LATEST NEWS
తమిళనాడు రాజకీయాల్లో  ఇప్పుడు అణ్ణామలై, రజనీకాంత్ కాంబినేషన్ పై తీవ్ర చర్చ జరుగుతోంది. ద్రావిడ రాజకీయాల కోటను బద్దలు కొట్టేందుకు తెరవెనుక చకచకా పావులు కదులుతున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై చుట్టూ తిరుగుతున్న ఒక ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు   పొలిటికల్ సర్కిల్స్‌ను పూర్తిగా షేక్ చేస్తోంది. నిన్నటివరకు తమిళనాడు బీజేపీలో అత్యంత యాక్టివ్, ఫైర్ బ్రాండ్ లీడర్‌గా చక్రం తిప్పిన అన్నామలై, ఆ పార్టీకి అధికారికంగా గుడ్ బై చెప్పిన తర్వాత ఒక సరికొత్త రాజకీయ వేదికను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆయన ఏర్పాటు చేసిన ఈ సరికొత్త వేదికకు క్షేత్రస్థాయిలో ప్రజల నుండి, ముఖ్యంగా యువత నుండి ఊహించని రీతిలో భారీ ఎత్తున స్పందన లభిస్తోంది.ఇలాంటి కీలక తరుణంలో, అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. దశాబ్దాలుగా సాగుతున్న సాంప్రదాయ ద్రావిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా, ఒక సరికొత్త రాజకీయ శకం ప్రారంభం కాబోతోందనే చర్చ ఇప్పుడు ఊపందుకుంది. అన్నామలై మొదటి నుంచి రజనీకాంత్‌ను తన వ్యక్తిగత గురువుగా, అంతకంటే ఎక్కువగా ఒక ఆధ్యాత్మిక మార్గదర్శిగా బహిరంగంగానే భావిస్తూ వస్తున్నారు. అన్నామలై తన ప్రతిష్టాత్మక ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత, 2020లో రజనీకాంత్ స్వయంగా ఆయనను తన నివాసానికి ఆహ్వానించి సుదీర్ఘంగా మాట్లాడారు. అప్పటినుంచే వీరిద్దరి మధ్య అత్యంత బలమైన సంబంధాలు, ప్రత్యేక అనుబంధం కొనసాగుతున్నాయి. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా అన్నామలై రెగ్యులర్‌గా రజనీకాంత్‌ను కలుస్తూనే ఉన్నారు.ప్రస్తుతం అన్నామలై బీజేపీని వీడిన ప్రత్యేక తరుణంలో, రజనీకాంత్ గతంలో కలలుగన్న  ఆధ్యాత్మిక రాజకీయం అనే సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని ఈ కొత్త కూటమి రూపుదిద్దుకోబోతున్నట్లు సమాచారం. ఈ వ్యూహం ప్రకారం, క్లీన్ ఇమేజ్ ఉన్న అన్నామలైను పార్టీ ఫ్రంట్ ఫేస్‌గా ముఖ్యమంత్రి అభ్యర్థిగా లేదా కీలక నేతగా పెట్టి, తెరవెనుక నుండి రజనీకాంత్ తన పూర్తి సపోర్ట్ ఇస్తారనే ప్రచారం జోరందుకుంది.  గతంలో రజనీకాంత్ సొంతంగా రాజకీయ పార్టీ పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ, చివరి నిమిషంలో ఆరోగ్యం సహకరించని కారణంగా వెనక్కి తగ్గిన విషయం  తెలిసిందే. అయితే ప్రస్తుతం తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే  హవాకు బ్రేక్ వేయడానికి ఈ సరికొత్త కాంబినేషన్ ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. క్లీన్ ఇమేజ్, అడ్మినిస్ట్రేటివ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న యువ నాయకుడు అన్నామలైకు, రజనీకాంత్ ఉన్న పాన్-ఇండియా ఇమేజ్ తోడైతే రాష్ట్రంలో తిరుగులేని మాస్ ఫోర్స్ క్రియేట్ అవుతుందని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు.  రజనీకాంత్ అభిమాన సంఘాలు కూడా అంతర్గతంగా ఈ కాంబినేషన్‌పై సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాక ముందే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ అవుతుండటం విశేషం. ఒకవేళ ఈ కాంబినేషన్ అధికారికంగా నిజమైతే, అది తమిళనాడు రాజకీయాలలో ఒక సంచలన కాంబినేషన్ అవుతుందనడంలో సందేహం లేదు. 
భారత  దక్షిణ సరిహద్దుల్లో ఉన్న అండమాన్ నికోబార్ దీవుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గ్రేట్ నికోబార్ ఐలాండ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ, పర్యావరణ దుమారాన్ని రేపుతోంది. నీతి ఆయోగ్ ప్రతిపాదనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం రూ. 81,000 కోట్ల భారీ వ్యయంతో ఈ ద్వీపంలో ఒక అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్, సివిల్ మరియు మిలిటరీ అవసరాల కోసం అంతర్జాతీయ విమానాశ్రయం, గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్,  అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ టౌన్‌షిప్‌ను నిర్మించాలని నిర్ణయించింది. మలక్కా జలసంధికి అత్యంత సమీపంలో ఉండటం వల్ల చైనా వ్యూహాత్మక ఆధిపత్యానికి గట్టి అడ్డుకట్ట వేయడానికి..  అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే  అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వివాదాస్పద ద్వీపాలను స్వయంగా సందర్శించి..  అక్కడ సముద్రంలోకి ప్రత్యేకంగా డైవింగ్ చేసి అక్కడి పర్యావరణాన్ని నిశితంగా పరిశీలించిన రాహుల్ గాంధీ ఒక ప్రత్యేక వీడియోను   విడుదల చేశారు. దేశ రక్షణ, అంతర్జాతీయ ఓడరేవు అనేవి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న పచ్చి అబద్ధాలని..  నిజానికి రక్షణ అవసరాలే ఉంటే అక్కడ ఇప్పటికే ఉన్న మిలిటరీ బేస్ ఐఎన్ఎస్ బాజ్ ను మరింత విస్తరించవచ్చని ఆయన పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం రక్షణ దళాల వెనుక దాక్కుని దేశ అమూల్యమైన భూములను కార్పొరేట్లకు దోచిపెట్టే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లింక్‌ను రాహుల్ గాంధీ ప్రధానంగా ప్రస్తావిస్తూ..  ఈ మెగా ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందేది కేవలం అదానీ మాత్రమేనని ఆరోపించారు. భారతదేశపు అత్యంత అరుదైన పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేసి, కేవలం ఒక వ్యాపారవేత్త కోసం అక్కడ లగ్జరీ హోటళ్లు, క్యాసినోలు,  రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించడానికి మోదీ ప్రభుత్వం నిర్ణయించిందని రాహుల్ ఆరోపించారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్ట్ పేరుతో లక్షలాది అడవులను  నరికివేసి, ఆ విలువైన కలపను అక్రమంగా తరలించి కోట్లాది రూపాయల వ్యాపారం చేసే పెద్ద స్కెచ్ దీని వెనుక ఉందని ఆరోపించారు.   పర్యావరణ పరంగా చూస్తే ఈ ప్రాజెక్టు వల్ల గ్రేట్ నికోబార్ ద్వీపానికి కోలుకోలేని శాశ్వత నష్టం వాటిల్లుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు, విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మెగా ప్రాజెక్ట్ నిర్మాణం కోసం సుమారు 130 చదరపు కిలోమీటర్ల మేర దట్టమైన ఉష్ణమండల వర్షారణ్యాలను పూర్తిగా తొలగించాల్సి వస్తుందని, దీనివల్ల దాదాపు 1.5 కోట్లకు పైగా అత్యంత అరుదైన వృక్షాలు నరికివేతకు గురవుతాయని రాహుల్ గాంధీ వాదిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యమైన సుందాలాండ్ బయోడైవర్సిటీ హాట్‌స్పాట్‌లో ఈ ద్వీపం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇక్కడ ఓడరేవు నిర్మాణం చేపట్టడం వల్ల సముద్ర గర్భంలో శతాబ్దాలుగా పెరుగుతున్న సజీవ పగడపు దిబ్బలు అంతరించిపోతాయని, అంతరించిపోతున్న అరుదైన లెదర్‌బ్యాక్ సముద్ర తాబేళ్ల ప్రధాన సంతానోత్పత్తి కేంద్రమైన గలాథియా బే పూర్తిగా కలుషితమైపోతుందని పర్యావరణ నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. కేవలం ప్రకృతికే కాకుండా, తరతరాలుగా అక్కడ నివసిస్తున్న షోంపెన్, నికోబారీస్ వంటి ప్రాచీన ఆదిమ గిరిజన తెగలను, అలాగే దేశం కోసం ప్రాణాలర్పించి అక్కడ స్థిరపడిన మాజీ సైనికుల కుటుంబాలను ఫారెస్ట్ రైట్స్ యాక్ట్‌ను పూర్తిగా ఉల్లంఘించి అక్రమంగా వారి సొంత భూముల నుండి ఖాళీ చేయిస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ శతాబ్దాల నాటి అడవులను దారుణంగా నరికేసి, దానికి పరిహారంగా ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానా, మధ్యప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో కొత్తగా మొక్కలు నాటుతామనడం పర్యావరణాన్ని, ప్రకృతిని దారుణంగా అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఈ వివాదాస్పద ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఆన్‌లైన్ పిటిషన్ ఉద్యమాన్ని కూడా ప్రారంభించడంతో, ఈ గ్రేట్ నికోబార్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత హాట్‌టాపిక్‌గా మారింది.
జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబుల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. నాయకుడిని ప్రశ్నించకుండా అనుసరించండి అంటూ నాగబాబు చేసిన ఓ ట్వీట్ పై ప్రకాశ్ రాజ్ మండి పడ్డారు.  మేము గొర్రెలం కాదు అంటూ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు.  దీంతో సోషల్ మీడియాలో జనసేన వర్సెస్ ప్రకాశ్‌ రాజ్‌ అన్నట్లుగా పొలిటికల్ హీట్ పెరిగింది. అసలీ వివాదం ఎలా మొదలైందంటే.. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీనిపై నాగబాబు..  నాయకుడి మాటే అంతిమం. ఏది ఒప్పో, ఏది తప్పో ఆయనకు మాత్రమే తెలుసు  ప్రశ్నించకుండా అనుసరించడం అంటూ పోస్టు చేశారు. దీనిపై  ప్రకాశ్ రాజ్ గొర్రెలం కాము అంటూ కౌంటర్ ఇచ్చారు.  ప్రకాశ్ రాజ్ తాజా కౌంటర్‌కు నాగబాబు ఏ విధంగా స్పందిస్తారోనని సర్వత్రాఆసక్తి నెలకొంది.
భారతీయ కార్పొరేట్ రంగంలోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ అత్యంత ప్రభావమంతమైన వ్యూహకర్తగా, బలమైన లాబీయిస్ట్ గా గుర్తింపు పొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ పరిమళ్ నత్వానీకి ఈసారి నిరాశే మిగిలింది. వరుసగా మూడు పర్యాయాలు, అంటే దాదాపు 18 ఏళ్ల పాటు  రాజ్యసభలో చక్రం తిప్పిన నత్వానీకి..  2026 రాజ్యసభ ఎన్నికల్లో ఎక్కడా చోటు దక్కలేదు. ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.  పరిమళ్ నత్వానీ రాజకీయ ఒక సారి  పరిశీలిస్తే ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌లో ఆయన ఆరితేరారని అర్థమవుతుంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి అత్యంత నమ్మకస్తుడైన నత్వానీ, 2008లో మొదటిసారిగా జార్ఖండ్   నుండి స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ బరిలోకి దిగారు. ఏ రాజకీయ పార్టీకి అధికారికంగా చెందని వ్యక్తి అయినప్పటికీ..  తనకున్న కార్పొరేట్ నెట్‌వర్క్, అద్భుతమైన లాబీయింగ్ వ్యూహాల ద్వారా స్థానిక ప్రాంతీయ పార్టీల మద్దతు  కూడగట్టుకుని అప్పట్లో సంచలన విజయం సాధించారు. ఆ విజయం యాదృచ్ఛికం కాదని నిరూపిస్తూ..  మళ్లీ 2014లో కూడా అదే జార్ఖండ్ నుండి రెండోసారి కూడా ఇండిపెండెంట్ గా  పెద్దల సభలో అడుగుపెట్టారు. జార్ఖండ్ లాంటి గిరిజన ప్రాధాన్యత, సంక్లిష్ట రాజకీయాలు ఉన్న రాష్ట్రంలో ఒక గుజరాతీ పారిశ్రామికవేత్త వరుసగా రెండుసార్లు ఇండిపెండెంట్ గా గెలవడం అప్పట్లో ఒక అరుదైన రికార్డుగా నిలిచింది. అయితే, 2020 నాటికి జార్ఖండ్ రాజకీయాల్లో ఊహించని మార్పులు రావడంతో నత్వానీ   ఆంధ్రప్రదేశ్ వైపు చూశారు. నాడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ స్వయంగా రంగంలోకి దిగి..  నాటి ఏపీ ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డితో తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ ఉన్నత స్థాయి చర్చల ఫలితంగా.. ఆంధ్రప్రదేశ్‌తో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ  వైసీపీ కోటా నుండి పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు దక్కింది. జగన్   తన సొంత పార్టీకి చెందిన ఎందరో సీనియర్ నేతలను, ఆశావహులను పక్కనబెట్టి మరీ నత్వానీని ఏపీ నుండి పెద్దల సభకు  పంపారు. ఈ విధంగా రెండుసార్లు జార్ఖండ్ నుండి, ఒకసారి ఆంధ్రప్రదేశ్ నుండి మొత్తం మూడు సార్లు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.   ప్రస్తుత 2026 ఎన్నికల నాటికి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలుకావడంతో, ఆ పార్టీకి ఈసారి ఒక్క రాజ్యసభ సీటును కూడా సొంతంగా గెలుచుకునే సంఖ్యాబలం  లేదు. ప్రస్తుతం ఖాళీ అవుతున్న 4 స్థానాలనూ అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికే  దక్కబోతున్నాయి.  మరోవైపు జార్ఖండ్‌లోనూ ప్రస్తుత అధికార, ప్రతిపక్ష కూటములు స్థానిక క్యాడర్‌కే ప్రాధాన్యత ఇవ్వడంతో అక్కడ కూడా నత్వానీకి మొండిచేయే ఎదురైంది. దీంతో..  ఒకప్పుడు తెరవెనుక ఉండి దేశ రాజకీయాలను శాసించిన రిలయన్స్ ప్రతినిధి పరిమళ్ నత్వానీ, ఈసారి ఏ రాష్ట్రం నుంచీ మద్దతు లభించక పెద్దల సభకు దూరమై మాజీ ఎంపీగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కమ్యూనిస్టులపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ చేసిన వాఖ్యలను సీపీఎం  రాష్ట్ర కార్యదర్శి  శ్రీనివాసరావు తప్పుపట్టారు.  విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో  జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ  కమ్యూనిజానికి కాలం చెల్లిందన్న పనికిరాని పాత చింతకాయ పచ్చడినే పవన్ కల్యాణ్‌ మరోమారు వండి వార్చారని, ఆ వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ అపరిపక్వతకు నిదర్శనమన్నారు.  పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు.   ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు   అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. మొన్నటి వరకు చేగువేరా, భగత్‌సింగ్ ఆదర్శాల గురించి చెప్పిన ఆయన నేడు కమ్యూనిజమే కాలం చెల్లిన సిద్ధాంతమంటున్నారని ఎద్దేవా చేశారు.   గతంలో కమ్యూనిస్టులతో పనిచేసిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత బిజెపి సరసన చేరి సనాతన ధర్మం గురించి   హడావుడి చేశారనీ.. ఇప్పుడేమో.. ఆంధ్ర ప్రజల్లో ప్రాంతీయ అభిమానం కూడా లేదని ఇప్పుడు మాట్లాడుతున్నారనీ, ఇలా రోజుకో మాట, పూటకో విధానాన్ని మార్చే ఆయన కమ్యూనిజం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వీశ్రీనివాసరావు విమర్శించారు.  మతతత్వ బిజెపితోచేరి యువతలో వస్తున్న మార్పుల్ని పవన్ కల్యాణ్ గుర్తించడం లేదని వీశ్రీనివాసరావు అన్నారు. 
