LATEST NEWS
పశ్చిమ బెంగాల్ లో పొటిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్ కు చేరింది. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని హౌస్ అరెస్టు చేశారంటూ టీఎంసీ నేతల ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.  దక్షిణ 24 పరగణాల జిల్లా బారుయిపూర్‌లో హత్యాచారానికి  గురైన  12 ఏళ్ల బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి మమతా బెనర్జీ వెళ్లకుండా అడ్డుకునేందుకు ఆమెను హౌస్ అరెస్టు చేశారని టీఎంసీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రిని, ఆమె సొంత రాష్ట్రంలోనే కదలకుండా నిర్బంధించడం దారుణమని మండిపడుతున్నాయి.  కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని  మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద   భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.  మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను  టీఎంసీలు ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, మహువా మొయిత్రా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  బాధితురాలి కుటుంబాన్ని కలిసి పరామర్శించకుండా అడ్డుకోవడానికే  సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ మమతను హౌస్ అరెస్టు చేశారని వారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.   సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఏడుసార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించి,   మూడుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన సీనియర్ నాయకురాలి పట్ల   అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణమని మహువా మొయిత్రా విమర్శించారు.   ఇలా ఉండగా,   బారుయిపూర్ లో మైనర్ బాలికపై హత్యాచార   ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను  అరెస్ట్ చేశారు. ఈ  కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్  ఏర్పాటు చేశామని, దోషులను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మమతా బెనర్జీ  గృహనిర్బంధం ఆరోపణలను   టీఎంసీ ఆడుతున్న రాజకీయ నాటకాలుగా  ప్రభుత్వం కొట్టిపారేసింది.   MC leaders allegations, West Bengal politics, Mahua Moitra, Baruipur case
  అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక్కడి ప్రాంతీయ సమీకరణాలు, నాయకుల వ్యక్తిగత చరిష్మా పార్టీల జయాపజయాలను శాసిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ (TDP) సీనియర్ నాయకుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి రాజకీయ అడుగులపై ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయన పార్టీ మారుతున్నారనే ఊహాగానాలు ఒకవైపు వినిపిస్తుండగా, టోన్ న్యూస్‌ ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలు జిల్లా రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపుతున్నాయి.  పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను చాటుకుంటూనే, తన భవిష్యత్తు కార్యాచరణపై చంద్రబాబు నాయుడు నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. రాజకీయ వ్యూహం మరియు అంతరార్థాలు ప్రభాకర్ చౌదరి సుదీర్ఘ కాలంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ, జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి కీలక పదవులను నిర్వహించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఆయనకు బలమైన క్యాడర్ మరియు ప్రజాదరణ ఉన్నాయి. తాజా పరిణామాల ప్రకారం, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్న శాసనమండలి (MLC) స్థానాలపై ఆయన ఆశలు పెట్టుకున్నారు.  గతంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు. ఇది ఒక రకంగా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచే వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ మారే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని చెబుతూనే, తన సీనియారిటీకి మరియు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తగిన గుర్తింపు దక్కాలనే ఆకాంక్షను ఆయన బలంగా వినిపించారు. ఒకవేళ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఇస్తే చట్టసభల్లో ప్రజా సమస్యలపై గళమెత్తడానికి సిద్ధంగా ఉన్నానని, ఇవ్వకపోయినా ఒక సాధారణ కార్యకర్తలా పార్టీలోనే కొనసాగుతానని చెప్పడం వెనుక రాజకీయ పరిణతి కనిపిస్తుంది. రాజకీయ పరిణామాలు మరియు అంతస్సూత్రాలురాయలసీమ రాజకీయాల్లో ఒకప్పుడు ఉన్న ఫ్యాక్షనిజం తీరుపై, ప్రస్తుత స్వార్థపూరిత రాజకీయాలపై ప్రభాకర్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. గతంలో ఫ్యాక్షనిజానికి కులం, మతం లేవని, గ్రూపుల మధ్య మాత్రమే వైషమ్యాలు ఉండేవని పేర్కొన్నారు. కానీ నేడు రాజకీయం కలుషితమై ఫ్యాక్షన్‌ను కొందరు ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తులు ఎదిగే అవకాశం కనుచూపు మేరలో లేదని, సంప్రదాయ వారసత్వ పార్టీలే రాజ్యమేలుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్లో మార్పు రావడానికి మరింత సమయం పడుతుందనే వాస్తవాన్ని ఆయన అంగీకరించారు.  ఈ పరిణామాలు అనంతపురం జిల్లాలో టిడిపి అంతర్గత గ్రూపు రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభాకర్ చౌదరికి తగిన ప్రాధాన్యత దక్కకుంటే జిల్లాలో పార్టీ క్యాడర్ నైరాశ్యంలో మునిగిపోయే ప్రమాదం ఉంది.భవిష్యత్తు రాజకీయ ప్రభావంరానున్న రోజుల్లో ప్రభాకర్ చౌదరి భవిష్యత్తు పూర్తిగా టిడిపి అధిష్టానం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే, అనంతపురం జిల్లాలో పార్టీ మరింత పుంజుకుంటుంది. ఒకవేళ అధిష్టానం ఆయనను విస్మరిస్తే, స్థానిక సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఆయన పార్టీ మారే యోచనలో లేనప్పటికీ, ద్వితీయ శ్రేణి నాయకులు మరియు అనుచరుల ఒత్తిడి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయానికైనా దారితీయవచ్చు. పూర్తి చర్చను టోన్ న్యూస్‌లో తప్పక వీక్షించండి.  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో  కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్  జనసేన గూటికి చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా రాజకీయాలలో క్రీయాశీలంగా ఉండకుండా మౌనం వహించిన ఆమంచి ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకుంటారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.  సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్..  2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా  రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే..  2019 ఎన్నికలకు ముందు  తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.  2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేసి  కరణం బలరాం చేతిలోపరాజయం పాలయ్యారు.  ఆ ఓటమి తరువాత  వైసీపీలో ఆమంచి కృష్ణమోహన్ ను ఇసుమంతైనా ప్రాధాన్యత దక్కలేదు.   దీంతో   2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమంచి కృష్ణమోహన్  వైసీపీని వీడి.. వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్  తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టింది.  దీంతో ఆమంచి రాజకీయంగా ఇన్ యాక్టివ్ అయ్యారు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన తన అనుచరులు, నియోజకవర్గ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఆ చర్చలలో చీరాలలో తన పట్టు నిలుపుకోవాలన్నా, రాజకీయంగామనుగడ సాగించాలన్న జనసేనలో చేరడమే కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చారు.   ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జనసేనను మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్ష్ ఒక్కటే మార్గమని భవించిన.. ఆమంచి నేడో రేపు ఇదే విషయాన్ని బహిరంగంగా ప్రకటించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఆ దిశగా ఇప్పటికే  జనసేన ముఖ్యులతో ఆమంచి చర్చలు జరిపారనీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అప్పాయింట్ మెంట్ ఖరారైన తరువాత ఆయన జనసేన చేరిక ప్రకనట చేసే అవకాశం ఉందనీ, జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది.   Amanchi Krishna Mohan, Janasena Party, Pawan Kalyan, Chirala Politics, Teluguone
  తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. కేవలం ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా మొదలైన ఆయన ప్రయాణం, నేడు తెలంగాణ రాష్ట్రాన్ని శాసించే ముఖ్యమంత్రి స్థాయికి చేరి సరిగ్గా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈ 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక భావోద్వేగ భరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు. రెండు దశాబ్దాల తన ప్రజా జీవితం మరుపురాని మధుర జ్ఞాపకం అని ఆయన కొనియాడారు. కేవలం రేవంత్ రెడ్డి అనే పేరుతో ప్రారంభమైన తన రాజకీయ ప్రయాణాన్ని, ప్రజలు ఆదరించి 'రేవంతన్న'గా తమ గుండెల్లో నిలిపిన తీరును ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం నుంచి ప్రారంభమైన తన తొలి రాజకీయ అడుగులను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్థానిక సంస్థల ప్రతినిధిగా మిడ్జిల్ లో మొదలైన ప్రయాణమే తనను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ 20 ఏళ్ల కాలంలో ఎన్నో సందర్భాలు, మరెన్నో రాజకీయ పరిణామాలు, తీవ్రమైన సంఘర్షణలను ఎదుర్కొన్నానని, అయితే ప్రతి కష్టకాలంలోనూ, ప్రతి మలుపులోనూ ప్రజలు తనకు అండగా నిలిచారని ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సుదీర్ఘ ప్రస్థానం తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన అధ్యాయమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇదే ప్రజాదరణ, స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత సేవ చేయాలనేదే తన ఏకైక సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తాను ఒక సామాన్య శ్రామికుడిగా నిరంతరం శ్రమిస్తానని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కలలను నెరవేర్చే ఒక నమ్మకమైన సేవకుడిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. అధికార గర్వం లేకుండా, కేవలం ప్రజల మనిషిగా, అందరి 'రేవంతన్న'గా ప్రజా హృదయాల్లో మరింత ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవడమే తన ఆశయమని ఆయన ఈ మైలురాయి సందర్భంగా ఉద్ఘాటించారు. 2006 నుంచి 2026 వరకు సాగిన ఈ రెండు దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఒంటరి పోరాటాలు చేసి, చివరకు ప్రజా బలంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రేవంత్ రెడ్డి ప్రయాణం తెలుగు రాజకీయాల్లో ఒక సంచలనం.  
కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆమె స్థాపించిన కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన పేరుపై భారీ ఎత్తున అభ్యంతరాలు వచ్చిన కారణంగా పార్టీ పేరు మార్చుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు పార్టీకి అధికారిక సమాచారం ఇచ్చింది.  ఈసీ ఆదేశాల మేరకు   కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.   తన పార్టీకి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేర్కొంటూ..  రిజిస్ట్రేషన్ కోసం కవిత ఈసీకి దరఖాస్తు చేసుకున్న సంగతి విదితమే. అయితే..  ఈ పేరుపై  వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని అందువల్ల మూడు ప్రత్యామ్నాయ పేర్లను  కు సర్పించాలని ఈసీ  కవితకు లేఖ రాసింది.   కాగా ఈసీ నుంచి వచ్చిన అభ్యంతరాలపై స్పందించిన కవిత..  ఈసీ కోరినట్లు ప్రత్యామ్నాయంగా కొత్త పేర్లు ఇచ్చే ప్రసక్తే లేదనీ..  ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామనీ తెలిపారు.  గత ఫిబ్రవరిలో తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజా శక్తి  పేర్లను సూచిస్తూ కవిత సీఈసీకి లేఖ రాశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 25న మునీరాబాద్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో తమ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేనగా  ప్రకటించిన కవిత, అదే సభలో పార్టీ జెండాను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన మూడు రోజులకు కవిత కొత్త పార్టీ పేరును  తెలంగాణ రక్షణ సేన గా ఈసీ ప్రాథమికంగా గుర్తించింది.  తాజాగా ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ..  ప్రత్యామ్నాయ పేర్లు ఎంపిక చేసుకోవాలని సూచించడం తెలంగాణలో రాజకీయ సంచలనానికి తేరతీసింది.  ECI, Kalvakuntla, Kavitha, TRSname, Teluguone, Telangana Politics
ALSO ON TELUGUONE N E W S
తనదైన హాస్యంతో, విలక్షణ నటనతో ఐదు తరాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న 'నటకిరీటి' రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుండి 'పద్మశ్రీ' అవార్డును అందుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయనకు సన్మాన కార్యక్రమ జరిగింది. ఈ సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ.. తన 48 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన అరుదైన అనుభవాలను, ఆసక్తికరమైన విషయాలను ఎంతో ఓపెన్‌గా పంచుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎప్పుడూ ఎలాంటి వివాదాలకు చోటివ్వలేదని స్పష్టం చేసిన రాజేంద్రప్రసాద్, ఈ మధ్య కాలంలో వస్తున్న సోషల్ మీడియా ట్రోల్స్ గురించి ఏమాత్రం పట్టించుకోనని అన్నారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు కాలం నుండి నేటి తరం సూపర్ స్టార్లు మహేష్ బాబు, అల్లు అర్జున్ వరకు ఐదు జనరేషన్ల హీరోలతో కలిసి ట్రావెల్ కావడం దేవుడు తనకు ఇచ్చిన గొప్ప ప్రసాదంగా ఆయన అభివర్ణించారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సైతం తనకు చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. అలాగే చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మాణంలో తాను నటించిన 'సేనాపతి' సినిమాను చూసి మెగాస్టార్ చిరంజీవి తన నటనను ఎంతగానో అభినందిస్తూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేదికపై రాజేంద్రప్రసాద్ తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'ఆ నలుగురు' సినిమా గురించిన ఒక షాకింగ్ సంఘటనను బయటపెట్టారు. ఈ క్లాసిక్ సినిమా చూసి లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు థియేటర్ నుండి బయటకు వస్తున్న సమయంలో తాను ఎదురుపడ్డానని చెప్పారు. అప్పుడు విశ్వనాథ్ గారు ఒక్కసారిగా తన చెంప మీద కొట్టారని, దాంతో మొదట తనకు ఏమీ అర్థం కాలేదని, సినిమా నచ్చలేదేమో అని భయపడ్డానని అన్నారు. అయితే వెంటనే విశ్వనాథ్ గారు తనను హగ్ చేసుకుని, "నీ దుంపతెగ.. సినిమా అంతా వెతికాను కానీ ఎక్కడా ఒక్క ఫ్రేమ్‌లో కూడా నాకు రాజేంద్రప్రసాద్ కనిపించలేదు, కేవలం ఆ పాత్ర మాత్రమే కనిపించింది.. నువ్వు నేర్చుకున్న నటనను పర్‌ఫెక్ట్‌గా వాడుకున్నావ్.. గాడ్ బ్లెస్ యూ" అని మనస్ఫూర్తిగా దీవించారని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. నటుడిగా ఎంతో మంది హృదయాలను గెలిచినప్పటికీ నిర్మాతగా మాత్రం తాను ఫెయిల్యూర్ అయ్యానని రాజేంద్రప్రసాద్ నిజాయితీగా ఒప్పుకున్నారు. తన భార్య విజయ చాముండేశ్వరి ప్రొడ్యూసర్‌గా మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతో 'మేడమ్', 'రాంబంటు' చిత్రాలను నిర్మించామన్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన 'మేడమ్' చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా, నంది అవార్డుల్లో 'బెస్ట్ యాక్ట్రెస్' కేటగిరీలో తనకు స్పెషల్ జ్యూరీ అవార్డు తెచ్చిపెట్టిందని, ఆ అవార్డు కోసం లెజెండ్ ఏఎన్నార్ తన పేరును స్వయంగా రెఫర్ చేశారని గుర్తుచేసుకున్నారు. కానీ ఆ తర్వాత నిర్మించిన 'రాంబంటు' సినిమా మాత్రం భారీ ఆర్థిక నష్టాలను మిగిల్చిందని, ఆ సినిమా నష్టాలను పూడ్చడానికి అన్నపూర్ణ స్టూడియోస్ పక్కనే ఉన్న తన అరెకరం భూమిని అమ్ముకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో తాను ప్రొడ్యూసర్‌గా పనికిరానని తేల్చుకుని, ఆ తర్వాత ఎప్పుడూ సినిమాలు నిర్మించలేదని స్పష్టం చేశారు.     Rajendra Prasad, Padma Shri, K Viswanath, TeluguOne  
Pradeep Ranganathan has taken an unconventional route for his debut as a producer by announcing his maiden production under the PR Show banner with a concept that is already generating curiosity. Instead of backing a film with a single filmmaker, he has introduced an "Alpha Unit" comprising six writer-directors, who have jointly written and are directing the project together. Headlined by Mamitha Baiju, the yet-to-be-titled film is positioned as a female-led action entertainer. The announcement video offers a glimpse into its intense premise, with Mamitha seen holding a blood-stained knife before hurling it at Ashwath Marimuthu, who appears to be playing a police officer. The story is said to revolve around a young woman taking on a police official, hinting at an action-driven conflict. Apart from Mamitha and Ashwath, the film also stars Shivaji Sontineni, Swasika and introduces newcomer Anamika Mahi. Music is being composed by Sai Abhyankkar, one of the most sought-after young composers in South cinema. While writer and director duos have become common in Indian cinema, a team of six filmmakers jointly directing a feature film is an unusual experiment. The move is reminiscent of the 1999 Tamil film Suyamvaram, which saw multiple directors collaborate on a single project, although that was made under a completely different format. Known for his fresh storytelling choices as an actor and filmmaker, Pradeep appears to be extending the same philosophy to his production ventures. With an ambitious collaborative filmmaking model and a promising action-oriented premise, the project has emerged as one of the more intriguing announcements from the Tamil film industry in recent times. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  మంచు విష్ణు సరసన 'సూర్యం'తో జత కట్టి తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన భామ  సెలీనా జైట్లీ(celina jaitly).. మాజీ మిస్ ఇండియా కూడా అయిన సెలీనా బాలీవుడ్ లో అనేక హిట్ చిత్రాల్లో చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.  కెరీర్ పీక్ లో  ఉన్నప్పుడే 2010లో ఆస్ట్రియన్ వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ని వివాహం చేసుకుని విదేశాల్లో స్థిరపడ్డారు. వివాహం తర్వాత సినిమాలకి దూరమై  పూర్తిగా కుటుంబానికే అంకితమయ్యారు. అయితే, దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో తాజాగా తన వైవాహక జీవితంలో అనుభవించిన నరకాన్ని బయటపెట్టి అందరినీ షాక్‌కి గురిచేశారు.  తమ 15వ వివాహ వార్షికోత్సవం (వెడ్డింగ్ యానివర్సరీ) రోజున జరిగిన ఒక దారుణమైన సంఘటనను గుర్తుచేసుకుంటూ సెలీనా ఎమోషనల్ అయ్యారు.సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ ' నా భర్త  కారులో తీసుకెళ్లి, ఒక కొండ కింద నిర్జనమైన రోడ్డుపై ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి తీవ్ర ఆందోళనతో నడుచుకుంటూ ఇంటికి చేరుకున్నాక, ఆస్ట్రియా పోస్ట్ ఆఫీస్ నుండి వచ్చిన ఒక లేఖ కనిపించింది. ఆ లేఖ జర్మన్ భాషలో ఉండటంతో నా  పిల్లలైన విన్‌స్టన్, విరాజ్‌లకు దానిని చదవమని ఇచ్చాను. వాళ్ళు ఆ లేఖ చదవగానే  నా ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. ఎందుకంటే, అది పెళ్లి రోజు కానుక (యానివర్సరీ గిఫ్ట్) పేరిట నా భర్త నాకు పంపిన విడాకుల నోటీసు. నా  కన్నబిడ్డల నోటే, నాపై  భర్త చేసిన దారుణమైన ఆరోపణలను వినాల్సి రావడం జీవితాంతం మర్చిపోలేని పెద్ద గాయంగా మిగిలిపోయింది. కోర్టు మొదటి విచారణలోనే ఇద్దరూ సామరస్యంగా విడిపోవాలని సూచించినప్పటికీ, అప్పటికే నేను  తీవ్రమైన ఆర్థిక, మానసిక ఒలిడికి గురయ్యాను. ఆ సమయంలో నా అకౌంట్ లో డబ్బులు లేవు. అయినప్పటికీ పిల్లల భవిష్యత్తు కోసం భర్త ఆస్తిలో తనకు పైసా కూడా వద్దని కోర్టుకి చెప్పాను. పెళ్లికి ముందు  కష్టపడి సంపాదించిన సొంత ఆస్తులని మాత్రమే తిరిగి ఇవ్వాలని అడగడంతో పాటు  పిల్లల సంరక్షణ బాధ్యత (జాయింట్ కస్టడీ) కావాలని అడిగాను . కానీ ఆ తర్వాత పరిస్థితులు మరింత నరకంగా మారాయి. దాంతో నా ఇంట్లోనే బందీగా ఉండాల్సి వచ్చింది. అంతేకాకుండా, ఉద్యోగం చేయాలని ఒత్తిడి తెస్తూ, సూపర్ మార్కెట్‌లో క్లీనర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నా భర్త  తీవ్రంగా అవమానించాడు. ఇండియాలో 2004లో nenu కొనుగోలు చేసిన సొంత ఆస్తులని  కూడా విక్రయించేందుకు  ప్రయత్నించడంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను . చివరకి ప్రాణాలను దక్కించుకోవాలనే భయంతో 2025 నవంబర్‌లో అర్ధరాత్రి వేళ పిల్లలతో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చేసి ముంబై కోర్టులో గృహ హింస కేసు దాఖలు చేశారు. తన భర్త పీటర్ హాగ్‌పై గృహహింస, క్రూరత్వం, మోసపూరిత చర్యల కింద కేసు నమోదు చేసి నెలకి 10 లక్షల భరణంతో పాటు50 కోట్ల  పరిహారాన్ని డిమాండ్ చేశాను . ప్రస్తుతం ఆస్ట్రియా ఫ్యామిలీ కోర్టు జాయింట్ కస్టడీ ఇచ్చినప్పటికీ, పిల్లలని  ఒక రహస్య ప్రాంతానికి తరలించి వాళ్లకి బ్రెయిన్ వాష్ చేసి నాతో మాట్లాడకుండా అడ్డుకుంటున్నాడ ని చెప్పుకొచ్చింది. సెలీనా మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సెలీనాకి మొత్తం ముగ్గరు మగపిల్లలు. పేర్లు  విన్‌స్టన్, విరాజ్, ఆర్థర్.  
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో రూపొందనున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'గాడ్ ఆఫ్ వార్' (God of War). ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్, కనీసం షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే అప్పుడే రాజకీయ వివాదాల సుడిగుండంలో చిక్కుకోవడం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా హిందూ దేవుడు కార్తికేయుడు, తమిళ సంప్రదాయంలో 'మురుగన్'గా అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించబడే దేవుడి జన్మస్థలానికి సంబంధించిన అంశంపై చిత్రబృందం చేసిన కొన్ని వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్రమైన రాజకీయ దుమారానికి దారితీశాయి. ఇటీవల ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేసిన సమయంలో, మేకర్స్ సినిమా కథకు సంబంధించిన కాన్సెప్ట్‌ను వివరిస్తూ ఒక ప్రకటన చేశారు. అందులో మురుగన్ దేవుడు మొదట ఉత్తర ప్రాంతంలో జన్మించారని, ఆ తర్వాతే కాలక్రమేణా దక్షిణాదితో ముడిపడిన దేవుడిగా మారారని చిత్రబృందం పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తమిళనాడులో పెను వివాదాన్ని రేకెత్తించాయి. తమిళ సంస్కృతిలో మురుగన్‌.. 'తమిళ కడవుల్' (తమిళుల దేవుడు)గా అత్యంత పవిత్రంగా భావించే సంప్రదాయం శతాబ్దాలుగా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం చేసిన వ్యాఖ్యలు చారిత్రక, సాంస్కృతిక వాస్తవాలను పూర్తిగా వక్రీకరించేలా ఉన్నాయని అక్కడి ప్రజలు, పలువురు ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సెన్సిటివ్ అంశంపై తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, దర్శకుడు, నటుడు సీమాన్ (Seeman) అత్యంత ఘాటుగా స్పందించారు. మురుగన్‌ను తమిళుల ఆరాధ్య దైవంగా భావించే సుదీర్ఘ సంప్రదాయాన్ని విస్మరించి, ఆయనను ఉత్తర భారతానికి చెందిన దేవుడిగా చూపించే ప్రయత్నం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కళ పేరుతో చరిత్రను, సాంస్కృతిక మూలాలను మార్చే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు. చిత్రబృందం విడుదల చేసిన అధికారిక పోస్టే ఈ వివాదానికి మూల కారణమని, అది కోట్లాది మంది తమిళుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని సీమాన్ ఆరోపించారు. ఈ వివాదం ఇక్కడితో ఆగకుండా మరింత ముదిరింది. 'గాడ్ ఆఫ్ వార్' సినిమాను తమిళనాడులో విడుదల కాకుండా తమ పార్టీ శ్రేణులతో కలిసి ఖచ్చితంగా అడ్డుకుంటామని సీమాన్ సంచలన ప్రకటన చేశారు. అవసరమైతే తెలుగు, తమిళం అనే తేడా లేకుండా రెండు భాషల్లోనూ ఈ చిత్ర ప్రదర్శనలను నిలిపివేసేందుకు పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేపడతామని ఆయన హెచ్చరించడం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే ఈ స్థాయి రాజకీయ వేడి, హెచ్చరికలు రావడం సినీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఇంత పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్నా, ఈ అంశంపై ఎన్టీఆర్ కానీ, దర్శకుడు త్రివిక్రమ్ కానీ లేదా చిత్ర నిర్మాతలు కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. కథకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. సినిమా ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉండటంతో, భవిష్యత్తులో ఈ సున్నిత అంశంపై చిత్రబృందం స్పష్టత ఇచ్చి వివాదానికి ముగింపు పలికే అవకాశం ఉందని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు.      Jr NTR, Trivikram, God of War, Controversy, TeluguOne  
