LATEST NEWS
కేరళం ముఖ్యమంత్రిగా ఎంపికైన వీడీ సతీశన్‌కు తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేర‌కు గురువారం ( మే 14) ఓ ప్రకటనలో  కేరళం ప్ర‌జ‌ల‌కు దశాబ్దాలుగా సేవ చేస్తూ, విలువలతో కూడిన‌ రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపని  రేవంత్  పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి మద్దతుగా  నిలిచిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అధికార బాధ్యతలు అప్పగించారని అన్నారు. విద్య, వైద్యం, అక్షరాస్యతలో కేరళం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్న రేవంత్..  సతీశన్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, పర్యాటకం, పరస్పర సహకారం వంటి రంగాల్లో కేరళం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్ల‌డించారు. కేరళం మరింత ప్రగతి, సుసంపన్నత దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్న‌ట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
కేరళం ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్‌ను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. దాంతో  గత పది రోజులుగా కేరళం ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది   కేరళం సీఎంగా సతీశన్ పేరును గురువారం (మే 14) ఏఐసీసీ ప్రకటించింది. సీఎం పదవి కోసం సతీషన్‌తో పాటు సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్ , రమేష్ చెన్నితాల పోటీపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు అధిష్ఠానం ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో  ఆయనే సీఎం అవుతారని ప్రచారం జరిగింది. అయితే విధేయత లెక్కలు, సీనియర్టీల కన్నా కేరళం క్యాడర్ అభిష్టానానికి తలొగ్గిన కాంగ్రెస్ హైకమాండ్ చివరకు  ప్రజా మద్దతున్న సతీషన్‌‌ వైపే  మొగ్గుచూపింది.   సతీషన్‌కు యూడీఎఫ్ భాగస్వామ్య పక్షం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా గట్టి మద్దతు ఇచ్చింది. కేరళ ఎన్నికలలో  ఐయూఎంఎల్ 22 సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. భాగస్వామ్యపక్షం ఒత్తిడి కూడా ఈ విషయంలో పనిచేసింది. ఎల్‌డీఎఫ్   హయాంలో వి.డి.సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. క్లిష్ట సమయలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. కేరళం కాంగ్రెస్  కేడర్‌లో కూడా ఇదే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సీఎంగా సతీశన్ ను ఎంపిక చేసింది.    వి.డి. సతీశన్ పూర్తి పేరు వడస్సేరి దామోదరన్ సతీశన్. 1964, మే 31న ఆయన జన్మించారు. ఆయన స్వస్థలం ఎర్నాకులం జిల్లాలోని నెట్టూరు. ఈయన తల్లిదండ్రులు విలాసిని అమ్మ, దామోదర మీనన్. భార్య లక్ష్మీప్రియ. సతీశన్ దంపతులకు కుమార్తె ఉన్నిమాయ ఏకైక సంతానం. నాయర్ల కుటుంబంలో పుట్టిపెరిగిన సతీశన్ ఉన్నత విద్యావంతుడు. సోషల్ వర్క్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు సతీశన్ కేరళ హైకోర్టులో పదేళ్లపాటు లాయర్ గా   ప్రాక్టీస్ చేశారు. కమ్యునిస్టు కంచుకోటగా ఉన్న పరాపూర్ నుంచి వరుసగా ఆరు సార్లు..  ఎమ్మెల్యేగా  ఎన్నికయ్యారు.  కేరళ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 2001లో కేరళ శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన సతీశన్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు .
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కాన్వాయ్ లోని వాహనాలను తగ్గించుకునేందుకు నిర్ణయించుకున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నారు.  ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే దిశగా బాబు, పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.   తమ కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని అధికారులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. పొదుపు చర్యలలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ తన వాహన శ్రేణిని కుదించాలని ఆదేశాలు జారీ చేసిన గంటల వ్యవధిలో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు అదే దారిని ఎంచుకోవడం గమనార్హం.  సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల పర్యటనల సమయంలో భద్రతా కారణాల రీత్యా పెద్ద సంఖ్యలో వాహనాలు కాన్వాయ్‌లో ఉంటాయి. అయితే..  దీనివల్ల భారీగా ఇంధన వ్యయం అవ్వడమే కాకుండా..  ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని  భావించిన సీఎం, డిప్యూటీ సీఎం..  ఖజానాపై అనవసర భారం పడకూడదనే ఉద్దేశంతో, భద్రతకు విఘాతం కలగకుండానే వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు.  వీరు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక   పొదుపు వ్యూహం కనిపిస్తోంది. రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో, పై స్థాయి నుండి పొదుపు చర్యలు ప్రారంభం కావాలని  భావిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా నెలకు లక్షల రూపాయల ఇంధన ఖర్చు ఆదా కావడమే కాకుండా, నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందని అధికారులు అంటున్నారు.  ప్రజా ప్రతినిధులు,  ఉన్నతాధికారులు అనవసర ఆడంబరాలకు పోకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న బలమైన సందేహాన్ని కూడా వీరి నిర్ణయంతో ఇచ్చారని చెప్పాలి.  గతంలో కూడా చంద్రబాబు తన పర్యటనల సమయంలో సామాన్యులకు ఇబ్బంది కలగకూడదని ట్రాఫిక్ ఆంక్షలను తగ్గించాలని ఆదేశించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నేరుగా తన కాన్వాయ్‌పైనే నియంత్రణ విధించడం చర్చనీయాంశంగా మారింది. 
తెలంగాణ రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నేపధ్యంలో బీఆర్ఎస్ విమర్శల దాడి ఉధృతం చేసింది. కాంగ్రెస్, బీజేపీల మధ్య సీక్రెట్ బంధం ఉందంటూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు   ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   సంచలన వ్యాఖ్యలు చేశారు.   తీవ్రమైన పోక్సో   కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయంగా పెను సంచలనం సృష్టించాయి.   మైనర్ బాలికపై జరిగిన అకృత్యానికి సంబంధించిన కేసులో నిందితులకు కొమ్ముకాసేలా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి  ప్రభుత్వం,  బీజేపీ అగ్రనేత బండి సంజయ్ మధ్య ఉన్నరహస్య పొత్తు కారణంగానే  ఈ కేసులో సాక్ష్యాధారాలు తారుమారయ్యాయ ఆరోపించారు.  రాజకీయ ప్రయోజనాల కోసం చిన్నారుల భద్రతను కూడా ఫణంగా పెడుతున్నారని విమర్శించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో బాధితులకు అండగా ఉండాల్సిన పాలకులు నిందితులకు కొమ్ము కాస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.  
