LATEST NEWS
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. నగరంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కళావేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం, డిప్యూటీ సీఎంకు ఈనాడు గ్రూప్ సీఎండీ సీహెచ్ కిరణ్, రామోజీ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకకు గౌరవ అతిథిగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఈనాడు గ్రూప్ సీఎండీ సీహెచ్ కిరణ్, రామోజీ కుటుంబ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచ్చేశారు. ఆయనకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఈనాడు గ్రూప్ సీఎండీ సీహెచ్ కిరణ్, రామోజీ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు హాజరయ్యారు. రామోజీరావు జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన తొమ్మిది మందికి ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ప్రతిభావంతులను గుర్తించి, వారి సేవలను గౌరవించడమే ఈ పురస్కారాల ప్రధాన ఉద్దేశం. రామోజీరావుకు వెంకయ్యనాయుడు ఘన నివాళి.! మరోవైపు, విలువలతో కూడిన వ్యాపారం, సమాజహితమే జర్నలిజం అని ఆచరణలో చూపించిన మహామనిషి రామోజీరావు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. రామోజీరావు జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయనకు నివాళులర్పించారు.రామోజీరావు పట్టుదల, స్వయంకృషి, క్రమశిక్షణ, చిత్తశుద్ధి, కార్యదీక్ష భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.  సాధారణ రైతు కుటుంబంలో ప్రారంభమైన ఆయన ప్రస్థానం.. ఈనాడు దినపత్రికతో పాటు రామోజీ ఫిల్మ్‌సిటీ వంటి మహోన్నత వ్యవస్థల నిర్మాణంతో ప్రపంచస్థాయికి చేరిందని గుర్తుచేశారు. తెలుగువారి కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రామోజీరావు పేరు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని వెంకయ్యనాయుడు తన పోస్టులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: డేటింగ్ యాప్‌లో వల..బీర్‌లో మత్తుమందు..ఆపై బంగారం మాయం.!     [ Ramoji Excellence Awards, Ramoji Rao,Amit Shah, Chandrababu Naidu, Pawan Kalyan, Justice Abdul Nazeer, Venkaiah Naidu, Eenadu Group, CH Kiran, Ramoji Film City, Vijayawada, Andhra Pradesh ]
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు.. పక్కాగా ప్లాన్ చేసిన దోపిడీ.. డేటింగ్ యాప్‌లను వేదికగా చేసుకుని యువకులతో పరిచయాలు పెంచుకుంటున్న ఓ ముఠా.. వారిని గదులకు రప్పించి మత్తుమందు ఇచ్చి దోపిడీలకు పాల్పడుతోంది. బాధితులు స్పృహ కోల్పోగానే ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను దోచుకెళ్తోంది. అంతటితో ఆగకుండా.. బాధితులకు సంబంధించిన వీడియోలతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. గ్రైండర్ యాప్‌లో పరిచయం.. ముందుగానే రెక్కీ.! గ్రైండర్ డేటింగ్ యాప్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా తమ నేరాలకు తెరతీసినట్లు పోలీసులు గుర్తించారు. తొలుత యాప్‌లో బాధితులను గుర్తించి.. ఆన్‌లైన్ చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా పరిచయాన్ని పెంచుకుంటారు. మాటలతో నమ్మకం సంపాదించుకున్న తర్వాత అసలు ప్లాన్ అమలు చేస్తారు. బాధితుల వద్ద బంగారు ఆభరణాలు ఉన్నాయా? వారు ఒంటరిగా ఉంటున్నారా? వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అనే వివరాలను ముందుగానే తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత వారిని గదులకు లేదా ఇళ్లకు రప్పించి దోపిడీకి పాల్పడతారు. బీర్‌లో మత్తుమందు.. స్పృహ తప్పగానే దోపిడీ.! బాధితులతో కలిసి బీర్ తాగుతున్నట్లు నటిస్తూ అందులో ముందుగానే మత్తు పదార్థాలు కలిపి ఇస్తారు. అది తాగిన బాధితులు స్పృహ కోల్పోగానే ఒంటిపై ఉన్న బంగారు గొలుసులు, ఉంగరాలతో పాటు ఇంట్లోని విలువైన వస్తువులను దోచుకెళ్తారు. బాధితులు తేరుకునేలోపే అక్కడి నుంచి పరారవుతారు. అంతేకాదు.. వారి వద్ద విలువైన వస్తువులు లేకపోతే వ్యక్తిగత వీడియోలను రికార్డు చేసి, వాటిని బయటపెడతామంటూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రెండు ప్రాంతాల్లో వేట.. ఐదుగురు అరెస్ట్.! ఈ ముఠా కోసం రంగంలోకి దిగిన పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో నిందితులను పట్టుకున్నారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ సమీపంలో ముగ్గురు నిందితులను ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఏఎస్ రావు నగర్‌లో మరో ఇద్దరిని కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి సుమారు 361 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అంటే దాదాపు 35 తులాలకు పైగా బంగారం నిందితుల నుంచి లభ్యమైంది. 14 కేసుల్లో ముఠా ప్రమేయం.! నిందితుల విచారణలో పలు ప్రాంతాల్లో జరిగిన దోపిడీలతో వీరికి సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు మొత్తం 14 కేసుల్లో వారి ప్రమేయాన్ని గుర్తించారు. వీటిలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో రెండు, సైబరాబాద్ పరిధిలో ఏడు, హైదరాబాద్ పరిధిలో మూడు, విశాఖపట్నంలో ఒక కేసు ఉన్నాయి. మరో కేసుకు సంబంధించిన వివరాలపైనా దర్యాప్తు కొనసాగుతోంది. పరారీలో మరో నిందితుడు.. డిజిటల్ ఆధారాల పరిశీలన.! ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించిన చందు అనే మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టయిన నిందితుల మొబైల్ ఫోన్లు, గ్రైండర్ యాప్ ప్రొఫైల్స్, చాటింగ్స్, వీడియో కాల్స్, కాల్ డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాధితుల ఫిర్యాదులు, డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తూ ఈ ముఠా వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను వెలికితీసే పనిలో ఉన్నారు. డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయమైన వ్యక్తులను గుడ్డిగా నమ్మితే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. ముఖ్యంగా వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలను అపరిచితులతో పంచుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆన్‌లైన్ పరిచయాల ముసుగులో జరుగుతున్న ఇలాంటి నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం గుర్తుచేస్తోంది. ఇది కూడా చదవండి: భారత్ సమ్మిట్ వివాదం: తెలంగాణ BJP నేతలపై అమిత్ షా ఆగ్రహం.!   [ Grindr Dating App, Dating App Robbery, Hyderabad Crime, Malkajgiri Police, Kushai guda Police, Uppal Police, Dating App Gang, Drugged Beer, Gold Robbery ]
ఇటలీ నేత ఫిలిబెక్ వ్యాఖ్యలపై కమలనాథుల ఫైర్.!     హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. సమ్మిట్‌లో ఇటలీకి చెందిన రాజకీయ ప్రతినిధి ఫిలిప్పో ఫిలిబెక్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నాయకత్వం వెంటనే స్పందించలేదన్న విమర్శలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. విదేశీ ప్రతినిధులు భారతదేశానికి వచ్చి ఇక్కడి రాజకీయ అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటే.. రాష్ట్ర స్థాయి నాయకులు ఉదాసీనంగా ఉండటం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. చట్టపరమైన మార్గాల్లో ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు, కాన్ఫరెన్స్ వీసాపై భారత్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులు స్థానిక రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వీసా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందా? అనే అంశంపైనా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని తేలితే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే, భారత్ సమ్మిట్‌ 2026లో విదేశీ రాజకీయ ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశారు. తన న్యాయ బృందంతో కలిసి సంబంధిత విదేశీ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO)కు ఫిర్యాదు చేశారు. సమ్మిట్‌లో చేసిన వ్యాఖ్యలపై పార్టీ అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో ఈ వివాదం మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరే అవకాశం ఉంది. అమిత్ షా అసంతృప్తి నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మీకు నచ్చవచ్చు: విజయ డెయిరీ ఛైర్మన్‌ ఎన్నికపై హైకోర్టు కీలక తీర్పు.! మీకు నచ్చవచ్చు: 14 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు..భార్యతో విడాకులు ప్రకటించిన మంత్రి ఆధవ్‌ అర్జున.!      [ Italian leader Filipes remarks at India Summit, Amit Shah, TG BJP Leaders, Filippo Filibeck, Bharat Summit Hyderabad, TeluguOne News ]  
