LATEST NEWS
తెలంగాణ లో మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సందడి ఓ రేంజ్ లో పెరిగింది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ కాదు, పునర్వ్యవస్థీకరణే అంటే కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది.  రాష్ట్రంలో  రేవంత్ సర్కార్  మూడేళ్ల పాలన పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణ విషయంలో కొత్త వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకు సాగాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.   సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న క్రమంలో, రాష్ట్రంలో మరో డిప్యూటీ సీఎం పదవి అంశం తెరపైకి వచ్చింది.   తెలంగాణలో కాంగ్రెస్ అధినాయకత్వం ప్రభుత్వం, పార్టీ యంత్రాంగంలో కీలక మార్పులు చేసేందుకు సమాయత్తమౌతోందని అంటున్నారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్నదని పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వం మధ్య ఉన్న విభేదాలు, అలాగే కొందరు ఎమ్మెల్యేలు తరచుగా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పిస్తున్న తీరును సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్.. ప్రస్తుత మంత్రివర్గంతో పాటు పార్టీ పదవుల్లోనూ మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్న నిర్ణయానికి వచ్చేసింది.   2028 అసెంబ్లీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ఇటు పార్టీ పదవుల్లోనూ, అటు కేబినెట్ పోర్టుపోలియోల్లోనూ కూడా భారీ మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుత కేబినెట్‌లో ఉన్న ఇద్దరు మంత్రులపై వేటు పడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేసిన వెంటనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న వార్తలు జోరుగా వినిపింయాయి. అయితే అరకొర మార్పులు కాకుండా సమగ్ర ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో హైకమాండ్ కేబినెట్ పునర్యవస్థీకరణ అంశాన్ని అప్పటికి పక్కన పెట్టింది.  త్వరలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియ జరగనుంది. అది పూర్తయిన వెంటనే రేవంత్ కేబినెట్ ప్రక్షాళన చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గవర్నర్ కోటాలో ఎంపికయ్యే ఎమ్మెల్సీలలో ఒకరికి కేబినెట్ లో చోటు కల్పించే అవకాశాలున్నాయన్నది పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.  మల్లు భట్టి విక్రమార్కకు తోడుగా, బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతకు మరో డిప్యూటీ సీఎం పదవిని కేటాయించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలంటున్నాయి.   ఇది కూడా చదవండి:   వినాయక చవితికి ముందే రేవంత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ? ఎవరు ఇన్ ఎవరు ఔట్ అంటే? రాష్ట్ర జనాభాలో 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు ప్రభుత్వంలో   కీలక వాటా దక్కాలన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా ఉంది. ఆ డిమాండ్ ను నెరవేర్చే ఉద్దేశంతో హైకమాండ్ రెండో ఉప ముఖ్యమంత్రి అంశాన్ని తెరపైకి తెచ్చిందని అంటున్నారు.  భవిష్యత్తులో బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారంటూ ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రెండో ఉపముఖ్యమంత్రి అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.   సామాజిక సమతుల్యతను కాపాడుతూనే పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పునర్వ్యవస్థీకరణతో పార్టీలో అసమ్మతి, అసమ్మతి గళాలకు చెక్ పెట్టాలన్న కృత నిశ్చయంతో కాంగ్రెస్ హైకమాండ్ ఉందని అంటున్నారు.  ఏది ఏమైనా వచ్చే నెల రెండో వారం నాటికి కేబినెట్ రీషఫుల్, రెండో ఉప ముఖ్యమంత్రి, పార్టీ పదవులలో మార్పులు తదితర అంశాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    మీకు నచ్చవచ్చు:  రేవంత్ మంత్రివర్గ విస్తరణ నిరవధిక వాయిదా ? రేపో మాపో రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?​ [Raventh, Cabinet Reshuffle, SecondDeputyCM,  Highcommand, Strategy, TeluguOne]
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడుల వెల్లువపై వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతల విమర్శలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఘాటుగా బదులిచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.  రాష్ట్రంలోని   జిల్లాలోని పరిస్థితులు, వాతావరణం, వనరులు, అవకాశాల ప్రాతిపదికన పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని వివరించారు.   ఏయే జిల్లాలో ఏయే పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు నెలకొన్నాయనే వివరాలతో కూడిన రాష్ట్ర మ్యాప్‌ను నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదకగా షేర్ చేశారు.   కూటమి ప్రభుత్వ హయాంలో ఎక్కడెక్కడ ఏయే పరిశ్రమలు వచ్చాయి, ఎంత మందికి ఉద్యోగాలు లభించాయి. ఆ పరిశ్రమల ద్వారా  స్థానికంగా లభిస్తున్న ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై  సమగ్రంగా వివరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్న లోకేష్.. ఈ విషయంలో దాపరికం ఏమీ లేదన్నారు. ఈ విషయంపై  బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ చేశారు.   అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న పరిణామాలు, పరిశ్రమలను తరిమేసిన తీరుపైనా బహిరంగంగా చర్చించుకుందామని లోకేష్ అన్నారు.  రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తుంటే, గతంలో ఆ పరిశ్రమలను వెళ్లగొట్టేందుకు వైసీపీ అరాచక శక్తులు శ్రమించాయంటూ విమర్శించారు. పరిశ్రమల విషయంలో రెండు ప్రభుత్వాల కాలంలో జరిగిన అంశాలను పక్కపక్కనే పెట్టి చర్చించాలని సవాల్ చేశారు.   ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టుకు  రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడుల వివరాలను తెలిపే మ్యాప్‌ను జత చేశారు. మరోవైపు వైసీపీ హయాంలో ఏం జరిగిందనే కోణంలో మరో మ్యాప్‌ను జత చేశారు.  ఇక  అదే పోస్టుకు  బర్నాల్ ఆయింట్‌మెంట్ చిత్రాన్ని జోడించి.. ప్రస్తుత పెట్టుబడుల పురోగతిని చూసి తట్టుకోలేక కడుపు మంటతో రగిలిపోతున్న వారు బర్నాల్ రాసుకోవాలని ఎద్దేవా చేశారు.   ఇటీవల జరిగిన సీఐఐ సదస్సులో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై వైసీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తూ.. పది కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కోటి రూపాయల పెట్టుబడులు కూడా రాలేదంటూచేసిన వ్యాఖ్యలపై లోకేష్ ఈ మేరకు స్పందించారు.  ఇది కూడా చదవండి:  ఏపీకి పెట్టుబడుల వెల్లువ: సీక్రెట్ ను బయటపెట్టిన లోకేష్.. రహస్య వ్యూహం అనుకరించమంటూ సెటైర్.!  పెట్టుబడులు, పరిశ్రమలు, సీఐఐ ఒప్పందాల విషయంలో అధికార తెలుగుదేశం కూటమి, వైసీపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జోరుగా సాగుతున్న వేళ నారా లోకేష్ సెటైరికల్ రియాక్షన్ ప్రాధాన్యత సంతరించుకుంది.   రానున్న రోజుల్లో పెట్టుబడుల క్షేత్రస్థాయి పురోగతి, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పనపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.  కాగా లోకేష్ సవాల్ కు వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందన్నన్నది చూడాల్సి ఉంది.  పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల విషయంలో ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్న భావన పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమౌతున్న నేపథ్యంలో లోకేష్ సవాల్ కు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.   మీకు నచ్చవచ్చు:  ఏపీకి కియా భారీ పెట్టుబడులు.. పెనుకొండలో మరో ప్లాంట్.!​ ఏపీలో కియా విస్తరణ: 14 వేల 167 కోట్ల పెట్టుబడి: విశాఖ ఇన్వెస్టర్ల సదస్సులో ఎంవోయూ.! [Nara Lokesh, Challenge, YCP, Iindustries, Incestments,  CII summit, Employment opportunities, TeluguOne]
