LATEST NEWS
ఎగ్జిట్ పోల్స్ సర్వేలో బిజెపి మంచి మెజారిటీతో గెలుపొందనుందని వెల్లడి కావడంతో  గత అసెంబ్లీ ఎన్నికల ముందు బిఆర్ఎస్ పార్టీతో మెతక వైఖరి ప్రదర్శించిన బిజెపి మరింత కఠినంగా వ్యవహరించాలని చూస్తోంది. తెలంగాణలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నబిజెపి ఇక నుంచి తన వైఖరి మార్చనుంది.  కెసీఆర్ టార్గెట్ గా బిజెపి రాజకీయాలు చేయనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. సగం చచ్చిన పాము బిఆర్ఎస్ ను పూర్తిగా చంపేయాలని  బిజెపి చూస్తోంది. బిఆర్ఎస్ ను ఇరుకున పెట్టేలా కవిత మీద చార్జ్ షీట్ ఫైల్ చేయనుంది.  ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 7వ తేదీ వరకు పొడిగించింది. అంతకుముందు, ఈడీ కేసులో కవిత కస్టడీని వచ్చే నెల 3 వరకు పొడిగించిన న్యాయస్థానం... ఆ తర్వాత సీబీఐ కేసులోనూ ఈ శుక్రవారం వరకు పొడిగించింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ జూన్ 7న కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. మద్యం కేసులో కవిత పాత్రపై ఈడీ ఇటీవల సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీనిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ముఖ్యమంత్రిగా జగన్ అధికారం చివరి కొద్ది గంటలకు చేరుకుంది. బుధవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభం అయ్యే నాటికి మనం జగన్‌ని ‘మాజీ ముఖ్యమంత్రి’ అని అధికారికంగా భావించవచ్చు. దేశవ్యాప్తంగా వున్న దాదాపు 45 సర్వే సంస్థలు ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమిదే అధికారం అని స్పష్టంగా చెప్పాయి. ఓ ఐదు పేటీఎం బ్యాచ్ సంస్థలు మాత్రం వైసీపీకి అధికారం కొనసాగుతుందని చెప్పి తమ తోక ఊపాయి. ఈ భజన సంస్థల సంగతి అలా వుంచితే, గత ఎన్నికలలో జగన్‌కి 150 సీట్లు వస్తాయని చెప్పిన కేకే సంస్థ ఈసారి జగన్‌కి 14 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పింది. మరీ పద్నాలుగు సీట్లేంట్రా దేవుడా అనుకుంటూ వుండగానే, ‘ఓపెన్ టాక్ సర్వే’ అనే సంస్థ అయితే జగన్ పార్టీకి ఏకంగా 11 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పి వైసీపీ గాలి మరీ దారుణంగా తీసిపారేసింది. ఈ 45 సర్వేలను ఎంతమాత్రం నమ్మని వైసీపీ బ్యాచ్, తమ జేబు సంస్థలు ఐదు చెప్పిన సర్వేలే కరెక్ట్ అంటూ భ్రమల్లో బతికేస్తున్నాయి. ఆ భ్రమలన్నీ మంగళవారం నాడు పటాపంచలు అయిపోతాయి అది వేరే సంగతి. ఇదిలా వుంటే, శనివారం ఎగ్జిట్ పోల్స్ వచ్చిన దగ్గర్నుంచి తాడేపల్లి ప్యాలెస్‌లో పరిస్థితి మారిపోయినట్టు సమాచారం. అధికారం చెయ్యి జారిపోతోందని అర్థం చేసుకున్న జగన్ ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా వుండిపోయినట్టు తెలుస్తోంది. తన అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా వేయని పోలీసులు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాగానే, కనీసం తనను సంప్రదించకుండా చంద్రబాబుకి, టీడీపీ కార్యాలయానికి భద్రత పెంచడంతో ఇక పరిస్థితి తన చేయి దాటిపోయిందని జగన్ బాధపడ్డట్టు తెలుస్తోంది. ఇన్ని వేల కోట్లు పంచిపెట్టినా జనం తనను మోసం చేశారని అంటూ  ఒక దశలో జగన్ కన్నీరు పెట్టుకున్నారని కూడా సమాచారం. 
రేవ్ పార్టీ ఉచ్చు బిగుస్తోంది. బెంగుళూరు నుంచి తప్పించుకుని వచ్చినట్లు చెబుతున్న పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు.  సినీ నటి హేమ కోసం బెంగళూరు సీసీబీ పోలీసులు గాలిస్తున్నారు. సీసీబీ పోలీసులు ఆమెకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. బెంగళూరులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ ఆమె విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకోవడానికి సీసీబీ పోలీసులు ఈరోజు హైదరాబాద్ వచ్చారు. నటి హేమ మే 20న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నారు. ఆమె రక్తనమూనాలో డ్రగ్స్ పాజిటివ్‌ను గుర్తించారు. దీంతో విచారణకు రావాలని హేమతో పాటు... రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురికి నోటీసులు ఇచ్చారు. మొదటిసారి గత సోమవారం విచారణకు హాజరు కావాలని, రెండోసారి జూన్ 1న విచారణకు హాజరు కావాలని హేమకు నోటీసులు ఇచ్చారు. కానీ ఆమె సీసీబీ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకాలేదు.
‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు’ ఈ పదాన్ని మళ్ళీ వినడానికి ఇంకా ఎంతో సమయం పట్టదు. ఇప్పటికే  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి హోదా వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అని ఫిక్సయిపోయింది. ఎందుకంటే, ఈ నిర్ణయాన్ని తీసుకుంది వాళ్ళే కదా.. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పోలీసులు అడక్కుండానే భద్రత పెంచారంటేన అసలు విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. సోమవారం టీడీపీ ఏపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబుకు వందలాది మంది కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. అందరూ ‘సీఎం... సీఎం’ అంటూ నినదించారు. సందర్శకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో టీడీపీ కార్యాలయంలో సందడి నెలకొంది. సేమ్ టైమ్ మేమే గెలుస్తామని వైసీపీ నాయకులు బిల్డప్ ఇస్తున్నారుగానీ, ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మాత్రం వెలవెలబోతోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తల్లి  ఆదివారంరాత్రి మృతి చెందింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ ముఖ్య  భూమిక వహించారు.  తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కోర్టు అవకాశమిచ్చింది. కానీ షరతులతో కూడిన బెయిల్ అతనికి మంజూరు చేసింది.  రేపు సాయంత్రం వరకు అతనికి కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఆయన తల్లి సరోజినీదేవి ఆదివారం రాత్రి కరీంనగర్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు ఎస్కార్ట్‌తో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం ఇచ్చింది.
