స్కిట్ చేశారంటూ  లోక్‌సభలో ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ,  మరో నలుగురు విపక్ష ఎంపీలపై బీహార్‌ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ ప్రాంగణంలో ప్రతిపక్ష నాయకులు ప్రదర్శించిన సొలిటిరల్ స్కిట్ తీవ్ర దుమారాన్ని రేపింది. సనాతన ధర్మ విశ్వాసాలను, భక్తుల మత మనోభావాలను గాయపరిచేలా ఈ ప్రదర్శన ఉందని, కేవలం ప్రచారం కోసమే ఇలా చేశారని ఆరోపిస్తూ..   న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.   పార్లమెంట్ ఆవరణలో జులై 31న అయోధ్య రామమందిర విరాళాల కుంభకోణంపై విపక్ష ఎంపీలు వినూత్న నిరసన చేపట్టారు.  ఈ నిరసనలో భాగంగా ఇండిపెండేంట్  ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ ఒక పూజారి వేషధారణలో  కూర్చిన తన ముందు ఒక  విరాళాల పెట్టెను ఉంచగా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు భక్తుల రూపంలో వచ్చి ఆ పెట్టెలో డబ్బులు వేస్తున్నట్లుగా.. ఆ డబ్బులను   పూజారి వేషంలో ఉన్న పప్పు యాదవ్   తన జేబులో వేసుకోవడం, దాన్ని పక్కనే ఉన్న మరో ప్రతిపక్ష ఎంపీ ప్రశ్నించడం వంటి సన్నివేశాలను ఆ స్కిట్ లో ప్రదర్శించారు. అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన  రాజకీయ వివాదానికి దారి తీసింది.   రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ..  బీహార్‌లోని జమూయి సివిల్ కోర్టులో  ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్‌లో రాహుల్ గాంధీని ప్రధాన ప్రతివాదిగా చేర్చడంతో పాటు,  ఎంపీ పప్పు యాదవ్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎంపీలు అవధేశ్ ప్రసాద్, రుచి వీర,   ధర్మేంద్ర యాదవ్‌లను  ప్రతివాదులుగా చేర్చారు. ఈ ఐదుగురు ఎంపీలు చట్టవిరుద్ధంగా, మతపరమైన భావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని పిటిషనర్ పేర్కొన్నారు.  Rahul Gandhi court complaint, Parliament skit controversy, Bihar Jamui Civil Court case, Ayodhya Ram Mandir donation skit, Opposition MPs court case, Pappu Yadav priest skit
ALSO ON TELUGUONE N E W S
కోలీవుడ్ మాస్ యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మకుటం' (Magudam) ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ముఖాముఖిలో తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకున్న ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్, తాజా రాజకీయ వివాదాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ చిత్ర పరిశ్రమలోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపిన ఈ ఘటనపై విశాల్ మాట్లాడుతూ.. బహిరంగ ప్రసంగాల్లో మాట్లాడేటప్పుడు పరిమితులు పాటించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కొందరి కామెంట్లు వివాదాస్పదంగా మారి ఇటువంటి పరిస్థితులకు దారితీస్తాయని, కొన్ని విషయాలను ముందే నివారించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తన కళాశాల రోజులను గుర్తుచేసుకున్న విశాల్, ఈ పరిణామంపై ఆసక్తికరంగా స్పందించారు. లయోలా కాలేజీలో తమకు సీనియర్ అయిన హీరో విజయ్, ఒక రోజు తమ బ్యాచ్‌మేట్ అయిన ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుందని తాము ఎప్పుడూ ఊహించలేదని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చాక ఇలాంటి సవాళ్లు, అరెస్టులు ఎదురుకావడం సహజమేనని ఆయన పేర్కొన్నారు. నటుడిగా తనకు కూడా గతంలో పలు వివాదాలు ఎదురైన విషయాన్ని విశాల్ ప్రస్తావించారు. మీడియాలో పూర్తి వ్యాఖ్యలను చూపించకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు అనవసరమైన గందరగోళం నెలకొంటుందని, ఉదయనిధి విషయంలోనూ అదే జరిగి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసే వ్యాఖ్యలకు పరిణామాలు ఎలా ఉంటాయో ఇదొక ఉదాహరణ అని అన్నారు. ప్రస్తుతం విశాల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. విజయ్, ఉదయనిధి, విశాల్‌ల కాలేజ్ కాంబినేషన్‌ను ప్రస్తావిస్తూ నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ అని నెటిజన్లు చర్చిస్తున్నారు. కాగా, విశాల్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'మకుటం' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నటీనటులు: లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి, సంజన, అవినాష్ రఘుదేవన్ సాంకేతిక వర్గం: రచన: అరుణ్ మాదేశ్వరన్, ఫ్రాంక్లిన్ జాకబ్, అరుణ్ రంజన్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం (సినిమాటోగ్రఫీ): ముఖేష్ జి కూర్పు (ఎడిటింగ్): ప్రసన్న జి.కె దర్శకత్వం: అరుణ్ మాదేశ్వరన్ నిర్మాణం: కళానిధి మారన్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఉత్తమ దర్శకుల్లో ఒకరిగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తన సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ నటనపై ఉన్న ఆసక్తిని చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు డిసి (DC) చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా మారారు. రాఖీ, కెప్టెన్ మిల్లర్ లాంటి చిత్రాలు తీసిన అరుణ్ మాదేశ్వరన్  (Arun Matheswaran) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వామికా గబ్బి హీరోయిన్. