LATEST NEWS
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఆధిక్యత ప్రస్ఫుటమైంది.   రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  మరోవైపు   వైసీపీ కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లాకే పరిమితమైంది. స్థానిక సంస్థల అత్యున్నత వేదికలైన జిల్లా పరిషత్‌లపై కూటమి సాధించిన ఈ విజయంపై కూటమి పార్టీల్లో ఆనందోత్సాహలు వ్యక్తమతౌతున్నాయి. సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.  ఇక ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే.. అత్యధిక స్థానాలలో  తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. మొత్తం 22 జడ్పీ చైర్‌పర్సన్ పదవులతో పాటు 20 వైస్ చైర్‌పర్సన్ పదవులను తెలుగుదేశం కైవసం చేసుకుంది. ఇక జనసేన జనసేన నాలుగు జడ్పీ చైర్‌పర్సన్ పదవులు, ఐదు వైస్ చైర్‌పర్సన్ పదవులను తన ఖాతాలో వేసుకుంది. బీజేపీ ఒక జడ్పీ చైర్‌పర్సన్ పదవితో పాటు రెండు వైస్ చైర్‌పర్సన్ స్థానాలను గెలుచుకుంది. ఇక   అల్లూరి సీతారామరాజు జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను వైసీపీ దక్కించుకుంది.   పొత్తులో భాగంగా కొన్ని జిల్లాల అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించడంతో సమీకరణాలు మారిపోయాయి. తొలి నుంచి ఆయా పదవులను ఆశించిన నాయకుల్లో కొంత అసంతృప్తి తలెత్తింది. ముఖ్యంగా కాకినాడ,   కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కూటమి శ్రేణుల్లోని అసమ్మతి బయటపడింది. పదవుల కేటాయింపు విషయంలో నెలకొన్న మార్పులు కొన్ని చోట్ల చర్చనీయాంశంగా మారాయి. కాకినాడ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవిని ఆశించిన కాకినాడ రూరల్ టీడీపీ ఇన్‌ఛార్జి పిల్లి అనంతలక్ష్మికి  పొత్తు కారణంగా ఆ అవకాశం దక్కలేదు. ఆ పదవి జనసేనకు వెళ్లడంతో ఆమెకు వైస్ చైర్‌పర్సన్ అవకాశం కల్పించేందుకు ప్రయత్నించారు. అయితే అసంతృప్తికి గురైన ఆమె ఎన్నిక ప్రక్రియకు హాజరుకావడానికి తొలుత నిరాకరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ఎంపీ సానా సతీశ్ తదితరులు ఆమెతో మాట్లాడి బుజ్జగించినప్పటికీ, సమావేశ మందిరానికి వచ్చిన అనంతరం ఆమె ప్రమాణస్వీకారం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వైస్ చైర్‌పర్సన్‌గా టీడీపీ జడ్పీటీసీ సభ్యురాలు పంపన రాజేశ్వరి ఎన్నికయ్యారు. ఇది కూడా చదవండి: అభ్యర్థుల ప్రకటనలో తెలుగుదేశం జోరు: స్థానిక సమరం.. క్యాండేట్ల రెండో జాబితా విడుదల.! పార్వతీపురం మన్యం జిల్లాలోనూ పదవుల కేటాయింపుపై నిరసనలు వ్యక్తమయ్యాయి. వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్‌కు జడ్పీ చైర్‌పర్సన్ పదవి వస్తుందని తొలుత అంచనాలు ఉన్నప్పటికీ, పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీనిని నిరసిస్తూ కురుపాంలో బంద్ నిర్వహించారు. అనంతరం వీరేశ్ చంద్రదేవ్‌కు వైస్ చైర్మన్ పదవి దక్కగా, ఆయన ఎన్నికై ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల స్థాయిలో పట్టు పెంచుకునే దిశగా జరిగిన ఈ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మిత్రపక్షాల మధ్య సమన్వయంతో   మెజారిటీ జడ్పీలను చేజిక్కించుకోవడం కూటమికి సానుకూలాంశంగా మారింది.   జిల్లా పరిషత్‌ల పాలకమండళ్లు పూర్తిస్థాయిలో కొలువుదీరిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించే అవకాశం ఉంది. తాగునీరు, రహదారులు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో జడ్పీల పాత్ర కీలకంగా ఉంటుంది. మున్ముందు జడ్పీ సమావేశాల నిర్వహణ, నిధుల కేటాయింపు, అభివృద్ధి పనుల అమలులో కూటమి నేతల మధ్య సమన్వయం ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల సమయంలో తలెత్తిన అసంతృప్తులను సమర్థవంతంగా సర్దుబాటు చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య ఐక్యతను కాపాడుకోవడం కూటమి నాయకత్వానికి కీలకంగా మారనుంది. ప్రజల సమస్యల పరిష్కారంలో కొత్తగా ఎన్నికైన జడ్పీ పాలకవర్గాలు ఏ మేరకు వేగంగా పనిచేస్తాయో వేచి చూడాలి. మీకు నచ్చవచ్చు: చీరాల మునిసిపోల్ ఫలితాలు: సోదిలో కూడా కనిపించని వైసీపీ.! ఏపీలో వైసీపీ కంటే బీజేపీయే బెటర్: స్థానిక సమరంలో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న జగన్ పార్టీ.! [Andhra Pradesh Zilla Parishad Elections,  Alliancevictory, ZP chairpersons, YCP,  Alluri Sitarama Raju Zilla Parishad]
కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థి: కేటీఆర్ ను లైట్ తీసుకుంటా.. సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రేవంత్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నిజంగా ఆత్మవిశ్వాసం ఉంటే హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి, ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై విజయం సాధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి సవాల్ చేశారు.  హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన సదరన్ రైజింగ్ సమ్మిట్ 2026  కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జాతీయ, ప్రాంతీయ రాజకీయాలకు సంబంధించి  కీలక వ్యాఖ్యలు చేశారు.  మతపరమైన ఓట్ల చుట్టూనే బీజేపీ, ఎంఐఎం రాజకీయాలు నడుపుతున్నాయని విమర్శించిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్  మాత్రం అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగుతోందన్నారు. ఈ వేదికపై జరిగిన సంభాషణలో లోక్‌సభ సీట్ల పునర్విభజన, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలోని రాజకీయ ప్రత్యర్థులపై ఆయన తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లుగా వెల్లడించారు.  నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)   ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విషయంగా కాకుండా, యావత్ దక్షిణ భారతదేశ భవిష్యత్తుకు సంబంధించిన పెద్ద సవాలుగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. లోక్‌సభ స్థానాలను యాభై శాతం పెంచితే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల ప్రభావం గణనీయంగా తగ్గిపోతుందని, కేవలం ఉత్తరాది సీట్ల ఆధారంగానే అధికారాన్ని చేజిక్కించుకునే పరిస్థితి ఏర్పడుతుందని  హెచ్చరించారు. పునర్విభజన తర్వాత మొత్తం 850 లోక్‌సభ స్థానాలు ఏర్పడితే.. వాటిలో ఉత్తరాదికి దాదాపు  650 సీట్లు, దక్షిణాదికి దాదాపు 195 సీట్లు దక్కే అవకాశం ఉందని గణాంకాలతో సహా వివరించారు. కేరళలో 20, ఉత్తరప్రదేశ్‌లో 80 స్థానాలు ఉన్న ప్రస్తుత పరిస్థితిలో 60 సీట్ల తేడా ఉండగా, యాభై శాతం పెంపు జరిగితే కేరళలో 30, యూపీలో 120 సీట్లతో ఆ వ్యత్యాసం 90 సీట్లకు పెరుగుతుందని ఉదాహరించారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం కీలకమని గుర్తు చేస్తూ, గతంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో పడిపోయిన సందర్భం ఉన్నప్పటికీ, దక్షిణాది ప్రాధాన్యతను దెబ్బతీసేలా సీట్ల సంఖ్యలో భారీ అసమతుల్యత రావడం దేశానికి  ఏ మాత్రం శ్రేయస్కరం కాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 175 సీట్లు ఆంధ్ర ప్రాంతానికి, 119 సీట్లు తెలంగాణకు ఉన్న సమీకరణంలో మెజారిటీ బలంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఆ కారణంగానే పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి, రాష్ట్రాలు, జనాభా, జీడీపీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని యాభై శాతం ఫార్ములాను అనుసరించాలని గట్టిగా డిమాండ్ చేశారు.  మహిళా రిజర్వేషన్ల అమలుకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే కొత్త చట్టాలు లేదా రాజ్యాంగ సవరణల అవసరం లేకుండానే, ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లో 181 స్థానాలను మహిళలకు కేటాయించవచ్చన్నారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడానికి కాంగ్రెస్ సహకరించినప్పటికీ, సంఖ్యాబలంతో ముందుకెళ్తూ భవిష్యత్తులో డీలిమిటేషన్ ద్వారా దక్షిణాదికి నష్టం కలిగించేలా వ్యవహరించడం తగదన్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీని  విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్ గా అభివర్ణిస్తూ, ఆయన తరచూ విదేశీ పర్యటనల్లో ఉంటున్నారన్న రేవంత్ రెడ్డి,  కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీలను రాజకీయ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారని, జాతి, మతం, భాష పేరిట విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్య్ర సమరయోధుల కృషితో సామాన్యులకు లభించిన ఓటు హక్కును బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, రాహుల్ గాంధీ చేపట్టిన 'ఓట్ చోర్ - గద్దీ చోర్' నినాదానికి దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తోందన్నారు. ఇక విదేశాల్లో మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు చేయడంపై,  పేదల హక్కుల కోసం వివిధ దేశాల్లో పోరాడిన చేగువేరా స్ఫూర్తితోనే ప్రజా సమస్యలపై తాము నిలబడతామని సమర్ధించారు.   