ALSO ON TELUGUONE N E W S
స్వాతిలో ముత్యమంతా ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన.. సందెలో చీకటంతా సిగ్గులా అంటుకుంది లోనలోనా.. నందమూరి బాలకృష్ణ (balakrishna)హీరోగా  1993 లో వచ్చిన బంగారు బుల్లోడు మూవీలోనిది ఈ పాట.. ఇందులో బాలయ్య వేసిన స్టెప్ లకి ధీటుగా డాన్స్ చేసిన భామ రవీనా టాండన్( raveena tandon)ఎన్నేళ్లయినా సరే  ఆ పాటని  మర్చిపోలేము..అలాగే  రవీనా ని మర్చిపోలేము.  ఆమెకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.  ముంబై లోని అత్యంత ఖరీదు ప్రాంతం బాంద్రా. రీసెంట్ గా ఆ ఏరియాలో రవీనా, ఆమె డ్రైవర్ మీద దాడి జరిగింది. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు   మాపై దాడి చెయ్యకండి అంటూ రవీనా ప్రాధేయపడినట్టుగా ఒక వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొట్టింది. అదే విధంగా రవీనా ఆమె డ్రైవర్  మద్యం తాగి ఉన్నారని  ఫలితంగా రాష్ డ్రైవింగ్ చేసి కొంత మందిని గాయపరిచారని పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయం మొత్తం పైన  క్లారిటీ వచ్చింది. దర్యాప్తు చేసిన పోలీసులే స్వయంగా వివరణ ఇచ్చారు. సంఘటన జరిగిన బాంద్రా రోడ్ లోని సి సి ఫుటేజ్ ని పరిశీలించాం. రవీనా కారు డ్రైవర్ కారు ని పార్కింగ్ చెయ్యడానికి వెనక్కి తెస్తున్నాడు.అదే టైం లో ఒక ఫ్యామిలీ కారు వెనుక బాగానే నడుచుకుంటూ వెళ్తుంది.  రివర్స్ చేసేటప్పుడు వెనుక ఎవరైనా ఉన్నారా లేదా అనేది చూసుకోవాలంటూ డ్రైవర్ తో  గొడవకి దిగారు. ఆ గొడవ కాస్తా పెరగడంతో రవీనా అక్కడికి వచ్చి వారి నుంచి  డ్రైవర్ ని రక్షించే పని చేసింది. ఇదే అక్కడ జరిగింది. అంతే కానీ రవీనా మద్యం తాగడం కానీ వాళ్ళని బతిమాలాడటం గాని జరగలేదని పోలీసులు తేల్చి చెప్పారు. ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ నుంచి రవీనా కి మద్దతు లభించింది.  దాడి చేసిన ఘటనలో ఎక్కువ మంది ఉండి ఉంటే రవీనా  ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేది. మళ్ళీ ఇలాంటివి జరగకుండా నిందితులని   కఠినంగా శిక్షించాలని  కోరింది.పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా రవీనా కి తమ సంఘీభావాన్ని తెలియచేస్తున్నారు.      
'Queen of Masses' Kajal Aggarwal plays the lead role in the movie "Satyabhama," with Naveen Chandra in the pivotal role of Amarender. Produced by Bobby Tikka and Srinivasa Rao Takkalapalli under the banner of Aurum Arts, the film is presented by Sasikiran Tikka, known for the movie "Major," who also crafted the screenplay. Directed by Suman Chikkala, this crime thriller is set for a grand theatrical release on the 7th of this month. In a recent interview, music director Sricharan Pakala shared his experience of providing music for the film. - Sricharan expressed his excitement about working on "Satyabhama," particularly because Kajal Aggarwal plays the lead role. This film marks his third collaboration with Sashikiran and a project with familiar friends, making the experience unique and enjoyable. He believes this film is a perfect comeback for Kajal and praised the action sequences. - "Satyabhama" will resonate with those who love thrillers due to its superb twists and emotional journey of a police officer. Kajal performed all the action scenes herself, an impressive feat post-childbirth, which inspired me to create compelling music. - The film features five songs, starting with two: "Kallara" a love song between Kajal and Naveen Chandra, and "Vethuku Vethuku" sung by Keeravaani, which ties into Kajal's case investigation. An English song is also included, and the rest of the lyrical songs will be released soon. Collaborating with Keeravaani garu and Chandra Bose garu on the song "Vethuku Vethuku" was a memorable experience for me. - While Sricharan has a reputation for thrillers, he has also composed music for love and commercial films like "Krishna and His Leela," "DJ Tillu," and "Guntur Talkies." He expressed a desire to work on a variety of genres, including mass and commercial movies, despite his current image. - Sricharan acknowledged that background music often stands out in thrillers, even if the songs are good. He aims to provide quality music across genres and hopes to receive diverse opportunities. - Sricharan shared that he listened to ghazals as a child and has also created rock music. He never worked as an assistant to any music director, and his career began when the audience appreciated his music for a film. He continues to create music and aspires to deliver new and unique compositions to the audience. - Sricharan mentioned his friendly relationships with fellow music directors like Vivek Sagar, Kaala Bhairava, and Praveen Lakkraju. He remains focused on his musical career, despite appearing in a small role in "Krishna and His Leela." With numerous projects lined up after "Gooda chari 2," he does not see himself pursuing acting full-time.
గత రెండు వారాలుగా హాట్‌ టాపిక్‌గా మారిన అంశం బెంగళూరు రేవ్‌ పార్టీ. మే 20న బెంగళూరులోని ఓ ఫామ్‌ హౌస్‌లో జరిగిన రేవ్‌ పార్టీలో దాదాపు 150 మంది పాల్గొన్నారనే సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు పార్టీ జరుగుతున్న ప్రదేశానికి చేరుకొని అందర్నీ అదుపులోకి తీసుకున్నారు. వారిలో టాలీవుడ్‌ నటి హేమ కూడా వుండడంతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది. తాను రేవ్‌ పార్టీలో పాల్గొనలేదంటూ కొన్ని వీడియోలు చేసి పోలీసుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది హేమ. అయితే రేవ్‌ పార్టీలో పాల్గొన్న హేమ ఫోటోను రిలీజ్‌ చెయ్యడంతో తన కథ అడ్డం తిరిగిందని గ్రహించింది. ఆ తర్వాత పోలీసులు పార్టీలో చాలా మంది డ్రగ్స్‌ సేవించారని తెలియడంతో 105 మంది బ్లడ్‌ శాంపుల్స్‌ కలెక్ట్‌ చేశారు పోలీసులు. వారిలో 86 మందికి పాజిటివ్‌ వచ్చింది. వారందరికీ పోలీసులు సమన్లు జారీ చేశారు. పోలీస్‌ విచారణకు హాజరు కావాల్సిందిగా కోరారు. నటి హేమకు రెండు సార్లు నోటీసులు పంపించినప్పటికీ విచారణకు హాజరు కాకపోవడంతో మూడో నోటీసు కూడా పంపారు. దానికి కూడా హాజరు కాకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించిన హేమ సోమవారం పోలీసుల ఎదుట హాజరైంది. ప్రస్తుతం హేమ పోలీసుల అదుపులో ఉంది. డ్రగ్స్‌ వాడకం విషయంలో పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్‌ తీసుకోవడం ఇదే మొదటిసారైతే కౌన్సిలింగ్‌ ఇచ్చి వదిలేసే అవకాశం ఉంది. అలా కాకుండా అంతకుముందు కూడా డ్రగ్స్‌ తీసుకున్నట్టు తేలితే చర్యలు కఠినంగా ఉంటాయని తెలుస్తోంది. మరి ఈ విచారణలో పోలీసులు ఏం తేల్చనున్నారనే విషయం త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. 