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.! ముఖానికి ముసుగు.. ఒంటినిండా నల్లటి దుస్తులు.. వేలిముద్రలు పడకుండా చేతులకు గ్లౌజులు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా పక్కా ప్లాన్. సుమారు 15 కిలోల బంగారం, వజ్రాభరణాలను క్షణాల్లో బ్యాగులో నింపుకుని పరారయ్యాడు. కానీ తాను చేసిన చిన్న పొరపాటు అతడి నేర సామ్రాజ్యాన్ని బయటపెట్టింది. చేతి మణికట్టుపై ఉన్న ఓ చిన్న టాటూ పోలీసులకు కీలక క్లూగా మారింది. తమిళనాడులోని మదురైలో జరిగిన ఈ భారీ నగల చోరీ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. 25 ఏళ్ల నిషాంత్ కృష్ణ.. ఓ గ్రాడ్యుయేట్. బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూనే యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, సినిమాల్లో చూపించినట్లుగా పక్కా ప్రణాళికతో భారీ దొంగతనానికి తెరతీశాడు. మదురై బైపాస్ రోడ్డులోని తనిష్క్ జ్యువెలర్స్‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు. ఈ నెల 11వ తేదీ రాత్రి తన ప్లాన్‌ను అమలు చేశాడు. మూడు గెటప్పులు.. మూడు సార్లు రెక్కీ.! చోరీకి ముందే నిషాంత్ పక్కాగా రెక్కీ నిర్వహించాడు. సాధారణ కస్టమర్‌లా ఒక్కోసారి ఒక్కో గెటప్‌లో షోరూంకు వెళ్లాడు. ఆభరణాలు ఎక్కడున్నాయి? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎక్కడి నుంచి లోపలికి వెళ్లొచ్చు? ఎలా బయటపడొచ్చు? ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. ఏ చిన్న ఆధారం కూడా వదలకూడదని ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఆ షోరూం ప్రారంభమై అప్పటికి కేవలం రెండు వారాలే అవుతోంది. దీపావళి సీజన్‌లో భారీగా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో యాజమాన్యం భవన నిర్మాణం పూర్తికాకముందే కార్యకలాపాలు ప్రారంభించింది. లాకర్ గది నిర్మాణంలో ఉండటం, భద్రతా ఏర్పాట్లు పూర్తిస్థాయిలో లేకపోవడం నిషాంత్‌కు కలిసొచ్చాయి. బ్యాగులో పట్టినంత బంగారమే టార్గెట్.! ముఖానికి ముసుగు.. ఒంటినిండా నల్లటి దుస్తులు.. చేతులకు గ్లౌజులు ధరించి భవనం వెనుకవైపు ఉన్న ఇనుప చువ్వల సాయంతో పైకి ఎక్కాడు. మొదటి అంతస్తులోకి ప్రవేశించాడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. కొన్ని కెమెరాలపై స్ప్రే కూడా చల్లాడు. లాకర్లను తెరిచే ప్రయత్నం చేయలేదు. కేవలం డిస్‌ప్లేలో ఉంచిన ఆభరణాలనే టార్గెట్ చేశాడు. తనతో తెచ్చుకున్న డఫ్ బ్యాగులో పట్టినంత బంగారం, వజ్రాభరణాలను నింపుకున్నాడు. అప్పటికి ఆ అంతస్తులో సుమారు 42 నుంచి 43 కిలోల బంగారం ఉన్నట్లు సమాచారం. అయితే బ్యాగులో పట్టకపోవడంతో మిగిలిన ఆభరణాలను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ మార్గంలో ఏర్పాటు చేసిన తాడును ఉపయోగించి కిందికి దిగాడు. తాళాలు పగులగొట్టకుండా, ఆయుధాలు ఉపయోగించకుండా చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. మరుసటి రోజు షోరూంలో ఆభరణాలు కనిపించకపోవడంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి కోసం ఓ కస్టమర్ అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్న నగలు కూడా చోరీకి గురవడం నిర్వాహకులను కలవరపరిచింది. పోలీసులకు చిక్కిన చిన్న టాటూ.! కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు షోరూం పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ముసుగు ధరించిన దొంగ ద్విచక్రవాహనంపై మాడకుళం రోడ్డు వైపు వెళ్లినట్లు గుర్తించారు. అయితే అతడి ముఖం కనిపించకపోవడంతో గుర్తించడం కష్టంగా మారింది. ఇదే సమయంలో షోరూం ప్రారంభోత్సవం రోజు నుంచి నమోదైన సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు మరోసారి పరిశీలించారు. ఓ యువకుడు మూడు వేర్వేరు సందర్భాల్లో షోరూంకు వచ్చినట్లు గుర్తించారు. అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో నిశితంగా పరిశీలించారు. అప్పుడే పోలీసులకు ఓ కీలక విషయం కనిపించింది. రెక్కీ సమయంలో కనిపించిన యువకుడి చేతి మణికట్టుపై ఉన్న టాటూ.. చోరీ జరిగిన సమయంలో ముసుగు ధరించిన వ్యక్తి చేతిపై కనిపించిన టాటూతో సరిపోలింది. ముఖాన్ని దాచుకున్నా.. ఆ చిన్న గుర్తును మాత్రం దాచలేకపోయాడు. అదే పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది. ప్రియురాలి బైక్‌తోనే చోరీకి వెళ్లాడా.? దర్యాప్తులో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. నిషాంత్ ఉపయోగించిన ద్విచక్రవాహనం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మీనాక్షి నాచ్చియార్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఆమె కాల్ డేటాను పరిశీలించగా తిరుప్పూర్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ కీలకంగా మారింది. చోరీ చేసిన నగల సమాచారాన్ని నిషాంత్ తన సొంత ఫోన్ నుంచి కాకుండా మరో వ్యక్తి ఫోన్ ద్వారా మీనాక్షికి చేరవేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా నగలను ఎక్కడెక్కడ దాచారో పోలీసులు గుర్తించారు. మదురైలోని మాడకుళం ప్రాంతంలోని ఇంటితో పాటు సమీపంలోని కొండ ప్రాంతంలో దాచిన సుమారు ఆరు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ తర్వాత తాను ధరించిన దుస్తులను పొలాల్లో తగులబెట్టినట్లు కూడా విచారణలో తేలింది. పోలీసులకు చిక్కకుండా పలుమార్లు మార్గాలు మార్చుకుంటూ వెళ్లినట్లు గుర్తించారు. ప్రేయసి కోసం భారీ చోరీ చేశాడా.? మీనాక్షి నిర్మించుకుంటున్న ఇంటికి డబ్బు అవసరమవడంతో నిషాంత్ ఈ భారీ చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మీనాక్షితో పాటు నిషాంత్ తండ్రి, ఆటో డ్రైవర్ సురేష్‌ను కూడా అరెస్టు చేశారు. చోరీ చేసిన సొత్తును దాచిపెట్టడంలో వీరి పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రధాన నిందితుడు నిషాంత్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడి ఫోన్ సిగ్నల్స్ తొలుత మదురై సమీపంలోని తిరుప్పాలైలో, ఆ తర్వాత తిరుప్పూర్‌లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పొల్లాచ్చి, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో తొమ్మిది ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఇంటి దొంగ హస్తం ఉందా.? ఈ భారీ చోరీ వెనుక షోరూం భద్రతా లోపాలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చోరీ జరిగిన సమయంలో అలారం ఆఫ్‌లో ఉండటం, డిస్‌ప్లేలోని ఆభరణాలను రాత్రివేళ లాకర్లలో భద్రపరచకపోవడం, భవనం నిర్మాణం పూర్తికాకపోవడం వంటి అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. అలారం ఎందుకు ఆఫ్‌లో ఉందనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. షోరూం సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 5వ తేదీనే నిషాంత్ చోరీకి ప్రయత్నించినట్లు సీసీ కెమెరాల ద్వారా బయటపడింది. భవనంపైకి ఎక్కినప్పటికీ కుక్కలు తరమడంతో అప్పట్లో పారిపోయాడు. ఆ సమయంలో నగలు తీసుకెళ్లలేదు. అయినా షోరూం యాజమాన్యం భద్రతను మరింత పటిష్టం చేయకపోవడం మరోసారి చర్చకు దారితీసింది. 29 వరకు జ్యుడీషియల్ కస్టడీ..! ఈ కేసులో అరెస్టయిన మీనాక్షి, సురేష్‌లను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి ఈ నెల 29 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వారిని మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. తొలుత సుమారు 30 కిలోల ఆభరణాలు చోరీకి గురైనట్లు అంచనా వేసినా, స్టాక్ పరిశీలన అనంతరం దాదాపు 15 కిలోల బంగారు, వజ్రాభరణాలు మాయమైనట్లు నిర్ధారించారు. ఇప్పటివరకు ఆరు కిలోల వరకు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఖాన్ని దాచుకుంటే తప్పించుకోవచ్చని.. సీసీ కెమెరాలకు చిక్కకుండా వ్యవహరిస్తే పోలీసులకు దొరకమని భావించిన నిషాంత్‌ను చివరకు అతడి చేతిపై ఉన్న చిన్న టాటూ పట్టించింది. కోట్ల విలువైన ఆభరణాల చోరీలో పెద్ద ప్లాన్ వేసినా.. ఓ చిన్న గుర్తు అతడి గుట్టును బయటపెట్టింది. ఇప్పుడు మిగిలిన నగలు ఎక్కడున్నాయి? నిషాంత్ ఎక్కడ దాక్కున్నాడు? ఈ భారీ చోరీలో ఇంకా ఎవరి పాత్ర ఉంది? అన్న ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులో సమాధానాలు రావాల్సి ఉంది. మీకు నచ్చవచ్చు: హైదరాబాద్‌లో బిర్యానీ ప్రియులకు షాక్..భారీగా పెరిగిన ధరలు.! మీకు నచ్చవచ్చు: ప్రేమించింది..చంపేయాలనుకుంది..ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి మాస్టర్ ప్లాన్.!   [ Tanishq Jewellery Robbery, Madurai Gold Theft, Nishanth Krishna, Meenakshi Nachiyar, 15 Kg Gold Theft, Jewellery Heist, Tattoo Clue, Madurai Police Investigation, Gold Robbery Case, CCTV Footage ]
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది. నగరంలో ఎంతో ఇష్టంగా తినే బిర్యానీ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. నగరంలోని పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు ప్లేట్ బిర్యానీపై రూ.50 వరకు ధరలు పెంచేశాయి. దీంతో వీకెండ్‌లో కుటుంబంతో కలిసి హోటల్‌కు వెళ్లాలన్నా, చిన్నపాటి సెలబ్రేషన్ చేసుకోవాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఈ పెంపు అదనపు భారంగా మారింది. హైదరాబాద్‌లో సుమారు 25 వేల హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నట్లు వ్యాపార వర్గాల అంచనా. ఉద్యోగాలు, చదువుల కోసం నగరానికి వచ్చిన బ్యాచిలర్లు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల్లో చాలామంది బయటి ఆహారంపైనే ఆధారపడుతుంటారు. తాజా ధరల పెంపుతో వీరి నెలవారీ ఆహార బడ్జెట్‌పై రూ.500 నుంచి రూ.1,000 వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని అంచనా. ఇక నగరవ్యాప్తంగా రోజుకు సుమారు 6 లక్షల బిర్యానీ ప్లేట్లు అమ్ముడవుతున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సగటున ఒక్కో ప్లేట్‌పై రూ.30 పెరిగినా.. నగరవాసులపై రోజుకు రూ.1.8 కోట్ల అదనపు భారం పడుతుంది. అంటే నెలకు సుమారు రూ.54 కోట్ల మేర అదనపు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా ఆర్డర్ చేసేవారికి ప్యాకింగ్, డెలివరీ ఛార్జీలు అదనంగా తోడవడంతో బిల్లు మరింత పెరుగుతోంది. అయితే, ఈ ధరల పెంపునకు ముడిసరుకుల ధరల పెరుగుదలే ప్రధాన కారణమని హోటల్ యజమానులు చెబుతున్నారు. గత ఆరు నుంచి ఎనిమిది నెలలుగా ముడిసరుకుల ధరలు 15 నుంచి 20 శాతం వరకు పెరిగాయని వివరిస్తున్నారు. బిర్యానీ తయారీలో ఉపయోగించే నాణ్యమైన నెయ్యి ధర హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.580 నుంచి రూ.800 దాటిందని పేర్కొంటున్నారు. పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తుల ధరలు కూడా 20 శాతం వరకు పెరిగాయని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..