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల  వేళ జనసేన  కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పరిమితులు, ఆంక్షలు లేదా పట్టింపులు లేవని, ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్ దాఖలు చేయవచ్చని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేరుతో  జనసేన కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.    ఏ గ్రామంలోనైనా జనసేన మద్దతుతో పోటీ చేయాలనుకునే వారు ముందుకు వచ్చి నామినేషన్ వేయవచ్చని క్లారిటీ ఇచ్చింది. అలా పోటీ చేయాలనుకునే అభ్యర్థులను పార్టీ నాయకులు   అడ్డుకోకూడదనీ,  వారికి అండగా నిలబడి, సహకారం అందించి, నామినేషన్ వేసేందుకు ప్రోత్సహించాలని పేర్కొంది.   వీర మహిళలు, జనసైనికులతో పాటు పార్టీ మద్దతుదారులుగా రంగంలోకి దిగి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఎవరైనా స్వేచ్ఛగా పాల్గొనవచ్చని ఆ ప్రకటన విస్పష్టంగా పేర్కొంది.   కూటమి పొత్తుల అంశాన్ని ప్రస్తావిస్తూ, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే గ్రామీణ పంచాయతీ ఎన్నికల విషయంలో అలాంటి సీట్ల పంపకాలు ఏవీ ఉండబోవని జనసేనాని పేరుపై విడుదలైన ఆ ప్రకటన స్పష్టం చేసింది.   గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక పార్టీ జెండాపై లేదా ఒకే పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావని వివరించింది.  పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ప్రజలు ఎన్నుకునే ఈ స్థానాల ఎన్నికలు కూటమి పార్టీలకు అతీతంగా జరుగుతాయని తెలిపారు. ఈ క్రమంలో పౌరుల స్వేచ్ఛను కాపాడాల్సిన ఆవశ్యకత ఉందని, ఎవరైనా స్వేచ్ఛగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవచ్చని ఆ ప్రకటన క్లారిటీ ఇచ్చింది. ఇది కూడా చదవండి: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..పూర్తి షెడ్యూల్ ఇదే.!  పంచాయతీ ఎన్ని కలవేళ జనసేన అధినేత తీసుకున్న ఈ  నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రామీణ స్థాయిలో పోటీ చేయాలనుకునే కార్యకర్తలు, మద్దతుదారులకు ఇది స్పష్టమైన మార్గదర్శకంగా నిలుస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఈ ప్రకటనతో క్షేత్రస్థాయిలో నామినేషన్ల ప్రక్రియపై చర్చ మొదలైంది.    మున్ముందు పంచాయతీ ఎన్నికల నామినేషన్లు, పోటీ విషయంలో గ్రామాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది. పవన్ కల్యాణ్ సూచనలకు అనుగుణంగా జనసైనికులు, వీర మహిళలు, నాయకులు ఎలా ముందుకు సాగుతారనేది తదుపరి దశలో స్పష్టమవుతుంది.   గ్రామీణ ఎన్నికల్లో స్వేచ్ఛాయుత పోటీకి అవకాశం కల్పించడం ద్వారా స్థానిక స్థాయిలో ఆశావహులకు అవకాశం లభిస్తుందనే భావన వ్యక్తమవుతోంది. ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ గ్రామ పంచాయతీల వారీగా పోటీ చిత్రం మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.  మీకు నచ్చవచ్చు:  పంచాయతీ నామినేషన్ల వేళ హింసకు కుట్ర: 66 మంది అరెస్టు.!​ ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్.! [Pawan Kalyan,  Panchayat elections,  Jana SenaStand,  Seatsharing,  AllianceEthics, TeluguOne]
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగళూరుకు చేరుకోవడంతో యలహంక ప్యాలెస్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆమెను నిలువరించేందుకు పోలీసులు విమానాశ్రయం వద్దే కాకుండా ప్యాలెస్ వైపు వెళ్లే దారుల్లోనూ సన్నద్ధమయ్యారు. ఇటీవల వివాహ వేడుక సంబంధిత ఏర్పాట్ల నిమిత్తం షర్మిల యలహంక ఆస్తి వద్దకు వెళ్లేందుకు సన్నాహాలు చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ప్రతినిధి భీమిశెట్టి రమేష్‌బాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించి, షర్మిల మరియు ఆమె అనుచరుల ప్రవేశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సుధీర్ మేడమ్మయ్య వాదనల ప్రకారం, వైఎస్ భారతి తల్లి ఇ.సి. సుగుణమ్మ 2007 మార్చి 1న ఇరవై ఏళ్ల లీజు ఒప్పందం కింద ఈ ఆస్తిని తమ సంస్థకు అప్పగించారు. ఆ తర్వాత సుగుణమ్మ ఆగస్టు 2026లో కుమార్తె భారతి, మనుమరాళ్ల పేరిట గిఫ్ట్ డీడ్ నమోదు చేసినప్పటికీ, 2027 ఫిబ్రవరి 28 వరకు లీజు గడువు కొనసాగుతోందని, అక్కడి కట్టడాలు, పండ్ల తోటల పరిరక్షణ దృష్ట్యా బయటి వ్యక్తుల జోక్యాన్ని ఆపాలని కోరారు. ఈ వాదనలను పరిశీలించిన ధర్మాసనం, తదుపరి విచారణ జరిగే వరకు యలహంక ప్యాలెస్‌లోకి షర్మిల గానీ, ఆమెకు సంబంధించిన వ్యక్తులు గానీ ప్రవేశించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, కేసును డిసెంబర్ 19కి వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వులను పక్కాగా అమలు చేయడమే తమ బాధ్యత అని బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు. ఈ పరిణామం వైఎస్ కుటుంబంలోని అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. సిలికాన్ బిల్డర్స్‌తో భారతి, రమేష్‌బాబులకు ఉన్న సంస్థాగత అనుబంధాల నేపథ్యంలో ఈ పిటిషన్ వెనుక జగన్ వ్యూహం ఉందన్న ఆరోపణలు వినిపిస్తుండగా, మరోవైపు వైసీపీ వర్గాలు మాత్రం స్థానిక ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా తెరపైకి వచ్చిందని విమర్శిస్తున్నాయి. వివాహ వేడుకకు సంబంధించిన వేదిక అంశంపై కూడా గతంలో సోదరసోదరీమణుల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తిన నేపథ్యంలో, తాజాగా కోర్టు ఆదేశాలు అమలవుతున్న తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉన్నందున క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 19న జరగబోయే తదుపరి విచారణలో షర్మిల తరఫున ఎలాంటి న్యాయపరమైన అభ్యంతరాలు లేవనెత్తుతారనేది ఆసక్తికరంగా మారింది. కోర్టు తుది నిర్ణయం వరకు యలహంక ఆస్తి వ్యవహారం రాజకీయంగానూ, చట్టపరంగానూ కీలక మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. మీకు నచ్చవచ్చు: అతడి మేధస్సుకు రూ.800 కోట్ల ప్యాకేజీ.. ఏఐ ప్రపంచంలో సంచలనం.!   [ YS Sharmila, Yelahanka Palace, Bengaluru Police, YS Jagan, property dispute ]
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగంలో లోతైన సాంకేతిక నైపుణ్యం కలిగిన నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది. ఈ క్రమంలో భారత సంతతికి చెందిన ఏఐ పరిశోధకుడు త్రపిత్ బన్సల్‌కు సుమారు రూ.800 కోట్ల భారీ ప్యాకేజీ లభించిన వార్త టెక్ వర్గాల్లో విస్తృతంగా చర్చనీయాంశమైంది.    ఉత్తరప్రదేశ్‌కు చెందిన త్రపిత్ బన్సల్ చిన్నతనం నుంచే గణితంపై ప్రత్యేక ఆసక్తి పెంచుకుని, ఐఐటీ కాన్పూర్‌లో విద్యాభ్యాసం చేశారు. ఆ రోజుల్లో ఐటీ ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్ ప్యాకేజీల వైపు చాలామంది ఆకర్షితులవుతుండగా, ఆయన మాత్రం గణితం, గణాంక శాస్త్రాలపై దృష్టి సారించారు. క్లిష్టమైన సమస్యలను విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకునే ఏఐ వ్యవస్థలకు గణిత పునాది అత్యంత కీలకమని ఆయన విశ్వసించారు.    అనంతరం విశ్లేషకుడిగా కెరీర్ ప్రారంభించినప్పటికీ, పరిశోధనలపై ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)లో రీసెర్చ్ అసిస్టెంట్‌గా చేరారు. అక్కడ బేసియన్‌ మోడలింగ్, ఇన్ఫరెన్స్ మెథడ్స్ వంటి అంశాల్లో పనిచేసిన తర్వాత, ఉన్నత చదువుల కోసం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ ఆమ్‌హర్ట్స్‌లో చేరి మాస్టర్స్, పీహెచ్‌డీ పూర్తి చేశారు.    గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల్లో వివిధ పరిశోధన ప్రాజెక్టులపై పనిచేసిన అనుభవం బన్సల్‌కు అందింది. ఓపెన్ ఏఐలో ఇంటర్న్‌గా, ఆ తర్వాత పూర్తిస్థాయి పరిశోధకుడిగా పనిచేస్తూ ఏఐ రీజనింగ్ సామర్థ్యాలను మెరుగుపరిచే ప్రాజెక్టుల్లో కీలక భూమిక పోషించారని నివేదికలు పేర్కొంటున్నాయి. గణితం, కోడింగ్, సైన్స్ వంటి సంక్లిష్ట రంగాల్లో తార్కిక విశ్లేషణ వేగవంతం కావడం ఏఐ పురోగతిలో ప్రధాన మలుపుగా నిలిచింది.    ఇది కూడ చదవండి: రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలి.. కాంగ్రెస్ శ్రేణులకు సందీప్ కుమార్ పిలుపు.! ఈ నేపథ్యంలో తదుపరి తరం ఏఐ వ్యవస్థల అభివృద్ధి కోసం అగ్రశ్రేణి టెక్ దిగ్గజాలు ప్రతిభావంతుల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. మెటా తన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌కు సంబంధించిన కీలక బాధ్యతల కోసం ఆయనకు భారీ ఆఫర్ అందజేసిందన్న కథనాలు సాంకేతిక రంగంలో ఆసక్తిని రేకెత్తించాయి.    నిపుణుల అభిప్రాయం ప్రకారం, తక్షణ ఆదాయాల కంటే దీర్ఘకాలిక పరిశోధన, ప్రాథమిక శాస్త్రాలపై పట్టు సాధించడమే ఈ స్థాయి గుర్తింపునకు కారణమని విశ్లేషిస్తున్నారు. భారతీయ విద్యాసంస్థల నుంచి ఎదిగిన పరిశోధకులు అంతర్జాతీయ ఏఐ ఆవిష్కరణల్లో కీలక పాత్ర పోషిస్తుండటం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో సూపర్ ఇంటెలిజెన్స్, అధునాతన రీజనింగ్ మోడళ్ల రంగంలో మరిన్ని కీలక ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని టెక్ పరిశీలకులు భావిస్తున్నారు. ఏఐ రంగంలో పరిశోధనలు ఏ దిశగా పయనిస్తాయనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.    మీకు నచ్చవచ్చు: రేకుల గదికి నెలకు రూ. 2.12 లక్షల అద్దె.. ఎక్కడో తెలుసా? మీకు నచ్చవచ్చు: కొడుకు పుట్టలేదని భార్యకు ట్రిపుల్ తలాక్...!   [ Trapit Bansal, AI Rs. 800 crore package, IIT Kanpur AI researcher, Meta Superintelligence Lab, Open AI Reasoning Model ]
ALSO ON TELUGUONE N E W S