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం. కథ: తన తల్లిని దారుణంగా చంపిన మేనమామలను హత్య చేసి జైలుకు వెళ్లిన దేవదాస్ (లోకేష్ కనగరాజ్), బయటికొచ్చాక తన తండ్రికి దూరంగా ఉంటాడు. పోలీసు ఆఫీసర్‌గా ఉండి నక్సలైట్‌గా మారిన అరసు గ్యాంగ్‌లో చేరుతాడు. ఆయుధాల కోసం పోలీసు వాహనంపై దాడి చేసినప్పుడు, పోలీసులు చేసే అరాచకాలు అతనికి తెలుస్తాయి. న్యాయం కోసం ఆ అవినీతి పోలీస్ అధికారిని చంపాలని నిర్ణయించుకుంటాడు, కానీ దాని వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్ తోనే యుద్ధం చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో బార్ సింగర్ పార్వతి (Sanjana)తో ప్రేమలో పడతాడు. వారి బంధానికి భవిష్యత్తు లేదని తెలిసినా ఇద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు. దురదృష్టవశాత్తూ, అతని కోసం వెతుకుతున్న పోలీసులు పార్వతిని చంపేస్తారు. పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్న దేవదాస్ జైలు నుంచి తప్పించుకుంటాడు. పోలీసులకు సమాచారం ఇచ్చిన బార్ ఓనర్‌ను చంపే క్రమంలో, చంద్ర (Wamiqa Gabbi) అనే వేశ్యతో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏమైంది? అనేది మిగతా కథ. విశ్లేషణ: నటుడిగా లోకేష్ కనగరాజ్ తనను తాను నిరూపించుకున్నాడు, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో చాలా సహజంగా కనిపించాడు. ఎమోషనల్ సీన్స్ కూడా పర్వాలేదనిపించినా, యాక్షన్‌లో ఉన్నంత ఈజ్ ఎమోషన్స్‌లో లేదు. వామికా గబ్బి తన పాత్ర పరిధి మేరకు బాగా నటించింది, అయితే కొన్ని డైలాగుల దగ్గర కొంచెం తడబడినట్లు అనిపిస్తుంది. పార్వతి పాత్రకు సంజన సరిగ్గా సరిపోయింది, లోకేష్‌తో ఆమె కాంబినేషన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించారు. దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ మేకింగ్ స్టైల్, ఫ్రేమింగ్ చాలా కొత్తగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే స్క్రీన్‌ప్లేలో కొన్ని పాత ఐడియాలు మళ్లీ మళ్లీ రిపీట్ అవ్వడమే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా బ్రిలియంట్ గా తీశాడు. పార్వతి ట్రాక్ ను విజువల్ గా అద్భుతంగా చూపించాడు. కానీ క్లాసిక్ 'దేవదాస్' కథను బానీ అండ్ క్లైడ్ తరహా ప్రపంచంలో చూపించాలన్న అతని ప్రయత్నానికి, ఊహకందే స్క్రీన్‌ప్లే పెద్ద మైనస్ అయింది. సెకండ్ హాఫ్ లో కథ ముందుకు సాగేకొద్దీ కొత్తదనం లోపించింది. కొన్ని ఎమోషన్స్ ను ఎలివేట్ చేయడానికి దర్శకుడు అనవసరమైన సమయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. దర్శకుడి విజన్ కు తగ్గట్టుగా అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. క్లాసికల్, వెస్ట్రన్ మ్యూజిక్ ను మిక్స్ చేసిన విధానం సినిమాకు హైలైట్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ బాగున్నా, కొన్ని ఫ్రేమ్స్ ఇంకాస్త టైట్ గా ఉంటే బాగుండేది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. కొన్ని షాట్స్ మరీ సాగదీసినట్లు అనిపిస్తాయి. ఓవరాల్ గా ఈ యాక్షన్ ప్యాక్డ్ 'దేవదాస్' ఒక మోస్తరుగా ఆకట్టుకుంటుంది కానీ, అందరికీ నచ్చకపోవచ్చు. తెరపై రక్తపాతం, వైలెన్స్ ఇష్టపడేవారు ఒకసారి చూడొచ్చు. అధికారం ఎలా దుర్వినియోగం అవుతుందో, తిరుగుబాటును ఎలా తప్పుగా అర్థం చేసుకుంటారో చూపిస్తూ, పాత దేవదాస్ కథకు ఇచ్చిన కొత్త ముగింపు బాగుంది. ప్లస్ పాయింట్స్: అనిరుధ్ రవిచందర్ సంగీతం లోకేష్ కనగరాజ్ నటన సంజన స్క్రీన్ ప్రెజెన్స్ కొన్ని యాక్షన్ సన్నివేశాలు మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్‌లో సాగదీత కొన్ని సన్నివేశాల్లో ఆశించిన స్థాయి ఎమోషన్ లేకపోవడం ప్రీ-క్లైమాక్స్ కి ముందు గందరగోళం రిపీట్ అయిన సీన్స్, నెమ్మదించిన కథనం బాటమ్ లైన్: 'డిసి' యాక్షన్ ప్రియులకు మాత్రమే నచ్చే ఒక డీసెంట్ మూవీ. రేటింగ్: 2.25/5 డిస్‌క్లెయిమర్: ఈ రివ్యూలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు పూర్తిగా సమీక్షకుడి వ్యక్తిగతమైనవి, వీటికి సంస్థకు ఎలాంటి బాధ్యత లేదు. పాఠకులు తమ సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నాం.
Cast: Lokesh Kanagaraj, Wamiqa Gabbi, Sanjana, Avinash Raghudevan  Crew:  Written by Arun Matheswaran, Franklin Jacob, Arun Ranjan Music by Anirudh Ravichander  Cinematography by Mukesh G Editing by Prasanna GK  Directed by Arun Matheswaran Produced by Kalanithi Maran Lokesh Kanagaraj has earned a huge following across Telugu states and Tamil Nadu, as one of the best directors. He showcased a penchant to be an actor by playing small roles in his films. Now, he debuted as a full-fledged actor with DC. Arun Matheswaran who made Rocky, Captain Miller directed this film with Wamiqa Gabbi as leading lady. Anirudh Ravichander's music elevated buzz for the film and it released in theatres, Today. Let's discuss about the film, in detail. Plot:  Devadas (Lokesh Kanagaraj), who went to jail after killing his uncles who brutally murdered his mother stays away from his father. He joins a gang of Arasu, who was a police officer turned naxalite. He ambushes police vehicle for weapons and finds out the atrocities committed by them. He decides to kill the corrupt police official for establishing justice but he finds himself at war with entire department.  In the meantime, he falls in love with Parvathy (Sanjana), a bar singer, and even though they don't know that the relationship has no future, they do find attracted to each other. Unfortunately, police in the pursuit of him, kills her. He decides to take revenge and escapes from jail. While eliminating the bar owner who tipped off to police, he meets a prostitute Chandra (Wamiqa Gabbi). What happens next? Watch the movie to know more.  Analysis:  Lokesh Kanagaraj is a competent actor and he proves that he is believable in action space. He handles emotional portions decently well. Maybe he is more natural with action than other emotions. Wamiqa Gabbi is good until he tries to deliver dramatic monologues. Her expressions are good and her screen presence adds to the film. Sanjana Krishnamoorthy is apt for Parvathy and her beauty, portions with Lokesh shine. All others are adequate in their performances.  