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లెనిన్' (Lenin). రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం జూలై 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో తిరుపతి వేదికగా జరిగిన 'లెనిన్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో అఖిల్ అక్కినేని ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు.  దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ప్రేక్షకులకు, అభిమానులకు దూరంగా ఉండటంపై తన మనసులోని బాధను, ఆవేదనను ఈ వేదికపై అఖిల్ ఫ్రాంక్‌గా పంచుకున్నారు. ఇటీవల వైజాగ్ ఈవెంట్ స్టేజ్ మీద సారీ చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇవాళ కూడా అభిమానులకు క్షమాపణలు చెబుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గత రెండున్నర ఏళ్లుగా అభిమానులతో కమ్యూనికేట్ చేయలేకపోయానని, ముఖం చూపించలేకపోయాననే బాధ తన మైండ్‌లో ఎంతో బలంగా ఉండిపోయిందని అఖిల్ అన్నారు. కానీ ఇవాళ తను ఒక పాజిటివ్ మైండ్‌సెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చానని, ఆ పాజిటివ్ ఎనర్జీనే ఈ 'లెనిన్' సినిమా అని స్పష్టం చేశారు.  ఈ సినిమాతో తాను కొత్తగా కనిపించాలని, ఎంతో బాగా నటనను ప్రదర్శించాలని కష్టపడినట్లు చెప్పారు. అయితే వీటన్నింటి వెనుక ఉన్న తన ఏకైక ఉద్దేశం ఒక్కటేనని.. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు తనను తమ ఇంటి బిడ్డగా భావించి, గుండెల్లో దాచుకోవాలని అఖిల్ ఆకాంక్షించారు. "నన్ను మీ ఇంటి వాడిని చేసుకోండి, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి, అప్పుడే నేను ఎంతో సంతోషంగా ఉంటాను" అంటూ అఖిల్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల హృదయాలను కదిలించాయి. రెండు సంవత్సరాల క్రితం రాయలసీమ బిడ్డ అయిన దర్శకుడు మురళీ కిషోర్ (నందు) తనను కలిసి ఈ అద్భుతమైన కథను చెప్పాడని అఖిల్ గుర్తుచేసుకున్నారు. కథ విన్న వెంటనే నందుకు ఒక గట్టి హగ్ ఇచ్చి, "ఈ కథను ఇంకెవరికీ చెప్పకు, ఇది నాకోసమే రాశావు" అని అడిగినట్లు చెప్పారు. ఆ సమయంలో తన మైండ్‌లో రన్ అవుతున్న పెయిన్ జర్నీ, బాధ అంతా ఆ కథలో కనిపించిందని భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతటి గొప్ప దర్శకుడిని తనకు అందించినందుకు నందు తల్లిదండ్రులకు వేదికపై ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నమ్మకానికి తాము తిరిగి ఇచ్చే థాంక్స్ ఏంటనేది జూలై 10న థియేటర్లలో 'లెనిన్' సినిమా రూపంలో చూపిస్తామని, అది చూసి అందరూ ఆనందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా ప్రయాణంలో నిర్మాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ తనకు అందించిన సపోర్ట్ మరువలేనిదని అఖిల్ కొనియాడారు. రెండేళ్ల క్రితం వంశీతో కలిసి పార్ట్‌నర్స్ లాగా వర్క్ చేద్దామని అనుకున్నామని, ఈ కథతో తమ మధ్య ఒక గొప్ప పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయిందని చెప్పారు. ఈ కథను తన తండ్రి నాగార్జున గారి వద్దకు తీసుకెళ్లినప్పుడు.. హిట్ కొట్టడం, బ్లాక్‌బస్టర్ కొట్టడం మాత్రమే కాకుండా ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమా ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని ఇద్దరూ చేతులు కలిపిన క్షణాలను అఖిల్ గుర్తుచేసుకున్నారు. ఈ జర్నీలో ఎడిటర్ నవీన్ నూలి, డీఓపీ లియాన్ బ్రిటోతో పాటు ఎంతో మంది టెక్నీషియన్లు ప్రాణం పెట్టి పనిచేశారని, అందుకే ఇవాళ తాను ఎంతో వర్క్ సాటిస్ఫాక్షన్‌తో, నమ్మకంతో స్టేజ్ మీద నిలబడగలిగానని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman S) ఈ సినిమాకు అద్భుతమైన ప్రాణం పోశాడని అఖిల్ ప్రశంసించారు. గత రెండు మూడు రోజులుగా సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) చూస్తున్నామని, థమన్ మ్యూజిక్‌తో థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని అన్నారు. అలాగే హీరోయిన్ భాగ్యశ్రీ (భారతి) పాత్ర కోసం పడిన కష్టాన్ని తాను కళ్లారా చూశానని, ఆమె షాట్‌లో చూపిస్తున్న ఎనర్జీ చూసి తాము కూడా ఎంతో జాగ్రత్తగా, వళ్లు దగ్గర పెట్టుకుని యాక్ట్ చేయాల్సి వచ్చిందని నవ్వుతూ చెప్పారు. సహనటులు శివాజీ, బ్రహ్మాజీ, సునీల్ ఒక కుటుంబంలా కలిసి కష్టపడ్డారని, వారంతా తన గురించి మాట్లాడిన మంచి మాటలన్నీ ఈ సినిమా ఇచ్చిన గొప్పదనమేనని పేర్కొన్నారు. చివరగా తన తండ్రి నాగార్జున గారి వైపు చూస్తూ.. "నాన్నా.. ఇవాళ నేను ఇంకా ఎక్కువ మాట్లాడను. ఈసారి జూలై 10న సినిమానే మాట్లాడుతుంది. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వచ్చే రియాక్షనే మన కష్టానికి సమాధానం చెబుతుంది. అప్పుడే నేను మళ్లీ మాట్లాడతాను" అంటూ అఖిల్ తన స్పీచ్‌ను ముగించారు.     Akhil Akkineni, Lenin Event, Tirupati, TeluguOne  
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రాయలసీమ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (Lenin). ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక తిరుపతి వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కింగ్ అక్కినేని నాగార్జున వేదికపై చేసిన వ్యాఖ్యలు అక్కినేని అభిమానుల్లో సరికొత్త జోష్ నింపాయి. ముందుగా కొండపై ఉన్న వేంకటేశ్వర స్వామికి, ప్రేక్షక దేవుళ్లకు నమస్కారాలు తెలియజేస్తూ నాగార్జున తన ప్రసంగాన్ని ఎంతో ఎమోషనల్‌గా ప్రారంభించారు. ఈ సినిమా కథ తన వద్దకు వచ్చినప్పటి నుండి, సినిమా చూసే వరకు తనకు కలిగిన అనుభూతులను ఆయన పంచుకున్నారు. డైరెక్టర్ మురళీ కిషోర్ (నందు) మొదట ఈ కథ చెప్పడానికి తన వద్దకు వచ్చినప్పుడు, ఇది 'శ్రీరామాపురం' నేపథ్యంలో జరిగే కథ అని చెప్పగానే తనకు ఒక తెలియని సెంటిమెంట్ కనెక్ట్ అయిందని నాగార్జున వెల్లడించారు. ఎందుకంటే శ్రీరామాపురం అనేది అక్కినేని నాగేశ్వరరావు గారు పుట్టిన ఊరి పేరు అన్నారు. అందుకే ఆ పేరు వినగానే కథ వినాలనే కుతూహలం పెరిగిందని చెప్పారు. అలా నందు కథ చెప్పడం ప్రారంభించాక, అందులోని క్యారెక్టరైజేషన్స్, విభిన్నమైన ఎమోషన్స్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని నాగార్జున ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రపంచంలో ప్రేమను మించిన పెద్ద ఎమోషన్ లేదని, ప్రేమ కోసం రాజ్యాలు కూలిపోయాయని, యుద్ధాలు జరిగాయని చెబుతూ, ఈ 'లెనిన్' చిత్రంలో కూడా ఒక అద్భుతమైన ప్రేమకథ ఉందని నాగార్జున పేర్కొన్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన భాగ్యశ్రీ (భారతి) నటనను ఆయన ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. భారతి పాత్ర కోసం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చనేంతగా ఆమె అద్భుతంగా నటించిందని, ఆమె ఈ సినిమాకు హార్ట్ బీట్ లాంటిదని కొనియాడారు. అలాగే తనతో ఎప్పటి నుంచో జర్నీ ఉన్న శివాజీ, బ్రహ్మాజీ, సునీల్ వంటి నటీనటులు ఈ సినిమాలో భాగం కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, వీరంతా సినిమాపై ఉన్న ప్రేమతో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారని అభినందించారు. చిత్ర నిర్మాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ గురించి మాట్లాడుతూ.. మీరు చింటూ అన్న అని పిలుస్తారు కదా అంటూ ఫ్యాన్స్ లో జోష్ పెంచారు. నాగవంశీకి మాస్ పల్స్ ఏంటో బాగా తెలుసని ప్రశంసించారు. నాగవంశీకి ఈ సినిమాపై ఎంతటి గట్టి నమ్మకం ఉందంటే, ఆంధ్రప్రదేశ్ టోటల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఆయనే చూసుకుంటున్నారని నాగార్జున అన్నారు. చివరగా తన కుమారుడు అఖిల్ అక్కినేని గురించి నాగార్జున మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. అఖిల్ ఇప్పటివరకు అన్ని అర్బన్ క్లాస్ సినిమాలు చేశాడని, ఈ సీమ మట్టి కథలో, సీమ మనుషుల నేపథ్యంలో జరిగే రా అండ్ రస్టిక్ పాత్రకు అతను సెట్ అవుతాడా లేదా అని మొదట్లో తనకు చాలా పెద్ద భయం ఉండేదని నిజాయితీగా ఒప్పుకున్నారు. ఇది సీమలో జరిగే ఒక 'మహాభారతం' లాంటి కథ అని అభివర్ణించారు. కానీ సినిమా చూసిన తర్వాత తాను మాత్రమే కాదు, అందరూ ఆశ్చర్యపోయేలా అఖిల్ అద్భుతంగా నటించాడని గర్వంగా చెప్పారు. స్క్రీన్ మీద మీకు అఖిల్ కనిపించడని, కేవలం 'లెనిన్' మాత్రమే కనిపిస్తాడని అన్నారు. థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకులు లెనిన్ స్నేహాన్ని, అతని ప్రేమను, అతని పగను గుండెలకు హత్తుకుని ఇంటికి తీసుకెళ్తారని భరోసా ఇచ్చారు. తన తండ్రి ఏఎన్నార్ ఎప్పుడూ చెప్పే 'ప్రేక్షక దేవుళ్ల' ఆశీస్సులు తమకు ఉంటాయని నమ్ముతూ, "జూలై 10న వస్తున్నాం... మనవాడు గట్టిగా కొడుతున్నాడు" అంటూ నాగార్జున హై వోల్టేజ్ స్పీచ్‌తో అభిమానుల్లో పూనకాలు తెప్పించారు.     Akhil Akkineni, Lenin Event, Tirupati, Nagarjuna Speech, TeluguOne  