ఇది కూడా చదవండి: బాబుతో బంధాన్ని ఎప్పుడో తెంచుకున్నా: తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యం.. సీఎం రేవంత్.!   అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.  ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంబంధాలపై మాట్లాడుతూ,  కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న రేవంత్ రెడ్డి  బీజేపీ ముఖ్యమంత్రుల పేర్లు గుర్తుకురాక నీతి ఆయోగ్ సమావేశాల్లో నేమ్ బోర్డులు చూడాల్సి వస్తోందని చమత్కరించారు.  కేసీఆర్‌ను తన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తానని, అయితే కేటీఆర్‌ను సీరియస్‌గా తీసుకోనని రేవంత్ చెప్పారు.  తాను పదిహేడేళ్ల వ్యవధిలో జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగి స్వయంశక్తితో ముఖ్యమంత్రి పదవిని చేరుకున్నానని, కేటీఆర్ మాత్రం తండ్రి అండతో  మేనేజ్‌మెంట్ కోటా లో నాయకుడయ్యారని ఎద్దేవా చేశారు.  తన రాజకీయ కథలో కేసీఆర్‌ను  రావణాసురుడిగా అభివర్ణించారు.   ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్‌ను కొనసాగిస్తున్నామని, లేదంటే ఎప్పుడో ఖాళీ చేసేవారమని స్పష్టం చేశారు. మీకు నచ్చవచ్చు: రేవంత్ టార్గెట్ కేసీఆర్ కాదు.. కేటీఆర్, హరీష్.​ కేటీఆర్ ఆస్తులివీ: సిరిసిల్ల వేదకగా బయటపెట్టిన సీఎం రేవంత్.!  [Southern Rising Summit, Revanth Reddy,   Delimitation,   Amit Shah, Oyaisi, KCR,  KTR, TeluguOne] 
జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే  కడప  ఎంపీ, వైసీపీ సీనియర్ నేత వైఎస్ అవినాష్ రెడ్డికి పెలీసులు నోటీసులు అందజేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నివాసం నుంచి  బయటకు రావద్దని పోలీసులు ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే , ఆ ఆంక్షలను ఖాతరు చేయకుండా  ఆయన భారీ వాహనశ్రేణితో పర్యటనకు బయలుదేరారు.  వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనే ఉద్దేశంతో వైఎస్ అవినాష్ రెడ్డి సింహాద్రిపురం మండలంలోని అంకాలమ్మ గూడూరుకు శుక్రవారం (నవంబర్ 20) చేరుకున్నారు. పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది.  ఈ పరిణామాలకు ముందురోజు అంటే గురువారం (నవంబర్ 19)  టీడీపీ నేత బీటెక్ రవి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఎంపీ అవినాష్ రెడ్డి ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ, ఆయన వ్యవహార శైలిని తక్షణమే కట్టడి చేయాలని  డిమాండ్ చేశారు. ఇది జరిగిన  మరుసటే అవినాష్ రెడ్డి పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించి కాన్వాయ్‌తో పర్యటనకు వెళ్లడాన్ని టీడీపీ శ్రేణులు, స్థానికులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యగా అభివర్ణిస్తూ   ఖండించారు. అదలా ఉండగా,  అంకాలమ్మ గూడూరు వద్ద తెలుగుదేశం, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అయితే ఈ ఘటనలో ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై పెట్రోల్ బాంబులతో దాడి జరిగిందంటూ వైసీసీయులు పెద్ద ఎత్తున ప్రచారం మొదలెట్టారు. అయితే ఎంపీ కాన్వాయ్ పై పెట్రోల్ బాంబు దాడి వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీసులు ఖండించారు.  ఆలా ఉండగా అంకాలమ్మ గూడురులో జరిగిన ఘర్షణలో తెలుగుదేశం కార్యకర్త ఒకరు గాయపడ్డారు.  ఇది కూడా చదవండి:  అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై బాంబుదాడి: సింహాద్రిపురంలో ఉద్రిక్తత.! ప్రస్తుతం అంకాలమ్మ గూడూరులో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. ఘర్షణ నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ఘర్ణణకు దిగిన వారిని స్వల్పంగా లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. పులివెందులలోనూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆంక్షలు విధించి భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిబంధనలను, ఆంక్షలను ఉల్లంఘిస్తూ కఠిన చర్యలు తప్పవని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు. మునిసిపల్, పరిషత్ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో పంచాయతీ ఎన్నికలలో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నిందని తెలుగుదేశం వర్గీయులు ఆరోపిస్తున్నారు. మీకు నచ్చవచ్చు:   పులివెందులలోనూ వైసీపీ కుదేలు: రాజకీయం పతనానికి సంకేతమేనా? పులివెందులలో జగన్ కు మరో షాక్: జడ్పీటీసీ తెలుగుదేశం కైవసం.! [Kadapa MP YS Avinash Reddy, Violate, estrictions, HugeCanvoy, Ankalamma Guduru, Pulivendula, TeluguOne]
తెలుగుదేశం పార్టీతోనూ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతోనూ ఉన్న సన్నిహిత సంబంధాన్ని తాను ఎప్పుడో తెంచుకున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేటలో నిర్వహించిన  ప్రజా పాలన  ప్రగతి బాట బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన.. తెలంగాణ ప్రయోజనాలే తనకు  ముఖ్యమని కుండబద్దలు కొట్టారు.     ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తనకు సంబంధాలు ఉన్నాయంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను రేవంత్ రెడ్డి   తిప్పికొట్టారు. తెలుగుదేశం పార్టీతో తాను ఏనాడో తెగదెంపులు చేసుకున్నానని, బాబుతో సన్నిహిత సంబంధాన్ని ఎప్పుడో విచ్ఛిన్నం చేసుకున్నానని  పునరుద్ఘాటించారు. తాను తెలంగాణ బిడ్డనని, తనను ముఖ్యమంత్రిని చేసిన ఈ గడ్డకు నీటి విషయంలో   అన్యాయం ఎలా చేస్తానని, ఎందుకు చేస్తానని  ప్రశ్నించారు. కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని గతంలో సంతకం చేసింది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్ రావు కాదా అని నిలదీశారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డిని ప్రగతిభవన్‌కు ఆహ్వానించి విందు ఇచ్చి, రాయలసీమ ప్రాజెక్టులకు సహకరించింది కేసీఆరేనని  ఆరోపించారు. కేసీఆర్, హరీశ్ రావుల రాజకీయ ప్రస్థానం, కుటుంబ ఆస్తులు, ప్రాజెక్టుల వ్యవహారాలపై రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.  చింతమడకలో ఉన్న కేసీఆర్‌కు తొలిసారి రాజకీయ అవకాశం కల్పించింది దివంగత కాంగ్రెస్ నేత ఆనంతుల మదన్ మోహన్ అనీ,   అలాంటి వ్యక్తిపైనే కేసీఆర్ పోటీ చేశారని విమర్శించారు. ఆయన జ్ఞాపకార్థం సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు పెడతామని ప్రకటించారు. గత నాలుగు దశాబ్దాలుగా మామ, అల్లుడు, బావమరిది అంటూ వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయన్న రేవంత్ రెడ్డి.. 2004లో వార్డు మెంబర్ కూడా కాని హరీశ్ రావు, నాడు కాంగ్రెస్ దయతో  రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారని గుర్తుచేశారు. రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, జన్వాడ ప్రాంతాల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఫామ్ హౌస్‌లు, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సమకూరాయని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపైనా రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు ముందుండి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడేళ్లకే కుప్పకూలిపోయిందని విమర్శించారు. ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే కారణంతోనే, 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆరోపించారు. అలాగే తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చాక ఆమె అడగకపోయినా పిలిచి పదవి ఇచ్చి గౌరవించామని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గ రాజకీయ భవిష్యత్తుపై మాట్లాడుతూ, ఇకపై సిద్దిపేట గడ్డ కాంగ్రెస్ అడ్డాగా మారబోతోందని రేవంత్  ధీమా వ్యక్తం చేశారు.  ఇది కూడా చదవండి: తెలంగాణలో పాలసీ పెరాలసీ లేదు..పెట్టుబడులకు సంపూర్ణ భద్రత: సీఎం రేవంత్ రాబోయే ఎన్నికల్లో సిద్దిపేట కార్యకర్తలు, నాయకులు చర్చించి సూచించిన అభ్యర్థికే కాంగ్రెస్ టికెట్ కేటాయిస్తామని, ఇక్కడ గెలిచే ఎమ్మెల్యేకు కీలకమైన మంత్రి పదవి అందిస్తామని హామీ ఇచ్చారు. 