Puri Jagannadh is currently busy with upcoming film Double Ismart which stars Ustaad Ram Pothineni as the main lead. The film shoot progressing halted due to budget issues. As everything cleared out, the shoot resumed recently in Mumbai. Bollywood baddie Sanjay Dutt is playing Big Bull role in the film. Kavya Thapar is playing female lead. Melody Brahma Manisharma who gave chartbuster music for Ismart Shankar will be scoring tunes. And fans are eager to listen the first single from the film. Makers planning to release the film's first single next week. The makers missed the announced release date and they are now in plans to release the film on July 5th. The film will release a week after the release of Prabhas’ Kalki 2898 AD. Double iSmart will also have a pan-Indian release. The entire shoot will be completed in a week and the major portion of shoot is done in Mumbai. Puri Connects are the producers. The first single from Double iSmart will be out in this month and the makers are in plans to kick-start the promotions. Apart from directing the movie, Puri Jagannadh is also bankrolling it along with Charmme Kaur under their banner, Puri Connects.
Sai Dharam Tej, now known as Sai Durgha Tej, is set to embark on an ambitious new project following his blockbuster success with "Virupaksha." Initially, the actor planned to collaborate with director Sampath Nandi on a film titled "Gaanja Shankar." However, due to budget constraints, this project was unfortunately shelved. The project was shelved after pre production work. This out-and-out mass entertainer narrated to several heroes, Sampath Nandi got the nod from Sharwanand. The young actor responded on a positive note and People Media Factory will bankroll this prestigious project. People Media Factory is also producing Manamey which is the costliest film made in the actor’s career. Young actor Sharwanand sounded super confident on Manamey and the film is slated for June 7th release. Sharwanand has signed two new films and he recently commenced the shoot of his 36th film directed by Abhilash Reddy. UV Creations are the producers of this sports drama. Ghibran scores the music. Sharwanand is also in talks for a comic entertainer to be directed by Samajavaragamana fame Ram Abbaraju. The shooting formalities of this film starts very soon. Sharwanand and Sampath Nandi film will roll next year.
Superstar Rajinikanth currently working for Vettaiyan, directed buy TJ Gnanavel, who scored massive hit on OTT with Jai Bhim starring Suriya. On the occasion of Thalaivar’s birthday makers revealed a stunning glimpse of Vettaiyan which presented Rajinikanth in all his glory. The glimpse raised the expectations among audiences and fans. The audience were eagerly waiting for another exciting update from the makers. Today, makers revealed film release date. Vettaiyan will be releasing pan India wide in October 10th 2024. Another Pan India film NTR's Devara is releasing on the same date. This will be a huge clash between south superstars. Devara Part 1 might prepone as the shoot is almost finished. Koratala Siva is directing the film while Anirudh Ravichander is scoring the music. The movie also stars Amitabh Bachchan, Fahadh Faasil, Rana Daggubati, Manju Warrier, Dushara Vijayan, and Ritika Singh in crucial roles. Subaskaran is producing this prestigious project under the banner of Lyca Productions. Anirudh Ravichander is composing the tunes. GM Sundar, Rohini, Rao Ramesh, Ramesh Thilak, and Rakshan are also part of this project. Apart from it, Rajinikanth is also part of Thalaivar 171, directed by sensational Lokesh Kanagaraj.
సినిమా పుట్టిన నాటి నుంచి ఈ రంగంపై అందరికీ చులకన భావం ఉంది. సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు అస్తవ్యస్తంగా ఉంటాయని, వారికి అన్ని దురలవాట్లు ఉంటాయని సాధారణ ప్రజలు భావించేవారు. ముఖ్యంగా మహిళలకు సినిమా రంగంలో భద్రత అనేది ఉండదని నమ్మేవారు. అందుకే పాత రోజుల్లో సినిమా రంగానికి వెళ్ళడానికి మహిళలకు ఎన్నో అవరోధాలు ఏర్పడేవి. కుటుంబ సభ్యులు తమ ఇంటి మహిళలు సినిమాల్లోకి వెళ్ళేందుకు ఇష్టపడేవారు కాదు. అయినా ఎంతోమంది నటీమణులు సినిమా రంగంలోకి వచ్చి తారాపథంలో దూసుకుపోయారు. అయితే కొందరు మాత్రం స్వయంకృతాపరాథం వల్ల కావచ్చు, సహనటులు మోసం చేయడం వల్ల కావచ్చు.. జీవితంలో అన్నీ కోల్పోయారు.  ప్రస్తుత జనరేషన్‌లో సినిమా ఇండస్ట్రీకి రావడానికి అన్ని అవరోధాలు ఉన్నట్టు కనిపించదు. అయితే ఈ రంగంలో మహిళలకు రక్షణ లేదని, సినిమా అవకాశం కావాలంటే ఎన్నో కోల్పోవాల్సి ఉంటుందనే విషయం బాగా ప్రచారంలో ఉంది. కొందరు దర్శకనిర్మాతలు, హీరోలు.. కొత్తవారికి అవకాశం ఇవ్వాలంటే కమిట్‌మెంట్‌ పేరుతో లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారని చాలా సందర్భాల్లో రుజువైంది. దీనిపై గత కొంతకాలంగా పోరాటం కూడా జరుగుతోంది. ఇండస్ట్రీలోని అందరూ అలాంటి లైంగిక వేధింపులకు పాల్పడకపోయినా, కొందరి వల్ల మొత్తం ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తోందని మిగిలిన వారు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఓ నిర్మాత అలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తనవద్ద పనిచేస్తున్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు, దానికి సంబంధించిన వీడియోలతో ఆ యువతిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తుండడంతో పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ.  తమిళ సినీ రంగంలో నిర్మాతగా కొనసాగుతున్న మహ్మద్‌ అలీ కొన్ని సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలీ ఆఫీసులో గత ఏడాది కొరట్టూరుకు చెందిన ఓ యువతి చేరింది. అలీకి అప్పటికే పెళ్ళయింది. ఆ విషయాన్ని దాచిపెట్టి ఆ యువతితో ప్రేమాయణం నడిపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆ తర్వాత ఆమెతో బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేశాడు. దాన్ని ఒక వీడియోగా చేసి ఆ యువతిని బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలు పెట్టాడు. ఆ వీడియోను అడ్డుపెట్టుకొని చాలాసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భవతి కాగా, అబార్షన్‌ అయ్యేందుకు మాత్రలు ఇచ్చాడు. అతని ఆగడాలకు ఎదురు తిరిగితే ఆ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేస్తానని బెదిరించాడు. అతని వేధింపులు భరించలేక అంబత్తూరు మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను అలీ ఎలా మభ్యపెట్టాడో వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అలీని అరెస్టు చేసి జ్యూడిషియల్‌ కస్టడీకి తరలించారు. 
ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కలిపితేనే సినిమా. వాళ్ళల్లో ఎప్పుడు ఎవరి రేంజ్ ఏ  స్థాయికి వెళ్తుందో చెప్పలేం. సింపుల్ గా చెప్పాలంటే టైం కోసం ఎదురుచూస్తుంటారు.టైం వచ్చాక  టైం లేకుండా గడుపుతారు. అలాంటి వాళ్లలో ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ కూడా ఒకడు.వర్సటైల్  యాక్టర్ గా తనదైన శైలిలో ముందుకు దూసుపోతున్నాడు. తాజాగా  పుష్ప 2 గురించి కొన్ని వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు అవి ఆయన స్థాయిని తెలియచేస్తున్నాయి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో 2021 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ పుష్ప. ఇప్పుడు దానికి కొనసాగింపు గా పుష్ప 2  తెరకెక్కుతుంది.మొదటి భాగంలో నటించిన చాలా మంది సీక్వెల్‌ లో నటిస్తున్నారు.ఇప్పుడు ఈ విషయం మీదనే  ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న  అజయ్‌ ఘోష్  చెప్పిన మాటలు పలువుర్ని ఆలోచింపచేస్తున్నాయి. పుష్ప 2 లో నా పాత్ర లేదు.. నేను నటించలేక పోతున్నానే బాధ లేదు. ఎందుకంటే ఇంక  నా సినీ  కెరీర్‌ ఖతం  అయ్యింది అనుకుంటున్న టైం లో  పుష్ప  వన్ లో అవకాశం వచ్చింది. అందులోని  కొండా రెడ్డి  పాత్ర నటుడుగా నాకు  పునర్జన్మని  ఇచ్చింది.  ఆ సంతృప్తి చాలని చెప్పుకొచ్చాడు.  మొదటి భాగంలో కొండా రెడ్డి క్యారక్టర్ చనిపోతుంది. దీంతో ఆయన పార్ట్ 2 లో నటించే అవకాశం లేదు.సోషల్ మీడియా లో ఆయన ఇంటర్వ్యూ చూసిన చాలా మంది అజయ్  ఘోష్ పుష్ప 2 లో నటించాలని, వేరే క్యారక్టర్ కి తీసుకున్నా బాగుండేదని అంటున్నారు. ఏది ఏమైనా పుష్ప ఇచ్చిన ఉత్సాహంతో  అజయ్ ఘోష్ ఇప్పుడు  చేతి నిండా సినిమాలతో ఫుల్  బిజీగా ఉన్నాడు. వేరే నటుడి క్యారక్టర్ చూసి ఆ క్యారక్టర్ అజయ్ ఘోష్ చేస్తే బాగుండు అనే రేంజ్ కి కూడా వెళ్ళాడు. 2010 లో ప్రస్థానం తో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు 40 సినిమాలకి పైనే చేసాడు. వాటిల్లో ఇతర బాషా చిత్రాలు కూడా ఉన్నాయి.  
ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్‌’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దాదాపు 8 సంవత్సరాల గ్యాప్‌ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న సినిమా ‘దేవర’. యువసుధ ఆర్ట్స్‌, ఎన్‌.టి.ఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై నందమూరి కళ్యాణ్‌రామ్‌, మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. ఇలా.. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్‌ ఇదివరకే ప్రకటించింది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను వాయిదా వేస్తూ వచ్చిన చిత్ర యూనిట్‌ ఫైనల్‌గా అక్టోబర్‌ 10న సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.  ఇదిలా ఉంటే.. గత ఏడాది ‘జైలర్‌’ చిత్రంతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ తన నెక్స్‌ట్‌ సినిమా ‘లాల్‌ సలామ్‌’ ఓ కీలక పాత్ర పోషించారు. రజినీ కుమార్తె ఐశ్వర్యా రజినీకాంత్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయినా  టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజినీ చేస్తున్న ‘వేట్టయాన్‌’ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా వంటి హేమాహేమీలు నటిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని కూడా అక్టోబర్‌ 10నే రిలీజ్‌ చేయనున్నట్టు ప్రకటించారు. ‘దేవర’, ‘వేట్టయాన్‌’ రెండూ పాన్‌ ఇండియా సినిమాలే కావడంతో పలు భాషల్లో ఒకే రోజు విడుదల కాబోతున్నాయి.  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నట విశ్వరూపాన్ని చూసిన ప్రేక్షకులు, అభిమానులు ‘దేవర’ చిత్రంలో ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ ఎలా ఉంటుందీ, అతని పెర్‌ఫార్మెన్స్‌ ఎలా ఉండబోతోంది అనే విషయాల్లో క్యూరియాసిటీతో ఉన్నారు. రెండు భాగాలుగా రిలీజ్‌ అవుతున్న ఎన్టీఆర్‌ మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇక ‘జైలర్‌’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసిన సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ‘వేట్టయాన్‌’తో మరోసారి సెన్సేషన్‌ క్రియేట్‌ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. దేవర, వేట్టయాన్‌.. ఈ రెండు సినిమాలకు అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతాన్ని అందించడం విశేషంగా చెప్పుకోవాలి. ఒకేరోజు తలపడనున్న యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌లలో విజయం ఎవరిని వరిస్తుంది అనే విషయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఇప్పటివరకు 14 సినిమాల్లో హీరోగా నటించారు. 15వ సినిమాగా గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ‘గేమ్‌ఛేంజర్‌’ రూపొందుతోంది. ఈ సినిమా ప్రారంభమైన నాటి నుంచి ఏదో ఒక అవాంతరం రావడం, షూటింగ్‌ వాయిదా పడడం జరుగుతోంది. ఇంకా ఈ సినిమాకి సంబంధించి 30 రోజుల షెడ్యూల్‌ బ్యాలెన్స్‌ ఉంది. ఈ నెలలోనే చివరి షెడ్యూల్‌ జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్నోసార్లు ఈ సినిమా షూటింగ్‌ క్యాన్సిల్‌ అవుతూ వచ్చింది. ఈ చివరి షెడ్యూల్‌ కూడా అలాంటిదేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అదే జరిగితే సినిమా ఎప్పటికి పూర్తవుతుంది అనే ప్రశ్న తలెత్తుతోంది. ‘ఆర్‌సి15’గా రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌ మూవీని 2021లోనే ఎనౌన్స్‌ చేశారు. 