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ వివాదం రాజుకుంటుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా రాజకీయాలు, సినీ రంగానికి సంబంధించిన వ్యక్తుల మధ్య జరిగే మాటల యుద్ధాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతుంటాయి. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌, నిర్మాత బండ్ల గణేష్ మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన ఒక పెద్ద వివాదం ఇప్పుడు సోషల్ మీడియాను తీవ్రంగా ఊపేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ చేసిన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలకు, బండ్ల గణేష్ అంతే ఘాటుగా సమాధానమిస్తూ వేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఈ తీవ్రమైన చర్చ ఇండస్ట్రీలోనూ, సాధారణ ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల ఒక వివాదాస్పద కేసులో యూట్యూబర్ 'రావణ్' అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ అరెస్ట్, కోర్టు బెయిల్ అంశాలపై నటుడు ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏంటీ నాటకం, దౌర్జన్యం? ఒక కేసులో అరెస్ట్ చేస్తారు, కోర్టు బెయిల్ ఇస్తుంది. మళ్లీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారు, మళ్లీ కోర్టు బెయిల్ ఇస్తుంది. ఇలా వరుసగా అరెస్ట్ చేయడం, కోర్టులు బెయిల్ ఇవ్వడం చూస్తుంటే కోర్టు ఏం చెబుతోందో మీకు అర్థం కావడం లేదా? మీరు పెడుతున్నవి తప్పుడు కేసులు, అరెస్ట్ చేయొద్దని కోర్టులు చెబుతున్నా వినరా? ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజల కోసం ఇందుకేనా అధికారంలోకి వచ్చింది? ఏంటీ కక్ష సాధింపు? ఇంత ఓపెన్‌గా, ఇంత సిగ్గు లేకుండా, ఇంత అహంకారమా? దేశం మొత్తం ఈ పరిణామాలను చూస్తోంది. మీరు చేస్తోంది ముమ్మాటికీ తప్పు. మేము ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్‌కు మద్దతుగా నిలబడతాం’’ అంటూ ఏపీ ప్రభుత్వంపై అత్యంత తీవ్రమైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యల వీడియోపై నిర్మాత బండ్ల గణేష్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రకాష్ రాజ్ ప్రవర్తనను పూర్తిగా తప్పుబడుతూ ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘నువ్వు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావో అర్థం కావడం లేదు. ఎవరి మెప్పు కోసం ఈ డ్రామా? ముందు నీ స్థాయి, నీ బాధ్యత, నీ వ్యక్తిత్వం ఏమిటో ఒకసారి అద్దంలో చూసుకుని, నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో. అవసరానికి మించి అతిగా ప్రవర్తించడం గొప్పతనం కాదు. ప్రపంచాన్ని నువ్వే నడిపిస్తున్నట్టు, దేశ భవిష్యత్తు అంతా నీ భుజాల మీదే ఉన్నట్టు ప్రవర్తించడం హాస్యాస్పదంగా ఉంది. నీ అహంకారం, నీ అతి చూసి.. జాలి కంటే అసహ్యమే ఎక్కువగా కలుగుతోంది. కాస్త వినయం నేర్చుకో. హద్దులు దాటి ప్రవర్తిస్తే గౌరవం పెరగదు, ఉన్న గౌరవం కూడా పోతుంది’’ అంటూ బండ్ల గణేష్ అత్యంత కఠినమైన పదాలతో హితవు పలికారు. బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్‌కు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోంది. చాలా మంది నెటిజన్లు బండ్ల గణేష్ వ్యాఖ్యలను సమర్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో సమాజంలో ఎన్నో పెద్ద సంఘటనలు, ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు లేవని ప్రకాష్ రాజ్ నోరు, ఇప్పుడు కేవలం ఈ ‘రావణ్’ అనే వివాదాస్పద వ్యక్తి విషయంలో మాత్రమే ఎందుకు లేస్తుంది? అంటూ ప్రజలు కూడా ప్రకాష్ రాజ్‌ను సోషల్ మీడియా వేదికగా గట్టిగా ప్రశ్నిస్తున్నారు. అభివ్యక్తి స్వేచ్ఛ పేరుతో తప్పు చేసిన వారిని వెనకేసుకురావడం సరికాదని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు, బండ్ల గణేష్ ఇచ్చిన ఈ కౌంటర్ ఇప్పుడు టాలీవుడ్‌లో సరికొత్త రాజకీయ, సినీ వివాదానికి తెరలేపింది. ఈ వివాదం ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.       Bandla Ganesh, Prakash Raj, AP Government, Youtuber Raavan, Bandla Ganesh Twitter, Prakash Raj Comments, Tollywood Controversies
టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా కాంబినేషన్‌లో వచ్చిన సరికొత్త సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్'. జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ప్రయోగాత్మక చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడైన వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి రోజే ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా 1.40 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించగా, ఓవర్సీస్‌లో 1.50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దీంతో కేవలం ఒకే ఒక్క రోజులో ప్రపంచవ్యాప్తంగా 3.11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా నైట్ షోలలో ఏకంగా 38.08 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్‌కు నిదర్శనంగా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన సక్సెస్ మీట్‌లో హీరో సత్యదేవ్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ సక్సెస్ మీట్ వేదికగా సత్యదేవ్ మాట్లాడుతూ, "అది నాకు కొత్త కాదు.. నేను ఎప్పుడూ సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్‌షిప్) చేస్తుంటాను" అంటూ ఒక షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. సత్యదేవ్ నోట ఈ మాట వినగానే ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. అయితే ఆయన అన్న మాటల వెనుక ఉన్న అసలు అర్థాన్ని ఆ తర్వాత ఆయనే స్వయంగా వివరించారు. తాను నిజ జీవితంలో ఎంచుకునే విభిన్నమైన పాత్రల గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టం చేశారు. ఒక నటుడిగా తాను చేసే ప్రతి క్యారెక్టర్‌తోనూ మానసికంగా ప్రయాణం చేస్తానని, ఆ పాత్రలోనే లీనమై జీవిస్తానని చెప్పారు. 'రావు బహదూర్' సినిమాలో తాను పోషించిన భువనరామప్ప రావు బహదూర్ పాత్ర కూడా తన గుండెకు అంతగా హత్తుకుపోయిందని, అందుకే ఆ క్యారెక్టర్‌తో తాను సహజీవనం చేశానని ఎమోషనల్‌గా వివరించారు. ఈ చిత్రంలో సత్యదేవ్ 1968 నుండి 1991 వరకు సాగే విభిన్న కాలక్రమాల్లో, యువకుడి నుండి లివర్ క్యాన్సర్ చివరి దశలో ఉన్న వృద్ధుడి వరకు రకరకాల మేకోవర్లలో కనిపించి అద్భుతమైన నటనను కనబరిచారు. 169 నిమిషాల నిడివి గల ఈ క్లిష్టమైన సైకలాజికల్ డ్రామాలో ఒకే గదికి పరిమితమైన రాజుగా, భ్రమలు, అనుమానాలతో సతమతమయ్యే వ్యసనపరుడిగా సత్యదేవ్ నటన కెరీర్ బెస్ట్ అనిపించుకుంటోంది. ఈ పాత్ర తనను మానసికంగా ఎంతో ప్రభావితం చేసిందని, అందుకే షూటింగ్ పూర్తయినా ఆ మూడ్ నుండి బయటకు రావడానికి సమయం పట్టిందని ఆయన పేర్కొన్నారు. కేవలం సంచలనం కోసమే కాకుండా, ఒక నటుడిగా పాత్రలపై తనకు ఉండే అంకితభావాన్ని చాటిచెప్పడానికే సత్యదేవ్ ఈ రకమైన పోలికను ఉపయోగించారు. మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రం కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా సమాజంలో ఉన్న కుల వ్యవస్థ, రంగు, రక్తసంబంధాల పిచ్చిని బలంగా ప్రశ్నిస్తోంది. వికాస్ ముప్పాల, దీపా థామస్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం తెలుగు సినిమా సరిహద్దులను విస్తరిస్తోందని సత్యదేవ్ ధీమా వ్యక్తం చేశారు. ఏదేమైనా, సక్సెస్ మీట్‌లో సత్యదేవ్ ప్లే చేసిన ఈ 'సహజీవనం' వర్డ్ ట్రిక్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.     Satyadev, Rao Bahadur, Rao Bahadur Box Office Collections, Venkatesh Maha, Satyadev Live In Relationship Comments, Rao Bahadur Success Meet