పూర్తి షెడ్యూల్ ఇదే.! వీటికి తోడు నిర్వహణ ఖర్చులు కూడా హోటల్ యాజమాన్యాలకు భారంగా మారాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర గతంలో రూ.1,750 ఉండగా, ప్రస్తుతం రూ.3,080కి చేరిందని నిర్వాహకులు చెబుతున్నారు. వంట నూనె లీటరు ధర రూ.150కి చేరగా, నాణ్యమైన బియ్యం కిలో రూ.100కు చేరువైందని పేర్కొంటున్నారు.  చికెన్, కూరగాయల ధరలు కూడా అధికంగానే ఉండటంతో హోటళ్ల నిర్వహణ వ్యయం గణనీయంగా పెరిగిందని వివరిస్తున్నారు. ముడిసరుకుల నుంచి వంట గ్యాస్ వరకు అన్నింటి ధరలు పెరగడంతో నాణ్యతలో రాజీ పడకుండా హోటళ్లు నిర్వహించడం కష్టంగా మారిందని యజమానులు అంటున్నారు. ఈ కారణంగానే తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వచ్చిందని స్పష్టం చేస్తున్నారు. లాభాలు పోయి.. నష్టాలు వస్తున్నాయి: కంచర్ల అశోక్ రెడ్డి.! నగరంలో హోటల్ వ్యాపారం ప్రస్తుతం తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోందని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కంచర్ల అశోక్ రెడ్డి తెలిపారు. గతంలో వచ్చిన లాభాలు పోయి.. ఇప్పుడు నష్టాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో కొన్ని హోటళ్లు ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ధరలు పెంచితే కస్టమర్లు దూరమవుతారనే ఆందోళన ఉన్నప్పటికీ, ధరలు పెంచకుండా హోటళ్లు నిర్వహించడం సాధ్యం కాని పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు.మొత్తంగా ఒకప్పుడు సామాన్యుడికి సైతం అందుబాటులో ఉన్న బిర్యానీ ఇప్పుడు క్రమంగా ఖరీదైన వంటకంగా మారుతోంది. ముడిసరుకుల ధరలు తగ్గకపోతే భవిష్యత్తులో హోటల్ భోజనం మరింత భారంగా మారే అవకాశముందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీకు నచ్చవచ్చు: ప్రేమించింది..చంపేయాలనుకుంది..ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి మాస్టర్ ప్లాన్.! మీకు నచ్చవచ్చు: స్నేహితులతో సరదాగా బయటకు వెళ్లిన ఇండిగో మహిళా ఉద్యోగిని దారుణ హత్య.!     [ Hyderabad Biryani Prices hike , Biryani Price Hike, Hyderabad Restaurants, Telangana Food Prices, Hotel Association ]  
ALSO ON TELUGUONE N E W S
హరిహర సుతుడు అయ్యప్ప.. ఈ పేరు వింటే అయ్యప్ప భక్తులు ఎంతగా పులకరించిపోతారో చెప్పక్కర్లేదు. స్వామియే శరణమయ్యప్ప అంటూ తమ మనసు నిండా  ఆ మణికంఠుడుని స్మరించుకుంటూ ఉంటారు. సెల్యులాయిడ్ సైతం స్వామియే శరణమయ్యప్ప అంటు అయ్యప్పని బేస్ చేసుకొని కొన్ని చిత్రాలు తెరకెక్కించి ఘన విజయాన్ని అందుకున్నాయి. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ అందుకున్న ఇరుముడి కథ ఆత్మ యొక్క పరమార్ధం కూడా అయ్యప్పనే.     ఈ క్రమంలోనే ఇప్పుడు దక్షిణాది ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త హాట్ టాపిక్‌గా మారింది. శబరిమల అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర నేపథ్యంలో ఒక భారీ పాన్ ఇండియా మూవీ రూపొందబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.అయ్యప్ప స్వామి జననం, పందళ రాజుల పెంపకం, గురుకుల విద్య, మహిషి సంహారం,శబరిమల క్షేత్ర ఆవిర్భావం వంటి అద్భుత ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించేందుకు ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో టాలీవుడ్‌కి  చెందిన ఒక స్టార్ హీరో చేయబోతున్నాడనే  రూమర్ సినీ వర్గాల్లో జెట్ స్పీడ్ వేగంతో చక్కర్లు కొడుతుంది.  అయ్యప్ప దీక్షని  ఎంతో నిష్టతో ఆచరించిన ఆ అగ్ర కథానాయకుడు అయితేనే పూర్తి న్యాయం చేయగలరని మేకర్స్ భావిస్తున్నారట.గతంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అయ్యప్ప స్వామి మహత్యంపై పలు చిత్రాలు వచ్చాయి. 1989లో శరత్ బాబు ప్రధాన పాత్రలో వచ్చిన 'అయ్యప్ప స్వామి మహత్యం' సినిమా అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే, నేటి ఆధునిక వీఎఫ్ఎక్స్ టెక్నాలజీని ఉపయోగించి, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ దివ్య గాథను వెండితెరపై ఆవిష్కరించాలని ఈ కొత్త ప్రాజెక్ట్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.  ఇటీవల ఇదే తరహాలో 'ఆర్య కేరళ వర్మన్' పేరుతో అయ్యప్ప స్వామి జీవితంలోని చారిత్రక కోణాలను ఆవిష్కరించేలా పాన్ ఇండియా స్థాయిలో ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రస్తుతం వినిపిస్తున్న ఈ తాజా రూమర్ ప్రకారం, దాదాపు ఐదు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించేందుకు స్క్రిప్ట్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయట. ముఖ్యంగా ప్రతి ఏటా శబరిమల యాత్రకు వెళ్లే కోట్లాది మంది అయ్యప్ప భక్తులను దృష్టిలో ఉంచుకుని, అత్యంత భక్తిశ్రద్ధలతో, ఎక్కడా వివాదాలకు తావులేకుండా ఈ కథను తీర్చిదిద్దుతున్నారని టాక్.  సదరు స్టార్ హీరో కూడా ఈ కథ విని ఎంతో ఎగ్జైట్ అయ్యారని, తన తదుపరి సినిమాల షెడ్యూల్స్ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టుపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజంగానే సెట్ అయితే, బాక్సాఫీస్ వద్ద మరో భారీ ఆధ్యాత్మిక సంచలనం నమోదవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయ్యప్ప భక్తులైతే రూమర్ ని నిజం చేయమని శరణఘోష చెప్పుకుంటున్నారు.   మీకు నచ్చవచ్చు:రామాయణ కలెక్షన్స్ పరిస్థితి ఇదే! మీకు నచ్చవచ్చు:ఉపాసన కొణిదెల తాజా వ్యాఖ్యలు వైరల్!   [Ayyappa Swamy Biopic, Sabarimala Ayyappa, Bada Hero, Tollywood]
టాలీవుడ్‌లో ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి మృణాళిని రవి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. మలేషియాకు చెందిన ఆధ్యాత్మిక ప్రసంగకర్త మహావిష్ణును ఆమె వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మలేషియాలోని లంకావి దీవిలో వీరి పెళ్లి వేడుక జరిగింది. తాజాగా మృణాళిని స్వయంగా పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. మృణాళిని, మహావిష్ణు ఏడేళ్లుగా స్నేహితులుగా ఉన్నారని సమాచారం. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులో వీరి నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 15న మలేషియాలోని లంకావి దీవిలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ మృణాళిని పెట్టిన క్యాప్షన్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. “జీవితం నా ప్రార్థనలకు ఇచ్చిన సమాధానాల్లో నువ్వే అత్యంత అందమైనది. 15.11.2026.. మనం 'ఒకటి'గా మారిన రోజు” అనే అర్థం వచ్చేలా ఆమె రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మృణాళిని పెళ్లి ఫొటోల్లో ఆమె లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పింక్ కలర్ పట్టుచీర, సంప్రదాయ బంగారు ఆభరణాలు, మల్లెపూలతో పెళ్లికూతురుగా అందంగా ముస్తాబయ్యారు. మరోవైపు మహావిష్ణు కూడా సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. సముద్రం పక్కన అందంగా అలంకరించిన వేదికపై జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది కూడా చదవండి: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్.. చిరంజీవి సహా తరలివచ్చిన ప్రముఖులు.! సోషల్ మీడియాలో టిక్‌టాక్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న మృణాళిని రవి.. 2019లో వచ్చిన విజయ్ సేతుపతి, సమంత నటించిన తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’తో నటిగా పరిచయమయ్యారు. అదే ఏడాది హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో అథర్వ సరసన ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘చాంపియన్’, ‘ఎనిమీ’, ‘ఎంజీఆర్ మగన్’, ‘జాంగో’, ‘కోబ్రా’ వంటి తమిళ సినిమాల్లో నటించారు. తెలుగులో ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’, ‘మామా మశ్చీంద్ర’ చిత్రాలతోనూ ప్రేక్షకులను పలకరించారు. 2024లో విజయ్ ఆంటోనీ సరసన ‘రోమియో’ సినిమాలో కనిపించారు. ఇక పెళ్లి తర్వాత మృణాళిని సినిమాలకు దూరమవుతారా? లేక నటిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తారా? అనే చర్చ కూడా మొదలైంది. అయితే ఆమె తన నటనా కెరీర్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం మాత్రం పెళ్లి ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఈ కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. మీకు నచ్చవచ్చు: బన్నీ-బోయపాటి కాంబో.. ఈసారి మాస్ కాదు.. మైథలాజికల్.! ఒకే  ఫ్రేమ్‌లో చిరంజీవి, ప్రభాస్‌.. సందీప్‌ రెడ్డి అభిమానం చూపిస్తాడా.? https://www.instagram.com/p/DfzYziyCLdH/ https://www.instagram.com/p/DfzfipQiFQ1/       [Mirnalini Ravi Wedding, Mirnalini Ravi Marriage, Mahavishnu, Tollywood Actress Wedding, Malaysia]