2023లో ‘గేమ్‌ ఛేంజర్‌’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ఎంతోకాలంగా షూటింగ్‌ జరుగుతున్న ఈ సినిమా ఓ కొలిక్కి రాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం వున్న పరిస్థితుల్ని చూస్తుంటే ‘గేమ్‌ ఛేంజర్‌’ ఈ ఏడాది రిలీజ్‌ అవుతుందా అనే డౌట్‌ కూడా వస్తోంది.  డైరెక్టర్‌ శంకర్‌ మాత్రం ‘ఇండియన్‌ 2’ చిత్రం షూటింగ్‌ని పూర్తి చేసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌పై దృష్టి పెట్టారు. అంతేకాదు, ఈ సినిమాను ఎలా పబ్లిసిటీ చెయ్యాలనే విషయాలపై తీవ్రంగా చర్చిస్తున్నారు. వీటి వల్ల శంకర్‌ వల్లే ‘గేమ్‌ఛేంజర్‌’ ఆలస్యమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే రామ్‌చరణ్‌ వల్లే షూటింగ్‌ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. పలు కారణాలతో చరణ్‌ ఈ సినిమా షూటింగ్‌ని క్యాన్సిల్‌ చేశారనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే షూటింగ్‌ డిలే అవడానికి శంకరే కారణమనే అభిప్రాయంలో ప్రేక్షకులు, అభిమానులు ఉన్నారు. దానికి కారణం శంకర్‌ కాదన్న విషయం యూనిట్‌ సభ్యులకు తెలుసు కాబట్టి వస్తున్న విమర్శలను వారు అంతగా పట్టించుకోవడం లేదు.  ఈనెలలో చివరి షెడ్యూల్‌ పూర్తి చేస్తే మరో నెలరోజులు పోస్ట్‌ ప్రొడక్షన్‌కి కేటాయించాల్సి ఉంటుంది. ఆగస్ట్‌లో సినిమాను రిలీజ్‌ చెయ్యడానికి అవకాశం లేదు. ఎందుకంటే ‘పుష్ప2’ ఆగస్ట్‌ 15న రిలీజ్‌ కాబోతోంది. అంతేకాదు, మరి కొన్ని సినిమాలు ఆగస్ట్‌ను అడ్వాన్స్‌గా బుక్‌ చేసుకున్నాయి. ఇక మిగిలిన నాలుగు నెలల్లోనే ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌కి ప్లాన్‌ చేసుకోవాలి. అయితే ఆ నాలుగు నెలల్లో కూడా కొన్ని భారీ సినిమాలు ఉన్నాయి. ‘దేవర’ అక్టోబర్‌ 10న రిలీజ్‌ కాబోతోంది. తాజాగా సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ‘వేట్టయాన్‌’ చిత్రాన్ని కూడా అక్టోబర్‌ 10నే రిలీజ్‌ చెయ్యబోతున్నట్టు ప్రకటించారు. ఇక ఒక మాదిరి సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఇన్ని సినిమాల మధ్యలో చరణ్‌ సినిమాకు ఒక మంచి డేట్‌ ఫిక్స్‌ చేసుకోవాలంటే కష్టంతో కూడుకున్న పనే. ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’ పరిస్థితి చూస్తే.. అలాంటి ఆలోచన ఏదీ లేదేమో అనే సందేహం కలుగుతోంది. మరి ఈ విషయంలో చిత్ర యూనిట్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. చరణ్‌ కొత్త సినిమాకి ఎప్పుడు మోక్షం లభిస్తుందో చూడాలి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి కోపం రావడం సహజం. ఆ కోపం చాలా మటుకు ఎలా వస్తుందో అలాగే వెళ్లిపోతుంది కూడా. కొందరి విషయాలలో మాత్రమే కోపాలు కాస్తా గొడవలకు, అవి కాస్తా తెగదెంపులకు దారి తీస్తాయి. ఎలాంటి గొడవలు జరిగినా, ఏ సమస్య వచ్చినా అవి చాలా వరకు పరిష్కారం అవడం అనేది భార్యాభర్తలు వాటికి రియాక్ట్ అవ్వడం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే.. భార్యాభర్తల సాధారణ ప్రవర్తన కూడా వారికి తమ భాగస్వామి మీద కోపం వస్తుందా? రాదా అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. సాధారణంగా మగవారు చేసే మూడు పనులు వారికి తమ భార్యల మీద కోపం వస్తుందా రాదా అనే విషయాన్ని స్పష్టం చేస్తుందట. ఇంతకీ భర్తలు చేసే ఆ మూడు పనులేంటంటే.. సహాయం..  పనిని జెండర్ ఆధారంగా విభజించకుండా అన్ని పనులు అందరూ చేయవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకుంటారో అలాంటి భర్తలు భార్యలను అస్సలు కోపగించుకోరట. పైపెచ్చు ఇలాంటి భర్తలు తమ భార్యలకు ఎంచక్కా సహాయం కూడా చేస్తారట. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే భర్తలు సహాయం చేస్తే భార్యలు చాలా సంతోషిస్తారు.  భర్తలకు అనుగుణంగా ఉంటారు. భార్యలు కూడా  ఇలాంటి భర్తలకు కోపం తెప్పించే పనులు అస్సలు చెయ్యరు. ప్రేను వ్యక్తం చేయడం.. చాలామంది మగాళ్లకు భార్య మీద బోలెడు ప్రేమ ఉంటుంది. కానీ అదంతా ఇంట్లోనో లేక పడక గదిలోనో మాత్రమే బయట పెడుతుంటారు. కానీ భార్య మీద ఉన్న ప్రేమను ఎలాంటి సంకోచం లేకుండా బహిరంగంగా బయటపెట్టే భర్తలకు తమ భార్యలంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. ఇలాంటి భర్తలకు అస్సలు భార్యలమీద కోపం అనేది కల్లో కూడా ఉండేమో అన్నంత ప్రేమగా ఉంటారు. నలుగురిలో భార్య మీద కోప్పడే మగాడు కాదు.. నలుగురిలో భార్య మీద ప్రేమ కురిపించే మగాడిని చూసి భార్య గర్వపడుతుంది. అలాంటి భర్తను గౌరవిస్తుంది. సమయాన్ని  గడపడం.. భార్య కోసం సమయాన్ని వెచ్చించే భర్త ఎప్పుడూ భార్య మీద కోపం చేసుకోడు. ఎందుకంటే అతను భార్య కోసం సమయాన్ని వెచ్చించడంలోనే అతని ప్రేమ వ్యక్తం అవుతుంది. ఇక తన కోసం సమయం కేటాయిచే  భర్తంటే భార్యకు కూడా గౌరవం. ఇద్దరూ కలిసి గడిపే సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరికొకరు మద్దతుగా ఉండటం ఇలా అన్నీ వారి బంధాన్ని దృఢంగా మారుస్తాయి.                                                 *నిశ్శబ్ద. 