బాలీవుడ్ ప్రముఖ నటి సెలీనా జైట్లీ తన వైవాహిక జీవితంలోని అత్యంత చీకటి కోణాన్ని బయటపెట్టి అందరినీ షాక్‌కు గురిచేసింది. మంచు విష్ణు సరసన 'సూర్యం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల తార, 2010లో ఆస్ట్రియన్ వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ను వివాహం చేసుకుని విదేశాల్లో స్థిరపడింది. అందరూ ఆమె జీవితం చాలా అందంగా సాగిపోతోందని అనుకున్నారు, కానీ ఆమె అంతరంగంలో ఒక పెద్ద పీడకలను అనుభవించింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ సినీ పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో, ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న నరకాన్ని గుర్తుచేసుకుని ఒక ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకుంది. తన 15వ వెడ్డింగ్ యానివర్సరీకి కొన్ని రోజుల ముందు జరిగిన ఒక దారుణమైన సంఘటనను సెలీనా గుర్తుచేసుకుంది. ఒకరోజు ఆమె భర్త పీటర్ హాగ్ ఆమెను కొండ కింద రోడ్డుపైనే కార్లో నుంచి దించేసి వెళ్ళిపోయాడు. సెలీనా నడుచుకుంటూ కొండపై ఉన్న తన ఇంటికి చేరుకునే సరికి, ఆమె కవల పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు. అదే సమయంలో ఆస్ట్రియా మునిసిపాలిటీ లేదా రెసిడెన్స్ స్టేటస్‌కి సంబంధించిన ఏదో లేఖ వచ్చిందని ఆమె భావించింది. దాన్ని అనువదించి చదివే ఓపిక లేక, తన కవల పిల్లల చేతికి ఇచ్చి చదవమని చెప్పింది. కానీ ఆ లేఖలో ఉన్నది పెళ్లి రోజు బహుమతి నెపంతో పంపిన విడాకుల నోటీసు అని తెలిసి ఆమె గుండె పగిలిపోయింది. తన చిన్న పిల్లల నోటి నుంచే ఆ ఘోరమైన విడాకుల నోటీసును వినాల్సి రావడం ఆమె జీవితంలో మర్చిపోలేని ఒక పెద్ద గాయంగా మిగిలిపోయింది. ఆ నోటీసులో ఆమెపై ఎన్నో అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ, పెళ్లి బంధం పూర్తిగా విచ్ఛిన్నమైందని పేర్కొన్నారు. కోర్టు మొదటి విచారణ తర్వాత, నవంబర్ వరకు ఇద్దరూ సామరస్యంగా విడిపోయేందుకు ప్రయత్నించాలని జడ్జి సూచించారు. ఆ సమయంలో సెలీనా బ్యాంక్ ఖాతాలో చాలా తక్కువ డబ్బు ఉంది. భర్త మానసికంగా, ఆర్థికంగా తీవ్రంగా వేధిస్తున్న ఆ రోజులు ఆమెకు ఒక నరకంలా అనిపించాయి. అయినా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆమె స్నేహపూర్వకంగానే విడిపోవడానికి అంగీకరించింది. తనకు భర్త ఆస్తి వద్దు, కేవలం తాను కష్టపడి సంపాదించి పెట్టుబడిగా పెట్టిన డబ్బు, తన సొంత ఆస్తులు వెనక్కి ఇస్తే చాలని, పిల్లల ఉమ్మడి సంరక్షణ బాధ్యత ఇస్తే చాలని కోరింది. కానీ ఆస్ట్రియాలోని ఆ ఇంట్లో భర్త పై అంతస్తులో ఉంటే, సెలీనా పిల్లలతో కలిసి మధ్య అంతస్తులో చాలా కాలం ఒంటరిగా పోరాటం చేయాల్సి వచ్చింది. పిల్లల కోసం అక్కడే ఉండాలంటే ఉద్యోగం చేయాలని భర్త ఒత్తిడి తెచ్చాడు. అంతటితో ఆగకుండా "నీకు సూపర్ మార్కెట్‌లో క్లీనర్ ఉద్యోగం ఇప్పిస్తాను" అంటూ అవమానించాడు. ఏ ఉద్యోగమూ తక్కువ కాదు కానీ, ఒక స్టార్ హీరోయిన్‌గా ఉన్న ఆమెను అలా అనడం వెనుక ఆమెను మానసికంగా దెబ్బతీయాలనే కుట్ర దాగి ఉంది. ఇవన్నీ భరిస్తున్న సమయంలోనే, ఇండియాలో ఆమె కష్టపడి కొనుక్కున్న ఆస్తులను కూడా విక్రయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసి ఆమె షాక్‌కు గురైంది. తనకు ఏమీ మిగల్చకుండా రోడ్డున పడేయాలని చూస్తున్నారని గ్రహించి, 2025 అక్టోబర్ 11న అర్ధరాత్రి 1 గంటకు ఆస్ట్రియా నుంచి పిల్లలను వదిలి ఒంటరిగా ఇండియాకు పారిపోయి వచ్చింది. భారతదేశానికి వచ్చినప్పుడు ఆమెకు కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదు. దాదాపు 10 రోజుల పాటు ఒక హోటల్‌లోనే గడపాల్సి వచ్చింది. ఆ తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందుల సమయంలో బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో పాటు మరికొందరు నమ్మకమైన స్నేహితులు అందించిన మద్దతుతోనే ఆమె మళ్లీ తన జీవితాన్ని సున్నా నుంచి ప్రారంభించగలిగింది. 2010 లో పెళ్లయ్యాక 2012 లో విన్‌స్టన్, విరాజ్ అనే కవలలు, ఆ తర్వాత 2017 లో ఆర్థర్ జన్మించారు. గతంలో షంషేర్ అనే మరో కుమారుడు గుండె సంబంధిత వ్యాధితో చనిపోవడం ఆమెను మరింత కుంగదీసింది. 2025 నవంబర్‌లో ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టులో గృహహింస, క్రూరత్వం కింద కేసు నమోదు చేసిన సెలీనా, ప్రస్తుతం తన ముగ్గురు పిల్లల కోసం న్యాయపోరాటం చేస్తోంది. ఆస్ట్రియా కోర్టు జాయింట్ కస్టడీ ఇచ్చినప్పటికీ, పిల్లలకు తల్లిపై విషం నూరిపోస్తూ కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడనివ్వడం లేదని సెలీనా జైట్లీ ఆవేదన వ్యక్తం చేసింది.       Celina Jaitly, Celina Jaitly divorce, Peter Haag domestic violence, Celina Jaitly children, Bollywood celebrity divorce, Celina Jaitly interview
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒకే నటుడు బహుళ పాత్రలు పోషించడం ఎప్పుడూ ఒక పెద్ద సంచలనమే. గతంలో నటనకు నిలువెత్తు రూపం లాంటి దివంగత మహానటుడు శివాజీ గణేశన్ 'నవరాత్రి' సినిమాలో తొమ్మిది పాత్రలు పోషించి అప్పట్లో ఒక అరుదైన మైలురాయిని సృష్టించారు. ఆ తర్వాత లోకనాయకుడు, విశ్వనటుడు కమల్ హాసన్ 'దశావతారం' చిత్రంలో ఏకంగా 10 విభిన్న పాత్రల్లో ఒదిగిపోయి యావత్ సినీ ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేశారు. ఎన్నో  సంవ‌త్స‌రాలుగా చెక్కుచెదరకుండా ఉన్న కమల్ హాసన్ 10 పాత్రల రికార్డును బ్రేక్ చేసేందుకు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీయెస్ట్ స్టార్ కమెడియన్‌గా దూసుకుపోతున్న యోగి బాబు సరికొత్త సాహసానికి తెరలేపారు. ఊహించని విధంగా ఒకే సినిమాలో ఏకంగా 11 విభిన్న పాత్రలతో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఆయన సిద్ధమయ్యారు. తనదైన మేనరిజం, డిఫరెంట్ హెయిర్ స్టైల్, టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించే యోగి బాబు.. ఈసారి కేవలం నవ్వించడమే కాదు, తనలోని నటుడిని సరికొత్తగా ఆవిష్కరించేందుకు రెడీ అయ్యారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా యోగి బాబు కామెడీ పాత్రలకే పరిమితం కాకుండా.. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా అంటే హీరోగా మరియు విలన్‌గా రెండు ప్రధాన పాత్రలతో పాటు మరో తొమ్మిది ఇతర విభిన్న పాత్రలలో కనిపించనున్నారు. మొత్తం 11 పాత్రల్లోనూ వేర్వేరు బాడీ లాంగ్వేజ్, విభిన్నమైన లుక్స్ మరియు ప్రత్యేకమైన యాసలతో మాట్లాడటం ఈ సినిమా యొక్క ప్రధాన ఆకర్షణ కానుంది. ఇందులో కొన్ని కవల పిల్లల క్యారెక్టర్లు కూడా ఉండటం విశేషం. ఒకే నటుడు 11 పాత్రల్లో మెప్పించడం అంటే మామూలు విషయం కాదు, కానీ యోగి బాబు ఈ భారీ ఛాలెంజ్‌ను స్వీకరించి ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురిచేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆర్. కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడిగా ఆయనకు ఇది మొదటి సినిమా కావడం విశేషం. ఈ సినిమా కథాంశం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఇది హై-ఎనర్జీతో సాగే యాక్షన్ కామెడీ థ్రిల్లర్ అని తెలిపారు. ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక సైనిక హెలికాప్టర్ ప్రమాదానికి గురవుతుందని, ఆ హెలికాప్టర్‌లోని అత్యంత కీలకమైన 'బ్లాక్ బాక్స్'ను కనుగొనే ప్రయత్నంలో సాగే ప్రయాణమే ఈ సినిమా అని వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను కనుగొనడానికి బయలుదేరిన హీరో ఎదుర్కొనే సవాళ్లను వినోదం మరియు యాక్షన్ అంశాలతో తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. పాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో విడుదల కానున్న ఈ భారీ చిత్రంలో మలయాళ నటి అదితి రవి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రెడిన్ కింగ్స్లీ, విటివి గణేష్, పంజు సుబ్బు, ఎ. వెంకటేష్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు జి. బాలమురుగన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, 'తని ఒరువన్' ఫేమ్ గోపి కృష్ణ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ రెండో షెడ్యూల్ షూటింగ్‌ను యునైటెడ్ కింగ్‌డమ్ (ఇంగ్లాండ్) మరియు కెన్యా దేశాల్లో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ధర్మప్రభు, గూర్ఖా, మండేలా వంటి సినిమాలతో మెప్పించిన యోగి బాబు.. ఇప్పుడు 11 పాత్రలతో కమల్ హాసన్ రికార్డును దాటబోతుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.       Yogi Babu 11 roles, Yogi Babu breaks Kamal Haasan record, Dasavathaaram record broken, Yogi Babu new movie, Kollywood movie updates, Yogi Babu hero and villain
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం,  ఈర్ష్య,  అసూయ,  ఓర్చుకోలేని తత్వం ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి వారిని చెడ్డవాళ్లుగా చెబుతూ ఉంటారు.  చాలా వరకు మనుషులు తాము మంచి వాళ్లని, చెడ్డ వాళ్లని బయటకు చెప్పుకోరు.  వారి ప్రవర్తనలో ఇది బయటపడుతూ ఉంటుంది.  ముఖ్యంగా కొందరు వ్యక్తులు మంచి వాళ్ల చుట్టూ చేరి తీయని మాటలతో మోసం చేయాలని చూస్తుంటారు.  వారు ఇలా మోసం చేస్తారని తెలుసుకోలేని పరిస్థితిలో కొందరు ఉంటారు.  తీయని మాటలతో అందరినీ మోసం చేయగల వ్యక్తులు ఎలా ఉంటారు? వారిని కనిపెట్టడం ఎలా?  తెలుసుకుంటే.. ప్రసంశలు.. ఎవరైనా  కలిసిన వెంటనే మితిమీరి పొగడటం మొదలుపెట్టినా లేదా రాత్రికి రాత్రే మిమ్మల్ని ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రకటించినా, జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసే వ్యక్తులు  వారిని గుడ్డిగా నమ్ముతారనే ఆశతో, మొదట్లో  ప్రేమను, పొగడ్తలను కురిపిస్తారు. మీకు వాళ్ల మీద  నమ్మకం ఏర్పడిన తర్వాత, వారి నిజ స్వరూపం బయటపడుతుంది. తప్పు ఒకరిది, అవమానం మరొకరిది.. తీయని మాటలతో మోసం చేసే వ్యక్తుల ముఖ్య లక్షణం ఏమిటంటే, వారు తమ తప్పులను ఎన్నడూ ఒప్పుకోరు . ఒకవేళ మీరు వారు తప్పు చేయడం మీరు గమనించినా, వారు ఆ పరిస్థితిని ఎంత చాకచక్యంగా వాడుకుంటారంటే, చివరికి మీకే అపరాధభావం కలుగుతుంది. మీరు తప్పు చేశారని మీకు అనిపించేలా  చేస్తారు. తమని తాము అనుమానించుకునేలా.. "నేను అలా ఎప్పుడూ అనలేదు," అనడం లేదా..  "నీకే పిచ్చి, అది అసలు ఎప్పుడు జరిగింది, అలాంటిదేం  జరగలేదు." వంటి  మాటలు ఎవరినుండైనా ఎదురవుతూ ఉంటే..  జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఇతరులను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేవారు తరచుగా మీకు ఎంత నమ్మకంగా అబద్ధాలు చెబుతారంటే, మీరు మీ జ్ఞాపకశక్తిని, నిజాయితీని మీరే అనుమానించడం మొదలుపెడతారు. ఇది మనసును నియంత్రించడంలో చాలా ప్రమాదకరమైన పద్ధతి. అయ్యో పాపం అనుకునేలా చేయడం.. పరిస్థితులు ఎలా ఉన్నా, తప్పు ఎవరిదైనా సరే, తియ్యని మాటలతో మోసం చేసే  వ్యక్తులు తామే ప్రపంచంలో చాలా బాధలో ఉన్నవారమన్నట్లుగా కథను చెబుతారు. వారు మీ సానుభూతిని పొందాలని చూస్తారు, తద్వారా మీరు వారి పట్ల జాలిపడి, వారు చెప్పే ప్రతిదానితో ఏకీభవించి వారి గురించి పాపం అనుకునేలా చేస్తారు. ఇష్టమైన వారి నుండి వేరు చేయడం.. మిమ్మల్ని లొంగదీసుకోవాలనుకునే వ్యక్తి, మొదట మిమ్మల్ని మీ నిజమైన స్నేహితులు , కుటుంబ సభ్యుల నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. "మీ కుటుంబం మిమ్మల్ని అర్థం చేసుకోదు" లేదా "మీకు ఉన్నది నేను ఒక్కడినే" అనే ఆలోచనలను  మనసులో నాటుతారు. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని, వారిపై ఆధారపడి ఉన్నారని భావించేలా చేయడానికి వారు ఇలా చేస్తారు. అవసరం.. అవసరానికి మాత్రమే మాట్లాడేవారు, మిగతా సమయాలలో తప్పించుకోవడం లేదా కారణాలు, సాకులు చెప్పి దూరంగా ఉండటం చేసేవారు మోసం చేసే స్వభావం కలిగినవారని అర్థం.  ఇలాంటి వారు తమకు అవసరం వచ్చినప్పుడు  చాలా మంచివారిలా ఉంటారు, కానీ వారి పని పూర్తయిన వెంటనే, మిమ్మల్ని మళ్లీ పట్టించుకోవడం మానేస్తారు . తియ్యగా మాట్లాడేవారిని గుర్తించడం కష్టం, ఎందుకంటే వారు తరచుగా చాలా బాగా నటిస్తారు. కానీ ఎప్పుడూ మీ అంతరాత్మ చెప్పేది వినాలి. ఒక సంబంధం మీకు సంతోషానికి బదులుగా ఎప్పుడూ మానసిక గందరగోళాన్ని, ఒత్తిడిని కలిగిస్తుంటే, హద్దులు పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం.                                    *రూపశ్రీ.
భార్యాభర్తల బంధం విచ్చిన్నం కాకుండా కాపాడే బంగారు సూత్రం! నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం. ఇవి ప్రస్తుతం చాలామంది  ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్ లు. ముఖ్యంగా బార్యాభర్తల బంధం ఈ కాలంలో చాలా బలహీనంగా మారింది.  బంధాలను కాపాడుకోవడం,  మనఃశాంతిగా ఉండటం.. ఈ రెండింటిని ఎలా సమతుల్యం చేసుకోవాలనేదే అతిపెద్ద గందరగోళం. అయితే ఈ విషయానికి సమాధానం లేదా అంటే.. ఖచ్చితంగా ఉంది. బంధాలు నిలబెట్టుకోవడానికి బంగారు సూత్రం ఉంది. అదేంటో తెలుసుకుంటే.. బంధాలకు బంగారు సూత్రం.. నేటి వివాహాలు, సంబంధాలలో ఉన్న అతిపెద్ద బలహీనతను  ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోకపోవడమే.  బంధం బాగుండాలంటే బంధం ముడిపడేవరకు  కళ్ళు తెరిచి ఉండాలి, కానీ బంధం ముడిపడిన తర్వాత కళ్లు మూసుకుని ఉండాలట. ఈ విషయాన్ని  స్వయానా సినీ నటుడు, రచయిత, ఆధ్యాత్మిక వేత్త అయిన అశుతోష్ రాణా చెప్పుకొచ్చారు.  ఈయన తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించారు.   ఒకరితో సంబంధంలోకి వచ్చాక, కళ్ళు మూసుకోవాలని ఆయన అంటున్నారు. దీని అర్థం ఏమిటంటే, ఒక సంబంధం ఏర్పడిన తర్వాత, ప్రతి చిన్న లోపాన్ని పట్టుకుని విమర్శించడం లేదా ఫిర్యాదు చేయడం కంటే, కొన్ని విషయాలను పట్టించుకోకుండా ఉండటం ముఖ్యమని అర్థం. ఈ ప్రపంచంలో ఏ మనిషి అన్ని విషయాలలోనూ పర్పెక్ట్ గా ఉండరు.  ప్రతి ఒక్కరిలోనూ కొన్ని చెడు అలవాట్లు, తప్పు చేసే స్వబావం, కొన్ని లోపాలు ఉంటాయి.   భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు, అగ్ని ఎల్లప్పుడూ పొగతో కప్పబడి ఉన్నట్లే, ప్రతి మనిషిలోనూ, ప్రతి చర్యలోనూ ఏదో ఒక లోపం లేదా దోషం ఉంటుందని పేర్కొన్నాడు. వివాహం విషయానికి వస్తే..  సీతాదేవి , శ్రీరాముని జీవితంలో కనిపించేది  సమతుల్యత. అక్కడ వివాహానికి ముందు రాముడి  యోగ్యతను పరీక్షించినప్పటికీ, వివాహం తర్వాత వారిద్దరూ ఒకరి పరిమితులను మరొకరు అంగీకరించి, ప్రేమ , కర్తవ్యానికి మాత్రమే ఎక్కువ  ప్రాధాన్యతనిచ్చారు. ఈ రోజుల్లో పెళ్లి తర్వాత చాలామంది తమ భాగస్వాములను మార్చుకోవాలని ప్రయత్నించడం వల్ల సంబంధాలు త్వరగా నాశనం అవుతున్నాయనేది చాలా మంది అర్థం చేసుకోరు, అయితే సగం కళ్ళు మూసుకోవడం అంటే ఉదాసీనత కాదు, అది ఎదుటి వ్యక్తిలోని లోపాలను అంగీకరించే పరిణతి. ప్రతి వ్యక్తకి తమ సమస్యలకు పరిష్కారాలు తమలోనే ఉంటాయి. కానీ వచ్చిన చిక్కల్లా తమని తాము విమర్శ చేసుకోలేక పోవడం, అలాగే..  తమకు నచ్చిన విధంగానే పరిష్కారం జరగాలని అనుకోవడం. ఇదే చాలామంది సమస్యలు పెద్దవి అవడానికి,  మనఃశాంతి లేకపోవడానికి దారి తీస్తుంది.  బందం బలంగా ఉండాలంటే చిన్న విషయాలను పట్టించుకోవడం మానెయ్యాలి. అదే బంగారు సూత్రం.                                           *రూపశ్రీ.  
