
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఆయన గారాలపట్టి అల్లు అర్హ రేపు (నవంబర్ 21) పదో పుట్టినరోజు జరుపుకోనుంది. ఈ సందర్భంగా అల్లు కుటుంబం ప్రత్యేక వేడుకల కోసం శ్రీలంకకు బయలుదేరింది.
అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు అయాన్ కాగా.. చిన్న కుమార్తె అర్హ. తన అల్లరి, ముద్దు ముద్దు మాటలతో అర్హ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్‌తో కలిసి ఆమె చేసే సందడి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఇప్పుడు అర్హ పదో పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా జరిపేందుకు కుటుంబమంతా శ్రీలంకకు వెళ్లడం విశేషం. ఈ సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు అర్హకు ముందుగానే సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
[Allu Arjun, Allu Arha, 10th Birthday, Sneha Reddy, Allu Ayaan]