Mirnalini Ravi has entered a new phase of her life as she tied the knot with her longtime boyfriend Mahavishnu in an intimate destination wedding. The wedding took place on November 15 in Langkawi Island, Malaysia, in the presence of family members and close friends. The actress shared beautiful pictures from the wedding celebrations on her social media handles on November 16, surprising her fans and well-wishers. The couple got married according to traditional Hindu customs, with the picturesque beachside setting adding charm to the celebrations. Mirnalini looked beautiful in a pink silk saree paired with traditional gold jewellery, while Mahavishnu opted for traditional ivory-coloured attire. Pictures capturing the wedding rituals and romantic moments of the newlyweds have been circulating widely on social media. Sharing the wedding pictures, Mirnalini penned an emotional note, saying, "Of all the prayers life could answer, you were my most beautiful one. 15.11.2026 — The day we became us." Also Read: Teja Sajja gets engaged to Mourya Interestingly, the couple reportedly shared a friendship for nearly seven years before their relationship blossomed into love. They got engaged in August this year, and their wedding celebrations have now marked the beginning of their journey together as a married couple. Mirnalini Ravi made her acting debut with Super Deluxe in 2019 and subsequently became familiar to Telugu audiences through films like Gaddalakonda Ganesh, Organic Mama Hybrid Alludu and Mama Mascheendra. Several celebrities and fans have congratulated the newlyweds, wishing them a happy married life.  Check Out:  Salman Khan to give a Monster B'Day Treat                       Rashmika's Mysaa Second Single Out Now Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
రామోజీరావు.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్, ఒక వ్యవస్థ అని పాలు తాగే పిల్లోడిని అడిగినా చెప్పేస్తారు. ఆ సంస్థలో పని చేసి వచ్చిన, చేస్తున్న వాళ్ళకి అయితే దేవుడు..దశాబ్డల క్రితమే  సీరియల్స్ అనే వాటిని రామోజీ రావు గారు ఓన్ చేసుకొని కార్పొరేట్ కల్చర్ తీసుకురాకపోయి ఉంటే కళని నమ్ముకొని హైదరాబాద్ వచ్చిన ఎంతో మంది మంది కళాకారులు హైదరాబాద్ వదిలి వెళ్లిపోయేవాళ్ళని నిత్యం సినీ సర్కిల్స్ లో వినిపించే మాట. అలాంటి రామోజీరావు గారు తన సినీ ప్రస్థానంలో లభించిన అపురూప విజయం తాలూకు న్యూస్ ఒకదాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.   తెలుగు సినిమా  చరిత్రలో ఉషాకిరణ్ మూవీస్ సంస్థది ఒక ప్రత్యేక అధ్యాయం. 1983లో రామోజీరావు గారు స్థాపించిన ఈ నిర్మాణ సంస్థ, కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా సమాజాన్ని ఆలోచింపజేసే ఎన్నో కంటెంట్ ఆధారిత చిత్రాలని  అందించింది. 1984లో 'శ్రీవారికి ప్రేమలేఖ'తో మొదలైన ఈ ప్రస్థానంలో దాదాపు 80కి పైగా సినిమాలు తెరకెక్కాయి. అయితే, ఉషాకిరణ్ మూవీస్ చరిత్రలో ఒకే ఒక్క సినిమా సృష్టించిన సంచలనం, కురిపించిన కాసుల వర్షం ఆ సంస్థకి హైదరాబాద్ నడిబొడ్డున ఒక శాశ్వత చిరునామాని తెచ్చిపెట్టింది. 1989లో రామోజీరావు నిర్మాణంలో, ఎ. మోహన గాంధీ దర్శకత్వంలో విడుదలైన 'మౌన పోరాటం' అప్పట్లో బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించింది. ఒడిశాకు చెందిన సబిత అనే ఒక గిరిజన మహిళ నిజ జీవిత పోరాటం ఆధారంగా ఈ సినిమాని  రూపొందించారు. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ యథార్థ గాథని  తెరకెక్కించడానికి రామోజీరావు ఎంతో ధైర్యం చేశారు. ఎలాంటి కమర్షియల్ హంగులు, స్టార్ హీరోలు లేకుండా కేవలం బలమైన కథనే నమ్ముకుని సెట్స్ పైకి తీసుకెళ్లారు. మౌన పోరాటం ద్వారానే నటి యమున, హీరో వినోద్ కుమార్ తెలుగు తెరకి  పరిచయమయ్యారు. అంతేకాదు, ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి సంగీత దర్శకురాలిగా పనిచేసిన ఏకైక చిత్రం కూడా ఇదే కావడం విశేషం. దుర్గ అనే ఆదివాసి యువతి తన బిడ్డకి  తండ్రి పేరును, న్యాయాన్ని సాధించడం కోసం చేసిన అలుపెరగని పోరాటం ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. జనం బ్రహ్మరథం పట్టారు. తక్కువ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం ఊహించని స్థాయిలో వసూళ్లను రాబట్టి నిర్మాత రామోజీరావుకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.   ఇది కూడా చదవండి:సినిమా హిట్ అవ్వాలంటే ఆ కలల రాకుమారి కంపల్సరీ అంట: తాజాగా వెలుగులోకి వచ్చిన నిజం! ఆ కాలంలో 'మౌన పోరాటం' సినిమా సాధించిన అద్భుతమైన లాభాలతోనే రామోజీరావు హైదరాబాద్‌లోని అత్యంత కీలకమైన బేగంపేట మెయిన్ రోడ్డు (గ్రీన్ ల్యాండ్స్ సమీపంలో) ఉన్న ఉషాకిరణ్ మూవీస్ కార్యాలయ భవనాన్ని కొనుగోలు చేశారని సినీ ప్రముఖులు, విశ్లేషకులు చెబుతుంటారు. ఇండస్ట్రీలో "ఒక్క సినిమాతో ఆఫీస్ బిల్డింగ్ కొన్న నిర్మాత" అనే మాట వినిపించినప్పుడల్లా రామోజీరావు దూరదృష్టి, 'మౌన పోరాటం' సాధించిన ఘనవిజయం గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటారు.కేవలం ఆర్థికంగానే కాకుండా ప్రతిష్టాత్మక పురస్కారాల పరంగానూ 'మౌన పోరాటం' ఉషాకిరణ్ మూవీస్ కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచింది. 1989వ సంవత్సరానికి గాను ఉత్తమ ద్వితీయ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుతో పాటు, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో మరో నంది అవార్డుని  కైవసం చేసుకుంది. సామాజిక స్పృహతో తీసిన ఒక మంచి సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా, దశాబ్దాల పాటు ఒక దిగ్గజ నిర్మాణ సంస్థకు ప్రధాన కార్యాలయంగా నిలిచే ఆస్తిని సమకూర్చడం తెలుగు సినీ చరిత్రలో ఒక అరుదైన రికార్డుగా నిలిచిపోయింది. రామోజీ గారి సినీ ప్రస్థానం చూసుకుంటే ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ సమాజానికి ఉపయోగపడే విలువలతో పాటు చైతన్యవంతుల్ని చేసే సినిమాలు.కమర్షియల్ జోనర్ అనే వర్డ్ ని తన కాంపౌండ్ గేట్ దగ్గరకి కూడా రానివ్వలేదు.   మీకు నచ్చవచ్చు:సాయి పల్లవి తల్లి వ్యాఖ్యలు వైరల్! మీకు నచ్చవచ్చు:సోనియా గాంధీ బయోపిక్ రెడీ: ఈ హీరోయినేనా!   [Ramoji Rao, Mounaporatam, Ushakiran Movies, Yamuna, vinod Kumar]
రష్మిక మందన్న అప్ కమింగ్ మూవీ ‘మైసా’. ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్‌లో ఆమెను మునుపెన్నడూ చూడని రఫ్ అండ్ పవర్‌ఫుల్ అవతార్‌లో చూపించారు. ఫస్ట్ సింగిల్ ‘ఓ మైసా రే’ కూడా అదే మాస్ ఇమేజ్‌ను మరింత పెంచింది. కానీ ఇప్పుడు విడుదలైన రెండో పాట మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. ‘ఏనాటి వరమో నువ్వు’ అంటూ తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అందమైన అనుబంధాన్ని ఆవిష్కరించింది. జేక్స్ బిజోయ్ స్వరపరిచిన ఈ పాటకు రెహమాన్ సాహిత్యం అందించగా, కృష్ణ తేజస్వి ఆలపించారు. మెలోడీ ట్యూన్‌తో పాటు భావోద్వేగాలను కలగలిపిన ఈ పాటలో తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా పాటలోని విజువల్స్ చూస్తుంటే మైసా పాత్ర వెనుక ఉన్న ఎమోషనల్ కథను మేకర్స్ పరిచయం చేసినట్లు అనిపిస్తోంది. ఈ పాటలో రష్మిక చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు ఆమె జీవితంలోని కొన్ని మధురమైన క్షణాలను చూపించారు. తండ్రితో కలిసి వ్యవసాయ పనుల్లో సాయం చేయడం, అల్లరి చేయడం వంటి సన్నివేశాలతో చిన్ననాటి మైసాను పరిచయం చేశారు. తండ్రి అంటే ఆమెకు ఎంత ఇష్టమో, ఆయనతో ఆమెకు ఉన్న అనుబంధం ఎంత బలమైనదో ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. ముఖ్యంగా తండ్రిపై ప్రేమకు గుర్తుగా ఆయన పేరుతో టాటూ వేయించుకోవాలని మైసా నిర్ణయించుకునే సన్నివేశం భావోద్వేగంగా ఉంది. సముద్రఖని తండ్రి పాత్రలో కనిపించగా, ఈశ్వరీ రావు తల్లిగా నటించారు. మొదటి పాటలో కనిపించిన రష్మిక ఉగ్రరూపానికి పూర్తి భిన్నంగా ఈ పాటలో ఆమె పాత్రలోని సున్నితమైన కోణాన్ని చూపించారు. ఇది కూడా చదవండి: 15 ఏళ్ల ‘కొలవెరి డి’.. ఆరు నిమిషాల్లో రాసిన పాట ప్రపంచాన్ని ఊపేసింది.! ‘మైసా’ ప్రచార చిత్రాలను గమనిస్తే రష్మిక ఈసారి ఒక పవర్‌ఫుల్ యాక్షన్ పాత్రలో కనిపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. అయితే కేవలం ఫైట్లు, యాక్షన్ సన్నివేశాలకే పరిమితం కాకుండా ఆమె పాత్రకు బలమైన ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్ కూడా ఉందని ఈ రెండో పాటతో అర్థమవుతోంది. ఒకవైపు తండ్రి ప్రేమలో పెరిగిన అమ్మాయి.. మరోవైపు పరిస్థితుల కారణంగా ఎంతటి పోరాటానికైనా సిద్ధపడే మహిళ. ఈ రెండు కోణాల మధ్య మైసా పాత్ర ఎలా మారుతుంది? ఆమె జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి? అనే ఆసక్తిని ఈ పాట పెంచుతోంది. నూతన దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 27న ఈ సినిమా విడుదల కానుంది. మీకు నచ్చవచ్చు:  ‘కాకా’లో స్పెషల్ సాంగ్.. మెగాస్టార్‌తో రితికా సింగ్ మాస్ స్టెప్పులు.! శ్రీలీల ఓపెన్ కామెంట్స్.. చిన్న వయసులో తప్పులు చేశా.!       [Mysaa Second Single, Yenati Varamo Nuvvu Song, Rashmika Mandanna, Jakes Bejoy, Samuthirakani]  