Arun Matheswaran has a filmmaker is unconventional and his framing is attractive. Only problem lies in his staging of few scenes and repetitive ideas in screenplay. He established brilliantly in the first half and excelled with his visual storytelling in the Parvathy portions. But the predictability in the screenplay does hamper his ambition to set the re-adapt classical Devdas tale in a world of Bonnie and Clyde.  The ideas needed to be more refreshing as the investigation progresses and at times, for feel he seems to spend more time on ideas that end up being repetitive. Anirudh Ravichander goes a brilliant job in understanding the idea behind the director's vision and he uses fusion in his score to mix classical and western. His work standsout. Cinematography is good at places framing could have been tighter.  Editing needed to be even better as some shots stretch at places more than they should. Overall, the action packed Devdas version is satisfactory but not a tale for everyone. People who love to see gore and brutal violence on screen can give it a try. The movie does offer a clever twist to tale of Devdas by pointing at how rebellion can be misjudged and power can be misguided.  Positives:  Anirudh Ravichander score Lokesh Kanagaraj performance Sanjana screen presence Few action blocks Negatives:  Slight indulgence in second half Few underwhelming pay-offs Randomness towards pre-climax Drag and repeated ideas Bottomlime: DC offers a decent watchable experience but only for action lovers.  Rating: 2.25/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
    థమన్(Thaman).. ఇది కేవలం పేరు కాదు బ్రాండ్ అనే రీతిలో ఎన్నో చిత్రాలకి అద్భుతమైన మ్యూజిక్ ఇస్తూ లెక్కపెట్టలేని  విధంగా అభిమానులని సంపాదించుకుంటున్నాడు. ఈ రోజు వరుణ్ తేజ్ తో కలిసి  'కొరియన్ కనకరాజు' గా వచ్చాడు. రావడమే కాదు ఆర్ఆర్ తో కొరియన్ కనకరాజుకి ప్రాణంగా నిలిచాడని అభిమానులు, ప్రేక్షకులు ముక్త కంఠంతో చెప్తున్నారు. తమన్ అందించిన నేపధ్య సంగీతం అసలైన మేజర్ అసెట్‌గా నిలిచిందని సినీ విశ్లేషకులు కూడా ముక్తకంఠంతో స్పష్టం చేస్తున్నారు.  ఈ కథలో వరుణ్ తేజ్ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక సాధారణ యువకుడి పాత్రలో కనిపించడంతో పాటు, కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ ఆవహించిన తర్వాత అతనిలో వచ్చే మార్పులని చాలా వినోదాత్మకంగా ప్రదర్శించారు. హీరోయిన్ రితికా నాయక్ ఈ సినిమాలో కియా మోటార్స్ కంపెనీ ప్రతినిధిగా నటించగా, నటుడు సత్య తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు. అయితే, థియేటర్లలో సీన్స్ ని  నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లడంలో ప్రధాన భూమిక పోషించింది మాత్రం తమన్ అందించిన స్కోరే. కథలోని కామెడీ, యాక్షన్, ఎమోషన్ మరియు హారర్ ఎలిమెంట్స్‌ని ఎలివేట్ చేయడంలో తమన్ రీ-రికార్డింగ్ అద్భుతంగా పనిచేసింది. Also read: కొరియన్ కనకరాజు హైలెట్స్ ఇవే!  గతంలో వచ్చిన 'ఓజీ' లాంటి భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాల స్కేల్‌లో తమన్ ఈ చిత్రానికి పవర్ ఫుల్ మ్యూజికల్ బిట్స్ ఇచ్చారనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే గ్యాంగ్‌స్టర్ డ్రామా సన్నివేశాలలోనూ, కనకరాజు కొరియన్ బాటిల్ ఆత్మతో ప్రవర్తించే కీలక సీన్లలోనూ థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లో థ్రిల్‌ అందిస్తోందని ప్రేక్షకులు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. స్క్రీన్‌పై సత్య కామెడీ సన్నివేశాలకు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ఫన్నీ బిట్స్ థియేటర్లోని  ఆడియన్స్‌ ని  ఆకట్టుకున్నాయి. అలాగే ప్రీ-క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ యాక్షన్ ఘట్టాలలో తమన్ మార్క్ హై-వోల్టేజ్ మ్యూజిక్ సినిమా మూడ్‌ను పూర్తిగా మార్చేసింది. విజువల్ క్వాలిటీ 100 శాతంగా ఉంటే, తమన్ మ్యూజిక్ దానికి మరింత ప్రాణం పోసి 200 శాతం ఎనర్జీ ఇచ్చిందని రివ్యూయర్లు అంచనా వేస్తున్నారు.  korean kanakaraju, Varun Tej, Merlapaka Gandhi, rithika nayak
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్‌లోని తన తొలి మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నారు. ఏషియన్ గ్రూప్‌తో భాగస్వామ్యంతో విశాఖపట్నంలో అత్యాధునికంగా నిర్మించిన 'AAA సినిమాస్' (AAA Cinemas) మల్టీప్లెక్స్‌ను ప్రారంభించేందుకు బన్నీ ఈ నెల 9న వైజాగ్ విచ్చేయనున్నారు. దీంతో వైజాగ్‌లో టాలీవుడ్ హడావుడి పెరిగింది. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు, నిర్వాహకులు ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ఈసారి సాధారణ ప్రేక్షకులకు, అభిమానులకు ప్రాంగణంలోకి ప్రవేశాన్ని నిరోధిస్తూ ఆంక్షలు విధించారు. కేవలం ఆహ్వాన పత్రికలు ఉన్న విఐపిలు, ప్రత్యేక అతిథులు, నిర్వాహకులకు మాత్రమే మల్టీప్లెక్స్ ప్రారంభ ప్రాంతంలోకి ప్రవేశం ఉండనుంది. అల్లు అర్జున్ మాల్‌లోకి వచ్చి ప్రారంభోత్సవం పూర్తి చేసుకుని, తిరిగి వెళ్లేంత వరకు మాల్ సముదాయాన్ని సాధారణ ప్రజల కోసం తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద ఎదురైన చేదు అనుభవాలు, తొక్కిసలాట సంఘటనల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. విశాఖ పోలీసులు మరియు మల్టీప్లెక్స్ యాజమాన్యం సమన్వయం చేసుకుంటూ ఈ ప్రత్యేక భద్రతా ప్రణాళికను అమలు చేస్తున్నారు. అయితే విశాఖపట్నం వచ్చి తమ అభిమాన కథానాయకుడిని నేరుగా చూడాలనుకునే ఫ్యాన్స్ కోసం మాల్ వెలుపల ఒక వేదికను సిద్ధం చేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ నుండి బన్నీ అభిమానులకు అభివాదం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఎంతో పేరు తెచ్చుకున్న AAA సినిమాస్, ఇప్పుడు ఎనిమిది అత్యాధునిక స్క్రీన్లతో ఆంధ్రాలో కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస గ్లోబల్ ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా ఉన్నారు. 'పుష్ప 2' సృష్టించిన ప్రభంజనం తర్వాత ఆయన నటిస్తున్న తదుపరి సినిమాలపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో వ్యాపారపరంగా కూడా అడుగుపెడుతున్న బన్నీ ప్రాజెక్ట్ విశాఖ సినీ ప్రియుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
