Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గొర్రెలంకాదు.. నాగబాబుకు ప్రకాశ్ రాజ్ కౌంటర్
posted on: Jun 6, 2026 3:29PM

జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబుల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. నాయకుడిని ప్రశ్నించకుండా అనుసరించండి అంటూ నాగబాబు చేసిన ఓ ట్వీట్ పై ప్రకాశ్ రాజ్ మండి పడ్డారు. మేము గొర్రెలం కాదు అంటూ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో జనసేన వర్సెస్ ప్రకాశ్ రాజ్ అన్నట్లుగా పొలిటికల్ హీట్ పెరిగింది.
అసలీ వివాదం ఎలా మొదలైందంటే.. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీనిపై నాగబాబు.. నాయకుడి మాటే అంతిమం. ఏది ఒప్పో, ఏది తప్పో ఆయనకు మాత్రమే తెలుసు ప్రశ్నించకుండా అనుసరించడం అంటూ పోస్టు చేశారు. దీనిపై ప్రకాశ్ రాజ్ గొర్రెలం కాము అంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ తాజా కౌంటర్‌కు నాగబాబు ఏ విధంగా స్పందిస్తారోనని సర్వత్రాఆసక్తి నెలకొంది.






