మమతాబెనర్జీ హౌస్ అరెస్టు?!

posted on: Jul 6, 2026 9:31AM

పశ్చిమ బెంగాల్ లో పొటిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్ కు చేరింది. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని హౌస్ అరెస్టు చేశారంటూ టీఎంసీ నేతల ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.  దక్షిణ 24 పరగణాల జిల్లా బారుయిపూర్‌లో హత్యాచారానికి  గురైన  12 ఏళ్ల బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి మమతా బెనర్జీ వెళ్లకుండా అడ్డుకునేందుకు ఆమెను హౌస్ అరెస్టు చేశారని టీఎంసీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రిని, ఆమె సొంత రాష్ట్రంలోనే కదలకుండా నిర్బంధించడం దారుణమని మండిపడుతున్నాయి. 

కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని  మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద   భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.  మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను  టీఎంసీ ఎంపీలు ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, మహువా మొయిత్రా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  బాధితురాలి కుటుంబాన్ని కలిసి పరామర్శించకుండా అడ్డుకోవడానికే  సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ మమతను హౌస్ అరెస్టు చేశారని వారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఏడుసార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించి,   మూడుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన సీనియర్ నాయకురాలి పట్ల   అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణమని మహువా మొయిత్రా విమర్శించారు.  

ఇలా ఉండగా,   బారుయిపూర్ లో మైనర్ బాలికపై హత్యాచార   ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను  అరెస్ట్ చేశారు. ఈ  కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్  ఏర్పాటు చేశామని, దోషులను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మమతా బెనర్జీ  గృహనిర్బంధం ఆరోపణలను   టీఎంసీ ఆడుతున్న రాజకీయ నాటకాలుగా  ప్రభుత్వం కొట్టిపారేసింది.  

MC leaders allegations, West Bengal politics, Mahua Moitra, Baruipur case

google-ad-img
    Related Sigment News
    • Loading...