2029 ఎన్నికల్లోనూ తెలంగాణలో రెండోసారి ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని తాము రద్దు చేయలేదని, పైగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక కొత్త పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా  5 లక్షల రూపాయల బీమా కవరేజీతో  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంచామన్నారు. మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంపై సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు.. సిద్దిపేట సభలో ప్రగల్భాలు, వ్యక్తిగత విమర్శలు తప్ప ప్రజలకు ఉపయోగపడే అంశం ఒక్కటీ లేదని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన  దేవుళ్లపై ఒట్లు వేసి రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి..  ఇప్పుడు ఒట్ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, హరీశ్ రావు కౌంటర్‌తో సిద్దిపేటలో జరిగిన ఈ బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.    మీకు నచ్చవచ్చు:   మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ: ఏం చర్చించారో తెలుసా.?​ తెలంగాణ విద్యావిధానంలో సమూల మార్పులు.. వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం.! [Revanth Reddy, Siddipetpublicmeeting, Chandrababu, Harish Rao, IndirammaFamily LifeInsurance]
లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి తన వ్యాఖ్యలతో దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడల్లా దేశ అంతర్గత విషయాలపై విమర్శలు చేయడం ఆయనకు పరిపాటిగా మారిందన్న విమర్శలు మళ్లీ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమెరికాలోని ప్రఖ్యాత కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో  చర్చకు దారితీశాయి.   కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో  అనేక లోపాలు ఉన్నాయని విదేశీ వేదికపై విమర్శించడం ఇప్పుడు అధికార పక్షంతో పాటు రాజకీయ పరిశీలకులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  సాధారణంగా విదేశాలకు వెళ్లినప్పుడు తమ మాతృభూమి గొప్పతనాన్ని చాటిచెప్పడం భారత సంప్రదాయం. మన ఇతిహాసమైన మహాభారతంలో సైతం, అంతర్గత విభేదాలు ఎన్ని ఉన్నా బయటి వ్యక్తుల ముందు మన లోపాలను ఎత్తిచూపకూడదని ధర్మరాజు తన తమ్ముళ్లకు సూచించిన సందర్భాన్ని పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  అయితే.. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న రాహుల్ గాంధీ.. విదేశీ సదస్సుల్లో, విదేశీ మీడియా ముందు దేశ ప్రతిష్ఠను మసకబార్చులా  మాట్లాడటం   సమంజసం కాదన్న అభిప్రాయం గట్టిగా వ్యక్తమౌతోంది.    దేశంలో ఏవైనా సమస్యలు ఉంటే, ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసే  హక్కు రాహుల్ గాంధీకి ఉంది. ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ ప్రజలను చైతన్యవంతం చేయాలి. అవసరమైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేపట్టి ప్రభుత్వానికి నిర్దిష్ట సూచనలు ఇవ్వాలి.. కానీ, స్వదేశంలో చేయాల్సిన రాజకీయ పోరాటాన్ని పక్కనపెట్టి, విదేశీ గడ్డపై దేశ ఆర్థిక వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో ఇండియా ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది.  ప్రస్తుతం ఇండియా చుట్టూ ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు   సున్నితంగా ఉన్నాయి. చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలు భారత్‌లో అస్థిరతను సృష్టించేందుకు నిరంతరం ఏదో ఒక రకంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో   దేశ బలహీనతలను విదేశీ వేదికలపై ఎత్తిచూపడం ద్వారా  శత్రుదేశాలకు   ఆయుధాలు అందించినట్లు అవుతుందని పరిశీలకులు అంటున్నారు.  ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి నేతలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని   అభిప్రాయపడుతున్నారు.   కొలంబియా విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ  విరుచుకుపడింది. రాహుల్ ఆరోపణలను ఖండిస్తూ, గత పన్నెండేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజలు  సుఖసంతోషాలతో జీవిస్తున్నారని పేర్కొంది.. ఇప్పటికే ప్రధాని మోదీ పలు సందర్భాల్లో రాహుల్ గాంధీ రాజకీయ వైఖరిని ఎద్దేవా చేస్తూ మాట్లాడిన విషయాన్ని వారు గుర్తుచేశారు.  ఇది కూడా చదవండి:  రాహుల్ విదేశీ పర్యటన: శశిథరూర్ వ్యాఖ్యలు వైరల్.!​ అదలా ఉంటే.. ఇటీవల సోనియా గాంధీ ఆత్మకథ విడుదల సందర్భంగా తన తల్లిదండ్రులను పార్వతీపరమేశ్వరులతో పోలుస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు కూడా హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసి, మరో వివాదానికి తెరలేపాయి.   నిజానికి ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాలు సామాన్య ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి. ఒక బలమైన ప్రతిపక్ష నేతగా ఆయన ఎదుగుతున్నారనే సంకేతాలు వెలువడ్డాయి. కానీ, ఆ సానుకూల వాతావరణాన్ని నిలబెట్టుకోవాల్సింది పోయి, ఆయన ఇలాంటి అనవసర వివాదాల్లో చిక్కుకుంటూ తన వ్యక్తిత్వాన్ని, రాజకీయ ప్రతిష్ఠను ఆయనే స్వయంగా తగ్గించుకుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.    రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ తన ప్రసంగాల శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సందర్భోచితంగా, దేశ ప్రయోజనాలకు భంగం కలగని రీతిలో వ్యవహరించకపోతే, అది వ్యక్తిగతంగా ఆయనకే కాకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీకి కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సమయోచిత వ్యాఖ్యలు చేయనంత కాలం హస్తం పార్టీకి రాజకీయ కష్టాలు తప్పవని, ప్రజల విశ్వాసాన్ని పూర్తిస్థాయిలో గెలుచుకోవడం కష్టతరమవుతుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.   మీకు నచ్చవచ్చు: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై దుమారం​ 8 బిలియన్ డాలర్ల నుంచి 140 బిలియన్ డాలర్లకు.. అదానీ ఆస్తులు ఎలా పెరిగాయి: రాహుల్ గాంధీ   [Rahul Gandhi, ColumbiaUniversitySpeech, IndianEconomy, BJPReaction, TeluguOne]
ALSO ON TELUGUONE N E W S
Tharun Bhascker's ENE Repeat is maintaining its strong momentum at the box office, with the sequel to Ee Nagaraniki Emayyindi grossing over ₹23.12 crore worldwide in its first two days. The film has opened on a promising note, with bookings continuing to remain strong beyond its initial run. Starring Vishwak Sen, Srinath Maganti, Abhinav Gomatham and Venkatesh, the film brings back the popular gang from the original. Shivatmika Rajasekhar and Anisha Ambrose play the female leads in the sequel. The film has received a positive response from audiences, with word of mouth contributing to its sustained theatrical run. Viewers are enjoying the combination of humour, emotions and the gang's familiar chemistry on the big screen. Despite competition from other releases, ENE Repeat is witnessing strong bookings for its third and fourth days. The continued demand suggests that the film is holding its ground after its opening, rather than relying only on the initial excitement surrounding the sequel. Also Read: ENE Repeat Movie Review  Produced by Srujan Yarabolu and Sandeep Nagireddy, the film has been mounted on a substantial budget. Its early box-office performance and steady ticket demand have raised expectations about its commercial prospects. ENE Repeat is aiming to turn its strong opening into a sustained theatrical success. Trade expectations are growing that the film could emerge as a profitable venture for its makers and stakeholders. Check Out:    O.M: Operation Mole Movie Review                         Ramayana Part-1 creates huge BO history   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Primeshow Entertainment, which scored a massive pan-India success with HanuMan, is expanding its cinematic universe with the next chapter, HanuMan 2 – The Rise of Vanaras. The production house has roped in Panja Vaisshnav Tej as the lead actor, with creative filmmaker VI Anand directing the project. The announcement has suprised many as Prashanth Varma created PVCU - Prashanth Varma Cinematic Universe, post the success of Hanu-Man and he planned direct sequel, Jai Hanuman with Rishab Shetty. He creative produced and written another PVCU film, Mahakali, as well. But prodcuers have decided to take this new direction.  