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. సుకుమార్ రైటింగ్స్, వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, ది స్టోరీస్ బ్యానర్లపై తెరకెక్కనున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రానికి ‘రికార్డ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు వీర కోగటం కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. పుష్ప, పుష్ప 2 చిత్రాలకు రచయితగా పనిచేసిన వీర కోగటం ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఆసక్తి మొదలైంది. సినిమా ప్రారంభోత్సవానికి దర్శకుడు సుకుమార్, నిర్మాత దిల్ రాజు, బన్నీ వాసు, ఏషియన్ సునీల్ నారంగ్ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. దిల్ రాజు క్లాప్ కొట్టగా, సుకుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బన్నీ వాసు తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య, దిల్ రాజు చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను కూడా మేకర్స్ ఆసక్తికరంగా రూపొందించారు. కెమెరా రికార్డింగ్‌కు సంబంధించిన అంశాలతో పాటు ఎర్రటి పౌర్ణమి నేపథ్యంలో కిరణ్ అబ్బవరం సిల్హౌట్ కనిపిస్తోంది. పోస్టర్‌లో గాడిద, చీకటిలో నడుస్తున్న ఓ అమ్మాయి వంటి అంశాలు కథపై ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే సినిమా కథ, జానర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర బృందం ఇంకా వెల్లడించలేదు. ఇది కూడా చదవండి: మెగాస్టార్ చేతుల మీదుగా ‘ఆలోచన’ ట్రైలర్! ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, అశోక్ బండ్రెడ్డి నిర్మిస్తున్నారు. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కిరణ్ అబ్బవరం చేస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్ ఆయన కెరీర్‌లో మరో ఆసక్తికరమైన సినిమాగా నిలవనుంది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘రియాలిటీ’ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ‘రికార్డ్’ సినిమాను కూడా ప్రారంభించడం విశేషం. వీర కోగటం ఎలాంటి కథతో కిరణ్ అబ్బవరాన్ని చూపించబోతున్నారు? పోస్టర్‌లో కనిపించిన మిస్టరీ అంశాల వెనుక ఏముంది? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మీకు నచ్చవచ్చు: అల్లు సినిమాస్‌లో టికెట్లు బ్లాక్ చేస్తున్నారా? ‘భోగి’ ట్రైలర్‌లో శర్వానంద్ విశ్వరూపం.!     [KiranAbbavaram, RecordMovie, SukumarWritings, VeeraKogatam, Vamsi Nandipati]
ధనుష్‌, మమ్ముట్టి కలిసి నటించిన ‘OM - ఆపరేషన్ మోల్’ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర భారీ వసూళ్లతో సత్తా చాటుతోంది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.101.7 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేస్తూ సినిమాను ‘మెగా బ్లాక్‌బస్టర్‌’గా పేర్కొంది. మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ను దాటడం సినిమాకు మంచి ఓపెనింగ్‌ దక్కినట్లు సూచిస్తోంది. ముఖ్యంగా ధనుష్‌ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తోంది. గతంలో ఆయన నటించిన చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్‌ భారీ స్థాయిలో ఉందని ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  ‘OM - ఆపరేషన్ మోల్’ సినిమాకు ‘అమరన్‌’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ధనుష్‌, మమ్ముట్టి వంటి ఇద్దరు ప్రముఖ నటులు ఒకే సినిమాలో కనిపించడం ప్రేక్షకుల్లో ముందునుంచే ఆసక్తిని పెంచింది.  ఇందులో ధనుష్‌, మమ్ముట్టితో పాటు సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించారు. సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. శ్రద్ధా అగర్వాల్‌, ధనుష్‌, అజ్మత్ జాగ్మాగ్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇది కూడా చదవండి: భోగి ట్రైలర్‌లో శర్వా విశ్వరూపం.. ఐదుగురు చెల్లెళ్ల కోసం గంగ పోరాటం.! కథ విషయానికి వస్తే.. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ఓ పోలీస్‌ అధికారి అండర్‌కవర్‌ ఆపరేషన్‌ చేపట్టడం చుట్టూ కథ సాగుతుంది. సాయి పల్లవి ఐపీఎస్‌ అధికారి నిత్యా రెడ్డి పాత్రలో, ధనుష్‌ పళని అనే అండర్‌కవర్‌ ఏజెంట్‌గా కనిపిస్తారు. మమ్ముట్టి స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌కు చెందిన బర్మా కార్తికేయన్‌ పాత్రలో నటించారు. మూడు రోజుల్లోనే రూ.101.7 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించినట్లు మేకర్స్‌ వెల్లడించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలి మూడు రోజుల జోరును కొనసాగిస్తూ ‘OM’ మరిన్ని బాక్సాఫీస్‌ రికార్డులు సృష్టిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. మీకు నచ్చవచ్చు: నిత్యా మేనన్‌ సంచలన నిర్ణయం.. అసలు కారణమిదే.! వృషకర్మ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్!       [OM Box Office, OM 100 Crore, Dhanush, Mammootty, Rajkumar Periasamy]  
హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్‌లో టికెట్ల బుకింగ్ విషయంలో ప్రేక్షకుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు డాల్బీ స్క్రీన్ టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండటం లేదని కొందరు సినీ అభిమానులు ఆరోపించారు. తాజాగా ఈ విషయాన్ని నేరుగా నిర్మాత అల్లు అరవింద్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. నవంబర్ 20న విడుదలైన దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా ప్రదర్శన అనంతరం అల్లు అరవింద్ థియేటర్ నుంచి బయటకు వస్తుండగా కొందరు ప్రేక్షకులు ఆయనను కలిశారు. షో ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు వరకు ఎక్కువ టికెట్లను బ్లాక్ చేసి ఉంచుతున్నారని, కేవలం కింది నాలుగు వరుసల సీట్లు మాత్రమే బుకింగ్‌కు అందుబాటులో ఉంటున్నాయని వారు వివరించారు. మిగిలిన సీట్లు చివరి నిమిషంలో విడుదల చేస్తున్నారని తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రేక్షకుల ఫిర్యాదును విన్న అల్లు అరవింద్ అక్కడికక్కడే తన థియేటర్ సిబ్బందికి వీడియో కాల్ చేశారు. సమస్యను నేరుగా వివరించాలని అక్కడున్న వారిని కోరారు. అనంతరం ఈ వ్యవహారాన్ని తానే పర్యవేక్షిస్తానని, రెండు వరుసలు మినహా మిగిలిన అన్ని సీట్లను సాధారణ ప్రేక్షకుల బుకింగ్ కోసం విడుదల చేయాలని సిబ్బందికి సూచిస్తానని హామీ ఇచ్చారు. ఇది కూడా చదవండి: హిట్లు, ఫ్లాపులతో సాగిన ప్రయాణం.. నాగచైతన్య కెరీర్లో ఆసక్తికర విశేషాలివే.! అల్లు అరవింద్ ప్రేక్షకులతో మాట్లాడి సిబ్బందికి సూచనలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టికెట్ల బుకింగ్‌పై వచ్చిన ఫిర్యాదుకు ఆయన వెంటనే స్పందించిన తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిన ‘ఆకాశంలో ఒక తార’ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ ‘ఎమ్మెస్: యాన్ ఆన్-స్క్రీన్ లెగసీ’ నిర్మాణంలోనూ ఆయన భాగస్వామిగా ఉన్నారు. మీకు నచ్చవచ్చు: నిత్యమేనన్ సంచలన నిర్ణయం.. అసలు కారణమిదే! డింపుల్ హయతికి క్షమాపణలు చెప్పిన సంపత్ నంది!       [Allu Aravind, AlluCinemas, AlluCinemasHyderabad, AakasamloOkaTara, DulquerSalmaan]
సినిమా ప్రమోషన్లలో కొత్త కొత్త ఆలోచనలు చూస్తుంటాం. అయితే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంతో పాటు సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేకంగా ఉచిత టికెట్లు అందించాలనే నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘ఆలోచన’ సినిమా బృందం ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.  మరోవైపు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కానుంది. నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ‘ఆలోచన’ ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 5:09 గంటలకు చిరంజీవి లాంచ్ చేయనున్నారు.  ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. మెగాస్టార్ చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదల కానుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా విడుదల సందర్భంగా 60 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలకు చిత్రబృందం ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. నవంబర్ 27, 28, 29 తేదీల్లో థియేటర్లలో ఉచితంగా సినిమా చూసే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ప్రేక్షకులు తమ ఆధార్‌ కార్డును చూపించి ఉచిత టికెట్లు పొందవచ్చని మేకర్స్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: భోగి ట్రైలర్‌లో శర్వా విశ్వరూపం.. ఐదుగురు చెల్లెళ్ల కోసం గంగ పోరాటం.! సురేందర్ చాచా ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాతలుగా వ్యవహరించారు. నారాయణరావు, నరసింహరాజు, ప్రసాద్ బాబు, రాజన్ హరి, మహర్షి రాఘవ, జయలలిత వంటి సీనియర్‌ నటీనటులు ఇందులో కనిపించనున్నారు. బెన్నీ సుధాకర్‌ ఈ సినిమాతో నటుడిగా పరిచయం అవుతున్నారు. యూ/ఏ సర్టిఫికెట్‌ పొందిన ‘ఆలోచన’ నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌ విడుదలతో సినిమా కథ, అందులోని పాత్రలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి మెగాస్టార్ చేతుల మీదుగా విడుదల కానున్న ఈ ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మీకు నచ్చవచ్చు:  నిత్యా మేనన్‌ సంచలన నిర్ణయం.. అసలు కారణమిదే.! డింపుల్ హయాతికి క్షమాపణలు చెప్పిన సంపత్ నంది.!       [Alochana Trailer, Megastar Chiranjeevi, Alochana Movie, Free Tickets, Senior Citizens]  
