LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక అడుగు పడింది. శనివారం(మార్చి 28) ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా తీర్మానం అమోదించనుంది. ఈ విషయాన్ని ఏపీ అసెంబ్లీ స్పీకర్  చింతకాయల అయ్యన్నపాత్రుడు  ప్రకటించారు. అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదనీ, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు. ​కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతిని రాజధానిగా ఆమోదించిందని, అయితే పార్లమెంటులో బిల్లు పాస్ కావాల్సి ఉందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు ఉన్నందున, రాష్ట్ర అసెంబ్లీ చేసే తీర్మానాన్ని వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టం చేయించేలా  నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ చట్టం పూర్తయితే రాజధాని విషయంలో కొందరు చేస్తున్న విమర్శలకు శాశ్వతంగా తెరపడుతుందన్నారు. గవర్నర్ ఎ అబ్దుల్ నజీర్ ఉత్తర్వుల మేరకు వెలగపూడిలోని అసెంబ్లీ హాల్‌లో  శనివారం (మార్చి 28) ఈ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. 
  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వి.కె. శశికళ మరియు పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్. రాందాస్ అనూహ్యంగా చేతులు కలిపారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలకు గట్టి పోటీ ఇచ్చే లక్ష్యంతో ఈ ఇద్దరు నేతలు వ్యూహాత్మక పొత్తును ప్రకటించారు. శశికళ ఇటీవల స్థాపించిన 'ఆల్ ఇండియా పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం' పార్టీతో కలిసి పీఎంకే (రాందాస్ వర్గం) ఎన్నికల బరిలోకి దిగనుంది. విల్లుపురం జిల్లాలోని రాందాస్ నివాసం తైలాపురం గార్డెన్స్‌లో ఈ కీలక భేటీ జరిగింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన చర్చల అనంతరం, 2026 ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు వారు స్పష్టం చేశారు. ఈ పొత్తు రాష్ట్ర రాజకీయాల్లో ఒక 'ప్రకంపన' సృష్టిస్తుందని డాక్టర్ రాందాస్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కూటమి ఏర్పాటుకు ప్రధాన కారణం అన్నాడీఎంకేలో నెలకొన్న అంతర్గత విభేదాలే అని తెలుస్తోంది. ప్రస్తుతం అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టిన ఎడప్పాడి పళనిస్వామిపై పైచేయి సాధించేందుకు శశికళ సుదీర్ఘ కాలంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, పీఎంకేలో చీలక ఏర్పడి, రాందాస్ కుమారుడు అన్బుమణి రాందాస్ అన్నాడీఎంకే-బీజేపీ కూటమిలో చేరడంతో.. రాందాస్ ఒంటరి అయ్యారు. ఈ నేపథ్యంలో, తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఆయన శశికళతో జతకట్టారు. ఈ కొత్త కూటమిని కేవలం రెండు పార్టీలకే పరిమితం చేయకుండా, మరిన్ని చిన్న పార్టీలను తమ వైపు తిప్పుకోవాలని చిన్నమ్మ భావిస్తున్నారు. ప్రజల సంక్షేమం మరియు తమిళనాడు స్వయంప్రతిపత్తిని కాపాడటమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు. అయితే, పీఎంకే గుర్తు మరియు జెండా విషయంలో కోర్టులో వివాదం నడుస్తున్నందున, రాందాస్ వర్గం ఏ గుర్తుపై పోటీ చేస్తుందనేది ఇంకా స్పష్టత రాలేదు. రాబోయే రోజుల్లో ఈ కూటమి సీట్ల సర్దుబాటు మరియు ఉమ్మడి ప్రచార ప్రణాళికను ప్రకటించనుంది. శశికళకు ఉన్న సామాజిక వర్గ మద్దతు, ఉత్తర తమిళనాడులో పీఎంకేకున్న బలం కలిస్తే ప్రధాన పార్టీల ఓట్ల బ్యాంకుకు గండి పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా అన్నాడీఎంకే ఓట్లను ఈ కూటమి ఎంతవరకు చీలుస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  
జగన్ హయాంలో ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ అత్యంత కీలకంగా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినీ జగన్ వదల కుండా ముంచేశారు.   మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ హయాంలో  పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఓ వెలుగువెలిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.  తాను చక్రం తిప్పిన ప్రభుత్వ హయాంలోనే తన కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ సంస్థకు రావాల్సిన బకాయిల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.  ఆ బకాయిల కోసం ఆయన భార్య ఏకంగా సర్వోన్నత న్యాయస్ధానాన్నే ఆశ్రయించారు. అయితే అక్కడ ఆమెకు చుక్కెదురైంది. జగన్ హయాంలో చేపట్టిన రోడ్డు పనులకు సంబంధించిన బకాయిల చెల్లింపుల కోసం పెద్ది రెడ్డి ఇప్పుడు న్యాయపోరాటం చేస్తున్నారు. భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు.  అయితే న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసం  ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా పేర్కొంది.  హైకోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది.   దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణలత తన పిటిషన్ ను ఉప సంహరించుకున్నారు.  నిజానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పిఎల్ఆర్ కంపెనీ చేపట్టిన పనులను నిలిపివేసింది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పనులపై సమీక్షలు చేస్తోంది. అంటే పెద్దిరెడ్డి ఇప్పుడు అడుగుతున్న బకాయిలన్నీ జగన్ హయాంలో చేసిన పనులకు సంబంధించినవే. అంటే జగన్   తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న పెద్దిరెడ్డికి కూడా తన హయాంలో బిల్లులు చెల్లించలేదని తేటతెల్లమౌతోంది.   ఎన్నికల సమయంలో పార్టీ కోసం భారీగా ఖర్చు చేసిన పెద్దిరెడ్డికి   సొంత ప్రభుత్వం నుంచే నిధులు అందలేదన్నమాట. ఇక ప్రస్తుతానికి వస్తే  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్ హయాంలో అడ్డగోలుగా కాంట్రాక్టులు దక్కించుకున్న పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నది. పనులకు సంబంధించి కాంట్రాక్టు నిబంధనల ప్రకారమే ఇచ్చారా? ఆ పనుల నాణ్యత సరిగా ఉందా.. అన్న విషయంలో కచ్చితంగా పరిశీలించి పరిష్కరిస్తోంది. దీంతో బిల్లుల కోసం పెద్దరెడ్డి కుటుంబం అనివార్యంగా కోర్టుకెక్కి గత వైసీపీ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని చెప్పకనే చెబుతున్నారు.   అధికారంలో ఉన్నప్పుడు బిల్లులు ఇచ్చే విషయంలో చొరవ తీసుకోని జగన్ ను నిలదీయాల్సింది పోయి.. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్న జగన్ రెడ్డిని చూసి వైసీపీ వర్గాలే జాలిపడుతున్న పరిస్థితి నెలకొంది.   కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి కంపెనీ చేపట్టిన పనులపై విచారణకు ఆదేశిస్తే ఆయన కుటుంబం మరిన్ని చిక్కులను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడుతుందని పరిశీలకులు అంటున్నారు.  
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి. ఈ విషయంలో వైసీపీకి వినా మరెవరికీ ఎటువంటి అభ్యంతరాలు, అనుమానాలూ లేవు. అయితే అడుగడుగునా అమరావతికి అడ్డంకులు కల్పిస్తూ వైసీపీ చీకాకులు సృష్టిస్తోంది. జగన్ ఐదేళ్ల హయాంలో అప్పటికి వేగంగా జరుగుతున్న అమరావతి నిర్మాణాన్ని నిలిపివేసి.. నిర్వీర్యం చేసింది. అమరావతికి భూములిచ్చిన రైతులను నానా ఇబ్బందులూ పెట్టింది. అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి విజయం సాధించి అధికారంలోకి రావడంతో అమరాతి అడ్డంకులు తొలిగిపోయి ఏకైక రాజధాని నిర్మాణం శరవేగంగా ముందుకు సాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తే రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించేందుకు సమాయత్తమౌతోంది. ఇందు కోసం ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమెదించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు. ఇప్పటికే  అమరావతిని ఆంధ్రప్రదేశ్  ఏకైక  శాశ్వత రాజధానిగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే  పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన   బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ ఆమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా తీర్మానం ఆమెదించి కేంద్రానికి పంపిస్తే.. ఆ దిశగా కేంద్రం పార్లమెంటులో సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటులో ఎన్డీయేకు ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఆ బిల్లు ఆమోదం లాంఛనమే. ఇక బిల్లు ఆమోదం పొందితే అమరావతికి తిరుగులేని చట్టబద్ధత లభిస్తుంది.  ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సమయంలో హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కేటాయించిన సంగతి తెలిసిందే.  ఆ గడువు దాదాపు రెండేళ్ల కిందటే.. అంటే 2024 జూన్ 2తో ముగిసింది. అంటే అప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా ఉందన్న మాట.   సీఎం చంద్రబాబు ఇటీవలి తన హస్తిన పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో  రాజధానిగా అమరావతికి చట్టబద్ధతపై చర్చించారు.  గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిపై నెలకొన్న గందరగోళాన్ని పూర్తిగా తొలగించాలంటే పార్లమెంట్‌లో చట్టబద్ధత అవసరమని గట్టిగా చెప్పారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఇప్పటికే ముసాయిదా బిల్లు కూడా రెడీ అయ్యిందని తెలుస్తోంది. ఈ ముసాయిదా బిల్లుకు  న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల నుంచి ఆమోదం కూడా అభించిందని అంటున్నారు. దీంతో అసెంబ్లీ  అమరావతి  ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ   తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపడం  ఇక ఎలాంటి జాప్యం లేకుండా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి దోహదపడుతుందని పరిశీలకులు అంటున్నారు.  