  ఈ రోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'గా సెల్యులాయిడ్ పై ప్రత్యక్షమయ్యాడు నిన్న ప్రీమియర్స్ ప్రదర్శించడంతో అభిమానులు, ప్రేక్షకులు భారీగానే పోటెత్తారు. మేర్లపాక గాంధీ దర్శకుడు కాగా యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రెమ్ సంయక్తంగా నిర్మించాయి. ప్రస్తుతం థియేటర్స్ దగ్గర టాక్ అయితే పర్వాలేదనే స్థాయిలో వినపడుతుంది. సోషల్ మీడియా వేదికగా కొంత మంది మూవీలోని హైలెట్స్ గురించి మాట్లాడుతున్నారు. అవేంటో చూద్దాం.   Also read: కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ  1 . రెండు డిఫరెంట్ మైండ్ సెట్ తో సాగిన వరుణ్ తేజ్ పెర్ ఫార్మెన్స్  2 . ఎంట్రీలో వచ్చిన కొరియా ఎపిసోడ్  3 .  ఫస్ట్ హాఫ్ లో కథని నడిపిన విధానం  4 .కొరియా డాన్ అస్థికలు కలిపి ఉన్న చెంబులో వరుణ్ తేజ్ మందు కలిపి తాగడం  5 .సెకండ్ హాఫ్ లో వచ్చిన సత్య, ఫాదర్ మధ్య వచ్చిన దెయ్యాల ఎపిసోడ్  6 . థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్  7 .ప్రతి ఫ్రేమ్ ని అత్యద్భుతంగా మలిచిన ఫొటోగ్రఫీ  8 . యాక్షన్ సీక్వెన్స్  ఇలా పలు హైలెట్స్ సీన్స్ ని మూవీ చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ కి జోడిగా రితికా నాయక్ జత కట్టగా సునీల్, సత్య, బలగం మురళి గౌడ్ ఇతర కీ రోల్స్ లో కనిపించారు.  korean kanakaraju, Varun Tej, Merlapaka Gandhi, rithika nayak
'ఊరు వాడ' పేరుతో వంద కోట్ల విలువైన సేవా కార్యక్రమాలు అంటూ.. కొద్దిరోజుల క్రితం 'RAW NTR' చేసిన రచ్చ అంతాఇంతా కాదు. అది పొలిటికల్ ప్రకంపనలు సృష్టించడంతో.. ఆ 'RAW NTR'తో మాకు ఎలాంటి సంబంధం లేదని 'ఎన్టీఆర్ ఆఫీస్' ప్రకటన చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 'RAW NTR' కూడా తమ కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక అంతా ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలో.. తాజాగా 'RAW NTR' అకౌంట్ నుండి వచ్చిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. 'ఇటాలియన్ ఫుడ్ ప్రొడక్ట్స్' ఎగుమతి కోసం.. దాదాపు 1000 కోట్ల MoU అయినట్లుగా ఆ ట్వీట్ లో ఉంది. అయితే ఆ ట్వీట్ లో 'ఎన్టీఆర్'ను ట్యాగ్ చేయడం వివాదంగా మారింది. అసలు MoUకి , ఎన్టీఆర్ కి సంబంధం ఏంటి? ఆయన్ని ఎందుకు ట్యాగ్ చేశారు? అంటూ 'RAW NTR' టీంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. https://x.com/RAWNTR/status/2085259622928220334     Jr NTR, RAW NTR, Controversy  
ఒకప్పుడు తెలుగు సినిమా బాక్సాఫీస్ స్థాయిని కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేసేవారు. కానీ గత కొన్నేళ్లుగా ఓవర్సీస్, ముఖ్యంగా అమెరికా (USA) మార్కెట్ టాలీవుడ్ చిత్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. అయితే ఇటీవల కాలంలో యూఎస్ బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల వసూళ్లు ఆశించిన స్థాయిలో రాకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో చిన్న, మీడియం రేంజ్ సినిమాలు కూడా సరైన టాక్ వస్తే చాలు నార్త్ అమెరికాలో చాలా సులభంగా మిలియన్ డాలర్ల మార్కును దాటేసేవి. ఇక స్టార్ హీరోల సినిమాలైతే ప్రీమియర్ల ద్వారానే రికార్డు స్థాయి వసూళ్లను సాధించేవి. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చిందని, ఓవర్సీస్ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి తీవ్రంగా యోచిస్తున్నారని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ కలెక్షన్ల స్లోడౌన్‌కు ప్రధానంగా టికెట్ ధరలు పెరగడం, కంటెంట్‌లో నాణ్యత తగ్గడం వంటి అంశాలు కారణమని తెలుస్తోంది. ఆడియన్స్ కంటెంట్ ఏమాత్రం తేడా కొట్టినా థియేటర్ల బాట పట్టకుండా, కొన్ని వారాల్లోనే ఓటీటీలోకి వస్తుంది కదా అనే భావనకు వచ్చేస్తున్నారు. దీంతో ప్రీమియర్లు, మొదటి రోజు వసూళ్ల తర్వాత చాలా సినిమాలకు కలెక్షన్లు దారుణంగా పడిపోతున్నాయి. గతంలో 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప', 'కల్కి 2898 ఏడి' వంటి భారీ పాన్ ఇండియా చిత్రాలు నార్త్ అమెరికాలో ప్రభంజనం సృష్టించి టాలీవుడ్ ఓవర్సీస్ మార్కెట్ స్థాయిని ఆకాశానికి ఎత్తేశాయి. అయితే ఆ స్థాయికి తగ్గ కంటెంట్ లేకపోతే సాధారణ కమర్షియల్ చిత్రాలకు అక్కడ డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడులు కూడా వెనక్కి రావడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితిపై సోషల్ మీడియాలో సినీ అభిమానులు, విశ్లేషకులు విస్తృతంగా చర్చిస్తున్నారు. కేవలం స్టార్ పవర్, భారీ ప్రమోషన్లతో ఓవర్సీస్‌ను ఆకట్టుకోవడం సాధ్యం కాదని, బలమైన కథనం ఉంటేనే డాలర్ల వర్షం కురుస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఓవర్సీస్ మార్కెట్‌ను కాపాడుకోవాలంటే టికెట్ రేట్లను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే కాలంలో వారణాసి, రాకా, డ్రాగన్ వంటి అనేక భారీ చిత్రాలు అమెరికా బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నాయి. మరి రాబోయే పెద్ద సినిమాలు మళ్లీ ఓవర్సీస్ మార్కెట్‌కు పూర్వవైభవం తెచ్చిపెడతాయో లేదో వేచి చూడాలి.   Tollywood Overseas Box Office, USA Box Office Slowdown, Telugu Movies US Collections, Million Dollar Club Tollywood, TeluguOne Box Office News