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగు వేశారు. మంగళవారం అమరావతిలో బొల్లినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్  యూనివర్శిటీ (బిసెర్ ) నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతి భవిష్యత్తుపై తనకున్న విజన్‌ను పంచుకున్నారు.  పాతిక ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. కేవలం వైద్య సేవలే కాకుండా స్కిల్ డెవలప్ మెంట్ కి ఈ సంస్థ పెద్దపీట వేయనుంది. రానున్న రోజుల్లో లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చి..  వారిని అంతర్జాతీయ స్థాయి నిపుణులుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మెడికల్, పారామెడికల్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచానికి నాయకత్వం వహించాలని ఆయన పిలుపునిచ్చారు.  అలాగే.. ఈ ప్రాజెక్టు గడువుపై స్పష్టమైన చంద్రబాబు నిర్దిష్ట గడువు నిర్దేశించారు.  వచ్చే ఏడాది మే నాటికి ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రారంభోత్సవం చేయాలని  యాజమాన్యాన్ని కోరారు. ప్రభుత్వం తరపున అన్ని రకాల అనుమతులు  ఆటో పైలట్  మోడ్‌లో వేగంగా మంజూరు చేస్తామని,ఇన్వెస్టర్లు  పనుల్లో వేగం పెంచాలని సూచించారు. అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.  గతంలో తాను హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ,  హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ..  అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు  చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు. ఔటర్ రింగ్ రోడ్, క్వాంటం వ్యాలీ వంటి ప్రాజెక్టులతో అమరావతి అంతర్జాతీయ పటంలో నిలుస్తుందన్నారు.  రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన 29 వేల మంది రైతుల త్యాగాన్ని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతుల కలలను నిజం చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు భవిష్యత్తులో ఈ నగరం ద్వారా అత్యధిక లాభం చేకూరుతుందని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయని చంద్రబాబు అన్నారు.   రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్,  నేచురల్ ఫార్మింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గించడమే కాకుండా..  పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. యువత కేవలం ఉద్యోగాల కోసం చూడకుండా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, అందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. అమరావతి గడ్డపై బిసెర్ వంటి విద్యా, వైద్య సంస్థలు రావడం శుభపరిణామమన్న సీఎం చంద్రబాబు.. ఈ ప్రాజెక్టు ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా..  రాజధాని ప్రాంతం ఒక మెడికల్ టూరిజం హబ్‌గా మారుతుందని చెప్పారు. పారదర్శక పాలన, వేగవంతమైన నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.
ALSO ON TELUGUONE N E W S
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అది వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం. వెండితెరపై తమ నటనతో మెప్పించే నటులు, నిజ జీవితంలో కూడా విలాసవంతమైన జీవనాన్ని గడుపుతూ అపరకుబేరులుగా వెలుగొందుతున్నారు. ఈ రోజు మనం భారత సినీ చరిత్రలో అత్యధిక సంపాదన మరియు ఆస్తులు కలిగిన టాప్ 5 నటుల గురించి, వారి నికర ఆస్తుల విలువ గురించి తెలుసుకుందాం. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తారు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్. గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందిన షారుఖ్ నికర ఆస్తి విలువ దాదాపు 6,300 కోట్ల రూపాయలు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థ, ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు అనేక బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా ఆయన ఈ స్థాయి సంపదను కూడబెట్టారు. దుబాయ్‌లోని పామ్ జుమేరాలో విల్లా నుండి ముంబైలోని మన్నత్ బంగ్లా వరకు ఆయన ఆస్తులు ఆశ్చర్యపరుస్తాయి. రెండవ స్థానంలో మన టాలీవుడ్ లెజెండ్, మెగాస్టార్ చిరంజీవి నిలవడం విశేషం. సుమారు 1,650 కోట్ల రూపాయల నికర ఆస్తితో ఆయన దక్షిణాదిలోనే అత్యంత ధనిక నటుల్లో ఒకరిగా నిలిచారు. దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న చిరంజీవికి రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడులు ఉన్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆయన నిర్మించుకున్న రాజభవనం వంటి ఇల్లు మరియు కొణిదెల ప్రొడక్షన్స్ ద్వారా ఆయన తన సామ్రాజ్యాన్ని విస్తరించారు. తర్వాతి స్థానంలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఉన్నారు. దాదాపు 1,200 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి కలిగిన హృతిక్, కేవలం నటన ద్వారానే కాకుండా తన 'HRX' అనే ఫిట్‌నెస్ బ్రాండ్ ద్వారా భారీగా లాభాలను గడిస్తున్నారు. అలాగే, కండల వీరుడు సల్మాన్ ఖాన్ సుమారు 2,800 కోట్ల రూపాయల నెట్ వర్త్ కలిగి ఉన్నప్పటికీ, రిపోర్టుల ప్రకారం ఆయన అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా ఉన్నారు. సల్మాన్ ఖాన్ కు చెందిన 'బీయింగ్ హ్యూమన్' ఫౌండేషన్ మరియు బ్రాండ్ వాల్యూ ఆయన ఆస్తులకు ప్రధాన మూలం. చివరగా, అక్షయ్ కుమార్ కూడా ఈ రేసులో ఏమాత్రం తక్కువ కాదు. సంవత్సరానికి నాలుగైదు సినిమాలు చేస్తూ, క్రమశిక్షణతో కూడిన జీవనం గడిపే అక్షయ్ ఆస్తి విలువ సుమారు 2,500 కోట్ల రూపాయలు. ఫిట్‌నెస్ మరియు ప్రాక్టికల్ లైఫ్‌ని ఇష్టపడే అక్షయ్, నిర్మాణ రంగంలో కూడా రాణిస్తున్నారు. ఈ నటులందరూ కేవలం అదృష్టంతోనే ఈ స్థాయికి చేరుకోలేదు, వారి కఠోర శ్రమ, ముందుచూపుతో కూడిన పెట్టుబడులు వారిని నేడు భారత సినీ ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా నిలబెట్టాయి. వీరి విలాసవంతమైన కార్లు, ప్రైవేట్ జెట్లు మరియు విదేశీ ఆస్తులు చూస్తుంటే వారు నిర్మించుకున్న సామ్రాజ్యం ఎంతటిదో అర్థమవుతుంది.