They have stated that they own the title rights and can develop a new story around the premise. The makers unveiled the project with a striking title poster that features a man ascending through the clouds, accompanied by a gigantic celestial tail and a mystical presence. VI Anand, known for his imaginative storytelling and distinctive approach to fantasy, is expected to bring a different vision to this ambitious project. The combination of Anand's creative sensibilities and the mythology-driven world of HanuMan has raised curiosity about the film. Also Read: Aakasamlo Oka Tara Movie Review  For Vaisshnav Tej, the project marks a major comeback to the big screen after a gap. The actor will be seen in a fantasy spectacle that promises a new world and a different cinematic experience. With HanuMan 2 – The Rise of Vanaras, the makers are taking another significant step in building the HanuMan universe. Further details about the cast and production schedule are expected to be announced soon. Check Out:   Samantha gives birth to a baby boy                       O.M: Operation Mole Movie Review    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
‘హనుమాన్‌’ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న తర్వాత ఆ ఫ్రాంచైజీ నుంచి మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇప్పుడు డబుల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చింది. ఒకవైపు రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో ప్రశాంత్‌ వర్మ ‘జై హనుమాన్‌’ తెరకెక్కిస్తుండగా.. మరోవైపు పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ‘హనుమాన్‌ 2’ను ప్రకటించారు. దీంతో ఒకే ఫ్రాంచైజీ పేరుతో రెండు వేర్వేరు సినిమాలు తెరపైకి రావడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా నిర్మాత నిరంజన్‌ రెడ్డి తన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ‘హనుమాన్‌ 2’ను ప్రకటించారు. పంజా వైష్ణవ్‌ తేజ్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ‘ది రైజ్‌ ఆఫ్‌ వానరాస్‌’ అనే ట్యాగ్‌లైన్‌ పెట్టారు.  విఐ ఆనంద్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విడుదల చేసిన పోస్టర్‌లో ఆధ్యాత్మికత, ఫాంటసీ అంశాలతో కూడిన భారీ ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం కనిపిస్తోంది. మరోవైపు ‘హనుమాన్‌’ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఇప్పటికే ‘జై హనుమాన్‌’ సినిమాను పట్టాలెక్కించారు. ఇందులో రిషబ్‌ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ కూడా ఇటీవల ప్రారంభమైనట్లు వార్తలు వచ్చాయి. ఇది కూడా చదవండి: 450 కోట్ల సినిమా.. ఎవరూ పట్టించుకోలేదు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.! అయితే ‘హనుమాన్‌’ తర్వాత సీక్వెల్‌ విషయంలో నిర్మాత నిరంజన్‌ రెడ్డి, దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మధ్య క్రియేటివ్‌ విభేదాలు తలెత్తినట్లు గతంలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇద్దరూ వేర్వేరు హీరోలతో హనుమాన్‌ నేపథ్యంలోని సినిమాలను ముందుకు తీసుకెళ్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తానికి ఒకప్పుడు ‘హనుమాన్‌’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫ్రాంచైజీ నుంచి ఇప్పుడు రెండు సినిమాలు రాబోతున్నాయి. ఒకదానిలో వైష్ణవ్‌ తేజ్‌, మరొకదానిలో రిషబ్‌ శెట్టి కనిపించనున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ప్రేక్షకులకు ఎక్కువగా నచ్చుతుంది? రెండు చిత్రాలు ఒకదానికొకటి భిన్నమైన కథలతో ఎలా మెప్పిస్తాయి? అన్నది ఆసక్తికరంగా మారింది. మీకు నచ్చవచ్చు:  త్రివిక్రమ్‌ నెక్స్ట్‌ మూవీ.. చిరంజీవితోనా.. సూర్యతోనా.? బాలకృష్ణకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం.!       [HanuMan 2, Jai Hanuman, Prasanth Varma, Niranjan Reddy, Panja Vaisshnav Tej]  
సౌత్ సినీ ప్రేమికులంత అదృష్టవంతులు లేరనట్టుగా ధనుష్, మమ్ముట్టి , సాయి పల్లవి,  శ్రీలీల వంటి స్టార్ కాంబో మూకుమ్మడిగా నిన్న' ఓం' తో సెల్యులాయిడ్ పై అడుగుపెట్టారు.  ఈ పాన్ ఇండియా దినుసుల సువాసన ఇన్ క్లూడింగ్  వరల్డ్ మూవీ లవర్స్ కి  కూడా తగిలిందనుకోండి. మరి ఫస్ట్ డే ఎంత రాబట్టిందో చూద్దాం.   ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ చిత్రం తొలిరోజు భారతదేశవ్యాప్తంగా  17.70 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టి, ధనుష్ కెరీర్‌లోనే అత్యధిక డొమెస్టిక్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా సరికొత్త చరిత్ర లిఖించింది.  భారతదేశంలో మొత్తం 6,628 షోలతో భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు ప్రాంతీయ భాషల వారీగా అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా తమిళ వెర్షన్ నుంచి  13.35 కోట్లు వసూలు కాగా, తెలుగు రాష్ట్రాల్లో ధనుష్‌కు ఉన్న క్రేజ్ మరోసారి రుజువైంది. సినిమా విడుదలకు ముందు 'ఓం' తమిళ సినిమాతో సమానంగా తెలుగు సినిమా కూడా అని ధనుష్ చెప్పిన మాటలు నిజమయ్యాయి.  తెలుగు వెర్షన్ మొదటి రోజే  4 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 2.5 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచింది. ఇక హిందీ వెర్షన్ నుంచి  35 లక్షలు తోడవడంతో, తొలిరోజు ఇండియా గ్రాస్ కలెక్షన్లు  20.55 కోట్లకు చేరుకున్నాయి.  కేవలం దేశీయ మార్కెట్‌లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ 'ఓం' సత్తా చాటింది. అంతర్జాతీయ మార్కెట్లలో మొదటి రోజు ఏకంగా 11 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో, సినిమా మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లు  31.55 కోట్ల మార్కును తాకాయి. ఈ భారీ వసూళ్లతో ధనుష్ తన పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టారు.  ఇది కూడా చదవండి: ఓం మూవీ రివ్యూ! గతంలో ధనుష్ అత్యధిక ఓపెనర్‌గా నిలిచిన 'తేరే ఇష్క్ మే' (రూ. 16 కోట్లు) రికార్డును 'ఓం' అధిగమించింది. అంతేకాకుండా, ఆయన గత చిత్రాలైన 'కుబేర' (రూ. 14.75 కోట్లు), 'రాయన్' (రూ. 13.65 కోట్లు) తొలిరోజు వసూళ్లను సునాయాసంగా దాటేసింది. ఈ ఏడాది విడుదలైన ధనుష్ గత చిత్రం 'కార' (రూ. 6.20 కోట్లు) తో పోలిస్తే, 'ఓం' రెట్టింపు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టడం విశేషం.  ఇంతటి భారీ ఓపెనింగ్ రావడానికి ప్రధాన కారణం ఇందులోని భారీ తారాగణం. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి 'బర్మా కార్తికేయన్' అనే క్రూరమైన స్మగ్లింగ్ గ్యాంగ్ లీడర్ గా  నటించడం, సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా వంటి అగ్ర నటులు భాగం కావడం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే  9 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది. మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, వారాంతంలో థియేటర్లకు ప్రేక్షకుల తాకిడి పెరిగితే  బాక్సాఫీస్ ని తన వశం చేసుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకుడు.    మీకు నచ్చవచ్చు :ఆకాశంలో ఒక తార రివ్యూ! మీకు నచ్చవచ్చు: ఆకాశంలో ఒక తార ఫస్ట్ డే కలెక్షన్స్!   [Om, Dhanush, Sai pallavi, Sreeleela,mamootty, Tollywood]
తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటుతూ ఆకాశంలో ఒక తార బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. నిన్న ఈవినింగ్ షో కి అయితే చాలా రోజుల తర్వాత  రెగ్యులర్ ప్రేక్షకులతో పాటు మోస్ట్ పవర్ ఫుల్ హై క్లాస్ పీపుల్స్, ఉన్నత విద్యావంతుల హోదాలో ఐపిఎస్, ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సైతం ఆకాశంలో ఒక తార కోసం థియేటర్స్ లో తిష్ట వేశారు. దీన్ని బట్టి విజయాన్ని అందుకోబోయే రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు సుమారు 4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లని  సొంతం చేసుకుంది.  మొదటి రోజు ఇండియా గ్రాస్ అయితే 3 కోట్లు. , దేశవ్యాప్తంగా దాదాపు 2,079 షోలతో విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు 27.7 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 60.29 లక్షల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 49.72 లక్షల రూపాయల అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్‌తో మెజారిటీ వసూళ్లు తెలుగు వెర్షన్ నుంచే వచ్చాయి. అయితే దుల్కర్ సల్మాన్ గత సినిమాలతో పోలిస్తే ఆకాశంలో ఒక తారకు వచ్చిన ఓపెనింగ్స్ కాస్త తక్కువగానే ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అదే రోజు ధనుష్, మమ్ముట్టి కలిసి నటించిన ఓఎం: ఆపరేషన్ మోల్ వంటి భారీ యాక్షన్ థ్రిల్లర్ విడుదలై బాక్సాఫీసు వద్ద పోటీ ఇవ్వడమే.   దాదాపు 60 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారానే మంచి రికవరీ సాధించింది. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ ఓటీటీ హక్కులను ఏకంగా 34 కోట్ల రూపాయలకు దక్కించుకుంది.బాక్సాఫీసు వద్ద ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే 30 కోట్ల రూపాయల థియేట్రికల్ షేర్, అంటే దాదాపు 60 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సిన టార్గెట్ ఉంది. ఇది కూడా చదవండి:పవన్ కళ్యాణ్ పై ఉపాసన కొణిదెల వ్యాఖ్యలు వైరల్! మొదటి రోజు 4 కోట్ల గ్రాస్‌తో డీసెంట్ స్టార్ట్ అందుకున్న ఈ చిత్రం, పాజిటివ్ మౌత్ టాక్ సహాయంతో శనివారం, ఆదివారం వీకెండ్‌లో భారీగా పుంజుకునే అవకాశం ఉంది. శనివారం అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే 1.08 కోట్లు, ఆదివారం 1.13 కోట్లు దాటడం సినిమాకు కలిసొచ్చే అంశం. ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడితే దుల్కర్ ఖాతాలో మరో క్లాసిక్ హిట్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. సాత్విక వీరవల్లి టైటిల్ రోల్ కాగా  శ్రుతి హాసన్, రుహానీ శర్మ, స్వాసిక కీ రోల్స్ లో  మెరిశారు. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ తో కలిసి గుణ్ణం గంగరాజు నిర్మించాడు. పవన్ సాదినేని దర్శకుడు. మీకు నచ్చవచ్చు: సాత్విక బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు: మీ ఆకాశంలో ఒక తార! మీకు నచ్చవచ్చు:ఆకాశంలో ఒక తార షాకింగ్ రివ్యూ!   [Aakasamlo oka tara, dulqer salmaan, sathvika veeravalli, shruthi haasan, pawan sadineni]
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఆయన గారాలపట్టి అల్లు అర్హ రేపు (నవంబర్‌ 21) పదో పుట్టినరోజు జరుపుకోనుంది. ఈ సందర్భంగా అల్లు కుటుంబం ప్రత్యేక వేడుకల కోసం శ్రీలంకకు బయలుదేరింది. అల్లు అర్జున్‌, స్నేహా రెడ్డి దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు అయాన్‌ కాగా.. చిన్న కుమార్తె అర్హ. తన అల్లరి, ముద్దు ముద్దు మాటలతో అర్హ ఇప్పటికే సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్‌తో కలిసి ఆమె చేసే సందడి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పుడు అర్హ పదో పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా జరిపేందుకు కుటుంబమంతా శ్రీలంకకు వెళ్లడం విశేషం. ఈ సెలబ్రేషన్స్‌ ఎలా ఉండబోతున్నాయోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు అర్హకు ముందుగానే సోషల్‌ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.       [Allu Arjun, Allu Arha, 10th Birthday, Sneha Reddy, Allu Ayaan]  
జబర్దస్త్‌ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డేగల బాబు. ఒక సాధారణ కంటెస్టెంట్‌గా షోలోకి అడుగుపెట్టి.. తన కామెడీ పంచులు, ప్రాసలతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇప్పుడు నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన సత్తా చాటుతున్నాడు. ఇలాంటి సమయంలో ఈ కమెడియన్‌ తన అభిమానులకు మరో గుడ్‌న్యూస్‌ చెప్పాడు. ఏడేళ్లుగా ప్రేమిస్తున్న అమ్మాయి అమూల్యను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. శుక్రవారం (నవంబర్‌ 20) బాబు, అమూల్య వివాహం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను స్వయంగా బాబే సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో ఈ కొత్త జంటకు అభిమానులు, నెటిజన్ల, బుల్లితెర ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాబు పెళ్లి వేడుకకు పలువురు జబర్దస్త్‌ ఆర్టిస్టులు, బుల్లితెర సెలబ్రిటీలు హాజరయ్యారు. సునీత, టేస్టీ తేజ, జిత్తు, సందీప్‌, పంచ్‌ ప్రసాద్‌, నూకరాజు తదితరులు వేడుకలో సందడి చేశారు. నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకప్పుడు జబర్దస్త్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన బాబు.. తన ప్రతిభతో టాప్‌ కమెడియన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టీవీ షోలలోనూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.  ఇది కూడా చదవండి: సమంత కొడుకు పేరు వెనుక ఇంత అర్థం ఉందా.? నటనతో పాటు స్క్రిప్ట్‌ రైటింగ్‌లోనూ బాబుకు మంచి పట్టుంది. ఇప్పటికే పలు టీవీ షోల కోసం వందలాది స్కిట్లు రాశాడు. https://www.instagram.com/reel/Df9e0OtyIKe/ ఇటీవలే మెగాఫోన్‌ పట్టి ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ వెబ్‌ సిరీస్‌తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఓటీటీలో విడుదలైన ఈ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ప్రేక్షకులను నవ్వించడంతో పాటు దర్శకుడిగా బాబుకు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కెరీర్‌లో ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతున్న సమయంలోనే తన ఏడేళ్ల ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకున్నాడు. మీకు నచ్చవచ్చు:  త్రివిక్రమ్‌ నెక్స్ట్‌ మూవీ.. చిరంజీవితోనా.. సూర్యతోనా.? 450 కోట్ల సినిమా.. ఎవరూ పట్టించుకోలేదు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.!       [Jabardasth Babu, Wedding, Marriage, Babu Amulya]
స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు దంపతులకు నవంబర్ 19న మగబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. నవంబర్ 20న ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సమంత.. తమ కుమారుడి పేరును కూడా అభిమానులతో పంచుకున్నారు.  చిన్నారి చేతి వేళ్లను పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ ‘దేవ్ నిడిమోరు’ అని పేరు ప్రకటించారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ చిన్నారి పేరుపై పడింది. అసలు ‘దేవ్’ అనే పేరుకు అర్థమేంటి? ఈ పేరును ఎంచుకోవడం వెనుక ఏదైనా ప్రత్యేకత ఉందా? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. సంస్కృత మూలాలున్న ‘దేవ్’ అనే పేరుకు దేవుడు, దైవికమైన వ్యక్తి అనే అర్థాలు ఉన్నాయి. అలాగే ప్రకాశించేవాడు, కాంతివంతమైనవాడు అనే భావాలు కూడా ఈ పేరుతో ముడిపడి ఉన్నాయి. పవిత్రత, దైవత్వం, మంచితనానికి ప్రతీకగా ఈ పేరును భావిస్తారు. చిన్నగా, సులభంగా పలకడానికి వీలుగా ఉండటంతో పాటు సంప్రదాయ అర్థాన్ని కలిగి ఉండటం ‘దేవ్’ పేరులోని ప్రత్యేకత. ఆధునికంగా అనిపిస్తూనే భారతీయ సంస్కృతితో అనుబంధం ఉండటం కూడా ఈ పేరును ఆకర్షణీయంగా మార్చింది. ఇది కూడా చదవండి: సమంతకు బాబు పుట్టాడు.. పేరు కూడా రివీల్‌ చేశారు.!       [Samantha Son Name, Dev Name Meaning, Dev Nidimoru, Raj Nidimoru]  