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'కొరియన్‌ కనకరాజు' తాజాగా విడుదలైంది. అయితే ఇందులో సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఒకటి ఉపయోగించడం కాంట్రవర్సీకి కారణమైంది. 'యుగపురుషుడు' సినిమాలో 'మీ స్ట్రోక్స్ చాలా అమెచ్యూరిష్ గా ఉన్నాయి" అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలు మీమ్స్ లో ఆ డైలాగ్ దర్శనమిస్తోంది.  అయితే 'కొరియన్‌ కనకరాజు' సినిమాలో ఇదే డైలాగ్ ను.. కమెడియన్ సత్య 'ఎన్టీఆర్'ను ఇమిటేట్ చేస్తూ చెప్పాడు. రీసెంట్ గా వైరల్ అయిన ఈ డైలాగ్ ను.. ఎప్పుడో షూటింగ్ అయిపోయిన మూవీలో ఎలా పెట్టారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ డైలాగ్ ను సినిమాలో వాడారు కాబట్టే.. ప్లానింగ్ ప్రకారం కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయిస్తున్నారు? అని నందమూరి ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మూవీ టీంపై ఫైర్ కూడా అవుతున్నారు. మరి దీనిపై 'కొరియన్‌ కనకరాజు' మూవీ టీం ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.     Korean Kanakaraju, NTR Amateurish Dialogue, Varun Tej, Comedian Satya  
పళ్ళబురుసు(టూత్ బ్రష్) కొనివ్వలేదని ఒక వృద్ధ తండ్రి తన కొడుకు మీద కేసు వేసి, కోర్టు మెట్లు ఎక్కితే ఎలా ఉంటుంది?. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న మూవీ 'పళ్ళబురుసు'.  అచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సహజమైన హాస్యం, గుండెలకు హత్తుకునే కుటుంబ అనుబంధాల కలబోతగా ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ ప్రారంభమే చాలా ఫన్నీగా మొదలవుతుంది. “సేటు.. నా కొడుకు మీద కేసు వేయాలి!” అని ఒక ముసలాయన పోలీస్ స్టేషన్ కి వచ్చి పంచాయితీ పెడతాడు. “ఎందుకు కొట్టిండా? పొడిసిండా?” అని పోలీసులు అడిగితే... “లేదు సార్.. నాకు పళ్ళబురుసు కొనియ్యలే” అని ఆ తాత చెప్పే డైలాగ్ తోనే థియేటర్లలో నవ్వుల వర్షం కురవడం ఖాయమని అర్థమైపోతుంది. పళ్ళబురుసు కోసం ఆ తాత పడే తాపత్రయం కామెడీని పండించింది. కానీ ఈ సినిమాలో కేవలం కామెడీ మాత్రమే అనుకుంటే పొరపాటే. దీని వెనుక ఒక బలమైన కుటుంబ కథ, తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ దాగి ఉన్నాయి. “ఎవరి జాగా వాళ్లకే ఉండాలి” అంటూ సరిహద్దులు, ఆస్తి తగాదాలు, హైకోర్టు వరకు వెళ్లేంత మొండితనం.. కథలో ఎమోషనల్ డెప్త్ ని పెంచాయి. ట్రైలర్ ముగింపులో “ఏం తాతా లంకె బిందెలు వెతుకుతున్నావా?” అని అడిగితే.. “లంకె బిందెలా? అదొక్కటే తక్కువైంది నా మొఖానికి. బొంద తవ్వుతున్నా" అంటాడు. ఎవరిది అని అడగగా.. 'నాదే' అని ఆ తాత చెప్పే డైలాగ్ గుండెను పిండేసే ఎమోషన్ తో పాటు ఫన్ ఎలిమెంట్ ని కూడా మిక్స్ చేసింది. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ తమ సహజసిద్ధమైన నటనతో ప్రాణం పోశారు. తెలంగాణ పల్లెటూరి యాస, ఆ వాతావరణం ప్రతీ ఫ్రేమ్ లో ఎంతో నాచురల్ గా కనిపిస్తోంది. అలాగే పవన్ సీహెచ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రూరల్ విలేజ్ ఫీల్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది.  మొత్తానికి మన పల్లెటూరి మట్టి వాసనను, స్వచ్ఛమైన నవ్వులను, కుటుంబ సంబంధాలను గుర్తుచేసేలా ‘పల్లబురుసు’ ట్రైలర్ ఆకట్టుకుంది.     Pallaburusu, Movie Trailer, Annapurna Studios  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు.  వీటి కారణంగానే ఆ తరువాత చాలా బాధపడతారు కూడా. ఈ తప్పుల వల్ల బంధాలు చెడిపోవడం, విచ్చిన్నం కావడం, ఆఖరుకు ఆ బంధం ముగిసిపోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. రిలేషన్ లో ఉన్న ఎంతో మంది అమ్మాయిలు చేసే తప్పులు ఏంటో తెలుసుకుంటే.. అది కొంతమందికి అయినా ఆలోచించే అవకాశాన్ని,  తప్పు జరగకుండా జాగ్రత్త పడే అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది.  రిలేషన్ లో ఉండే అమ్మాయిలు చేసే తప్పులు ఏమిటో తెలుసుకుంటే.. తొందరపాటు.. ప్రేమ, సహజీవనం,  పెళ్లి.. ఇలా ఏ బంధంలో అయినా  మహిళలు ఒక కొత్త బంధానికి త్వరగా కట్టుబడిపోతారు. ఏ సంబంధమైనా బలంగా అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కానీ మహిళలు మాత్రం చాలా తొందరగా ఆ బంధానికి స్టిక్ అయిపోతారు.  అవగాహన లేకుండా జరిగే ఈ తొందరపాటు వల్ల  భవిష్యత్తులో  చాలా సమస్యలు వస్తాయి.  మొదట్లో తాము అనుకున్నట్టు, తరువాత లేదని అనుకోవడం,  పరిస్థితులు విభిన్నంగా మారడం.. ఇలా చాలా విషయాలు ఆ తరువాత బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా సాగుతాయి.  ప్రాధాన్యత.. మహిళలు ఏ సంబంధంలోనైనా చాలా భావోద్వేగంగా ఉంటారు.  తరచుగా తమ అవసరాల కంటే తమ భాగస్వామి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అలవాటు కారణంగా, సంబంధంలో తమకు తాము ప్రియారిటీ ఇచ్చుకోవడం కూడా మరిచిపోతారు.  ఇధి ఇలాగే కొనసాగితే.. బంధంలో భాగస్వామి తప్ప వారు ఎప్పటికీ కనిపించరు.  సింపుల్ గా చెప్పాలంటే తమను తాము కోల్పోతారు. ఇదే తర్వాత వారి బాధకు కారణం అవుతుంది. ఎమోషనల్ డిపెండింగ్.. చాలా మంది మహిళలు ఎప్పుడూ భావోద్వేగపరంగా తమ  భాగస్వామి మీద ఆధారపడతారు, తమ సంతోషాన్ని, తమకు కావలసిన ఓదార్పును,  తన ఇష్టాలను అన్నింటిని తమ భాగస్వామి ద్వారానే పొందుతారు.  ఇందులో తప్పు లేదు. భాగస్వామి కూడా భావోద్వేగపరంగా అంతే అనుభూతి చెందించే పర్లేదు.. కానీ  భావోద్వేగ మద్దతు కోసం పూర్తిగా  భాగస్వామిపై ఆధారపడటం  తప్పు. ఈ అలవాటు  భాగస్వామిపై ఒత్తిడిని కలిగించి సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు. ఎంపిక.. చాలా వరకు మహిళలు సంబంధాలలో తమ సొంత ఇష్టాలను పక్కన పెడతారు. తమ భాగస్వామికి అవి నచ్చవనే కారణంతో వారు తమ అభిరుచులను, అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడం  సంబంధానికి మంచిది కాదు. అది సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు.  ఎవరి కోసమూ  అభిరుచులను, ఇష్టాలను వదులుకోకూడదు. లేకపోతే రేపటి రోజు చెప్పుకోవడానికి ఇష్టం,  చేయడానికి అభిరుచి వంటివి ఏమీ లేకుండా చుట్టూ శూన్యం ఉన్నట్టు అనిపిస్తుంది.                                              *రూపశ్రీ.