శర్వానంద్‌ అంటే ఇప్పటివరకు ఎక్కువగా గుర్తొచ్చేది లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు. కానీ ఇప్పుడు ఆయన రూటు మార్చి ఊరమాస్‌ అవతారంలోకి వచ్చేశారు. సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘భోగి’ ట్రైలర్‌ చూస్తుంటే శర్వానంద్‌ను ఇంత రా అండ్ రస్టిక్‌గా గతంలో ఎప్పుడూ చూడలేదనిపిస్తోంది. యాక్షన్‌, ఎమోషన్‌, పీరియడ్‌ బ్యాక్‌డ్రాప్‌.. ఇలా అన్ని అంశాలతో ట్రైలర్‌ ఆసక్తిని పెంచుతోంది. 1960ల కాలంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఓ గ్రామం నేపథ్యంలో ‘భోగి’ కథ సాగుతున్నట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది. ఆ ఊరిపై దొరలు, పెత్తందారుల ఆధిపత్యం ఉంటుంది. ప్రతి అమావాస్య తర్వాత గ్రామంలో యువకులు అదృశ్యమవుతుండటం, దాని వెనుక ఉన్న రహస్యం కథలో కీలకంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఏదో చూసిన గంగను నోరు మూసుకుని ఉండాలని హెచ్చరించడం ట్రైలర్‌ ఆరంభంలోనే ఉత్కంఠను పెంచుతోంది. ఈ సినిమాలో శర్వానంద్‌ గంగ అనే పాత్రలో కనిపిస్తున్నారు. ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా, కుటుంబాన్ని ఎంతో ప్రేమించే వ్యక్తిగా ఆయన పాత్రను పరిచయం చేశారు. అయితే తన కుటుంబానికి, ఊరికి అన్యాయం జరుగుతున్నప్పుడు మాత్రం గంగలోని మరో మనిషి బయటకు వస్తాడు. దొరల దౌర్జన్యాలను ఎదిరిస్తూ చేసే పోరాటమే కథలో ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శర్వానంద్‌ బాడీ లాంగ్వేజ్‌, తెలంగాణ యాస, యాక్షన్‌ సన్నివేశాలు ఆయన పాత్రలోని తీవ్రతను చూపిస్తున్నాయి. ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్‌ పాత్రల్లో ఎక్కువగా కనిపించిన శర్వా.. ఈసారి పూర్తిగా కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ఇది కూడా చదవండి: డింపుల్ హయాతికి క్షమాపణలు చెప్పిన సంపత్ నంది.! ట్రైలర్‌లో అనుపమ పరమేశ్వరన్‌, డింపుల్‌ హయాతి పాత్రలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అనుపమ కందుల సులోచనారాణి పాత్రలో కనిపిస్తుండగా.. గంగలోని అగ్గిని గుర్తుచేస్తూ ఆమె చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. మరోవైపు డింపుల్‌ పాత్ర గంగను మరింత తీవ్రంగా పోరాడేలా ప్రేరేపిస్తున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా పాటలు, గ్లామర్‌ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న డింపుల్‌కు ఇందులో ఎలాంటి పాత్ర దక్కిందనేది ఆసక్తికరం. మొత్తంగా చూస్తే ‘భోగి’ శర్వానంద్‌ కెరీర్‌లో మరో భిన్నమైన ప్రయత్నంగా కనిపిస్తోంది. మాస్‌ యాక్షన్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలను కూడా కలిపినట్లు ట్రైలర్‌ సూచిస్తోంది. నవంబర్‌ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి గంగగా శర్వానంద్‌ బాక్సాఫీస్‌ దగ్గర ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి. మీకు నచ్చవచ్చు: 18 ఏళ్లైనా ఆ ప్రేమ తగ్గలేదు.. సమీరారెడ్డి కామెంట్స్ వైర‌ల్‌.! అర్ధరాత్రి వేళ ఘోర ప్రమాదం.. ఆసుపత్రిలో జబర్దస్త్ కమెడియన్లు!       [Bhogi Trailer, Sharwanand, Sampath Nandi, Anupama Parameswaran, Dimple Hayathi]  
సినిమా వేడుకల్లో నటీనటులపై దర్శకులు ప్రశంసలు కురిపించడం సహజమే. కానీ ఓ దర్శకుడు మాత్రం తన సినిమాలో నటించిన నటికి వేదికపైనే క్షమాపణలు చెప్పారు. ఆమెకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయానంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు.. ‘భోగి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంపత్ నంది. ఆయన క్షమాపణలు చెప్పింది నటి డింపుల్ హయాతికి. ప్రస్తుతం ఈ సంఘటన టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. శర్వానంద్‌ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భోగి’. నవంబర్ 22న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సంపత్ నంది.. డింపుల్ హయాతికి తాను ఇచ్చిన ఓ హామీని గుర్తుచేసుకున్నారు. ఆమెను ఒక పాటలో అందంగా, హుందాగా చూపిస్తానని మాట ఇచ్చానని, కానీ కొన్ని కారణాల వల్ల అలా చేయలేకపోయానని చెప్పారు. రాజ్ కపూర్ సినిమాల్లోని హీరోయిన్ల తరహాలో డింపుల్‌ను చూపించాలని అనుకున్నానని సంపత్ నంది తెలిపారు. ఎలాంటి స్కిన్ షో లేకుండా, అసభ్యకరమైన కెమెరా యాంగిల్స్‌కు తావివ్వకుండా ఆమె అందం, అభినయాన్ని హైలైట్ చేయాలనుకున్నానని చెప్పారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాటను తెరకెక్కించలేకపోయానని చెబుతూ డింపుల్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అంతేకాదు.. భవిష్యత్తులో మరోసారి కలిసి పనిచేసే అవకాశం వస్తే తన ఆలోచనను తప్పకుండా అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఇక సంపత్ నంది మాటలకు డింపుల్ హయాతి కూడా స్పందించారు. తనను చాలామంది గ్లామర్ కోణంలోనే చూశారని, కానీ తన శరీరాన్ని కాకుండా కళ్లలోని భావాలను గుర్తించి మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు సంపత్ నందేనని ప్రశంసించారు. ఆయన తనకు ఇచ్చిన ప్రాధాన్యత, గౌరవం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఇది కూడా చదవండి: నిత్యా మేనన్‌ సంచలన నిర్ణయం.. అసలు కారణమిదే.! గతంలో సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ‘సీటీమార్’ సినిమాలోనూ డింపుల్ హయాతి నటించారు. అందులోని ‘పెప్సీ ఆంటీ’ పాట కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ‘భోగి’లో మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఈ సినిమాలో డింపుల్ కీలక పాత్రలో కనిపించనుండగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. శర్వానంద్‌ను మునుపెన్నడూ చూడని రా అండ్ రస్టిక్ మాస్ అవతార్‌లో చూపించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, కేకే రాధామోహన్ నిర్మించారు. నవంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మీకు నచ్చవచ్చు:  వృషకర్మ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్! 18 ఏళ్లైనా ఆ ప్రేమ తగ్గలేదు.. సమీరారెడ్డి కామెంట్స్ వైర‌ల్‌.!       [Sampath Nandi, Apology, Dimple Hayathi, Bhogi Movie, Sharwanand]  
National Award buzz has become a familiar promotional weapon, and the makers of Bhogi seem to be reaching for the same playbook. Similar claims were doing the rounds for Peddi well before its release, while Nani was also being projected as a strong contender until the final stretch of promotions for The Paradise began. The film's disastrous outcome made all that award talk look premature. Now, Bhogi is trying to create a similar aura around Sharwanand, with director Sampath Nandi leading the charge. At the grand pre-release event, Sampath Nandi made a strong pitch for his lead actor. “I never told this story to any other actor than Sharwanand. He should get a National Award for his performance and he surprised me every day,” the director said. He added that Sharwa's close-up shots would be discussed, as his eyes speak volumes. Sampath also revealed that Sharwanand called him three times after watching the final cut and praised his work. “That's the award I crave for,” he said, describing Bhogi as an honest attempt. The director thanked producer KK Radhamohan for believing in his idea and providing everything the film needed. Sharwanand, meanwhile, said Sampath Nandi is bringing out a new action angle in him, just as Gunnam Gangaraju, Deva Katta and Sujeeth had revealed different shades through Amma Cheppindi, Prasthanam and Run Raja Run. “After them, Sampath is re-introducing me in an action angle to audiences,” he said. Also Read: Are King100 and Dada being postponed? The film marks the first collaboration between Sharwanand and Sampath Nandi. Produced by KK Radhamohan on a lavish scale, the intense, raw and rustic action drama features Anupama Parameswaran as the leading lady and Dimple Hayathi in a prominent role. Its trailer has received a positive response, and the team is now banking on the performance buzz to carry the film forward. But the National Award pitch feels like a campaign pulled from an old playbook. Declaring an actor award-worthy before audiences have even seen the film is no longer an exciting