చాణక్య నీతి ఆచార్య చాణక్యుడి మాటలు తప్పు అని రుజువు కాలేదు. ఈ కారణంగానే నేటికీ చాలామంది చాణక్యుడి మాటలను అనుసరిస్తున్నారు. మీరు మీ జీవితంలో విజయం సాధించాలనుకుంటే, మీరు అతని విధానాల నుండి కొన్ని చిట్కాలను తీసుకోవచ్చు.ఆచార్య చాణక్యుడి తత్వానికి ప్రాచీన కాలం నుండి నేటి వరకు ప్రాముఖ్యత ఉంది. ఆచార్య చాణక్యుడి మాటలు ఎప్పుడూ తప్పు కాదంటారు. నేటికీ ప్రజలు దీనిని పాటించడానికి కారణం ఇదే.మీరు మీ జీవితంలో విజయం సాధించాలంటే, మీరు అతని సూత్రాల నుండి కొన్ని చిట్కాలను తీసుకోవచ్చు.అయితే కొన్ని అలవాట్లు ఉన్న వ్యక్తులు ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదని చెప్పాడు చాణక్యుడు. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం. సోమరిపోతుల ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు: ఆచార్య చాణక్యుడు ప్రకారం, సోమరితనం  ఉన్న వ్యక్తి తన జీవితంలో ఎప్పటికీ పురోగతి సాధించలేడు. అలాగే లక్ష్మీదేవి కూడా అలాంటి వారిని అనుగ్రహించదు.అలాంటి పరిస్థితిలో లక్ష్మీదేవి సంపూర్ణ ఆశీర్వాదం కోరుకునే వ్యక్తి జీవితంలో విజయం సాధించాలంటే సోమరితనాన్ని విడిచిపెట్టాలి. పిసినారితనం: సహాయం చేయడంలో లేదా దానధర్మాలు చేయడంలో కఠోరమైన వ్యక్తి తన జీవితాంతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటాడని చాణక్యుడి తత్వం చెబుతోంది. ఎందుకంటే దానధర్మాలతో సంపద పెరుగుతుందని చాణక్యుడు చెప్పాడు. దేవుడు కూడా సంతోషిస్తాడు. డబ్బు వృధా : చాణక్య నీతి ప్రకారం, తమ చెడు సమయాల కోసం డబ్బును పొదుపు చేయని, అనవసరంగా ఖర్చు చేసే వ్యక్తులు జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారు. అంతేకాదు, అలాంటి వారి జీవితం ఎప్పుడూ ఇబ్బందుల్లోనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి డబ్బు విలువను గుర్తించాలి. అలాగే డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి.  
చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో మానసిక ఒత్తిడి సర్వసాధారణం అయిపోయింది. వీటిని జయించడానికి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ వాటి విషయంలో ఫలితాలు మాత్రం కాస్త నిరాశగానే ఉంటాయి. ఎందుకంటే ఒత్తిడి నుండి బయటపడటానికి ఎంత ప్రయత్నించినా దానిలో సఫలం అయ్యేవారు చాలా కొద్దిమందే ఉంటారు. అయితే ఒత్తిడి అనేది పూర్తిగా మనిషి మానసిక పరిస్థితి వల్ల కలిగేది. దీన్ని జబ్బు కింద జమచేసి చాలా కాలమే అయినా దీనికి తగిన మందు మాత్రం కనుగొనలేకపోయారు. అయితే ఒత్తిడి జయించడానికి ఎప్పుడూ చేసే ప్రయత్నాలే కాకుండా దాని గురించి అందరినీ అలర్ట్ చేస్తూ ఒత్తిడి భూతానికి దూరంగా ఉండేందుకూ, ఒత్తిడి సమస్య ఉన్నపుడు దాన్ని జయించడానికి సలహాలు, సూచనలు, జాగ్రత్తలు మొదలైన వాటిని చర్చించుకునేందుకు ఓ రోజును కేటాయించారు. దాన్నే వరల్డ్ మెంటల్ హెల్త్ డే గా, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన దీన్ని నిర్వహిస్తారు. మానసిక ఆరోగ్యం సరిగా లేకుండా ఒత్తిడిలోకి జారుకుని ఎంతోమంది బలవన్మరణానికి కూడా పాల్పడుతున్నవారు ఉన్నారు. ఎంతోమంది సెలెబ్రిటీస్ జీవితాలు కూడా ఇలాంటి సమస్య వల్ల ముగిసిపోయాయి.  మానసిక ఒత్తిడి ఎలా పుడుతుంది?? బాధ్యతలు ఎక్కువైనప్పుడు, మనిషిని అర్థం చేసుకోనపుడు మానసికంగా అలసిపోవడం జరుగుతుంది. తగినంత విశ్రాంతి దొరకకపోతే ఆ అలసట కాస్తా ఒత్తిడిగా మారుతుంది. అది పెరుగుతూ వెళ్ళేకొద్ది విశ్వరూపం దాలుస్తుంది. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కనీసం దాన్ని పంచుకునేవారు లేకపోవడం, వ్యక్తి నలిగిపోతున్నప్పుడు గమనించకుండా వారి మానాన వారిని వదిలేయడం వల్ల మానసిక సమస్య అనేది ప్రమాదకర సమస్యగా రూపాంతరం చెందుతోంది. ఏమి చెయ్యాలి?? మానసిక సమస్యను అధిగమించడానికి కొన్ని మార్గాలు ఫాలో అవ్వాలి. వాటి వల్ల ఒత్తిడి నుండి బయటపడవచ్చు.  మీకోసం మీరు కాస్త సమయం కేటాయించుకోవాలి!! మనసు భారంగా మారితే ఒత్తిడి తాలూకూ ప్రభావం పెరుగుతుంది. అందుకే మనసును ఎప్పటికప్పుడు తేలికగా మార్చుకుంటూ ఉండాలి. ఎమోషన్స్ ని భరిస్తూ ఉండటం అంటే ఒత్తిడిని నెత్తిన పెట్టుకొని తిరగడమే. అందుకే ఒత్తిడిని జయించాలంటే మనసును తేలికగా ఉంచుకోవడమే ఉత్తమ పరిష్కారం.  ఇష్టమైన పనులను చేయడం!! ఇష్టమైన పనులు చేయడంలో తృప్తి ఉంటుంది. ఈ తృప్తి మనిషిని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. మనిషి ఎన్ని బరువులు మోస్తున్నా తనకు నచ్చిన పని చేస్తున్నాననే సాటిసిఫాక్షన్ మనిషిని హాయిగా ఉంచుతుంది. మంచి నిద్ర!! నిద్ర ఒక గొప్ప ఔషధం. నిద్ర సరిగ్గా ఉంటే ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం దొరికేసినట్టే ప్రతి మనిషికి రోజుకు కనీసం 6 నుండి 8 గంటల నిద్ర తప్పనిసరిగా అవసరం అవుతుంది. రోజు మొత్తం అలసట నుండి శరీరానికి మెదడుకు ఆమాత్రం విశ్రాంతి కచ్చితంగా అవసరం.  ఎమోషన్స్ ని మోయకూడదు!! కొందరు ఏ ఎమోషన్ బయట పెట్టకుండా ఉండటం వల్ల ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం లేదని అనుకుంటూ వుంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. ఎమోషన్స్ ని మనిషిలో దాచుకోవడం వల్ల అవి ఒత్తిడిగా మారిపోతాయి. అలాగని అందరి ముందూ కోపం, అసహనం, ద్వేషం వంటివి వ్యక్తం చేయమని అర్థం కాదు. ఎమోషన్ క్రియేట్ అయ్యే వరకు పరిస్థితులను తీసుకెళ్లకూడదు. అలాగే ఎమోషన్స్ ని భూతద్దంతో చూడకూడదు.  భరించకూడదు!! కొన్నిసార్లు కొన్ని పనులను భరిస్తూ చేయాల్సి వస్తుంది. ఆ పనులు ఎలా ఉంటాయంటే మనిషిని నిమిషం కూడా స్థిమితంగా ఉండనివ్వవు. మీ బాధ్యత కాకపోతే, దాని వల్ల అదనపు ఒత్తిడి తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని అనిపిస్తే సున్నితంగా ఆ పనికి నో చెప్పేయచ్చు.  నష్టం కూడా మంచిదే!! కొన్నిసార్లు కొన్ని పనులు, కొన్ని విషయాలు వదులుకుంటే ఆర్థికంగా కొంత నష్టపోవడం మాట నిజమే. కానీ ఆ పనుల వల్ల కలిగే భీకర ఒత్తిడిని సున్నితంగా దూరం చేసినట్టు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. డబ్బు ఈరోజు కాకపోయినా రేపు సంపాదించుకోవచ్చు, కాలం, కాలం చేసే ఒత్తిడి మాయాజలంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఒత్తిడి విషయంలో అన్ని రకాల మార్గాలను అన్వేషించి వాటిని అనుసరిస్తే మనిషి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మందులేని జబ్బు అయిన ఈ మానసిక సమస్యలకు మనసుతోను, ఆలోచనలతోనూ వైద్యం చేసుకోవాలి.                                    ◆నిశ్శబ్ద.