2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. శకునిని అడ్డుపెట్టుకొని, జూదంలో పాండవులపై కౌరవులు పైచేయి సాధించినట్టుగా.. శకుని లాంటి రాజకీయ వ్యూహకర్త జిత్తులతో ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది. అయినా ఫ్యాన్ పార్టీ తీరు మారలేదు. వచ్చే ఎన్నికల కోసం మళ్ళీ ఆ శకుని లాంటి వ్యూహకర్తను రంగంలోకి దింపడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది.  అసలీ ఉపోద్ఘాతమంతా ఎందుకంటున్నారా? అక్కడికే వస్తున్నా... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చ జోరుగా సాగుతోంది.  2024ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,   2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పావులు కదపడం ప్రారంభించిందన్న చర్చ జరుగుతోంది.   ముఖ్యంగా గతంలో అంటే 2019 ఎన్నికలలో తనకు అఖండ విజయాన్ని అందించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే వైపు జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ మొగ్గు చూపుతున్నారని చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  గత ఎన్నికల సమయంలో తలెత్తిన విభేదాలను పక్కన పెట్టి, మళ్ళీ పాత బంధాన్ని పునరుద్ధరించుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో వైకాపా సాధించిన 151 సీట్ల అద్భుత విజయానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే ప్రధాన కారణమన్న సంగతి తెలిసిందే.  అప్పట్లో జగన్ పాదయాత్ర నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు పీకే  కీలక పాత్ర పోషించారు.  అయితే, 2024 ఎన్నికల సమయానికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరామం తీసుకోవడం, జగన్ కు దూరంగా జరగడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా, గత ఎన్నికల్లో జగన్ ఓటమిని పీకే ముందే ఊహించి ప్రకటించడం ఇద్దరి మధ్య అగాధాన్ని పెంచింది. అయితే 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఇప్పటి వరకూ వైసీసీ ఇసుమంతైనా కోలుకోలేదు. పైపెచ్చు ఆ పార్టీ అధినేత జగన్  ఏపీకి విజిటర్ గా మాత్రమే వస్తూ ఎక్కువ కాలం బెంగళూరుకే పరిమితం కావడంతో వైసీపీ క్యాడర్ కూడా దాదాపు చెల్లాచెదరైన పరిస్థితి.  ఉన్న కేడర్ లో సైతం నైరాశ్యం అలుముకుంది.  ఇక అధికారంలో ఉన్నంత కాలం పార్టీ తరఫున గొంతును గట్టిగా వినిపించిన నేతలలో చాలా మంది ప్రస్తుతం సైలంట్ మోడ్ లో ఉన్నారు. ఇటువంటి తరుణంలో పార్టీని గాడిన పెట్టడానికి పటిష్ట వ్యూహాలు రచించాలంటే పీకేయే శరణ్యమని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచే గట్టిగా వినిపిస్తోంది.  2024 ఎన్నికల్లో ఐప్యాక్  క్షేత్రస్థాయి పరిస్థితులను సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైందని జగన్ భావిస్తున్నారు. ఆ లోపాలన్నిటినీ సరిదిద్ధి క్యాడర్ లో ఉత్సాహం నింపాలంటే ప్రశాంత్ కిశోర్ వినా మరో గత్యంతరం లేదని జగన్ గట్టిగా భావిస్తున్నారని అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే  జగన్  పీకేతో సంప్రదింపులు జరిపాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ నాయకత్వంలో ఉన్న లోపాలను సరిదిద్దడం, నియోజకవర్గాల వారీగా బలాబలాలను అంచనా వేయడంలో పీకే అనుభవం తనకు ఉపకరిస్తుందని జగన్ భావిస్తున్నట్లు కనబడుతోంది.  గతంలో పీకేపై జగన్ కొన్ని విమర్శలు చేశారు. అలాగే పీకే సైతం జగన్ పై కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. గతం గత: అనుకుని మళ్లీ పీకేతో కలిసి ముందుకు సాగాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం అది అంత సులభంగా జరిగే పని కాదని అంటున్నారు. గతంలో  జగన్ తనపై చేసిన వ్యాఖ్యలను పీకే విస్మరిస్తారా? అలాగే..   పీకే  జగన్ రాజకీయ శైలిపై చేసిన వ్యాఖ్యలను జగన్  మరచిపోయి మళ్లీ చేతులు కలుపుతారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అదే సమయంలో  ఒక వేళ పీకే, జగన్ లు చేతులు కలిపినా.. 2019 నాటి మ్యాజిక్  రిపీట్ అయ్యే అవకాశాలు అంతంత మాత్రమేనని కూడా అంటున్నారు. సొంత రాష్ట్రం బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాలకూ తన పార్టీ జనసురాజ్ పార్టీ అభ్యర్థులను నిలిపిన ప్రశాంత్ కిశోర్ కనీసం ఒక్కరిని కూడా గెలిపించుకోలేక బొక్కబోర్లా పడ్డ సంగతిని గుర్తు చేస్తూ.. ఏపీలో పీకే వ్యూహాలు పారే అవకాశాలు లేవంటున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
SVSC మూవీపై రాజశేఖర్ కామెంట్స్  రేలంగి మావయ్య రోల్ చేయకపోవడానికి కారణం అదే! టాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అన్నదమ్ములుగా నటించిన వెంకటేష్, మహేష్ బాబు. అయితే ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్ర 'తండ్రి' క్యారెక్టర్. ప్రకాష్ రాజ్ పోషించిన ఆ రేలంగి మావయ్య పాత్ర సినిమాకే ఆత్మ వంటిది. నిజానికి ఆ అద్భుతమైన పాత్రను టాలీవుడ్ 'యాంగ్రీ మ్యాన్' రాజశేఖర్(Rajasekhar) చేయాల్సి ఉంది. ఆ ఛాన్స్ మిస్ అవ్వడంపై తాజాగా రాజశేఖర్ తనదైన శైలిలో స్పందించారు. రాజశేఖర్ కీలక పాత్ర పోషించిన 'బైకర్'(Biker) మూవీ ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజశేఖర్.. రేలంగి మావయ్య పాత్ర చేయకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నప్పుడు, తండ్రి పాత్ర కోసం మొదట రాజశేఖర్‌ను సంప్రదించారట. "మీ స్మైల్ బాగుంటుంది. ఇందులో ఎప్పుడూ నవ్వుతూ ఉండే పాత్ర ఉంది, అది మీరు చేస్తే బాగుంటుంది అని అడిగారు. కానీ, ఎందుకనో కుదరలేదు." అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. "ఆ సినిమా చూసినప్పుడు, మంచి పాత్రను వదులుకున్నానని ఏమైనా ఫీలయ్యారా" అని అడగగా.. అలాంటిదేం లేదని రాజశేఖర్ బదులిచ్చారు. నిజానికి రాజశేఖర్ తన కెరీర్ ఆరంభం నుండి పవర్‌ఫుల్ పాత్రలతో, యాక్షన్ సినిమాలతో మెప్పించారు. అలాంటి హీరో రేలంగి మావయ్య లాంటి పాత్రలో కనిపిస్తే కచ్చితంగా కొత్తగా ఉండేది. ప్రకాష్ రాజ్ తన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశారనడంలో సందేహం లేదు, కానీ రాజశేఖర్ ఆ పాత్ర చేసి ఉంటే సినిమాకు కొత్తదనం వచ్చేదని అభిమానులు భావిస్తున్నారు. తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్‌ను మళ్ళీ పునరుద్ధరించిన చిత్రంగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నిలిచిపోయింది. పెద్దోడు, చిన్నోడు మధ్య ఉండే అనుబంధం, ఆ ఇంట్లోని మధ్యతరగతి భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇలాంటి క్లాసిక్ సినిమాలో రాజశేఖర్ భాగం అయ్యుంటే, నటుడిగా ఆయన కెరీర్ మరో మలుపు తిరిగేదేమో. ప్రస్తుతం రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. హీరోగా కాకుండా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే 'బైకర్' సినిమాలో శర్వానంద్ కి తండ్రిగా నటించారు.  