The ongoing dispute between Tollywood exhibitors and producers over the percentage system continues to escalate. Following the exhibitors' press meet on May 12th and the producers' counter on May 13th, the issue took a personal turn with producer Naga Vamsi taking digs at Asian Suniel, leading to a strong "fake wig" retort from the latter. Today, theater owners, notably without Shirish Reddy and Suniel, addressed the media again to counter the producers and clarify their stance. The theater owners declared that they have emerged much stronger post-Covid and are fully prepared to shut down cinemas for months or even a year until the percentage revenue system is implemented. They strongly denied targeting the upcoming film Peddi, accusing the producers of unnecessarily dragging the movie into the equation to divert attention from the core issue. The owners expressed their desire for an amicable resolution and openly welcomed industry bigwigs like Chiranjeevi to intervene and help settle the matter, which has been delayed for over a year. Adding to this, C. Kalyan stated that the Film Chamber will urge producers to agree to the percentage system during tomorrow's critical meeting. He confirmed that a grading system across various areas has already been introduced and that they are ready for its comprehensive implementation. Kalyan expressed confidence that tomorrow's meeting will not be delayed further and will serve as the crucial first step in finding a permanent solution.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన లేటెస్ట్ మూవీ 'కరుప్పు' (తెలుగులో వీరభద్రుడు) విడుదల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా చుట్టూ అల్లుకున్న వివాదాలు, పంపిణీ సమస్యలపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తాజాగా స్పందించారు. తెలుగువన్ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను విశ్లేషిస్తూనే, ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. (Karuppu) ఫైనాన్స్ సమస్యలే ప్రధాన అడ్డంకి: నట్టి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. 'వీరభద్రుడు' (Veera Bhadrudu) సినిమా విడుదలకు సుమారు 43 కోట్ల రూపాయల మేర ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయని తెలుస్తోంది. సినిమా బడ్జెట్ భారీగా పెరగడం, మార్కెట్ పరిస్థితుల్లో మార్పులు రావడం వల్ల నిర్మాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే థియేటర్లకు సంబంధించిన 'కీ'లు డౌన్‌లోడ్ అయినప్పటికీ, ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకపోవడం వల్లే ప్రదర్శనలు ఆగిపోయాయని ఆయన వివరించారు. రంగంలోకి దిగిన హీరో సూర్య: ఈ క్లిష్ట పరిస్థితుల్లో హీరో సూర్య స్వయంగా రంగంలోకి దిగి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని నట్టి కుమార్ తెలిపారు. సూర్య ఒక జెంటిల్మెన్ అని, ఆయన వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ఫైనాన్షియర్లతో మాట్లాడుతున్నారని, త్వరలోనే ఈ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నీ సవ్యంగా జరిగితే రేపటికల్లా సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎగ్జిబిటర్ల పర్సంటేజీ వివాదం: మరోవైపు, పరిశ్రమలో ప్రస్తుతం నడుస్తున్న 'పర్సంటేజీ సిస్టమ్' వివాదం కూడా నిర్మాతలపై భారం పెంచుతోందని నట్టి కుమార్ విశ్లేషించారు. థియేటర్ల యజమానులు రాత్రికి రాత్రే పర్సంటేజీ పద్ధతిని కోరడం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని, ఇది పెద్ద సినిమాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సూర్య గత కొన్నేళ్లుగా ఒక సరైన థియేట్రికల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో 'వీరభద్రుడు' పై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎదురవుతున్న ఈ అడ్డంకులు తొలగిపోయి, సినిమా త్వరగా ప్రేక్షకుల ముందుకు రావాలని, తద్వారా ఇండస్ట్రీలోని కార్మికులకు, డిస్ట్రిబ్యూటర్లకు మేలు జరగాలని నట్టి కుమార్ కోరుకున్నారు. మరి సూర్య ప్రయత్నాలు ఫలించి సినిమా ఎప్పుడు విడుదలవుతుందో వేచి చూడాలి. మరిన్ని ఆసక్తికర వీడియోలు, లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం 'తెలుగువన్ సినిమా' (TeluguOne Cinema) యూట్యూబ్ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.
టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీలో థియేటర్ల పర్సంటేజీ వ్యవహారం ఇప్పుడు ఒక సెన్సిటివ్ ఇష్యూగా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పూర్తిస్థాయి పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్లు పట్టుబడుతుండగా, దీనిని నిర్మాతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TSFCC) గురువారం ఒక ప్రెస్ మీట్ నిర్వహించి తమ వాదనను వినిపించింది. ఈ సమావేశంలో ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి శ్రీధర్, ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ పర్సంటేజీ విధానం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పర్సంటేజీ విధానం కోసం తాము 2008 నుండి పోరాడుతున్నామని ఆయన గుర్తు చేశారు. గతేడాది కూడా ఇదే విషయంపై అడగ్గా, 'హరిహర వీరమల్లు' వంటి పెద్ద సినిమాల విడుదల సమయంలో ఇలాంటి మార్పులు వద్దని కోరారని, రెండు నెలల్లో చర్చిద్దామన్నా స్పందన లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు చర్చను పక్కదారి పట్టిస్తూ కొందరు 'పెద్ది' (Peddi) సినిమా ప్రస్తావన తీసుకువస్తున్నారని, కానీ ఈ చిత్రంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నిర్మాతలు చర్చలకు ఎప్పుడు పిలిచినా తాము సిద్ధంగా ఉన్నామని, కొందరు నిర్మాతలు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదంపై తుది నిర్ణయం తీసుకునేందుకు రేపు (మే 15, శుక్రవారం) ఫిల్మ్ ఛాంబర్‌లో ఒక కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్ల డిమాండ్లపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థియేటర్ల యాజమాన్యాలు మరియు నిర్మాతల మధ్య నెలకొన్న ఈ ప్రతిష్టంభన ఇండస్ట్రీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా మే 15న జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇరు వర్గాలు సామరస్యంగా చర్చించుకుని ఇండస్ట్రీ మనుగడకు మేలు చేసే పరిష్కారాన్ని కనుగొంటారని సినీ ప్రేమికులు ఆశిస్తున్నారు.  
తెలుగు సినిమా అంటే ఒకప్పుడు కథలు, పాత్రలు. కానీ కాలక్రమేణా అది 'హీరో' చుట్టూ తిరిగే ఒక భారీ సామ్రాజ్యంగా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా హీరోల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ బడ్జెట్ల గురించే చర్చ. "ఈ హీరో-సెంట్రిక్ వ్యవస్థ ఒక్క రోజులో ఏర్పడిందా?" అంటే.. ఖచ్చితంగా కాదు. ఇది దశాబ్దాల కాలంగా నిర్మితమైన ఒక పటిష్టమైన వ్యాపార నమూనా. 90వ దశకంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అసాధారణం. అప్పట్లో ఒక సాధారణ సినిమా రూ. 1–2 కోట్లు వసూలు చేయడమే గగనంగా ఉండేది. కానీ, ఈ స్టార్ హీరోల సినిమాలు ఏకంగా రూ. 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ లెక్కలను మార్చేశాయి. నిర్మాతలకు "హీరో ఉంటేనే భారీ లాభాలు" అనే నమ్మకం అప్పుడే బలపడింది. ఫలితంగా, కథ కంటే హీరో ఇమేజ్‌కు ప్రాధాన్యత పెరిగింది. 2000వ దశకం వచ్చేసరికి, సినిమా అనేది కేవలం కళ మాత్రమే కాదు, ఒక హై-రిస్క్ బిజినెస్‌గా మారింది. కథలో బలం లేకపోయినా, హీరో పేరు మీద థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. దీంతో పంపిణీదారులు కూడా 'పేరు' చూసి కోట్లు కుమ్మరించడం మొదలుపెట్టారు. హీరోల చుట్టూ ఫ్యాన్ బేస్ పెరగడం, మాస్ మసాలా ఫార్ములాలు హిట్ అవ్వడం ఈ వ్యవస్థను మరింత స్ట్రాంగ్ చేశాయి. డిజిటల్ విప్లవం తర్వాత ప్రేక్షకుల అభిరుచి మారుతుందని అందరూ భావించారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఓవర్ ది టాప్ (OTT) వేదికలు చిన్న సినిమాలకు అండగా నిలుస్తున్నప్పటికీ, పెద్ద సినిమాల రికవరీకి అవే ప్రధాన వనరుగా మారాయి. స్టార్ హీరో సినిమా అంటే OTT సంస్థలు కూడా భారీ ధరకు కొనుగోలు చేస్తున్నాయి. అంటే, టెక్నాలజీ మారినా 'హీరో ఫ్యాక్టర్' మాత్రం అలాగే ఉండిపోయింది. ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన వాదన ఏంటంటే "ఒక రోజులో వచ్చింది ఒక రోజులో పోదు". ఈ హీరో సెంట్రిక్ వ్యవస్థను మార్చడం అంత సులభం కాదు. ఎందుకంటే స్టార్ హీరో ఉంటేనే ఫైనాన్షియర్స్ ముందుకు వస్తున్నారు. రాజమౌళి వంటి దర్శకులు గ్లోబల్ గుర్తింపు తెచ్చినప్పటికీ, పాన్ఇండియా మార్కెట్‌లో నిలబడాలంటే ఇంకా స్టార్ పవర్ అవసరమవుతోంది. టాలీవుడ్ హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ అనేది ఒక బలమైన భావోద్వేగపు మరియు వ్యాపారపు పునాదిపై ఉంది. అయితే, రాబోయే రోజుల్లో బడ్జెట్లు అదుపు తప్పితే లేదా ప్రేక్షకులు కేవలం 'పేరు'ను చూసి మోసపోవడానికి సిద్ధంగా లేకపోతే, తప్పనిసరిగా మార్పు వస్తుంది. కంటెంట్ మరియు కటౌట్ రెండూ కలిస్తేనే సినిమా బతుకుతుంది. ఈ నిర్మాణం పూర్తిగా కూలిపోకపోవచ్చు కానీ, భవిష్యత్తులో కథా బలమే అసలైన 'హీరో'గా మారక తప్పదు.