ALSO ON TELUGUONE N E W S
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి చిత్రయూనిట్ సంతోషంగా ఉంది. తాజాగా సక్సెస్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు బుచ్చిబాబు ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులు థియేటర్లలో ఫ్యామిలీలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియో క్లిప్స్‌ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా పిల్లలతో కలిసి వచ్చి ఈ సినిమాను చూడటం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. 'పెద్ది' అనేది కేవలం ఒక కమర్షియల్ సినిమా మాత్రమే కాదు, అదొక అత్యంత స్ఫూర్తిదాయకమైన పాత్ర అని బుచ్చిబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను తీసుకువెళ్లి ఈ సినిమాను చూపించాలని ఆయన కోరారు. ఈ చిత్రం పిల్లల్లో మంచి మోటివేషన్ నింపుతుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు. తాను కథ రాసుకున్నప్పుడు ప్రేక్షకులు సినిమాను ఎంతలా ఓన్ చేసుకుంటారో అని భావించానో, ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోందని బుచ్చిబాబు సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు సినిమా చూసి ఇంటికి వెళ్లేటప్పుడు ఒక మంచి అనుభూతిని, సందేశాన్ని తమతో పాటు తీసుకెళ్తున్నారని వస్తున్న మెసేజ్‌లు తనను ఎంతో ఎగ్జైట్ చేస్తున్నాయని చెప్పారు. ఈ సినిమా విజయం వెనుక ఉన్న శ్రమను వివరిస్తూ, రామ్ చరణ్ పడ్డ కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించారని బుచ్చిబాబు కొనియాడారు. చరణ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారని, ఆయన నటన, డెడికేషన్ 'పెద్ది' చిత్రానికి అతి పెద్ద ప్లస్ పాయింట్ అని దర్శకుడు స్పష్టం చేశారు. మెగా పవర్‌ను స్క్రీన్‌పై చూడటం అభిమానులకు పూనకాలు తెప్పిస్తోందని అన్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన ఈ చిత్రం, విడుదలకు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఇప్పుడు విడుదల తర్వాత కూడా అదే జోష్‌ను కొనసాగిస్తూ టాలీవుడ్‌లో సరికొత్త రికార్డుల వైపు దూసుకుపోతోంది. బుచ్చిబాబు మేకింగ్, చరణ్ పెర్ఫార్మన్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.  
  ప్రముఖ అందాల భామ నికిలా విమల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు గత కొన్ని రోజులుగా నెట్టింట ఫుల్ జోష్ మోడ్ లో ట్రావెల్ చేస్తున్నాయి. దాంతో నిఖిలా విమల్ రంగంలోకి దిగి పెళ్ళికి సంబంధించిన విశేషాలని చాలా క్లియర్ కట్ గా చెప్పేసింది. నికిలా విమల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు నా మనసులో ఇప్పటివరకూ ఎవరూ లేరు.  ఎవర్ని ప్రేమించడం లేదు కూడా.పెళ్లి అనేది నా జీవితంలో ఇప్పుడే అంత అర్జంట్ కాదు. అసలు పెళ్లి గురించి నేనింకా  ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఆ ఆలోచనే ప్రస్తుతానికి లేదు. ప్రేమ, పెళ్లి అనేవి జీవితంలో చాలా పెద్ద విషయాలేమీ కావు. దానికి ఇంకా చాలా సమయం ఉంది. ఒకవేళ భవిష్యత్తులో అలాంటి ఆలోచన వస్తే అప్పుడు చూసుకోవచ్చు . ప్రస్తుతం నా దృష్టంతా పూర్తిగా సినిమాలపైనే ఉంది. మంచి క్యారెక్టర్స్ చేస్తూ నటిగా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవడమే నా ఏకైక లక్ష్యం. రూమర్స్ రావడం సహజమే అని చెప్పుకొచ్చింది. Also read: Nag ashwin: కల్కి 2 షూటింగ్ అప్‌డేట్.. నాగ్ అశ్విన్ సంచలన ప్రకటన  చైల్డ్ ఆర్టిస్ట్‌గా మలయాళ చిత్ర సీమలో కెరీర్ ప్రారంభించిన ఈ మలయాళ ముద్దుగుమ్మ తమిళ, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటూ నటిగా తన రేంజ్  మరింత పెంచుకోవాలని చూస్తుంది. తమిళంలో వెట్రివేల్, కిడారి, పంచుమిట్టాయి, తంబి, పోర్ తొళిల్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నికిలా, ఇటీవల మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'వాళై' సినిమాతో ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో మేడ మీద అబ్బాయి, గాయత్రి వంటి చిత్రాల్లో చేసింది.  
సుమంత్ (Sumanth) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మహేంద్రగిరి వారాహి' (Mahendragiri Varahi). సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రాజశ్యామల ‌ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై మధు కాలిపు, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.   మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.  సుమంత్ , మీనాక్షి గోసామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, సత్యసాయి శ్రీనివాస్, వంశీ చాగంటి, మంజు భార్గవి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు కథ మురళి అందించారు. జూన్ 8న 'మహేంద్రగిరి వారాహి' టీజర్ విడుదల కాబోతుంది. డివోషనల్ టచ్ ఉన్న సినిమా కావడంతో ఈ టీజర్ పై సోషల్ మీడియాలో ఆసక్తి నెలకొంది. ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ టీజర్ గురించి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.  మహేంద్రగిరి వారాహి టీజర్ విజువల్ గా ఆకట్టుకుంటుంది. రిచ్ విజువల్స్, ప్రామిసింగ్ సీజి వర్క్ తో గ్రాండ్ గా ఈ టీజర్ ఉండబోతోందని, ప్రేక్షకులు మహేంద్రగిరి వారహి టీజర్ తో సరికొత్త అనుభూతిని పొందుతారని మేకర్స్ చెబుతున్నారు. సుమంత్ కెరీర్ లో 'మహేంద్రగిరి వారాహి' సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో, ఫ్యామిలీ ఆడియన్స్ గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్ (Venkatesh) రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త విధ్వంసం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. కేవలం మూడు నెలల అతి తక్కువ వ్యవధిలోనే రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారింది. ఇద్దరు టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్లతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను లైన్‌లో పెట్టి అభిమానులకు డబుల్ ధమాకా అందించేందుకు ఆయన పక్కా ప్లాన్ రెడీ చేశారు. ఈ బాక్సాఫీస్ వేటలో మొదటి చిత్రంగా టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47' (AK47) నిలవనుంది. 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి ఎవర్ గ్రీన్ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు త్రివిక్రమ్ అందించిన అద్భుతమైన మాటలు, కథనాలు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక పక్కా ఫ్యామిలీ, ఫన్ అండ్ ఎమోషనల్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను 2026 దసరా పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ శరవేగంగా పనులు ముగిస్తున్నారు. దసరా సెలవుల అడ్వాంటేజ్‌తో థియేటర్లలో వెంకీ మామ వింటేజ్ ఫ్యామిలీ మ్యాజిక్ రిపీట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ దసరా పండగ హంగామా ముగిసిందో లేదో, సరిగ్గా మూడు నెలల గ్యాప్‌లోనే వెంకటేష్ తన తదుపరి బాంబును పేల్చడానికి రెడీ అవుతున్నారు. సక్సెస్‌ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వెంకీ అనిల్ 4' (VenkyAnil4) సంక్రాంతి బరిలో నిలవనుంది. ఇందులో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా నటిస్తుండటం విశేషం.  అనిల్ రావిపూడి అనగానే అందరికీ గుర్తొచ్చేది హిలేరియస్ కామెడీ, క్లీన్ ఎంటర్టైన్‌మెంట్. వెంకీ-రావిపూడి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల వర్షం కురిపించాయో అందరికీ తెలిసిందే. అనిల్ రావిపూడికి సంక్రాంతి సెంటిమెంట్ చాలా బలంగా ఉండటంతో, ఈ కొత్త క్రేజీ మల్టీస్టారర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను 2027 సంక్రాంతి కానుకగా జనవరిలో థియేటర్లలోకి తీసుకురావడానికి పక్కా ప్లాన్ సిద్ధం చేశారు. కేవలం 3 నెలల వ్యవధిలోనే దసరా, సంక్రాంతి వంటి టాలీవుడ్ బిగ్గెస్ట్ పండుగ సీజన్లను టార్గెట్ చేస్తూ విక్టరీ వెంకటేష్ వస్తుండటం ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.   
టాలీవుడ్‌లో మాస్ యాక్షన్ హీరోగా తనదైన ముద్ర వేసుకున్న నటుడు మాచో స్టార్ గోపీచంద్ (Gopichand). జూన్ 12న గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఒక అదిరిపోయే గిఫ్ట్ అందనుంది. టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కల్ట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా నిలిచిన గోపీచంద్ సూపర్ హిట్ చిత్రం 'గోలీమార్' (Golimaar) స్పెషల్ షోను ఆయన బర్త్‌డే కానుకగా ప్రదర్శించబోతున్నారు. పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో ఎంతో పవర్‌ఫుల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, గోపీచంద్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ ప్రతిష్టాత్మక బర్త్‌డే స్పెషల్ షో కోసం హైదరాబాద్‌లోనే అత్యంత పేరుగాంచిన అతిపెద్ద సింగిల్ స్క్రీన్ థియేటర్ అయిన బాలానగర్‌లోని మైత్రి విమల్ (Mythri Vimal) వేదికగా నిలవనుంది. గోపీచంద్ పుట్టినరోజు రోజైన జూన్ 12 ఉదయం 8:00 గంటలకు ఈ స్పెషల్ షో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఒక అద్భుతమైన స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో గోపీచంద్ చేతిలో గన్ పట్టుకుని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గంగారాం లుక్‌లో ఎంతో అగ్రెసివ్‌గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటేనే థియేటర్లలో అభిమానుల హంగామా మరియు ఈలలు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో అర్థమవుతోంది. పూరీ జగన్నాథ్ మార్క్ డైలాగ్స్, గోపీచంద్ నటన, చక్రి అందించిన అద్భుతమైన సంగీతం ఈ సినిమాను అప్పట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ డ్రామాగా నిలబెట్టాయి. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ సొసైటీలోని గ్యాంగ్‌స్టర్లను ఏరిపారేయడానికి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా ఎలా మారాడనే పాయింట్‌తో ఈ సినిమా సాగుతుంది. ఈ కల్ట్ క్లాసిక్ యాక్షన్ మూవీని మళ్లీ బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు నగరంలోని సినీ ప్రేమికులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ బర్త్‌డే సెలబ్రేషన్ షోకి సంబంధించిన ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. 