hook; it is an overused shortcut to manufacture prestige. After similar campaigns around other films, Bhogi's promotional strategy feels less like a fresh statement of confidence and more like a dated attempt to convince audiences of a performance before they can judge it themselves. The film releases on November 27. Check Out:   O.M becomes Dhanush's highest Day 1                        VHP seeks Ban on Ramayana Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తూ బిజీగా ఉండాలని చాలామంది హీరోయిన్స్ కోరుకుంటారు. కానీ నిత్యా మేనన్‌ ఆలోచనా విధానం మాత్రం కాస్త భిన్నం. వరుసగా సినిమాలు చేయకుండా మధ్యమధ్యలో విరామం తీసుకుంటూ ఉంటారు. దీంతో ఆమెకు అవకాశాలు తగ్గాయా? లేక సినిమాలకు దూరంగా ఉంటున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తుంటాయి. అయితే తన బ్రేక్‌ల వెనుక ఉన్న అసలు కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిత్యా మేనన్‌ బయటపెట్టారు. నిత్యా మేనన్‌ ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ గ్రే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వివేక్‌ ఒబెరాయ్‌తో కలిసి నటించిన ఈ మూవీ డిసెంబర్‌ 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవడం వెనుక తన ఆలోచనలను పంచుకున్నారు. జీవితం అంటే కేవలం సినిమాలు మాత్రమే కాదని నిత్య చెబుతున్నారు. పని అనేది జీవితంలో ఒక భాగం మాత్రమేనని, దాని బయట కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమాల నుంచి విరామం తీసుకున్నప్పుడు ఇంట్లోనే ఉంటూ కొత్త విషయాలు నేర్చుకుంటానని తెలిపారు. తనకు అలాంటి బ్రేకులు అవసరమని, ఒక యంత్రంలా నిరంతరం పనిచేయడం తన వల్ల కాదని స్పష్టం చేశారు. నిజమైన పువ్వు తన చుట్టూ ఉన్న పరిసరాల నుంచి ఎన్నో విషయాలను గ్రహిస్తుందని, తాను కూడా అలాగే ఉంటానని నిత్య చెప్పారు. కెమెరా ముందు కృత్రిమంగా నటించడం తనకు సాధ్యం కాదని, పాత్రలోని భావోద్వేగాలు తనలో నుంచి సహజంగా రావాలని పేర్కొన్నారు. అందుకే ప్రతి సినిమా తర్వాత తనను తాను తిరిగి సిద్ధం చేసుకోవడానికి సమయం తీసుకుంటానని వివరించారు. ఇది కూడా చదవండి: 18 ఏళ్లైనా ఆ ప్రేమ తగ్గలేదు.. సమీరారెడ్డి కామెంట్స్ వైర‌ల్‌.! ‘‘నేను ఒక ఆర్టిస్టును.. వర్కర్‌ను కాదు. నా ఆరోగ్యం బాగోలేకపోతే నటనలో వంద శాతం ఎలా ఇవ్వగలను? తెరపై ఒక పాత్ర సహజంగా కనిపించడం వెనుక చాలా సన్నాహాలు ఉంటాయి. ఆ శ్రమ నుంచి కోలుకోవడానికి, మళ్లీ కొత్త ఉత్సాహంతో పని చేయడానికి నాకు సమయం కావాలి’’ అన్నది నిత్యా మేనన్‌ అభిప్రాయం. సినిమాల సంఖ్య పెంచుకోవడం కంటే, తాను చేసే ప్రతి పాత్రకు న్యాయం చేయడమే ముఖ్యమని నిత్యా మాటలను బట్టి అర్థమవుతోంది. కెరీర్‌లో గ్యాప్‌ వస్తుందనే భయం లేకుండా తనకు నచ్చిన విధంగా ముందుకు సాగుతున్న ఆమె నిర్ణయంపై అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి. మీకు నచ్చవచ్చు: ర‌ష్మిక ‘మైసా’ వాయిదా.. కారణం తెలిస్తే షాక్ అవుతారు.! అర్ధరాత్రి వేళ ఘోర ప్రమాదం.. ఆసుపత్రిలో జబర్దస్త్ కమెడియన్లు!           [Nithya Menen, Interview, Career Breaks, Mr and Mrs Grey, Vivek Oberoi]  
టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరోయిన్ శ్రీలీలకు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. 'పెళ్లి సందD', 'ధమాకా' సినిమాలతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ భామకు ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. 'స్కంద', 'ఆదికేశవ', 'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్', 'గుంటూరు కారం', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి సినిమాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. దీంతో టాలీవుడ్‌లో కొత్త సినిమాల విషయంలో శ్రీలీలకు కొంత గ్యాప్ ఏర్పడింది. అయితే తెలుగులో అవకాశాలు తగ్గినా తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రం ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే శివకార్తికేయన్ హీరోగా నటించిన 'పరాశక్తి' సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైన శ్రీలీల.. ఇప్పుడు అక్కడి అగ్ర హీరోల సినిమాల్లో వరుసగా అవకాశాలు అందుకుంటోంది. ధనుష్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ఓం' సినిమాలోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో ధనుష్ భార్యగా, రోజా అనే పాత్రలో కనిపించనుంది. అంతేకాదు.. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' సినిమాలోనూ శ్రీలీలకు అవకాశం దక్కింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార, సిమ్రాన్, రాశీ ఖన్నా వంటి నటీనటులు కూడా ఉన్నారు. ఇక తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న 'డేర్ డెవిల్' సినిమాలోనూ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అజిత్ భార్య షాలిని తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా విషయంలో గతంలో శ్రీలీలను తప్పించారంటూ వార్తలు వచ్చినప్పటికీ, తాజాగా సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొనడంతో ఆ ప్రచారానికి తెరపడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. అజిత్ వంటి స్టార్ హీరోతో నటించే అవకాశం రావడంతో శ్రీలీల కెరీర్‌కు ఈ చిత్రం కీలకంగా మారనుంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్లిన శ్రీలీలకు ఇప్పుడు తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుండటం ఆసక్తికరంగా మారింది. రజినీకాంత్, ధనుష్, అజిత్ వంటి ముగ్గురు అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం చిన్న విషయం కాదు. అయితే తమిళంలో ఆమెకు లభిస్తున్న ఈ అవకాశాలు ఎలాంటి విజయాలను అందిస్తాయి? అక్కడ స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకుంటుందా? అనేది చూడాలి.     [Sreeleela, Rajinikanth, Dharman, Dhanush, O.m Ajith, DareDevil] 
ప్రముఖ కామెడీ షో 'జబర్దస్త్' ద్వారా తెలుగు ప్రేక్షకులను నవ్వించిన కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు పశ్చిమగోదావరి జిల్లాలో ప్రమాదానికి గురికావడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. భీమవరం సమీపంలోని పాలకోడేరు మండలం గొరగనమూడి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వీరితో పాటు కారులో ఉన్న డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. అయితే డ్రైవర్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. కాకినాడలో జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దొరబాబు, రైజింగ్ రాజు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గొరగనమూడి సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న దొరబాబు, రైజింగ్ రాజుతో పాటు డ్రైవర్‌ను బయటకు తీసి భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దొరబాబు, రైజింగ్ రాజులకు ప్రాణాపాయం తప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించినట్లు సమాచారం. ఇక ఈ ప్రమాదానికి గల కారణాలపై భిన్నమైన వార్తలు వినిపిస్తున్నాయి. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే కారు అదుపుతప్పిందని రైజింగ్ రాజు చెప్పినట్లు కొన్ని కథనాలు వెల్లడించాయి. మరోవైపు అతివేగం లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పాలకోడేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ అభిమాన కమెడియన్లకు ప్రమాదం జరిగిందని తెలిసిన జబర్దస్త్ ప్రేక్షకులు, అభిమానులు వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.     [Jabardasth, Dorababu, Rising Raju, DorababuRoadAccident, RisingRajuAccident]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మగాళ్ల రహస్యం..  భార్యకు,  కుటుంబ సభ్యులకు ఈ విషయాలు అస్సలు చెప్పరట..! మన సమాజంలో ఎన్నో ఏళ్లుగా మగవారికి ఒక రకమైన  నియమం ఉంది. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఒత్తిడి ఉన్నా మొహంలో చిరునవ్వు చెరగకూడదు, ఎవరి ముందూ కన్నీళ్లు పెట్టుకోకూడదు, అన్ని బాధ్యతలను ఒంటిచేత్తో మోయాలి అనే మాటలు చిన్నప్పటి నుంచే వారి మనసులో బలంగా నాటుకుపోతాయి. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, శారీరక అలసటైనా వాళ్లు చాలావరకు బయటకు చెప్పుకోరు. కానీ బయటకు గట్టిగా కనిపించే ప్రతి మనిషి లోపలా ఎన్నో సున్నితమైన భావోద్వేగాలు, చిన్న చిన్న ఆశలు దాగి ఉంటాయి. మగవారు తమ భార్య నుంచి, కుటుంబ సభ్యుల నుంచి మనసులో ఏం కోరుకుంటారో, కానీ బయటకు ఎందుకు చెప్పలేరో వివరంగా తెలుసుకుంటే.. అసలు మీరు ఎలా ఉన్నారు అని ఎవరైనా అడిగితే బాగుంటుందని.. కుటుంబంలోని ప్రతి ఒక్కరి బాగోగులు మగవారే చూసుకుంటూ ఉంటారు. పిల్లల చదువు, అమ్మానాన్నల ఆరోగ్యం, ఇంటి ఖర్చులు ఇలా అన్నింటి గురించి ఆలోచిస్తారు. కానీ వారిని ఎవరైనా ఒక్కసారి మీరు ఎలా ఉన్నారు, ఈరోజు మీకు ఎలా గడిచింది అని అడిగితే చాలా సంతోషిస్తారు. తమ మనసులోని మాటలను ఎలాంటి భయం లేకుండా, మొహమాటం లేకుండా చెప్పుకునే మనిషి ఒకరు పక్కన ఉండాలని వాళ్లు లోలోపల కోరుకుంటారు. ప్రతి సమస్యకు పరిష్కారం వాళ్లే చూపించాలని అనుకోరు.. ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా అందరి చూపు ముందుగా ఇంటిలోని మగవారి వైపే ఉంటుంది. ఆర్థిక సమస్యలైనా, ఇతర కష్టాలైనా వాళ్లే పరిష్కరించాలని అందరూ ఆశిస్తారు. కానీ కష్టకాలంలో తమను ఒంటరిని చేయకుండా, కుటుంబ సభ్యులు కూడా అండగా నిలబడాలని, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని వాళ్లు కోరుకుంటారు. ప్రతి భారాన్ని వాళ్ల మీదే వేయకుండా పంచుకుంటే ఎంతో ఊరటగా ఉంటుందని భావిస్తారు. చేసే కష్టానికి చిన్న మెచ్చుకోలు ఆశిస్తారు.. కుటుంబం కోసం మగవారు తమ సొంత ఆనందాలను, కోరికలను చాలాసార్లు పక్కన పెడతారు. రోజుల తరబడి కష్టపడి పని చేస్తారు. అయితే తమ పనికి పెద్ద పెద్ద బహుమతులు లేదా ఘనమైన సన్మానాలు ఏమీ ఆశించరు. కానీ మీ కష్టం నాకు కనిపిస్తోంది, మీరు చేస్తున్న పని చాలా గొప్పది లేదా ఒక్క చిన్న థ్యాంక్స్ వంటి మాటలు వినాలని మనసులో ఆశపడతారు. ఆ చిన్న ప్రశంస వాళ్లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది కూడా చదవండి  రోజూ వాకింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా కాస్త విశ్రాంతి కావాలి.. సంపాదన, బాధ్యతలు అంటే జీవితకాలం పరుగెడుతూనే ఉండాలి అన్నట్టు కొందరు ప్రవర్తిస్తుంటారు. దానివల్ల కాసేపు తీరిక తీసుకుందామన్నా, సరదాగా గడుపుదామన్నా మగవారికి ఎక్కడో ఒక మూల తప్పు చేస్తున్నామనే భావన కలుగుతుంది. స్నేహితులతో కలవడమో, ఇష్టమైన సినిమా లేదా ఆట చూడటమో, లేదంటే కాసేపు ప్రశాంతంగా ఒంటరిగా ఉండటమో వాళ్లకు కూడా అవసరం. ఏ విధమైన అపరాధ భావన లేకుండా అలాంటి సమయాన్ని కుటుంబం ఇస్తే వాళ్లు ఎంతో రిలాక్స్ అవుతారు. భావోద్వేగాలను తక్కువ చేసి చూడకూడదు.. చాలామంది మగవారు తమ బాధలను బయటకు చెప్పడానికి జంకుతారు. ఎక్కడ నన్ను బలహీనుడు అనుకుంటారో, ఎక్కడ హేళన చేస్తారో అనే భయం వారిలో ఉంటుంది. బాధ వచ్చినప్పుడు కన్నీళ్లు రావడం లేదా మనసు విప్పి మాట్లాడటం బలహీనత కాదు, అది సహజమైన మనిషి స్వభావం. తాము ఏడ్చినా, బాధపడినా దాన్ని తేలికగా తీసుకోకుండా, అర్థం చేసుకుని గౌరవించాలని వాళ్లు కోరుకుంటారు. భార్య, కుటుంబం నుంచి ప్రేమ, ఆత్మీయతతో కూడిన తోడు.. భార్యాభర్తల బంధం కేవలం ఖర్చులు, బాధ్యతలు, అవసరాలకే పరిమితం కాకూడదు అని ప్రతి భర్త కోరుకుంటాడు. ఇద్దరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకోవడం, ఒకరికొకరు సమయం కేటాయించడం, కష్టసుఖాల్లో తోడుగా నిలబడటం ఎంతో ముఖ్యం. కుటుంబ సభ్యుల నుంచి కూడా ప్రేమ, నమ్మకం, ఆత్మీయత లభిస్తే ఆ మనిషికి అంతకంటే పెద్ద బలం మరొకటి ఉండదు. సొంత ఇష్టాలు, వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించాలి.. పెళ్లయ్యాక, కుటుంబ బాధ్యతలు పెరిగాక చాలామంది మగవారు తమ సొంత అభిరుచులను, కలలను, ఇష్టాలను వదులుకుంటూ ఉంటారు. కేవలం డబ్బు సంపాదించే యంత్రంలానో, బాధ్యతల మనిషిలానో కాకుండా, తమకూ ఒక వ్యక్తిత్వం ఉందని, సొంత ఇష్టాలు ఉంటాయని కుటుంబం గుర్తించాలని వాళ్లు ఆశిస్తారు. తమ కలలను, స్నేహాలను, ఆసక్తులను గౌరవిస్తే వాళ్లు మరింత సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు. మొత్తానికి బయటకు ఎంత గట్టిగా, ధైర్యంగా కనిపించినా మగవారికి కూడా ప్రేమ, ఓదార్పు, విశ్రాంతి, అండ అవసరం. ఈ విషయాలను వాళ్లు మాటల్లో చెప్పకపోయినా, మనసులో మాత్రం ఎంతో బలంగా కోరుకుంటారు. ఇంటిల్లిపాది కలిసి ఆ చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకుంటే కుటుంబంలో ప్రేమ, సంతోషం ఇంకా పెరుగుతాయి.                                                                                                                                                *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   ప్రేమ, నమ్మకం ఉన్నప్పటికీ.. లైఫ్ పార్ట్నర్ ఎందుకు మారిపోతారు.!                                    ఈ నాలుగు పాటిస్తే అత్తాకోడళ్ల మధ్య గొడవలే ఉండవు
చలికాలం రాగానే వాతావరణం చల్లగా మారుతుంది, ఎండ వేడి తగ్గినట్టు అనిపిస్తుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలామంది సన్‌స్క్రీన్ వాడటం ఆపేస్తారు. కానీ మన చర్మం థర్మామీటర్ చూసి స్పందించదు, కాంతికి స్పందిస్తుంది. మిద్దె మీద లేదా ఆరుబయట కొన్ని గంటలు గడిపితే చల్లని గాలిలో కూడా ముఖం, చేతులు నల్లబడతాయి. నిపుణుల ప్రకారం, సన్ ట్యాన్ వేడి వల్ల కాదు, అతినీలలోహిత కిరణాల (UV rays) వల్ల వస్తుంది. వేడిని మనం అనుభవించగలం కానీ UV కిరణాలను అనుభవించలేం. చలికాలంలో UVB కిరణాలు తక్కువగా ఉన్నా, వృద్ధాప్య ఛాయలు మరియు ట్యానింగ్‌కు కారణమయ్యే UVA కిరణాలు మాత్రం చురుకుగానే ఉంటాయి. ఇవి మేఘాలను మరియు కిటికీ అద్దాలను కూడా దాటుకుని చర్మాన్ని తాకుతాయి. దీనివల్ల చర్మం తనను తాను కాపాడుకోవడానికి మెలనిన్ (melanin) ఉత్పత్తి చేస్తుంది, అదే ట్యాన్‌గా మారుతుంది. చలికాలపు ఎండ బయటకు కనిపించినంత అమాయకంగా ఉండదు. చల్లని గాలి వల్ల వేడి హెచ్చరిక తెలియక మనం ఎండలో ఎక్కువ సమయం గడిపేస్తాం. స్పష్టమైన రోజుల్లోనే కాకుండా పలుచని మేఘాలు ఉన్నప్పుడు కూడా గణనీయమైన UV కిరణాలు కిందకు వస్తాయి. మంచు, నీరు, లేదా ప్రకాశవంతమైన ఉపరితలాలు UV కిరణాలను తిరిగి చర్మంపై ప్రతిబింబిస్తాయి. ఎత్తైన ప్రాంతాలు లేదా హిల్ స్టేషన్లకు వెళ్లినప్పుడు UV తీవ్రత మరింత పెరుగుతుంది. 2024లో ప్రచురించబడిన ఒక అధ్యయన సమీక్ష ప్రకారం, UVA కిరణాలు మరియు దృశ్య కాంతి మేఘాలు, కిటికీ అద్దాల గుండా ప్రయాణించగలవు, అలాగే మెలస్మా వంటి నల్లటి మచ్చల సమస్యలో సూర్యకాంతి కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ చర్మతత్వానికి చలికాలపు ఎండ వల్ల అదనపు జాగ్రత్తలు అవసరం. ముదురు చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కమిలిపోదు కానీ సులభంగా ట్యాన్ అవుతుంది మరియు నల్లటి మచ్చలు ఏర్పడతాయి. చలికాలపు ఎండ ముఖం, చేతులు, మెడను నల్లబర్చడమే కాకుండా, మెలస్మా (బుగ్గలు, నుదురుపై గోధుమ లేదా బూడిద రంగు మచ్చలు)ను తీవ్రతరం చేస్తుంది మరియు మొటిమల మచ్చలను ఎక్కువకాలం ఉంచుతుంది. 2022లో జరిగిన ఒక సమీక్ష ప్రకారం, దృశ్య కాంతి మరియు దీర్ఘ తరంగ UVA కిరణాలు మెలస్మాకు ముఖ్య కారణాలుగా నిలిచాయి, అయినప్పటికీ మెలస్మా ఉన్నవారిలో ఎక్కువమంది సూర్యరశ్మి నుంచి రక్షణ చర్యలు సరిగ్గా పాటించడం లేదని తేలింది. అందుకే చలికాలంలోనూ ప్రతిరోజూ ఉదయం కనీసం SPF 30 మరియు PA+++ లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి. సన్‌స్క్రీన్ వాడటంలో సంఖ్య కంటే వాడే పద్ధతి, మోతాదు చాలా ముఖ్యం. ముఖం మరియు మెడ కోసం సుమారు రెండు వేళ్ల పొడవు (two finger lengths) అంత సన్‌స్క్రీన్ తీసుకోవాలి. బయట ఉన్నప్పుడు ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి మళ్లీ రాయాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నీడలో ఉండటం మంచిది. టోపీ, సన్‌గ్లాసెస్, ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించాలి మరియు చేతుల వెనుక భాగం, చెవులు, మెడను కూడా కవర్ చేసుకోవాలి. చల్లని గాలి వల్ల చర్మం పొడిబారి సున్నితంగా మారుతుంది కాబట్టి మాయిశ్చరైజర్ కూడా వాడాలి. ఉష్ణోగ్రత కంటే వాతావరణ యాప్‌లో UV ఇండెక్స్ చూసి ప్రణాళిక వేసుకోవాలి. ఇది కూడా చదవండి:జలుబు, పొడి దగ్గు వేధిస్తోందా? ఇంట్లోనే ఈ సులభ పరిష్కారాలు విటమిన్ D కోసం గంటల తరబడి ఎండలో నిలబడాల్సిన అవసరం లేదు; అలా చేస్తే పిగ్మెంటేషన్ మరియు చర్మ సమస్యలు పెరుగుతాయి. విటమిన్ D లోపం గురించి ఆందోళన ఉంటే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. 2021లో ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో వచ్చిన సమీక్ష ప్రకారం, ముదురు చర్మం ఉన్నవారికి అదే స్థాయిలో విటమిన్ D ఉత్పత్తి కావడానికి ఎండలో ఎక్కువ సమయం పట్టవచ్చు, కాబట్టి అంచనా వేయడం సరికాదు.  అలాగే, విస్తరిస్తున్న లేదా తగ్గని నల్లటి మచ్చలు, ఆకారం లేదా రంగు మారుతున్న పుట్టుమచ్చలు, చర్మం కాలిపోవడం లేదా పొట్టు ఊడటం, లేదా సన్‌స్క్రీన్ వాడినా పెరుగుతున్న పిగ్మెంటేషన్ కనిపిస్తే వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. చలికాలంలోనూ రోజూ సన్‌స్క్రీన్ రాయడం, చర్మాన్ని కప్పి ఉంచడం ద్వారా మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉంచుకోవచ్చు. మీకు నచ్చవచ్చు:ఆంధ్ర స్టైల్, మిరపకాయ బజ్జీ కూర.. సింపుల్ టిప్స్‌తో పర్ఫెక్ట్ గ్రేవీ!                              ఈజీగా చేసుకునే, రుచికరమైన పొట్లకాయ పచ్చిశనగపప్పు, కూర విధానం           Winter Sun Tan, Sun Tan In Winter Causes, Dermatologist Skincare Tips, Winter Sunscreen Tips, UV Rays In Winter, Prevent Tanning In Cold Weather, Skincare Tips In Telugu.