వదినలో అమ్మనో, అక్కనో చూసుకునే వారు ఎందరో ఉంటారు. అలాగే బావ గారిలో అన్నయ్యను చూసుకునే వారు కొందరు ఉంటారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సతీమణి అన్నా లెజ్నెవా కూడా తన బావ గారైన చిరంజీవి(Chiranjeevi)లో అన్నయ్యను చూసుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా ఆమె చేసిన పోస్ట్ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. అన్నా లెజ్నెవా రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు స్వాగతం పలికారు. చిరంజీవి కూడా వెల్కమ్ చెప్పారు. అయితే దానికి ఆమె "థాంక్యూ అన్నయ్య" అని రిప్లై ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. బావ గారిని అన్నయ్య అని పిలవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై అన్నా క్లారిటీ ఇచ్చారు.  "అన్నయ్యా? బావగారా?" అంటూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన పోస్ట్ కట్టిపడేస్తోంది. "దాదాపు 15 ఏళ్ల క్రితం, అందరూ ఒకరికొకరు ఎంతో దగ్గరగా ఉన్న కుటుంబంలోకి నేను వచ్చాను. ఎలా కలవాలో, ఎవరిని ఏమని పిలవాలో కూడా తెలియదు. అందుకే నా భర్త వాడే మాటలనే నేనూ వాడాను. అవే అన్నయ్య, చిన్నన్నయ్య. మొదట్లో అవి నేను జాగ్రత్తగా, సందేహంతో పలికిన మాటలే. కానీ కాలక్రమంలో అవి నేను అనుభూతి చెందిన భావాలుగా మారాయి. నాకు అన్నయ్య లేరు. కానీ జీవితం నాకు ఇద్దరిని ఇచ్చింది.. చిరంజీవి & నాగబాబు" అంటూ అన్నా లెజ్నెవా పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ అన్నయ్యలను తన అన్నయ్యల్లా భావిస్తూ అన్నా లెజ్నెవా చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది కదా బాండింగ్ అంటే అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. https://www.instagram.com/p/DWVdJ75CWSg/
  -పవన్ హీరోయిన్ రాశి గుర్తుంది కదా   -ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పుకోవాలా!r -రాశి గురించి అభిమానులు ఏమంటున్నారు ప్రభాస్(Prabhas).. ఆ కట్ అవుట్ కి ఉండే క్రేజ్ తాలూకు వెయిట్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తే తుఫాన్ ని సృష్టించే కొత్త వర్డ్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. డై హార్ట్ ఫ్యాన్స్ అయితే నిత్యం  అదే పనిలో ఉంటు సోషల్ మీడియా వేదికగా వాటిని షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక తాజాన్యూస్ వాళ్ళ కంట పడటంతో ఆసక్తిగా గమిస్తుండటంతో పాటు కామెంట్స్ చేస్తున్నారు. ఆ న్యూస్ ఏంటో చూద్దాం. తెలుగు ప్రేక్షకుల అభిమాన కథానాయికగా అనిపించుకున్న రాశి(Raasi)ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతు 'ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇంతవరకు పర్సనల్ గా కలవలేదు. తన ఫస్ట్ పిక్చర్ 'ఈశ్వర్' ట్రైలర్ చూసినప్పుడే పెద్ద స్టార్ అవుతాడని భావించాను. ఛత్రపతి', 'బాహుబలి' సిరీస్ తో నా భావన నిజమైంది. తన సినిమాలు చూసేందుకు ప్రత్యేకంగా థియేటర్‌కి వెళ్తాను. ప్రభాస్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే  విషయానికి వస్తే అక్క, వదిన క్యారెక్టర్స్ అయితే ఓకే. తల్లిగా మాత్రం చేయను. 'మిర్చి'లో నదియాగారికి 'రాధే శ్యామ్'లోని ఒక క్యారక్టర్ కి డబ్బింగ్ చెప్పాను. Also read: Raj tarun: మద్యం మత్తులో రాజ్‌తరుణ్ మాజీ లవర్ లావణ్య హల్‌చల్.. పక్కా యాక్సిడెంట్  ఇక ప్రభాస్  మాట్లాడే తీరు, మేనరిజం, ఇతరులకు ఇచ్చే గౌరవం నాకు బాగా నచ్చుతాయి. 'బాహుబలి' సిరీస్ తర్వాత ఆయన ఇమేజ్‌ ని వేరేలా ఊహించుకోవడం కష్టమైంది. బాహుబలి క్యారక్టర్ లో తన రాజసం, స్క్రీన్ ప్రెజన్స్ నాకు ప్రత్యేకంగా అనిపిస్తాయని రాశి పేర్కొంది. దీంతో అభిమానులు స్పందిస్తు రాశి గారు మీరు భవిష్యత్తులో ప్రభాస్ తో కలిసి నటించాలని కోరుకుంటున్నామనే కామెంట్స్ చేస్తున్నారు. అందం, అణుకువ, నిజాయితీ, స్వచ్చతతో కూడిన ఎన్నో క్యారెక్టర్స్ పోషించి  సెల్యులాయిడ్ పై హీరోల చేత మూడు చెరువుల నీళ్లు తాగించింది. అందుకు ఒక ఉదాహరణ   'గోకులంలో సీత'లోని పవన్ కళ్యాణ్. మరి రాశి సెకండ్ ఇన్నింగ్స్  స్టార్ట్ చేస్తుందేమో చూడాలి.  
'పెద్ది' షూటింగ్‌లో రామ్ చరణ్‌కు ప్రమాదం చరణ్ కంటి గాయంపై చిరంజీవి ఎమోషనల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) 'పెద్ది' మూవీ షూటింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. చరణ్ కంటికి గాయం కావడంతో మెగా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ ఆందోళనలన్నింటికీ తెరదించుతూ మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'(Peddi) షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మంగళవారం(మార్చి 24) ఓ కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా, చరణ్ ఎడమ కంటి పైభాగంలో చిన్న గాయమైంది. వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్, ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ సుధాకర్ ప్రసాద్ నేతృత్వంలోని వైద్య బృందం చరణ్ కంటి రెప్పకు చిన్న సర్జరీ చేశారు. సుమారు నాలుగు కుట్లు పడినట్లు తెలుస్తోంది. ఈ క్లిష్ట సమయంలో సకాలంలో స్పందించి, అత్యంత నైపుణ్యంతో చికిత్స అందించిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్‌కు చిరంజీవి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. "చరణ్ కంటికి జరిగిన గాయం మాలో కొంత ఆందోళన కలిగించింది. కానీ మీ ఖచ్చితత్వం, శ్రద్ధ, నైపుణ్యం మా ఆందోళనను తొలగించాయి. మేము మీకు ఎంతో రుణపడి ఉంటాం" అంటూ చిరంజీవి తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.  మెగాస్టార్ అప్‌డేట్‌తో ఊపిరి పీల్చుకున్న అభిమానులు, చరణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.  ఇదిలా ఉంటే, రామ్ చరణ్ తన డెడికేషన్ ను మరోసారి చాటుకున్నారు. కంటికి సర్జరీ జరిగినప్పటికీ, ఆయన ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా మళ్ళీ షూటింగ్ కి రెడీ అయినట్లు సమాచారం.  గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది.  పెద్ది సినిమా ఏప్రిల్ 30, 2026న థియేటర్లలోకి రానుంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  https://x.com/KChiruTweets/status/2037029752184463719
  -వైరల్ గా మారిన లావణ్య ఇష్యు  -రంగంలోకి పోలీసులు -కారులో ఉన్న వ్యక్తి ఎవరు   ప్రముఖ హీరో రాజ్ తరుణ్(Raj Tarun)లవర్ గా మీడియా ముందుకు వచ్చి రాజ్ తరుణ్ నాకు కావాలని లావణ్య(Lavanya)చేసిన హడావిడి తెలిసిందే. ఈ విషయంలో ఎవరి వాదనలు ఎలా ఉన్నా నిమిషానికి ఒక ట్విస్ట్ తో ఎన్నో క్యారెక్టర్స్ ఆ ఇద్దరి వ్యవహారంలోకి ప్రవేశించి మీడియాకి రెస్ట్ లేకుండా చేసాయి. రీసెంట్ గా లావణ్యకి సంబంధించిన తాజా న్యూస్  కూల్ గా ఉన్న సోషల్ మీడియాని హీట్ పెంచేలా చేస్తుంది. లావణ్య ఏం చూసిందో చూద్దాం. లావణ్య మద్యం మత్తులో తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మల్లేపల్లిలో కారు నడుపుతు మద్యం మత్తులో హల్‌చల్ చేశారు. ఒక బైక్ ని ఢీ కొట్టింది. కానీ కారు ఆపకుండా వెళ్తుంటే గ్రామస్థులు కొంత మంది లావణ్య కారుని అడ్డుకొని పోలీసులకి సమాచారం ఇచ్చారు.ఆ సమయంలో గ్రామస్థులు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇక పోలీసులు  డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేయగా లావణ్యకి పాజిటివ్ రావడంతో  కారుని సీజ్ చేసారు.  లావణ్యతో పాటు కారులో మరో వ్యక్తి కూడా ఉండటంతో ఆ వ్యక్తి ఎవరనే చర్చ నెట్టింట జరుగుతుంది.   also read: Balakrishna: బాలకృష్ణకి అరుదైన గౌరవం.. సిఎం చేతుల మీదుగా అందచేత     