  కల్కి పార్ట్ 2(Kalki Part 2).. ఇండియన్ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ హోదాతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పార్ట్ 1 ని మించి హిట్ చెయ్యాలనే పట్టుదలతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అవ్వగా ప్రభాస్ కూడా కొన్ని రోజులు షూట్ లో పాల్గొన్నాడనే వార్తలు వచ్చాయి. అశ్విన్  నిర్మాతగా, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన'సింగ్ గీతం'. ఈ నెల 11 వ తేదీన రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో అశ్విన్ 'కల్కి 2' గురించి మాట్లాడుతు జూలై నుంచి 'కల్కి 2'  నాన్ స్టాప్ గా షూటింగ్ ని జరుపుకోనుంది చెప్పాడు. ఇప్పుడు ఈ మాట ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు కల్కి లవర్స్ లో జోష్ తెచ్చినట్లయింది. ఇప్పటికే దాదాపు 20 నుండి 25 రోజుల షూటింగ్‌ని మొదటి భాగంతో పాటే పూర్తి చేసినట్లు నాగ్ అశ్విన్ గతంలోనే హింట్ ఇచ్చారు. మిగిలిన ప్రధాన భాగం అంతా వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోయే లాంగ్ అండ్ కంటిన్యూస్ షెడ్యూల్స్ లో కంప్లీట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్ లో ఇండియన్ సినిమా లెజెండ్స్ అమితాబ్ బచ్చన్,  కమల్ హాసన్ మధ్య వచ్చే మైండ్ బ్లోయింగ్ ఫేస్-ఆఫ్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని ఆయన నమ్మకంగా చెప్పారు. అంతేకాకుండా మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సాధించిన భారీ వసూళ్ల రికార్డులను దృష్టిలో పెట్టుకుని, పార్ట్ 2 ని మరింత విజువల్ వండర్ గా, సరికొత్త 4వ ప్రపంచాన్ని (4th World) పరిచయం చేస్తూ నిర్మించబోతున్నట్లు సమాచారం. Also read: భయపడితే మాకు సంబంధం లేదు.. ఓటిటిలో దుమ్ము రేపుతున్న హర్రర్ క్రైమ్ థ్రిల్లర్ మరోవైపు జూన్ 11న రిలీజ్ కాబోతున్న 'సింగ్ గీతం' సినిమా వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన చారిత్రక నేపథ్యాన్ని కూడా నాగ్ అశ్విన్ ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారికి నా  మనసులో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయనపై ఉన్న గౌరవంతోనే 'జాతి రత్నాలు' సినిమా తర్వాత తాను ఈ చిత్రాన్ని నిర్మించాను. నిజానికి ఈ కథని  సింగీతం శ్రీనివాసరావు తన క్లాసిక్ మూవీ 'పుష్పక విమానం' కంటే ముందే రాసుకున్నారు. అప్పట్లో ఈ వినూత్నమైన మ్యూజికల్ కథని   కమల్ హాసన్ గారికి  కూడా వినిపించారని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇన్నాళ్లకి సింగీతం కలల ప్రాజెక్టుని మేము  నిర్మించడం చాలా ఆనందంగా  ఉందని చెప్పుకొచ్చాడు.  
Filmmaker Nag Ashwin, revealed interesting insights about Singeetham Srinivasa Rao's Sing Geetham. He stated that Singeetam originally pitched this very script to Kamal Haasan even before making the iconic Pushpaka Vimanam. Shelved for decades due to scheduling conflicts, the project has finally materialized, promising a timeless quality that Ashwin believes mirrors the veteran director's classic works. Set against the fictional gold mines of Kuberapuram, the film consciously avoids established stars in favor of newcomers like Ayaan, Ahalya Bamroo, and Shalini Kondepudi. Ashwin explained this was entirely Singeetam’s call, driven by the need to build a unique world untainted by the massive image of a superstar. Working with a fresh cast and crew allowed the filmmaker to mold the narrative organically, relying on his trademark humor and human-centric storytelling rather than relying on star power to carry the film. The film’s most daring gamble, however, is its format. Sing Geetham features no conventional dialogue; every spoken line is delivered as a song. Scored by Devi Sri Prasad, the film runs on a continuous musical loop. While Ashwin claims the format quickly feels natural to the viewer, he admits it poses a massive logistical nightmare for a pan-India release. Aside from the Tamil version, dubbing the film into other languages means painstakingly recomposing every single line to fit the new musical meter. Behind the scenes, the making of the film was an exercise in patience and spontaneity. Pre-production consumed nine months of intense writing and rehearsals, yet Singeetam remained ruthlessly impulsive on set. Ashwin, who treated his own role more as an assistant director executing a vision rather than a traditional producer, revealed that the veteran would frequently scrap and rewrite scenes on the spot. When reminded that he was changing his own written work, Singeetam would simply retort by asking if he didn't have the right to make a mistake. Ultimately, Ashwin views Sing Geetham through the same lens he viewed his own risky ventures like Mahanati, noting that while box office reception is unpredictable, an honest attempt at storytelling usually finds its audience. As a parting note for fans waiting for his own directorial work, Ashwin briefly stepped out of his producer role to confirm that the much-anticipated Kalki 2 will resume its continuous, fast-paced shooting schedule starting next month. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ని చూస్తూ ఉంటే వచ్చే మజానే వేరు. సదరు జోనర్ ని ఇష్టపడే ప్రియులైతే సినిమాలన్నీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కధాంశంతో వస్తే ఎంత బాగుండని అనుకుంటూ ఉంటారు. కన్నడ ఇండస్ట్రీ నుండి రీసెంట్‌గా థియేటర్లలోకి అలాంటి ఒక మూవీనే రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. ఆ మూవీనే 'పీటర్'.  ఇప్పుడు ఈ మూవీ జూన్ 4 నుంచి  ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో  స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఏప్రిల్ 10న విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం, కేవలం రెండు నెలల లోపే డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమవ్వడం విశేషం. ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎమ్‌డీబీ (IMDb) లో ఈ చిత్రానికి ఏకంగా 9.2/10 రేటింగ్ లభించడంతో మూవీపై నెట్టింట భారీ హైప్ క్రియేట్ అవుతోంది.  సుకేష్ శెట్టి దర్శకత్వం వహించగా, వృద్ధి స్టూడియోస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సంచలన చిత్రాలను పంపిణీ చేసిన 'KVN ప్రొడక్షన్స్' సంస్థ  డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలని తీసుకోవడం వల్ల   థియేటర్లలో భారీ ఎత్తున విడుదలైంది.  రాజేష్ ధ్రువ, జాన్వీ రాయల, రవిక్ష శెట్టి ప్రధాన పాత్రల్లో అద్భుతమైన నటనను కనబరిచారు. ముఖ్యంగా నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే ఒక వ్యక్తి జీవితం ఎలా మారుతుంది అనే బలమైన రివేంజ్ పాయింట్‌కు, గూస్‌బంప్స్ తెప్పించే హారర్ ఎలిమెంట్స్‌ను జోడించి దర్శకుడు సుకేష్ శెట్టి ఈ కథను వెండితెరపై ఆవిష్కరించిన విధానం  కట్టిపడేస్తుంది. Also read: Devi sri prasad: నా జీవితంలో మళ్లీ రాని అద్భుతమైన అవకాశం.. క్రేజీ ప్రాజెక్ట్ కి మ్యూజిక్ పై దేవిశ్రీ ప్రసాద్‌  విజువల్స్ పరంగా కూడా కొత్త అనుభూతిని ఇస్తుంది. సహజత్వం కోసం  కర్ణాటకలోని ప్రసిద్ధ కొడగు (కూర్గ్) జిల్లాకు చెందిన మడికేరి, భాగమండల పరిసరాల్లోని దట్టమైన అడవులు, మంచు కొండల మధ్య  షూట్ చేశారు. ఆ లోకేషన్స్ సినిమాలోని సస్పెన్స్ మరియు భయానక వాతావరణాన్ని మరింత పెంచాయి. కొన్ని హారర్ సీన్స్ అయితే థియేటర్లలో ఆడియెన్స్ ని  నిజంగానే భయపెట్టాయి. క్రైమ్ మరియు హారర్ జోనర్లను ఇష్టపడే వారికి ఈ వీకెండ్‌లో  'పీటర్' ఒక పర్‌ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.    