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ వైఫ్ ఉపాసన కి సంబంధించిన న్యూస్ వేడి వేడి హాట్ న్యూస్ హోదాలో సోషల్ మీడియా;నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అని పాడుకునేలా చేస్తుంది. మరి ఉదయం నుంచి సోషల్ మీడియాని సరిగా ఎవరు పట్టించుకోలేదంటా! మరి పూర్తి మ్యాటర్ చూద్దాం.  .సాధారణంగా అభిమానులు, సినీ ప్రేక్షకులు పవన్ కల్యాణ్‌ను ఆప్యాయంగా ‘పవర్ స్టార్’ అని పిలుచుకుంటారు. అయితే ఇటీవల జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఉపాసన మాట్లాడుతూ, మీ అందరికీ ఆయన పవర్ స్టార్‌లా కనిపిస్తున్నారేమో కానీ, తన దృష్టిలో మాత్రం ఆయన నిజమైన ‘ఎంపవర్ స్టార్’ అని పేర్కొనడం అందరినీ ఆకట్టుకుంది. ఇతరులకు శక్తిని ఇవ్వడం, ప్రజలను సాధికారత వైపు నడిపించడమే నిజమైన శక్తి అని ఆమె అభిప్రాయపడ్డారు. పిఠాపురం నియోజకవర్గంలో అపోలో ఆసుపత్రుల ఆధ్వర్యంలోని ‘అపోలో ఆరంభ్’ చొరవతో ఏర్పాటు చేసిన తొలి మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంలో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం గడ్డపై ఈ అత్యాధునిక అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభం కావడం ఒక గర్వకారణమైన ఘట్టమని ఉపాసన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి, దేశంలోని తల్లులు మరియు చిన్నారుల కోసం రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా చిన్నారుల ప్రాథమిక ఆరోగ్యం, పోషకాహారం, తొలిదశ అభ్యాసానికి బలమైన పునాది వేస్తున్నట్లు వివరించారు.      ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తల్లులు, శిశువుల సంక్షేమాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో రూపొందించిన ఈ మోడల్ అంగన్‌వాడీ కేంద్రం సురక్షితమైన, పిల్లలకు అనుకూలమైన వాతావరణంలో మెరుగైన వైద్య సేవలు, పౌష్టికాహారం, ఆధునిక విద్యా సౌకర్యాలను అందిస్తుందని నిర్వాహకులు తెలిపారు. పిఠాపురం ప్రజలు ఈ చొరవను హర్షాతిరేకాలతో స్వాగతించారు.   ఇది కూడా చదవండి: నిజంగానే ఆకాశంలో ఒక తార: సాత్విక వీరవల్లి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు! కేవలం పిఠాపురం నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇలాంటి మరిన్ని మోడల్ అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుకు ఈ ప్రాజెక్ట్ ఒక ఆదర్శంగా నిలుస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకత్వం, ఆరోగ్య రంగ సంస్థల సమన్వయంతో సమాజంలో మార్పు తీసుకురావచ్చని ఉపాసన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఒకవైపు పవన్ కల్యాణ్ ప్రజాసేవ, నియోజకవర్గ అభివృద్ధి దృక్పథాన్ని ప్రశంసిస్తూనే, మరోవైపు మహిళలు, చిన్నారుల ఆరోగ్య భద్రతపై ఉపాసన తీసుకుంటున్న చొరవపై ప్రజల్లో సానుకూల చర్చ జరుగుతోంది. ‘పవర్ స్టార్’ నుంచి ‘ఎంపవర్ స్టార్’ వరకు ఆమె ఇచ్చిన ఈ కొత్త బిరుదు ఇప్పుడు అభిమానుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర అంశంగా మారింది.   మీకు నచ్చవచ్చు:హీరోయిన్ అయితే చేతులతో తాకాలా: దెబ్బకి డిలీట్ చేసి పడేసాడు!  మీకు నచ్చవచ్చు: పవన్ కల్యాణ్ ఇంటి వద్ద కత్తితో కలకలం!   [Pawan Kalyan, Upasana, Empower Star,Ram Charan,Tollywood]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ నెక్స్ట్‌ మూవీ ఎవరితో చేయబోతున్నారు? ఈ ప్రశ్నకు సంబంధించి ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఒకవైపు మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు కోలీవుడ్‌ స్టార్‌ సూర్యతోనూ త్రివిక్రమ్‌ చర్చలు జరుపుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. వెంకటేశ్‌తో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ చేయాల్సిన ప్రాజెక్ట్‌ ఎన్టీఆర్‌తో ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’. అయితే ఎన్టీఆర్‌ ఇతర సినిమాల షెడ్యూల్స్‌ కారణంగా ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కడానికి మరికొంత సమయం పట్టే అవకాశముంది. దీంతో ఈ గ్యాప్‌లో మరో సినిమాను పూర్తి చేయాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే చిరంజీవితో సినిమా చేసే ఆలోచనకు వచ్చారని సమాచారం. ఇప్పటికే మెగాస్టార్‌కు ఓ కథ వినిపించారని, అది ఆయనకు నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్‌ సిద్ధం చేయమని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు త్రివిక్రమ్‌ మనసులో సూర్యతో సినిమా చేయాలనే ఆలోచన కూడా ఉందట. గతంలోనే సూర్యకు ఓ కథ చెప్పినట్లు త్రివిక్రమ్‌ స్వయంగా వెల్లడించారు. ఆ కథను ఆయనకు నచ్చేలా చెప్పలేకపోయానని, త్వరలోనే సూర్యతో సినిమా చేస్తాననే నమ్మకం ఉందని కూడా చెప్పారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌పై కొంతకాలంగా ఆసక్తి నెలకొంది. ఇది కూడా చదవండి: తాత టైటిల్‌తో తారక్ మూవీ.. అనిల్‌ రావిపూడి ప్లాన్ మామూలుగా లేదు.! తాజా ప్రచారం ప్రకారం, చిరంజీవితో సినిమా ఆలస్యమైతే సూర్యతో ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నారట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు సూర్య ఇప్పటికే ఓ సినిమా చేయడానికి అంగీకరించారని, ఈ కాంబినేషన్‌ కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని టాక్‌. మరి త్రివిక్రమ్‌ ముందుగా మెగాస్టార్‌తో సినిమా చేస్తారా? లేక సూర్యతో కొత్త ప్రయాణం మొదలుపెడతారా? ప్రస్తుతం ఈ రెండు కాంబినేషన్లపై చర్చలు జరుగుతున్నా.. ఏది ఖరారైందనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. మీకు నచ్చవచ్చు:  ఒసేయ్ రాములమ్మ రీమిక్స్‌.. థియేటర్లను షేక్ చేయబోతున్న రష్మిక.! సమంతకు బాబు పుట్టాడు.. పేరు కూడా రివీల్‌ చేశారు.!       [Trivikram Srinivas, Chiranjeevi, Suriya, God of War, Jr NTR]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
సాధారణంగా ఇంట్లో పొట్లకాయ కూర అనగానే చాలామంది ముఖం చిట్లిస్తారు. కానీ అదే పొట్లకాయకు పచ్చిశనగపప్పు తోడైతే ఆ రుచి ఎక్కడికో వెళ్లిపోతుంది. ఒకసారి ఈ పద్ధతిలో పొట్లకాయ పచ్చిశనగపప్పు కూర వండితే మాంసం కూరలను కూడా మర్చిపోవాల్సిందేనన్నంత అద్భుతమైన రుచి సొంతమవుతుంది. వేడివేడి అన్నం, చపాతీ, లేదా రోటి దేనిలోకి తిన్నా ఈ కూర అమోఘంగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కూర కావాలనిపించేలా చేసే ఈ వంటకం మన వంటింట్లో ఉండే సాధారణ దినుసులతోనే సులభంగా సిద్ధమవుతుంది. కేవలం 5 దశల్లో ఈ వంట విధానాన్ని పూర్తి చేయవచ్చు. ఈ కూర రుచికి అసలు పునాది పచ్చిశనగపప్పును సరిగ్గా ఉడికించడంలోనే ఉంది. ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పును తీసుకుని, తగినన్ని నీళ్లు మరియు కొద్దిగా పసుపు వేసి ఉడికించాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, పప్పును మరీ మెత్తని పేస్ట్‌లా కాకుండా ఒక మాదిరిగా గింజ చెదరకుండా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇలా మధ్యస్థంగా ఉడికిన పప్పు పొట్లకాయ ముక్కలతో కలిసినప్పుడు కూరకు ప్రత్యేకమైన పోకడ, రుచి వస్తాయి. తాలింపు వేసే విధానం కూర ఘుమఘుమలకు ప్రాణం పోస్తుంది. పాన్‌లో నూనె పోసి బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, మరియు శనగపప్పు వేసి దోరగా వేయించాలి. ఈ తాలింపు గింజలు చక్కగా వేగిన వెంటనే పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు లేత బంగారు రంగు వచ్చేవరకు ఓపికగా వేపుకుంటే కూరకు సహజమైన తీపి, కమ్మదనం చేరుతాయి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి అవి బాగా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. టమాటాలు గుజ్జులా మగ్గాక, అందులో నాలుగు పొట్లకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మరియు కారం వేసి బాగా కలపాలి. మసాలాలు, ఉప్పు, కారం పొట్లకాయ ముక్కలకు చక్కగా పట్టేలా కలిపితే ప్రతి ముక్కా రుచిగా మారుతుంది. ఇది కూడా చదవండి:రోజూ ఉదయం, ఇలా పసుపు నీళ్లు తాగితే. చర్మం మెరిసిపోవడంతో పాటు బోలెడు లాభాలు! ఇప్పుడు మూత పెట్టి సన్నని మంటపై పొట్లకాయ ముక్కలు మెత్తబడే వరకు బాగా ఉడికించాలి. పొట్లకాయ ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిశనగపప్పును ఇందులో కలపాలి. పప్పు వేసిన తర్వాత కూరను మరో 4 నిమిషాలు సిమ్‌లో ఉంచి దించేయాలి. ఆ 4 నిమిషాల సమయం పప్పు, కూర కలిసిపోవడానికి ఎంతో కీలకం. చివరగా తాజా కొత్తిమీర చల్లి దింపేస్తే ఘుమఘుమలాడే పొట్లకాయ పచ్చిశనగపప్పు కూర సిద్ధం. తక్కువ శ్రమతో, తక్కువ సమయంలోనే ఇంటిల్లిపాదికీ నచ్చే ఈ కూరను తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఆంధ్ర రుచుల ఇష్టపడేవారికి ఇది ఖచ్చితంగా ఫేవరెట్ డిష్‌గా నిలిచిపోతుంది. మీకు నచ్చవచ్చు:ఆముదం ఆకుల, రహస్యాలు తెలిస్తే షాక్ అవుతారు! ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు!                                    రోజ్ వాటర్ తో, మీ చర్మం మెరిసిపోవాలంటే, ఇలా ట్రై చేయండి!       Potlakaya Senagapappu Kura, Snake Gourd Chana Dal Curry, Andhra Veg Curries, Traditional Telugu Recipes, Vegetarian Meat Alternative, Healthy Lunch Curry, Cooking Recipes In Telugu.  