వెబ్ సిరీస్ : రిసార్ట్ నటీనటులు: లల్లూ, తలైవాసల్ విజయ్, ఎబి రాజన్, గిరి ద్వారకీష్, అబెనేయ నేత్రన్, విష్ణు బాల, సౌందర్య శరవణన్ కథ, స్క్రీన్ ప్లే: ఆర్ విజయ్ కుమార్ ఎడిటింగ్: వి నితీష్ కుమార్ సినిమాటోగ్రఫీ: ఆర్ నరేష్ నారాయణన్ మ్యూజిక్: రశాంత్ అశ్విన్ నిర్మాతలు: ఆర్ వెంకటేశ్ బాబు దర్శకత్వం: ప్రవీణ్ బెన్నెత్ ఓటీటీ: జియో హాట్ స్టార్ కథ: వెట్రి (విజయ్ కుమార్ రాజేంద్ర) ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు. అతనికి తల్లి, చెల్లి ఇద్దరే ఉంటారు. తన పరిస్థితికి కారకుడైన తండ్రి అంటే అతనికి కోపం ఉంటుంది. తండ్రి చేసిన అప్పులను తీర్చవల్సిన బాధ్యత అతనిపై ఉంటుంది. అందువలన డిగ్రీ కూడా పూర్తిచేయలేక ఉద్యోగాన్ని వెతుక్కుంటూ బయల్దేరతాడు. అదే సమయంలో 'ఉత్తమన్', 'మహాబలిపురం'లోని ఒక రెసాట్ లో రూమ్ సర్వీస్ బాయ్ గా జాబ్ ఇప్పిస్తాడు. బీచ్ ఒడ్డునే ఉన్న ఖరీదైన రెసాట్ అది. రూమ్ సర్వీస్ బాయ్ గా అక్కడ ఉద్యోగం చేయడం అంత ఆషామాషీ విషయం కాదనేది 'వెట్రి'కి అర్థమవుతుంది. అక్కడ కిచెన్ లో 'చెఫ్'గా నెడుమారన్ (తలైవాసల్ విజయ్) పనిచేస్తుంటాడు. ఆయన టీమ్ ను కూడా అక్కడి వాళ్లంతా చాలా ప్రత్యేకంగా చూస్తుంటారు. రూమ్ సర్వీస్ బాయ్ లను కిచెన్ వైపు వెళ్లనీయరని తెలిసి వెట్రి బాధపడతాడు. మొదటి నుంచి కూడా అతనికి వంట చేయడం ఇష్టం. చెఫ్ గా పనిచేయడం ఇష్టం. ఆ కారణంగా కిచెన్ వైపు వెళ్లిన ప్రతీసారి అతను నెడుమారన్ తో చీవాట్లు తింటాడు. అదే కిచెన్ లో ఐశ్వర్య పనిచేస్తూ ఉంటుంది. తొలి చూపులోనే ఆమెను వెట్రి ఇష్టపడతాడు. అయితే ఆమె నెడుమారన్ కూతురని తెలిసి ఆశ్చర్యపోతాడు. ఆమెకి చేరువకావడం అనుకున్నంత తేలిక కాదనే విషయం అతనికి అర్థమైపోతుంది. నెడుమారన్ మాటకి ఆ రెసాట్ లో ఎదురుండదు. ఆయన అంటే అందరికి భయమే. ఆ రెసాట్ లో పనిచేసే మేనేజర్ రాజన్ నుంచి అంతా ఆయన మాటకి ఎస్ చెప్పాల్సిందే. అందుకు కారణం ఆ రెసాట్ యజమాని రఘుపతికి .. నెడుమారన్ కి మధ్య గల స్నేహమే. త్వరగా అప్పులు తీర్చడం కోసం వెట్రి రాత్రి వేళలో స్ట్రీట్ ఫుడ్ తయారు చేస్తుంటాడు. అతని కారణంగా ఆ బండి దగ్గరికి వచ్చేవారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఒక రోజున కార్లో తన స్నేహితులతో కలిసి అటుగా వచ్చిన నెడుమారన్, వెట్రి బండి దగ్గర ఆగి సూప్ టేస్ట్ చేస్తాడు. అది తన సిగ్నేచర్ సూప్ కావడంతో షాక్ అవుతాడు. తన సూప్ రెసిపీని కాపీ చేసిన వెట్రిపై కోపంతో రగిలిపోతాడు. మరోవైపున నెడుమారన్ కూతురు ఐశ్వర్య, తన స్నేహితులైన వేణి - శ్రీనిధితో కలిసి వెట్రిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ తండ్రీకూతుళ్ల కారణంగా అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? రఘుపతి కూతురు రియా ఎంట్రీతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? వెట్రి తండ్రి ఎవరనేది మిగతా కథ.             విశ్లేషణ: ఈ కథంతా ఓ రెసాట్ లో‌ జరుగుతుంది. ఇందులో ప్రస్తుతం ఎనిమిది ఎపిసోడ్ లు ఉన్నాయి. నెడుమారన్, వెట్రి, రియా, ఉత్తమన్ పాత్రల చుట్టూ సాగే ఈ కథ మొదట్లో కాస్త బోర్ అనిపించినా ఎపిసోడ్ లు పూర్తయ్యే కొద్ది ఆసక్తికరంగా సాగింది. మొదటి నాలుగు ఎపిసోడ్ లలో వెట్రి గతం, అతనికి కుకుంగ్ మీద ఉన్న ఆసక్తి, అప్పుల బాధలు, నెడుమారన్ , రియా పాత్రలని పరిచయం చేశాడు దర్శకుడు. ఎప్పుడు అయితే రాత్రి పూట నెడుమారన్ రోడ్డు సైడ్ బండి మీద సూప్ తాగుతాడో అప్పటి నుండి కథ ఆసక్తికరంగా సాగింది. అయితే వెట్రి ఒక రూమ్ బాయ్ కావడం వల్ల నెడుమారన్ కి అతను నచ్చడు. నెడుమారన్ ఎంత స్ట్రిక్ట్ ఉంటాడంటే తన కూతురు ఇష్టాలు కూడా చెప్పలేకపోతుంది. అయితే వెట్రికి ఐశ్వర్య మధ్య లవ్ ఎప్పుడు మొదలైంది. వాళ్ళు కలుస్తారా.. ఐశ్వర్య వాళ్ళ నాన్న వెట్రిని అల్లుడిగా అంగీకరిస్తాడా.. అసలు వెట్రి వాళ్ళ నాన్నకి నెడుమారన్ కు సంబంధం ఏంటి అనే అంశాలు క్యూరియాసిటిని పెంచేశాయి. సిరీస్ అంతా ఎంగేజింగ్ గా లేకపోయినా అలా టైమ్ పాస్ కి ఒకసారి చూసేలా ఉంది. పెద్దగా ట్విస్ట్ లు లేకపోవడం ఈ సిరీస్ కి మైనస్. ఎక్కువ పాటలేం లేవు.. ఫైట్లు కూడా లేవు. అలా అని కామెడీ కూడా లేదు. అడల్ట్ స్లీన్లు లేవు. అసభ్య పదజాలం వాడలేదు. మొత్తానికి, రొటీన్ క్రైమ్ థ్రిల్లర్లు, హారర్ కథల మధ్య 'రెసాట్' ఒక రిఫ్రెషింగ్ ఫీల్ ఇస్తుంది. కాస్త నెమ్మదైన కథనం ఉన్నప్పటికీ, వీకెండ్‌లో ప్రశాంతంగా ఒకసారి చూసేయొచ్చు.. నితీష్ కుమార్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. రశాంత్ అశ్విన్ మ్యూజిక్ బాగుంది. నరేష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు: వెట్రిగా విజయ్ కుమార్ రాజేంద్ర చక్కగా నటించాడు. నెడుమారన్ గా తలైవాసల్ విజయ్ ఒదిగిపోయాడు. మిగతా వారు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ఫైనల్ గా : వన్ టైమ్ వాచెబుల్ రేటింగ్: 2.5/ 5 ✍️. దాసరి మల్లేశ్
వినోదాల విందులా 'పాపం ప్రతాప్' టీజర్  అసలు ప్రతాప్ సమస్య ఏమిటి? విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తిరువీర్. ముఖ్యంగా గతేడాది 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు 'పాపం ప్రతాప్' సినిమాతో మరోసారి నవ్వులు పూయించడానికి రెడీ అయిపోయాడు. ఈటీవీ విన్ నుంచి వస్తున్న సినిమా కావడం అదనపు ఆకర్షణ. ఎస్పీ దుర్గ నరేష్ దర్శకత్వంలో వస్తున్న 'పాపం ప్రతాప్' టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. (Papam Prathap Teaser) 'పాపం ప్రతాప్' ఎంటర్టైనింగ్ గా ఉంది. ప్రతాప్ గా తిరువీర్ బాగానే నవ్వించాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ప్రతాప్. మొదటి మూడు రాత్రులు తన ప్రతాపాన్ని చుపించానంటూ మురిసిపోతాడు. కానీ, ఆ తర్వాతే అసలు బొమ్మ మొదలవుతుంది. ప్రతాప్ తో సమస్య ఉందంటూ అతని భార్య ఊరి పెద్దల ముందు పంచాయితీ పెడుతుంది. "ప్రతాప్ గదిలో మంచం పైన" అంటూ సమస్యను అర్థమై అర్థం కానట్టుగా చెబుతుంది. దీంతో ఊరంతా ప్రతాప్ కి లోపం ఉంది అనుకుంటుంది. అసలు ఆ సమస్య ఏంటి? ప్రతాప్ లో నిజంగానే లోపం ఉందా? అనే ఆసక్తిని కలిగిస్తూ టీజర్ ను సరదాగా కట్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఇది కేవలం కామెడీ సినిమా మాత్రమే కాదు, ఇందులో ఆసక్తికర కథ ఉందని అర్థమవుతోంది. ప్రతాప్ గదిలో ఏం చేస్తున్నాడు? మంచం మీద ఎందుకు అలా ఉన్నాడు? వంటి ప్రశ్నలు తలెత్తేలా కొన్ని హిడెన్ హింట్స్ వదిలారు. ప్రతాప్‌లో ఏదో లోపం ఉందా అన్న కోణంలో సాగే సీన్లు ప్రేక్షకులలో ఒక రకమైన క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ నవ్వులతో పాటు ఒక తెలియని మిస్టరీని దాచి ఉంచినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో "అది పనిచేస్తుందా?" అని అడిగే సీన్ టీజర్‌కే హైలైట్ అని చెప్పవచ్చు. ఈ ఒక్క డైలాగ్‌తో సినిమా ఏ రేంజ్ కామెడీని పంచబోతుందో హింట్ ఇచ్చేశారు. టీజర్‌లో విజువల్స్ పల్లెటూరి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్‌ను ఎలివేట్ చేస్తూ హై ఎనర్జీని ఇస్తోంది. సినిమాటోగ్రఫీ చాలా సహజంగా ఉంది.  మొత్తానికి 'పాపం ప్రతాప్' టీజర్ ప్రేక్షకులకు ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ ప్రామిస్ చేస్తోంది. ఏప్రిల్ 17న థియేటర్లలో సందడి చేయడానికి వస్తున్న 'పాపం ప్రతాప్'.. ఈ వేసవిలో బాక్సాఫీస్ వద్ద నవ్వుల జల్లు కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది. https://x.com/etvwin/status/2036794487939473882
  -పద్మభూషణ్ బాలకృష్ణకి మరో పురస్కారం -అభిమానుల ఆనందం  -సోషల్ మీడియాలో కనువిందు చేస్తున్న విజువల్స్  బాలయ్య బాలయ్య, గుండెల్లో గోలయ్య జో కొట్టాలయ్య అని అభిమానులు అడుగుతున్నట్టుగానే, గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ బాలకృష్ణ(Balakrishna)తన నట విశ్వరూపం తాలూకు ప్రభంజనాన్ని సినిమా సినిమాకి పెంచుకుంటూ పోతున్నాడు. ప్రజాసేవలోను అదే పంధాని కొనసాగిస్తు సామాన్యులకి తక్కువ ధరకే క్యాన్సర్ ట్రీట్ మెంట్ ని ఇస్తు 'నో బడీ కెన్ రీచ్ హిమ్' అని మరోసారి అందరికి  గుర్తు చేస్తున్నాడు. రీసెంట్ గా బాలకృష్ణ అరుదైన పురస్కారాన్ని అందుకోవడంతో అభిమానులు, తెలుగు ప్రజల్లో ఆనందం వెల్లివిసురుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. నిన్న ఢిల్లీ(Delhi)లో 2026 వ సంవత్సరానికి సంబంధించి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఢిల్లీ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బాలకృష్ణకి సదరు కమిటీ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుని ప్రకటించి సత్కరించింది. ఢిల్లీ  సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా బాలకృష్ణ అవార్డుని అందుకున్న విజువల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో అభిమానులతో పాటు తెలుగు ప్రజలు బాలకృష్ణకి కంగ్రాట్స్ చెప్తున్నారు. అదే వేదికపై సీనియర్ నటి షర్మిలా ఠాగూర్‌, దివంగత నటుడు ధర్మేంద్రగారికి కూడా  లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు లభించింది. also read: Anna lezhneva: కీలక నిర్ణయం తీసుకున్న అన్నాలెజినోవా.. వెల్ కమ్ చెప్తున్నపవన్   బాలయ్య అప్ కమింగ్ సినిమా విషయానికి వస్తే వీరసింహ రెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni)తో చేస్తున్న షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బాలయ్య కెరీర్లోనే హయ్యస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతుండటంతో పాటు టెక్నీకల్ పరంగాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మాణం జరుపుకోనుంది. బాలయ్య మాఫియా డాన్ గా కనిపించబోతున్నట్టు టాక్.  