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'రణబాలి' (Ranabaali) ఇండస్ట్రీలో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో అలరించిన ఈ క్రేజీ కాంబినేషన్.. పెళ్లి తర్వాత తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్ పై విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా దూసుకుపోతున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఒక అదిరిపోయే అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా విజయవంతంగా 100 రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. సరిగ్గా వంద రోజుల పాటు నిర్విరామంగా సాగిన ఈ ప్రయాణంలో సినిమాకు సంబంధించిన కీలకమైన షెడ్యూల్స్ అన్నింటినీ దర్శకుడు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ మైలురాయిని రీచ్ అయిన సందర్భంగా మూవీ మేకర్స్ సరికొత్త లొకేషన్ స్టిల్స్ పంచుకున్నారు. అందులో ముఖ్యంగా వందవ రోజు షూటింగ్ సెట్‌లో సూర్యాస్తమయం వేళ భారీ క్రేన్ కెమెరాతో చిత్ర బృందం వర్క్ చేస్తున్న అద్భుతమైన సిల్హౌట్ దృశ్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరో విశేషం ఏమిటంటే, ఈ వంద రోజుల సుదీర్ఘ ప్రయాణంతో 'రణబాలి' సినిమాకు సంబంధించిన 90% షూటింగ్ పార్ట్ పూర్తిగా పూర్తయిపోయింది. కేవలం 10 శాతం మాత్రమే మిగిలి ఉండటంతో చిత్ర బృందం త్వరలోనే గుమ్మడికాయ కొట్టేందుకు సిద్ధమవుతోంది.  ఇటీవల కడప పరిసర ప్రాంతాల్లోని అందమైన, రాతి కొండల నేపథ్యంలో ఒక భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఎంతో శ్రమతో కూడిన ఈ కడప షెడ్యూల్ కూడా విజయవంతంగా ముగిసింది. దీనికి సంబంధించిన ఫోటోను కూడా పంచుకున్నారు. అక్కడ సుదూరంగా విండ్‌మిల్స్, సంధ్యా సమయపు రంగురంగుల ఆకాశం మరియు రాతి లోయల అద్భుతమైన లొకేషన్ బ్యాక్‌డ్రాప్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇస్తోంది. ఈ చిత్రం కేవలం ఒక సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు, ఇది నిజ జీవితంలో జరిగిన చారిత్రాత్మక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఒక భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా. పక్కా రియలిస్టిక్ ఎలిమెంట్స్‌తో పాటు భారీ ఎత్తున విజువల్స్ ఉండేలా మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను విజువల్ వండర్‌గా మలుస్తున్నారు.  విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం సెప్టెంబర్ 11న  థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.   
  రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్(Devi sri prasad)మ్యూజిక్ కి ఉన్న శక్తి ఏ పాటిదో అందరకి తెలిసిందే. అన్ని రకాల బాణీలతో సుదీర్ఘ కాలం నుంచి అభిమానులని, సంగీత ప్రియులని అలరిస్తు వస్తున్నాడు.   తన సంగీత ప్రయాణంలో మరో అరుదైన మైలురాయిని అందుకోబోతున్నారు. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సింగ్‌ గీతం' మూవీకి వర్క్ చేస్తున్నాడు. ఆ చిత్రానికి సంబంధించిన పలు విషయాలని ప్రేక్షకులతో పంచుకున్నాడు.   దేవి శ్రీప్రసాద్ మాట్లాడుతు 'సింగ్‌ గీతం ప్రాజెక్ట్ వెనుక ఉన్న గతాన్ని గుర్తుచేసుకుంటూ.. గతంలో పవన్ కల్యాణ్ హీరోగా, సింగీతం శ్రీనివాసరావు(Singeetam Srinivasarao) దర్శకత్వంలో 'యేసుక్రీస్తు' జీవితకథ ఆధారంగా ఒక భారీ సినిమాని  అధికారికంగా ప్రకటించారు. ఆ మూవీకి నేనే మ్యూజిక్ డైరెక్టర్.  కొన్ని అనివార్య కారణాల వల్ల  పట్టాలెక్కకపోయినప్పటికీ, అదే సమయంలో సింగీతం తనకు ఈ 'సింగ్‌ గీతం' కథాంశాన్ని వివరించారు. ఆ వినూత్నమైన ఐడియా వినగానే  థ్రిల్ అయ్యాను. 'విచిత్ర సోదరులు', 'పుష్పక విమానం' లాంటి క్లాసిక్ చిత్రాల సరసన నిలిచే మరో అద్భుతమైన ప్రయోగాత్మక చిత్రం. సింగీతం శ్రీనివాసరావు, కె. విశ్వనాథ్ వంటి దిగ్గజ దర్శకుల ఆలోచనలు ఎప్పటికీ పాతబడవు. సాధారణంగా కొన్ని కథలు రెండు లేదా మూడేళ్లలోనే ట్రెండ్ మారిపోయి అవుట్‌డేటెడ్ అయిపోతుంటాయి, కానీ సింగీతం నుంచి వచ్చిన 'పుష్పక విమానం', 'విచిత్ర సోదరులు', 'ఆదిత్య 369' వంటి ప్రయోగాలు చూస్తే.. అవి మరో 50 ఏళ్ల తర్వాత రావలసిన సినిమాల్లా అనిపిస్తాయి. 'సింగ్‌ గీతం' కూడా సరిగ్గా అలాంటి అద్భుతమైన కాలాతీత కథే. పూర్తిగా మ్యూజిక్, డాన్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. Also read: Janhvi kapoor: పెద్దిలో జాన్వీ కపూర్‌కి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా? ఈ పాపులర్ సింగర్ ఒక ఊరిలోని ప్రజలంతా హఠాత్తుగా మాట్లాడటం మానేసి, కేవలం పాటల ద్వారానే ఎందుకు కమ్యూనికేట్ చేయాల్సి వచ్చింది అనే వింతైన, వినోదాత్మక నేపథ్యంతో ఈ కథ నడుస్తుంది. ఇందులో కేవలం కామెడీ మాత్రమే కాకుండా, ప్రేక్షకులని  కట్టిపడేసే బలమైన ఎమోషన్స్, ఊహించని ట్విస్ట్‌లు ఉంటాయి. మూవీ చూశాక ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా షాక్ అవుతారు. దాదాపు ఏడాదిన్నర  పాటు సాగిన ఈ సుదీర్ఘ చిత్ర ప్రయాణంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. నా  జీవితంలో ఇలాంటి గొప్ప అవకాశం మళ్లీ రాదని  భావోద్వేగానికి గురయ్యారు. పదేళ్ల విరామం తర్వాత 90 ఏళ్లకు పైబడిన వయసులో లెజండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. సింగ్ గీతం జూన్ 11 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఆదివారం అనే మాట వినగానే మన ముఖాల్లో సంతోషకరమైన చిరునవ్వు వస్తుంది. ఇది కుటుంబంతో సమయం గడపడానికి,  పని నుండి విరామం తీసుకోవడానికి కేటాయించబడిన రోజుగా పరిగణిస్తారు. చిన్నప్పుడు పిల్లలు ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా అని ఎదురుచూసేవారు.. కానీ ఇప్పుడు పిల్లలు పెద్దలు కూడా ఆదివారం కోసం ఎదురుచూడటం సాధారణమైపోయింది.  భారతదేశంలో ప్రభుత్వ కార్యాలయాలకు  ఆదివారం వారపు సెలవుదినంగా ఉంటుంది. కానీ ఆదివారం అనేది మొదటి నుండి సెలవు దినంగా ఉన్నది కాదని,  ఆదివారం సెలవు దినం కావడం వెనుక చాలా ఆసక్తికరమైన సంఘటన ఉంది. దాని గురించి తెలుసుకుంటే.. కార్మిక హక్కులు.. బ్రిటిష్ పాలన కాలంలో  ఆదివారంను వారపు సెలవు దినంగా ఎంచుకున్నారు. దీని  వెనుక ఒక  కథ ఉంది. ఆదివారం సెలవు వెనుక కథ.. ప్రస్తుత కాలం ఆదివారంతో చేసే ఎంజాయ్మెంట్ ఎప్పుడూ ఉండేది కాదు.  