సిబ్లింగ్ థెరపీ..  తోబుట్టువుల మధ్య వచ్చే మనస్పర్థలు సులువుగా తొలగించే భలే మార్గం..! అన్నా తమ్ముడు, అక్కా చెల్లి, అన్నా చెల్లెళ్లు,  అక్కా తమ్ముళ్లు.. ఇలా తోబుట్టువుల బంధాలు చాలా గొప్పవి. ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టిన వారి మధ్య బంధం ఎంతో అపురూపమైనది.  చిన్నతనంలో తోబుట్టువులు కొట్టుకున్నా, తిట్టుకున్నా, గొడవ పడినా అది జరిగిన తర్వాత కొన్ని నిమిషాలు లేదా గంటల్లోనే తిరిగి కలిసిపోతారు.  ఒక్కటిగా పెరుగుతారు.  కానీ పెద్దయ్యాకే సమస్యలు వస్తాయి.  చాలామందికి అపార్థాలు చోటుచేసుకుంటాయి. మనస్పర్థలు వస్తాయి. వీటి వల్ల కేవలం ఆ మనిషి మాత్రమే కాకుండా కుటుంబం అంతా కలత చెందుతుంది.  పైగా ఇలాంటి మనస్పర్థలు,  అపార్థాల వల్ల దూరం కూడా పెరుగుతుంది. ఇలాంటి దూరాలను తగ్గించి, మనస్పర్థలు పోగొట్టి తిరిగి తోబుట్టువులను ఒక్కటిగా ఉంచే మార్గమే సిబ్లింగ్ థెరపీ.. అసలు సిబ్లింగ్ థెరపీ అంటే ఏంటి? దీని ప్రయోజనం ఏంటి? ఇదెలా సహాయపడుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. సిబ్లింగ్ థెరపీ అంటే.. సిబ్లింగ్ థెరపీ అనేది కుటుంబ చికిత్సలో ఒక భాగం. తోబుట్టువుల మధ్య మాట్లాడుకునే విధానాన్ని  మెరుగుపరచడం, గత విభేదాలను పరిష్కరించడం,  సంబంధంలో నమ్మకాన్ని తిరిగి వచ్చేలా చేయడం  దీని లక్ష్యం. ఈ చికిత్సలో బాగా ట్రైనింగ్ అయిన వ్యక్తి మనస్పర్థలు ఉన్న ఇద్దరు వ్యక్తులను  స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తపరచనవు చెబుతారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడానికి గల కారణాలను అర్థం చేసుకోవడంలో సహాయపడతారు. తోబుట్టువుల మధ్య తరచుగా  జరిగే గొడవలు, ఇద్దరి మధ్య మాటలు లేకపోవడం, సవతి కుటుంబ సమస్యల కారణంగా సంబంధాలు దెబ్బతినడం, లేదా  పెద్దవయలు అయిపోయిన తల్లిదండ్రులను చూసుకోవడం.. ఇలా చాలా కారణాల వల్ల తోబుట్టువుల మధ్య విబేధాలు ఏర్పడితే వాటికి సరైన సొల్యుషన్ చెప్పి తోబుట్టువులను తిరిగి కలుపుతారు. ప్రయోజనం... సిబ్లింగ్ థెరపీ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, అది వారి మధ్య కమ్యునికేషన్ ను  మెరుగుపరుస్తుంది. థెరపీ సమయంలో, తోబుట్టువులు శ్రద్ధగా వినడం, తమ భావాలను సరైన విధంగా  వ్యక్తపరచడం,  అవతలి వ్యక్తి కోణాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు. దీనివల్ల క్రమంగా అపార్థాలు తగ్గుతాయి. ఒకవేళ చిన్ననాటి అనుభవం లేదా గతంలోని వివాదం వారి సంబంధంలో సమస్యకు కారణమైతే, ఈ సమస్యలను బహిరంగంగా చర్చించడానికి థెరపీ ఒక మంచ వాతావరణాన్ని అందిస్తుంది. కొన్నిసార్లు, పక్షపాతం, పగ, లేదా చెప్పుడు మాటలు వంటివి సంవత్సరాల తరబడి ఆ సంబంధాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి.  థెరపిస్ట్ సహాయంతో ఈ సమస్యలను చర్చించి పరిష్కరించడం జరుగుతుంది, తద్వారా ఆ సంబంధం సాఫీగా  సాగడానికి వీలవుతుంది. ఎమోషనల్ సపోర్ట్.. సిబ్లింగ్ థెరపీ  రిలేషన్స్ ను ఎమోషన్ పరంగా బలంగా మారుస్తుంది.  తోబుట్టువులకు ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుంది. కష్ట సమయాల్లో  కలసికట్టుగా ఉండటం, ఒకరి సంతోషాన్ని మరొకరు పంచుకోవడం, ఒకరి ఇబ్బందులలో మరొకరు తోడుగా ఉండటం.. ఇలా   మొత్తం కుటుంబంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంట్లో ఒత్తిడి తగ్గుతుంది , ఇతర కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడటం ప్రారంభిస్తాయి. తోబుట్టువుల మధ్య ఎప్పుడూ గొడవలు ఉంటే,  లేదా పూర్తీగా మాటలు ఆగిపోయి ఉంటే.. కుటుంబంలో పెద్ద మార్పు తర్వాత సంబంధాలు క్షీణిస్తే, లేదా కుటుంబ నిర్ణయాలపై తరచుగా వివాదాలు అవుతూ ఉంటే, సిబ్లింగ్ థెరపీని తీసుకోవడం చాలా మంచిది.                              *రూపశ్రీ.  
"నేటి బాలలె రేపటి పౌరులు.." "విత్తనం మంచిదైతే పసిడి పంట పండుతుంది".  ఇలాంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం. ఇవన్నీ పిల్లల వ్యక్తిత్వాన్ని వారి నడవడికను తెలియజేయడానికి, పిల్లల భవిష్యత్తు గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు.  ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు ఉన్నతంగా ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, తమకు మంచి పేరు తీసుకురావాలని అనుకుంటారు.  అయితే ఇవన్నీ జరగాలన్నా, పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలన్నా.. పిల్లలకు కొన్ని లక్షణాలు అలవాటు చేయాలి.  దీని వల్ల పిల్లల భవిష్యత్తు బంగారం అవుతుంది.  తల్లిదండ్రులు పిల్లలకు అలవాటు చేయాల్సినవి ఏమిటో తెలుసుకుంటే.. జ్ఞానం, తెలివితేటలు.. జ్ఞానం , తెలివితేటలు  పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా బలాలుగా మారతాయి. నేర్చుకోవాలనే తపన, ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉన్న పిల్లలు జీవితంలో విజయ మార్గంలో సులభంగా పయనిస్తారు. అటువంటి పిల్లలు తమ వృత్తి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలరు. తెలివైన పిల్లలు తమ భవిష్యత్తును గొప్పగా మార్చుకోవడమే  చేసుకోవడమే కాకుండా వారి తల్లిదండ్రుల ప్రతిష్టను కూడా పెంచుతారు. అందుకే చిన్నతనం నుండే పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వాలి.   ప్రవర్తన.. మంచి ప్రవర్తన, నీతి, నిజాయితీ వంటి విలువలు గొప్ప ఆస్తిగా పరిగణించాలి. పెద్దల పట్ల గౌరవం, క్రమశిక్షణ, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన పిల్లలు కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి పిల్లలు ఇంట్లో శాంతి, సంతోషాన్ని నెలకొల్పి, సమాజంలో కుటుంబానికి గౌరవాన్ని తెస్తారు. అందుకే పిల్లలకు మంచి విలువలు నేర్పించాలి.  దీని వల్ల పిల్లల ప్రవర్తన కూడా ఉన్నతంగా మారుతుంది. నిజాయితీ.. అబద్ధాలు చెప్పడం, మోసం, వంచనలకు దూరంగా ఉండే పిల్లలు సమాజంలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. పిల్లలు అయినా పెద్దలు అయినా.. వారి వ్యక్తిత్వాన్ని బలంగా ఉంచేది నిజాయితీనే..  ఇది  చుట్టూ ఉన్న వ్యక్తుల నమ్మకాన్ని పొందడంలో సహాయపడుతుంది. అటువంటి పిల్లలకు జీవితంలో విజయం సాధించడానికి గొప్ప అవకాశాలు ఉంటాయి. అందుకే వారి తల్లిదండ్రులు కూడా సమాజంలో గౌరవాన్ని పొందుతారు. దయ.. దయ కలిగి ఉండటం,  సహాయపడే గుణం ఉన్న పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు.  పేదలకు సహాయం చేస్తూ, ఇతరుల పట్ల సున్నితంగా ఉండే పిల్లలు సంతోషం, శాంతితో కూడిన జీవితాన్ని గడుపుతారు. అలాంటి పిల్లలకు  తల్లిదండ్రుల ఆశీర్వాదం, మద్దతు కూడా ఎప్పుడూ ఉంటుంది.   పిల్లలలో ఉండే ఈ దయ, జాలి, కరుణ, సహాయం చేసే గుణం వంటివి సమాజంలో గప్ప గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.                                *రూపశ్రీ.  