శీతాకాలం మొదలవగానే ఉదయాన్నే చల్లగాలి వణుకు పుట్టిస్తుంది, ఆ వెంటనే జలుబు, దగ్గు, నీరసం, మోకాళ్లు మరియు కీళ్ల నొప్పులు వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడతాయి. చలి వాతావరణంలో శరీరానికి లోపలి నుంచి వెచ్చదనం, స్థిరమైన శక్తి మరియు బలం అవసరమవుతాయి. అలాంటి కాలానికి మన సంప్రదాయ వంటకాలలో గోందు లడ్డూ ఒక అద్భుతమైన బలవర్ధక ఆహారంగా నిలుస్తుంది. ఇందులో ఉపయోగించే గోందు ప్రత్యేకమైన చెట్ల నుంచి లభించే సహజ జిగురు కాగా, ఆయుర్వేదంలో దీనిని శతాబ్దాలుగా ఆరోగ్యాన్ని కాపాడే ఔషధంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో చలవ కోసం వాడే గోందు కతీరాకు భిన్నంగా, సాధారణ గోందు శీతాకాలంలో శరీరానికి వేడిని, బలాన్ని అందించడానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ గోందు లడ్డూల తయారీలో ప్రతి కొలత, ప్రతి దశ కూడా రుచి మరియు ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తుంది. ముందుగా 1 కప్పు గోధుమపిండిలో 1 స్పూన్ నెయ్యి, చిటికెడు ఉప్పు వేసి, 2 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలను కొద్దికొద్దిగా చల్లుతూ పిండి ముద్ద కాకుండా 15 నిమిషాలు నానబెట్టి, ఆపై జల్లెడ పడితే అది చక్కటి రవ్వలా మారుతుంది. తర్వాత కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసి పావు కప్పు గోందును తక్కువ మంటపై వేయించాలి; అది వడియాల్లా ఉబ్బి తెల్లగా మారేవరకు లోపలి వరకు వేయించడం చాలా అవసరం, లేదంటే తినేటప్పుడు పళ్లకు జిగురుగా అంటుకుంటుంది. అదే కడాయిలో కొద్దిగా నెయ్యితో జీడిపప్పు పలుకులు, కిస్మిస్‌లు, పుచ్చగింజలు, బాదం పలుకులు, అలాగే అర చిప్ప తురిమిన ఎండుకొబ్బరిని కమ్మటి వాసన వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇక గోధుమపిండి రవ్వను మరొక 1 స్పూన్ నెయ్యిలో లో ఫ్లేమ్ మీద రంగు మారి సువాసన వచ్చేవరకు వేయించి చల్లారనివ్వాలి. వేయించిన గోందును చేతితో మెత్తగా క్రష్ చేసి, దానికి అర స్పూన్ యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్, ఎండుకొబ్బరి, గోధుమపిండి మిశ్రమాన్ని కలపాలి. మరోవైపు ముప్పావు కప్పు బెల్లంలో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి తక్కువ మంటపై తీగపాకం వచ్చేవరకు కరిగించి, ఆ పాకాన్ని మిశ్రమంలో వడకట్టి వేయాలి. వేడిగా ఉన్నప్పుడే గరిటెతో కలిపి, తర్వాత చేతితో గట్టిగా నొక్కుతూ లడ్డూలుగా చుట్టాలి. ఇలా తయారు చేసిన గోందు లడ్డూలను ఫ్రిజ్‌లో పెట్టకుండానే 10 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. పోషకాల పరంగా చూస్తే, సుమారు 30 గ్రాముల నుంచి 35 గ్రాముల బరువున్న ఒక గోందు లడ్డూ దాదాపు 160 నుంచి 180 క్యాలరీల శక్తిని అందిస్తుంది (సైజు మరియు నెయ్యి, బెల్లం మోతాదును బట్టి 60 గ్రాముల లడ్డూలో 287 క్యాలరీల వరకు ఉండవచ్చు). గోధుమపిండి మరియు బెల్లం నుంచి కార్బోహైడ్రేట్లు, నెయ్యి మరియు బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ నుంచి ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈ, ఖనిజాలు లభిస్తాయి. చలికాలంలో రోజుకు కేవలం 1 గోందు లడ్డూ తీసుకోవడం ద్వారా శరీరానికి తక్షణ శక్తి అందడమే కాకుండా, ఎముకలు మరియు కీళ్ల దృఢత్వానికి తోడ్పడుతుంది. ఇది కూడా చదవండి:రోజూ ఒక్క కివీ లేదా ఉడికించిన టమాటో: కణాల ఆరోగ్యంపై డాక్టర్ సూచనలు ఈ లడ్డూలు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయుక్తంగా ఉంటాయి, ముఖ్యంగా ప్రసవం తర్వాత మహిళలకు నడుము మరియు ఎముకలు గట్టిపడటానికి, శరీరం త్వరగా కోలుకోవడానికి సంప్రదాయకంగా వీటిని తినిపిస్తారు. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ, శీతాకాలపు నీరసాన్ని తగ్గించడంలోనూ ఇవి మంచి తోడ్పాటు అందిస్తాయి. అయితే ఇందులో నెయ్యి, బెల్లం, గోధుమపిండి ఉండటం వల్ల క్యాలరీలు మరియు సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి; కాబట్టి మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ లేదా బరువు నియంత్రణలో ఉన్నవారు మితంగా, వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది. మొత్తానికి, సరైన మోతాదులో తీసుకుంటే గోందు లడ్డూ శీతాకాలంలో రుచిని, ఆరోగ్యాన్ని కలబోసే విలువైన సంప్రదాయ ఆహారం. బయట దొరికే అనారోగ్యకరమైన చిరుతిళ్లకు బదులుగా, ఇంట్లోనే సులభంగా చేసుకునే ఈ లడ్డూను రోజుకు 1 చొప్పున 10 రోజుల పాటు నిల్వ ఉండేలా సిద్ధం చేసుకుంటే చలికాలపు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. సహజ పదార్థాల మేళవింపుతో రూపొందే ఈ లడ్డూ మన జీవనశైలిలో భాగమైతే శరీరానికి బలం, మనసుకు తృప్తి రెండూ దక్కుతాయి. మీకు నచ్చవచ్చు:పిల్లల స్నాక్ బాక్స్ కోసం, క్విక్ అటుకుల మిక్చర్.. నెల రోజులు నిల్వ                                  వేడి అన్నంలో నెయ్యి, చిక్కుడుకాయ కూర.. బాల్యపు రుచి మళ్లీ!       Winter Gond Laddu, Gond Laddu Benefits, Strong Bones In Winter, Immunity Boosting Laddu, Edible Gum Laddu, Winter Wellness Tips, Health Tips In Telugu.  