ఎందుకంటే  బ్రిటిష్ పాలనలో భారతదేశంలోని వస్త్ర మిల్లులలో, ముఖ్యంగా ముంబైలోని కార్మికుల పరిస్థితులు దారుణంగా ఉండేవి. వారు వారానికి ఏడు రోజులు విరామం లేకుండా పని చేయాల్సి వచ్చింది. వారం మొత్తం ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఆరోగ్యం చాలా దెబ్బతినేది. ఈ క్లిష్ట సమయంలో నారాయణ్ మేఘాజీ లోఖండే వారి హీరో అయ్యాడు. 7ఏళ్ల పోరాటం.. కార్మికుల దుస్థితిని చూసి లోఖండే వారి హక్కుల కోసం గొంతు విప్పాడు. 1881,  1884 మధ్య ఎన్నో నిరసనలు నిర్వహించి బ్రిటిష్ పరిపాలకులకు చాలా సందేశాలను పంపాడు. అతని విజ్ఞప్తిపై వేలాది మంది కార్మికులు ఏకమయ్యారు. కానీ అది చిన్న పోరాటం కాదు. ఈ ఉద్యమం ఏడు సంవత్సరాలు కొనసాగింది. చివరికి కార్మికుల సంఘీభావం,  లోఖండే ప్రయత్నాలకు బ్రిటిష్ ప్రభుత్వం లొంగిపోయింది.   జూన్ 10, 1890న, భారతదేశంలో  ఆదివారం అధికారికంగా వారపు సెలవు దినంగా ప్రకటించబడింది. ఆదివారం సెలవు వెనుక అసలు కారణం.. ఆదివారం సెలవు దినంగా ఎంచుకోవడం వెనుక మతపరమైన,  ఆచరణాత్మక కారణాలు రెండూ ఉన్నాయి. ఆ సమయంలోభారతదేశాన్ని క్రైస్తవ మతాన్ని ఆచరించే బ్రిటిష్ వారు పరిపాలించారు. వారికి ఆదివారం చర్చికి వెళ్లడానికి సరైన రోజు. అందువల్ల ఆదివారం సెలవు దినంగా ఎంచుకున్నారు. భారతీయ సంస్కృతి,  హిందూ మతంతో అనుసంధానిస్తూ ఆదివారం సూర్యభగవానుడికి,  కొన్ని ప్రాంతాలలో ఖండోబాకు అంకితం చేయబడిందని ఒక వాదన ముందుకు వచ్చింది. బ్రిటిష్ వారిలాగే భారతీయ కార్మికులు కూడా విశ్రాంతి,  పూజ కోసం ఒక రోజును కలిగి ఉండాలి. 1700 సంవత్సరాల చరిత్ర.. ఆదివారాన్ని విశ్రాంతి దినంగా చేయడం అనేది  భారతదేశంలో పుట్టినది కాదు. దీని చరిత్ర చాలా కాలం నాటిది. 321 ADలో, రోమన్ చక్రవర్తి కాన్‌స్టాంటైన్ ది గ్రేట్ మొదట ఆదివారాన్ని రోమన్ సామ్రాజ్యం అంతటా విశ్రాంతి దినంగా ప్రకటించాడు. క్రమంగా ఈ సంప్రదాయం యూరప్,  తరువాత బ్రిటన్ పరిపాలనా వ్యవస్థలో భాగమైంది.  వారు దానిని భారతదేశానికి తీసుకువచ్చారు. అంతే తప్ప భారతీయులకు ప్రత్యేకంగా ఈ ఆదివారం సెలవు వెనుక ఎలాంటి ప్రాధాన్యత లేదు.                                        *రూపశ్రీ.
 భారతదేశ  పరిమళం ఇప్పుడు సప్త సముద్రాల ఆవలి దేశాల వాతావరణంతో మేళవిస్తోంది. ఆ దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు మనకంటే పూర్తిగా భిన్నమైనవి. మనం మన పెరటి మొక్కగా అంతకంటే ఎక్కువ ఇంటి దేవతగా  భావించి, ప్రతి ఉదయం, సాయంత్రం నీళ్ళు పోసి పూజించే  తులసి, ఇప్పుడు ప్రపంచంలోని ప్రధాన ముస్లిం దేశాల మొదటి ఎంపికగా మారింది. ఈ మాట తెలియగానే చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది.  కానీ  ఇటీవలి డేటా , వాణిజ్య నివేదికలు ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని వెల్లడించాయి. బంగ్లాదేశ్, మలేషియా , ఇండోనేషియా వంటి దేశాలలో భారతీయ తులసికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇది కేవలం వాణిజ్యానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, భారతీయులుగా తెలుసుకోవాల్సిన విషయం. తులసిని కేవలం మొక్కగా బావించే ఎంతోమంది విదేశీయులు కూడా తులసికి ఎందుకంత గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. విదేశాలలో తులసి.. సనాతన ధర్మంలో, తులసిని కేవలం ఒక మొక్కగా మాత్రమే కాకుండా, "సాక్షాత్తు లక్ష్మీదేవి" స్వరూపంగా భావిస్తారు. పెరట్లో తులసి ఉన్న ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించలేదని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ నేడు, ఈ నమ్మకం అన్ని హద్దులను దాటింది. ఇటీవలి నివేదికల ప్రకారం, తులసి,  దాని సారాలు భారతదేశం నుండి పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ , మలేషియా వంటి ఆగ్నేయాసియా దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నాయి. ఆశ్చర్యకరంగా, ఈ దేశాలు దీనిని కేవలం ఒక మొక్కగా మాత్రమే కాకుండా, ఒక "దివ్య ఔషధం"గా స్వీకరిస్తున్నాయి. విదేశాలలో తులసికి ఆదరణ.. విదేశాలలో తులసి ఆదరణ  వెనుక విజ్ఞానం  ఆధ్యాత్మికతల కలయికను ప్రతిబింబించే అనేక లోతైన , తార్కిక కారణాలు ఉన్నాయి. నయంకాని వ్యాధులకు సర్వరోగ నివారిణిగా తులసి పనిచేస్తుంది. ఈ దేశాలలో ఆయుర్వేదంపై నమ్మకం పెరిగింది. అక్కడి శాస్త్రవేత్తలు కూడా క్యాన్సర్, మధుమేహం , శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో తులసి ప్రభావవంతంగా పనిచేస్తుందని గుర్తించి దాన్ని వైద్యంలో భాగం చేస్తున్నారట. హలాల్ గుర్తించిన మూలిక.. మలేషియా , ఇండోనేషియా వంటి దేశాలలో, "హలాల్" ఉత్పత్తులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసి ఉత్పత్తులు సహజమైనవి , స్వచ్ఛమైనవి, వీటిలో నిషేధిత రసాయనాలు ఏవీ ఉండవు. ఈ కారణంగానే అక్కడి ముస్లిం సమాజంలో వీటికి ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. తులసి టీ.. భారతీయ "తులసి టీ" కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రజలు కెఫిన్‌ను వదిలిపెట్టి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి , రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తులసి సారాన్ని ఆశ్రయిస్తున్నారు. తులసితో టీ తయారు చేసుకుని తాగుతున్నారు. మతపరమైన దృక్కోణం నుండి చూస్తే ప్రతి భారతీయుడు దీన్ని  గర్వంగా భావించాలి. మనం విష్ణువుకు ఎంతో ప్రతీకరమైనదిగా  పిలుచుకునే మొక్క పరిమళం ఇప్పుడు విభిన్నమైన ప్రార్థనా పద్ధతులున్న ఇళ్లకు చేరుతోంది. సనాతన సంస్కృతి పూజించే ప్రకృతిలోని ప్రతి అంశం మానవులకు ఎంతో మేలు చేసేది, ఆరోగ్యం చేకూర్చేది అనేటువంటి దానికి ఇదొక నిదర్శనం.   ప్రపంచ మార్కెట్లో తులసికి ప్రాధాన్యత.. భవిష్యత్తులో తులసి ప్రపంచ మూలికా మార్కెట్‌కు బిలియన్ల డాలర్ల మేర దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. గత మూడేళ్లలో గల్ఫ్ దేశాలకు తులసి ఎగుమతులు 30-40% పెరిగాయట. దుబాయ్ , సౌదీ అరేబియాలోని విలాసవంతమైన స్పా మరియు బ్యూటీ పార్లర్లలో ఇప్పుడు తులసి ఆధారిత ఫేస్ మాస్క్‌లు , నూనెలను ప్రీమియం ట్రీట్మెంట్ లో భాగంగా గా అందిస్తున్నారట. భారతీయులకు ఎంతో పవిత్రమైన,  ఆయుర్వేదంలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నట్టు పేర్కొన్న తులసిని భారతీయులు చిన్నతనం చేయకుండా ఉపయోగించుకోవాలి.                                      *రూపశ్రీ.