Celebrating an extraordinary legacy spanning five decades, Telugu cinema legend Nandamuri Balakrishna was honoured with the prestigious Lifetime Achievement Award at the International Film Festival of Delhi (IFFD) 2026, held at the iconic Bharat Mandapam. Recognising his monumental contribution to Indian cinema over a remarkable 50-year journey, the festival conferred this honour as a tribute to his enduring impact, versatility, and unmatched dedication to the craft of acting. Nandamuri Balakrishna attended the grand ceremony in New Delhi on March 25, where the award was presented by the Hon’ble Chief Minister of Delhi, Rekha Gupta, in the presence of distinguished guests from across the film fraternity and cultural spheres. Adding to his recent accolades, his film Bhagavanth Kesari, directed by Anil Ravipudi, was honoured with the Best Feature Film in Telugu at the 71st National Film Awards, further cementing his continued relevance and excellence. In 2025, the Government of India also conferred upon him the prestigious Padma Bhushan, the country’s third-highest civilian honour, recognising his immense contribution to the arts and cinema. Over the years, Balakrishna has carved a unique space in Indian cinema with his powerful performances, larger-than-life screen presence, and an unwavering connection with audiences. From mythological epics to mass entertainers, his body of work reflects both range and consistency, making him one of the most celebrated figures in Telugu cinema. This recognition at IFFD 2026 stands as a testament to his unparalleled journey and continued influence, inspiring generations of actors and filmmakers alike. The event marked a proud moment not only for his admirers but also for the entire Telugu film industry, as it celebrates one of its most iconic stalwarts on a prestigious international platform.  
  సినిమా పేరు: బ్యాండ్ మేళం న‌టీన‌టులు: హ‌ర్ష్ రోష‌న్‌, శ్రీదేవి, సాయికుమార్‌, గోప‌రాజు విజ‌య్  త‌దిత‌రులు  సినిమాటోగ్ర‌ఫీ: సతీష్ ముత్యాల   ఎడిటింగ్: శివ ముప్పరాజు మ్యూజిక్:విజ‌య్ బుల్గానిన్‌ నిర్మాత‌: కోన వెంకట్  బ్యానర్: కోన ఫిలిం కార్పొరేషన్  రచన,దర్శకత్వం: స‌తీష్ జ‌వ్వాజి  రిలీజ్ డేట్ : మార్చి 26 , 2026  కోర్ట్ మూవీ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి ఈ రోజు బ్యాండ్ మేళంతో మరో సారి సెల్యులాయిడ్ పై ల్యాండ్ అయ్యారు. భారీ హిట్ చిత్రాల రైటర్ కోన వెంకట్ నిర్మాత కావడం, ప్రచార చిత్రాల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ బ్యాండ్ మేళం చుట్టూ వైఫైలా చక్కర్లు కొడుతుండటంతో మూవీ లవర్స్, ప్రేక్షకుల కన్ను బ్యాండ్ మేళం పై పడింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం కథ గిరి(హర్ష్ రోషన్) రాజి(శ్రీదేవి) బావ మరదళ్ళు..పుట్టినప్పటి నుంచే ఒకరంటే ఒకరికి ప్రాణం. ఆ ఇద్దరి తల్లితండ్రులు కూడా గిరి, రాజి ఒకరి కోసం ఒకరు పుట్టారని పెద్దయ్యాక పెళ్లి చేయాలనీ అనుకుంటారు. కానీ రాజి ఇంజనీరింగ్ లో చేరాక గిరిపై చిరాకుని, ద్వేషాన్ని చూపిస్తుంది. దీంతో గిరి తట్టుకోలేకపోతాడు. రాజికి తండ్రి సాయిలు( సాయికుమార్) వేరే పెళ్లి ఫిక్స్ చేస్తాడు. పైగా చదువు లేకుండా మ్యూజిక్ అంటూ తిరుగుతాడని మేనల్లుడు గిరి అంటే చాలా కోపం కూడా. పెళ్లి జరిగే రోజు తన కాలేజీ అబ్బాయిని ప్రేమించానని లెటర్ రాసి రాజి లేచిపోతుంది. మరి రాజి నిజంగానే తన కాలేజీ అబ్బాయి ప్రేమలో పడి లేచిపోయిందా? లేక పెళ్లిని తప్పించుకోవడానికి అలా క్రియేట్ చేసిందా! అసలు గిరిపై ఉన్న ప్రేమ మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది! నిజంగానే గిరిపై ద్వేషం ఉందా? రాజిపై ప్రేమని పెంచుకున్న గిరి తీసుకున్న నిర్ణయం ఏంటి? చివరకి బ్యాండ్ మేళం ఏం చెప్పిందనేదే చిత్ర కథ ఎనాలసిస్  కథగా చెప్పుకుంటే బాగుండటంతో పాటు కథనం కూడా సినిమా చూస్తున్నంత సేపు బాగానే ఉంటుంది. కానీ కథకి ఆయువుపట్టైన మెయిన్ పాయింట్ ప్రీ క్లైమాక్స్ వరకు రాదు. పైగా రాజి బాగా చదువుకున్న తెలివైన అమ్మాయితో పాటు టాపర్. అలాంటి అమ్మాయి గిరి విషయంలో వాళ్ళ నాన్న విషయంలో తీసుకునే నిర్ణయం లాజిక్కే ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మంచి ఇంట్రెస్ట్ గా ఎనర్జిటిక్ గా సాగుతుంది. గిరి, రాజి మధ్య వచ్చిన సీన్స్, ఆ ఇద్దరి తల్లి తండ్రుల మధ్య వచ్చిన సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా గిరి తండ్రి దాన ధర్మాలతో ఆస్తులు పోగొట్టుకున్నా, ఆ బాధని మైండ్ లోకి కూడా రానీయకుండా మంచి తనాన్ని ప్రదర్శించే సీన్స్ చాలా బాగున్నాయి. గిరి అతని బ్యాండ్ ట్రూప్ మధ్య వచ్చిన సీన్స్ నవ్వులు పూయిస్తాయి. మ్యూజిక్ ఆల్బమ్ చెయ్యడానికి గిరి అండ్ బాచ్ తమ ఊరిలోనే దొంగతనం చేసే సీన్స్ గిరి ఫ్రెండ్ లేచిపోయిన తన మరదలిని పెళ్లి చేసుకునే సందర్భంగా వచ్చే సీన్స్ అయితే ఎక్స్ లెంట్. ఇంటర్వెల్ ట్విస్ట్ వర్క్ అవుట్ కాలేదు. సెకండ్ హాఫ్ లో చూసుకుంటే కొన్ని సీన్స్ బాగున్నా, ఫస్ట్ హాఫ్ లో వస్తున్న సీన్స్ చూసినట్టుగానే ఉంది. గిరి ఇంట్లోనే రాజి ఉంటూ ఉద్యోగానికి వెళ్లడం అనే లైన్ బాగున్నా ఆ ఇద్దరి మధ్య వచ్చిన సీన్స్ రొటీన్. పైగా గిరి కోసమే రాజి డ్రామా చేస్తుందనే విషయం మనకి స్టార్టింగ్ నుంచే అర్థమవుతు ఉంటుంది. కాబట్టి గిరిని రెచ్చగొడుతూ అతను లైఫ్ లో సెటిల్ కావడానికి రాజి ప్రయత్నాలు చేయాల్సింది. క్లైమాక్స్ పర్లేదు  నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు  గిరిగా హర్ష్ రోషన్ పెర్ ఫార్మెన్స్ ఎనర్జిటిక్ గా సాగింది. ఆల్ వేరియేషన్స్ లోను సూపర్ అండ్ మెచ్యూర్డ్ గా చేసాడు. డాన్స్ లు కూడా ఇరగదీయడంతో పాటు ఫ్యూచర్ లో నాకు మంచి హీరో దొరికాడని తెలుగు సిల్వర్ స్క్రీన్ మురిసిపోయేలా చేసాడు.శ్రీదేవి కూడా మరో సారి నాచురల్ పెర్ఫార్మ్ ని ప్రదర్శించింది. కాకపోతే తన పెర్ఫార్మ్ ప్రదర్శించడానికి స్కోప్ మాత్రం ఎక్కువగా రాలేదు. మిగతా క్యారెక్టర్స్ లో చేసిన సాయికుమార్, గోపరాజు విజయ్ అండ్ విజయ్ వైఫ్, ఫ్రెండ్స్ గా చేసిన అందరూ కూడా తగ్గేదేలే అనే విధంగా మెస్మరైజ్ చేసారు. సతీష్ నుంచి వచ్చిన డైలాగ్స్, డైరెక్షన్ బాగున్నా మెయిన్ పాయింట్ చుట్టూ కధనాన్ని అల్లుకోవడంలో పొరపాట్లు చేసాడు. కోన వెంకట్ నుంచి వచ్చిన నిర్మాణ విలువలు బాగున్నాయి. విజయ్ బుల్గానిన్‌ సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్స్ ఆర్డినరీ. సతీష్ ముత్యాల ఫొటోగ్రఫీ అతిపెద్ద ఎస్సెట్.  ఫైనల్ గా చెప్పాలంటే ఆర్టిస్టులు తమ పెర్ఫార్మ్ తో మెప్పించారు. కథనంలోని లోపాల వ ల్ల 'బ్యాండ్ మేళం' మోత నామమాత్రమే. బలాలు   1 . హర్ష్ రోషన్ పెర్ఫార్మెన్స్ 2 . కామెడి సీన్స్  3 .ఫొటోగ్రఫీ  4 మ్యూజిక్  5 .డైరెక్షన్  6 . ఫస్ట్ హాఫ్  బలహీనతలు  1 . కథ  2 .సెకండ్ హాఫ్   3 ప్రీ క్లైమాక్స్  4 . క్లైమాక్స్ రేటింగ్ 2 .5 /5                                                         అరుణాచలం 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