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu), కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా వీరిద్దరూ ప్రాణస్నేహితులుగా కొనసాగుతున్నారు. తాజాగా మోహన్ బాబు ఒక వేదికపై రజనీకాంత్ గురించి చెబుతూ.. ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. రజనీకాంత్ తనకు ఫోన్ చేసి మరీ తిట్టారని ఆయన సరదాగా గుర్తు చేసుకున్నారు. ఒకరోజు మోహన్ బాబుకు రజనీకాంత్ ఫోన్ చేశారట. "నువ్వు వెంటనే బెంగళూరుకు రా" అని కోరినట్లు మోహన్ బాబు తెలిపారు. దానికి మోహన్ బాబు స్పందిస్తూ.. "ఎందుకు రావాలి? ఎక్కడికి రావాలి?" అని అడిగారట. అప్పుడు రజనీకాంత్ తాను శ్రీశ్రీ రవిశంకర్ గురుదేవ్ గారి ఆశ్రమంలో ఉన్నానని, నువ్వు కూడా రా అని చెప్పారట. మోహన్ బాబు మొదట్లో వెళ్ళడానికి నిరాకరించినట్లు చెప్పుకొచ్చారు. రజనీకాంత్ మాత్రం.. "నువ్వు నీ భార్యను తీసుకుని ఇక్కడికి రా.. గురువు గారి దగ్గరకు రా" అని పట్టుబట్టారట. దానికి మోహన్ బాబు.. "ఎవరా గురువు? ఆయన ఎవరికి గురువు? నేను రాను" అని సమాధానం ఇచ్చారట. ఆ మాట వినగానే రజనీకాంత్ కోపం తెచ్చుకుని, మోహన్ బాబును ఫోన్ లోనే తిట్టారని ఆయన నవ్వుతూ వెల్లడించారు. రజనీకాంత్ తిట్టినా అది స్నేహంతో కూడిన కోపం మాత్రమేనని మోహన్ బాబు మాటల ద్వారా అర్థమవుతోంది. రజనీకాంత్ ఆధ్యాత్మికతను ఎంతగా నమ్ముతారో అందరికీ తెలిసిందే. తన స్నేహితుడు కూడా ఆ ప్రశాంతతను పొందాలనే ఉద్దేశంతోనే ఆయన అంతగా ఒత్తిడి చేశారని స్పష్టమవుతోంది. వీరిద్దరి మధ్య ఉన్న ఈ బాండింగ్ చూసి అభిమానులు ఎంతో ముచ్చటపడుతున్నారు. మరిన్ని ఆసక్తికర వీడియోలు, సినిమా అప్డేట్స్ కోసం 'తెలుగువన్ సినిమా' (TeluguOne Cinema) యూట్యూబ్ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.
సూర్య (Suriya), త్రిష (Trisha) ప్రధాన పాత్రల్లో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన 'కరుప్పు' (Karuppu) చిత్రం విడుదలకు ముందే అనూహ్యమైన చిక్కుల్లో పడింది. ఆర్థిక కారణాలతో సినిమా విడుదల వాయిదా పడినప్పటికీ, ఒక థియేటర్లో నిర్మాత అనుమతి లేకుండానే ప్రదర్శన జరగడం ఇప్పుడు కోలీవుడ్‌లో పెను సంచలనంగా మారింది. ఈ సెక్యూరిటీ వైఫల్యంపై చిత్ర నిర్మాత తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సినిమా ఇంకా అధికారికంగా విడుదల కాకముందే, పూణేలోని ఒక థియేటర్లో 'కరుప్పు' సినిమా షో ప్రదర్శితమైంది. సాధారణంగా థియేటర్లకు డిజిటల్ కీ (KDM) పంపేటప్పుడు నిర్మాత అనుమతి తప్పనిసరి. కానీ, నిర్మాత అనుమతి లేకుండానే క్యూబ్ (Qube) సంస్థ ఈ డిజిటల్ కీని జారీ చేయడంతో అక్కడ ప్రదర్శన సాగింది. సుమారు గంట పాటు సినిమా ప్రదర్శించబడిన తర్వాత చిత్ర యూనిట్ అప్రమత్తమై దానిని నిలిపివేసింది. ఈ ఘటనపై నిర్మాత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దీనికి బాధ్యత వహిస్తూ క్యూబ్ సంస్థ తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో తమిళ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా నిర్మాతకు మద్దతుగా నిలిచింది. గంట సేపు సినిమా ప్రదర్శితం కావడంతో, ఆ సమయంలో ఎవరైనా సినిమాను రికార్డ్ చేసి ఉండవచ్చని చిత్ర బృందం ఆందోళన చెందుతోంది. గతంలో 'జననాయగన్' సినిమాకు ఎదురైనట్టే, ఈ చిత్రం కూడా ఆన్‌లైన్‌లో లీక్ అవుతుందేమోనన్న భయం నిర్మాతలను వెంటాడుతోంది. డిజిటల్ సినిమా టెక్నాలజీ ప్రొవైడర్ల నుండి ఇలాంటి పొరపాటు జరగడం పట్ల మేకర్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎదురవుతున్న ఆర్థిక పరమైన అడ్డంకులను తొలగించుకునే పనిలో చిత్ర యూనిట్ నిమగ్నమైంది. ఫైనాన్షియర్లతో చర్చలు తుది దశకు చేరుకున్నాయని, ఈ రాత్రికి అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే 'కరుప్పు' చిత్రం రేపు (శుక్రవారం) థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో విడుదల కానుంది.  