మనిషి  మెదడు చాలా శక్తివంతమైనది.  మనిషి మనుగడ సాగుతున్నది మెదడు పనితీరు మీదనే.. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి జీవితం అంత బాగుంటుంది.  కానీ మెదడు పనితీరు సరిగా లేకపోతే చాలా సమస్యలు వస్తాయి.  అయితే మనిషి మెదడు  ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా ఉండదని అంటున్నారు నిపుణులు. సమాచారాన్ని వేగంగా గ్రహించడంలో  సహాయపడటానికి..  మనస్సు కాగ్నిటివ్ బయాసెస్ అని పిలువబడే మానసిక పరిస్థితి పై ఆధారపడుతుంది. ఈ మార్గాలు సమయాన్ని ఆదా చేయగలిగినప్పటికీ, అవి ఆలోచించే, నిర్ణయాలు తీసుకునే ,  చుట్టూ ఉన్న వ్యక్తులను అర్థం చేసుకునే విధానాన్ని కూడా వక్రీకరించగలవని అంటున్నారు. దీని ఫలితంగా  మెదడు ఒక విషయాన్ని వేరేగా అన్వయించుకుంటుంది, అందుకే అదే నిజమని నమ్మే అవకాశం ఉంటుంది.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నిర్థారణలో పక్షపాతం..  ఇప్పటికే నమ్ముతున్న విషయాలను బలపరిచే సమాచారం కోసం  మెదడు సహజంగానే వెతుకుతూ ఉంటుందట.  ఎవరితోనైనా విభేదిస్తే, వారితో విభేధించడానికి గల అభిప్రాయానికి గల కారణాలను,  సాక్ష్యాలను విస్మరించి, వారు తప్పు అని చెప్పడానికి గల ప్రతి కారణంపై  దృష్టి పెడతారట. నిజాన్ని తెలుసుకోవడానికి  బదులుగా, మనస్సు తరచుగా తను అనుకున్నదే కరెక్ట్ అనే విషయాన్ని నిరూపించడం  కోసం వెతుకుతూ ఉంటుందట.  ఇలా నిజాలు తెలుసుకునే విషయంలో మెదడు పక్షపాతం వహిస్తుందట. హెలో ఎఫెక్ట్.. చాలామంది చక్కగా దుస్తులు ధరించి,  శుభ్రంగా ఉంటూ, చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటుంటారు.  ఇలాంటి వారి విషయంలో చాలామంది పాజిటివ్ గానూ,  వాళ్లదిమంచి వ్యక్తిత్వం అని అనుకుంటారు.  దీని కారణం మెదడే.. ఇలాంటి వాళ్లు మంచోళ్లు అని మెదడు అనుకుంటుందట.  ఇలాంటి ప్రభావాన్ని హెలో ఎఫెక్ట్ అని అంటారు. ఒక వ్యక్తిలో  మంచి గుణాన్ని గమనించినప్పుడు, ఎటువంటి నిజమైన ఆధారం లేకపోయినా,  మెదడు వారికి ఇతర మంచి లక్షణాలు కూడా ఉన్నాయని దానంతట అదే ఊహించుకుంటుంది. వాస్తవాల ఆధారంగా ఒకరిని అంచనా వేయడానికి బదులుగా,  మనస్సు దానికి నచ్చినట్టు మంచి మంచి స్టోరీస్ ను ఊహించుకుని మరీ  వారిని చాలా మంచోళ్లను,  అన్నీ మంచి గుణాలే ఉన్నోళ్లుగా భావిస్తుంది. ఎమోషనల్ లాజిక్.. ఎమోషన్స్ అనేవి వాస్తవాన్ని చూసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. ఎప్పుడైనా ఆందోళనగా అనిపిస్తే, ఆ పరిస్థితి ప్రమాదకరమైనదని అనుకోవడం,  ఎందులో అయినా ఫెయిల్యూర్ ఎదురైతే నిజంగానే పూర్తీగా విఫలమయ్యారని అనుకోవడం జరుగుతుంది. మనిషిలో ఉండే ఫీలింగ్స్  సరైనవే అయినప్పటికీ, అవి ఎల్లప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉండవు. ఎమోషన్స్ ను  వాస్తవాల నుండి వేరు చేయడానికి కొంత సమయం తీసుకోవాలి, యాంత్రికంగా రియాక్ట్ అయ్యే  బదులు మరింత ఆలోచనాత్మకంగా స్పందించాలి.  అలా ఉంటేనే మంచిది.  లేకపోతే మెదడు చేతిలో మోసపోవాల్సి వస్తుంది. సన్క్ కాస్ట్ పాలసీ.. ఇప్పటికే చాలా సమయం , శ్రమను  ఒక పని కోసం వెచ్చించారు అనే కారణంతో  అందులో  అలాగే కొనసాగుతూ ఉంటే దాన్ని 'సన్క్ కాస్ట్ ఫాలసీ' (sunk cost fallacy) అంటారు.  మెదడు తరచుగా గత పెట్టుబడిని భవిష్యత్ విలువతో గందరగోళానికి గురిచేస్తుంది. దీనివల్ల ఏదైనా  ఇకపై ఉపయోగపడకపోయినా దాని నుండి బయటపడటం కష్టమవుతుంది.  ఇప్పటికే గడిపిన సమయాన్ని తిరిగి పొందలేరని గుర్తుంచుకోవాలి.  ఎలా ముందుకు సాగాలని నిర్ణయించుకుంటారో అదే  అత్యంత ముఖ్యం. నెగిటివ్  ప్రభావం.. ఎవరైనా విమర్మించినప్పుడు, తిట్టినప్పుడు, బాధపెట్టినప్పుడు.. అది  రోజుల తరబడి మనసులో నిలిచిపోతుంది, కానీ ఎన్నో మంచి విషయాలు, సంతోషకరమైన విషయాలు  త్వరగా మర్చిపోతారు. ఇలా జరగడానికి కారణం, మెదడు సహజంగానే సానుకూల అనుభవాల కంటే ప్రతికూల అనుభవాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం. ఇది  ఒకప్పుడు, ప్రమాదం పట్ల అప్రమత్తంగా ఉండటానికి,  మానవులు మనుగడ సాగించడానికి సహాయపడింది. అయితే ఈ రోజుల్లో, ఇది రోజువారీ ఎదురుదెబ్బలను అవి నిజంగా ఉన్నదానికంటే చాలా పెద్దవిగా అనిపించేలా చేస్తుంది. నెగిటివ్ కంటే పాజిటివ్ ను మెదడులో ఇముడ్చుకోవాలి. అప్పుడే మెదడు పనితీరు ఆరోగ్యకరంగా ఉన్నట్టు. స్పాట్ లైట్ ఎఫెక్ట్..  తప్పులను,  రూపాన్ని, లేదా ఒక ఇబ్బందికరమైన క్షణాన్ని అందరూ గమనిస్తారని నమ్మడం చాలా సులభం. వాస్తవానికి, చాలా మంది తమ సొంత జీవితాలు , విషయాలపైనే దృష్టి పెడతారు. ఈ స్పాట్‌లైట్ ఎఫెక్ట్ వల్ల అందరూ తమను నిరంతరం గమనిస్తున్నారనే భావన కలుగుతుంది. కానీ నిజానికి అలా జరగకపోయినా  అదేలా భావిస్తుంటారు. ఈ ఆలోచనను  వదిలేయడం వల్ల,  రోజువారీ జీవితంలో మరింత ఆత్మవిశ్వాసంతో, తక్కువ భయంతో  ఉండటానికి సహాయపడుతుంది. పైన చెప్పుకున్నవిధంగా.. వివిధ కారణాల వల్ల చాలామందికి తమ మెదడే శత్రువులా మారి మోసం చేస్తుంది.                                     *రూపశ్రీ.  