రోజూ పండ్లు తినడం వల్ల లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొత్తం శరీరం  మెరుగైన పనితీరుకు అవసరమైన అన్ని పోషకాలను పండ్లు కలిగి ఉంటాయి. పండ్లలో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్, ప్రొటీన్, కాల్షియం, విటమిన్లు,  మినరల్స్ ఉంటాయి. పండ్లు క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది, గుండె జబ్బులు,  పక్షవాతం వచ్చే ప్రమాదం తగ్గుతుంది, అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది, మధుమేహం నియంత్రణలోనూ, స్థూలకాయాన్ని తగ్గించడంలోనూ, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ సహాయపడుతుంది. కంటి సమస్యలు,  జీర్ణ సమస్యలను నివారించడానికి,  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా వ్యాధులను నివారించడానికి పండ్లు మంచి ఔషదం. ఆయుర్వేదంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఆహారపు అలవాట్లు, జీవనశైలి నియమాలు, కాలానుగుణ నియమాలు ఇలా  మరెన్నో జాగ్రత్తలు ఉంటాయి. పండ్లను సరైన పద్ధతిలో తినడానికి కూడా ఆయుర్వేదం నియమాలను సూచించింది. తద్వారా  పండ్ల నుండి గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చు. పండ్లు ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలు.   వాటిని సరైన మార్గంలో  తీసుకుంటే ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనం ఉంటుంది. తప్పుడు మార్గంలో,  తప్పు సమయంలో పండ్లు తినడం వల్ల ప్రయోజనాలకు బదులుగా హాని కలుగుతుంది. పండ్లు ఎలా తీసుకోకూడదో ఆయుర్వేదం చెప్పిన నియమాలు ఏంటో తెలుసుకుంటే.. ఆహారంతో పాటు పండ్లు తినకూడదు.. చాలా మంది ఈ తప్పు చేస్తుంటారు. ఆహారంతో పాటు పండ్లు తినడం వల్ల పేగుల్లో విషపదార్థాలు పేరుకుపోతాయి. ఆయుర్వేదంలో కొన్ని విషయాలను 'ఆమ' అంటే విషపదార్థాలు అంటారు. ఆహారంతో పాటు పండ్లను తీసుకోవడం వల్ల అజీర్ణం ఏర్పడుతుంది. ఇది కాకుండా అనేక చర్మ సమస్యలు,  వాపులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. పండ్లను జ్యూస్ చేస్తే  ప్రాణానికే ముప్పు.. చాలా సులువుగా ఉంటుందని ఎక్కువ మంది పండ్లు తినడం కంటే పండ్ల రసాన్ని తీసుకోవడానికి ఇస్టపడతారు. అయితే పండ్ల రసం తీసుకున్నంత  మాత్రాన ప్రయోజనం ఉండదు.  పండ్ల నుండి ఎక్కువ పోషకాలను పొందడానికి  మొత్తం పండు తినాలి.  రసం తాగడం ద్వారా  ఫైబర్ తో పాటు  అనేక ఇతర మూలకాలను కోల్పోతారు. డిన్నర్‌లో లేదా సాయంత్రం తర్వాత పండ్లు తినవద్దు.. ఆయుర్వేదం ప్రకారం  పండ్లను సాయంత్రం లేదా రాత్రి భోజనం చేసినప్పుడు తీసుకోకూడదు.  ఈ సమయాన్ని కఫా కాలం అని, ఈ కాలంలో పండ్లు జీర్ణం కావడానికి చాలా బరువుగా ఉంటాయని,  ఇది దోష అసమతుల్యతకు దారితీస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పాలలో పండ్లను కలపవద్దు.. పాలతో పండ్లను తినడం విరుద్ధ ఆహారం అని ఆయుర్వేదం చెబుతోంది. చాలామంది పాలను పండ్లను మిక్సీ పట్టి మిల్క్ షేక్ చేసుకుని ఇష్టంగా తాగుతుంటారు.   అరటిపండు తియ్యగా ఉన్నప్పటికీ పేగులకు భారంగా ఉంటుంది. అందుకే అరటిపండ్లు పాలు కలిపి తినకూడదు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎల్లప్పుడూ సీజనల్ పండ్లను మాత్రమే తినాలి.. సీజన్‌లో లభించే పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిది. ఇతర పండ్లు రసాయనాల ద్వారా ఎక్కువ కాలం భద్రపరచబడతాయి. సీజనల్ లేని పండ్లను తినడం ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. పైపెచ్చు సీజన్ కాని పండ్లు సహజంగానే ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. కాబట్టి సీజన్ లో లభించే పండ్లను తాజాగా ఉన్నట్టే తినాలి.                                                        *నిశ్శబ్ద.