చలికాలం రాగానే వాతావరణంలో చలిగాలులు పెరిగి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరినీ జలుబు, దగ్గు, కఫం సమస్యలు తీవ్రంగా వేధిస్తుంటాయి. ఈ సీజన్‌లో వచ్చే సాధారణ దగ్గు కూడా కొన్నిసార్లు త్వరగా తగ్గకుండా రోజుల తరబడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా గొంతు గరగర, ముక్కు కారడం, ఛాతీలో కఫం పేరుకుపోవడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు మందులపైనే కాకుండా మన ఇంట్లో సులభంగా దొరికే సహజ పదార్థాలతో కూడిన సాంప్రదాయ ఇంటి చిట్కాలపై కూడా దృష్టి పెట్టడం ఎంతో మేలు చేస్తుంది. మన పెద్దలు తరతరాలుగా పాటిస్తున్న ఇంటి వైద్యంలో తమలపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. దగ్గులో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి; అవి పొడి దగ్గు మరియు కఫంతో కూడిన దగ్గు. ఈ రెండు రకాల దగ్గులను అదుపులోకి తీసుకురావడానికి మన వంటగదిలో ఉండే పదార్థాలే చక్కగా పనిచేస్తాయి. కఫంతో కూడిన దగ్గుతో బాధపడేవారికి తమలపాకు, తేనె కలయిక ఒక అద్భుతమైన పరిష్కారంగా నిలుస్తుంది. ఒక తాజా తమలపాకు తీసుకుని దాని తొడిమను తీసేసి, ఆకుపై ఒక స్పూన్ తేనె బాగా రాసి మడత పెట్టుకుని నెమ్మదిగా నమిలి రసాన్ని మింగాలి. ఇలా వరుసగా 2 రోజుల పాటు చేస్తే ఛాతీలో పేరుకుపోయిన కఫం కరిగి, దగ్గు నుంచి వేగంగా ఉపశమనం లభిస్తుంది. పొడి దగ్గు వేధిస్తున్నప్పుడు కరక్కాయ మరియు లవంగాలు ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. కరక్కాయను చిన్నగా దంచి, అందులో ఒక చిన్న ముక్కను పంటి కింద పెట్టుకుని మెల్లిగా నములుతూ రసాన్ని మింగడం వల్ల గొంతులోని చికాకు తగ్గుతుంది. ఇలా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తీసుకుంటే పొడి దగ్గు నుంచి మంచి ఊరట కలుగుతుంది. అలాగే పొడి దగ్గు ఉన్నప్పుడు 2 లవంగాలను పంటి కింద ఉంచుకుని నెమ్మదిగా నములుతూ రసం మింగడం కూడా గొంతుకు హాయిని ఇస్తుంది. గొంతులో ఇన్ఫెక్షన్ లేదా మంట అనిపించినప్పుడు గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి పుక్కిలించడం ద్వారా తక్షణ ఉపశమనం పొందవచ్చు. కఫం త్వరగా బయటకు రావడానికి తేనె, లవంగాల పొడి చిట్కా కూడా ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. అర టేబుల్ స్పూన్ తేనెలో తాజాగా దంచి పెట్టుకున్న లవంగాల పొడిని కలిపి తీసుకుంటే కఫం కరిగి దగ్గు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ చిట్కాను వరుసగా 2 నుంచి 3 రోజుల పాటు పాటిస్తే దగ్గు, జలుబు తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. చలికాలంలో వాతావరణ మార్పుల వల్ల కలిగే గొంతు నొప్పి, శ్వాసకోశ అసౌకర్యాన్ని తగ్గించుకోవడానికి ఈ సహజ పద్ధతులు సులభంగా ఆచరించదగినవిగా ఉంటాయి. ఇది కూడా చదవండి:ఆంధ్రుల ప్రత్యేక సాత్విక రుచి: అల్లం పచ్చి కారంతో, వంకాయ కూర! చిన్నపిల్లల విషయంలో దగ్గు, జలుబు కనిపించినప్పుడు మరింత జాగ్రత్తగా సహజ నివారణలను ఎంచుకోవాలి. ఒక స్పూన్ తులసి ఆకు రసంలో 2 నుంచి 3 చుక్కల తేనె కలిపి ఉదయాన్నే పిల్లలకు తాగిస్తే జలుబు, దగ్గు నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే ఏడాది లోపు శిశువులకు తేనె ఇవ్వకూడదనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. అలాగే చిన్నపిల్లలకు లేదా ఎవరికైనా దగ్గు, జలుబు ఎక్కువ రోజులు కొనసాగినా, జ్వరం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినా ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం అత్యంత అవసరం. మొత్తంగా చూస్తే, చలికాలంలో వచ్చే దగ్గు, కఫం, జలుబు సమస్యలను ఎదుర్కోవడానికి తమలపాకు, తేనె, లవంగాలు, కరక్కాయ, తులసి మరియు గోరువెచ్చని ఉప్పు నీరు వంటి సాంప్రదాయ ఇంటి చిట్కాలు మన పెద్దలు అందించిన విలువైన ఆయుర్వేద జ్ఞానం. సరైన మోతాదులో, క్రమం తప్పకుండా వీటిని పాటించడం ద్వారా సహజంగానే ఉపశమనం పొందవచ్చు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ ఈ చలికాలంలో దగ్గు, జలుబు బారి నుంచి మన కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకుందాం. మీకు నచ్చవచ్చు:ముఖంపై, మచ్చలు పోవాలంటే పచ్చి ,పాలను ఇలా రాయండి!                               ఫీవర్ తగ్గాక కూడా గుండె దడ, కాళ్ల వాపులు ఉంటున్నాయా? ఇవి ప్రమాదకర గుండె ముప్పుకు సంకేతాలు!         Betel Leaf For Cough And Cold, Tamalapaku Home Remedies, Winter Cold Remedies, Elders Health Tips, Natural Cough Relief, Traditional Home Remedies, Health Tips In Telugu.
చలికాలం రాగానే భుజాలపై తెల్లని పొట్టు రాలడం, తలలో తీవ్రమైన దురద, పదేపదే గోకాలనిపించడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య. ఉష్ణోగ్రతలు పడిపోగానే చుండ్రు అకస్మాత్తుగా మొదలవ్వడం లేదా మరింత తీవ్రంగా మారడం మనం తరచూ చూస్తుంటాం. చలి గాలి వల్ల తల చర్మం పొడిబారిపోతోంది కాబోలు అని చాలా మంది సులభంగా ఊహించేసుకుంటారు. కానీ తలలో పొట్టు రాలడానికి ప్రతిసారీ ఒకే కారణం ఉండదు. కొన్ని సందర్భాల్లో సాధారణ చుండ్రులా కనిపించేది నిజానికి సెబోర్రెయిక్ డెర్మటైటిస్ (Seborrhoeic Dermatitis) అనే వాపు సంబంధిత చర్మ సమస్య కావచ్చు. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ రెండు సమస్యలకు చికిత్స విధానాలు వేర్వేరుగా ఉంటాయి. గురుగ్రామ్‌లోని సీకే బిర్లా హాస్పిటల్ డెర్మటాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రూబెన్ భాసిన్ పాసి వివరాల ప్రకారం, తల చర్మంలో తేమ స్థాయి బాగా తగ్గిపోయినప్పుడు సాధారణంగా డ్రై స్కాల్ప్ లేదా పొడి తల చర్మం ఏర్పడుతుంది. చల్లని వాతావరణం, గాలిలో తక్కువ తేమ, ఘాటైన షాంపూలతో తరచూ తలస్నానం చేయడం, ఎక్కువసేపు వేడి నీటిని వాడటం వంటివి ఈ పొడిబారడానికి దారితీస్తాయి. ఇలాంటప్పుడు వచ్చే పొట్టు చాలా చిన్నదిగా, తెల్లగా, పౌడర్‌లా ఉంటుంది మరియు తల చర్మం బిగుతుగా లేదా స్వల్ప దురదతో అనిపిస్తుంది. డ్రై స్కాల్ప్ ఉన్నవారికి శరీరంలోని ఇతర భాగాల చర్మంపై కూడా పొడిబారడం కనిపించవచ్చు. మరోవైపు, సాధారణ చుండ్రు అనేది చర్మంపై సహజంగా ఉండే మలాసెజియా (Malassezia) అనే ఈస్ట్ అధికంగా పెరగడం లేదా దాని పనితీరు మారడంతో ముడిపడి ఉంటుంది. ఈ ఈస్ట్ చర్మంలోని నూనెలో ఉండే పదార్థాలను ఆహారంగా తీసుకుంటుంది. కొందరిలో ఈ ఈస్ట్, చర్మపు నూనెలు మరియు శరీరంలోని వాపు ప్రతిస్పందన కలిసినప్పుడు చర్మ కణాలు వేగంగా రాలిపోయి స్పష్టమైన పొట్టు, దురద ఏర్పడతాయి. ఈ సమస్య మరింత వాపుతో, దీర్ఘకాలం పాటు కొనసాగితే దానిని సెబోర్రెయిక్ డెర్మటైటిస్‌గా నిర్ధారిస్తారు. సాధారణ పొడి తల చర్మానికి భిన్నంగా, సెబోర్రెయిక్ డెర్మటైటిస్‌లో ఎరుపు రంగు, చికాకు మరియు కొంచెం జిడ్డుగా ఉండే తెలుపు లేదా లేత పసుపు రంగు పొట్టు కనిపించవచ్చు. ఇది తల చర్మం దాటి కనుబొమలు, ముక్కు పక్క భాగాలు, చెవుల వెనుక మరియు కొన్నిసార్లు ఛాతీపై కూడా ప్రభావం చూపవచ్చు. చలికాలంలో తక్కువ తేమ మరియు చల్లని ఉష్ణోగ్రతలు పొడిబారడాన్ని పెంచుతాయి, అలాగే హెయిర్ కేర్ అలవాట్లలో మార్పులు, ఒత్తిడి, అనారోగ్యం మరియు హార్మోన్ల ప్రభావాలు సెబోర్రెయిక్ డెర్మటైటిస్‌ను మరింత తీవ్రతరం చేయవచ్చు. ఇది కూడా చదవండి:వింటర్ డైట్: చలికాలంలో బరువు తగ్గడానికి, పాటించాల్సిన సులువైన మార్గాలు! చాలా మంది చేసే సాధారణ తప్పులలో ఒకటి ప్రతి రకమైన పొట్టుకు మందపాటి హెయిర్ ఆయిల్స్ రాయడం. నూనె రాయడం వల్ల పొడి జుట్టు కొంత మృదువుగా అనిపించవచ్చు కానీ, సెబోర్రెయిక్ డెర్మటైటిస్ ఉన్న తల చర్మంపై ఎక్కువ నూనె నేరుగా రాస్తే కొందరిలో లక్షణాలు మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్ పాసి స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ సమస్యకు తల చర్మంలోని నూనె మరియు మలాసెజియా ఈస్ట్‌తో దగ్గరి సంబంధం ఉంటుంది. అందువల్ల పొట్టు స్వభావాన్ని, దురద తీవ్రతను మరియు వాపు లక్షణాలను గమనించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణ డ్రై స్కాల్ప్ కోసం మైల్డ్ షాంపూ వాడటం, మరీ వేడి నీటిని నివారించడం, ఘాటైన ఉత్పత్తులను తగ్గించడం మరియు తల చర్మ అవసరానికి తగ్గట్టుగా తలస్నానాల వ్యవధిని సర్దుబాటు చేయడం మేలు చేస్తుంది. చుండ్రు మరియు సెబోర్రెయిక్ డెర్మటైటిస్ కోసం కెటోకొనజోల్ (Ketoconazole), సెలీనియం సల్ఫైడ్ (Selenium Sulphide) లేదా జింక్ పైరిథియోన్ (Zinc Pyrithione) వంటి యాంటీ ఫంగల్ మరియు మెడికేటెడ్ షాంపూలను సూచించవచ్చు. వీటిని తలకు పట్టించిన వెంటనే కడిగేయకుండా నిర్దేశించిన సమయం పాటు ఉంచి కడగాలి, లేదంటే వాటి ప్రభావం తగ్గుతుంది. దురద భరించలేనంతగా ఉన్నా తలను పదేపదే గట్టిగా గోకడం వల్ల గాయాలు, ఇన్ఫెక్షన్ ముప్పు పెరుగుతుంది, అలాగే తీవ్రమైన ఎరుపు, వాపు, మందపాటి ప్యాచెస్, నొప్పి లేదా జుట్టు రాలడం గమనిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం అత్యవసరం. మీకు నచ్చవచ్చు:మాయిశ్చరైజర్‌లో, SPF ఉంటే సరిపోతుందా? అసలు నిజాలు ఇవే!                                   ఉడికించిన అలసందలు తింటే, శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే!       Winter Dandruff, Hair Oil And Dandruff, Winter Hair Care Mistakes, Scalp Flakes Treatment, Dermatologist Hair Advice, Dandruff Tips In Winter, Health Tips In Telugu.