ప్రపంచంలో ఈ దేశాలు ఎంతో స్పెషల్.. జిమ్ లేకుండానే వందేళ్ళ ఆయుష్షు వారి సొంతం..! ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు. అయితే ేటి వేగవంతమైన కాలంలో ఇది సాధ్యం కాదని అనిపిస్తుంది.   కాలం గడిచేకొద్దీ అనారోగ్యాలు చుట్టుముడతాయి,   లేదా శరీరం  బలహీనపడతుంది, చురుగ్గా ఉండలేకపోతాము, ఈ ప్రపంచంలో 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంటూ, ఎలాంటి సమస్యలు లేకుండా తమ పనులన్నీ చేసుకుంటున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే ఇలాంటి వారు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా కొన్నిదేశాలలోనే ఎక్కువగా ఉన్నారు.  ఆ దేశాలు ఏంటి? ఆ దేశాలలో ప్రజలు ఎందుకు 100ఏళ్లు బ్రతకగలుగుతున్నారు? తెలుసుకుంటే.. బ్లూ జోన్స్.. ప్రపంచవ్యాప్తంగా సాధారణ జనాభా కంటే ఎక్కువ మంది 100 సంవత్సరాలు జీవించే ప్రాంతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాంతాలను "బ్లూ జోన్స్" అని పిలుస్తారు. జపాన్‌లోని ఒకినావా, ఇటలీలోని సర్డీనియా, గ్రీస్‌లోని ఇకేరియా, కోస్టారికాలోని నికోయా , యునైటెడ్ స్టేట్స్‌లోని లోమా లిండా ప్రాంతాలలో నివసించే ప్రజలకు విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ, వారి జీవనశైలిలో అలవాట్లు,  వారి జీవనవిధానం చాలా దగ్గరగా ఉంటుంది. వృద్ధాప్యానికి గురించిన రహస్యాలను విజ్ఞానశాస్త్రం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. ప్రతి ఏటా కొత్త విషయాలు వెలుగు చూస్తూనే  ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఉన్న ఆధారాలన్నీ ఒకే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.  దీర్ఘాయువు కోసం ఒక్క అద్భుత సూత్రం అంటూ ఏదీ లేదు.  కొన్నిరోజులు, నెలలు, ఏళ్ల పాటు పాటించిన అలవాట్లు, తీసుకున్న జాగ్రత్తలు,  జీవనవిధానం మీద ఇది ఆధారపడి ఉందని అంటున్నారు.                             *రూపశ్రీ.  
పురుషుల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేసే సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు. అయితే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి ముదిరే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ యూరాలజిస్టు, ఆండ్రాలజిస్టు డా. ఏవి రవి కుమార్ పురుషుల్లో ఎక్కువగా కనిపించే ఐదు ప్రధాన క్యాన్సర్ల గురించి సులభంగా వివరించారు. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, వృషణాల క్యాన్సర్, పురుషాంగ క్యాన్సర్ వంటి వ్యాధుల లక్షణాలు, ప్రమాద కారకాలు, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి అనే అంశాలను తెలియజేశారు.  అలాగే చాలామందికి ఉండే సందేహమైన యూరాలజీ (Urology) మరియు ఆండ్రాలజీ (Andrology) మధ్య ఉన్న తేడాను కూడా స్పష్టంగా వివరించారు. మూత్ర సంబంధిత వ్యాధులు, పురుషుల లైంగిక ఆరోగ్యం, సంతానలేమి సమస్యలు, ప్రోస్టేట్ సమస్యలు వంటి సందర్భాల్లో ఏ నిపుణుడిని సంప్రదించాలో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చు.  పురుషులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు? క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు ఎందుకు అవసరం? వంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియోలో డా. ఏవి రవి కుమార్ వివరించారు.  ప్రతి పురుషుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆరోగ్య సమాచారం కోసం ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.   మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అలవాటుగా , రోజును మొదలుపెట్టడానికి మంచి ఎనర్జీ డ్రింక్ గా కూడా భావిస్తారు. ఉదయం లేవగానే టీ తాగడం, పనిలో బ్రేక్  సమయంలో టీ తాగడం, సాయంత్రం స్నేహితులతో కలిసి టీని ఎంజాయ్ చేయడం.. ఇలా దాదాపు ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ లో టీ  ఒక భాగం. కొందరు టీ తాగనిది ఏ పని చేయలేరు.. టీ తాగడం అనేది ఒక పెద్ద బలహీనతగా మారినవాళ్లు ఉంటారు. కానీ  ఒక నెల పాటు టీ తాగడం మానేస్తే  శరీరంలో జరిగే మార్పుల గురించి చాలా మందికి తెలియదు.  కనీసం ఒక నెలరోజుల పాటు టీ తాగడం మానేస్తే అద్భుతాలు జరుగుతాయని  ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..  నిద్ర నాణ్యత.. టీలోని కెఫీన్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేసి, మెదడును చురుకుగా ఉంచుతూ, నిద్ర పట్టే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. టీ తాగడం మానేసినప్పుడు, శరీరంలో కెఫీన్ ప్రభావం క్రమంగా తగ్గుతుంది. ఇది త్వరగా నిద్రపోవడానికి సహాయపడటమే కాకుండా, నిద్ర గాఢతను కూడా మెరుగుపరుస్తుంది.  టీ మానేసిన తర్వాత రాత్రిపూట తరచుగా వచ్చే నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుందని చాలా మంది చెబుతారు. ఎసిడిటి, గ్యాస్.. ఎక్కువగా టీ తాగడం వల్ల కడుపులో ఆమ్లం ఉత్పత్తి పెరిగి, అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.  ముఖ్యంగా ఖాళీ కడుపుతో టీ తాగడం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.   టీ మానేయడం వల్ల, కడుపులోని ఆమ్లం బ్యాలెన్స్ మెరుగుపడి, జీర్ణక్రియ క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. దీనివల్ల కడుపు తేలికగా, సౌకర్యవంతంగా అనిపిస్తుంది. దంత ఆరోగ్యం.. టీలోని టానిన్లు దంతాలు మరకలు పడటానికి . పసుపు రంగులోకి మారడానికి కారణమవుతాయి. ఎక్కువ కాలం పాటు అధికంగా టీ తాగడం వల్ల దంతాల మెరుపు తగ్గుతుంది. టీ మానేయడం వల్ల దంతాలపై కొత్తగా మరకలు ఏర్పడటం తగ్గి, నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.  క్రమం తప్పకుండా బ్రష్ చేయడం వల్ల దంతాలు శుభ్రంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఒత్తిడి, ఆందోళన.. అధిక మోతాదులో కెఫిన్ తీసుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి, ఆందోళన, చంచలత్వం , భయం వంటి సమస్యలు ఏర్పడతాయి. టీ మానేసిన తర్వాత మనసు మరింత ప్రశాంతంగా ఉంటుంది, అలాగే మూడ్ స్వింగ్స్ కూడా తగ్గుతాయి. ఇది మానసిక స్థిరత్వాన్ని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. చర్మం..  టీకి బదులుగా నీరు , ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం  వల్ల, టీ మానేయడం వల్ల  శరీరం మరింత హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది.  తేమ పెరగడం వల్ల చర్మం మరింత కాంతివంతంగా, తాజాగా కనిపిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను తగ్గించడం వల్ల పొడిబారడం, కాంతిహీనత వంటి చర్మ సమస్యలను కూడా నయం అయ్యి,  చర్మం మెరుపు పెరుగుతుంది. గుండె ఆరోగ్యం.. అధికంగా కెఫిన్ తీసుకోవడం కొంతమందిలో రక్తపోటు , హృదయ స్పందన రేటుపై ప్రభావం చూపుతుంది. టీ తాగడాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతారు.                                     *రూపశ్రీ.
కుక్కర్‌లో ప్రతి ఫుడ్‌ని ఉడికించేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్, హోలిస్టిక్ లైఫ్‌స్టైల్ నిపుణురాలు శ్రీదేవి జాస్తి ఈ ఇంటర్వ్యూలో వివరించారు. ప్రతిరోజూ తినే ఆహారంలో కొంత భాగమైనా రా ఫుడ్‌కు కేటాయించాలని ఆమె సూచిస్తున్నారు. ముఖ్యంగా మొలకలు (Sprouts), తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి సహజ ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు మరింత సహజ రూపంలో అందుతాయని ఆమె చెబుతున్నారు. అలాగే ప్రతి ఆహార పదార్థాన్ని ప్రెషర్ కుక్కర్‌లో ఎక్కువసేపు ఉడికించడం అలవాటుగా మార్చుకోవద్దని, ఏ ఆహారాన్ని ఎలా తీసుకుంటే శరీరానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకుని ఆ విధంగా వంట చేయాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సహజ ఆహారం, సరైన వంట విధానాలు, రోజువారీ డైట్‌లో రా ఫుడ్ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)