Karuppu starring Suriya, Trisha Krishnan and directed by actor-writer-director RJ Balaji has been postponed but movie show has been played at Pune without producer authentication. Now, the film's producer, supported by the Tamil Producers Council, is demanding compensation from Qube, a prominent digital cinema technology provider.  This demand stems from a serious lapse where the movie's digital key was issued without the producer's consent for a screening in Pune. As Qube manages the secure distribution of these digital cinema packages and keys to theaters, the producers are holding them accountable for this breach. The unauthorized show reportedly ran for an entire hour before it was finally halted. This incident has left the makers deeply concerned. It is difficult to determine exactly how much of the film was exposed to the audience, raising severe fears of piracy. They are particularly worried that the footage might leak online, similar to the unfortunate situation faced by the film Jana Nayagan. Alongside this security breach, the film is also navigating some financial roadblocks. However, the producers have clarified that they are actively working to resolve these hurdles. Discussions with financiers are currently underway, and the team is optimistic about settling all financial matters by tonight. If these negotiations go smoothly and the issues are resolved, Karuppu is expected to finally hit the theaters tomorrow.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్క్రీన్ మీద కనిపిస్తే పూనకాలు రావడం ఖాయం. అయితే ఆయన పర్సనల్ లైఫ్ గురించి, ముఖ్యంగా ఆయన ఫ్రెండ్స్ సర్కిల్ గురించి బయట ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. తాజాగా ప్రముఖ నటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) 'తెలుగువన్'(TeluguOne)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్‌తో తనకున్న 25 ఏళ్ల అనుబంధాన్ని, అలాగే ఎన్టీఆర్ లోని ఒక అద్భుతమైన కళను బయటపెట్టారు. మాస్టర్ చెఫ్ ఎన్టీఆర్: తారక్ ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, అంతకు మించిన అద్భుతమైన వంటగాడు (Cook) అని రఘు చెప్పుకొచ్చారు. ఆయన ఏ కుజైన్ అయినా సరే.. చైనీస్, మొఘలాయ్, ఇటాలియన్ లేదా మన పక్కా ఆంధ్ర వంటకాలైనా సరే, నెక్స్ట్ లెవల్ లో చేస్తారని తెలిపారు. ముఖ్యంగా ఎన్టీఆర్ స్వయంగా బిర్యానీ, హలీమ్ కూడా వండుతారని.. ఆయన వంట చేశారంటే ఆ రుచికి ఫిదా అయిపోయి తింటామని రఘు వ్యాఖ్యానించారు. ఆర్-ఫోర్స్ (R-Force) బ్యాచ్: ఇండస్ట్రీలో వీరికి ఒక ప్రత్యేకమైన గ్యాంగ్ ఉందని, దానికి "ఆర్-ఫోర్స్" అని పేరు పెట్టుకున్నట్లు రఘు వెల్లడించారు. ఇందులో రామారావు (తారక్), రాజీవ్ కనకాల, రాఘవ, రామారావు పెద్ది, రఘు కారుమంచి సభ్యులు. వీరందరి పేర్లు 'R' తోనే మొదలవ్వడం విశేషం. వీరంతా కలిసి ఒకప్పుడు కామన్ గా టాటూలు కూడా వేయించుకోవాలని అనుకున్నారట. వీరు కేవలం స్నేహితులు మాత్రమే కాదు, ఒక కుటుంబంలా కలిసిపోతారని, తారక్ అందరి ఫ్యామిలీ మెంబర్స్ కు చాలా క్లోజ్ అని రఘు పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫర్మేషన్ కింగ్: ప్రస్తుతం తారక్ చేస్తున్న ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' సినిమాల కోసం ఆయన పడుతున్న కష్టం గురించి రఘు మాట్లాడారు. తారక్ నీళ్లలాంటి వారని, ఏ పాత్రకైనా.. ఏ రూపానికైనా ఇట్టే మారిపోతారని ప్రశంసించారు. అంత పెద్ద ఫుడీ (Foodie) అయ్యుండి కూడా, సినిమా కోసం డైట్ కంట్రోల్ చేస్తూ అలా సన్నబడటం ఆయన డెడికేషన్ కు నిదర్శనమని అన్నారు. ఆది సినిమాతో మొదలైన బంధం: తారక్ తో తన ప్రయాణం 'ఆది' సినిమా షూటింగ్ సమయంలో మొదలైందని, రాజీవ్ కనకాల ద్వారా ఆయనకు పరిచయమయ్యానని రఘు గుర్తు చేసుకున్నారు. ఒక చిన్న నటుడిని కూడా తన ఇంటికి పిలిచి భోజనం పెట్టి, ఎంతో గౌరవించే గొప్ప వ్యక్తిత్వం తారక్ ది అని కొనియాడారు. తాను తారక్ ను ఎప్పుడూ పేరు పెట్టి పిలవనని, ఎంతో గౌరవంతో "పెద్దన్న" అని పిలుస్తానని రఘు తన మనసులోని మాటను పంచుకున్నారు.  మొత్తానికి రఘు కారుమంచి మాటలను బట్టి చూస్తుంటే, తారక్ కేవలం వెండితెర మీదే కాదు, నిజ జీవితంలో కూడా ఒక గొప్ప స్నేహితుడిగా, ఒక వండర్ఫుల్ సోల్ గా అందరి మనసులు గెలుచుకుంటున్నారని అర్థమవుతోంది.  
ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది 'కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్' (Cannes Film Festival). కేవలం సినిమాల పరంగానే కాకుండా, అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికగా కూడా  ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2026 కాన్స్ వేడుకల్లో భారతీయ తారలు తమ గ్లామర్‌తో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా తన డ్రెస్సింగ్ స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షించి రెడ్ కార్పెట్‌పై వెండి బొమ్మలా మెరిసింది. కాన్స్ 2026 వేడుకల్లో భాగంగా ఊర్వశి రౌతేలా  ధరించిన సిల్వర్ కలర్ ఔట్‌ఫిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ  దుస్తుల్లో ఆమె ఒక దేవకన్యలా ఉందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక భారీ వెండి రంగు సీక్విన్డ్ గౌన్‌ ని ఎంచుకుంది. తన లుక్‌ కి తగ్గట్టుగా హెవీ డైమండ్ నెక్లెస్, మ్యాచింగ్ ఇయరింగ్స్ ధరించింది. స్మోకీ ఐస్ మరియు గ్లోసీ లిప్స్టిక్‌తో ఆమె మేకప్ హైలైట్‌. గత కొన్నేళ్లుగా ఉర్వశి రౌతేలా కాన్స్ రెడ్ కార్పెట్‌పై క్రమం తప్పకుండా కనిపిస్తోంది. ప్రతిసారి ఏదో ఒక వైవిధ్యమైన థీమ్‌తో రావడం ఆమె ప్రత్యేకత. గతంలో 'మొసలి' ఆకారపు నెక్లెస్ ధరించి వార్తల్లో నిలిచిన ఉర్వశి, ఈసారి క్లాసిక్ మరియు లగ్జరీ లుక్‌ ఎంచుకుంది. భారతీయ సినిమా మరియు ఫ్యాషన్‌ ని అంతర్జాతీయ వేదికపై ప్రతిబింబించేలా తన ఫ్యాషన్ ఎంపికలు ఉంటాయని ఆమె పలుమార్లు పేర్కొన్నారు. Also read: Prabhas: ప్రభాస్ కీలక నిర్ణయం.. ఫ్యాన్స్ కోరుకునేది ఇదే డార్లింగ్   ప్రస్తుత పిక్స్  ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ డాకు మహారాజ్ లో  ఉర్వశి రౌతేలా కనిపించిన విషయం తెలిసిందే. ఇక అసలైన విషయం ఏంటంటే  ఉర్వశి డ్రెస్ కానీ, పైన చెప్పుకున్న మేకప్ మెటీరియల్స్, వగైరా  మొత్తం 155 .87 మిలియన్ డాలర్స్ అంట. మన ఇండియన్ కరెన్సీ లో 1500 కోట్లు.   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
వివాహం అన్ని సంబంధాల కంటే విభిన్నమైన కోణం. వివాహం ప్రారంభ రోజుల్లో భార్యాభర్తల  మధ్య ప్రేమ, ఉత్సాహం,  ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ క్రమంగా భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది.  చాలామంది వివాహం అయిన కొద్ది కాలానికే మనుషులు మారిపోయారు అని అంటూ ఉంటారు. అయితే ఇది చాలా వరకు భార్యాభర్తల మధ్య జరిగేదే. కానీ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గకుండా తిరిగి ప్రేమను పెంచుకోవడం భార్యాభర్తల ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. పెళ్లైన కొన్ని సంవత్సరాల తర్వాత భార్యాభర్తల బంధం కొందరికి  బోరింగ్‌గా మారుతుంది.ఒకరిపై ఒకరు ప్రేమను చూపించడం,  బంధంలో ఉత్సాహం వంటివి అస్సలు కనిపించవు.  దీనికి బదులు వారి బంధంలో విసుగు చెందడం,  గొడవ పడటం చాలా సహజం అయిపోతుంది. కానీ వివాహం అయిన కొన్ని రోజులకే   భార్యాభర్తల మధ్య ప్రేమ ముగిసిపోవడం అనేది ఉండదు.  పెళ్లైన కొత్త రోజుల్లో ఉండే ప్రేమ ఎన్నైళ్లైనా భార్యాభర్తల మధ్య అలాగే ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.  అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గడానికి కారణమయ్యేవి ఏంటో కూడా తెలుసుకోవాలి. బాధ్యతలు, ఒత్తిడి వివాహం తర్వాత, ఉద్యోగం, ఇంటిని చూసుకోవడం, కుటుంబ అంచనాలు,  పిల్లలను పెంచడం వంటి బాధ్యతలు భార్యాభర్తలపై భారంగా మారతాయి.  ఒకరికొకరు సమయం ఇచ్చుకోవడం కష్టం అవుతుంది. క్రమంగా ప్రేమ కాస్తా బాధ్యతల్లోకి జారిపోతుంది. ఒకే దినచర్య.. ఒకే  దినచర్య సంబంధంలో విసుగును కూడా తెస్తుంది. ప్రతిరోజూ ఆఫీసు, ఇల్లు,  ఇతర పనుల మధ్య,  ప్రేమ ఎక్కడో వెనుకబడిపోతుంది. కొత్త శక్తి,  ఉత్సాహం లేకపోవడం సంబంధాన్ని మందకొడిగా చేస్తుంది. కమ్యూనికేషన్.. భార్యాభర్తల  మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం కూడా ప్రేమ తగ్గిపోవడానికి  ఒక పెద్ద కారణం. భార్యాభర్తలు తమ భావాలను, అంచనాలను,  సమస్యలను ఒకరితో ఒకరు పంచుకోనప్పుడు దూరం పెరుగుతుంది.  ఈ దూరం క్రమంగా సంబంధాన్ని బలహీనపరుస్తుంది. ప్రేమ పెరగాలంటే.. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య  మునుపటిలా  ప్రేమను తిరిగి పుంజుకోవడానికి కొన్ని పద్ధతులను అనుసరించవచ్చు.  ఉదాహరణకు కొన్ని.. ఒకరికొకరు సమయం ఇవ్వడం... రోజంతా బిజీగా ఉన్నప్పటికీ కనీసం అరగంటైనా  ఇద్దరూ సంతోషంగా ఉండటానికి  మాత్రమే కేటాయించాలి. డేటింగ్ నైట్ ప్లాన్ చేసుకోవడం...   డేటింగ్ కి వెళ్లడం వల్ల పెళ్లైన సంవత్సరాల తర్వాత కూడా సంబంధానికి కొత్త జీవం పోస్తుంది. ఆశ్చర్యకరమైన బహుమతులు ఇవ్వడం.. చిన్న బహుమతులు కూడా పెద్ద ప్రేమ బయటకు వ్యక్తం  చేస్తాయి. సంభాషణకు ప్రాముఖ్యత ఇవ్వడం.. ప్రతిరోజూ కొంత సమయం ఒకరితో ఒకరు ఓపెన్ మాట్లాడుకోండి. శారీరక సాన్నిహిత్యంపై.. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం,  దగ్గరగా కూర్చోవడం కూడా ప్రేమను తిరిగి రేకెత్తించడానికి ఒక మార్గం కావచ్చు. నిజానికి వివాహం అయిన తరువాత పిల్లలు పుట్టగానే శారీరకంగా బంధం బలహీనమవుతుంది.  అందుకే చాలా వరకు ప్రేమ తగ్గినట్టు అనిపిస్తుంది.  సురక్షిత మార్గంలో భార్యాభర్తలు శారీరక బంధాన్ని సాగిస్తే వారి మధ్య ప్రేమ ఎప్పుడూ తాజాగా ఉంటుంది.                                  *రూపశ్రీ.
  ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ఆనందంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా గడపాలని కోరుకుంటాడు.  మానసిక సమస్యలకు దూరంగా ఉండాలని కోరుకుంటాడు.  నేటి కాలంలో కొందరు  అనారోగ్యంతో బాధపడుతుంటే  మరికొందరు  కుటుంబ సమస్యల గురించి ఆందోళన చెందుతుంటారు. కొంతమంది ఉద్యోగం రాలేదని,   మరికొందరు తమకు జీతం తక్కువ అని, ఇంకొందరు జీతం సరిగా రావడం లేదని.. ఇలా  సగం ప్రపంచం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతోంది. కానీ ఈ ప్రపంచంలో కొంతమంది ఎటువంటి ఆందోళన లేకుండా  సంతోషంగా ఉంటుంటారు. వాళ్లు అసలు అంత సంతోషంగా ఎలా ఉన్నారు? అనే విషయం కూడా కొందరికి అర్థమే కాదు.. అసలు  జీవితాన్ని సంతోషంగా,  ప్రశాంతంగా ఉంచగల మార్గాలు ఏమిటి? దుఃఖాలకు, సమస్యలకు దూరంగా ఉండటం ఎలా తెలుసుకుంటే.. తల్లిదండ్రుల సూచనలు..  పిల్లలు తల్లిదండ్రుల  మాట విని సరైన మార్గాన్ని అనుసరిస్తే, అది తల్లిదండ్రులకు  చాలా సంతోషకరమైన విషయం. అలాంటి పిల్లలు కుటుంబానికి కీర్తిని తెస్తారు.  వారి తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తారు. కాబట్టి జీవితంలో ఆనందం,  శాంతి కోరుకుంటే, ఎల్లప్పుడూ  తల్లిదండ్రుల సూచనలను పాటించాలి.  సరైన మార్గాన్ని అనుసరించాలి.  నేటి జెనరేషన్ అప్డేట్ అయి ఉండవచ్చు. కానీ తల్లిదండ్రుల దగ్గర అనుభవం ఉంటుంది.  కాబట్టి వారి అనుభవ పూరిత సలహాలు ఎప్పుడూ నష్టం మాత్రం కలిగించవు.  జీవిత భాగస్వామి మద్దతు.. జీవితంలో లైఫ్ పార్ట్నర్ చాలా ముఖ్యమైవారు.   జీవిత భాగస్వామి  సుఖదుఃఖాలన్నిటిలోనూ సపోర్ట్ ఇస్తూ అవగాహనతో మసలుకుంటే  జీవితం సులభంగా, సంతోషంగా మారుతుంది. జీవిత భాగస్వామి  అంటే పంచుకునేవారు. ఎలాంటి పరిస్థితిని అయినా అర్థవంతంగా చెప్పగలిగితే బాగస్వామి తప్పకుండా అర్థం చేసుకుంటారు.  ఎవరు అర్థం చేసుకోకపోయినా,  ఎవరు కష్టాలలో తోడు ఉండకపోయినా లైఫ్ పార్ట్నర్ తోడు ఉంటే బాధ, సమస్య ప్రభావం తెలియకుండా ఉంటుంది. తృప్తి.. ఈ కాలంలో మనిషికి లోపించినది తృప్తి.   ఎక్కువ కోసం ఆరాటపడకపోతే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, తద్వారా సంతోషంగా ఉంటాము. ముఖ్యంగా డబ్బు గురించి గొడవ చేసేవారు ఎప్పుడూ ఉన్నదాంతో  సంతృప్తి చెందరు. అందుకే మొదట డబ్బు దగ్గర ఉన్నదాంతో సంతృప్తి చెందడం నేర్చుకుంటే  అన్ని విషయాలలోనూ సంతృప్తిగా ఉండవచ్చు. ఆశించడం..  ఇతరుల సంపద,  ఆస్తి,  ఇతర వస్తువులు వంటివి కోరుకోవడం, తప్పని,  అది చాలా చీప్ మెంటాలిటీ అని  ఎప్పుడైతే తెలుసుకుంటారో.. అప్పుడు జీవితంలో దురాశను వదిలిపెడతారు. ఎవరినుండి అయినాఏదైనా ఆశించడం దురాశ చెందడమే. ఇట్లా దురాశను వదిలిన రోజు మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.  ఎటువంటి కోరిక లేకుండా జీవితాన్ని గడుపుతాము. భూత దయ.. నా వాళ్లు, మనవాళ్లు అని మాత్రమే కాదు.. అందరినీ, అన్ని జీవులను ప్రేమించాలి.అందరి పట్ల,  మూగ ప్రాణుల  పట్ల కూడా  దయ,  కరుణ కలిగి ఉంటే,   ప్రేమ,  శాంతిని నింపుకోగలుగుతారు. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలు,  మంచి ఆలోచనలు,  ఇతరులను ఇబ్బంది పెట్టని,  అన్ని జీవులను సమానంగా చూసే సమభావం అలవడుతుందో.. అప్పుడు మనిషి జీవితం ఎన్ని దుఃఖాలు, సమస్యలు వచ్చినా బాధకు లోనుకాకుండా ఉంటుంది.                               *రూపశ్రీ.
ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త.. ఆయన 2వేల సంవత్సరాల కిందట చెప్పిన మాటలు నేటికీ అనుసరణీయంగా ఉన్నాయి. ఆయన గొప్ప తత్వవేత్త, జీవితం గురించి ఎన్నో సత్యాలు చెప్పాడు. ముఖ్యంగా మనిషి వ్యక్తిత్వం గురించి, మనిషి ఎలా  ఉండాలనే విషయాల గురించి ఆయన చెప్పిన విధానాలు ఎన్ని తరాలు మారినా ప్రతి ఒక్కరూ అనుసరించేలా ఉన్నాయి. ఎవరైనా సరే.. సక్సెస్ ఫుల్ లైఫ్ ను గడపాలని అనుకున్నా,  జీవితంలో గొప్పగా ఎదగాలన్నా చాణక్యుడు చెప్పిన సూత్రాలు పాటిస్తే చాలు.. వారు విజేతలు కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అలాగే వ్యక్తి జీవితంలో శాంతి లేకపోవడానికి కొన్ని కారణాలను కూడా పంచుకున్నాడు చాణక్యుడు. వ్యక్తి చేసే కొన్ని తప్పులే వారి జీవితంలో శాంతి కోల్పోయేలా చేస్తాయట.  వాటి గురించి తెలుసుకుంటే.. ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం.. ఇంట్లో పూజలు చేయకపోవడం, దేవుని నామాన్ని స్మరించకపోవడం జరిగే ఇళ్లలో ప్రజలు ఎప్పుడూ ఇబ్బందుల్లో ఉంటారట. అలాంటి ఇళ్లలో నివసించే ప్రజలు  సంతోషంగా ఉండరట.  పైగా  ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారట.ఇలాంటి ఇళ్లలో నివసించే వారి జీవితాలు రోజు రోజుకూ దిగజారి పోతుంటాయట. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే లేదా అగౌరవపరిచే వ్యక్తి ఎప్పటికీ సంతోషంగా జీవించలేడట. అలా చేసిన ప్రతిసారీ జీవితంలో ఎదుగుదలకు ఆటంకం కలుగుతుందట. మహిళలను గౌరవించని కుటుంబాలు ఎప్పటికీ అభివృద్ధి చెందవని చాణక్యుడు స్పష్టంగా  చెప్పాడు. ఎందుకంటే లక్ష్మీ దేవి అలాంటి ఇళ్లలో ఎప్పుడూ నివసించదని కూడా స్పష్టంగా చెప్పాడు. పెద్దలు,  పిల్లలతో దుర్భాషలాడే ఇళ్లలో ఎల్లప్పుడూ అశాంతి నెలకొనే ఉంటుంది. అలాంటి ఇళ్లలో ధనం నిలవదు,  తరచుగా ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతూ ఉంటాయట. పైగా ఇలాంటి ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందట. ఇతరుల సంపదపై  దృష్టి పెట్టేవారి జీవితంలో ఎప్పటికీ శాంతి ఉండదట.  ఇతరుల సంపదను ముట్టుకోవడం అనేది పాముతో సమానం. అందుకే పరుల సొమ్ము పాము వంటిది అన్నారు అని చాణక్యుడు చెబుతాడు. పైన చెప్పుకున్నవన్నీ వ్యక్తి జీవితంలో శాంతి లేకపోవడానికి కారణం అవుతుంది.  అందుకే శాంతి కోరుకునే వారు వాటికి దూరంగా ఉండటం మంచిది.                                *రూపశ్రీ.  