  ఆరోగ్యంగా ఉండటానికి తరచుగా ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఉండాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు అందరూ చెప్తారు.  సాధారణంగా  ఆరోగ్యం మెరుగ్గా ఉన్న ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాలు, పానీయాలను తప్పనిసరిగా తమ ఫుడ్ మెనూలో చేర్చుకుంటారు.  అయితే చాలా మంది రోజూ తింటున్న కొన్ని ఆహారాలు శరీరానికి ఎంతో మంచిదనే భ్రమలో ఉన్నారు. కానీ నిజం చెప్పాలంటే ఇలా తీసుకుంటున్న కొన్ని ఆహారాలు  ఆరోగ్యానికి మంచి చేయకపోగా చెడు చేస్తయని ఆహార నిపుణులు అంటున్నారు.  అందరూ ఆరోగ్యం అనుకుంటున్న ఏ ఏ ఆహారాలు ఆరోగ్యానికి చేటు చేస్తాయో.. అసలవి ఎందుకు మంచివి కాదో తెలుసుకుంటే.. డైజెస్టీవ్ బిస్కెట్స్.. డైజెస్టివ్ అనే పేరును బట్టి ఈ బిస్కెట్లు చాలా ఆరోగ్యకరం అని అనుకుంటారు. చాలా మంది ఆకలిగా అనిపించినప్పుడు, అల్పాహారంలోనూ  ఈ బిస్కెట్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. నిజానికి డైజెస్టివ్ బిస్కెట్లు పిండి, చక్కెరతో నిండి ఉంటాయి. వీటిలో చాలా కేలరీలు ఉంటాయి. వీటిని రోజూ తీసుకుంటే, బరువు చాలా సులభంగా పెరుగుతారు.  ఖఖ్రా.. ఈ రోజుల్లో డైట్ ఖఖ్రా మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉంది. చాలామంది సాయంత్రం టీతో పాటు వీటిని  చాలా ఉత్సాహంగా తింటారు. అయితే డైట్ ఖఖ్రాలో 'డైట్' లాంటిది ఏమీ ఉండదనేది విస్తుపోవాల్సిన విషయం. ఈ వేయించిన స్నాక్స్ లో చాలా కేలరీలు ఉంటాయి. హెల్త్ డ్రింక్స్.. ఇప్పట్లో హెల్త్ డ్రింక్స్  చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు. పిల్లలకు ఈ హెల్త్ డ్రింక్స్ వాడకం మరీ ఎక్కువ ఉంటోంది.  ఎందుకంటే పిల్లలకు పాలు ఇవ్వాలంటే ఈ హెల్త్ డ్రింక్స్  పౌడర్లు ఉండాల్సిందే.  అయితే కంపెనీలు పేర్కొన్నట్టు విటమిన్లు, DHA కలిగిన ఈ హెల్త్ డ్రింక్స్ పౌడర్లు చాలా అనారోగ్యకరమైనవి.  వీటిలో చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది. వీట్ బ్రెడ్.. వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్, లేదా గోధుమ బ్రెడ్  ఆరోగ్యకరమైనదని చాలా మంది అనుకుంటారు. అయితే ఈ బ్రౌన్ బ్రెడ్ కూడా వైట్ బ్రెడ్ లాగా అనారోగ్యకరమైనది.  ఎందుకంటే ఇందులో రంగులు ఉపయోగించబడతాయి,  దీని తయారీలో ఆరోగ్యకరమైన పదార్థాలేవీ ఉపయోగించరు.                                 *నిశ్శబ్ద.  
లవంగాలు వంటగదిలో ఉండే మసాలా దినుసు.  ఇది వంటల్లోకే కాకుండా దగ్గు, జలుబు వంటి సమస్యలున్నప్పుడు కషాయం తయారుచేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో లవంగాలకు ఔషద స్థానం ఇచ్చారు. లవంగాలు ఆహారంలో భాగంగా తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే  విటమిన్-సి రక్తాన్ని శుద్ధి చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. లవంగం నూనెను ఉపయోగించడం వల్ల దంతాల ఆరోగ్యం బాగుంటుంది.  ఇంత శక్తివంతమైన లవంగాలను ప్రతిరోజూ రెండు నమిలి తిని గోరువెచ్చని నీరు తాగితే అద్బుతాలు జరుగుతాయి. అవేంటో తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.. లవంగాలు తినడం వల్ల  రోగనిరోధక శక్తి పెరుగుతుంది , ఎందుకంటే ఇది శరీరంలోని తెల్ల రక్త కణాల పరిమాణాన్ని పెంచుతుంది.  ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్ సి లవంగాలలో లభిస్తుంది, ఇది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైన విటమన్.  లవంగాలలోని యాంటీ-వైరల్ గుణం రక్తాన్ని శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది  రక్తంలోని టాక్సిన్లను తగ్గిస్తుంది.   తెల్ల రక్త కణాలను ప్రేరేపించడం ద్వారా వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ రెండు లవంగాలు తిని గ్లాసుడు గోరువెచ్చని నీరు త్రాగితే  జరిగే మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి.   మలబద్దకం  నుండి ఉపశమనం కలిగిస్తుంది.. లవంగం జీర్ణ సమస్యలకు చికిత్సగా ఉపయోగించవచ్చు, ఎందుకంటే ఇది జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచుతుంది,  వికారం కూడా తగ్గిస్తుంది. ఇది కాకుండా, ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు మంచిదని,  మలబద్ధకం సమస్యను తొలగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. పంటినొప్పిని దూరం చేస్తుంది.. లవంగాలలో  మత్తు లక్షణాలు ఉంటాయి.  పంటి నొప్పి ఉన్నప్పుడు తక్షణ ఉపశమనం పొందాలంటే లవంగాన్ని గ్రైండ్ చేసి అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని  దంతాలు,  వాపు ఉన్న చిగుళ్లపై రాయాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. లేదా లవంగాల నూనె కూడా ఉపయోగించవచ్చు. ఇవన్నీ కాకుండా ప్రతిరోజూ 2 చిన్న లవంగాలు నమిలి తిని గ్లాసుడు గోరువెచ్చని నీరు త్రాగితే అస్సలు పంటి నొప్పి, చిగుళ్ళ వాపు వంటి సమస్యలే ఎదురుకావు. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.. మన శరీరాన్ని శుద్ది చేయడానికి,  మనం తీసుకునే మందులను జీవక్రియ చేయడానికి కాలేయం బాధ్యత వహిస్తుంది. లవంగం నూనెలో ఉండే యూజినాల్ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో నొప్పి,  వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ రెండు లవంగాలు తిని గోరువెచ్చని నీరు తాగితే కాలేయానికి సంబంధించిన సమస్యలే రావు. నొప్పి, వాపు తగ్గిస్తుంది.. లవంగాలలో యూజీనాల్ అనే మూలకం ఉంటుంది, ఇది వాపును, నొప్పిని తగ్గిస్తుంది. ప్రతిరోజూ రెండు లవంగాలు తినడం అలవాటు చేసుకుంటే ఈ నొప్పులు, వాపులు ఆమడ దూరం ఉంటాయి. ఎముకలు, కీళ్లకు మంచి మెడిసిన్.. లవంగాలలో ఫ్లేవనాయిడ్స్, మాంగనీస్,  యూజినాల్ వంటి కొన్ని మూలకాలు ఉంటాయి, ఇవి ఎముకలు,  కీళ్ల ఆరోగ్యానికి మంచివి.  ఇవి  ఎముకల మందాన్ని పెంచుతాయి,  ఎముక కణజాలం ఏర్పడటానికి సహాయపడతాయి. అంతే కాదు  ఎముకలకు ఆరోగ్యకరమైన ఖనిజాలను అందించడంలో కూడా సహాయపడుతుంది. చక్కెర స్థాయిలు నియంత్రిస్తుంది.. ఇంట్లో ఎవరికైనా చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే, లవంగాలు శరీరంలో ఇన్సులిన్ లాగా పనిచేస్తాయి. ఇది  రక్తం నుండి అదనపు చక్కెరను  కణాలలోకి ఎగుమతి చేస్తుంది,  మిగిలిన చక్కెరను సమతుల్యం చేస్తుంది. అందుకే చక్కెర వ్యాధి ఉన్నవారు , చక్కెర వ్యాధి కుటుంబంలో ఎవరికైనా ఉన్నవారు రోజూ రెండు లవంగాలు తిని, గోరువెచ్చని నీరు తాగడం మంచిది.                                                             *నిశ్శబ్ద.