ఈ ఒక్క పోషకం లోపిస్తే నిద్ర, గుండె ఆరోగ్యం, కండరాల బలహీనత.. ఇలా ఎన్ని సమస్యలో తెలుసా? ఉదయం లేచినప్పటి నుంచీ ఏదో తెలియని అలసట, రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, అప్పుడప్పుడు కండరాలు పట్టేయడం లేదా బలహీనంగా అనిపించడం.. వీటిని మనం చాలామంది రోజువారీ ఒత్తిడి లేదా పని భారం వల్ల వచ్చిన సాధారణ విషయాలుగా కొట్టిపారేస్తాం. కానీ వీటన్నింటి వెనుక మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం లోపం ఉండొచ్చు. అదే మెగ్నీషియం. మన ఆరోగ్యానికి విటమిన్లు ఎంత అవసరమో, ఖనిజాలు కూడా అంతే అవసరం. వాటిలో మెగ్నీషియం పాత్ర ఎంతో కీలకమైనది. శరీరంలోని కండరాలు, నరాలు, ఎముకలు, గుండె సరిగ్గా పనిచేయడానికి ఇది తోడ్పడుతుంది. మన శరీరంలో శక్తి తయారవ్వాలన్నా, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలన్నా, రక్తపోటు సమతుల్యంగా ఉండాలన్నా మెగ్నీషియం ఎంతో అవసరం. సాధారణంగా పెద్దవారికి రోజుకు సుమారు 310 నుంచి 420 మిల్లీగ్రాముల వరకు మెగ్నీషియం అవసరం అవుతుందని వైద్య నివేదికలు చెబుతున్నాయి. ఇంత తక్కువ మోతాదులో అవసరమయ్యే ఈ పోషకం శరీరానికి సరిపడా అందకపోతే, చాలామందిలో మెల్లమెల్లగా లోపం తలెత్తుతుంది. మెగ్నీషియం లోపం ఎక్కువ కాలం కొనసాగితే శరీరంలో రకరకాల ఇబ్బందులు మొదలవుతాయి. కండరాలు బిగుసుకుపోవడం, పట్టేయడం, కొందరిలో వణుకు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే శరీరంలో నీరసం, బలహీనత, అలసట ఎక్కువగా అనిపించడం కూడా దీని వల్ల జరగవచ్చు. కండరాలు సాధారణంగా పనిచేయడానికి, వాటికి విశ్రాంతి కలగడానికి మెగ్నీషియం సహాయపడుతుంది. అందుకే దీని లోపం ఉన్నప్పుడు కండరాలకు సంబంధించిన సమస్యలు త్వరగా బయటపడతాయి. నరాల పనితీరు సక్రమంగా సాగడానికి, శరీరంలో శక్తి ఉత్పత్తి జరగడానికి కూడా మెగ్నీషియం అవసరం. ఇది తగ్గిపోయినప్పుడు కొందరిలో మనసు ప్రశాంతంగా లేకపోవడం, చిరాకు, చికాకు కలగడం వంటివి కనిపిస్తాయి. దీని ప్రభావం నిద్ర మీద కూడా పడుతుంది. రాత్రి పూట సుఖంగా నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో అంతరాయాలు కలగడం వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది కూడా చదవండి  బూడిద గుమ్మడి రసంతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.! గుండె ఆరోగ్యంపై మెగ్నీషియం లోపం తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. గుండె కొట్టుకునే వేగం సాధారణంగా ఉండటానికి, రక్తపోటు అదుపులో ఉండటానికి ఈ ఖనిజం తోడ్పడుతుంది. మెగ్నీషియం లోపం తీవ్రంగా ఉన్నవారిలో గుండె స్పందనల్లో తేడాలు రావడం, రక్తపోటుపై ప్రభావం పడటం, అలాగే శరీరంలోని ఇతర ఖనిజాల సమతుల్యత దెబ్బతినడం వంటి సమస్యలు రావచ్చు. మెగ్నీషియం లోపాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి.. రోజువారీ ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.  ఇంట్లో దొరికే అనేక ఆహార పదార్థాల్లో మెగ్నీషియం బాగానే ఉంటుంది. బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు, తృణధాన్యాలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు వీటిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల మెగ్నీషియం అందుతుంది. ఒకవేళ ఎవరికైనా ఈ లోపం చాలా ఎక్కువగా ఉంటే, వైద్యుల సలహా మేరకు మెగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. మొత్తానికి చిన్నదిగా కనిపించే ఈ ఖనిజం మన శరీరంలోని ఎన్నో ముఖ్యమైన పనులను నియంత్రిస్తుంది. అలసట, కండరాల నొప్పులు, నిద్రలేమి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా, సమతుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా అనిపిస్తే లేదా దీర్ఘకాలంగా వేధిస్తుంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.                                                                                                                                                *రూపశ్రీ. మీకు నచ్చవచ్చు  మూత్రంలో ఈ మార్పులు కనిపిస్తే కిడ్నీ సమస్యలు ఉన్నట్టేనట..!                                 కిడ్నీ, లివర్ సమస్యలకు ముందే శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే!
అవిసె గింజలు (Flax Seeds) చిన్నవిగా కనిపించినప్పటికీ ఎన్నో పోషక విలువలు కలిగిన ఆరోగ్యకరమైన ఆహారం. వీటిలో సమృద్ధిగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (Omega-3 Fatty Acids), డైటరీ ఫైబర్ (Dietary Fiber), ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా కీళ్ల ఆరోగ్యం, మెదడు పనితీరు, గుండె ఆరోగ్యం, జీర్ణవ్యవస్థకు అవిసె గింజలు ఎలాంటి మేలు చేస్తాయి? వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? కీళ్ల నొప్పులు, కీళ్ల వాపు వంటి సమస్యలు ఉన్నవారికి అవిసె గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలా ఉపయోగపడతాయి? శరీరంలో వాపు (Inflammation) తగ్గించడంలో వీటికి ఉన్న పాత్ర ఏమిటి? వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరును మెరుగ్గా ఉంచుకోవడానికి అవిసె గింజలు ఎలా తోడ్పడతాయి? వీటిలోని పోషకాలు మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తాయి? అనే విషయాలను తెలుసుకుందాం. అంతేకాకుండా అవిసె గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు ఎలా ఉపయోగపడుతుంది? మలబద్ధకం సమస్యను తగ్గించడంలో ఇవి ఎలాంటి పాత్ర పోషిస్తాయి? కొలెస్ట్రాల్ నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి అవిసె గింజలు ఎలా సహాయపడతాయి? వంటి ముఖ్యమైన విషయాలను కూడా ఈ వీడియోలో వివరించారు. అయితే అవిసె గింజలను పచ్చిగా తినాలా? వేయించి తీసుకోవాలా? పొడి చేసుకుని తీసుకోవడం మంచిదా? రోజుకు ఎంత మోతాదులో తీసుకోవాలి? థైరాయిడ్ సమస్య ఉన్నవారు అవిసె గింజలను తీసుకోవచ్చా? థైరాయిడ్ మందులు వాడేవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అందరూ వీటిని తీసుకోవచ్చా? ఎవరు ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి? అనే సందేహాలకు కూడా సమాధానాలు తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మగారు అవిసె గింజల్లోని పోషక విలువలు, వాటి ఆరోగ్య ప్రయోజనాలు, తీసుకునే సరైన పద్ధతి, తగిన మోతాదు, తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలియజేశారు. మరి గుప్పెడు అవిసె గింజలు మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయి? కీళ్ల ఆరోగ్యం నుంచి మెదడు పనితీరు వరకు వీటి ప్రయోజనాలు ఏమిటి? థైరాయిడ్ సమస్య ఉన్నవారు వీటిని ఎలా తీసుకోవాలి? ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి పూర్తి వీడియో చూడండి.
రోజూ వాకింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా? మిమ్మల్ని మీరు ఎంత మోసం చేసుకుంటున్నారో తెలుసా? ఆఫీస్ డెస్క్ ముందు గంటల తరబడి కూర్చుని పని చేసేవాళ్లకు ఆరోగ్యం గురించి, వాకింగ్ గురించి చెప్పగానే మొదట గుర్తొచ్చే మాట  సమయం లేదని చెప్పడం. రోజు ఒక గంట వ్యాయామం చేయండి, కడుపునిండా నిద్ర పోండి, సమయానికి ఆహారం తినండి అని చెప్పడం సులువే కానీ, పన్నెండు నుంచి పద్నాలుగు గంటల పని ఒత్తిడిలో ఉన్న మనిషికి అది ఎంతవరకు సాధ్యం?  చాలామంది  ఇదే విషయంలో గందరగోళానికి గురవుతూ ఉంటారు. వైద్యులు లేదా ఆరోగ్య నిపుణులు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఒక గంట ఎక్సర్సైజ్ చేయాలని, ఒత్తిడి తగ్గించుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు. కానీ సమయం లేకపోవడం లేదా చేయలేకపోతున్నామని సాకులు చెప్పుకోవడం మాని,  చేతులు ముడుచుకుని కూర్చోకుండా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లు చిన్న చిన్న మార్పులతో మొదలుపెట్టవచ్చు. వ్యాయామం అంటే రోజుకు ఒక గంట తప్పనిసరిగా కేటాయిస్తేనే లాభం అని అనుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా రోజుకు పది నిమిషాల నడకతో మొదలుపెట్టినా చాలు. వీలు కుదిరినప్పుడల్లా చిన్న చిన్న విడతలుగా నడవడం, నెమ్మదిగా వారానికి కనీసం నూట యాభై నిమిషాలు వేగంగా నడవడం లాంటి వ్యాయామం అందేలా చూసుకోవాలి. పని మధ్యలో కాసేపు లేచి కదలడం, తినే ఆహారం గురించి ముందే చిన్న ప్లానింగ్ చేసుకోవడం లాంటివి చేయొచ్చు. ముఖ్యంగా వ్యాయామం కోసం ఉన్న కొద్దిపాటి నిద్రను మాత్రం తగ్గించుకోకూడదు.                                                                                                                                                 *రూపశ్రీ.