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తప్పులు చేస్తాడు. కానీ అంతమాత్రాన వారు తప్పు చేస్తున్నారని, వారు తప్పు వ్యక్తులని కాదు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకున్నప్పుడు,  తరచుగా పొరపాట్లు చేస్తారు. తరువాత  దాని గురించి పశ్చాత్తాపపడతారు. చాలా వరకు ప్రతి వ్యక్తి తన నిర్ణయం సరైనదని నమ్ముతాడు, కానీ కాలక్రమేణా, వారి భ్రమలు తొలగిపోతాయి. ఒక వ్యక్తి తీసుకునే ప్రతి నిర్ణయం వారి మనస్సు , మెదడు డైరెక్షన్ ద్వారా నడుస్తుంది.  ఈ విషయాన్ని స్వయానా ఆచార్య  చాణక్యుడు స్పష్టం చేశాడు. మనిషి మనస్సు , మెదడు పూర్తీ సామరస్యంతో లేనంత వరకు, వారి నిర్ణయాలు తప్పు అని రుజువవుతాయని చాణక్యుడు నమ్ముతాడు. మనస్సు , మెదడు సంపూర్ణ సామరస్యంతో లేకపోతే, వారి సొంత మనస్సే వారికి శత్రువుగా మారుతుంది.ఒక వ్యక్తికి తన సొంత మనస్సే శత్రువుగా మారడానికి గల ఐదు కారణాలను ఆచార్యుడు స్పష్టంగా వివరించాడు.  అవేంటో తెలుసుకుంటే.. బాలెన్స్ లేకపోవడం.. నిర్ణయం తీసుకునే సామర్థ్యం  వ్యక్తి యొక్క మనఃస్థితి , మెదడుపై ఆధారపడి ఉంటుందని ఆచార్య చాణక్యుడు అంటాడు. అందువల్ల ఒక వ్యక్తి నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రశాంతంగా ఉంటే, ఆ నిర్ణయం మెరుగ్గా ఉంటుంది. అయితే వ్యక్తి భావోద్వేగాల ప్రభావంతో నిర్ణయం తీసుకున్నప్పుడు, ఫలితం ప్రతికూలంగా ఉంటుంది.  దాని వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. దురశాతో ఆధిపత్యం చెలాయించడం.. దురాశ  మనిషిని  ఆవరించినప్పుడు, వారు సరైన నిర్ణయాలు తీసుకోలేరని చాణక్యుడు చెబుతాడు. లాభాపేక్ష అనే ఆలోచనే మనిషిలో దురాశ పుడుతుంది.   ప్రయోజనాల కారణంగా జరిగే నష్టాల గురించి ఆలోచించరు. ఈ అలవాటు నేటికాలంలో చాలామందిలో చాలా ఎక్కువగా ఉంది.  వ్యాపారవేత్తలు కూడా అధిక లాభాల ఆశతో పెట్టుబడుల నుండి వచ్చే  నష్టాలను తరచుగా పట్టించుకోరు. చాణక్యుని దృష్టిలో, దురాశ , తొందరపాటు మనసును శత్రువుగా మారుస్తాయి. కోపం.. కోపం ముఖ్యమైన సంబంధాలను కూడా క్షణాల్లో విచ్ఛిన్నం చేస్తుంది.  చాణక్యుని ప్రకారం ఇది ఒక వ్యక్తి యొక్క ఆలోచనను, ఇతరులు చెప్పే విషయాన్ని వినాలనే ఆసక్తిని కూడా అణిచివేస్తుంది.  కోపంలో ఉన్నప్పుడు మనిషి తన కోపాన్ని బయటకు వ్యక్తం చేస్తాడు అంతే కానీ.. ఆలోచించి  జరిగిన విషయం గురించి ఆలోచించి సమస్యను పెద్దది కాకుండా ఆపే విచక్షణ ఉండదు. అందుకే తన కోపమే తన శత్రువు అని అన్నారు.ఈ కోపం మనిషి మనసును కూడా శత్రువుగా మారుస్తుంది. అతిగా ఎమోషనల్ బాండింగ్.. ఆచార్య చాణక్యుని ప్రకారం మితిమీరిన ఎమోషనల్ బాండింగ్ కూడా ఒక వ్యక్తికి హాని చేస్తుంది. ఒక వ్యక్తి ఎవరితోనైనా భావోద్వేగపరంగా చాలా గాఢంగా ముడిపడి ఉన్నప్పుడు, వారు నిజానిజాలు సరిచూసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ పరిస్థితిలో భ్రమల ఏది, నిజం ఏది తెలుసుకోలేరు.  తమ భ్రమ పడే విషయమే నిజం అని కూడా అనుకుంటారు. ఈ కారణంగానే అపార్థాలు కూడా చాలా సులువుగా వచ్చేస్తాయి. సందేహంతో తీసుకునే నిర్ణయాలు.. చాణక్యుడు జ్ఞానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చాడు. అసంపూర్ణ జ్ఞానం భవిష్యత్తుకు హాని కలిగిస్తుంది.    పూర్తి నిజం తెలుసుకోకుండా తుది నిర్ణయానికి రావడం చాలా ప్రమాదమని,  దీనివల్ల చాలా నష్టపోవాల్సి ఉంటుందని చెబుతాడు. సందేహంతో తీసుకునే   నిర్ణయాలు కంటే వాస్తవాలను అర్థం చేసుకుని తీసుకునే నిర్ణయాలు మనిషిని నష్టానికి దూరంగా ఉంచుతాయి.                                 *రూపశ్రీ.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం అనేది ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా 30-32 ఏళ్ల చిన్న వయసులోనే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూనో, ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తూనో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వార్తలు మనల్ని కలచివేస్తున్నాయి. ఆసుపత్రికి వెళ్తే స్టెంట్ వేయాలని లేదా డయాలసిస్ చేయాలని చెప్పినప్పుడు ఆ కుటుంబం పడే వేదన వర్ణనాతీతం. కానీ, ప్రకృతి ప్రసాదించిన ఆహార నియమాలతో, ఆపరేషన్లు లేకుండానే గుండె బ్లాకులను తొలగించుకోవచ్చని మరియు కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని డాక్టర్ శ్రీనివాస్ గుప్త గారు ఈ VIDEO లో వివరించారు. మనం ఈ మార్పును ఎందుకు ఎంచుకోవాలి? (Why Should We?) సాధారణంగా గుండెలో బ్లాక్స్ ఉన్నాయని తెలిస్తే వెంటనే సర్జరీ వైపు మొగ్గు చూపుతాము. అయితే, సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా శరీరానికి ఎటువంటి హాని కలగకుండా ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు. సర్జరీ భయం లేకుండా: స్టెంట్ లేదా బైపాస్ సర్జరీల అవసరం లేకుండానే 20% నుండి 40% వరకు బ్లాకులను సహజంగా తగ్గించుకోవచ్చు. దుష్ప్రభావాలు లేని వైద్యం: ఎటువంటి ఇంజెక్షన్లు లేదా కెమికల్ మెడిసిన్స్ లేకుండా కేవలం కూరగాయల రసాలు మరియు ఆయుర్వేద పద్ధతులతో చికిత్స పొందవచ్చు. సమగ్ర ఆరోగ్యం: ఇది కేవలం గుండెకే కాదు, షుగర్, బీపీ, మరియు కిడ్నీ సమస్యలను కూడా ఒకేసారి అదుపులోకి తెస్తుంది. ఏమి చేయకూడదు? (What Not to Do?) ఆరోగ్యంగా ఉండాలంటే మందుల కన్నా ముందు కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం ముఖ్యం: నూనె వాడకం: నూనెతో వేయించిన పదార్థాలను (Oil-fried foods) పూర్తిగా పక్కన పెట్టాలి. ప్రిజర్వేటివ్స్ మరియు సాల్ట్: బ్రెడ్, నూడిల్స్, బేకరీ ఫుడ్స్ వంటి వాటిలో ఉప్పు మరియు ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి బీపీని మరియు కిడ్నీ సమస్యలను పెంచుతాయి. తెల్ల అన్నం మరియు గోధుమలు: కనీసం మూడు నెలల పాటు వైట్ రైస్ మరియు గోధుమలను దూరం పెట్టి, సిరిధాన్యాలు లేదా బార్లీ రొట్టెలు తీసుకోవాలి. పొగత్రాగడం: గుండె సమస్యలకు ప్రధాన కారణమైన స్మోకింగ్ వంటి అలవాట్లను తక్షణమే మానేయాలి. ఆరోగ్యాన్ని తిరిగి పొందే మార్గం (How to do?) డాక్టర్ శ్రీనివాస్ గుప్త గారు సూచించిన ఈ చిట్కాలను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి: 9 వారాల జ్యూస్ థెరపీ: మొదటి వారం: ఉదయాన్నే ఖాళీ కడుపుతో బూడిద గుమ్మడికాయ జ్యూస్ (200 ml). రెండో వారం: సొరకాయ జ్యూస్. మూడో వారం: కీరా (కుకుంబర్) జ్యూస్. ఈ విధంగా ఈ మూడు వారాల చక్రం 9 వారాల పాటు (మొత్తం 3 సార్లు) కొనసాగించాలి. ఆహార నియమాలు (Plate 1 & Plate 2): మొదటి ప్లేట్‌లో కేవలం పండ్లు (బ్లూబెర్రీస్, ఆపిల్, జామకాయ) మరియు మొలకలు తీసుకోవాలి. రెండవ ప్లేట్‌లో నూనె లేకుండా వండిన కూరలు, బార్లీ లేదా రాగి రొట్టెలు తీసుకోవాలి. కిడ్నీ మరియు బీపీ కోసం సహజ టీలు: కొలెస్ట్రాల్ తగ్గడానికి దాల్చిన చెక్క నీళ్లు తాగాలి. బీపీ అదుపులో ఉండటానికి కరివేపాకు డికాక్షన్ తీసుకోవాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు 5 వేపాకులు, 3 రావి ఆకులను నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగడం ద్వారా క్రియాటినిన్ స్థాయిలు తగ్గుతాయి. జీవనశైలి మార్పులు: సాయంత్రం 7 గంటల లోపే డిన్నర్ పూర్తి చేయాలి. ప్రతిరోజూ చెప్పులు లేకుండా నడవాలి (Barefoot walking), దీనివల్ల పాదాలలోని ఆక్యుప్రెషర్ పాయింట్లు స్టిమ్యులేట్ అవుతాయి. సాధారణ సందేహాలు (Q&A) ప్ర: డయాలసిస్ ఆపడం సాధ్యమేనా?  