సినిమా.. నిర్మాణ దశలో ఉన్నప్పుడే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది బతుకుతున్నారు.  ఈ మాట అక్షర సత్యమని లైవ్ లో తెలుసుకోవాలంటే తెల్లవారుజామున హైదరాబాద్ లో కృష్ణ నగర్ ని అనుకోని ఉండే ఇంద్రనగర్ గడ్డ దగ్గరకి వస్తే చాలు. మరి సినిమా రిలీజైన తర్వాత  హిట్ టాక్ తెచ్చుకుంటే పాన్ ఇండియా, ఓవర్సీస్ వ్యాప్తంగా ఎంత మంది బతుకుతారో అనే ఫిగర్ కి లెక్కే లేదు. కానీ వాళ్లందరికీ అన్యాయం చేస్తూ హిట్ శాతం చాలా లో డిగ్రీస్ లో ఉంది. అందుకు గల కారణం ఇదే అని ఫిలిం సర్కిల్ తో పాటు సినీ అభిమానులు, ప్రేక్షకుల సినీ హార్ట్ లో నిత్యం ఒక విషయం స్ఫురణకి వస్తు ఉంటుంది. మరి వారి హార్ట్ బీట్ లో దాగి ఉన్న భావాలేంటో చూద్దాం. తెలుగు సినిమా చరిత్రలో ఒక చిత్రం ఘనవిజయం సాధించాలంటే కేవలం హీరో ఇమేజ్, భారీ యాక్షన్ సీన్లు మాత్రమే ఉంటే సరిపోదు. కథలో హీరోయిన్ క్యారక్టర్ కి  కూడా సమానమైన ప్రాధాన్యత ఉన్నప్పుడే ఆ సినిమా ప్రేక్షకుల హృదయాలకి  హత్తుకుంటుంది. ఒకప్పుడు తెలుగు వెండితెరపై కథానాయికల రోల్స్  కథను మలుపు తిప్పే శక్తివంతమైన పిల్లర్లుగా ఉండేవి. సావిత్రి, జమున, భానుమతి, శ్రీదేవి, విజయశాంతి వంటి మహానటీమణులు నటించిన చిత్రాల్లో హీరోలకు దీటుగా వారి పాత్రలు తీర్చిదిద్దబడ్డాయి. 'మాయాబజార్', 'మిస్సమ్మ', 'గుండమ్మ కథ', 'ప్రతిఘటన', 'కర్తవ్యం' వంటి చిత్రాలు కేవలం హీరోల వల్లే కాకుండా, హీరోయిన్ల అద్భుతమైన పాత్రల బలం వల్లే కల్ట్ క్లాసిక్స్‌గా నిలిచాయి. ఆ కాలంలో సినిమా విజయంలో కథానాయికల పాత్ర 50 శాతానికి పైగా ప్రభావం చూపేదని సినీ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే కాలక్రమేణా కమర్షియల్ సినిమాల మోజు పెరిగిపోవడంతో హీరోయిన్ పాత్రల ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. గత దశాబ్ద కాలంలో వచ్చిన చాలా పెద్ద సినిమాల్లో హీరోయిన్లు కేవలం మూడు పాటలు, నాలుగు రొమాంటిక్ సన్నివేశాలకు మాత్రమే పరిమితమయ్యారు. కథలో వారి క్యారక్టర్ కి ఎలాంటి బలం లేకపోవడం, హీరో ఎలివేషన్ల మధ్య వారు తేలిపోవడం ఒక సాధారణ విషయంగా మారిపోయింది.   హీరో చుట్టూ తిరిగే కథల్లో హీరోయిన్ కేవలం ఒక గ్లామర్ డాల్‌గా మిగిలిపోవడంతో ప్రేక్షకులకు ఆ పాత్రలతో ఎమోషనల్ కనెక్ట్ తగ్గిపోయింది. కేవలం హీరో ఇమేజ్‌ను నమ్ముకుని, బలమైన మహిళా పాత్రలు లేకుండా తీసిన ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.  ఇది కూడా చదవండి:కోలీవుడ్ కి DNK కానీ ఇటీవలి కాలంలో తెలుగు సినిమా తీరు మళ్ళీ మారుతోంది. ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పుని  గుర్తించిన దర్శకులు మళ్ళీ హీరోయిన్ లకి కథలో కీలక స్థానం కల్పిస్తున్నారు. దీనికి నిదర్శనంగా గత కొంతకాలంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన కొన్ని సినిమాలని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి 'సీతారామం' సినిమాలో సీతామహాలక్ష్మి క్యారక్టర్  లేకపోతే ఆ కథకు ఆత్మ ఉండేది కాదు. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంలో మృణాల్ ఠాకూర్ ది ప్రధాన భూమిక. అలాగే 'హాయ్ నాన్న' చిత్రంలో యష్న పాత్ర చుట్టూనే కథ మొత్తం నడుస్తుంది. ఆ పాత్రలోని ఎమోషన్ ప్రేక్షకులను కట్టిపడేసి సినిమాని బ్లాక్‌బస్టర్ చేసింది. అంతేకాకుండా 'మహానటి', 'అరుంధతి', 'భాగమతి', 'సైరా నరసింహారెడ్డి', 'పుష్ప' వంటి చిత్రాల్లోనూ హీరోయిన్ పాత్రలకు ఇచ్చిన ప్రాధాన్యత ఆ సినిమాల విజయానికి ఎంతో దోహదపడింది. 'పుష్ప' సినిమాలో శ్రీవల్లి పాత్రకు మాస్ ఆడియన్స్‌లో వచ్చిన క్రేజ్ ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో 350 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడానికి ఒక కారణమైంది. ఇటీవల వచ్చిన 'కల్కి 2898 AD' చిత్రంలో కూడా సుమతి పాత్ర చుట్టూనే అసలు కథ తిరుగుతుంది. 1000 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రంలో ఆ పాత్రకున్న ప్రాధాన్యత ఏంటో అందరికీ తెలిసిందే.   దీన్ని బట్టి అర్థమయ్యే అసలు సత్యం ఏంటంటే, సినిమాలో హీరోయిన్ క్యారక్టర్ కి   కేవలం అలంకారప్రాయంగా కాకుండా, కథని ముందుకు నడిపించే బలమైన శక్తిగా తీర్చిదిద్దితే ప్రేక్షకులు ఖచ్చితంగా  ఆదరిస్తారు.ఈ సూత్రాన్ని కొంత మంది దర్శకులు నమ్మి ఆ దిశగా దూసుకెళ్తున్నారు. కాబట్టి మిగతా దర్శకులు, రచయితలు కూడా తల్లి లేనిదే సృష్టికి జననం ఎలా అయితే లేదో, ఏ జోనర్ కథ అయినా సరే  హీరోయిన్ క్యారక్టర్ ని బేస్ చేసుకొని కథకి లింక్ చేస్తేనే  సినీ పుట్టకకి అర్ధం, పరమార్ధం. దాంతో సినిమా ముసి ముసి నవ్వులతో  పరవళ్లు తొక్కుతుంది. అదే జరిగితే మేకర్స్ కి సినిమా ఏం ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.   మీకు నచ్చవచ్చు:హిందుస్థాన్ వాళ్ళ సొంతమా: సింగర్ వ్యాఖ్యలు వైరల్! మీకు నచ్చవచ్చు:త్రిష పెంపుడు కుక్క సంచలనం     [Importance of heroine roles, sai Pallavi,Mrunal Thakur, Telugu Cinema]
వరుస సినిమాలతో బిజీగా ఉండే యంగ్ హీరోయిన్స్ లో శ్రీలీల ఒకరు. కెరీర్ ఆరంభంలోనే వరుస అవకాశాలు అందుకుని టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరిస్తూ సినిమాలు చేసి కొన్ని షాకులు తిన్న శ్రీలీల.. ఇప్పుడు తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నారట. కథల ఎంపిక విషయంలో గతంలో కొన్ని తప్పులు చేశానని, ఇకపై ఆచితూచి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో తన కెరీర్ గురించి శ్రీలీల మనసు విప్పి మాట్లాడారు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి రావడంతో అప్పట్లో కథలను ఎంచుకునే స్థాయిలో తాను లేనని, వచ్చిన అవకాశాలను అంగీకరిస్తూ ముందుకు వెళ్లానని తెలిపారు. ప్రేక్షకులు తనపై ఎంతో ప్రేమ చూపించారని, అయితే కొంతకాలం తర్వాత తన నిర్ణయాలను తానే సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు చెప్పారు. మనకు నచ్చిన కథలను ఎంచుకోవడం మొదలుపెట్టినప్పుడే జీవితంలో మార్పు వస్తుందని ఎవరో చెప్పిన మాట తనపై ప్రభావం చూపిందని వెల్లడించారు. అప్పటివరకు వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లానని, కానీ తన కెరీర్‌లో ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి? ఇంకా ఏం నేర్చుకోవాలి? అని ఆలోచించుకున్నానని తెలిపారు. సరిగ్గా అదే సమయంలో దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ‘ఓం’ కథ చెప్పారని, ఇందులో పాటలు ఉండవని ఆయన ముందే చెప్పడంతో తనకు చాలా కొత్తగా అనిపించిందని వివరించారు. తనను ఇప్పటివరకు చూడని కొత్త కోణంలో చూపించే పాత్రను ఇచ్చినందుకు దర్శకుడికి శ్రీలీల కృతజ్ఞతలు తెలిపారు. ఈ వ్యాఖ్యలను బట్టి ఇకపై కేవలం కమర్షియల్ అవకాశాలకే పరిమితం కాకుండా, తన నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకోవాలని శ్రీలీల  భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇది కూడా చదవండి: 15 ఏళ్ల ‘కొలవెరి డి’.. ఆరు నిమిషాల్లో రాసిన పాట ప్రపంచాన్ని ఊపేసింది.! ఇదే ఈవెంట్‌లో సాయిపల్లవి గురించి శ్రీలీల చెప్పిన మాటలు కూడా ప్రత్యేకంగా నిలిచాయి. తాను మెడిసిన్ ఎంట్రన్స్ పరీక్ష రాస్తున్న సమయంలోనే ‘ఫిదా’ సినిమా విడుదలైందని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఒక డాక్టర్ అమ్మాయి హీరోయిన్‌గా నటించడం తమ ఇంట్లో అందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. ఇప్పుడు తాను కూడా మెడిసిన్ పూర్తి చేసి, సాయిపల్లవితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.  దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీలతో పాటు రేణు దేశాయ్ కీలక పాత్రలో నటించారు. సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. నవంబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది. మీకు నచ్చవచ్చు: ఆకాశంలో ఒక తార vs డియర్ ఆస్ట్రోనాట్.. ఒకే రోజు ఒకే కథతో రెండు సినిమాలు.! ‘కాకా’లో స్పెషల్ సాంగ్.. మెగాస్టార్‌తో రితికా సింగ్ మాస్ స్టెప్పులు.!       [OM Movie, Sreeleela, Dhanush, Sai Pallavi, Renu Desai]  
సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ముందుండి స్పందించే మెగాస్టార్ చిరంజీవి మరోసారి చిత్ర పరిశ్రమ తరఫున కీలకమైన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. దాని ద్వారా సెలబ్రిటీల ముఖాలు, గొంతులను అనుమతి లేకుండా ఉపయోగించడం, డీప్‌ఫేక్ వీడియోలు రూపొందించడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కళాకారుల వ్యక్తిగత గుర్తింపు, గౌరవం, సృజనాత్మక హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతూ చిరంజీవి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఈ వినతిపత్రాన్ని అందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర హోం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలకు ఉద్దేశించి దీనిని సమర్పించారు. ఇటీవల అమిత్ షాతో జరిగిన సమావేశంలో AI దుర్వినియోగం వల్ల సినీ, టెలివిజన్ కళాకారులకు ఎదురవుతున్న సమస్యలను చిరంజీవి వివరించారు. ఈ అంశంపై లిఖితపూర్వకంగా వినతిపత్రం ఇవ్వాలని అమిత్ షా సూచించడంతో తాజాగా కిషన్ రెడ్డికి అందజేశారు. ఇందులోని అంశాలను సంబంధిత మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి సమన్వయం చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ వినతిపత్రంలో పలు కీలకమైన అంశాలను చిరంజీవి ప్రస్తావించారు. కళాకారుల ముఖం, గొంతు, వ్యక్తిగత గుర్తింపును వారి అనుమతి లేకుండా డిజిటల్ రూపంలో ఉపయోగించకుండా చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరారు. AI ద్వారా ఒక వ్యక్తి రూపాన్ని, గొంతును తిరిగి సృష్టించే ముందు వారి అనుమతి తప్పనిసరి చేయాలని సూచించారు. అలాగే దురుద్దేశంతో రూపొందించే డీప్‌ఫేక్ వీడియోలపై తగిన శిక్షలు విధించడం, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను నిర్ణీత సమయంలో తొలగించే వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి ప్రతిపాదనలు చేశారు. ఇలాంటి ఘటనలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని కూడా కోరారు. కేవలం సినీ ప్రముఖులే కాకుండా సాధారణ ప్రజలు, మహిళలు, చిన్నారులు కూడా AI దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని చిరంజీవి పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల కష్టంతో సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలు, వ్యక్తిగత గౌరవం క్షణాల్లో దెబ్బతినే పరిస్థితులు వస్తున్నాయని వివరించారు. కరోనా సమయంలో సినీ కార్మికులకు అండగా నిలవడం, హెల్త్ కార్డులు, వైద్య సహాయం అందించడం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న చిరంజీవి.. ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో కళాకారుల హక్కుల పరిరక్షణ కోసం ముందుకొచ్చారు. "సాంకేతికత సృజనాత్మకతను పెంపొందించాలి.. మనిషి గౌరవాన్ని దెబ్బతీయకూడదు" అనే సందేశంతో ఈ అంశంపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు. Chiranjeevi, Chiranjeevi Latest News, AI Deepfake Misuse, Chiranjeevi Kishan Reddy Meeting, Kishan Reddy, Amit Shah, AI Protection for Actors, Celebrity Digital Rights, Deepfake Videos, Telugu Film Industry News
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'ఆదర్శ కుటుంబం.. హౌస్ నంబర్ ఏకే 47'. ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించగా.. త్రివిక్రమ్ మార్క్ మాటలు, కుటుంబ నేపథ్యంలోని కథ ప్రేక్షకులకు నచ్చాయి. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు సమాచారం. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలనే ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నవంబర్ చివరి వారంలోనే 'ఆదర్శ కుటుంబం' నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చే అవకాశం ఉందని టీవీ9 కథనం పేర్కొంది. అయితే ఇప్పటివరకు స్ట్రీమింగ్ తేదీపై నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.  ఇక ఈ సినిమాలో వెంకటేష్ చిట్టిబాబు అనే మధ్యతరగతి వ్యక్తి పాత్రలో కనిపించారు. చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించే ఆయన భార్య స్వర్ణ పాత్రలో శ్రీనిధి శెట్టి నటించారు. భార్య కోరికల కారణంగా అప్పులపాలైన చిట్టిబాబు కుటుంబం అనూహ్యంగా ఓ లగ్జరీ విల్లాలోకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ వారికి ఎదురయ్యే పరిణామాలు, ఓ గ్యాంగ్‌స్టర్‌తో చిట్టిబాబుకు ఉన్న సంబంధం ఏమిటన్నది కథలో ఆసక్తికరమైన అంశాలు. నారా రోహిత్ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా.. థమన్ సంగీతం అందించారు. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. నారా రోహిత్, శ్రీనిధి శెట్టితో పాటు నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు నటించారు. థియేటర్లలో చూడలేకపోయిన వెంకటేష్ అభిమానులు ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.       [Venkatesh, AadarshaKutumbamOTT, Netflix, TrivikramSrinivas, SrinidhiShetty]
సినిమా ఇండస్ట్రీలో ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదల కావడం సాధారణమే. కానీ ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకుల సినిమాలు ఒకేరోజు థియేటర్లలోకి రావడం మాత్రం అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో అలాంటి ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోబోతోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ నటించిన సినిమాలు నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దీంతో ఈ తండ్రీకొడుకుల బాక్సాఫీస్ పోటీపై ఆసక్తి నెలకొంది. మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన చిత్రం 'ఓం' (O.M). తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనుండగా.. సాయిపల్లవి పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. శ్రీలీల, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక మరోవైపు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న సినిమా 'ఆకాశంలో ఒక తార'. సాత్విక వీరవల్లి ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా సంస్థలపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇందులో శ్రుతి హాసన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. నవంబర్ 20న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఇలా ఒకే రోజు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ సినిమాలు విడుదల కానుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ రెండు సినిమాలు వేర్వేరు భాషల్లో, విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఒకవైపు ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్‌లో వస్తున్న 'ఓం'పై అంచనాలు ఉండగా.. మరోవైపు తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్న దుల్కర్ 'ఆకాశంలో ఒక తార'తో వస్తున్నారు. మరి నవంబర్ 20న తండ్రి సినిమా ఎక్కువగా ఆకట్టుకుంటుందా? కొడుకు సినిమా పైచేయి సాధిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.     Mammootty, Dulquer Salmaan, Mammootty vs Dulquer, OM Movie 2026, Aakasamlo Oka Tara, Dhanush OM Movie, Mammootty New Movie, Dulquer Salmaan Telugu Movie, November 20 Movie Releases, Father Son Box Office Clash
భారతదేశంలో నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు కొనసాగే శీతాకాలంలో అత్యంత చల్లని వాతావరణం ఉంటుంది. ఈ సీజన్‌లో ఉదయం నిద్రలేచి వ్యాయామశాలకు వెళ్లడం కొందరికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇప్పటికే అధిక బరువు ఉన్నవారికి బద్ధకంతో వ్యాయామాలు వాయిదా పడటం సర్వసాధారణం. అయితే ఎలాంటి కష్టతరమైన జిమ్ వర్కౌట్లు లేకుండానే, కేవలం చిన్నపాటి జీవనశైలి మార్పులతో ఈ చలికాలంలోనూ సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. శీతాకాలంలో హైడ్రేషన్ అనేది చాలా కీలకమైన అంశం. చలికాలంలో సాధారణంగా దాహం తక్కువగా అనిపిస్తుంది కాబట్టి, నీరు తాగడం తగ్గిపోతుంది. అయితే శరీరానికి తగినంత నీరు అందకపోతే డీహైడ్రేషన్ ఏర్పడి తరచుగా ఆకలిగా అనిపిస్తుంది. ఇది అనవసరమైన ఆహారాన్ని తీసుకోవడానికి దారితీసి బెల్లీ ఫ్యాట్ పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి చలికాలంలో ఖచ్చితంగా తగినన్ని నీళ్లు తాగాలి. చల్లటి నీరు తాగడం కష్టంగా అనిపిస్తే గోరువెచ్చని నీటిని అలవాటు చేసుకోవడం మంచిది. గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రించబడి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది కొవ్వు కరగడానికి సహాయపడి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. అధ్యయనాల ప్రకారం, మీ శరీర ఉష్ణోగ్రత కంటే చల్లని నీరు తాగితే, శరీరం దానిని వేడి చేయడానికి సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో అవసరమైన క్యాలరీలు బర్న్ అవుతాయి. కాబట్టి వీలైతే గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని తాగడం చాలా ఉత్తమం. నీటితో పాటు కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలు శీతాకాలంలో బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడతాయి. కొబ్బరి నీళ్లలో నీటితో పాటు పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. వ్యాయామానికి ముందు తేలికపాటి పానీయం కావాలనుకునే వారికి ఇది చక్కటి ఎంపిక. అలాగే ఒక చిన్న బీట్‌రూట్‌తో తయారు చేసుకున్న రసంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే ఎంతో మంచిది. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఇది కూడా చదవండి:ముఖంపై, మచ్చలు పోవాలంటే పచ్చి ,పాలను ఇలా రాయండి! చల్లని వాతావరణంలో చాలామంది కాఫీ, టీ ఎక్కువగా తాగుతుంటారు. అయితే చక్కెర, పాలు కలిపిన పానీయాలు బరువును పెంచే ప్రమాదం ఉంది. దీనికి బదులుగా బ్లాక్ టీ, మందార టీ, ఊలాంగు టీ వంటి హెర్బల్ టీలను ఎంచుకోండి. కాఫీలో కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీవక్రియ పెరిగి బరువు తగ్గడం చాలా సులభమవుతుంది. చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఆకలి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో ఎక్కువగా వేయించిన, నూనెతో కూడిన ఆహారాన్ని తీసుకుంటాం. అలా కాకుండా ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. చిన్నపాటి శారీరక శ్రమను చేస్తూ ఈ చిట్కాలను పాటిస్తే శీతాకాలంలో ఎదురయ్యే సవాళ్లను సులభంగా అధిగమించి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండవచ్చు. మీకు నచ్చవచ్చు:ఫీవర్ తగ్గాక కూడా గుండె దడ, కాళ్ల వాపులు ఉంటున్నాయా? ఇవి ప్రమాదకర గుండె ముప్పుకు సంకేతాలు!                              ఆంధ్రుల ప్రత్యేక సాత్విక రుచి: అల్లం పచ్చి కారంతో, వంకాయ కూర!       Winter Weight Loss, Control Weight In Winter, Winter Health Secrets, Fitness Tips For Cold Weather, Healthy Lifestyle Habits, Doctor Health Advice, Health Tips In Telugu.
ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ కాంతివంతమైన, మచ్చలేని అందమైన చర్మాన్ని కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలుష్యభరిత వాతావరణం మరియు ఎండల కారణంగా చర్మం తన నిగారింపును కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. రసాయనాలతో కూడిన ఖరీదైన క్రీమ్‌లకు బదులుగా సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించడం ద్వారా చర్మానికి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా సంరక్షించుకోవచ్చు. అలాంటి అద్భుతమైన నేచురల్ క్లెన్సర్‌లలో పచ్చి పాలు ముందు వరుసలో ఉంటాయి. చర్మ సౌందర్యానికి పచ్చి పాలు ఏ విధంగా సహాయపడతాయో తెలుసుకోవడం ద్వారా సహజమైన అందాన్ని సొంతం చేసుకోవచ్చు. చర్మ సంరక్షణలో పాలు ఒక అద్భుతమైన సహజ క్లెన్సర్‌లా పనిచేస్తాయి. ప్రతిరోజూ పాలతో ముఖాన్ని మర్దనా చేసుకోవడం వల్ల చర్మ రంధ్రాల్లో పేరుకున్న ధూళి, మలినాలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ సాధారణ పద్ధతి వల్ల చర్మం ఎప్పుడూ తాజాగా మరియు ఆరోగ్యంగా కనిపించేలా చేయడానికి సహాయపడుతుంది. రసాయన ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలను నివారిస్తూ చర్మాన్ని లోతుగా శుభ్రపరచడంలో పచ్చి పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. పచ్చి పాలను రోజూ ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం లోతుగా పోషణ పొంది ప్రకాశవంతంగా మారుతుంది. అంతేకాకుండా, ఇది చర్మంపై ముడతలు, సన్నని గీతలు ఏర్పడకుండా నివారించడంలో ఎంతో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా పాలను ముఖానికి పట్టించడం ద్వారా చర్మ ఛాయ మెరుగుపడుతుంది మరియు సహజమైన మెరుపు సొంతమవుతుంది. ముఖంపై మొటిమల వల్ల ఏర్పడే నల్లటి మచ్చలు, దద్దుర్లు తగ్గించడంలో పాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా వేసవిలో ఎండ కారణంగా చర్మం కందిపోయి నల్లబడటాన్ని తగ్గించడంలో ఇది చక్కటి పరిష్కారం. ఎండ వల్ల వచ్చే ట్యాన్‌ను తొలగించి, చర్మానికి పాత కాంతిని తీసుకురావడానికి పచ్చి పాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇది కూడా చదవండి:కాళ్లలో రక్తం, గడ్డలు ఊపిరితిత్తులకు చేరితే ఎంత ప్రమాదం? పల్మనరీ ఎంబాలిజం పూర్తి వివరాలు పచ్చి పాలలో ఉండే సహజ కొవ్వు పదార్థాలు చర్మానికి అవసరమైన తేమను నిరంతరం అందిస్తాయి. దీనివల్ల చర్మం ఎప్పుడూ మృదువుగా, సున్నితంగా ఉంటుంది. క్రమం తప్పకుండా పాలను వాడటం ద్వారా వృద్ధాప్య ఛాయలను కూడా సమర్థవంతంగా తగ్గించవచ్చు, తద్వారా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. పచ్చి పాలను ముఖానికి రాసుకునే సరైన పద్ధతి చాలా సులభం. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పచ్చి పాలు, దూది తీసుకోవాలి. దూది ఉండను పాలలో ముంచి, ముఖం అంతటా సమానంగా రాయాలి. పాలు సహజంగా ఆరిన తర్వాత, అదే దూదిని ఉపయోగించి మరోసారి పాలను రాయాలి. ఇలా 3 నుంచి 4 సార్లు అప్లై చేయాలి. సుమారు 20 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్‌కు స్వస్తి పలికి, ఇంట్లోనే దొరికే పచ్చి పాలను మీ చర్మ సంరక్షణ దినచర్యలో భాగం చేసుకోండి. కొద్ది రోజుల్లోనే మీ చర్మంలో స్పష్టమైన తేడాను గమనించవచ్చు. మీకు నచ్చవచ్చు:చలికాలం స్పెషల్: ఆరోగ్యకరమైన, క్యాప్సికం బజ్జీ తయారీ విధానం!                           పచ్చి బొప్పాయితో ,చర్మ సౌందర్యం మరియు, అసాధారణ ఆరోగ్య లాభాలు!       Raw Milk Skincare, Glowing Skin Remedies, Blemish Free Face, Kacha Dudh Benefits, Natural Beauty Tips, Skin Care Routine, Health Tips In Telugu.  
వాతావరణం మారినప్పుడు వచ్చే సీజనల్ ఫ్లూ, కోవిడ్ 19 లేదా మరేదైనా తీవ్రమైన వైరల్ ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు చాలా మందిలో జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన నీరసం రావడం సర్వసాధారణం. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే ఇవి వాటంతట అవే తగ్గిపోతాయని అందరూ భావిస్తారు. కానీ, కొన్నిసార్లు వైరస్‌లు కేవలం శ్వాసకోశ వ్యవస్థకే పరిమితం కాకుండా, గుండెపై చాలా ప్రమాదకరమైన ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.   ఓపెన్ హార్ట్ జర్నల్  మరియు  కరెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ కార్డియాలజీ జర్నల్ ల తాజా అధ్యయనాల ప్రకారం, కోవిడ్ 19 లేదా ఇతర తీవ్రమైన వైరల్ ఇన్‌ఫెక్షన్ల తర్వాత గుండె సమస్యలు తలెత్తే ముప్పు గణనీయంగా పెరుగుతుందని తేలింది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు మన శరీరం సృష్టించే తీవ్రమైన వాపు ప్రక్రియ ఒక్కోసారి గుండె కండరాలను లేదా గుండె బయటి పొరను తీవ్రంగా దెబ్బతీస్తుంది. వైరల్ ఇన్‌ఫెక్షన్‌ల తర్వాత తలెత్తే ఈ గుండె సమస్యలను వైద్య పరిభాషలో మయోకార్డిటిస్ లేదా పెరికార్డిటిస్ అని పిలుస్తారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తినప్పుడు మన శరీరం కొన్ని ప్రత్యేకమైన హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. వీటిని మామూలు ఫ్లూ లక్షణాలుగా లేదా సాధారణ నీరసంగా భావించి పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా గమనించాల్సిన మొదటి లక్షణం భంగిమను బట్టి పూర్తిగా మారిపోయే విచిత్రమైన ఛాతీ నొప్పి. వెల్లకిలా పడుకున్నప్పుడు ఛాతీలో నొప్పి మరింత పెరిగి, కొద్దిగా ముందుకు వంగినప్పుడు కొద్దిగా తగ్గుతున్నట్లు అనిపిస్తే అది వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల గుండె పొర వాపునకు గురైందని అర్థం చేసుకోవాలి. ఈ స్పష్టమైన సంకేతం కనిపిస్తే వెంటనే అప్రమత్తమై కార్డియాలజిస్ట్‌ను సంప్రదించడం ఎంతో ముఖ్యం. రెండవ అత్యంత కీలకమైన లక్షణం ఎటువంటి శారీరక శ్రమ లేకుండానే వచ్చే తీవ్రమైన ఆయాసం. ప్రశాంతంగా కూర్చున్న చోట కూడా శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడటం లేదా అర్ధరాత్రి హఠాత్తుగా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై మెలకువ రావడం గుండె రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయలేకపోతోందని సూచిస్తుంది. మూడవదిగా అస్థిరమైన హృదయ స్పందన లేదా గుండె దడ. ఒకవేళ జ్వరం పూర్తిగా తగ్గిన తర్వాత కూడా మీ గుండె దడదడలాడుతున్నా లేదా విపరీతమైన వేగంతో కొట్టుకుంటున్నా అది తీవ్రమైన అరిథ్మియా సమస్యకు దారితీసే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయాల్లో గుండె పనితీరు అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి:కంటి చూపును, సహజంగా పెంచే సూపర్ ఫుడ్.. మునగాకు రహస్యాలు! నాల్గవ ముఖ్యమైన లక్షణం శరీరంలో నీరు చేరడం వల్ల వచ్చే వాపులు మరియు అకస్మాత్తుగా పెరిగే బరువు. గుండె బలహీనపడినప్పుడు శరీరంలో ద్రవాలు సరిగ్గా ప్రసరించక పేరుకుపోతాయి. దీనివల్ల చీలమండలు, పాదాలలో అకస్మాత్తుగా వాపులు రావడం, కేవలం 24 నుంచి 48 గంటల వ్యవధిలో హఠాత్తుగా బరువు పెరగడం జరుగుతుంది. ఇది గుండె వైఫల్యానికి స్పష్టమైన సంకేతం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఐదవది విపరీతమైన నీరసం మరియు కళ్లు తిరగడం. ఇన్‌ఫెక్షన్ తగ్గాక కూడా తీవ్రమైన నీరసం వేధించడం, నిలబడినప్పుడు కళ్లు తిరగడం లేదా స్పృహ తప్పడం వంటివి జరిగితే అది రక్తపోటు పడిపోవడానికి సూచన. ఈ 5 కీలక హెచ్చరిక సంకేతాలను ఏ దశలోనూ తేలికగా తీసుకోకూడదు. ఛాతీ నొప్పి, తీవ్రమైన ఆయాసం, గుండె దడ, కాళ్ల వాపులు, విపరీతమైన నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యంతావశ్యకం. సరైన సమయంలో స్పందించి తగిన వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండెకు జరిగే శాశ్వత నష్టాన్ని పూర్తిగా నివారించవచ్చు. ఈ జాగ్రత్తలు పాటిస్తూ, ఆరోగ్యం విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉంటే వైరల్ ఇన్‌ఫెక్షన్ల తదనంతరం ఎదురయ్యే ప్రాణాంతక గుండె ముప్పుల నుంచి సులభంగా రక్షణ పొందవచ్చు. మీకు నచ్చవచ్చు:రోగనిరోధక శక్తిని పెంచే, క్యాప్సికమ్ గురించిన, ఆసక్తికర విషయాలు!                  కేలరీల ఖజానా, నల్ల శెనగలు.. చలికాలంలో ఇవి తింటే మీ శరీరానికి అసలైన శక్తి!       Heart Palpitations After Fever, Leg Swelling Symptoms, Post Viral Complications, Heart Risk Warnings, Cardiovascular Health News, Doctor Health Advice, Health Tips In Telugu.
మనం చేసే ప్రతి చిన్న పనీ మన భవిష్యత్తును నిర్ణయించినట్లే, మనం రోజూ ఆచరించే ప్రతీ అలవాటు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి జబ్బుల కంటే మన చెడ్డ అలవాట్లే మనల్ని నెమ్మదిగా బలహీనపరుస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు ఊరికే అనలేదు. ధనం పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం కోల్పోతే అదే అసలైన దరిద్రం. శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మన పూర్వీకులు కొన్ని సులువైన జీవన సూత్రాలను చెప్పారు. వాటిని సరిగ్గా పాటిస్తే జీవితం ప్రశాంతంగా, ఆనందంగా మారుతుంది. ఆ ముఖ్యమైన ఐదు ఆరోగ్య సూత్రాలు ఏమిటో  వివరంగా తెలుసుకుంటే..  సరైన ఆహార నియమం.. మన శరీరం జీర్ణవ్యవస్థపైనే మన ఆయుర్దాయం ఆధారపడి ఉంటుంది. కడుపులో ఉన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకముందే మళ్లీ మళ్లీ తినడం విషం తినడంతో సమానమని పెద్దలు చెబుతారు. ఆకలి లేకపోయినా కేవలం సమయం అయిపోయిందన్న ఒకే ఒక్క కారణంతో బలవంతంగా తినడం మనం చేసే అతి పెద్ద తప్పు. శరీరం చెప్పే ఆకలి సంకేతాలను వినడం నేర్చుకోవాలి కానీ గడియారపు ముళ్లను చూస్తూ తినకూడదు. ఆకలి ఉంటేనే, శరీరం కోరితేనే మితంగా, రుచిగా కాక ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి.  నిద్ర.. ఈ కాలంలో చాలామంది రాత్రంతా మేలుకోవడం, తెల్లవారితే అతిగా నిద్రపోవడం అలవాటు చేసుకున్నారు. అయితే అతిగా నిద్రపోవడం లేదా అసలు నిద్రపోకపోవడం రెండు పద్ధతులూ శరీర నాశనానికి దారితీస్తాయి. తెల్లవారుజామునే నిద్రలేవడం వల్ల మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, బద్ధకం దరిచేరదు. సూర్యుడితో పాటు నిద్రలేచి ప్రకృతితో మమేకమైతే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. క్రమబద్ధమైన నిద్ర శారీరక శక్తిని పునరుద్ధరిస్తుంది. శారీరక శ్రమ.. నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత శారీరక కదలికలు పూర్తిగా తగ్గిపోయాయి. శరీరాన్ని కదిలించకుండా కేవలం ఒకే చోట కూర్చుని పనిచేయడం అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుంది. వ్యాయామం, యోగ, చిన్నపాటి నడక, ఇంటి పనులు వంటి సహజ కదలికలు శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. జిమ్‌లకు వెళ్లి విపరీతంగా కష్టపడాల్సిన అవసరం లేదు కానీ రోజూ శరీరానికి తగిన శ్రమ ఇచ్చేలా చూసుకోవడం చాలా అవసరం. ఇది కూడా చదవండి    వాకింగ్ ఎలా చేయాలి? చాలామందికి తెలియని సీక్రెట్ ఇదే..! మానసిక ప్రశాంతత.. శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అతిగా కోపగించుకోవడం వల్ల శరీరంలోని ప్రాణశక్తి లోపలి నుంచే క్షీణించిపోతుంది. కోపం మన ఆరోగ్యాన్ని నాశనం చేసే అతిపెద్ద శత్రువు. మనసుపై నిగ్రహం లేకపోతే ఏ పనీ సరిగ్గా చేయలేము. డబ్బు కంటే మనసు నిండుగా, సంతోషంగా ఉండటమే అసలైన ఐశ్వర్యం. యోగ, ధ్యానం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. శుచి , పరిశుభ్రత.. కేవలం మన ఇల్లు మాత్రమే కాకుండా మన శరీరం, పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి మూలస్తంభం. శరీరం, చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉండటం మనలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. అలాగే మన ఆలోచనలు, మాటలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఈ ఐదు సూత్రాలు ఏవీ కొత్తవి కావు, మన దైనందిన జీవితంలో ఎంతో సులభంగా పాటించదగినవే. వీటిని రోజువారీ జీవితంలో అలవాటు చేసుకుంటే ఏ అనారోగ్య సమస్యలూ దరిచేరవు. జీవనశైలిలో చిన్న మార్పుతోనే పెద్ద మార్పును సాధించవచ్చు. ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకొని ఆనందంగా జీవించవచ్చు.                                                                                                                                                 *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు.. ఈ 5 పండ్లతో ఎన్నో లాభాలు!  
ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటుంటారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, గుండెను పదిలంగా కాపాడుకోవడానికి చాలామంది వాకింగ్ ను ఎంచుకుంటారు. అయితే, వాకింగ్ చేయాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ, దానిని నిలకడగా కొనసాగించడంలో చాలామంది విఫలమవుతుంటారు. వర్షం వచ్చిందని, చలికాలం అని, లేదా ఆ రోజు మూడ్ బాలేదని, బిజీగా ఉన్నామని రకరకాల కారణాలతో నడకను మధ్యలోనే ఆపేస్తుంటారు. అసలు వాకింగ్ ఎలా చేయాలి? చాలామందికి తెలియని ఆ ముఖ్యమైన రహస్యం ఏమిటో  వివరంగా తెలుసుకుంటే.. ఉత్సాహం కాదు.. సరైన ప్లానింగ్ ముఖ్యం.. చాలామంది ఫిట్‌నెస్ విషయంలో ఒక పెద్ద పొరపాటు చేస్తుంటారు. మొదటి రోజే ఉత్సాహంతో నలభై ఐదు నిమిషాలు లేదా గంటపాటు నడవాలని నిర్ణయించుకుంటారు. అలా మొదటి రోజు కష్టపడి నడిచాక, రెండో రోజు కాళ్ల నొప్పితో బాధపడతారు. మూడో రోజు పని ఒత్తిడి, నాలుగో రోజు వాతావరణం బాగోలేకపోవడంతో వాకింగ్ కు స్వస్తి చెబుతారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఫిట్‌నెస్ సాధించడంలో ఎక్కువ మోటివేషన్ ఉన్నవారు కాదు, మంచి అలవాట్లు ఏర్పరచుకున్నవారే విజయం సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు. వేగం కాదు.. ఈ లాజిక్ ముఖ్యం.. గుండె ఆరోగ్యం కోసం వేగంగా నడవాలని,  హార్ట్ పాయింట్లు అని ఈ మధ్య చాలామంది వేగంగా నడుస్తూ ఉంటారు. కానీ ఎంత వేగంగా నడిచాం లేదా ఎంతసేపు నడిచాం అనేది ముఖ్యం కాదు, ప్రతీరోజూ నడకను కొనసాగించామా లేదా అనేదే చాలా కీలకం. ఈ క్రమంలోనే వాకింగ్ ప్రారంభించాలనుకునేవారి కోసం ఒక సులభమైన , అద్భుతమైన మార్గం ఉంది. అదేంటంటే.. ఈజీగా.. హుషారుగా.. మొదటగా మొదటి మూడు వారాలు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే నడవాలి. కేవలం ఐదు నిమిషాలు నడవడం వల్ల గుండెకు పెద్దగా ప్రయోజనం చేకూరకపోవచ్చు, కానీ మన మెదడుకు ఒక కొత్త అలవాటును నేర్పించడానికి ఇది సరిగ్గా సరిపోతుంది. మొదటి మూడు వారాలు ఐదు నిమిషాలు నడిచిన తర్వాత, ఆ సమయాన్ని మరో ఐదు నిమిషాలు పెంచి పది నిమిషాలు చేయాలి. ఆ తరువాత మరో మూడు వారాలకు పదిహేను నిమిషాలు, ఇలా క్రమంగా ఇరవై నుంచి ముప్పై నిమిషాలకు పెంచుకుంటూ పోవాలి. ఇది కూడా చదవండి   మోకాళ్ల నొప్పులతో ఇబ్బందా..ఈ 5 వ్యాయామాలు మిస్ అవ్వకండి .! ​ ఇక్కడ ప్రధాన లక్ష్యం మొదట్లోనే శరీరాన్ని అలసటకి గురి చేయడం కాదు, నడకను ఒక మంచి అలవాటుగా మార్చుకోవడం. అలవాటు ఏర్పడిన తర్వాత ఫిట్‌నెస్ అనేది దానంతట అదే మన సొంతం అవుతుంది. చిన్న చిన్న చిట్కాలు.. వాకింగ్ కు మార్గాలు.. నడకను ఎటువంటి ఆటంకాలు లేకుండా క్రమం తప్పకుండా సాగించడానికి కొన్ని చిన్నచిన్న చిట్కాలు ఎంతో సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందే మరుసటి రోజు ఉదయం వాకింగ్ కి వేసుకునే దుస్తులను సిద్ధంగా ఉంచుకోవాలి. వీలైతే వాటిని పక్కనే ఉంచుకోవడం మంచిది. అలాగే షూస్‌ను మంచం పక్కనే ఉంచాలి. ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. దీనివల్ల మనం అలసత్వాన్ని గెలవడం కంటే అసలు అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా ఉండవచ్చు. హ్యాబిట్ స్టాకింగ్.. హ్యాబిట్ స్టాకింగ్ అనే ఒక అద్భుతమైన పద్ధతిని పాటించవచ్చు. ఉదయం నిద్రలేచి బ్రష్ చేసిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా నేరుగా వాకింగ్ కి వెళ్ళిపోవాలి. వాకింగ్ పూర్తయిన తర్వాతే స్నానం చేసేలా దినచర్యను మలచుకోవాలి. ఒక పాత అలవాటుకు మరో కొత్త అలవాటును ఇలా జోడించడం వల్ల పనులు మర్చిపోయే అవకాశం ఉండదు. ఒకవేళ వర్షం కారణంగా బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడితే, ఇంట్లోనే ఐదు నిమిషాల పాటు నడవాలి కానీ వాకింగ్ అలవాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించకూడదు. మొదలు పెట్టిన రోజే పది కిలోమీటర్లు నడవడం కంటే, ఏడాది పొడవునా ప్రతీరోజూ పది నిమిషాల చొప్పున నడవడం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. మన గుండెకు కావాల్సింది ఏదో ఒక్కరోజే చేసే  ప్లానింగ్ కాదు.. ప్రతీరోజూ కొనసాగించే ప్లానింగ్ కావాలి. ఈ చిన్నపాటి నియమాలను పాటిస్తూ, వాకింగ్ ను జీవితంలో ఒక భాగం చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా దూరంగా ఉండవచ్చు. ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతమవుతుంది.                                                                                                                              *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు  మీ దగ్గర డబ్బు నిలవడం లేదా..అసలు కారణాలు ఇవే..!                                 మీకు తెలుసా ..ఈ విటమిన్లు లోపిస్తే లివర్ దెబ్బతింటుంది..!
మన ఆరోగ్యం బాగుండాలంటే రోజువారీ ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండే పండ్లను తప్పనిసరిగా చేర్చుకోవాలి. పండ్లు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు (Fiber), యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ఇవి జీర్ణక్రియ మెరుగుపడటానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి, శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా కొన్ని పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించుకోవడానికి కూడా సహాయపడుతుంది. మరి మన ఆరోగ్యానికి మేలు చేసే ఆ ఐదు పండ్లు ఏమిటి? జామ, బొప్పాయి, దానిమ్మ, పైనాపిల్, మామిడి పండ్లలో ఎలాంటి పోషకాలు ఉంటాయి? వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఈ పండ్లు ఎలా ఉపయోగపడతాయి? ఈ ప్రత్యేక వీడియోలో ఆయుర్వేద డైటీషియన్ శ్రవంతి రఘు గారు ఈ ఐదు పండ్లలోని పోషక విలువలు, వాటి ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. జామపండులో ఉండే పీచు పదార్థాలు జీర్ణక్రియకు ఎలా సహాయపడతాయి? బొప్పాయిలోని పోషకాలు మహిళల ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి? దానిమ్మ శరీరానికి అందించే ప్రయోజనాలు ఏమిటి? పైనాపిల్ పేగుల ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? మామిడి పండులోని విటమిన్లు, పోషకాలు మన శరీరానికి ఎలా మేలు చేస్తాయి? అనే విషయాలను వివరంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, ఈ పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు కలిగే ప్రయోజనాలు, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వీటి పాత్ర, రోగనిరోధక శక్తికి అవసరమైన పోషకాలు వంటి అనేక విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మలబద్ధకం సమస్యను తగ్గించుకోవడానికి పీచు పదార్థాలు అధికంగా ఉండే పండ్లను ఆహారంలో ఎలా చేర్చుకోవాలి? వాటిని ఏ విధంగా తీసుకుంటే మంచిది? అనే విషయాలను కూడా శ్రవంతి రఘు గారు వివరించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఖరీదైన ఆహారాలే అవసరం లేదు. మనకు సులభంగా లభించే పండ్లను సరైన మోతాదులో, సరైన పద్ధతిలో తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ఈ ఐదు పండ్లలోని పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు, మలబద్ధకం సమస్యకు అవి ఎలా తోడ్పడతాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)