రాముడు రాఘవుడు రవికులుడితడు అనే పాటను వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నప్పుడు పుస్తకాల్లో శ్రీరాముడు పితృవాఖ్య పరిపాలకుడు అనే మాటను విని ఉంటాము. ఇంకా చక్కని నడవడిక కలిగిన అబ్బాయిలను చూస్తే రాముడు అనే టాగ్ వేస్తాము. ఇలా మన జీవితాలలో రాముడు ఒక భాగం. అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరామచంద్రుడు యావత్ భారతదేశానికి కూడా గర్వకారణం అంటారు. కొన్ని విమర్శలు ఉన్నా వాటి వెనుక కూడా సరైన హేతువులతో ఆలోచిస్తే దశావతారాలలో రాముడి అవతారం ప్రజలకు ఏదో చెప్పడానికే ఈ భూమి మీదకు వచ్చిందని ఖచ్చితంగా నమ్ముతారు. నవమి వైభవం!! నవమి రోజు రాముడు పుట్టాడు. అయితే అన్నిచోట్లా శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణం జరుపుతారు. భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రసిద్ధ గుడులలో ఇంకా చిన్న చిన్న రాముడి కోవెలలో కూడా సీతారాముల కల్యాణం ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. తెలంగాణలో భద్రాచలంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట లోనూ రాముడి కల్యాణం, శ్రీరాముడి పట్టాభిషేకం ఎంతో బాగా చేస్తారు.  ఏకపత్నీ వ్రతుడు!! ఒకటే మాట, ఒకటే బాణం అనే క్రమంలో సాగే రాముడు జీవితంలో కూడా ఒక భార్యను మాత్రమే కలిగి ఉండటం చక్కని సందేశం. ఆ కాలానికి ఒకటికి పదిమందిని పెళ్లిళ్లు చేసుకుని వందలకొద్ది పిల్లల్ని కలిగిన రాజుల కాలంలో రాముడు సీతకు మాత్రమే జీవితంలో చోటిచ్చాడు. శివదనస్సును విరిచి మరీ సీతను సొంతం చేసుకున్న ఈ కౌసల్యా కుమారుడు తన జీవితంలో ఏ ఇతర ఆడదాని వైపు కన్నెత్తి చూడలేదంటే ఆశ్చర్యమేస్తుంది.  రామాయణం!! భారతీయ సాహిత్య చరిత్రలో ఇదొక అద్భుత గ్రంధం. ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన ఈ రామాయణం ఏడు కాండలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నతనం నుండి పిల్లలకు రామాయణాన్ని చెబుతూ ఉండటం వల్ల పిల్లల్లో గొప్ప వ్యక్తిత్వం అలవడుతుందని అంటారు. ఇదే నిజం కూడా.  ఇంకా ఇందులో రాముడు మాత్రమే కాకుండా సీత, లక్ష్మణుడు, రాముడి ప్రయాణంలో ఎదురయ్యే ఎందరో గొప్ప వ్యక్తిత్వాలుగా మనకు కనబడతారు.  హనుమంతుడు, జటాయువు, విభీషణుడు, సుగ్రీవుడు, వానర సైన్యం. ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు రామాయణంలో ఉంటారు.  వీళ్ళు మాత్రమే కాకుండా గుహుడు, శబరి లాంటి గొప్ప రామభక్తులు కూడా కనిపిస్తారు. అందుకే రామాయణం అంత గోపోయా గ్రంథమయ్యింది. కాలంతో పాటు నిలిచే ఉంది. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే!! అవన్నీ పనిగట్టుకుని పుడుతున్నవి కాబట్టి ఈ రామాయణం ఆ రామ నామం ధర్మబద్ధమైన జీవితం మనిషి మనుగడ ఉన్నంతవరకు ఉంటాయి. రామనామం!! రాముడు గొప్పవాడా రామ నామం గొప్పదా అంటే రామ నామమే గొప్పది అంటారు. ఒక్కసారి రమానామాన్ని జపిస్తే వెయ్యిసార్లు ఇతర దేవుళ్లను జపించినట్టని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. వారధి కడుతున్న వానరసైన్యం ప్రతి రాయి మీద రామా అని రాసి సముద్రంలో వేస్తే అవి తేలుతున్నాయి. కానీ స్వయంగా రాముడే వాటిని సముద్రంలో వేస్తే అవి మునిగిపోయాయి. దీనిని బట్టి రాముడి కంటే రామ నామమే ఎంతో గొప్పది అని అర్థమవుతుంది. త్యాగరాజు అంటాడు  నిధి చాల సుఖమా రాముని స న్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా అని రామదాసు అంటాడు ఓ రామ నీనామ శ్రీరామ నీనామ మేమి రుచిరా అని ఎన్ని రకాలుగా చూసినా రాముడి వంటి పురుషుడు, రామ నామమంత సులువైన శక్తివంతమైన అద్భుత మార్గం మరొకటి ఉండదు అని నిక్కచ్చిగా చెప్పచ్చు. ఈ శ్రీరామ నవమి నాడు ఆ రామచంద్రుడిని పలుకే బంగారయాయేనా కోదండపాణి అంటూ లాలనగా ప్రార్థిస్తూ పునీతులవుదాం. ఇంకా గుడిలో వడపప్పు, పానకం వేసవిలో కమ్మగా తినేసొద్దాం.  ◆వెంకటేష్ పువ్వాడ.                           
  మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం.  అయితే ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని విషయాలను ఎవరికీ చెప్పకూడదు అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు.  మనిషి జీవితంలో ఏ విషయాలు ఇతరులకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? తెలుసుకుంటే.. ఆర్థిక పరిస్థితి గురించి  ఆదాయం, బ్యాంకు బ్యాలెన్స్, పెట్టుబడులు లేదా ఏ రకమైన లోన్ గురించైనా సమాచారాన్ని ఎవరితోనైనా పంచుకోవడం ప్రమాదకరం కావచ్చు.  కొన్నిసార్లు ఇలాంటి  సమాచారాన్ని చాలా మంది పుకారు అని వ్యక్తిత్వాన్ని చిన్నతనం చేయడం, లేదా సమాచారాన్ని అనుసరించి తప్పుడు పనులకు పాల్పడటం జరిగే అవకాశం ఉంటుంది.  ఉదాహరణకు.. ఏదైనా పెద్ద ఆస్తిని కొనుగోలు చేశారని లేదా ఏదైనా పెద్ద వస్తువు లేదా బంగారం లాంటివి కొనుగోలు చేశారని  ఎవరికైనా చెబితే..అది కాస్తా అందరికీ తెలుస్తూ చివరికి  దొంగతనం లేదా మోసపోవడానికి  దారితీయవచ్చు. అందువల్ల, ఆర్థిక విషయాలలో గోప్యతను పాటించడం ఎల్లప్పుడూ సురక్షితం. ఆరోగ్యం, వైద్య సమాచారం.. ఆరోగ్యం,  మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం చాలా సున్నితమైనది.  తీవ్రమైన అనారోగ్యాలు, మందుల అవసరాలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలను నమ్మకమైన వ్యక్తికి లేదా వైద్యుడికి మాత్రమే చెప్పడం మంచిది.   ఉదాహరణకు..  దీర్ఘకాలిక అనారోగ్యం ఉందని ఎవరికైనా చెబితే.. ఆ విషయం తప్పుడు వ్యక్తుల చేతికి వెళితే సామాజికంగా లేదా వృత్తిపరంగా నష్టం చేకూరే స్థితికి దారితీయవచ్చు. ఇష్టమైన, ఇష్టం లేని విషయాలు.. మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కూడా కొన్నిసార్లు ఇతరుల నుండి వ్యంగ్యానికి లేదా విమర్శకు మూలంగా మారవచ్చు.  వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ఇతరులకు చెప్పినప్పుడు వాటిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటే  ఎగతాళి చేయవచ్చు. కాబట్టి,  ఇష్టాయిష్టాలను నమ్మకమైన స్నేహితులకు మాత్రమే తెలియజేయండి. రిలేషన్స్, పర్సనల్ లైఫ్.. రిలేషన్స్ గురించి,  వ్యక్తిగత విషయాల గురించి బహిరంగపరచడం  గోప్యతకు భంగం కలిగించవచ్చు.  ఉదాహరణకు.. ఒక వివాదాన్ని లేదా కుటుంబ సమస్యను సోషల్ మీడియాలో లేదా మూడవ వ్యక్తితో పంచుకోవడం  ప్రతిష్టను దెబ్బతీస్తుంది. అలాగే  ఆత్మగౌరవానికి భంగం కలిగేలా చేస్తుంది.  అంతేకాదు..  బంధాల మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది.                                 *రూపశ్రీ.
  ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు.. ఇలా సంతోషంగా ఉండటానికి చేయాల్సినవన్నీ చేస్తారు. కానీ ఇన్నిచేసినా సరే.. కొందరు సంతోషంగా ఉండరు.  ఇలా ఎందుకు జరుగుతుందనే విషయం చాలా మంది ఆలోచించరు.  కేవలం అసంతృప్తి దగ్గరే ఆగిపోతారు.  కానీ క్షుణ్ణంగా గమనిస్తే.. ఒక వ్యక్తి చుట్టూ ఎన్ని సౌకర్యాలు, ఎన్ని సంతోషపెట్టే విషయాలు ఉన్నా ఆ వ్యక్తి సంతోషంగా ఉండటం లేదంటే.. ఆ వ్యక్తి చుట్టూ ఉండే కొందరు వ్యక్తులే కారణం అయ్యే అవకాశం ఉంటుంది. పక్కవాళ్లు సంతోషంగా ఉంటే ఓర్వలేని వ్యక్తులు కొందరు ఉంటారు.  ఇలాంటి వ్యక్తులు పక్కవాళ్ల సంతోషాన్ని చెదపురుగుల్లా తినేస్తుంటారు.  పైశాచిక ఆనందాన్ని లోలోపలే అనుభవిస్తారు.  పక్కవాళ్ల సంతోషాన్ని నాశనం చేసే ఆ వ్యక్తులు ఎవరు?  వారి లక్షణాలు ఏంటో తెలుసుకుంటే.. ఎప్పుడూ ఏడుస్తూ కంప్లైంట్లు చేసే వ్యక్తులు.. జీవితంలో ఏ మంచినీ చూడని వాళ్ళు వీళ్ళు. వాతావరణం బాగుంటే, ఎండ వేడిమి గురించి ఫిర్యాదు చేస్తారు. మంచి ఉద్యోగం వస్తే, తమ బాస్‌ను విమర్శిస్తారు. వారి దృక్పథం ఎంత ప్రతికూలంగా ఉంటుందంటే, వారి పక్కన కూర్చోవడం కూడా  మానసిక స్థితిని పాడు చేస్తుంది. ఇలాంటి వ్యక్తులు పక్కవాళ్ల సానుకూల శక్తిని హరించివేస్తారు. వీరికి దూరంగా ఉండటమే ఉత్తమం. స్వప్రయోజనాలు చూసుకునేవారు.. స్నేహితులలో, బంధువులలో చాలామంది స్వార్థంగా ఉంటారు.  మాట్లాడి చాలా  రోజులు అయింది అంటూ మాటలు కలిపి తమ స్వప్రయోజనాల కోసం సహాయం అడుగుతుంటారు.  ఇలాంటి వారు ప్రతి ఒక్కరి సర్కిల్లో ఉంటారు.వీళ్ళు కేవలం తమకు సహాయం కావాలన్నా లేదా ఏదైనా పని చేయించుకోవాలన్నా మాత్రమే ఎదుటి వ్యక్తిని గుర్తు చేసుకుంటారు. పని పూర్తయిన వెంటనే మాయమైపోతారు. ఇలాంటి స్వార్థపరులు  ఎప్పటికీ నిజమైన స్నేహితులు కాలేరు. చాడీలు చెప్పేవారు.. ఒకరి గురించి ఇంకొకరు దగ్గర చాడీలు చెప్పేవారు.. ఏదో ఒకరోజు ఎదుటి వారికి మీ గురించి చాడీలు చెప్పే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది.  అలాంటి వారికి నిజాయితీ ఉండదు. వారు సంబంధాలను పాడుచేయడానికి కల్పిత కథలను మాత్రమే చెబుతారు.  జీవితంలో మనశ్శాంతి కావాలంటే అలాంటి వ్యక్తులకు  దూరంగా ఉండటం మంచిది. అసూయ పరులు.. మీరు సంతోషంగా ఉన్నప్పుడు చప్పట్లు కొట్టేవాడే నిజమైన స్నేహితుడు. అయితే, కొంతమంది మీతో చాలా మంచిగా ఉన్నట్లు నటిస్తారు, కానీ రహస్యంగా మీ పురోగతిని చూసి అసూయపడతారు. మీరు కొత్త కారు కొన్నా, పదోన్నతి పొందినా, వారు మిమ్మల్ని అభినందిస్తారు, కానీ వారి కళ్ళలో, మాటల్లో ఒక వింతైన అసూయ  స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి అసూయపడే వ్యక్తులు మీ మంచిని ఎప్పటికీ కోరుకోలేరు. నిరాశ పరిచేవారు.. నువ్వు చేయలేవు.. నీకు చేతకాద.. నీకు సాధ్యం కాదు.. నువ్వు ఫెయిల్ అవుతావు.. వంటి మాటలు చెప్పే వ్యక్తులే మీ కలలకు, ధైర్యానికి అతిపెద్ద శత్రువులు. మీరు ఏదైనా కొత్తగా, సానుకూలంగా చేయాలని అనుకున్నప్పుడల్లా, వాళ్ళు తమ మాటలతో మిమ్మల్ని భయపెట్టి, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. మిమ్మల్ని మీరు నమ్మండి, వాళ్ళ మాటలను ఒక చెవితో విని, మరో చెవితో వదిలేయాలి. పైన చెప్పుకున్న లక్షణాలు గల వ్యక్తులు ప్రతి ఒక్కరి చుట్టూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఇలాంటి వ్యక్తుల మాటలను ఎంత తక్కువ పరిగణలోకి తీసుకుంటే అంత మంచిది. లేకపోతే సంతోషాన్ని చెదపురుగుల్లా తినేసి,  మనిషిని అశాంతికి గురిచేస్తారు.                                        *రూపశ్రీ.
  హైందవులు జరుపుకొనే ప్రతి పండుగకీ ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. దాంతో పాటుగా ఆ సమయాలలో ఉండే వాతావరణం, లభించే వనరులు, ప్రబలే అనారోగ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని వివిధ సంప్రదాయాలను రూపొందించినట్లు కనిస్తుంది. వినాయకచవితి నాడు పత్రిపూజ, దీపావళి నాడు బాణాసంచా, ఉగాది నాడు వేపపచ్చడి... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగకీ కాలానుగుణమైన ఓ సంప్రదాయం జతగా సాగుతోంది. శ్రీరామనవమినాటి పానంకం కూడా అంతే! శ్రీరామనవమి మండువేసవిలో వస్తుంది. ఈ సమయానికి ఎండలే కాదు, గాడ్పులు కూడా మొదలవుతాయి. వేసవిలో బెల్లపు పానకాన్ని తీసుకోవడం వల్ల చాలా మేలే జరుగుతుంది. వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల... మన ఒంట్లో ఉండే ఖనిజాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు ఆ చెమట ద్వారా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. పానకంలో ఈ నాలుగు ఖనిజాలూ ఉంటాయి. శరీరం నుంచి వెళ్లిపోయిన ఖనిజాలను అలా పానకం భర్తీ చేస్తుందన్నమాట! ఇక బెల్లంలో ఉండే ఇనుము వేసవి తాపాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. అంతేకాదు, వేసవిలో అటూఇటూ ఊగిసలాడే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి. ఆయుర్వేదం ప్రకారం చూసినా పానకం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. వేసవిలో తాపానికి పిత్తదోషాలు ప్రబలుతాయని ఆయుర్వేదం చెబుతోంది. దీనివల్ల అజీర్ణం, గుండెల్లో మంట, జుట్టు రాలడం, దద్దుర్లు, నిద్రలేమి లాంటి లక్షణాలు కనిపిస్తాయట. బెల్లానికి ఈ దోషాలను నివారించే గుణం ఉందంటారు ఆయుర్వేద వైద్యులు. ఇక బెల్లానికి ఉన్న మరో లక్షణం చలవ చేయడం. పైగా వేసవిలో వీలైనంత ఎక్కువగా నీరు తాగాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి నీటిలో బెల్లాన్ని కలుపుకుని పానకంగా తాగడం ఎవరికి మాత్రం ఇష్టముండదు! తెలుగునాట పెళ్లిళ్లలో విడిదికి చేరుకున్న వరుని కుటుంబానికి పానకపు బిందెలను అందించే సంప్రదాయం ఉంది. పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరుగుతాయి కాబట్టి... ఒక పక్క పెళ్లి పనులు, ప్రయాణాలు సాగించి మరో పక్క వేసవి తాపానికి అలసిన మగపెళ్లివారికి తిరిగి ఉత్సాహాన్ని కలిగించేందుకు, ఈ సంప్రదాయాన్ని నెలకొల్పి ఉంటారు.   బెల్లపు పానకంలో మిరియాలు, యాలుకలు కూడా వేస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం మిరియాలు, యాలుకలు కూడా జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయేలా తోడ్పడతాయి. వేసవిలో వచ్చే పొడిదగ్గుకి మిరియాలు గొప్ప ఔషధంలా పనిచేస్తే, యాలుకలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. పానకం గురించి ఇంత చెప్పుకున్నాక వడపప్పు గురించి కూడా ప్రస్తావించి తీరాల్సిందే! పెసరప్పుకి చలవ చేసే గుణం ఉందంటారు. అంతేకాదు! అతి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలలో పెసరపప్పు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించేందుకు, బరువు తగ్గించుకునేందుకు ఇప్పడు చాలామంది పాశ్చాత్యులు కూడా పెసరపప్పుతో చేసిన కట్టుని (సూప్‌) తాగడం మొదలుపెట్టారు. మనం ఆడుతూపాడుతూ తాగే వడపప్పు, పానకాల వెనుకాల ఇంత శాస్త్రం ఉందన్నమాట!   ..నిర్జర.
మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో కనిపించే చాలా లక్షణాలను చాలా సార్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా శరీరంలో కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం అనేది  కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు కావచ్చని వైద్యులు అంటున్నారు. మరీ ముఖ్యంగా అందరికీ కాకుండా కొందరికి మాత్రమే మూత్రపిండాల సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నేటికాలంలో చర్మ సంరక్షణలో భాగంగా చాలా రకాల క్రీములు వాడుతూ ఉంటారు.  ఇవి కూడా మూత్రపిండాల సమస్యకు కారణం అవుతాయి అనే మాట చాలా చర్చలకు దారి తీస్తోంది.   మూత్రపిండాల సమస్యకు అసలు కారణాలు ఏంటి? మూత్రపిండాల సమస్య ఎవరిలో ఎక్కువ వస్తుంది? వివరంగా తెలుసుకుంటే.. రెండు రూపాలు.. మూత్రపిండాల వ్యాధులు రెండు రూపాలలో వస్తాయి.  మధుమేహం వల్ల వచ్చే మూత్రపిండాల వ్యాధి మొదటిది. 50 శాతం మందికి మధుమేహం కారణంగా మూత్రపిండాల వ్యాధి వస్తుంది. అధిక రక్తపోటు మరొక కారణం. మూత్రపిండాల్లో రాళ్లు,  ఇన్ఫెక్షన్లు కూడా ఈ వ్యాధికి ఇతర కారణాలు. జన్యుపరంగా,  ఇతర మందులు తీసుకోవడం వల్ల కూడా మూత్రపిండాల వ్యాధి రావచ్చు. తాత్కాలిక,  శాశ్వత మూత్రపిండాల వ్యాధులు కూడా ఉన్నాయి. తాత్కాలిక మూత్రపిండాల వ్యాధి.. మలేరియా, డెంగ్యూ జ్వరం లేదా లెప్టోస్పిరోసిస్ వంటి వ్యాధి వచ్చినప్పుడు,  మూత్రపిండాలు తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోతాయి. ఈ పరిస్థితిలో డయాలసిస్ అవసరం కావచ్చు. లేదా మందులతో దీనిని నయం చేయవచ్చు. ధీర్షకాల మూత్రపిండాల వ్యాధి.. కొంతమందికి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉండవచ్చు. ఇది మధుమేహం,  అధిక రక్తపోటు కారణంగా వచ్చే అవకాశం ఉంటుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే, చివరికి  డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడి అవసరం  ఏర్పడుతుంది. లక్షణాలు.. మూత్రపిండాల వ్యాధికి తరచుగా ఎలాంటి లక్షణాలు ఉండవు. అందుకే చాలామంది  దానిని పట్టించుకోరు. ఏదైనా అనుమానం వచ్చి పరీక్ష చేయించుకున్నప్పుడు మాత్రమే రక్తంలో క్రియాటినిన్ స్థాయి ఎక్కువగా ఉందని తెలుస్తుంది. మూత్రపిండాల వైఫల్యానికి అత్యంత సాధారణ లక్షణం కాళ్ళలో నీరు చేరడం. ఇతర లక్షణాలలో లైట్ గా చలి, నొప్పి, జ్వరం, లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే చలి,  వెన్నెముకకు ఇరువైపులా నొప్పి వంటివి  ఉంటాయి. పాదాల వాపు మూత్రపిండాల వ్యాధి లక్షణం అని ఖచ్చితంగా చెప్పలేము. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా పాదాల వాపు రావచ్చు. జీవనశైలిలో మార్పులు కూడా మూత్రపిండాల వ్యాధికి కారణం కావచ్చు. మద్యపానం, ధూమపానం, జంక్ ఫుడ్ తినడం,  ఊబకాయం వంటివన్నీ మూత్రపిండాల వ్యాధికి దారితీసే పరిస్థితులు. మూత్రం రంగు మారడం, మూత్రంలో రక్తం కనిపించడం,  మూత్ర విసర్జనలో ఇబ్బంది కూడా మూత్రపిండాల వ్యాధి లక్షణాలే. చర్మాన్ని తెల్లబరిచే క్రీములతో మూత్రపిండ వ్యాధులు.. చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ఉపయోగించే క్రీములు మూత్రపిండాలకు హాని కలిగించవచ్చని వైద్యులు అంటున్నారు. వైద్యపరంగా ఉపయోగించే క్రీములు సాధారణంగా పెద్ద సమస్యలను కలిగించవు.  కానీ చాలామంది అందం మీద పిచ్చితో సోషల్ మీడియాలో కనిపించే ప్రమోషన్ యాడ్స్,  ఇంటర్నెట్ లో కనిపించే పేక్ రివ్యూస్ చూసి సొంతంగా క్రీములు ఎంచుకుని వాడుతుంటారు. అలాంటి క్రీములలో అధిక పరిమాణంలో పాదరసం ఉండవచ్చని అంటున్నారు. పాదరసానికి చర్మాన్ని తెల్లగా చేసే గుణం ఉంది. పాదరసం మూత్రపిండాలకు ప్రమాదకరమైన పదార్థం. మూత్రపిండాలకు హాని కలిగించే మరొక పదార్థం ఆర్సెనిక్. చాలా క్రీములలో వీటన్నింటి పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలం పాటు  వాడటం వల్ల, ఇది చర్మం ద్వారా రక్తంలో కలిసి మూత్రపిండాలకు చేరి ప్రమాదం కలిగిస్తుందని పరిశీలనలలో తేలింది. వైద్య సలహా లేకుండా ఎలాంటి క్రీములు వాడకుండా ఉండటం చాలా ఉత్తమం అని వైద్యులు చెబుతున్నారు.                                  *రూపశ్రీ.
నేటికాలంలో చాలామంది ఆరోగ్య స్పృహతో ఉంటున్నారు.  ఎంత బిజీగా ఉన్నా సరే.. తీసుకునే పండ్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు.  చాలామంది రోడ్ సైడ్ లేదా మాల్స్,  ఆఫీసుల దగ్గర దుకాణాలలో పిచ్చి  ఆహారాలకు బదులు ఫ్రూట్ చాట్ తినడం మంచిదని అనుకుంటారు. దుకాణాలలో కూడా వివిధ రకాల పండ్లను కలిపి ప్రూట్ చాట్ గా తయారు చేసి అమ్ముతుంటారు.  ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఫ్రూట్ చాట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివని అనుకుంటారు.  కానీ ఫ్రూట్ చాచ్ గురించి వైద్యులు,  ఆహార నిపుణులు దిమ్మతిరిగే నిజాలు చెబుతున్నారు.  ముఖ్యంగా వేసవిలో అందరూ ఫ్రూట్ చాట్ ఎక్కువగా తినాలని అనుకుంటారు కాబట్టి ఫ్రూట్ చాట్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ వైద్యులు ఏం చెప్పారో తెలుసుకోవాలి.. తొక్క వల్ల కలిగే నష్టం.. చాలా వరకు ఫ్రూట్ చాట్ లో పండ్ల మీద తొక్కను తొలగించి పండ్లను ముందుగానే ముక్కలు చేసి సిద్దంగా పెట్టి ఉంటారు. కస్టమర్లు రాగానే వాటిని అందిస్తుంటారు.  పండ్ల పై తొక్క పండ్లను చెక్కు చెదరకుండా రక్షిస్తాయి.  కానీ పండ్లను తొక్క తొలగించి  కోసిన తర్వాత ఈ రక్షణ పొర తొలగిపోతుంది. పండు లోపలి భాగం నేరుగా గాలి, దుమ్ము, కాలుష్యం,  మురికి మొదలైనవాటికి గురవుతుంది. ఈ పండ్లను ఎక్కువ కాలం పాటు, ముఖ్యంగా వేడి వాతావరణంలో  వదిలేస్తే, బ్యాక్టీరియా,  ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి. పరిశుభ్రత లోపించడం వల్ల రోడ్డు పక్కన పండ్లు అమ్మే చోట ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉంటుంది. నిల్వ.. కోసిన పండ్లను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే, అవి  తీవ్రమైన అనారోగ్యానికి గురిచేస్తాయి. ఈ కలుషితమైన పండ్లను తినడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఫుడ్ పాయిజన్,  కడుపునొప్పి,  వాంతులు విరేచనాలు, జ్వరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  ఇంట్లో  చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు వంటి  బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి ఇలాంటి ఫ్రూట్ చాట్ లేదా ముందే ముక్కలుగా కోసిన పండ్లు ఆరోగ్యానికి మరింత హాని చేసే అవకాశం ఎక్కువ. పోషణ ఉండవు..  శరీరానికి తగినంత పోషణ అందించడానికి  పండ్లు తింటాము, కానీ పండ్లను కోసి ఎక్కువ సేపు నిల్వ ఉంచడం వల్ల వాటిలోని ముఖ్యమైన పోషకాలు నశించిపోతాయని నిపుణులు చెబుతున్నారు. గాలికి నేరుగా గురికావడం వల్ల విటమిన్ సి వంటి సున్నితమైన, ప్రయోజనకరమైన పోషకాలు క్రమంగా నశించిపోతాయి. ముందుగా కోసిన పండ్లను తినడం వల్ల  అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉండటమే కాకుండా,  శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందవు. ప్యాక్ చేసిన కటింగ్ ఫ్రూట్స్.. సూపర్‌మార్కెట్లలో లభించే డబ్బాలలో ప్యాక్ చేసిన కోసిన పండ్లు, విడిగా అమ్మే పండ్ల కంటే కొంచెం సురక్షితమైనవిగా పరిగణించబడవచ్చు. అయినప్పటికీ, వాటిని కొనుగోలు చేసేటప్పుడు  జాగ్రత్తగా ఉండాలి. వాటి గడువు తేదీని,  వాటిని నిల్వ ఉంచిన ఉష్ణోగ్రతను  తనిఖీ చేయాలి. ఆరోగ్యంగా ఉండాలంటే.. మార్కెట్ నుండి  తాజాగా, కోయని పండ్లనే ఇంటికి తెచ్చుకోవాలి. పండ్లను శుభ్రమైన నీటితో బాగా కడిగి, ఆ తరువాతే కోయాలి. పండ్లను కోసిన తర్వాత వాటిని ఎక్కువ సేపు ఆరుబయట ఉంచకూడదు. కోసిన పండ్లు ఏవైనా మిగిలి ఉంటే, వాటిని గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. రోడ్డు పక్కన ఎలాంటి శుభ్రత లేని చోట,  ముందుగానే పండ్లను కోసి నిల్వ చేసి అమ్మే చోట పండ్ల ముక్కలు కొనుగోలు చేసి తినడం మంచిది కాదు.                                    *రూపశ్రీ.