జ: అవును, సహజ ఆహారం మరియు వేపాకు, రావి ఆకుల కషాయం వంటి నాచురల్ ట్రీట్‌మెంట్ ద్వారా క్రియాటినిన్ తగ్గించి డయాలసిస్ అవసరం లేకుండా చేయవచ్చని డాక్టర్ గారు అబ్సర్వ్ చేశారు. ప్ర: ఆయిల్ లేకుండా వంటలు రుచిగా ఉంటాయా?  జ: ఖచ్చితంగా! ఇడ్లీ కుక్కర్‌లో స్టీమ్ చేసిన మిర్చి బజ్జీలు లేదా బొండాలు వంటి వాటిని నూనె లేకుండానే ఎంతో రుచిగా చేసుకోవచ్చు. ప్ర: హార్ట్ హెల్త్‌ను ఎలా చెక్ చేసుకోవాలి?  జ: 40 ఏళ్లు దాటిన వారు కనీసం 4-5 ఏళ్లకు ఒకసారి 'సిటీ కరోనరీ యాంజియోగ్రామ్' (CT Coronary Angiogram) చేయించుకోవాలి. AI సాయంతో కేవలం 2 నిమిషాల్లోనే రిపోర్ట్ వస్తుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
  చాలామంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాళ్ల పిక్కలు పట్టేయడం (Leg Cramps at Night) వల్ల తీవ్రమైన నొప్పితో మేల్కొంటూ ఉంటారు. కండరాలు గట్టిగా బిగుసుకుపోయి, కాళ్లు కదల్చలేనంతగా వచ్చే ఈ నొప్పిని ఆయుర్వేదంలో 'ఖల్లీ వాతం' అని అంటారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి ఇంట్లోనే ఉండి ఎలాంటి ఖర్చు లేకుండా చేసుకోగలిగే ఆయుర్వేద పరిష్కారాలు ఏమిటో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. చిట్టిభొట్ల మధుసూదన శర్మ (MD-Ayurveda) గారు చెప్పిన మాటలు ఈ VIDEO ద్వారా తెలుసుకుందాం.   కాళ్ల పిక్కలు పట్టేయడానికి ప్రధాన కారణాలు: శరీరంలో వాత దోషం పెరగడం. డీహైడ్రేషన్ లేదా శరీరంలో నీటి శాతం తగ్గడం. రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం. విటమిన్లు, ఖనిజాల (మెగ్నీషియం, పొటాషియం) లోపం. డా. చిట్టిభొట్ల సూచించిన అద్భుత ఆయుర్వేద హోం రెమెడీ: ఈ సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి పొందడానికి మన వంటగదిలో దొరికే మూడు సహజసిద్ధమైన పదార్థాలతో సులువైన మందును తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు: శొంఠి పొడి (Ginger Powder) మిరియాల పొడి (Black Pepper Powder) జీలకర్ర పొడి (Cumin Powder) తయారుచేసే విధానం మరియు వాడే పద్ధతి: పైన పేర్కొన్న మూడు పదార్థాలను సమాన మోతాదులో తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు లేదా మీ వైద్యుల సలహా మేరకు అర టీస్పూన్ మోతాదులో కొద్దిగా గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవాలి. ఈ చిట్కా శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి, వాతాన్ని తగ్గించి, కండరాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
వేడి, విరేచనాలు లేదా వాంతులు వంటివి శరీరంలోని నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను త్వరగా దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ తాగడం చాలా ముఖ్యం. చాలా నీరసంగా ఉన్నప్పుడు, ఆహారం సరిగా తీసుకోలేనప్పుడు వైద్యులు కూడా ఓఆర్ఎస్ తీసుకోమని చెబుతుంటారు. ఓఆర్ఎస్ అనగానే మార్కెట్లో దొరితే  రెడీమేడ్ ఓఆర్ఎస్ గుర్తుకు వస్తుంది.  వీటిని బాగా మరిగించి చల్లార్చిన నీటిలో కలిపి తాగాలని చెబుతారు.   కానీ వాటిని ప్రతిరోజూ కొనడం ఖర్చుతో కూడుకున్నది. ఇది మాత్రమే కాదు.. ఈ మధ్యకాలంలో మార్కెట్లో దొరికే రెడీమేడ్ ఓఆర్ఎస్ కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు. అందుకే ఇంట్లోనే ఈజీగా ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు. ఇది ఖర్చు తక్కువ, పైగా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంట్లోనే ఓఆర్ఎస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే.. ఓఆర్ఎస్ తయారు చేసే విధానం.. కావలసిన పదార్థాలు..  1 లీటరు శుభ్రమైన లేదా మరిగించిన చల్లటి నీరు  6 టీస్పూన్ల చక్కెర (సుమారు 30 గ్రాములు)  ½ టీస్పూన్ ఉప్పు (సుమారు 3 గ్రాములు) ఎలా తయారు చేయాలి? ముందుగా 1 లీటరు నీటిని మరిగించి చల్లారనివ్వాలి. శుభ్రమైన పాత్రలో లేదా సీసాలో నీళ్ళు పోయాలి. దానికి 6 టీస్పూన్ల చక్కెర , అర టీస్పూన్ ఉప్పు కలపాలి. పంచదార, ఉప్పు పూర్తిగా కరిగే వరకు మిశ్రమాన్ని బాగా కలపాలి.  ఇలా చేస్తే ఇంట్లో తయారు చేసుకున్న ఓఆర్ఎస్ సిద్ధంగా ఉంది. దీనిని కొద్దికొద్దిగా తాగుతూ ఉండాలి. ఓఆర్ఎస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు.. విరేచనాలు, వాంతులు లేదా అధికంగా చెమట పట్టడం వల్ల శరీరంలో  డీహైడ్రేషన్ కలగవచ్చు. ఓఆర్ఎస్ శరీరాన్ని తిరిగి హైడ్రేట్ గా మార్చడంలో  సహాయపడుతుంది. ఓఆర్ఎస్ లో ఉండే ఉప్పు , చక్కెర శరీరంలో సోడియం, పొటాషియం , ఇతర ముఖ్యమైన ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయి. డీహైడ్రేషన్  వల్ల కలిగే అలసట, తలతిరగడం , నీరసాన్ని తగ్గించడంలో ఓఆర్ఎస్ ప్రభావవంతంగా పనిచేస్తుంది.  తీవ్రమైన వేడి , వడగాలుల సమయంలో ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది , అంతేకాదు వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. విరేచనాలు, వాంతుల సమయంలో పిల్లలు, వృద్ధులు డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ చాలా సహాయపడుతుంది. అనారోగ్యం లేదా ఇన్ఫెక్షన్ తర్వాత శరీరంలోని నీరు , ఖనిజాల లోపాలను భర్తీ చేయడం ద్వారా వేగంగా కోలుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఓఆర్ఎస్ తాగేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. ఓఆర్ఎస్ ను 24 గంటల కంటే ఎక్కువసేపు నిల్వ ఉంచకూడదు.  ఎల్లప్పుడూ శుభ్రమైన, మరిగించిన నీటిని వాడాలి. ఉప్పు, చక్కెర పరిమాణాన్ని సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ లేదా తక్కువ పరిమాణం హానికరం కావచ్చు. విరేచనాలు, వాంతులు లేదా డీహైడ్రేషన్ సమస్య తీవ్రంగా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.  చిన్న పిల్లలు , తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారి కోసం ఓఆర్ఎస్ ను నమ్ముకోకుండా  వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.                                         *రూపశ్రీ.