రోజూ వాకింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా? మిమ్మల్ని మీరు ఎంత మోసం చేసుకుంటున్నారో తెలుసా? ఆఫీస్ డెస్క్ ముందు గంటల తరబడి కూర్చుని పని చేసేవాళ్లకు ఆరోగ్యం గురించి, వాకింగ్ గురించి చెప్పగానే మొదట గుర్తొచ్చే మాట  సమయం లేదని చెప్పడం. రోజు ఒక గంట వ్యాయామం చేయండి, కడుపునిండా నిద్ర పోండి, సమయానికి ఆహారం తినండి అని చెప్పడం సులువే కానీ, పన్నెండు నుంచి పద్నాలుగు గంటల పని ఒత్తిడిలో ఉన్న మనిషికి అది ఎంతవరకు సాధ్యం?  చాలామంది  ఇదే విషయంలో గందరగోళానికి గురవుతూ ఉంటారు. వైద్యులు లేదా ఆరోగ్య నిపుణులు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఒక గంట ఎక్సర్సైజ్ చేయాలని, ఒత్తిడి తగ్గించుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు. కానీ సమయం లేకపోవడం లేదా చేయలేకపోతున్నామని సాకులు చెప్పుకోవడం మాని,  చేతులు ముడుచుకుని కూర్చోకుండా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లు చిన్న చిన్న మార్పులతో మొదలుపెట్టవచ్చు. వ్యాయామం అంటే రోజుకు ఒక గంట తప్పనిసరిగా కేటాయిస్తేనే లాభం అని అనుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా రోజుకు పది నిమిషాల నడకతో మొదలుపెట్టినా చాలు. వీలు కుదిరినప్పుడల్లా చిన్న చిన్న విడతలుగా నడవడం, నెమ్మదిగా వారానికి కనీసం నూట యాభై నిమిషాలు వేగంగా నడవడం లాంటి వ్యాయామం అందేలా చూసుకోవాలి. పని మధ్యలో కాసేపు లేచి కదలడం, తినే ఆహారం గురించి ముందే చిన్న ప్లానింగ్ చేసుకోవడం లాంటివి చేయొచ్చు. ముఖ్యంగా వ్యాయామం కోసం ఉన్న కొద్దిపాటి నిద్రను మాత్రం తగ్గించుకోకూడదు.                                                                                                                                                 *రూపశ్రీ.
మన శరీర ఆరోగ్యానికి జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడం ఎంతైనా అవసరం. పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే రోగనిరోధక శక్తి పెరిగి శరీరం ఉత్సాహంగా ఉంటుంది. మన జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఫైబర్ లేదా పీచు పదార్థం ప్రధాన పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో సరైన పీచు పదార్థాలు తీసుకుంటే మలబద్ధకం వంటి సమస్యలు దూరమవడంతోపాటు పేగుల్లోని మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా డవలప్ అవ్వడానికి సహాయపడే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి  వివరంగా తెలుసుకుంటే.. జామ.. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో జామకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక మధ్యస్థ పరిమాణంలో ఉండే జామకాయ ద్వారా సుమారు ఐదు నుంచి ఆరు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో కరిగే మరియు కరగని.. రెండు  రకాల పీచు పదార్థాలు  సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియ సజావుగా సాగేలా సహాయపడటంతోపాటు కడుపు నిండుగా ఉండే భావనను కలిగిస్తుంది. రాస్స్ బెర్రీస్.. రాస్స్ బెర్రీస్ పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఒక కప్పు రాస్స్ బెర్రీస్ లో దాదాపు ఎనిమిది గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉండే కరగని పీచు పదార్థం పేగుల్లోని మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అయితే ఇవి కొంచెం ఖరీదైనవి అయినప్పటికీ ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ. ఇది కూడా చదవండి   కిడ్నీ, లివర్ సమస్యలకు ముందే శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే!​ చియా గింజలు.. చియా గింజలలో పీచు పదార్థం చాలా మెరుగ్గా ఉంటుంది. కేవలం రెండు టీస్పూన్ల చియా గింజల ద్వారా సుమారు పది గ్రాముల పీచు లభిస్తుంది. ఇవి కడుపులోకి వెళ్లిన తర్వాత ఒక జెల్ లాంటి రూపంలో తయారవుతాయి. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిని పెరుగుతో కలిపి తీసుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుంది. నల్ల మినప్పప్పు.. మన దేశంలో సులభంగా లభించే పొట్టుతో కూడిన మినుములు లేదా నల్ల మినపప్పు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఉడికించిన ఒక కప్పు మినపప్పులో దాదాపు పదహారు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో కూడా కరిగే , కరగని పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండటం వల్ల పేగుల కదలికలు సజావుగా సాగి జీర్ణశక్తి మెరుగవుతుంది. వేయించిన శనగలు.. వేయించిన శనగలు పీచు పదార్థాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాయి. ప్రతి వంద గ్రాముల వేయించిన శనగలలో సుమారు పదిహేడు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో పీచుతో పాటు ప్రొటీన్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను పటిష్టంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.                                                                                                                                            *రూపశ్రీ మీకు నచ్చవచ్చు   ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది..                                  విటమిన్-డి లోపం ఉంటే పిల్లలు పుట్టడం కష్టమా..ఈ నిజాలు తెలుసుకోండి..!
బూడిద గుమ్మడి మనకు సులభంగా లభించే కూరగాయల్లో ఒకటి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన కొన్ని పోషకాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా బూడిద గుమ్మడి రసం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి ఆసక్తి ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండటంలో తగినంత నీరు తాగడం ఎంత ముఖ్యమైనది? బూడిద గుమ్మడి రసం కిడ్నీ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు దీనిని తీసుకోవచ్చా? బూడిద గుమ్మడిలోని పోషకాలు గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు ఎలా తోడ్పడతాయి? అంతేకాకుండా ఎసిడిటీ సమస్య, శరీర బరువు నియంత్రణ విషయంలో బూడిద గుమ్మడి ఎలాంటి ప్రయోజనాలను అందించగలదు? బూడిద గుమ్మడి, సాధారణ గుమ్మడి కాయ రెండూ ఒకటేనా? వీటి మధ్య ఉన్న తేడాలు ఏమిటి? వాటిలో లభించే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఎలా భిన్నంగా ఉంటాయి? ఈ ఆసక్తికరమైన విషయాలను సీనియర్ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ శిరీష ఈ వీడియోలో వివరించారు. బూడిద గుమ్మడి రసాన్ని ఎలా తీసుకోవాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో భాగంగా బూడిద గుమ్మడిని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: గమనిక: ఈ వీడియో కేవలం సమాచార, విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. బూడిద గుమ్మడి రసం కిడ్నీలో రాళ్లను కరిగిస్తుందని లేదా వాటిని నివారిస్తుందని శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు వైద్య నిపుణుల సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్స పొందాలి. వైద్యులు సూచించిన చికిత్సను ఆపి, దానికి బదులుగా ఇంటి చిట్కాలపై ఆధారపడకూడదు.