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో తల తిరగడం సమస్యకు మన ఇంట్లో ఉండే ధనియాలతో (Coriander Seeds) సులభమైన మరియు ప్రభావవంతమైన ఆయుర్వేద చిట్కాలను వివరించారు. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే అంశాలు: తల తిరగడానికి కారణాలు: అసలు వెర్టిగో లేదా తల తిరగడం ఎందుకు వస్తుంది? ధనియాల ప్రాముఖ్యత: ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ధనియాలు శరీరంలోని వేడిని తగ్గించి, నాడీ వ్యవస్థను ఎలా శాంతపరుస్తాయి? రెమెడీ తయారీ విధానం: ధనియాలను ఏ విధంగా ఉపయోగిస్తే తల తిరగడం తక్షణమే తగ్గుతుంది? ముందు జాగ్రత్తలు: ఈ సమస్య ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహార నియమాలు మరియు జాగ్రత్తలు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ సహజ సిద్ధమైన చిట్కాను పాటించి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. మరిన్ని వివరాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానల్ చూడండి: సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి ఇది ఒక పెద్ద అడ్డంకి అని అంటున్నారు ప్రముఖ ఫ్యాట్ లాస్ కోచ్ విజయ్ మంగం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాత్రిపూట అన్నం తినడం వల్ల కలిగే నష్టాలు మరియు ఆరోగ్యకరమైన మార్పుల గురించి ఈ VIDEO లో వివరించారు. రాత్రిపూట అన్నం ఎందుకు వద్దు? మనం పగటిపూట రకరకాల పనులు చేస్తూ ఉంటాం కాబట్టి శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. కానీ రాత్రిపూట శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట అన్నం తిని వెంటనే పడుకోవడం వల్ల ఆ శక్తి ఖర్చు కాక, అది కొవ్వుగా (Fat) మారి శరీరంలో పేరుకుపోతుంది. దీనివల్ల ముఖ్యంగా పొట్ట రావడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రత్యామ్నాయాలు ఏమిటి? విజయ్ మంగం సూచనల ప్రకారం, రాత్రిపూట అన్నానికి బదులుగా కూరగాయలు (Vegetables), ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ఉత్తమం. సలాడ్లు, సూప్స్ లేదా తక్కువ పరిమాణంలో ఇతర చిరుధాన్యాలను ఎంచుకోవచ్చు. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, శరీరానికి అనవసరమైన కొవ్వు చేరదు. ముఖ్య గమనిక: మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఫిట్‌గా కనిపించాలన్నా కేవలం వ్యాయామం మాత్రమే సరిపోదు, సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. బరువు తగ్గాలనుకునే వారు విజయ్ మంగం గారి ఈ టిప్స్ పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం మా TeluguOne Health ను సందర్శించండి.  సబ్‌స్క్రైబ్ చేసుకోండి!
కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు, కొలీగ్స్..  ఇట్లా  ఎవరితో అయినా ఎక్కడికైనా ప్రయాణాలు చేయాల్సి వస్తూనే ఉంటుంది.  చాలా వరకు ఆఫీసు పనులు, వ్యక్తిగత పనుల మీద ఒంటరిగానే ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. నిజానికి ప్రయాణాలు అంటే అదొక స్పెషల్ మూమెంట్ అనిపిస్తుంది.  కానీ చాలా మంది మాత్రం ప్రయాణంలో చెప్పుకోలేని అసౌకర్యం అనుభవిస్తుంటారు.  అదే మలబద్దకం. ప్రయాణం కోసం అలా ఇంటి నుండి బయటపడగానే.. ఇటు మలబద్ధకం, ఉబ్బరం, తిమ్మిర్లు,  అసౌకర్యం మొత్తం ప్రయాణాన్ని నాశనం చేస్తాయి. మరీ ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు  ఈ సమస్య నరకాన్ని పరిచయం చేస్తుంది. అసలు ప్రయాణాలలో మలబద్దకం ఎందుకు వస్తుంది.  ఈ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలేంటి తెలుసుకుంటే.. ప్రయాణాల సమయంలో మలబద్దకం ఎందుకు వస్తుంది? ప్రయాణాలు చేసేటప్పుడు దినచర్య మారడం,  ఆహారపు అలవాట్లలో మార్పులు,  నీరు తక్కువ తీసుకోవడం,  ఎక్కువ సేపు కూర్చోవడం,  నిద్రలేకపోవడం,  టాయిలెట్ కు వెళ్లడానికి తగిన వెసులుబాటు లేకపోవడం మొదలైనవి మలబద్దకం రావడానికి కారణం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే ప్రయాణాల సమయంలో మలబద్దకం,  ఉబ్బరం,   గ్యాస్ వంటి సమస్యలను చాలా మంది ఎదుర్కుంటారు. ముఖ్యంగా వృద్దులు, స్త్రీలు,  పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఏదైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు ప్రయాణ సమయంలో మలబద్దకం సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలలో మలబద్దకానికి చెక్ పెట్టే చిట్కాలు.. ప్రయాణాలలో మలబద్దకానికి చెక్ పెట్టాలంటే ప్రయాణాలలో ఫైబర్ మెరుగ్గా ఉన్న ఆహారం తీసుకోవాలి.  మరీ ముఖ్యంగా ప్రయాణాలలో హోటల్ ఆహారాన్ని నిషేధించాలి. ప్రయాణాలలో ఆహారం వల్ల ఏదైనా ఇబ్బంది అనిపిస్తే పండ్లను తినడం మంచిది. పండ్లలో ఫైబర్ ఉంటుంది, నీటి శాతం కూడా ఉంటుంది.  ఇది జీర్ణాశయానికి సహాయపడుతుంది. ప్రయాణాలలో ఆకలి వేయకపోయినా స్నాక్స్ తినే అలవాటు కొందరికి ఉంటుంది.  బిస్కెట్లు,  సమోసాలు వంటివి తినడం వల్ల మలబద్దకం వస్తుంది.  అందుకే వీటిని నివారించాలి.  ఆకలిగా అనిపిస్తే బాదం, కాజు వంటి శక్తిని ఇచ్చే నట్స్ తీసుకోవాలి. ప్రయాణాలలో చాలామంది నీరు తక్కువగా తాగుతారు. కానీ ప్రయాణాలలో తప్పనిసరిగా 8గ్లాసుల నీరు తాగేలా చూసుకోవాలి. దూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువసేపు అలాగే కూర్చోకుండా అటు ఇటు తిరగడం,  ఏవైనా స్టాప్ లు వచ్చినప్పుడు కిందకు దిగి మళ్లీ ఎక్కడం వంటివి చేయవచ్చు. ప్రయాణాలలో తప్పనిసరిగా బయటి ఆహారం తినాల్సి వస్తే ప్రోబయోటిక్స్ మెరుగ్గా ఉన్న ఆహారం తీసుకోవాలి.  దోశ, ఇడ్లీ,  మజ్జిగ, పెరుగన్నం వంటివి మలబద్దకం రాకుండా చేస్తాయి. అలాగే ప్రయాణంలో పాలు పోక ఊరికే కాఫీలు,  టీలు తాగడం మానేయాలి. ప్రయాణాలలో మలబద్దకం సమస్యను ఎదుర్కునేవారు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మరీ ముఖ్యంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఇలా సమస్య ఎదుర్కునేవారు వైద్యుడిని సంప్రదించి వారి సలహా మేరకు మందులు వాడటం మంచిది.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...