మధుమేహం అనేది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒక ఆరోగ్య సమస్య, ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. జీన్స్ ప్రభావం, ఊబకాయం , జీవనశైలిలో మార్పులు వంటి కొన్ని ప్రమాద కారకాలు ఈ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. మధుమేహాన్ని సాధారణంగా టైప్ 1 , టైప్ 2 అనే రెండు ప్రధాన రకాలుగా చర్చిస్తారు, కానీ  టైప్ 1.5 డయాబెటిస్ గురించి చాలామందికి తెలియదు. లాడా డయాబెటిస్ అంటే.. latent autoimmune diabetes in adult అని అర్థం. ఇది నెమ్మదిగా అభివృద్ది చెందే ఆటోఇమ్యూన్ జబ్బు. 30 ఏళ్లు పైబడిన వారికి వస్తుంది. టైప్ 1 డయాబెటిస్ తో పోలిస్తే.. 1.5 డయాబెటిస్ వల్ల కలిగే నష్టం నెమ్మదిగా ఉంటుంది. మొదట్లో దీన్ని టైప్ 2 అని పొరబడతారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..  టైప్ 1.5 డయాబెటిస్.. టైప్ 1.5 డయాబెటిస్  లక్షణాలు టైప్ 1 , టైప్ 2 డయాబెటిస్  లక్షణాలను పోలి ఉంటాయి. ఇది  సాధారణంగా వయోజన దశలో నిర్ధారణ అవుతుంది.  టైప్ 2 డయాబెటిస్ లాగా ఇది కూడా నెమ్మదిగా డవలప్ చెందుతుంది. అయితే టైప్ 2 డయాబెటిస్ లా కాకుండా, LADA అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి.  దీనిని ఆహార, జీవనశైలి మార్పులతో  నయం చేయలేము. ఎవరికైనా టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయితే,  బరువు , జీవనశైలి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, అది నిజానికి టైప్ 1.5 డయాబెటిస్ అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. టైప్ 1.5 డయాబెటిస్ కారణాలు, నిర్థారణ.. టైప్ 1.5 డయాబెటిస్‌ను అర్థం చేసుకోవాలంటే, అది ఇతర ప్రధాన రకాల డయాబెటిస్‌ల నుండి ఎలా భిన్నంగా ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యం. టైప్ 1 డయాబెటిస్‌ను ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధిగా పరిగణిస్తారు, ఎందుకంటే ఇన్సులిన్‌ను తయారు చేయడంలో శరీరానికి సహాయపడే ప్యాంక్రియాటిక్ బీటా కణాలను మీ  స్వయంగా నాశనం చేసుకోవడం వల్ల ఇది వస్తుంది. టైప్ 2 డయాబెటిస్ అనేది ప్రధానంగా ఇన్సులిన్‌కు శరీరం చూపే నిరోధకత వల్ల వచ్చే సమస్య. ఇలాంటప్పుడు శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు లేదా దానిని సరిగ్గా ఉపయోగించుకోదు. ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలకు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఏర్పడటం వల్ల క్లోమగ్రంథి దెబ్బతినడంతో టైప్ 1.5 మధుమేహం వస్తుంది.  కుటుంబంలో ఎవరికైనా ఆటోఇమ్యూన్ వ్యాధులు ఉంటే, ఈ రకమైన మధుమేహం వచ్చే ప్రమాదం ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. టైప్ 1.5 డయాబెటిస్ ఉన్న వ్యక్తి ఊబకాయంతో ఉంటే, అది ఇన్సులిన్ నిరోధకతకు కూడా దారితీయవచ్చు. దీనిని ఎలా గుర్తించాలి? టైప్ 1.5 మధుమేహం  లక్షణాలు మొదట్లో అంత స్పష్టంగా ఉండవు. దీని సమస్యలు ఇతర రకాల మధుమేహంలో ఉండే సమస్యల మాదిరిగానే ఉండవచ్చు. అయితే దీనిని ముందుగానే గుర్తించకపోయినా లేదా చికిత్స చేయకుండా వదిలేసినా, అది డయాబెటిక్ కీటోయాసిడోసిస్‌కు దారితీయవచ్చు. టైప్ 1.5 మధుమేహం తరచుగా టైప్ 2 మధుమేహం మాదిరిగానే సమస్యలను కలిగిస్తుంది. పదే పదే దాహం ఎక్కువ వేయడం, తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, బరువు తగ్గడం. దృష్టి మసకబారడం , జలదరింపు అనుభూతి వంటి లక్షణాలు ఉంటాయి. టైప్ 1.5 డయాబెటిస్ ను ఎలా నివారించాలి? టైప్ 1.5 డయాబెటిస్‌ను నిర్ధారించడానికి సమయం పట్టవచ్చు , దీనిని తరచుగా టైప్ 2 డయాబెటిస్‌గా పొరబడతారు. టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారి మాదిరిగానే, టైప్ 1.5 డయాబెటిస్ ఉన్నవారిలో కూడా కనీసం ఒక యాంటీబాడీకి పాజిటివ్ అని తేలవచ్చు.  శరీరం ఇన్సులిన్ ఉత్పత్తిని నెమ్మదింపజేస్తుంది కాబట్టి, ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరం కావచ్చు. ఇన్సులిన్ లేకుండా పరిస్థితి అదుపులో ఉండని వారు శాశ్వతంగా ఇన్సులిన్ తీసుకోవలసి రావచ్చు. ప్రస్తుతం, టైప్ 1.5 డయాబెటిస్‌ను నివారించడానికి మార్గం లేదు. టైప్ 1 డయాబెటిస్ మాదిరిగానే ఇందులో కూడా జన్యుపరమైన కారకాలు పాత్ర పోషిస్తాయి. టైప్ 1.5 డయాబెటిస్ వల్ల కలిగే సమస్యలను తగ్గించడానికి సరైన నిర్ధారణ , లక్షణాలపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం.                                      *రూపశ్రీ.  
అవిసె గింజలు (Flax Seeds) చిన్నవైనా ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో గొప్పది. ఆయుర్వేద నిపుణులు డా. చిట్టిభొట్ల మధుసూదన శర్మ ఈ వీడియోలో అవిసె గింజల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను సులభంగా వివరించారు. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, లిగ్నాన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో, జీర్ణక్రియ మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయని డాక్టర్ వివరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు అవిసె గింజలు ఎంతో మేలు చేస్తాయని ఆయన తెలిపారు. హార్మోన్ల సమతుల్యతను కాపాడటం, రుతుక్రమానికి సంబంధించిన సమస్యలను తగ్గించడం, మెనోపాజ్ సమయంలో వచ్చే అసౌకర్యాలను తగ్గించడం, చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అవిసె గింజలు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ వీడియోలో అవిసె గింజలను ఎలా తీసుకోవాలి? రోజుకు ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అనే అంశాలను కూడా వివరంగా తెలియజేశారు. అవిసె గింజలను మీ రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ పూర్తి వీడియోను తప్పకుండా చూడండి.  వీడియోలోని ముఖ్యాంశాలు: అవిసె గింజల పోషక విలువలు గుండె ఆరోగ్యానికి అవిసె గింజల ప్రయోజనాలు మెదడు, రక్తనాళాల రక్షణలో వాటి పాత్ర మహిళల హార్మోన్ల ఆరోగ్యానికి ఉపయోగాలు జీర్ణక్రియ, మలబద్ధకం సమస్యలపై ప్రభావం అవిసె గింజలను తీసుకునే సరైన విధానం తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు గమనిక: ఈ వీడియోలో చెప్పిన అంశాలు ఆయుర్వేద నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఉన్నాయి. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఏదైనా ఆహార మార్పులు చేసే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)